హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 293వ అధ్యాయం: షైతాన్‌ను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు. ఈ అధ్యాయంలో 3 హదీసులు (హదీసు 1636 – 1638) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
293. షైతాన్‌ను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు
باب النهي عن التشبه بالشيطان والكفار
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1636
عنْ جابرٍ رضي اللَّه عنْهُ قَال: قَال رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " لاَ تأْكُلُوا بِالشِّمَالِ، فَإنَّ الشَّيْطَانَ يأكُل ويَشْرَبُ بِشِمالِهِ "رواه مسلم.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఎడమ చేత్తో తినకండి. షైతాను ఎడమచేత్తో తింటాడు, త్రాగుతాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని అష్‌రిబా ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ as saying: “Do not eat with your left hand, because Satan eats and drinks with his left hand.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|293. షైతాన్‌ను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు|హదీసు 1636
హదీసు 1637
وعَن ابنِ عُمر رضي اللَّه عنْهُما أنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَأْكُلَنَّ أحدُكُمْ بِشِمالِهِ، وَلا يَشْربَنَّ بِهَا. فَإنَّ الشَّيْطَانَ يَأْكُلُ بِشِمالِهِ وَيشْربُ بِهَا" رواهُ مسلم.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: షైతాన్ ఎడమ చేత్తో తింటాడు. దాంతోనే త్రాగుతాడు. కనుక మీలో ఎవరూ కూడా ఎడమ చేత్తో తినరాదు. దాంతో త్రాగనూరాదు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని అష్‌రిబా ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “No person should eat and drink with his left hand for Satan eats with his left hand and drinks with his left hand.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|293. షైతాన్‌ను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు|హదీసు 1637
హదీసు 1638
وعَنْ أَبي هُرَيرَةَ رضي اللَّه عنْهُ أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: إنَّ الْيهُود والنَّصارى لاَ يَصْبِغُونَ، فَخَالِفوهُمْ" متفقٌ عليه. المُرَادُ: خِضَابُ شَعْرِ اللِّحْيةِ والرَّأسِ الأبْيضِ بِصُفْرةٍ أوْ حُمْرةٍ، وأمَّا السَّوادُ، فَمنْهيُّ عَنْهُ كَما سَنَذْكُرُ في الْباب بعْدَهُ، إنْ شَاءَ اللَّه تَعَالَى.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: యూదులు, నస్రానీలు రంగు వేసుకోరు. మీరు వారికి వ్యతిరేకంగా చేయండి.
(బుఖారీ-ముస్లిం)
అంటే, గడ్డం మరియు తలలోని తెల్ల వెంట్రుకలకు పసుపు లేక ఎరుపు రంగు పూసుకోవటమని దీని భావం. అయితే వాటికి నలుపురంగు మాత్రం వేయరాదు.
దైవం తలిస్తే – ఈ విషయాన్ని మేము రాబోవు అధ్యాయంలో వివరిస్తాం.
(సహీహ్ బుఖారీలోని లిబాస్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని లిబాస్, జీనత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ as saying: “Jews and Christians do not dye their hair, so act differently from them.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పండితులు ఈ హదీసులోని ఆదేశాన్ని ముస్తహబ్ (అభిలషణీయం)గా నిర్ధారించారు. కనుక గడ్డం లేక తలలోని తెల్లవెంట్రుకలకు రంగు వేసుకోవటం అవశ్యమేమీ కాదు గాని వేసుకుంటే మంచిది. ఏమయినప్పటికీ యూదుల, నస్రానీల వేషధారణను మాత్రం అనుసరించరాదు. అంచేత వెంట్రుకలకు రంగు వేసుకోకుంటే యూదుల్ని, నస్రానీలను అనుకరించినట్లవుతున్న పక్షంలో తప్పనిసరిగా వెంట్రుకలకు రంగు వేసుకోవాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|293. షైతాన్‌ను, అవిశ్వాసుల్ని అనుకరించరాదు|హదీసు 1638
You must be logged in to post a comment.