హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 296వ అధ్యాయం: సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 1644 – 1647) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
296. సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం
باب تحريم وصل الشعر والوشم والوَشر وهو تحديد الأسنان
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{إِنْ يَدْعُونَ مِنْ دُونِهِ إِلاَّ إِنَاثاً وَإِنْ يَدْعُونَ إِلاَّ شَيْطَاناً مَرِيداً لَعَنَهُ اللَّهُ وَقَالَ لأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيباً مَفْرُوضاً وَلأُضِلَّنَّهُمْ وَلأُمَنِّيَنَّهُمْ وَلآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الأَنْعَامِ وَلآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ} [النساء: ١١٧،١١٩]
వారు అల్లాహ్ను వదలి స్త్రీ దేవతలను ఆరాధ్యులుగా చేసుకుంటారు. అల్లాహ్ శాపానికి గురియైన తిరుగుబాటుదారు షైతాన్ను తమ ఆరాధ్యుడుగా చేసుకుంటారు. (వారు విధేయత చూపే ఆ షైతాను) అల్లాహ్తో ఇలా అన్నాడు: "నేను నీ దాసుల నుండి ఒక నిర్ణీతమైన భాగాన్ని నిశ్చయంగా తీసుకుంటాను. నేను వారిని మార్గం తప్పిస్తాను. వారిలో లేనిపోని ఆశలు కల్పిస్తాను, నేను వారిని ఆజ్ఞాపిస్తాను. వారు నా ఆజ్ఞానుసారం జంతువుల చెవులు చీలుస్తారు. నేను వారిని ఆదేశిస్తాను, వారు నా ఆదేశం ప్రకారం అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు." (అన్నిసా: 117-119)
వివరణ
మక్కానగర బహుదైవారాధకులు పూజించిన విగ్రహాలకు స్త్రీల పేర్లుండేవి. అంటే వారు స్త్రీ దేవీదేవతలను పూజించేవారన్నమాట. వారు దైవదూతలను అల్లాహ్ కుమార్తెలుగా భావించి వారిని పూజిస్తుండేవారు. వారు పూజించిన ఉజ్జా, అసాఫ్, నాయిలా మొదలగునవి కూడా స్త్రీ దేవతల పేర్లే.
పై ఆయతుల్లో విగ్రహారాధనను షైతాన్ ఆరాధనగా పేర్కొనటం జరిగింది. వీటన్నిటికీ ప్రధాన కారణం షైతాన్ ప్రేరణే గనక ఆ విధంగా చెప్పబడింది. తర్వాతి వాక్యాల్లో షైతాన్ దుష్ప్రేరేపణల మూలంగా ప్రజలు ఇంకా [మ]రెటువంటి చెడుపోకడలకు పాల్పడతారో వివరించటం జరిగింది.
English
“They (all those who worship others than Allah) invoke nothing but female deities besides Him (Allah), and they invoke nothing but Shaitan (Satan), a persistent rebel! Allah cursed him. And he [Shaitan (Satan)] said: `I will take an appointed portion of your slaves. Verily, I will mislead them, and surely, I will arouse in them false desires; and certainly, I will order them to slit the ears of cattle, and indeed I will order them to change the nature created by Allah’…” [An-Nisā’ 4:117–119]
హదీసు 1644
وعَنْ أسْمَاءَ رَضِيَ اللَّه عنْهَا أنَّ امْرأَةً سألتِ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالتْ: يا رَسُولَ اللَّه إنَّ ابْنَتِي أصَابَتْهَا الْحَصْبةُ، فتمرَّقَ شَعْرُهَا، وإنِّي زَوَّجْتُها، أفَأَصِلُ فِيهِ؟ فقالَ:"لَعَنَ اللَّه الْواصِلة والْمَوصولة" متفقٌ عليه. وفي روايةٍ:"الواصِلَةَ، والمُسْتوصِلَةَ". قَوْلَهَا:"فَتَمرَّقَ"هو بالرَّاءِ، ومعناهُ: انْتثر وَسَقَطَ،"والْوَاصِلة": التي تَصِلُ شَعْرهَا، أو شَعْر غَيْرِهَا بشَعْرٍ آخَرَ."والمَوْصُولة": التي يُوصَلُ شَعْرُهَا. "والمُستَوصِلَةُ": التي تَسْأَلُ منْ يَفْعَلُ ذلكَ لَهَا. وعَنْ عائشة رضي اللَّه عنْهَا نَحْوُهُ، متفقٌ عليه.
హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హా) కథనం: ఒక స్త్రీ దైవప్రవక్త ﷺ ను అడిగింది, "దైవప్రవక్తా! నా కూతురికి చర్మవ్యాధి సోకింది. దాని మూలంగా ఆమె (తల) వెంట్రుకలు రాలిపోయాయి. నేనామెకు పెళ్ళి చేశాను. మరి ఇప్పుడు నేను ఆమెకు సవరం పెట్టవచ్చా?" అని. అది విని ఆయన "సవరం పెట్టుకునేవారిని, ఆ సవరానికి ఎవరి వెంట్రుకలు వాడుతారో ఆ స్త్రీని దేవుడు శపించాడు" అని చెప్పారు. (బుఖారీ-ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో "సవరం పెట్టుకునే వారిని, పెట్టించుకోవటానికి తాపత్రయపడే వారిని (దేవుడు శపించాడు)" అని ఉంది.
'తమర్రఖ' అంటే రాలిపోయాయి అని అర్థం. వాసిలహ్ అంటే తన వెంట్రుకలతో లేక ఇతరుల వెంట్రుకలతో సవరం చేసి మరో స్త్రీ తలకు పెట్టేది అని అర్థం. మౌసూలా అంటే సవరానికి ఉపయోగించబడిన శిరోజాల స్త్రీ. ముస్తౌసిలా అంటే సవరం పెట్టించుకోవటానికి తాపత్రయపడే స్త్రీ అని భావం. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) నుండి కూడా ఇలాంటి హదీస్లు ఒకటి నకలు చేయబడింది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని లిబాస్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని లిబాస్, జీనత్ ప్రకరణం)
English
Asma’ (radiyallahu anha) said: A woman came to the Prophet ﷺ and said: “O Messenger of Allah! I have a daughter who had an attack of small pox and her hair fell off. Now I want to celebrate her marriage. Can I get her a wig?” Thereupon the Prophet ﷺ said, “Allah has cursed the maker and wearer of a wig.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో ముగ్గురు స్త్రీల గురించి చెప్పబడింది. సవరం పెట్టుకునే స్త్రీ , సవరం పెట్టుకోవాలని తాపత్రయపడే స్త్రీ, సవరం కోసం తన వెంట్రుకలు ఇచ్చే స్త్రీ. వీరు ముగ్గురూ దేవుని చేత శపించబడ్డారు. ఈ రోజుల్లో ఇలాంటి సవరాలు విగ్గుల రూపంలో వస్తున్నాయి. బ్యూటీ పార్లర్ల ద్వారా విగ్గులు ధరించటం, తదితర నీతిబాహ్యమైన పనులకు బాగా ప్రోత్సాహం లభిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|296. సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం|హదీసు 1644
హదీసు 1645
وَعَنْ حميْدِ بن عبْدِ الرَّحْمن أنَّهُ سَمِعَ مُعاويَةَ رضي اللَّه عنْهُ عامَ حجَّ علَى المِنْبَر وَتَنَاول قُصَّةً مِنْ شَعْرٍ كَانَتْ في يَدِ حَرِسيٍّ فَقَالَ: يَا أهْل المَدِينَةِ أيْنَ عُلَمَاؤكُمْ؟، سمِعْتُ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَنْهَى عنْ مِثْلِ هَذِهِ ويقُولُ: "إنًَّمَا هَلَكَتْ بنُو إسْرَائِيل حِينَ اتخذ هذه نِسَاؤُهُمْ" متفقٌ عليه.
హజ్రత్ హుమైద్ బిన్ అబ్దుర్రహ్మాన్ కథనం ప్రకారం తాను హజ్ చేసిన సంవత్సరం ముఆవియా (రదియల్లాహు అన్హు) వేదికపై ఇలా చెబుతుండగా తను విన్నారు. ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) కాపలాదారుని చేతిలో నుంచి వెంట్రుకల గుచ్చం తీసుకుని ఇలా అన్నారు: "ఓ మదీనా వాసులారా! (మిమ్మల్ని చెడుల నుంచి వారించే) మీ పండితులు ఏరి? దైవప్రవక్త ﷺ ఇలాంటి పనులు చేయవద్దని వారిస్తుండగా నేను విన్నాను. ఆయన ఇలా అనేవారు: "ఇస్రాయీల్ జాతి స్త్రీలు ఇలాంటి పనులు మొదలు పెట్టినప్పుడే ఆ జాతి నశించింది." (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని లిబాస్ ప్రకరణం-సహీహ్ ముస్లింలోని లిబాస్, జీనత్ ప్రకరణం)
English
Humaid bin `Abdur-Rahman (May Allah be pleased wth him) said: I saw Mu`awiyah (radiyallahu anhu) during the Hajj (pilgrimage) standing on the pulpit. He took from the guard a bunch of hair, and said: “O people of Al-Madinah! Where are your scholars? (Why do they do not prohibit you) I heard the Prophet ﷺ prohibiting from using this (false hair) and saying, `The people of Bani Israel were ruined when their women wore such hair.”’[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) గారు తన పరిపాలనా కాలంలో స్త్రీలు పాల్పడుతున్న చెడు పోకడలను ఎత్తిచూపారు. ఆ చెడు పోకడలేవో ఇంతకుముందు హదీసుల్లో వివరించబడ్డాయి. దీనిద్వారా బోధపడే విషయం ఏమిటంటే సమాజంలో చెడు వ్యాపిస్తున్నప్పుడు ఆ సమాజానికి అధికారులుగా వ్యవహరిస్తున్న వారు ఆ చెడుపోకడలను ఖండించాలి. జన సామాన్యాన్ని వాటికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. అంతేకాదు, పండితులు, మేధావుల దృష్టిని అటువైపు మళ్ళింపజేసి ఆ చెడు పోకడలకు వ్యతిరేకంగా వారు గళం విప్పేలా చేయాలి. ఈ హదీసు ద్వారా బోధపడుతున్న రెండో విషయం ఏమిటంటే ప్రజల్లో చెడులు వ్యాపిస్తున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా గళం విప్పకపోవటం దైవాగ్రహానికి, దైవశిక్షకు కారణభూతం కాగలదు. ఇక చివరగా మూడో విషయం ఏమిటంటే, ఈ హదీసు నేటి ముస్లింలను తీవ్రంగా హెచ్చరిస్తోంది. నేడు చాలామంది ముస్లిం స్త్రీలు పరదా నియమాలను బేఖాతరు చేస్తూ, బజారు స్త్రీల మాదిరిగా విపరీతంగా అలంకరణలు చేసుకొని, ఇండ్లనుంచి బయటికి వచ్చి నిర్లజ్జగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. ఈ రుగ్మతలు నేడు చాలా ఎక్కువయిపోయాయి. ఇలా చేయటం సవరాలు పెట్టటం, పెట్టించుకోవటం కంటే మహాపాపం. ముస్లింలు ఈ సిగ్గుమాలిన పనులను చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్లు నోరు మెదపకుండా ఉంటున్నారు. ఉలమాలు సయితం తమ ఉపన్యాసాలలో ఈ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వటంలేదు. మన ఈ వైఖరి దైవశిక్షను ఆహ్వానిస్తున్నట్టుంది?! తస్మాత్ జాగ్రత్త!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|296. సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం|హదీసు 1645
హదీసు 1646
وعَنِ ابنِ عُمر رضي اللَّه عنْهُ أنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَعَنَ الْواصِلَةَ وَالمُسْتوصِلَةَ، والْوَاشِمَة والمُستَوشِمة. متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: సవరాలు పెట్టుకునేవారిని, పెట్టించుకోవటానికి తాపత్రయపడే వారిని, పచ్చబొట్లు పొడిపించుకునే వారిని, పొడిపించుకోవటానికి తాపత్రయ పడేవారిని దైవప్రవక్త ﷺ శపించారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని లిబాస్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని లిబాస్, జీనత్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ cursed the maker and wearer of a wig and the tattooer and the one who is tattooed.
[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
వాషిమా అంటే పచ్చబొట్టు పొడిచే స్త్రీ అని అర్థం. సూది లేక అలాంటిదే మరేదయినా వస్తువును శరీరంపై గుచ్చి రక్తం తీస్తారు. తర్వాత ఆ గాయంపై సుర్మా లేక నీలం రంగు పూస్తారు. దానివల్ల ఆ భాగం నల్లగానో లేక పచ్చగానో మారిపోతుంది. దీనినే 'వష్మ్' (పచ్చ పొడిపించుకోవటం) అంటారు. దైవప్రవక్త ﷺ కాలంలో అరబ్బు స్త్రీలు తమ అందచందాలను, సౌందర్యాన్ని పెంచుకునే నిమిత్తం ఇలాంటి పద్ధతులే అనుసరించేవారు. శిరోజాలు బాగా పొడవుగా కనిపించాలని ఇతరుల వెంట్రుకలతో తయారయిన సవరాలను తమ జడలలో దూర్చుకునేవారు. ఈ పోకడలన్నీ అల్లాహ్ సృష్టిలో మార్పు చేయటం క్రిందికి వస్తాయి. కాబట్టి ఇలాంటి పనులు చేసేవారు చేయించేవారు, అందరూ దైవాగ్రహానికి గురవుతారు.
ఈ రోజుల్లో కూడా చాలా మంది స్త్రీలు ఇటువంటివే కొన్ని ఫ్యాషన్లను అనుసరిస్తున్నారు. కనురెప్పల నుంచి వెంట్రుకలను పీకేసి, ఆ సందుల్లో రంగులు నింపటం తదితర తదితర సౌందర్య సాధనాలెన్నింటినో ఉపయోగిస్తున్నారు. రానురాను ఫ్యాషన్లు మితిమీరిపోతున్నాయి. జనుల అభిరుచులు కూడా వెర్రితలలు వేస్తున్నాయి. కేవలం ఫ్యాషన్ల కోసమే వేలకు వేలు డబ్బు దుబారాగా ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి అసహజ పోకడలన్నీ దైవాగ్రహానికి కారణభూతమవుతాయనటంలో సందేహం లేదు.
ముస్లిం స్త్రీలు ఇటువంటి అసహజ పోకడలన్నింటికీ దూరంగా ఉండాలి. ఈ ఫ్యాషన్ పోకడలు మన పరలోక జీవితాన్ని ఎలాగూ నాశనం చేస్తాయి. దానితోపాటు ఇహలోకంలో కూడా ఇవి మన ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి. వీటివల్ల మన సామాజిక జీవితంలో అపసవ్యతలు చోటుచేసుకుంటాయి.
అలాగే గోళ్ళకు రంగుపూసుకునే ఫ్యాషన్ కూడా మన నాట అమల్లో ఉంది. గోళ్ళకు రంగుపూసుకోవటం వల్ల వుజూ నెరవేరదని చాలామంది పండితులు భావిస్తున్నారు. మరి ఈ ఫ్యాషన్ ఎంత నష్టదాయకమో ఆలోచించండి! ఈ ఫ్యాషన్ పోకడలన్నింటినీ మనం అవిశ్వాసుల్ని, పాశ్చాత్యులను గుడ్డిగా అనుసరిస్తూ చేస్తున్నవి. నిజానికి షరీఅత్ అనుమతించిన హద్దులో జీవితం గడపటంలోనే అందం ఉంది, ఆనందమూ ఉంది!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|296. సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం|హదీసు 1646
హదీసు 1647
وعن ابنِ مَسعُودٍ رضي عنْهُ قَال: لعنَ اللَّه الْواشِماتِ والمُستَوشمات والمُتَنَمِّصات، والمُتَفلِّجات لِلحُسْن، المُغَيِّراتِ خَلْق اللَّه، فَقَالَتْ لَهُ امْرأَةٌ في ذلكَ. فَقَالَ: وَمَا لِي لاَ ألْعَنُ مَنْ لَعَنَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَهُو فِي كِتَابِ اللَّه؟، قَالَ اللَّه تَعالى: {وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَما نَهَاكُمْ عَنْهُ فَانْتَهُوا} [الحشر: ٧] . متفقٌ عليه. "المُتَفَلِّجةُ": هيَ الَّتي تبْرُدُ مِنْ أسْنَانِهَا لِيَتَباعدَ بعْضُها مِنْ بعْضٍ قَليلاً وتُحَسِّنُهَا وهُوَ الْوَشْرُ، والنَّامِصَةُ: هِي الَّتي تَأْخُذُ مِنْ شَعْرِ حَاجِبِ غَيْرِهَا، وتُرَقِّقُهُ لِيصِيرَ حَسناً، والمُتَنمِّصةُ: الَّتي تَأمُرُ منْ يفْعَلُ بِهَا ذَلِكَ.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు), "పచ్చబొట్లు పొడిపించుకునేవారిని పొడిపించుకోవటానికి తాపత్రయ పడేవారిని, కనురెప్పల వెంట్రుకలు తీయించుకునే స్త్రీలను, అందం కోసం దేవుడు సృష్టించిన స్థితిని మార్చుకుంటూ పళ్ళ మధ్య సందుచేసుకునే స్త్రీలను దేవుడు శపించాడు" అని అన్నారు.
అది విని ఒకామె ఈ విషయమై ఆయనతో వాదించింది. అందు కాయన, "దైవప్రవక్త ﷺ శపించిన వారిని నేను మాత్రం ఎందుకు శపిం చను? ఇలా చేయమని దైవగ్రంథం లోనే ఉంది కదా! దైవప్రవక్త ఆదేశించిన వాటిని తీసుకోండి. ఆయన వారించిన వాటి జోలికిపోకండి అని దేవుడే అంటున్నాడు" అని చెప్పారు.
(బుఖారీ-ముస్లిం)
"ముతఫల్లిజహ్" అంటే పళ్ళు ఒకదానికొకటి దూరంగా ఉండటం కోసం, అందంగా తయారవటం కోసం దంతాలకు ట్రీట్మెంట్ చేయించటం. వష్ర్ అంటే ఇదే (అందం కోసం పళ్ళను సన్నగా చేసుకోవటం). నామిసహ్ అంటే అందంగా తయారు చేయటం కోసం ఇతర స్త్రీల కనురెప్పల్ని పట్టుకొని వాటిని సన్నగా చేసే స్త్రీ. 'ముతనమ్మిసహ్' అంటే ఇతరులచేత ఆ పని చేయించుకునే స్త్రీ.
(సహీహ్ బుఖారీలోని లిబాస్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని లిబాస్, జీనత్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) said: Allah has cursed those women who practise tattooing and those women who have themselves tattooed, and those women who get their hair removed from their eyebrows and faces (except the beard and the mustache), and those who make artificial spaces between their teeth for beauty, whereby they change Allah’s creation. A woman started to argue with him, saying: “What is all this?” He replied: “Why should I not curse those whom the Messenger of Allah ﷺ cursed and who are cursed in Allah’s Book? Allah, the Exalted, has said in His Book:
“And whatsoever the Messenger (Muhammad ﷺ) gives you, take it; and whatsoever he forbids you, abstain (from it).” (59:7)[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
సౌందర్యాన్ని పెంచుకునే ఉద్దేశ్యంతో దేవుడు సృష్టించిన శరీరాకృతుల్ని మార్చుకోవటం, వాటిలో హెచ్చుతగ్గులు చేసుకోవటం నిషిద్ధమని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఉదాహరణకు పచ్చబొట్లు పొడిపించుకోవటం, పళ్ళను సన్నగా చేసుకోవటం, పళ్ళ మధ్య సందు చేసుకోవటం, కనురెప్పల వెంట్రుకలు పీకేయటం మొదలగు పనులన్నీ ఈ కోవలోకే వస్తాయి. పోతే గోరింటాకు మూలంగా శరీరాకృతిలో ఎలాంటి మార్పు జరగదు. కనుక స్త్రీ గోరింటాకు పెట్టుకోవచ్చు. అయితే ఆ అలంకరణ పర పురుషుల ముందు బహిర్గతం కారాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|296. సవరాలు పెట్టుకోవటం, పచ్చబొట్లు పొడిపించు కోవటం, పళ్ళు సన్నగా చేసుకోవటం నిషిద్ధం|హదీసు 1647
You must be logged in to post a comment.