హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 315. ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ఒట్టు నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 315వ అధ్యాయం: ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు ఒట్టేయటం కఠినంగా వారించబడింది. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1714 – 1716) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

315. ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు ఒట్టేయటం కఠినంగా వారించబడింది

↑ విషయ సూచిక

باب تغليظ اليمين الكاذبة عمداً

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1714

హదీసు 1714

عَنِ ابْنِ مسْعُودٍ رضِي اللَّه عَنْهُ أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "منْ حلفَ علَى مَالِ امْريءٍ مُسْلِمٍ بغيْرِ حقِّهِ، لقِي اللَّه وهُو علَيْهِ غَضْبانُ" قَالَ: ثُمَّ قرأَ عليْنَا رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مِصَداقَه منْ كِتَابِ اللَّهِ عَزَّ وَجَلَّ: {إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَناً قَلِيلاً} [آل عمران: ٧٧] إلى آخِرِ الآيةِ: مُتَّفَقٌ عليْه.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అన్యాయంగా ఒకముస్లిం ధనాన్ని కాజేసే ఉద్దేశ్యంతో ప్రమాణం చేసేవాడు దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆయన అతని మీద ఆగ్రహంతో ఉంటాడు.

తర్వాత దైవప్రవక్త ﷺ సర్వోన్నతుడైన అల్లాహ్ గ్రంథంలో నుంచి ఈ భావాన్ని బలపరచే సూక్తిని పఠించి వినిపించారు: "ఎవరు అల్లాహ్‌కు చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో…." (ఆలి ఇమ్రాన్:77) (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ముసాఖాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఐమాన్ ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “He who takes oath to acquire the property of a Muslim unjustly will meet Allah and He will be angry with him” then he recited: “Verily, those who purchase a small gain at the cost of Allah’s Covenant and their oaths, they shall have no portion in the Hereafter. Neither will Allah speak to them nor look at them on the Day of Resurrection nor will He purify them, and they shall have a painful torment.” (3:77)[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|315. ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు ఒట్టేయటం కఠినంగా వారించబడింది|హదీసు 1714

1715

హదీసు 1715

وعَنْ أَبي أُمامةَ إِياسِ بْنِ ثعْلبَةَ الحَارِثِيِّ رضِيَ اللَّه عَنْهُ أَن رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "منِ اقْتَطعَ حَقَّ امْرِيءٍ مسْلِمٍ بِيمِينِهِ، فَقَدْ أَوْجَب اللَّه لَهُ النَّارَ. وحرَّم عَلَيْهِ الْجنَّةَ"فَقالَ لَهُ رَجُلٌ: وإِنْ كَانَ شَيْئاً يسِيراً يَا رسُولَ اللَّهِ؟ قَالَ:"وَإِنْ كَانَ قَضِيباً مِنْ أَراكٍ" رواهُ مُسْلِمٌ.

హజ్రత్ అబూ ఉమామా ఇయాస్ బిన్ సాలబా హారిసీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "(అబద్ధపు) ప్రమాణం ద్వారా ఒక ముస్లిం హక్కుని కాజేసేవాడికి దేవుడు నరకాన్ని తప్పనిసరి చేసేస్తాడు. అతని కొరకు స్వర్గాన్ని నిషేధిస్తాడు."

అది విని ఒకతను, "అది మామూలు వస్తువయినా (ఆ శిక్ష పడుతుందా) దైవప్రవక్తా?" అని అడిగాడు. అందుకాయన, "అది 'పీలూ' చెట్టు కొమ్మయినా సరే" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఐమాన్ ప్రకరణం)

English

Abu Umamah Iyas bin Tha`labah Al-Harithi (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “He who misappropriates the right of a Muslim by taking a false oath, Allah will condemn him to the fire of Hell and will forbid Jannah for him.” A person asked: “O Messenger of Allah, even if it is something insignificant?” He replied, “Yes, even if it is the twig of the Arak tree.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|315. ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు ఒట్టేయటం కఠినంగా వారించబడింది|హదీసు 1715

1716

హదీసు 1716

وعنْ عبْدِ اللَّهِ بْنِ عمرِو بْنِ الْعاصِ رضِي اللَّه عَنْهُمَا عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "الْكَبَائِرُ: الإِشْرَاكُ بِاللَّهِ، وَعُقُوقُ الْوَالِدَيْن، وَقتْلُ النَّفْسِ، والْيَمِينُ الْغَمُوسُ "رواه البخاري. وفي روايةٍ لَهُ: أَن أَعْرَابِيًّا جاءَ إِلى النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقال: يَا رَسُول اللَّه مَا الْكَبَائِرُ؟ قالَ:"الإِشْراكُ بِاللَّهِ"قَالَ: ثُمَّ مَاذا؟ قالَ:"الْيَمِينُ الْغَمُوسُ"قُلْتُ: وَمَا الْيمِينُ الْغَمُوسُ؟ قَالَ:"الَّذِي يَقْتَطِعُ مَالَ امْرِيءٍ مسلم،" يعْنِي بِيمِينٍ هُوَ فِيها كاذِبٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "ఘోరమైన పాపాలు ఇవి: అల్లాహ్‌కు ఇతరుల్ని సహవర్తులుగా నిలబెట్టడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడటం, (అన్యాయంగా) ప్రాణిని చంపటం, అబద్ధపు ప్రమాణం చేయటం." (బుఖారీ)

బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! ఘోరపాపాలు ఏవి?" అని అడిగాడు. అందుకాయన సమాధానమిస్తూ, "అల్లాహ్‌కు ఇతరుల్ని సహవర్తులుగా నిలబెట్టడం" అని చెప్పారు. అతను "ఆ తర్వాత ఏది?" అని అడిగాడు. "అబద్ధపు ప్రమాణం" అని చెప్పారు దైవప్రవక్త ﷺ.

(ఉల్లేఖకుడు ఇలా అంటున్నారు): "అబద్ధపు ప్రమాణం అంటే ఏమిటి?" అని నేను అడిగాను. అందుకాయన "ఒక ముస్లిం ధనాన్ని కాజేసేది" అని చెప్పారు. అబద్ధపు ప్రమాణం చేసి (ధనం కాజేయటం) అని ఆయన భావం.

(సహీహ్ బుఖారీలోని ఐమాన్ మరియు నుజూర్ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-As (radiyallahu anhuma) said: The Prophet ﷺ said, “Of the major sins are: Associating anything in worship with Allah, disobedience to the parents, killing without justification and taking a false oath (intentionally).”[Al-Bukhari].

Another narration is: A bedouin came to the Prophet ﷺ and asked him: “O Messenger of Allah, what are the cardinal sins?” He ﷺ replied, “Associating anything with Allah in worship.” The man asked: “(What is) next?” The Messenger of Allah ﷺ replied, “Al-Yamin Al-Ghamus.” He asked: “What do you mean by Al-Yamin Al-Ghamus?” The Messenger of Allah ﷺ replied, “Swearing falsely to usurp the property of a Muslim.”

ముఖ్యాంశాలు

'గుమూస్' అంటే ముంచటం అని అర్థం. అబద్ధపు ప్రమాణం మనిషిని పాపంలో ముంచుతుంది. అందుకని దాన్ని "యమీనె గుమూస్" అని అంటారు. ఈ పాపానికి పరిహారం చెల్లించవలసిన అవసరం ఉందా లేదా? అన్న విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. కొందరు పండితులు పరిహారం చెల్లించవలసిందేనంటే మరికొందరు అవసరం లేదంటున్నారు. యమీనె గుమూస్ అనేది పరుల సొమ్మును కాజేయటం కోసం చెప్పబడే ఒక అబద్ధం. కనుక దానికి పాల్పడేవారు తౌబా చేసుకొని దైవాన్ని క్షమాభిక్ష కోరి హక్కుదారునికి హక్కు చెల్లిస్తే సరిపోతుందని రెండో వర్గం అభిమతం. ఈ అభిమతమే సరైనది. ఎందుకంటే కేవలం పరిహారం చెల్లించినంత మాత్రాన ఆ పాపం తొలగిపోదు. తాము చేసిన దౌర్జన్యపు పాపాన్ని కూడా తొలగించుకోవటం అవసరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|315. ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు ఒట్టేయటం కఠినంగా వారించబడింది|హదీసు 1716