హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 284వ అధ్యాయం: హక్కుదారుడు స్థితిమంతుణ్ణి తన హక్కు ఇవ్వమని అడిగినప్పుడు అతను హక్కుదారునికి హక్కు ఇవ్వకుండా వాయిదాలు వేయటం ధర్మసమ్మతం కాదు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 1613) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
284. హక్కుదారుడు స్థితిమంతుణ్ణి తన హక్కు ఇవ్వమని అడిగినప్పుడు అతను హక్కుదారునికి హక్కు ఇవ్వకుండా వాయిదాలు వేయటం ధర్మసమ్మతం కాదు
باب تحريم مطل الغني بحقٍّ طلبه صاحبه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَنْ تُؤَدُّوا الأَمَانَاتِ إِلَى أَهْلِهَا} [النساء: ٥٨]
"ముస్లిములారా! అమానతులను యోగ్యులైన వారికి అప్పగించండి అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు." (నిసా: 58)
{فَإِنْ أَمِنَ بَعْضُكُمْ بَعْضاً فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمَانَتَهُ} [البقرة: ٢٨٣]
"మీలో ఎవరైనా మరొకర్ని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే, ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి." (బఖర: 283)
ముఖ్యాంశాలు
అమానతులంటే హక్కులు. అవి దేవుని హక్కులయినా కావచ్చు, దాసుల హక్కులయినా కావచ్చు. మొత్తానికి దీని భావం ఏమిటంటే, మీరు హక్కులన్నిటినీ- దేవుని హక్కుల్ని, దాసుల హక్కుల్ని- నెరవేర్చండి. ఎవరి హక్కునూ కాజేయకండి. ఒకరి హక్కుని కాజేయటం నీతినిజాయితీలకు విరుద్ధం. అలాగే ఎవరైనా తమ దగ్గర ఏమీ తాకట్టు పెట్టుకోకుండా ఎవరినీ సాక్షిగా ఉంచకుండా ఎదుటి వ్యక్తి మీద నమ్మకం కొద్దీ అతనితో బాకీ వ్యవహారం చేస్తే ఆ వ్యక్తి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అతని అమానతును చెల్లించాలని రెండో సూక్తికి భావం. హక్కుదారునికి అతని హక్కు చెల్లించకుండా అనవసరంగా వాయిదాలు వేస్తూ పోవటం నిజాయితీకి విరుద్ధం కనుక అలా చేయటం నిషిద్ధం అనే విషయాన్ని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఈ సూక్తుల ఆధారంగానే ప్రతిపాదించారు.
English
“Verily, Allah commands that you should render back the trusts to those, to whom they are due.” [An-Nisā’ 4:58]
“Then if one of you entrust the other, let the one who is entrusted discharge his trust (faithfully).” [Al-Baqarah 2:283]
హదీసు 1613
وَعَنْ أَبي هُريرَةَ رضي اللَّه عَنْهُ أنَّ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَطْلُ الغَنِيِّ ظُلْمٌ، وَإذَا أُتبِعَ أحَدُكُمُ عَلى مَلًيءٍ فَلْيَتْبَعُ "متفقٌ عَلَيْهِ. مَعْنَى"أُتبِعَ"أُحِيلَ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: స్తోమత కలవాడు (అప్పు తీర్చటంలో) ఆలస్యం చేయటం అన్యాయం. మీలో ఎవరినైనా స్తోమత కలిగిన వ్యక్తికి అప్పజెపితే అతను ఆ వ్యక్తి వెంట పడి (తన రుణాన్ని వసూలు చేసుకోవాలి). (బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని హవాలా ప్రకరణం మొదలు – సహీహ్ ముస్లింలోని బుయూ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “It is an act of oppression on the part of a person to procrastinate in fulfilling his obligation; if the repayment of a debt due to any of you is undertaken by a rich person, you should agree to the substitution.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
1) ఆలస్యం చేయటమంటే అప్పు తీర్చే స్తోమత ఉండికూడా రుణదాతకు అతని బాకీ తీర్చకుండా అనవసరంగా వాయిదాలు వేస్తూపోవటం. ఇలా చేయటం మహాపాపం.
2) గొడవను సద్దుమణచటం కోసం లేక మరేకారణం చేతనయినా రుణదాతను మరే ధనవంతునికయినా అప్పగించి అతన్నుండి తన బాకీ వసూలు చేసుకోమని చెబితే రుణదాత ఆ ప్రతిపాదనను ఒప్పుకోవాలి. మొత్తానికి ఈ హదీసులో వ్యవహారాలు ఉత్తమంగా ఉండాలని ప్రబోధించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|284. హక్కుదారుడు స్థితిమంతుణ్ణి తన హక్కు ఇవ్వమని అడిగినప్పుడు అతను హక్కుదారునికి హక్కు ఇవ్వకుండా వాయిదాలు వేయటం ధర్మసమ్మతం కాదు|హదీసు 1613
You must be logged in to post a comment.