హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 290వ అధ్యాయం: షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 6 హదీసులు (హదీసు 1624 – 1629) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం
باب تحريم النظر إِلَى المرأة الأجنبية والأمرد الحسن لغير حاجة شرعية
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{قُلْ لِلْمُؤْمِنِينَ يَغُضُّوا مِنْ أَبْصَارِهِمْ} [النور: ٣٠]
"ప్రవక్తా! విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అని చెప్పు." (నూర్:30)
{إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَئِكَ كَانَ عَنْهُ مَسْؤُولاً} [الإسراء: ٣٦]
"నిశ్చయంగా కళ్లూ, చెవులూ, మనస్సూ అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది." (ఇస్రా: 36)
{يَعْلَمُ خَائِنَةَ الأَعْيُنِ وَمَا تُخْفِي الصُّدُورُ} [غافر: ١٩]
"అల్లాహ్, చూపుల చౌర్యాన్ని సయితం ఎరుగును. హృదయాలు దాచి ఉంచిన రహస్యాన్ని సయితం ఆయన ఎరుగును." (అల్ మోమిన్: 19)
{إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ} [الفجر: ١٤]
"యదార్ధమేమిటంటే మీ ప్రభువు మాటువేసి ఉన్నాడు." (ఫజ్ర్:14)
English
“Tell the believing men to lower their gaze (from looking at forbidden things).” [An-Nūr 24:30]
“Verily, the hearing, and the sight, and the heart, of each of those ones will be questioned (by Allah).” [Al-Isrā’ 17:36]
“Allah knows the fraud of the eyes, and all that the breasts conceal.” [Ghāfir 40:19]
“Verily, your Rubb is Ever Watchful (over them).” [Al-Fajr 89:14]
హదీసు 1624
وَعَنْ أَبي هُريْرةَ رضي اللَّه عنْهُ عنِ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: كُتِبَ عَلَى ابْنِ آدَمَ نَصِيبُهُ مِنَ الزِّنَا مُدْرِكٌ ذلكَ لا محالَةَ: الْعَيْنَانِ زِنَاهُمَا النَّظَرُ، والأُذُنَانِ زِنَاهُما الاستِماعُ، واللِّسَانُ زِنَاهُ الْكَلامُ، وَالْيدُ زِنَاهَا الْبَطْشُ، والرَّجْلُ زِنَاهَا الخُطَا، والْقَلْب يَهْوَى وَيَتَمنَّى، ويُصَدِّقُ ذلكَ الْفرْجُ أوْ يُكَذِّبُهُ". متفقٌ عليه. وهذا لَفْظُ مسلمٍ، وروايةُ الْبُخاريِّ مُخْتَصَرَةٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఆదం పుత్రుని నొసటి మీద ఎంతోకొంత వ్యభిచారం రాసి ఉంటుంది. అతను ఎలాగైనా దాన్ని పొంది తీరుతాడు. కళ్ళ వ్యభిచారం (పరస్త్రీని) చూడటం, చెవుల వ్యభిచారం (అశ్లీల మాటలు) వినటం, నాలుక వ్యభిచారం (అశ్లీల) మాటలు మాట్లాడటం, చేతి వ్యభిచారం (అధర్మ వస్తువుని) పట్టుకోవటం, కాళ్ళ వ్యభిచారం (చెడు పనికోసం) నడవటం. మనసు వాంఛిస్తుంది, కోరుకుంటుంది. మర్మాంగం దాని మాట వింటుంది లేదా తిరస్కరిస్తుంది. (బుఖారీ-ముస్లిం)
పై వాక్యాలు ముస్లింవి. బుఖారీలోని ఉల్లేఖనం సంక్షిప్తంగా ఉంది.
(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఖదర్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Allah has written the very portion of Zina which a man will indulge in. There will be no escape from it. The Zina of the eye is the (lustful) look, the Zina of the ears is the listening (to voluptuous songs or talk), the Zina of the tongue is (the licentious) speech, the Zina of the hand is the (lustful) grip, the Zina of the feet is the walking (to the place where he intends to commit Zina), the heart yearns and desires and the private parts approve all that or disapprove it.”[Al-Bukhari and Muslim].
This is the wording in Muslim; Al-Bukhari wording is a bit short.
ముఖ్యాంశాలు
చూడటం, వినటం, పట్టుకోవటం, నడచివెళ్ళటం, వాస్తవానికి వ్యభిచార పనులు కావుగాని ఇవి వ్యభిచారానికి కారణభూతమయ్యే ప్రమాదం ఉండటం మూలంగా మనిషి వీటికి కూడా దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో అన్యాపదేశంగా వీటిని కూడా వ్యభిచార పనులుగా పేర్కొనటం జరిగింది. మనిషి గనక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అతని మర్మాంగం మనోవాంఛలకు దాసోహమంటుంది. ఫలితంగా ఎప్పుడో ఒకప్పుడు అతను వ్యభిచార కూపంలో పడిపోవచ్చు. అదే మనిషి వీటి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడనుకోండి. మర్మాంగం మనోవాంఛలకు లోనయ్యే ప్రసక్తే ఉండదు. ఫలితంగా అతను వ్యభిచారానికి దూరంగా ఉంటాడు. ఈ రోజుల్లో అదే జరుగుతోంది. అపరిచితులైన ఇద్దరు స్త్రీ పురుషులు ముందు ఒకర్నొకరు తీక్షణంగా చూసుకుంటారు. ఆ తర్వాత చిర్నవ్వులు, దరిమిలా కవ్వింపులు, సంభాషణలు, ఆపైన చెట్టాపట్టాలు – కనుక ఈ కారణాలన్నిటికీ దూరంగా ఉండటం చాలా అవసరం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం|హదీసు 1624
హదీసు 1625
وعنْ أَبي سعِيدٍ الخُدْرِيِّ رضي اللَّه عنْهُ عَنِ النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إيَّاكُمْ والجُلُوسَ في الطُّرُقَاتِ،"قَالُوا: يَارَسُول اللَّه مالَنَا مِنْ مجالِسِنا بُدٌّ: نَتَحَدَّثُ فِيهَا. فَقالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"فَإذَا أبَيْتُمْ إلاَّ المجْلِسَ، فأَعْطُوا الطَّرِيقَ حَقَّهُ"قَالُوا: ومَا حَقُّ الطَّرِيق يَارَسُولَ اللَّه؟ قَالَ:"غَضَّ البَصَرِ، وكَفُّ الأذَى، وردُّ السَّلامِ، والأمْرُ بِالمَعْرُوفِ والنَّهىُ عنِ المُنْكَرِ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "మీరు (జనం నడిచే) దారుల్లో కూర్చోకుండా జాగ్రత్త పడండి" అని ఆదేశించారు. అప్పుడు సహచరులు, "దైవప్రవక్తా! దారుల్లో కూర్చోవటం తప్ప మాకు వేరే దిక్కు లేదు. మేము అక్కడ కూర్చొని (చాలా ముఖ్యమైన మాటలు) మాట్లాడుకుంటాము" అని విన్నవించుకోగా, "సరే, దారుల్లో కూర్చోవటం తప్పదనుకుంటే మరి మీరు దారి హక్కు నెరవేర్చండి" అని అన్నారు దైవప్రవక్త ﷺ. అది విని సహచరులు మళ్ళీ "ఈ దారి హక్కు ఏమిటి దైవప్రవక్తా!?" అని ప్రశ్నించగా, "చూపులు క్రిందికి వాల్చి ఉంచటం, బాధాకరమైన వస్తువులను దారి నుంచి తొలగించటం, సలాంకు జవాబు పలకటం, మంచిని గురించి ప్రబోధించి, చెడు నుంచి ఆపటం (ఇదే దారి హక్కు)" అని ఆయన బదులిచ్చారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) said: The Prophet ﷺ said, “Avoid sitting on roadsides.” His Companions said: “O Messenger of Allah ﷺ, there is no other alternative but to sit there to talk.” Thereupon the Messenger of Allah ﷺ said, “If you have to sit at all, then fulfill the rights of the road.” They asked: “What are their rights?” Thereupon he said, “Lowering the gaze (so that you may not stare at unlawful things); refraining from doing some harm to others, responding to greeting (i.e., saying `Wa`alaikumus-salam’ to one another) and commanding the good and forbidding the evil.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
సాధారణ రోడ్లు, కాలిబాటలు సంఘంలోని ప్రజల ఉమ్మడి ఆస్తులుగా పరిగణించబడతాయి. కనుక వాటిమీద సభలు, సమావేశాలు నిర్వహించటం సరికాదు. దానివల్ల అటుగా వెళ్ళేవారికి ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా పరపురుషుల ముందునుంచి వెళ్ళటానికి ఇష్టపడని పరదాధారులైన స్త్రీలు చాలా మనస్తాపానికి గురౌతారు. కనుక రోడ్లమీద మీటింగులు, సమావేశాలు నిర్వహించటం తగదు. ఒకవేళ ఇళ్ళు ఇరుకుగా ఉండటం మూలంగానో లేక మరే కారణం వల్లనో బయట కూర్చోవటం తప్పదనుకుంటే- అలాంటప్పుడు రోడ్డు మీద పాపాలకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు దారిన వచ్చేపోయే స్త్రీల వైపు చూడకూడదు. అలాగే తమ వల్ల ఇతరులకు మేలుజరిగేలా చూసుకోవాలి. అంటే ధర్మబోధనలు చేసిగాని, ధర్మప్రచారం చేసిగాని ప్రజల నీతినడవడికలను తీర్చిదిద్దాలి. వారి శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఈ రోజుల్లో ప్రజలు వివాహాది వేడుకల సందర్భంగా దారులు మూసేసి ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇది షరీఅత్పరంగా, నైతికంగా కూడా ఎంతో చెడ్డ విషయం. తమ సొంత పని కోసం వేలాది మంది మనసు నొప్పించటాన్ని ఏ షరీఅత్, ఏ నైతిక విధానం అనుమతిస్తుంది? అదీగాకుండా ఈ వేడుకలు దైవ అవిధేయతా కార్యాలతో, దుబారా ఖర్చుతో, ఇతర పైశాచిక చేష్టలతో నిండి ఉంటాయి. దేవుడు ముస్లింలకు సన్మార్గాన్ని, సద్బుద్ధిని ప్రసాదించుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం|హదీసు 1625
హదీసు 1626
وعَنْ أَبي طلْحةَ زيْدِ بنِ سهْلٍ رَضِىَ اللَّه عنْهُ قَالَ: كُنَّا قُعُوداً بالأفنِيةِ نَتحَدَّثُ فِيهَا فَجَاءَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَامَ علينا فقال: "مالكُمْ وَلمَجالِسِ الصُّعُداتِ؟ اجْتَنِبُوا مَجَالِسَ الصُّعُداتِ"فَقُلنا: إنَّما قَعدنَا لغَير مَا بَأس: قَعدْنَا نَتَذاكرُ، ونتحدَّثُ. قَالَ:"إمَّا لاَ فَأدُّوا حَقَّهَا: غَضُّ البصرِ، ورَدُّ السَّلام، وحُسْنُ الكَلام "رواه مسلم. "الصُّعداتُ"بضَمِّ الصَّادِ والعيْن. أي: الطُّرقَات.
హజ్రత్ అబూ తల్హా జైద్ బిన్ సహ్ల్ (రదియల్లాహు అన్హు) కథనం: మేము ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటుండగా దైవప్రవక్త ﷺ మా దగ్గరికి వచ్చి నిలబడ్డారు. తర్వాత "ఏమిటీ దారుల్లో కచేరీలు పెట్టారు? దారుల్లో ఈ విధంగా కచేరీలు పెట్టకుండా జాగ్రత్తపడండి సుమా!" అని ఉపదేశించారు. అందుకు సహచరులు, "మేమిక్కడ షరీఅత్పరంగా తప్పుకాని పని మీద కూర్చున్నాం. మేమిక్కడ కూర్చొని పునశ్చరణలు, సంభాషణలు జరుపుకుంటాం" అని విన్నవించుకున్నారు. దానికాయన, "సరే, అలా కూర్చోవటం తప్ప మీకు వేరే మార్గం లేదనుకుంటే దాని హక్కుని నెరవేర్చండి. చూపులు క్రిందికి వాల్చి ఉంచటం, సలాంకు జవాబు పలకటం, మంచి మాటలు మాట్లాడుకోవటం (ఇదే దారి హక్కు)" అని బోధించారు. (ముస్లిం)
'సువుదాత్' అంటే దారులు అని అర్థం.
(సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Abu Talhah Zaid bin Sahl (radiyallahu anhu) said: We were sitting and talking on a platform in front of our house when the Messenger of Allah ﷺ stopped by us and said, “Why do you sit on roads? Avoid sitting in them.” We replied: “We sit there intending no harm. We only sit and discuss (religious) knowledge and talk.” He said, “If you have to sit, you should fulfill the rights of the road: Lower your gaze, respond to greetings and talk in a good manner.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం|హదీసు 1626
హదీసు 1627
وَعَنْ جَرِير رضي اللَّه عنْهُ قَالَ: سألْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنْ نَظَرِ الفجأةِ فَقَال:"اصْرِفْ بصَرَك" رواه مسلم.
హజ్రత్ జరీర్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺను అకస్మాత్తుగా దృష్టి పడటం గురించి అడిగాను. అందుకాయన, "(వెంటనే) దృష్టి మరల్చుకో" అని చెప్పారు. (ముస్లిం)
(సుననె అబూదావూద్లోని నికాహ్ ప్రకరణం)
English
Jarir bin `Abdullah (radiyallahu anhu) said: I asked the Messenger of Allah ﷺ about (the Islamic ruling on) accidental glance (i.e., at a woman one is not Islamically allowed to look at) and he ordered me to turn my eyes away.[Muslim].
ముఖ్యాంశాలు
పరస్త్రీ మీద యాదృచ్ఛికంగా దృష్టి పడిపోతే వెంటనే దృష్టి మరల్చుకోవాలి. తదేకంగా చూస్తూ ఉండిపోకూడదు. ఎందుకంటే దానివల్ల మనసులో కోరిక పుడితే అది పాపంగా, కంటి వ్యభిచారంగా పరిగణించబడుతుంది. అదే విధంగా మొహం మీద వెంట్రుకలు లేకుండా అందంగా కనపడే అబ్బాయిల వంక చూడటం కూడా స్త్రీల వైపు చూడటం లాంటిదేనని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం|హదీసు 1627
హదీసు 1628
وَعنْ أمِّ سَلَمةَ رضي اللَّه عنْهَا قَالَتْ: كُنْتُ عِنْدَ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وعِنْدَهُ مَيمونهُ، فَأَقْبَلَ ابنُ أمُّ مكتُوم، وذلكَ بعْدَ أنْ أُمِرْنَا بِالحِجابِ فَقَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "احْتَجِبا مِنْهُ"فَقُلْنَا: يَا رَسُولَ اللَّهِ ألَيْس هُوَ أعْمَى: لاَ يُبْصِرُنَا، وَلاَ يعْرِفُنَا؟ فقَال النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"أفَعَمْياوَانِ أنْتُما ألَسْتُما تُبصِرانِهِ؟ " رواه أَبُو داود والترمذي وقَالَ: حَدِيثٌ حسنٌ صَحِيحٌ.
హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం: నేను దైవప్రవక్త ﷺ దగ్గర ఉన్నాను. ఆ సమయంలో ఆయన దగ్గర మైమూన (రదియల్లాహు అన్హా) కూడా ఉన్నారు. అంతలో ఇబ్నె ఉమ్మె మక్తూమ్ అటుగా వచ్చారు. దైవప్రవక్త ﷺ మమ్మల్ని 'పరదాలోకి వెళ్ళి పొండని' ఆదేశించారు. మేము సందేహపడుతూ, "దైవ ప్రవక్తా! ఆయన అంధులు కారా? ఆయన మమ్మల్ని చూడలేరు. గుర్తు పట్టనూ లేరు కదా!?" అని అడిగాం. అందుకాయన, "మీరు కూడా అంధులేనా? మీకు ఆయన కనపడటం లేదా?" అని అన్నారు. (అబూదావూద్, తిర్మిజీ-హసన్, సహీహ్)
(సుననె అబూదావూద్లోని వస్త్రధారణ ప్రకరణం – సుననె తిర్మిజీలోని అదబ్ అధ్యాయం)
English
Umm Salamah (radiyallahu anha) said: I was with the Messenger of Allah ﷺ along with Maimunah (radiyallahu anhu) when Ibn Umm Maktum (radiyallahu anhu) (who was blind) came to visit him. (This incident took place after the order of Hijab). The Prophet ﷺ told us to hide ourselves from him (i.e., observe Hijab). We said: “O Messenger of Allah ﷺ, he is blind and is unable to see us, nor does he know us.” He replied; “Are you also blind and unable to see him?”[Abu Dawud and At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఆధారాల్లో ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) గారిచేత స్వేచ్ఛ నొసగబడిన బానిస నిబ్హాన్- గురించి పూర్తి వివరాలు తెలియటం లేదు (అని ప్రముఖ హదీసువేత్త అల్బానీగారు పేర్కొన్నారు). కనుక ఈ ఉల్లేఖనం ప్రామాణికమైనది కాదు. దీనికి విరుద్ధంగా దైవప్రవక్త ﷺ ఫాతిమా బిన్తె ఖైస్ను అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఇంట్లో 'ఇద్దత్' గడపమని ఆదేశించారనీ, అక్కడయితే నీవు బట్టలు విడువటానికి కూడా ఇబ్బంది ఉండదని ఆయన చెప్పినట్లు ప్రామాణిక హదీసుల్లో ఉంది. కనుక అంధులతో పరదా చేయవలసిన అవసరం లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం|హదీసు 1628
హదీసు 1629
وعنْ أَبي سَعيدٍ رضي اللَّه عنْهُ أنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"لاَ يَنْظُرُ الرَّجُلُ إِلَى عوْرةِ الرَّجُلِ، وَلا المَرْأةُ إِلَى عوْرَةِ المَرْأةِ، وَلاَ يُفْضِى الرَّجُلُ إِلَى الرَّجُلِ في ثوبٍ واحِدٍ، وَلاَ تُفْضِى المَرْأةُ إِلَى المَرْأةِ في الثَّوْبِ الواحِدِ" رواه مسلم.
హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: పురుషుడు ఇతర పురుషుని మర్మావయవాలను చూడరాదు. స్త్రీ ఇతర స్త్రీ మర్మావయవాలను చూడరాదు. పురుషుడు మరొక పురుషుని ప్రక్కన నగ్నంగా ఒకే దుప్పట్లో పడుకోరాదు. స్త్రీ ఇతర స్త్రీ ప్రక్కన నగ్నంగా ఒకే దుప్పట్లో పడుకోరాదు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని హియజ్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “A man must not look at a man’s private parts nor must a woman look at a woman’s private parts; neither should two men lie naked under one cover, nor should two women lie naked under the same cover.”[Muslim].
ముఖ్యాంశాలు
ఇస్లాం ధర్మం లజ్జావిహీనతను ఎంత కఠినంగా అరికట్టగోరుతుందో ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ఇస్లాం ఒక పురుషుడు మరో పురుషుని ప్రక్కన నగ్నంగా పడుకోవటాన్నే సహించనప్పుడు స్త్రీ పురుషుల్ని విచ్చలవిడిగా కలుసుకోనిచ్చే పాశ్చాత్య పోకడల్ని సహిస్తుందా? శోచనీయమైన విషయం ఏమిటంటే నేడు అదే నీతిమాలిన సంస్కృతిని టెలివిజన్ మొదలగు పరికరాల ద్వారా ముస్లిం దేశాల్లో కూడా ప్రచారం చేయటం జరుగుతోంది. పాశ్చాత్య తత్వం ఆవహించిన నేతలు కూడా ఆ నీతిమాలిన్యానికి, లజ్జారాహిత్యానికి 'సంస్కృతి' అనే ముద్దుపేరు పెట్టి ఆరాధిస్తున్నారు. దేవుడు ముస్లిం దేశాలను అలాంటి భ్రష్ట నేతల చెర నుండి విముక్తినొసగుగాక!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|290. షరీఅత్ పరమైన అవసరమేది లేకుండా పర స్త్రీ వైపు, వెంట్రుకలు లేకుండా అందంగా ఉన్న బాలుని వైపు చూడటం నిషిద్ధం|హదీసు 1629
You must be logged in to post a comment.