హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 313వ అధ్యాయం: ఖుర్బానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్జా మాసపు నెలవంక చూసినప్పటి నుంచి ఖుర్బానీ చేసే వరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కత్తిరించుకోరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1708) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
313. ఖుర్బానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్జా మాసపు నెలవంక చూసినప్పటి నుంచి ఖుర్బానీ చేసే వరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కత్తిరించుకోరాదు
باب نهي مَنْ دخل عليه عشر ذي الحجة وأراد أنْ يضحِّيَ عن أخذ شيء من شعره أو أظفاره حتى يضّحيَ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1708
عَنْ أُمِّ سَلَمةَ رضِيَ اللَّه عَنْهَا قَالَتْ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ كَانَ لَهُ ذِبْحٌ يَذْبَحُهُ، فَإِذا أُهِلَّ هِلالُ ذِي الحِجَّة، فَلا يَأْخُذَنَّ مِنْ شَعْره وَلا منْ أَظْفَارهِ شَيْئاً حَتَّى يُضَحِّيَ "رَواهُ مُسْلِم.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఖుర్బానీ కొరకు పశువు ఉండి ఖుర్బానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచెమైనా కత్తిరించుకోరాదు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని అజాహీ ప్రకరణం)
English
Umm Salamah (radiyallahu anha) said: The Messenger of Allah ﷺ said, “When anyone of you intends to sacrifice the animal and enter in the month of Dhul-Hijjah, he should not get his hair cut or nails pared till he has offered his sacrifice.”[Muslim].
ముఖ్యాంశాలు
ఖుర్బానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్జా నెలవంక చూసినప్పటినుంచి శిరోజాలు, చంకలోని, బొడ్డుక్రింద వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోకుండా ఉంటే వారి ఖుర్బానీ సున్నత్ ప్రకారం నెరవేరుతుంది. జుల్‌హిజ్జా 10వ తేదీన ఖుర్బానీ చేసిన తర్వాత క్షవరం చేయించుకోవాలి. అదే విధంగా ఖుర్బానీ చేయనివారు జుల్‌హిజ్జా 10వ తేదీన క్షవరం చేయించుకొని గోళ్లు కత్తిరించుకుంటే వారికి కూడా ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుందని కొన్ని ఉల్లేఖనాల ద్వారా బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|313. ఖుర్బానీ చేయదలచుకునేవారు జుల్‌హిజ్జా మాసపు నెలవంక చూసినప్పటి నుంచి ఖుర్బానీ చేసే వరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కత్తిరించుకోరాదు|హదీసు 1708
You must be logged in to post a comment.