హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 291. ఏకాంతంలో పర స్త్రీ వెంట ఉండటం నిషిద్ధం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 291వ అధ్యాయం: ఏకాంతంలో పర స్త్రీ వెంట ఉండటం నిషిద్ధం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 3 హదీసులు (హదీసు 1630 – 1632) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

291. ఏకాంతంలో పర స్త్రీ వెంట ఉండటం నిషిద్ధం

↑ విషయ సూచిక

باب تحريم الخلوة بالأجنبية

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعاً فَاسْأَلوهُنَّ مِنْ وَرَاءِ حِجَابٍ} [الأحزاب: ٥٣]

"మీరు ప్రవక్త భార్యలను ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి." (అహ్‌జాబ్:53)

English

“And when you ask (his wives) for anything you want, ask them from behind a screen.” [Al-Aḥzāb 33:53]

1630

హదీసు 1630

وَعَنْ عُقْبَةَ بْن عَامِرٍ رضي اللَّه عَنْهُ أنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "إيَّاكُمْ وَالدُّخُولَ عَلَى النِّسَاءِ"، فَقَالَ رَجُلٌ مِنَ الأنْصَارِ أفَرأيْتَ الْحمْوَ؟ قالَ:"الْحمْوُ المَوْتُ،" متفقٌ عَلَيْهِ. "الْحَموُ"قَرِيبُ الزَّوْجِ كأخِيهِ، وابْنِ أخِيهِ، وابْنِ عمِّهِ.

హజ్రత్ ఉఖ్‌బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ "పర స్త్రీలు ఉండే ఇళ్ళల్లోకి ప్రవేశించకండి" అని ఉపదేశించారు. అది విని అన్సార్ వర్గానికి చెందిన ఒక వ్యక్తి, "దైవప్రవక్తా! మరి మరిది సంగతి ఏమిటి?" అని అడిగాడు. దాని కాయన,"మరిది చావు లాంటివాడు" అని బదులిచ్చారు.

(బుఖారీ-ముస్లిం)

'అల్ హమ్వు' అంటే భర్తకు దగ్గరి బంధువు. అతని సోదరుడు, అతని సోదర కుమారుడు, బాబాయి కుమారుడు మొదలగువారు.

(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలామ్ ప్రకరణం)

English

`Uqbah bin `Amir (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Avoid (entering a place) in which are women (uncovered or simply to mix with them in seclusion).” A man from the Ansar said, “Tell me about the brother of a woman’s husband.” He replied, “The brother of a woman’s husband is death.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో పరదాకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం వివరించబడింది. దానిని ముస్లింలలో అత్యధిక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దగ్గరి బంధువులవటం చేత వారు ఇండ్లకు చాలా ఎక్కువగా వస్తూ పోతూ ఉంటారు. ఇంటి ఆడవాళ్ళతో ఏకాంతంలో ఉండే అవకాశాలు ఎన్నో వస్తుంటాయి. కనుక ఇతరుల కన్నా ఇలాంటి దగ్గరి బంధువుల మూలంగా ఉపద్రవాలకు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దగ్గరి బంధువుని మృత్యువుతో పోల్చటం జరిగింది. అంటే ధర్మపరంగా వారు మృత్యువుకు కారణభూతులవుతారన్నమాట! లేదా ఇస్లామీయ రాజ్యంలో వ్యభిచారానికి మరణశిక్ష ఉంటుంది కనుక ఆ స్త్రీ పురుషులు గనక పాపానికి పాల్పడితే దాని ఫలితం మరణమే అవుతుందని దాని భావం కావచ్చు. అదీకాకపోతే తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధమున్నట్లు భర్తకు అనుమానం వస్తే అతను పౌరుషం కొద్దీ ఆమెను హత్య చేయవచ్చు లేదా ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు. విడాకుల వల్ల కూడా స్త్రీ జీవితం జీవచ్ఛవమై పోతుంది. లేదా మృత్యువుకు ఎలా భయపడతారో పరస్త్రీతో ఏకాంతంలో గడపటానికి కూడా అలాగే భయపడండి అని భావం కావచ్చు. ఏది ఏమయినప్పటికీ భర్త సోదరులతోనే పరదా చేయటం అవశ్యమైనప్పుడు భర్త స్నేహితులతో పరదా చేయటం ఇంకెంత అవశ్యమో వేరే చెప్పనక్కర్లేదు. నేడు ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం చాలా ఎక్కువయిపోయింది. దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు ఎదురౌతున్నాయి. వాటిని తరచూ వార్తాపత్రికల్లో చదువుతూనే ఉంటాం. అయినప్పటికీ ప్రజలు వీటి వెనకున్న కారణాలను గ్రహించరు. లజ్జారాహిత్యం ఓ మహమ్మారిలా వ్యాపిస్తూ పోతుండటం చాలా విచారకరం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|291. ఏకాంతంలో పర స్త్రీ వెంట ఉండటం నిషిద్ధం|హదీసు 1630

1631

హదీసు 1631

وَعَن ابنِ عبَّاسٍ رضي اللَّه عنْهُما أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "لاَ يَخْلُوَنَّ أحدُكُمْ بِامْرأةٍ إلاًَّ مَعَ ذِي مَحْرَمٍ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: మీలో ఎవరూ కూడా పరస్త్రీ వెంట ఏకాంతంలో ఉండరాదు- ఆమె వెంట ఆమె మహ్రమ్ పురుషుడు ఉంటే తప్ప.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని నికాహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని హజ్ ప్రకరణం)

English

Ibn Abbas (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “No one of you should meet a woman in privacy unless she is accompanied by a Mahram (i.e., a relative within the prohibited degrees).”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|291. ఏకాంతంలో పర స్త్రీ వెంట ఉండటం నిషిద్ధం|హదీసు 1631

1632

హదీసు 1632

وعن بُريْدةَ رضي اللَّه عنْهُ قَالَ: قَال رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "حُرْمةُ نِساءِ المُجاهِدِينَ علَى الْقَاعِدِينَ كَحُرْمةِ أمهاتِهمْ، مَا مِنْ رجُل مِنْ الْقَاعِدِين يخْلُفُ رجُلاً مِنَ المُجاهدينَ في أهلِهِ، فَيَخُونُهُ فِيهِم إلاَّ وقَف لهُ يَوْم الْقِيامةِ، فَيأخُذُ مِن حسَناتِهِ مَا شَاءَ حَتَّى يَرضي"ثُمَّ الْتَفت إليْنَا رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ:"مَا ظَنُّكُمْ؟ " رواهُ مسلم.

హజ్రత్ బురైదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: యుద్ధానికి వెళ్ళినవారి స్త్రీల మానమర్యాదలు యుద్ధానికి వెళ్ళనివారి కొరకు తమ తల్లుల మానమర్యాదల మాదిరిగా పవిత్రమైనవి. ఎవడైనా యుద్ధానికి వెళ్ళని వాడు యుద్ధానికి వెళ్ళినవాడి ఇంటికి పర్యవేక్షకునిగా ఉండి ద్రోహానికి పాల్పడితే ప్రళయదినాన అతన్ని ఆ యోధుని ముందు నిలబెట్టడం జరుగుతుంది. అతను ఆ ద్రోహి చేసిన సత్కర్మల్లో తాను కోరుకున్నన్ని సత్కర్మలు తీసుకుంటాడు. ఆ విధంగా తీసుకొని చివరికి ప్రసన్నుడౌతాడు.

తర్వాత దైవప్రవక్త ﷺ మా వైపుతిరిగి, "మీరే మంటారు?" అని అడిగారు. (అంటే సహజంగానే మనిషి ఆశాపరుడై ఉండి దైవం నుంచి అనుమతి లభించిన తర్వాత అతను తనకు ద్రోహం చేసినవాడి దగ్గర ఒక్క సత్కర్మ అయినా వదులుతాడా?)

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఇమారహ్ ప్రకరణం)

English

Buraidah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “The sanctity of the wives of Mujahidun (i.e., those who strive hard and fight in the way of Allah) for those who remain at home (i.e., those who do not go to the battlefield to fight Jihad) is like the sanctity of their own mothers. Anyone who remains behind to look after the family of a Mujahid and betrays his trust, will be made to stand on the Day of Resurrection before the Mujahid who will take away from his meritorious deeds whatever he likes till he is satisfied.” The Messenger of Allah ﷺ turned toward us and said, “Now, what do you think (i.e., will he leave anything with him)?”[Muslim].

ముఖ్యాంశాలు

ధర్మయోధులు యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత వారి ఇంటిని పర్యవేక్షించటం వారి కుటుంబ సభ్యుల బాగోగుల్ని పట్టించుకోవటం చాలా గొప్ప కార్యం. అయితే ఆ పనిలో ద్రోహానికి గనక పాల్పడితే దాని పాపం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దాని మూలంగా ఇస్లాం ధర్మం ఎంతో ప్రాముఖ్యతనిచ్చే పరస్పర సహాయక వ్యవస్థకు విఘాతం వాటిల్లుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|291. ఏకాంతంలో పర స్త్రీ వెంట ఉండటం నిషిద్ధం|హదీసు 1632