హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 289. ప్రదర్శనాబుద్ధి క్రిందికి రాని విషయాలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 289వ అధ్యాయం: కొన్ని విషయాలు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్నట్లుంటాయి. వాస్తవానికి అవి ప్రదర్శనాబుద్ధి క్రిందికి రావు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1623) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

289. కొన్ని విషయాలు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్నట్లుంటాయి. వాస్తవానికి అవి ప్రదర్శనాబుద్ధి క్రిందికి రావు

↑ విషయ సూచిక

باب ما يتوهم أنه رياء وليس برياء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1623

హదీసు 1623

عنْ أَبي ذَرٍّ رضي اللَّه عنْهُ قَال: قِيل لِرسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أَرأَيْتَ الرَّجُلَ الَّذِي يعْملُ الْعملَ مِنَ الخيْرِ، ويحْمدُه النَّاسُ عَلَيْهِ؟ قَالَ:"تِلْكَ عاجِلُ بُشْرَى المُؤْمِنِ"، رواه مسلم.

హజ్రత్ అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺను అడగటం జరిగింది, "మనిషి ఒక మంచి పని చేస్తుంటే తోటి మనుషులు అతన్ని పొగుడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయమేంటి? (అది కూడా ప్రదర్శనా బుద్ధి క్రిందికే వస్తుందా?)" అని. అందుకాయన, "(లేదు), అది విశ్వాసికి లభించే ముందస్తు శుభవార్త" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Abu Dharr (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ was asked: “Tell us about a person who does some good deed and people praise him, will this be considered as showing off?” He replied, “This is the glad tidings which a believer receives (in this life).”[Muslim].

ముఖ్యాంశాలు

మనిషి మనసులో ప్రదర్శనాబుద్ధి లేకపోయినా తాను చేస్తున్న మంచి పనుల్ని చూసి జనం పొగిడితే దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. పైగా దాన్ని పరలోక జీవితంలో తనకు జరగబోయే సత్కారానికి ఇహలోకంలో ముందస్తుగా లభిస్తున్న శుభవార్తగా, జనుల నోట వెలువడుతున్న దైవిక సూచనగా భావించాలి. ప్రజల ప్రశంసలు, పొగడ్తల వల్ల చిత్తశుద్ధికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా ఆ ఆచరణ దేవుని సన్నిధిలో సమ్మతించి ఆమోదించబడిందనటానికి జనుల పొగడ్తలే సాక్ష్యం మరియు నిదర్శమూను.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|289. కొన్ని విషయాలు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్నట్లుంటాయి. వాస్తవానికి అవి ప్రదర్శనాబుద్ధి క్రిందికి రావు|హదీసు 1623