హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 283. ఏ జీవాన్నయినా అగ్నిలో కాల్చి శిక్షించరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 283వ అధ్యాయం: ఏ జీవాన్నయినా చివరికి చీమలాంటి వాటినయినా అగ్నిలో కాల్చి శిక్షించరాదు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1611 – 1612) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

283. ఏ జీవాన్నయినా చివరికి చీమలాంటి వాటినయినా అగ్నిలో కాల్చి శిక్షించరాదు

↑ విషయ సూచిక

باب تحريم التعذيب بالنار في كل حيوان حَتَّى النملة ونحوها

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1611

హదీసు 1611

عنْ أَبي هُريْرة رضي اللَّه عنْهُ قَال: بعثنا رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في بعثٍ فَقال: " إنْ وجدْتُم فُلاناً وفُلاناً"لِرجُلَيْنِ مِنْ قُريش سمَّاهُمَا"فأحْرِقُوهُمَا بالنَّارِ"ثُمَّ قَال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حِينَ أردْنا الخُرُوج:"إنِّي كُنْتُ أمرْتُكمْ أنْ تُحْرقُوا فُلاناً وفُلاناً، وإنَّ النَّار لا يُعَذبُ بِهَا إِلاَّ اللَّه، فَإنْ وجَدْتُموهُما فَاقْتُلُوهُما" رواه البخاري.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మమ్మల్ని ఓ సైనిక చర్య నిమిత్తం పంపుతూ, "మీకు గనక ఫలానా వారు (ఖురైష్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పారు) కనబడితే వారిని అగ్నితో కాల్చేయండి" అని ఆదేశించారు. అయితే ఆ తర్వాత మేము బయలుదేరినప్పుడు ఆయన మళ్ళీ, "నేను మిమ్మల్ని ఫలానా ఫలానా వ్యక్తులు కనబడితే అగ్నితో కాల్చమని ఆదేశించాను. కాని కేవలం అల్లాహ్ మాత్రమే అగ్నితో శిక్షించగలడు. కనుక వారు గనక కనబడితే మీరు వారిని చంపండి చాలు" అని అన్నారు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ sent us on an expedition and said to us, “If you find so-and-so (he named two persons belonging to the Quraish) commit them to the fire.” When we were on the verge of departure, he said to us, “I ordered you to burn so-and-so, but it is Allah Alone Who punishes with the fire. So if you find them put them to death.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

అగ్నిలో కాల్చే శిక్ష ఎవరికీ విధించరాదు. ఆఖరికి తమ శత్రువులకయినా సరే. దైవప్రవక్త ﷺ తన రెండవ ఆదేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|283. ఏ జీవాన్నయినా చివరికి చీమలాంటి వాటినయినా అగ్నిలో కాల్చి శిక్షించరాదు|హదీసు 1611

1612

హదీసు 1612

وعن ابنِ مسْعُودٍ رضي اللَّه عنْهُ قَال: كُنَّا مَعَ رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في سفَر، فَانْطَلَقَ لحَاجتِهِ، فَرأيْنَا حُمَّرةً معَهَا فَرْخَانِ، فَأَخذْنَا فَرْخيْها، فَجَاءتْ الحُمَّرةُ تَعْرِشُ فجاءَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "منْ فَجع هذِهِ بِولَدِهَا؟ رُدُّوا وَلَدهَا إليْهَا "وَرأى قَرْيَةَ نَمْلٍ قَدْ حرَّقْنَاهَا، فَقال: "مَنْ حرَّقَ هذِهِ؟ "قُلْنَا: نَحْنُ. قَالَ:"إنَّهُ لا ينْبَغِي أنْ يُعَذِّب بالنَّارِ إلاَّ ربُّ النَّارِ". رواه أَبُو داود بإسناد صحيح. قَوْله:"قَرْيةَ نَمْلٍ"معناهُ: موْضِعُ النَّمْلِ مَع النَّملِ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకానొక ప్రయాణంలో మేము దైవప్రవక్త ﷺ వెంట ఉన్నప్పుడు జరిగిన సంఘటన. దైవప్రవక్త ﷺ కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్ళి ఉన్నారు. ఆ సమయంలో మాకు (పిచ్చుకలాంటి) ఒక ఎరుపురంగు పక్షి కనిపించింది. దానివెంట రెండు కూనలున్నాయి. మేము ఆ కూనల్ని పట్టుకున్నాం. అప్పుడు ఆ పక్షి వెంట పడి మా చుట్టూ తారట్లాడ సాగింది. అంతలో దైవప్రవక్త ﷺ వచ్చారు. ఆయన ఆ దృశ్యం చూసి, "ఈ పక్షిని దాని పిల్లల మూలంగా బాధపెట్టిందెవరు? దాని పిల్లల్ని దానికి తిరిగిచ్చేయండి" అని అన్నారు.

ఆ తర్వాత ఆయన మేము కాల్చివేసిన ఒక చీమలపుట్టను చూసి "ఈ పుట్టను ఎవరు కాల్చారు?" అని అడిగారు. 'మేమే'నని చెప్పాం. అందుకాయన (మమ్మల్ని మందలిస్తూ)"అగ్నితో శిక్షించటం అగ్నిప్రభువుకే శోభిస్తుంది" అని అన్నారు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

"ఖర్‌యతు నమ్‌లిన్" అంటే చీమలు ఉన్న పుట్ట (చీమలు లేని పుట్టకాదు).

(సుననె అబూదావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: We were with the Messenger of Allah ﷺ in a journey when he drew apart (to relieve nature). In his absence, we saw a red bird which had two young ones with it. We caught them and the red mother bird came, beating the earth with its wings. In the meantime the Prophet ﷺ returned and said, “Who has put this bird to distress on account of its young? Return them to her.” He ﷺ also noticed a mound of ants which we had burnt up. He asked, “Who has set fire to this?” We replied: “We have done so.” He ﷺ said, “None can chastise with fire except the Rubb of the fire.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

1) పక్షికూనల్ని పట్టుకొని పక్షుల్ని హింసించటం, చీమ మొదలగు పురుగుల పుట్టలను పురుగులతో సహాకాల్చి చంపటం వారించబడింది. అయితే ఖాళీ పుట్టల్ని మాత్రం కాల్చవచ్చు. అందులో తప్పులేదు.

2) ఒకడు ఇంకొకడ్ని అగ్నితో కాల్చి చంపితే దానికి ప్రతిగా అతనికి కూడా అగ్ని శిక్ష విధించటం ధర్మసమ్మతం కాదుగాని హతుని వారసులు గనక హంతకుణ్ణి కూడా అలాగే చంపాలని డిమాండ్ చేస్తే మాత్రం హత్యాశిక్ష క్రింద అలా చేయవచ్చు. లేకపోతే ఖడ్గంతో అతని తల నరికి అయినా ప్రతీకారం చేయవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|283. ఏ జీవాన్నయినా చివరికి చీమలాంటి వాటినయినా అగ్నిలో కాల్చి శిక్షించరాదు|హదీసు 1612