హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 29. తోటి ముస్లింల అవసరాలను తీర్చటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 29వ అధ్యాయం: తోటి ముస్లింల అవసరాలను తీర్చటం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 246 – 247) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

29. తోటి ముస్లింల అవసరాలను తీర్చటం

↑ విషయ సూచిక

باب قضاء حوائج المسلمين

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{وَافْعَلُوا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُونَ} [الحج: ٧٧]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు: (విశ్వాసులారా!) మేలు చేయండి. బహుశా దీని ద్వారానే మీరు సాఫల్యం పొందవచ్చు. (అల్ హజ్ : 77)

English

“… and do good that you may be successful”. [Al-Ḥajj 22:77]

246

హదీసు 246

وعن ابن عمرَ رضي اللَّهُ عنهما أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "المسلمُ أَخو المسلم لا يَظلِمُه ولا يُسْلِمُهُ. ومَنْ كَانَ فِي حاجةِ أَخِيهِ كانَ اللَّهُ فِي حاجتِهِ، ومنْ فَرَّجَ عنْ مُسلمٍ كُرْبةً فَرَّجَ اللَّهُ عَنْهُ بها كُرْبةً مِنْ كُرَبِ يومَ القيامةِ، وَمَنْ سَتَرَ مُسْلماً سَتَرَهُ اللَّهُ يَومَ الْقِيامَةِ "مُتَّفَقٌ عَلَيهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (న) ఇలా ఉద్బోధించారు : ముస్లిం ముస్లింకు సోదరుడు. ఒక ముస్లిం తోటి ముస్లింపై (ఎన్నటికీ) దౌర్జన్యం చేయడు, అతన్ని నిస్సహాయుడిగా వదలిపెట్టడు. (ఒక ముస్లిం) తన సోదరుని అవసరాలు తీర్చే పనుల్లో (నిమగ్నుడై) ఉంటే దేవుడు అతని అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఎవరైనా ముస్లింను ఒక కష్టం నుంచి కాపాడితే, ప్రళయదినాన దేవుడు అతనికి ఎదురయ్యే కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైనా ఒక ముస్లిం (వల్ల జరిగిన పొరపాట్ల)పై ఆచ్ఛాదన వేస్తే దేవుడు కూడా ప్రళయ దినాన అతని (తప్పుల్ని) మరుగు పరుస్తాడు. (బుఖారీ – ముస్లిం)

English

Ibn `Umar (May Allah bepleased with them) reported: Messenger of Allah ﷺ said, “A Muslim is a brother of (another) Muslim, he neither wrongs him nor does hand him over to one who does him wrong. If anyone fulfills his brother’s needs, Allah will fulfill his needs; if one relieves a Muslim of his troubles, Allah will relieve his troubles on the Day of Resurrection; and if anyone covers up a Muslim (his sins), Allah will cover him up (his sins) on the Resurrection Day”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా, నిస్వార్థంతో, కేవలం దైవప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతోనే తోటి ముస్లింలకు సహాయం చేసి వారి అవసరాలను తీర్చాలి. తోటి ముస్లింలకు చేసే ఈ నిస్వార్థ సహాయ సహకారాలు దేవుని సన్నిధిలో శ్రేష్ఠమైన పుణ్యకార్యాలుగా లిఖించబడతాయి. ముస్లిం సమాజ అవసరాలను తీర్చేందుకు స్వచ్ఛందంగా పని చేసే వారి అవసరాలను దేవుడు తీరుస్తాడు. పరలోకంలో కూడా వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|29. తోటి ముస్లింల అవసరాలను తీర్చటం|హదీసు 246

247

హదీసు 247

وعن أَبي هريرة رضي اللَّه عنهُ، عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ نَفَّس عَنْ مُؤْمِنٍ كُرْبة منْ كُرب الدُّنْيا، نفَّس اللَّه عنْه كُرْبة منْ كُرَب يومِ الْقِيامَةِ، ومنْ يسَّرَ عَلَى مُعْسرٍ يسَّرَ اللَّه عليْه في الدُّنْيَا والآخِرةِ، ومنْ سَتَر مُسْلِماً سَترهُ اللَّه فِي الدنْيا وَالآخِرَةِ، واللَّه فِي عوْنِ العبْد مَا كانَ العبْدُ في عوْن أَخيهِ، ومنْ سَلَكَ طَريقاً يلْتَمسُ فيهِ عِلْماً سهَّل اللَّه لهُ به طَريقاً إِلَى الجنَّة. وَمَا اجْتَمَعَ قوْمٌ فِي بيْتٍ منْ بُيُوتِ اللَّه تعالَى، يتْلُون كِتَابَ اللَّه، ويَتَدارسُونهُ بيْنَهُمْ إلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينةُ، وغَشِيَتْهُمُ الرَّحْمةُ، وحفَّتْهُمُ الملائكَةُ، وذكَرهُمُ اللَّه فيمَنْ عِندَهُ. ومنْ بَطَّأَ بِهِ عَملُهُ لمْ يُسرعْ به نَسَبُهُ" رواه مسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : విశ్వాసికి ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని గనక ఎవడైనా దూరం చేస్తే, దేవుడు పరలోకంలో అతడికి ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైనా (ఆర్థిక) ఇబ్బందుల్లో ఉన్న ఒక అభాగ్యునికి సౌలభ్యాన్ని చేకూరిస్తే దేవుడు వారికి ఇహపరాల్లోనూ సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైనా ఒక ముస్లిం (పాపాల)ను కప్పిపుచ్చితే, దేవుడు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ అతని (పాపాలను) కప్పిపుచ్చుతాడు. దాసుడు తన సోదరుడికి సహాయం చేస్తున్నంతకాలం దేవుడు దాసునికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎవడైనా విద్యాన్వేషణలో ఏదైనా మార్గంలో నడిస్తే తద్వారా దేవుడు అతనికోసం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. ప్రజలు దైవగృహాలలోని ఏ గృహంలోనయినా సమావేశమయి దైవ గ్రంథాన్ని పఠించటం, దానిని ఇతరులకు బోధించటం చేసినప్పుడు వారిపై ప్రశాంతత ఆవరిస్తుంది. దైవకారుణ్యం వారిని అలుముకుంటుంది. దైవ దూతలు వారిని చుట్టుముడతారు. దేవుడు వారి గురించి తన సన్నిధిలో వున్న దూతలకు చెబుతాడు. (వీటన్నిటికి భిన్నంగా) ఆచరణ మందగించిన వాణ్ణి అతని వంశ గౌరవం ముందుకు తీసుకు పోజాలదు. (అంటే దేవుని సన్నిధిలో ఎవరూ వంశం ప్రాతిపదికపై ముక్తి పొందలేరని అర్థం.) (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రార్థనల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: The Prophet ﷺ said, “He who removes from a believer one of his difficulties of this world, Allah will remove one of his troubles on the Day of Resurrection; and he who finds relief for a hard-pressed person, Allah will make things easy for him on the Day of Resurrection; he who covers up (the faults and sins) of a Muslim, Allah will cover up (his faults and sins) in this world and in the Hereafter. Allah supports His slave as long as the slave is supportive of his brother; and he who treads the path in search of knowledge, Allah makes that path easy, leading to Jannah for him; the people who assemble in one of the houses of Allah, reciting the Book of Allah, learning it and teaching, there descends upon them the tranquillity, and mercy covers them, the angels flock around them, and Allah mentions them in the presence of those near Him; and he who lags behind in doing good deeds, his noble lineage will not make him go ahead.”[Muslim]

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ఇబ్బందుల్లో ఉన్న వారికి సౌలభ్యాన్ని చేకూర్చాలని చెప్పబడింది. ధర్మజ్ఞానాన్ని ఆర్జించే నిమిత్తం చేసే ప్రయాణం స్వర్గానికి పూబాట అవుతుందని చెప్పబడింది. ఖుర్‌ఆన్ పఠించటం, కొంతమంది ఒక చోట చేరి దానిని అభ్యసించడం, ఇతరులకు బోధించటం ఎంతో శుభప్రదమైన కార్యాలు. అయితే చనిపోయిన వారి పేరిట ఖుర్‌ఆన్‌ను పూర్తిగా పఠించి, ఆ సమయంలో ప్రత్యేకంగా వారి మన్నింపుకోసం ప్రార్థించటం లాంటి పనులు దీనిక్రిందికి రావు. ఏది చేసినా ఖుర్‌ఆన్ హదీసులకు అనుగుణంగానే చేయాలి. మనిషి సత్కార్యాలు చేయకుండా వంశప్రతిష్ఠల ప్రాతిపదికపై ముక్తి పొందగలనని భావించటం ఒక అపోహ. ఈ హదీసు అలాంటి అపోహల్ని పటాపంచలు చేసి ముక్తికి సదాచరణే శరణ్యమని చాటుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|29. తోటి ముస్లింల అవసరాలను తీర్చటం|హదీసు 247