హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 294. శిరోజాలకు నల్లరంగు వేసుకోరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 294వ అధ్యాయం: స్త్రీలయినా, పురుషులయినా తమ శిరోజాలకు నల్లరంగు వేసుకోరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1639) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

294. స్త్రీలయినా, పురుషులయినా తమ శిరోజాలకు నల్లరంగు వేసుకోరాదు

↑ విషయ సూచిక

باب نهي الرجل والمرأة عن خضاب شعرهما بسواد

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1639

హదీసు 1639

عنْ جابرٍ رضي اللَّه عنهُ قَال: أُتِى بِأَبِي قُحافَةَ والِدِ أَبي بكْرٍ الصِّدِّيقِ رضي اللَّه عنْهُما يَومَ فتْحِ مكَّةَ ورأسُهُ ولِحيتُهُ كالثَّغَامَةِ بَيَاضاً، فَقَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" غَيِّرُوا هَذا واجْتَنبُوا السَّوادَ "رواه مسلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: మక్కా విజయంనాడు అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హుమా) తండ్రిగారైన అబూ ఖుహాఫాను (దైవప్రవక్త-సల్లం-దగ్గరికి) తీసుకు వచ్చినప్పుడు ఆయనగారి తల, గడ్డం 'సుగామా' మాదిరిగా తెల్లగా ఉన్నాయి. అది చూసి దైవప్రవక్త ﷺ "వీటిని మార్చుకోండి, అయితే నలుపు జోలికి మాత్రం వెళ్ళకండి" అని ఉపదేశించారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని లిబాస్, జీనత్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) said: Abu Quhafah, father of Abu Bakr (radiyallahu anhuma) was presented to the Messenger of Allah ﷺ on the day of the conquest of Makkah and his head and beard were snow white. The Messenger of Allah ﷺ said, “Change it (i.e., dye it and avoid black colour).”[Muslim].

ముఖ్యాంశాలు

'అబూ ఖుహాఫా' అనేది అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తండ్రిగారి మారుపేరు. ఈయన అసలు పేరు ఉస్మాన్ బిన్ ఆమిర్. ఈయన మక్కా విజయంనాడు ఇస్లాం స్వీకరించారు. 'సుగామా' అనేది కొండ ప్రాంతాల్లో మొలకెత్తే ఒక మొక్క పేరు. అది చాలా తెల్లగా ఉంటుంది. అబూ ఖుహాఫా గారి తల వెంట్రుకలు కూడా బాగా తెల్లగా ఉండటం చూసి దైవప్రవక్త ﷺ వాటికి రంగు పూసుకోమని పురమాయించారు. అయితే నల్లరంగు మాత్రం పూసుకోరాదని తాకీదు చేశారు. దీనిద్వారా తెలిసేదేమంటే గత్యంతరం లేదనుకుంటే తప్ప తలకుగాని లేక గడ్డానికిగాని నల్లరంగు పూసుకోరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|294. స్త్రీలయినా, పురుషులయినా తమ శిరోజాలకు నల్లరంగు వేసుకోరాదు|హదీసు 1639