హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 281. మూడో వ్యక్తి ఎదుట ఇద్దరు రహస్యంగా మాట్లాడుకోరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 281వ అధ్యాయం: మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు. అయితే అవసర పరిస్థితుల్లో మాత్రం ఈ విధంగా మూడోవ్యక్తికి వినపడకుండా రహస్యాలు చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు మూడోవ్యక్తికి అర్ధంకాని భాషలో మాట్లాడుకోవటం కూడా ఈ భావంలోకి వస్తుంది. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 1600 – 1601) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

281. మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు. అయితే అవసర పరిస్థితుల్లో మాత్రం ఈ విధంగా మూడోవ్యక్తికి వినపడకుండా రహస్యాలు చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు మూడోవ్యక్తికి అర్ధంకాని భాషలో మాట్లాడుకోవటం కూడా ఈ భావంలోకి వస్తుంది

↑ విషయ సూచిక

باب النهي عن تناجي اثنين دونَ الثالث بغير إذنه إِلاَّ لحاجةٍ وَهُوَ أن يتحدثا سراً بحيث لا يسمعهما. وفي معناه مَا إِذَا تحدثا بلسان لا يفهمه.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{إِنَّمَا النَّجْوَى مِنَ الشَّيْطَانِ} [المجادلة: ١٠]

"రహస్యమంతనాలు జరపటం షైతాన్ చేష్ట." (ముజాదలహ్ : 10)

ముఖ్యాంశాలు

కొంతమంది కలిసి ఉన్నప్పుడుగాని ప్రయాణంలో ఉన్నప్పుడుగాని ఇతరులందరినీ వదలిపెట్టి కేవలం ఇద్దరే ఇద్దరు ఒక ప్రక్కకు వెళ్ళి గుసగుసలాడుకోవటం, రహస్యాలు చెప్పుకోవటాన్ని అరబీలో 'నజ్‌వా' అని అంటారు. ఇలా చేయరాదు. దీనివల్ల ఇతరుల మనసుకు బాధ కలగవచ్చు. వారిలో దురనుమానాలు రేకెత్తవచ్చు.

English

“Secret counsels (conspiracies) are only from Shaitan (Satan).” [Al-Mujādilah 58:10]

1600

హదీసు 1600

وعن ابْنِ عُمَرَ رضي اللَّه عنْهُمَا أنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "إِذَا كَانُوا ثَلاثَةً، فَلا يَتَنَاجَى اثْنَانِ دُونَ الثَّالِثِ" متفقٌ عليه. ورواه أَبُو داود وَزاد: قَالَ أبُو صالح: قُلْتُ لابْنِ عُمرَ: فَأرْبَعَةً؟ قَالَ: لا يضرُّكَ". ورواه مالك في"المُوطأ": عنْ عبْدِ اللَّهِ بنِ دِينَارٍ قَالَ: كُنْتُ أنَا وَابْنُ عُمرَ عِند دارِ خالِدِ بنُ عُقبَةَ الَّتي في السُّوقِ، فَجاءَ رجُلٌ يُريدُ أنْ يُنَاجِيَهُ، ولَيْس مَعَ ابنِ عُمر أحَدٌ غَيْري، فَدعا ابنُ عُمرَ رجُلاً آخَرَ حتَّى كُنَّا أرْبَعَةً، فَقَالَ لِي وللرَّجُلِ الثَّالِثِ الَّذي دَعا: اسْتَأخِرا شَيْئاً، فإنِّي سَمِعْتُ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "لا يَتَنَاجَى اثْنَانِ دونَ وَاحدٍ".

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ముగ్గురు ఒకచోట ఉన్నప్పుడు మూడోవ్యక్తిని వదలిపెట్టి మిగతా ఇద్దరూ రహస్యాలు మాట్లాడుకోరాదు. (బుఖారీ-ముస్లిం)

ఈ హదీసుని అబూదావూద్ కూడా పేర్కొన్నారు. అందులో అబూ సాలిహ్ (ఉల్లేఖకుడు) అదనంగా ఇలా అన్నట్లుంది: నేను ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా)గారిని "మరి నలుగురు ఉంటేనో?" అని అడిగాను. అందుకాయన "అలాగయితే ఫర్వాలేదు" అని అన్నారు.

మాలిక్ దీనిని అబ్దుల్లాహ్ బిన్ దీనార్ నుండి గ్రహించి తన గ్రంథం 'ముఅత్తా'లో పేర్కొన్నారు. అందులో అబ్దుల్లాహ్ బిన్ దీనార్ ఇలా అంటున్నారు: ఇబ్నె ఉమర్, నేను ఇద్దరం ఖాలిద్ బిన్ ఉఖ్బా ఇంటి దగ్గర ఉన్నాం. ఆయనిల్లు బజార్లో ఉంది. అంతలో ఒకతను వచ్చాడు. అతను ఇబ్నె ఉమర్‌తో ఏదో రహస్య విషయం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇబ్నె ఉమర్ వెంట నేను తప్ప మరెవరూ లేరు. అప్పుడు ఇబ్నె ఉమర్ ఇంకో వ్యక్తిని పిలిచారు. అతనితో కలిపి మేం నలుగురం అయ్యాం. ఆ తర్వాత ఆయన నన్నూ, ఆ పిలవబడిన వ్యక్తినీ కాస్త వెనక్కి వెళ్ళమని చెప్తూ, "(ఏమీ అనుకోకండి) ఒకణ్ణి ఒంటరిగా వదిలేసి మిగతా ఇద్దరు రహస్యాలు మాట్లాడుకోరాదని దైవప్రవక్త ﷺ చెబుతుండగా నేను విన్నాను. (అందుకే ఇలా చేయవలసి వచ్చింది)" అని అన్నారు.

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) said: the Messenger of Allah ﷺ said, “In the presence of three people, two should not hold secret counsel, to the exclusion of the third.”[Al-Bukhari and Muslim].

In Abu Dawud, Abu Salih related: I asked Ibn `Umar: “What if there are four people.” He said, “There is no harm in that.”

Malik reported in Al-Muwatta that `Abdullah bin Dinar related: Ibn `Umar and I were together in Khalid bin `Uqbah’s house which was situated in the market place. A man came to consult Ibn `Umar. None besides me was present. Ibn `Umar called another man in and we became four and said to me and the man he had called: Move away a bit because I have heard the Messenger of Allah ﷺ saying, “The two people should not hold secret counsel together excluding the third.”

ముఖ్యాంశాలు

ఈ హదీసులో కొన్ని సభా మర్యాదలు వివరించబడ్డాయి. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తనతో ఒంటరిగా మాట్లాడదలచుకున్న వ్యక్తి మాటలు వినటం కోసం తమ దగ్గరకు నాల్గో వ్యక్తిని పిలిచారు. ఆ తర్వాత తమ రహస్య విషయం ఆ మిగతా ఇద్దరికి వినపడకుండా ఉండటం కోసం వారిని కాస్త వెనక్కి వెళ్ళమన్నారు. దీనిద్వారా తెలిసేదేమంటే ఒకరికంటే ఎక్కువమంది సమక్షంలో ఇద్దరు వ్యక్తులు వేరుగా రహస్య విషయాలు మాట్లాడుకోవచ్చు. అయితే నలుగురు ఒకచోట ఉన్నప్పుడు ఒకడ్ని ఒంటరిగా వదిలేసి మిగతా ముగ్గురు రహస్యాలు మాట్లాడుకోవటం కూడా తగదు. ఇంకో విషయమేమిటంటే ధర్మ సమ్మతమైన విషయాలే రహస్యంగా మాట్లాడుకోవచ్చుగాని అధర్మ విషయాలు మాట్లాడుకోరాదు. ఆ సమయంలో మూడో వ్యక్తి ఉన్నా లేకపోయినా సరే. దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: "ఓ విశ్వాసులారా! మీరు గనక పరస్పరం రహస్య విషయాలు మాట్లాడుకుంటే, పాపమూ, దౌర్జన్యమూ దైవప్రవక్త ﷺ పట్ల అవిధేయతలకూ సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికీ, దైవభీతికీ సంబంధించిన విషయాలు మాట్లాడుకోండి." (అల్ ముజాదలహ్)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|281. మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు. అయితే అవసర పరిస్థితుల్లో మాత్రం ఈ విధంగా మూడోవ్యక్తికి వినపడకుండా రహస్యాలు చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు మూడోవ్యక్తికి అర్ధంకాని భాషలో మాట్లాడుకోవటం కూడా ఈ భావంలోకి వస్తుంది|హదీసు 1600

1601

హదీసు 1601

وَعن ابنِ مسْعُودٍ رضي اللَّه عنهُ أنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا كُنْتُمْ ثَلاثة، فَلا يَتَنَاجى اثْنَانِ دُونَ الآخَرِ حتَّى تخْتَلِطُوا بالنَّاسِ، مِنْ أجْل أنَّ ذَلكَ يُحزِنُهُ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు ముగ్గురున్నప్పుడు మూడోవాడ్ని వదలిపెట్టి మిగతా ఇద్దరు రహస్య విషయాలు మాట్లాడుకోకండి. ఈ వైఖరివల్ల ఆ మూడో వ్యక్తికి బాధ కలగవచ్చు. అయితే మీరు మరికొందరితో కలిసిపోతే అప్పుడు ఫర్వాలేదు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఇస్తీజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలామ్ ప్రకరణం)

English

Ibn Mas`ud (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “When three of you are together, two of you must not converse privately ignoring the third till the number increases, lest the third should be grieved.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఆ విధంగా రహస్య మంతనాలు జరుపుకోరాదని చెప్పటానికి కారణమేమిటో ఈ హదీసులో వివరించబడింది. ఆ వైఖరి వల్ల మూడోవ్యక్తికి బాధ కలుగుతుంది. ఒక విశ్వాసిని బాధపెట్టటం చాలా పెద్దపాపం. ఆ విధంగా చూస్తే ఇలాంటి రహస్య మంతనాలు దాదాపు నిషిద్ధ విషయాల క్రిందికి వస్తాయి. ఒకవేళ ఆ ముగ్గురు గనక మరికొందరితో కలిసిపోతే అప్పుడు ఆ ఇద్దరు తమకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకోవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|281. మూడో వ్యక్తి అనుమతి లేకుండా ఇద్దరు వ్యక్తులు రహస్య విషయాలు మాట్లాడుకోరాదు. అయితే అవసర పరిస్థితుల్లో మాత్రం ఈ విధంగా మూడోవ్యక్తికి వినపడకుండా రహస్యాలు చెప్పుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు మూడోవ్యక్తికి అర్ధంకాని భాషలో మాట్లాడుకోవటం కూడా ఈ భావంలోకి వస్తుంది|హదీసు 1601