హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 295. ‘ఖజా’ చేయరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 295వ అధ్యాయం: 'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు తల గొరిగించుకోవచ్చుగాని స్త్రీ మాత్రం గొరిగించుకోరాదు. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1640 – 1643) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

295. 'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు తల గొరిగించుకోవచ్చుగాని స్త్రీ మాత్రం గొరిగించుకోరాదు

↑ విషయ సూచిక

باب النهي عن القَزَع وَهُوَ حلق بعض الرأس دون بعض، وإباحة حَلْقِهِ كُلّهِ للرجل دون المرأة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1640

హదీసు 1640

عن ابن عُمر رضي اللَّه عنهُما قَالَ: نَ هَى رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عنِ القَزعِ. متفق عَلَيْهِ

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ఖజా (అనగా కొన్ని తల వెంట్రుకలు వదిలేసి మిగతా వాటిని గొరిగించుకోవటం) చేయటాన్ని వారించారు.

(బుఖారీ-ముస్లిం)

(బుఖారీలోని లిబాస్ ప్రకరణం – ముస్లింలోని లిబాస్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ forbade shaving a part of the head.[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|295. 'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు తల గొరిగించుకోవచ్చుగాని స్త్రీ మాత్రం గొరిగించుకోరాదు|హదీసు 1640

1641

హదీసు 1641

وعَنْهُ قَالَ: رَأى رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم صبِياً قَدْ حُلِقَ بعْضُ شَعْر رأسِهِ وتُرِكَ بعْضُهُ، فَنَهَاهَمْ عَنْ ذَلِكَ وَقَال:"احْلِقُوهُ كُلَّهُ أَوِ اتْرُكُوهُ كُلَّهُ". رواهُ أَبُو داود بإسناد صحيحٍ عَلَى شَرْطِ البُخَارِي وَمسْلِم.

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) గారే చేసిన మరొక కథనం: దైవప్రవక్త ﷺ ఒక బాలుణ్ణి చూశారు. అతని తల వెంట్రుకల్లో కొన్నింటిని గొరిగించి మిగతా వాటిని గొరిగించకుండా వదిలేయటం జరిగింది. అది చూసి ఆయన అలా చేయవద్దని తాకీదు చేశారు. "గొరిగిస్తే పూర్తిగా గొరిగించండి. లేదంటే మొత్తం వదలిపెట్టండి" అని ఆయన పురమాయించారు. (అబూ దావూద్ ఈ హదీసును దృఢమైన ఆధారాలతో, బుఖారీ-ముస్లిం షరతులననుసరించి వెలికితీశారు.)

(సుననె అబూదావూద్‌లోని తరజ్జుల్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ saw a boy, some portion of whose head was shaved and some of it was left out. He prohibited them from that and said, “Shave the whole of it or leave the whole of it.”[Muslim].

ముఖ్యాంశాలు

యూదులు, క్రైస్తవులలోని కొందరు బైరాగులు, సన్యాసులు, కొందరు ఆకతాయి దుర్మార్గులు కూడా ఈ విధంగా వెంట్రుకలు గొరిగించుకునేవారనీ, వారికి భిన్నంగా ఉండటం కోసమే దైవప్రవక్త ﷺ దీనిని వారించారనే మాట ప్రచారంలో ఉంది. కనుక ఆ విధంగా సగం తల గొరిగించుకోవటం ధర్మసమ్మతం కాదు. ఒకవేళ ఏదయినా వ్యాధి లేక మరే ఇతర కారణం చేతనయినా అలా చేస్తే అందులో తప్పులేదు. మొత్తానికి అర్థమయ్యేదేమిటంటే గొరిగించుకుంటే పూర్తి తల గొరిగించుకోవాలి లేదా పూర్తి తలను మామూలుగానే ఉంచుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|295. 'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు తల గొరిగించుకోవచ్చుగాని స్త్రీ మాత్రం గొరిగించుకోరాదు|హదీసు 1641

1642

హదీసు 1642

وعنْ عبْدِ اللَّه بنِ جعْفَر رضي اللَّه عَنْهُما أنَّ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أمْهَل آلَ جعْفَرٍ رضي اللَّه عنه ثَلاثاً، ثُمَّ أتَاهُمْ فَقَالَ: "لاَ تَبْكُوا عَلَى أخِى بَعْدَ الْيوم"ثُمَّ قَال:"ادْعُوا لِي بَنِيَّ أخِى"فجِىءَ بِنَا كَأَنَّا أفْرُخٌ فَقَال:"ادْعُوا لِي الحلاَّقَ"فَأَمرهُ، فَحَلَقَ رُؤُوسنَا. رواه أَبُو داود بإسنادٍ صحيح عَلَى شَرْطِ البخاري ومُسْلِمٍ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: (మా నాన్న జాఫర్ (రదియల్లాహు అన్హు) మరణించినప్పుడు) ఆయనింటివారు ఏడుస్తుంటే దైవప్రవక్త ﷺ మూడ్రోజుల వరకు వారిని ఏమీ అనకుండా వదిలేశారు. ఆ తర్వాత వారి దగ్గరకు వచ్చి, "ఈ రోజు తర్వాత నా తమ్ముడి మీద ఎవరూ ఏడ్వకూడదు" అని అన్నారు. తర్వాత "నా తమ్ముని కుమారుల్ని నా దగ్గరకు తీసుకురండి" అని ఆదేశించారు. మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. అప్పుడు మేము పసిపిల్లలం. ఆయన మంగలిని పిలవమని పురమాయించారు. ఆయన ఆదేశం మేరకు అతను మా తలలు గొరిగాడు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో బుఖారీ, ముస్లింల షరతులననుసరించి వెలికి తీశారు).

(సుననె అబూదావూద్‌లోని తరజ్జుల్ ప్రకరణం)

English

`Abdullah bin Ja`far (radiyallahu anhuma) said: The Prophet ﷺ gave respite for three days to the family of Ja`far (after his martydom). Then he came and said, “Don’t weep for my brother after this day.” He said, “Bring all of my nephews to me.” We were accordingly brought as if we were chickens. Then he said, “Call for me a barber.” He directed him to shave our heads which he did.[Abu Dawud].

ముఖ్యాంశాలు

జాఫర్(రదియల్లాహు అన్హు) దైవప్రవక్త ﷺ గారి బాబాయి కుమారుడు. ఈయన మౌతా యుద్ధంలో అమరగతులయ్యారు. ధర్మయుద్ధంలో అమరగతినొందటం ఎంతో గొప్ప పుణ్యకార్యం. దాని వల్ల ఆ అమర వీరునికి దైవ సన్నిధిలో ఎంతో ఉన్నతమైన గౌరవ సత్కారాలు లభిస్తాయి. అయితే ఒక వ్యక్తి మరణం వల్ల అతని ఇంటివారికి బాధ కలగటం కూడా సహజమే. అందుకే దైవప్రవక్త ﷺ మరణించిన వ్యక్తి యొక్క ఇంటివారికి మూడు రోజులపాటు సంతాపం పాటించేందుకు అనుమతినిచ్చారు. ఇక్కడ మూడు రోజులవరకు సంతాపం అనుమతించబడిందంటే, ఆ మూడు రోజులపాటు ఏకబిగిన ఏడుస్తూ కూర్చోవటం, పెడబొబ్బలు పెట్టటం, గుండెలు బాదుకోవటం, బట్టలు చింపుకో[వ]టం చేయవచ్చని భావంకాదు. ఇలా చేయటం ముమ్మాటికీ నిషిద్ధం. అసలు దీని భావం ఏమిటంటే మరణించిన వ్యక్తి తాలూకు బంధుమిత్రులకు మృతుని గురించి మాట్లాడినప్పుడు సహజంగానే కళ్లవెంబడి అశ్రుధారలు ప్రవహిస్తాయి. ఎంత బలవంతంగా ఆపుకున్నప్పటికీ లోపలి నుంచి దుఃఖం తన్నుకు వస్తుంది. ఇది చాలా సహజమైన విషయం. ఇలాంటి దుఃఖం మూడు రోజుల తర్వాత వ్యక్తమయినా షరీఅత్ దాన్ని తప్పుపట్టదు. దాన్ని నిషిద్ధ విషయం(హరామ్)గా పరిగణించదు. వాస్తవానికి మనిషి భావోద్రేకాలను అదుపులో పెట్టటానికే ఈ విధమైన షరతుపెట్టబడింది. చివరగా పేర్కొనదగిన ముఖ్య విషయం ఏమిటంటే తలగొరిగించుకోవటం, ముఖ్యంగా చిన్నపిల్లల తలలు గొరిగించటం ధర్మసమ్మతమేనన్న విషయాన్ని విశదీకరించటానికి ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|295. 'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు తల గొరిగించుకోవచ్చుగాని స్త్రీ మాత్రం గొరిగించుకోరాదు|హదీసు 1642

1643

హదీసు 1643

وعَن عَلِىٍّ رضي اللَّه عنْهُ قَالَ: نَهَى رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنْ تحْلِقَ المَرأةُ رَأسَهَا. رواهُ النِّسائى.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: స్త్రీ తన తల గొరిగించుకోవటాన్ని దైవప్రవక్త ﷺ వారించారు. (నసాయి)

(సుననె నసాయిలోని జీనత్ ప్రకరణం)

English

`Ali (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ prohibited a woman from shaving her head.[An-Nasa’i].

ముఖ్యాంశాలు

ఈ హదీసు తిర్మిజీ గ్రంథంలో కూడా ఉంది. షైఖ్ అల్‌బానీ (రహిమహుల్లాహ్) గారు దీనిని బలహీనమైన (జయీఫ్) హదీసుగా పేర్కొన్నారు. వివరాల కోసం అల్ అహాదీసుజ్జయీఫా గ్రంథం రెండవ సంపుటి 124వ పుట చూడండి. ఏమయినప్పటికీ పురుష పోలికలకు దూరంగా ఉండటం కోసం స్త్రీ తన తల గొరిగించుకోరాదనే చెప్పాలి. అయితే ఏదయినా చికిత్స నిమిత్తం లేక మరేదయినా అత్యవసర పనికోసం స్త్రీ తల గొరిగించుకోవలసివస్తే దానికి అనుమతి ఉంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|295. 'ఖజా' చేయరాదు, ఖజా అంటే కొన్ని శిరోజాలను గొరిగించుకొని మిగతా వాటిని వదిలేయటం. పురుషుడు తల గొరిగించుకోవచ్చుగాని స్త్రీ మాత్రం గొరిగించుకోరాదు|హదీసు 1643