హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 314వ అధ్యాయం: సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 1709 – 1713) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం.

↑ విషయ సూచిక

باب النَّهي عَن الحلف بمخلوق كالنبي والكعبة والملائكة والسماء والآباء والحياة والروح والرأس ونعمة السلطان وتُرْبَة فلان والأمانة، وهي من أشدها نهياً

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1709

హదీసు 1709

عَنِ ابْنِ عُمَرَ، رضِيَ اللَّه عنْهُمَا، عَنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَالَ: "إِنَّ اللَّه تَعالى ينْهَاكُمْ أَنْ تَحْلِفُوا بابائِكُمْ، فَمَنْ كَانَ حَالِفاً، فلْيَحْلِفْ بِاللَّهِ، أَوْ لِيَصْمُتْ" متفقٌ عَلَيْهِ. وفي رواية في الصحيح: "فمنْ كَانَ حَالِفاً، فَلا يَحْلِفْ إِلاَّ بِاللَّهِ، أَوْ لِيسْكُتْ"

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీరు మీ తాతముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని దేవుడు వారించాడు. కనుక మీలో ఎవరైనా ప్రమాణం చేయదలచుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. లేదా ఊరుకోవాలి. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ-సహీహ్ ముస్లింలోని ఐమాన్ ప్రకరణాలు)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: The Prophet ﷺ said, “Allah has prohibited you from taking an oath by your fathers. He who must take an oath, may do so by swearing in the Name of Allah or he should remain silent.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం.|హదీసు 1709

1710

హదీసు 1710

وعنْ عَبْدِ الرحْمنِ بْن سمُرَةَ، رضِي اللَّه عنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تحْلِفوا بِالطَّواغِي، ولا بآبائِكُمْ" رواه مسلم. "الطَّوَاغي": جَمْعُ طَاغِيَةٍ، وهِي الأصْنَامُ، وَمِنْهُ الحديثُ:"هذِهِ طاغِيةُ دوْسٍ": أَيْ: صنمُهُم ومعْبُودُهُم. ورُوِيَ في غَيرِ مُسْلِم:"بالطَّواغِيتِ"جمْع طاغُوت، وهُو الشَّيطانُ وَالصَّنمُ.

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ సమురా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు విగ్రహాల మీద, మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయకండి. (ముస్లిం)

'తవాగీ' అనేది 'తాగియహ్'కు బహువచనం. విగ్రహం అని దాని అర్థం. ఉదాహరణకు ఒక హదీసులో, "ఇది దౌస్ తెగ వారి తాగియహ్" అని ఉంది. అంటే వారి ఆరాధ్య దేవుడు, విగ్రహం అని భావం. సహీహ్ ముస్లిం తప్ప ఇతర గ్రంథాల్లో 'తవాగీత్' అని ఉల్లేఖించబడింది. ఇది 'తాగూత్'కు బహువచనం. 'షైతాన్, విగ్రహాలు' అని దాని భావం.

(సహీహ్ ముస్లింలోని ఐమాన్ ప్రకరణం)

English

`Abdur-Rahman bin Samurah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Swear neither by the name of Taghut (i.e., false deities, false leaders, etc.) nor by your fathers.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం.|హదీసు 1710

1711

హదీసు 1711

وعنْ بُريْدة رضِي اللَّه عنهُ أَنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ حلَف بِالأَمانَةِ فليْس مِنا". حدِيثٌ صحيحٌ، رواهُ أَبُو داود بإِسنادٍ صحِيحٍ.

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: నిజాయితీ మీద ప్రమాణం చేసినవాడు మా ముస్లింల పద్ధతిని అనుసరించట్లేదు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

(సుననె అబూదావూద్‌లోని ఐమాన్, నుజూర్ ప్రకరణం)

English

Buraidah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “He who swears by Amanah (trust) is not one of us.”[Abu Dawud with authentic Isnad].

ముఖ్యాంశాలు

అల్లాహ్ పేరు, ఆయన గుణగణాలు తప్ప ఇతర ఏ విషయం మీదా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ అనేది దేవుని ఆదేశాల్లో ఒక ఆదేశం లేక ఆయన నిర్ణయించిన నమాజ్, జకాత్, ఉపవాసం, హజ్ లాంటి ఒక విధి. కనుక "నేను నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను" అని అనకూడదు. అలా అంటే దేవుని విధుల్ని ఆయన గుణగణాలతో పోల్చినట్లవుతుంది. అది సరైన పద్ధతి కాదు. (ఔనుల్ మాబూద్)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం.|హదీసు 1711

1712

హదీసు 1712

وعنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ حلفَ، فَقَالَ: إِني برِيءٌ مِنَ الإِسلامِ فإِن كانَ كاذِباً، فَهُو كمَا قَالَ، وإِنْ كَان صادِقاً، فلَنْ يرْجِع إِلى الإِسلاَمِ سالِماً". رواه أَبُو داود.

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు)గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా తాను ఇస్లాంతో విసిగిపోయానని ప్రమాణం చేసినట్లయితే అతను చెబుతున్నది అబద్ధం అయిన పక్షంలో అతడు తాను చెప్పినట్లే అవుతాడు. ఒకవేళ తాను చెబుతున్నది నిజమయితే అప్పటికీ అతను ఇస్లాం వైపునకు క్షేమంగా తిరిగిరాలేడు.

(అబూదావూద్)

(సుననె అబూదావూద్‌లోని ఐమాన్, నుజూర్ ప్రకరణం)

English

Buraidah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “If anyone swears that in such and such case he will be free from Islam and afterwards he turns out to be a liar, he will be as he has sworn; but if he is speaking the truth, he will not revert safely to Islam.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఒక వ్యక్తి "నేను గనక ఫలానా పని చేసినట్లయితే ఇక నేను కాఫిర్ (ధర్మ తిరస్కారి)ని అయినట్లే లెక్క" అని అన్నాడనుకోండి. ఒకవేళ ఆ విధంగా అన్నప్పుడు అతను మనసులో తను ఆ పనికి ఒడిగడితే నిజంగా ధర్మతిరస్కార మార్గాన్ని ఎంచుకుంటానని అనుకున్న పక్షంలో వెంటనే అతను కాఫిర్ అయిపోతాడు. మరొకవేళ అతని ఉద్దేశం ధర్మంపై నిలకడగా ఉండటం, ఎట్టి పరిస్థితుల్లోనయినా ధర్మాన్ని త్యజించకుండా ఉండటం అయినట్లయితే అప్పుడు కూడా దానికోసం అతను ఎంచుకున్న మార్గం తప్పుగానే పరిగణించబడుతుంది. అందుకని అతను వెంటనే దైవం వైపు మరలి తన మన్నింపుకోసం, క్షమాభిక్ష కోసం వేడుకోవాలి. మరోమారు కలిమయె షహాదత్‌ను (విశ్వాస ధృవీకరణ వచనాన్ని) పఠించి తన విశ్వాసాన్ని పునరుద్ధరించుకుంటే ఇంకా మంచిది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం.|హదీసు 1712

1713

హదీసు 1713

وَعنِ ابْن عمر رضِي اللَّه عنْهُمَا أَنَّهُ سمِعَ رَجُلاً يَقُولُ: لاَ والْكعْبةِ، فقالَ ابْنُ عُمر: لاَ تَحْلِفْ بِغَيْرِ اللَّهِ، فإِني سَمِعْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "منْ حلفَ بِغَيْرِ اللَّهِ، فَقدْ كَفَر أَوْ أَشرْكَ" رواه الترمذي وقال: حدِيثٌ حسَنٌ. وفسَّر بعْضُ الْعلماءِ قوْلهُ:"كَفر أَوْ أشركَ"علَى التَّغلِيظِ كما رُوِي أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"الرِّيَاءُ شِرْكٌ".

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం ఒక వ్యక్తి 'కాబా గృహం సాక్షి!' అని ప్రమాణం చేస్తుండగా ఆయన విని అతనికి, "దైవేతరుల మీద ప్రమాణం చేయకు. దైవేతరుల మీద ప్రమాణం చేసేవాడు దైవ తిరస్కారానికి లేక బహుదైవారాధనకు పాల్పడినట్లేనని దైవప్రవక్త ﷺ ప్రబోధిస్తుండగా నేను విన్నాను" అని ఉపదేశించారు.

తిర్మిజీ ఈ హదీసుని వెలికితీసి హసన్‌గా పేర్కొన్నారు. 'దైవ తిరస్కారానికి లేక బహుదైవారాధనకు పాల్పడినట్లే' అన్న మాటను విశ్లేషిస్తూ కొందరు పండితులు ఈ మాట "ప్రదర్శనాబుద్ధి షిర్కు లాంటిది" అన్న దైవప్రవక్త హదీసు లాగా తీవ్రమైన హెచ్చరిక నిమిత్తం చెప్పబడిందని అభిప్రాయపడ్డారు.

(సుననె తిర్మిజీలోని ఐమాన్ మరియు నుజూర్ అధ్యాయాలు)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: I heard a man saying: “No, by the Ka`bah.” I admonished him: “Do not swear by any thing besides Allah, for I heard the Messenger of Allah ﷺ saying, `He who swears by anyone or anything other than Allah, has indeed committed an act of Kufr or Shirk’.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) చెప్పినట్లు "ప్రదర్శనాబుద్ధి షిర్క్ లాంటిది" అన్న వాక్యం హదీసుల్లో ఎక్కడా లేదు. కాని దైవప్రవక్త ﷺ ప్రదర్శనా బుద్ధిని అసహ్యించుకున్న మాటలద్వారా చూస్తే ప్రదర్శనాబుద్ధి కూడా ఒక విధంగా బహుదైవారాధన క్రిందికే వస్తుందని బోధపడుతోంది. ఉదాహరణకు దైవప్రవక్త ﷺ "ఇతరులకు చూపించటం కోసం ఉపవాసం ఉన్నవాడు షిర్క్‌కు పాల్పడ్డాడు. ఇతరులకు చూపించటం కోసం నమాజ్ చేసినవాడు షిర్క్‌కు పాల్పడ్డాడు" అని బోధించారు.

మొత్తానికి పై హదీసులో చెప్పబడిందేమిటంటే దైవేతరుల మీద ప్రమాణం చేయటం చాలా ఘోరమైన విషయం. ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) లాంటి కొందరు ఈ విషయం తీవ్రమైన హెచ్చరిక మాత్రమేనని చెప్పినప్పటికీ- ఒకవేళ ప్రమాణం చేసేవాని మనసులో ఆ దైవేతర వస్తువుమీద గౌరవాభిమానముంటే, ఆ గౌరవాభిమానాల మూలంగానే అతను దాని మీద ప్రమాణం చేస్తున్నట్లయితే చాలా మంది పండితుల దృష్టిలో అతను తప్పకుండా దైవతిరస్కారి లేక బహుదైవారాధకుడిగా పరిగణించబడతాడు. కనుక దైవేతరుల మీద ప్రమాణం చేయరాదు. శోచనీయమైన విషయం ఏమిటంటే అజ్ఞానులైన ముస్లింలు చాలా మంది ఇలాంటి ప్రమాణాలు చేస్తుంటారు. నీ మీద ఒట్టు, నీ తల మీద ఒట్టు, అమ్మతోడు, నాన్నతోడు అని అంటుంటారు. ఇలా అనటం నిషిద్ధమని అందరూ తెలుసుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|314. సృష్టిరాశుల మీద ప్రమాణం చేయరాదు. అంటే ప్రవక్త, కాబా, దైవదూతలు, ఆకాశం, తాత ముత్తాతలు, జీవితం, ఆత్మ, తల, రాజు జీవితం, అతని అనుగ్రహం, ఫలానా వారి సమాధి మీద, వారి నిజాయితీ మీద ప్రమాణం చేయటమన్న మాట. అయితే ఒకరి నిజాయితీ మీద ప్రమాణం చేయటం మరింత తీవ్రమైన విషయం.|హదీసు 1713