హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 282వ అధ్యాయం: షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 9 హదీసులు (హదీసు 1602 – 1610) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు
باب النهي عن تعذيب العَبْد والدابة والمرأة والولد بغير سبب شرعي أَوْ زائد عَلَى قدر الأدب.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَبِالْوَالِدَيْنِ إِحْسَاناً وَبِذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَى وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ إِنَّ اللَّهَ لاَ يُحِبُّ مَنْ كَانَ مُخْتَالاً فَخُوراً} [النساء: ٣٦]
"తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూమిన్నూ కాననివారు, తమ గొప్పదనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి." (నిసా : 36)
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన వారందరిపట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఈ ఆయతులో ఆదేశించటం జరిగింది. అంటే వారి పట్ల ఉత్తమ వ్యవహారానికి విరుద్ధమైన ధోరణి కనబరచరాదన్నమాట. ఒకవేళ తమ ఆధీనంలోవున్న వారిని శిక్షించవలసి వస్తే లేక సంస్కారం నేర్పటం కోసం వారిని కొట్టవలసి వస్తే అవసరానికి మించి కొట్టకూడదు. ఎందుకంటే అది కూడా ఉత్తమ వ్యవహారానికి విరుద్ధమే.
English
“And do good to parents, kinsfolk, orphans, Al-Masakin (the poor), the neighbour who is near of kin, the neighbour who is a stranger, the companion by your side, the wayfarer (you meet), and those (slaves) whom your right hands possess. Verily, Allah does not like such as are proud and boastful.” [An-Nisā’ 4:36]
హదీసు 1602
وَعنِ ابنِ عُمر رضي اللَّه عنْهُما أنَّْ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "عُذِّبتِ امْرَأةٌ في هِرَّةٍ حبستها حَتَّى ماتَتْ، فَدَخلَتْ فِيهَا النَّارَ، لاَ هِيَ أطْعمتْهَا وسقَتْها، إذ هي حبَستْهَا وَلاَ هِي تَرَكتْهَا تَأكُلُ مِنْ خَشَاشِ الأرض " متفقٌ عليه. "خَشَاشُ الأرْضِ"بفتح الخاءِ المعجمةِ، وبالشينِ المعجمة المكررة: وهي هَوامُّها وحشَراتُها.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒక స్త్రీ ఓ పిల్లి మూలంగా శిక్షకు గురైంది. ఆమె ఆ పిల్లిని చనిపోయేవరకూ కట్టిపడేసింది. దానిమూలంగానే ఆమె నరకానికి వెళ్ళింది. ఆమె ఆ పిల్లిని కట్టిపడేసి దానికి అన్నపానీయాలు పెట్టలేదు. నేలమీది క్రిమికీటకాలు తినేందుకు కూడా దాన్ని స్వేచ్ఛగా వదిలేయలేదు.
(బుఖారీ-ముస్లిం)
'ఖషాషుల్ అర్జ్' అంటే హాని కలిగించే పురుగులు, కీటకాలు అని అర్థం.
(సహీహ్ బుఖారీలోని అంబియా ప్రకరణం చివర్లో – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ said, “A woman was punished in Hell because of a cat which she had confined until it died. She did not give it to eat or to drink when it was confined, nor did she free it so that it might eat the vermin of the earth.”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
1) జంతువుల పట్ల కూడా మృదువుగా, ఉత్తమంగా వ్యవహరించటం అవసరమనీ, వాటి పట్ల కఠినంగా వ్యవహరించటం నిషిద్ధమని ఈ హదీసు నొక్కి చెబుతోంది.
2) పశుపక్ష్యాదుల్ని పంజరాల్లో, బోనుల్లో బంధించి ఉంచటం ధర్మసమ్మతమేగాని వాటి ఆహారపానీయాలను, ఇతర అవసరాలను తప్పకుండా పట్టించుకోవాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1602
హదీసు 1603
وعنْهُ أنَّهُ مرَّ بفِتْيَانٍ مِنْ قُريْشٍ قَدْ نصبُوا طَيْراً وهُمْ يرْمُونَهُ وقَدْ جعلُوا لِصاحبِ الطَّيْرِ كُلَّ خَاطِئةٍ مِنْ نَبْلِهِمْ، فَلَمَّا رأوُا ابنَ عُمرَ تفَرَّقُوا فَقَالَ ابنُ عُمَرَ: منْ فَعَلَ هَذَا؟ لَعنَ اللَّه مَن فَعلَ هَذَا، إنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَعَنَ مَنِ اتَّخَذَ شَيْئاً فِيهِ الرُّوحُ غَرضاً. متفقٌ عَلَيْهِ. "الْغرَضُ": بفتحِ الغَين المعجمة، والراءِ وهُو الهَدفُ، والشَّيءُ الَّذي يُرْمَى إلَيهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)గారే చేసిన వేరొక కథనం ప్రకారం ఒకసారి ఆయన తాను వెళ్ళేదారిలో కొంతమంది ఖురైష్ యువకులు ఒక పక్షిని గురిపెట్టి దానిపైకి బాణాలు వదులుతున్నారు. గురితప్పిన బాణాల్ని తను తీసుకోవచ్చని వారు ఆ పక్షి యజమానితో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)ని చూడగానే వారు (దాన్ని అక్కడే వదలిపెట్టి) అటూఇటూ పరుగెత్తారు. అప్పుడు ఇబ్నె ఉమర్ ఆ పక్షిని చూసి "ఎవరు ఈ పని చేసింది?" అని అడిగారు. ఆ తర్వాత ఇలా అన్నారు: "ఇలా చేసినవాణ్ణి దేవుడు శపించుగాక! జీవమున్న వాటిని గురిపెట్టేవాణ్ణి దైవప్రవక్త ﷺ శపించారు". (బుఖారీ-ముస్లిం)
'గర్జ్' అంటే "బాణం వదలిపెట్టటానికి చేసుకునే గురి" అని అర్థం.
(సహీహ్ బుఖారీలోని జబాయెహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జంతువేట ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: I happened to pass by some lads of the Quraish who had tied a bird at which they have been shooting arrows. Every arrow that they missed came into the possession of the owner of the bird. No sooner had they seen Ibn `Umar, they dispersed. Thereupon, Ibn `Umar said: “Who has done this? May Allah curse him who has done so. Verily, the Messenger of Allah ﷺ has cursed anyone who makes a live thing the target (of one’s marksmanship).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
గురి నేర్చుకోవటం కోసం జీవాలను కట్టివేసి వాటిమీద బాణాలు ప్రయోగించటం మహాపాపం. అలా చేసేవారు శాపానికి గురౌతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1603
హదీసు 1604
وعَنْ أنَسٍ رضي اللَّه عنْهُ قَال: نَهَى رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنَّ تُصْبَرَ الْبَهَائمُ. متفقٌ عَلَيْهِ، ومَعْنَاه: تُحْبسَ للْقَتْلِ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ జంతువుల్ని కట్టివేయటాన్ని వారించారు.
(బుఖారీ-ముస్లిం)
అంటే చంపటానికి కట్టివేయటమని అర్థం.
(సహీహ్ బుఖారీలోని జబాయెహ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జంతువేట ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ forbade animals being tied (as targets).[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
కట్టి లేక బంధించి చంపటమంటే జంతువుని ఒకచోట కదలకుండా కట్టివేసి అది చనిపోయేవరకూ దానిమీద బాణాలు, తూటాలు గురిపెట్టి వదలటమని భావం. ఇలా చేయటం మహాపాపం. జంతువుని చంపే సరైన పద్ధతి ఏమిటంటే దాన్ని అదుపులోకి తీసుకొని ఓ పదునైన కత్తితో తొందరగా దాని గొంతు కోసేయాలి. దానివల్ల దానికి ఎక్కువ బాధ కలగకుండా ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1604
హదీసు 1605
وَعَنْ أَبي عَليٍّ سُوَيْدِ بنِ مُقَرِّنٍ رضي اللَّهُ عنْهُ، قَالَ: لَقَدْ رَأيْتُني سابِعَ سبْعَةٍ مِنْ بني مُقرِّنٍ مَالنَا خَادِمٌ إلاَّ واحِدةٌ لَطمها أصْغرُنَا فأمَرنَا رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنْ نُعْتِقَها. رواه مسلم. وفي روايةٍ:"سابِع إخْوةٍ لِي".
హజ్రత్ అబూ అలీ సువైద్ బిన్ ముఖర్రిన్ (రదియల్లాహు అన్హు) కథనం: నాకు బాగా గుర్తుంది. నేను ముఖర్రిన్ గారి ఏడుగురు కుమారుల్లో ఏడోవాణ్ణి. మాకు ఒక బానిసరాలు తప్ప ఇతర సేవకులు ఎవరూ ఉండేవారు కాదు. ఒకసారి మాలో అందరికన్నా చిన్న తమ్ముడు ఆమెను కొట్టాడు. అది తెలిసి దైవప్రవక్త ﷺ ఆమెను విడుదల చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. (ముస్లిం)
వేరొక ఉల్లేఖనంలో "నేను మా అన్నదమ్ముల్లో ఏడో వాణ్ణి" అని ఉంది.
(సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Abu Ali Suwaid bin Muqarrin (radiyallahu anhu) said: I was the seventh child of Banu Muqarrin and we had only one slave-girl. When the youngest of us once happened to slap her (on the face) the Messenger of Allah ﷺ ordered us to set her free.[Muslim].
ముఖ్యాంశాలు
తమ ఆధీనంలో ఉండే బానిసల్ని, నౌకర్లను నిష్కారణంగా కొట్టడం, వారి మీద దౌర్జన్యం చేయటం పెద్దనేరం. ఒకవేళ ఆ నేరానికి పాల్పడినట్లయితే దానికి పరిహారంగా వారిని విడుదల అయినా చేయాలి లేదా మరే విధంగానయినా వారిని తమ పట్ల ప్రసన్నుల్ని చేసుకోవాలి. లేకపోతే ఆ విధంగా దౌర్జన్యం చేసేవాడు దేవుని దృష్టిలో నేరస్థుడిగా పరిగణించబడతాడు. పోతే హదీసులో పేర్కొనబడిన ఆ ఏడుగురు అన్నదమ్ములూ దైవప్రవక్త సహచరులు. మదీనాకు వలసవచ్చినవారు (ముహాజిర్లు).
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1605
హదీసు 1606
وعنْ أَبي مَسْعُودٍ البدْرِيِّ رضِيَ اللَّه عنْهُ قَال: كُنْتُ أضْرِبُ غُلامَاً لِي بالسَّوطِ، فَسمِعْتُ صَوْتاً مِنْ خَلفي: "اعلَمْ أَبَا مَسْعُودٍ" فَلَمْ أفْهَمْ الصَّوْتَ مِنَ الْغَضب، فَلَمَّا دنَا مِنِّي إِذَا هُو رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَإذا هُو يَقُولُ: "اعلَمْ أَبَا مسْعُودٍ اعلَمْ أبا مسْعُودٍ" قال: فألقيت السوط من يدي, فقال: "اعلَمْ أَبَا مسْعُودٍ أنَّ اللَّه أقْدرُ علَيْكَ مِنْكَ عَلى هَذَا الغُلامِ" فَقُلْتُ: لا أضْربُ مملُوكاً بعْدَهُ أَبَداً. وَفِي روَايةٍ: فَسَقَطَ السَّوْطُ مِنْ يدِي مِنْ هيْبتِهِ. وفي روايةٍ: فقُلْتُ: يَا رسُول اللَّه هُو حُرٌّ لِوجْهِ اللَّه تَعَالَى فَقَال: "أمَا لوْ لَمْ تَفْعَلْ، لَلَفَحَتْكَ النَّارُ، أوْ لمَسَّتكَ النَّارُ" رواه مسلم. بهذِهِ الرواياتِ.
హజ్రత్ అబూ మస్వూద్ బద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: నేను నా బానిసను కొరడాతో కొడుతున్నప్పుడు వెనుక నుంచి, "విను! అబూ మస్వూద్!" అన్న గొంతు వినిపించింది. కాని నేను ఆవేశంలో ఆ గొంతుని అర్థం చేసుకోలేకపోయాను. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన తరువాత తెలిసింది- ఆయన దైవప్రవక్త ﷺ అని. ఆయన నన్ను (మందలిస్తూ), "అబూ మస్వూద్! నీకు ఈ బానిస మీదున్న అధికారం కన్నా దేవునికి నీమీదున్న అధికారం గొప్పది జాగ్రత్త!" అని అంటున్నారు. తక్షణమే నేను "ఇక నుంచి నేను ఏ బానిసనూ కొట్టను" అని ప్రతిజ్ఞ చేసుకున్నాను.
వేరొక ఉల్లేఖనంలో "దైవప్రవక్తను చూడగానే భయంతో నాచేతిలోని కొరడా జారి క్రిందపడింది" అని ఉంది.
ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: వెంటనే నేను "దైవప్రవక్తా! అల్లాహ్ ప్రసన్నత కోసం నేనీ బానిసకు స్వేచ్ఛనిస్తున్నాను" అని అన్నాను. అది విని ఆయన "నువ్వొకవేళ అతనికి స్వేచ్ఛ ఇవ్వకపోతే నరకాగ్ని నిన్ను తప్పకుండా చుట్టుకుంటుంది (లేక) అంటుకుంటుంది" అని హెచ్చరించారు. ఈ ఉల్లేఖనాలన్నీ ముస్లిం పేర్కొన్నవి.
(సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Abu Mas`ud Al-Badri (radiyallahu anhu) said: I was beating my slave with a whip when I heard a voice behind me which said: “Abu Mas`ud! Bear in mind…” I did not recognize the voice for the intense anger I was in. Abu Mas`ud added: As he came near me, I found that he was the Messenger of Allah ﷺ who was saying, “Abu Mas`ud! Bear in mind that Allah has more dominance upon you than you have upon your slave.” Then I said: “I will never beat any slave in future.”
Another narration is: The whip dropped from my hand in awe of the Prophet ﷺ.
Still another narration is: I said: “He is free for the sake of Allah.” He ﷺ said, “If you had not done this, you would have been singed by the Fire.”[Muslim].
ముఖ్యాంశాలు
1) తమ ఆధీనంలో ఉండే బానిసల్ని, నౌకర్లను నిష్కారణంగా దండించటం లేక తప్పుకు మించి శిక్షించటం చేయరాదని ఈ హదీసులో హెచ్చరించటం జరిగింది.
2) దైవం తరపు నుంచి దైవప్రవక్త ﷺకు ప్రసాదించబడిన గాంభీర్యం గురించి కూడా ఈ హదీసులో కాస్త వివరించటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1606
హదీసు 1607
وَعنِ ابْنِ عُمر رضي اللَّه عنْهُمَا أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "منْ ضَرَبَ غُلاماً لَهُ حَداً لَمْ يأتِهِ، أَوْ لَطَمَهُ، فإنَّ كَفَّارتَهُ أنْ يُعْتِقَهُ" رواه مسلم.
హజ్రత్ ఉబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా తన బానిసను అతను చేయని నేరానికి శిక్షిస్తే లేక చెంపదెబ్బ కొడితే అతనికి స్వేచ్ఛ ఇచ్చేయటమే దానికి పరిహారం.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఈమాన్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “The expiation for beating or slapping a slave on the face for something he has not done is to set him free.”[Muslim].
ముఖ్యాంశాలు
ఖాజీ అయాజ్ ఇలా అంటున్నారు: అలాంటప్పుడు బానిసను విడుదల చేయటం వాజిబ్ (తప్పనిసరి) కాదనీ, కేవలం అభిలషణీయం మాత్రమేనన్న విషయంపై పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. అయితే ఆ విధంగా విడుదల చేయటం వల్ల లభించే పుణ్యం సాధారణ విడుదలకు లభించే పుణ్యానికి సమానం కాదుగాని అది యజమాని దౌర్జన్యానికి మాత్రం తప్పకుండా పరిహారం అవుతుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1607
హదీసు 1608
وعن هِشَام بن حكيمِ بن حزامٍ رضي اللَّهُ عنْهُما أنَّهُ مرَّ بالشَّامِ عَلَى أنَاسٍ مِنَ الأنباطِ، وقدْ أُقِيمُوا في الشَّمْس، وصُبَّ عَلَى رُؤُوسِهِم الزَّيْتُ، فَقَال: مَا هَذا؟ قيل: يُعَذَّبُونَ في الخَراجِ، وَفي رِوايةٍ: حُبِسُوا في الجِزيةِ. فَقَال هِشَامٌ: أشْهَدُ لسمِعْتُ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "إنَّ اللَّه يُعذِّبُ الذِينَ يُعذِّبُونَ النَّاس في الدُّنْيا" فَدَخَل عَلَى الأمِيرِ، فحدَّثَهُ، فَأمر بِهم فخُلُّوا. رواه مسلم"الأنبَاطُ"الفلاَّحُونَ مِنَ العجمِ.
హజ్రత్ హిషామ్ బిన్ హకీమ్ బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం ఒకసారి ఆయన సిరియా గుండా వెళుతుంటే ఒకచోట ఆయనకు కొందరు అరబ్బేతర రైతులు కనిపించారు. వారిని ఎండలో నిలబెట్టి వారి తలల మీద జైతూన్ నూనె పోయడం జరిగింది. అదిచూసి ఆయన "ఇక్కడ ఏం జరుగుతుంది?" అని అడిగారు. "వీరిని పన్ను చెల్లించ నందుకు శిక్షించటం జరుగుతోంది." వేరొక ఉల్లేఖనం ప్రకారం, "జిజ్యా చెల్లించనందుకు వీరిని బంధించటం జరిగింది" అని ఎవరో ఆయనకు చెప్పారు. అది విని ఆయన, "ప్రపంచంలో మనుషుల్ని శిక్షించే వారిని దేవుడు శిక్షిస్తాడని దైవప్రవక్త ﷺ చెబుతుండగా నేను విన్నాను. దీనికి నేను సాక్ష్యం చెబుతాను" అని అన్నారు. తర్వాత ఆయన వారి గవర్నరు దగ్గరికి వెళ్ళి అతనికి ఈ హదీసు తెలియజేశారు. ఫలితంగా గవర్నరు ఆదేశం మేరకు వారిని వదిలేయటం జరిగింది. (ముస్లిం)
'అన్బాత్' అంటే అరబ్బేతర రైతులు అని అర్థం.
(సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)
English
It has been narrated that Hisham bin Hakim bin Hizam (radiyallahu anhuma) happened to pass by some (non-Arab) farmers of Syria who had been made to stand in the sun, and olive oil was poured on their heads. He said: “What is the matter?” He was told that they had been detained for the non-payment of Jizyah. (Another narration says that they were being tortured for not having paid Al-Kharaj). Thereupon Hisham said: “I bear testimony to the fact that I heard the Messenger of Allah ﷺ saying, `Allah will torment those who torment people in the world.”’ Then he proceeded towards their Amir and reported this Hadith to him. The Amir then issued orders for their release.[Muslim].
ముఖ్యాంశాలు
1) ఇస్లామీయ రాజ్యపరిధుల్లో ఉండే ముస్లిమేతరుల ఆధీన భూముల నుండి వచ్చే ఆదాయంలో నుండి వసూలు చేసే పన్నును 'ఖిరాజ్' అని అంటారు. ముస్లింల భూముల ఆదాయం నుండి వసూలు చేసే పన్నును 'ఉష్ర్' అని అంటారు.
అదే విధంగా ఇస్లామీయ రాజ్యంలో ఉండే జిమ్మీల (శరణార్ధుల) ధన మానప్రాణాలను రక్షించినందుకుగాను వారినుండి వసూలు చేసే వార్షిక రుసుమును 'జిజ్యా' అని అంటారు. ముస్లింలు ప్రతి సంవత్సరం ఇస్లామీయ రాజ్యానికి జకాత్ చెల్లిస్తారు. అలాగే ముస్లిమేతరులు జిజ్యా చెల్లిస్తారు.
2) ఇక్కడ 'శిక్ష' అంటే దేవుడు నరకంలో నరకవాసులకు విధించే ఒక ప్రత్యేక రకమైన శిక్ష అన్నమాట. ప్రపంచంలో ఎవరైనా అలాంటి శిక్ష విధించటాన్ని దేవుడు ఇష్టపడడు. ఆ శిక్ష విధించేవారిని ప్రళయదినాన తాను ఆ శిక్షకు గురిచేస్తాడు. మండుటెండలో నిలబెట్టి తలమీద జైతూన్ నూనె పోయటం కూడా ఒక రకంగా నరకయాతనే. కనుకనే హిషామ్ (రదియల్లాహు అన్హు) గవర్నరుకు దైవప్రవక్త హదీసు వినిపించి ఆ శిక్షను ఆపు చేయించారు.
3) మంచిని ఆదేశించి చెడుని నిర్మూలించే బాధ్యతను నిర్వర్తించటం ప్రతి ముస్లిం విధి.
4) దౌర్జన్యకారుల్ని వారు చేస్తున్న దౌర్జన్యాల గురించి హెచ్చరించాలి. దానివల్ల వారు దౌర్జన్యకాండను మానుకోవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1608
హదీసు 1609
وعنِ ابنِ عبَّاسٍ رضي اللَّه عَنْهُما قَال: رَأى رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم حِماراً مْوسُومَ الوجْهِ، فأَنْكَر ذلكَ؟ فَقَال: " وَاللَّهِ لا أسِمُهُ إِلاَّ أقْصى شَيءٍ مِنَ الوجْهِ"، وَأمرَ بِحِمَارِهِ، فَكُوِيَ في جاعِرتَيْهِ، فَهُوَ أوَّلُ مَنْ كوى الجَاعِرتَيْنِ. رواه مسلم. "الجاعِرتَانِ": نَاحِيتَا الوركَيْن حوْل الدُّبُر.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఒక గాడిద మొహం మీద (గుర్తుకోసం) వాతపెట్టబడి ఉండటం చూసి దైవప్రవక్త ﷺ ఆ విధంగా మొహం మీద వాతపెట్టటాన్ని చాలా అసహ్యించుకున్నారు.
ఆ తర్వాత ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) (ఒక గాడిదను చూపిస్తూ), "దైవసాక్షి! నేను దీనికి వాతపెడతాను కాని దీని మొహానికి అత్యంత దూరంలో పెడతాను" అని అన్నారు. అప్పుడు ఆయన ఆదేశం మేరకు ఆ గాడిద పిరుదుల కొనభాగం మీద వాతపెట్టటం జరిగింది. ఆ విధంగా (పశువులకు) పిరుదుల కొనభాగం మీద వాత పెట్టించిన మొదటి వ్యక్తి ఆయనే. (ముస్లిం)
'జాయిరతాన్' అంటే పిరుదుల అంచులు అని అర్థం.
(సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ saw an ass which had been branded on the face. He disapproved of it. Upon this Ibn `Abbas (radiyallahu anhuma) said, “By Allah, I shall not brand (the animal) but on a part at a distance from the face.” Ibn `Abbas (radiyallahu anhuma) then commanded branding on the hips; he was the first person to brand the animals on hips.[Muslim].
ముఖ్యాంశాలు
గుర్తుగా లేక తేడా కన్పించటం కోసం పశువులకు వాతలు పెట్టాల్సి వచ్చినప్పుడు మొహాన్ని వదలిపెట్టి మరెక్కడయినా వాతలు పెట్టాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1609
హదీసు 1610
وعَنْهُ أنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: مَرَّ علَيهِ حِمَارٌ قَدْ وُسِم في وجْهِه فقَال: لَعَنَ اللَّه الَّذي وسمهُ" رواه مسلم. وفي رواية لمسلم أَيضاً: نَهى رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَنِ الضَّرْبِ في الوجهِ، وعنِ الوسْمِ في الوجهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) గారే చేసిన వేరొక కథనం: దైవప్రవక్త ﷺకు దారిలో మొహం మీద వాతపెట్టబడివున్న ఒక గాడిద కనిపించింది. దాన్నిచూసి ఆయన "దీనికి వాతపెట్టినవాణ్ణి దేవుడు శపించుగాక!" అని అన్నారు. (ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలోనే "దైవప్రవక్త ﷺ మొహం మీద కొట్టటాన్ని, వాత పెట్టటాన్ని వారించారు" అని ఉంది.
(సహీహ్ ముస్లింలోని వస్త్రధారణ ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) said: An ass with a brand on the face happened to pass before the Prophet ﷺ. Thereupon he said, “May Allah curse the one who has branded it (on the face).”[Muslim].
Another narration in Muslim is: “The Messenger of Allah ﷺ prohibited us from hitting across the face and branding on the face (of an animal).”
ముఖ్యాంశాలు
శరీరంలో ముఖం అత్యంత సున్నితమైన భాగం. కనుక మనిషి లేక పశువు ముఖంపైనయినా సరే; కొట్టటం, వాతపెట్టటం లేక ముఖసౌకుమార్యం సహించలేని మరే పని అయినా చేయటం తగదు. అందుకే సంస్కారం నిమిత్తం భార్యని, పిల్లల్ని, నౌకర్లను కొట్టటానికి అనుమతినిచ్చినప్పటికీ మొహం మీద కొట్టకుండా జాగ్రత్తపడాలని తాకీదు చేయటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|282. షరీఅత్ పరమైన కారణం లేకుండా లేక సంస్కారం నేర్పటానికి మించి బానిసను, పశువును, భార్యను, పిల్లల్ని శిక్షించరాదు|హదీసు 1610
You must be logged in to post a comment.