హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 280. మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 280వ అధ్యాయం: ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 1593 – 1599) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు

↑ విషయ సూచిక

باب تحريم الهجران بين المسلمين فوق ثلاثة أيام إِلاَّ لبدعة في المهجور أَوْ تظاهرٍ بفسقٍ أَوْ نحو ذَلِكَ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ} [الحجرات: ١٠]

"విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు, కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి." (హుజురాత్:10)

{وَلا تَعَاوَنُوا عَلَى الأِثْمِ وَالْعُدْوَانِ} [المائدة: ٢]

"పాపకార్యాలలో, అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి." (మాయిద: 2)

ముఖ్యాంశాలు

1) గొడవ పడటం, సంబంధాలు త్రెంచుకొని ఉండటం సౌభ్రాతృత్వ విధానానికి విరుద్ధం. అందుకే పరస్పరం గొడవపడ్డ ముస్లింల మధ్య సంధి కుదుర్చమని ముస్లింలను ఆదేశించటం జరిగింది. అప్పుడే విశ్వాసుల సౌభ్రాతృత్వం భాసిల్లుతుంది.

2) షరీఅత్ పరమైన కారణమేదీ లేకుండా మాట్లాడుకోకుండా ఎడమొహం, పెడమొహంతో ఉండటం పాపం, అన్యాయం. కనుక దాన్ని ప్రోత్సహించటం కూడా పాపమే. ఇస్లాం దాన్ని కూడా నివారించింది. పైగా ఇలాంటి సందర్భాల్లో వారి మధ్య సంధి కుదర్చటం తప్పనిసరి అని అంటుంది.

English

“The believers are nothing else than brothers (in Islamic religion). So make reconciliation between your brothers.” [Al-Ḥujurāt 49:10]

“But do not help one another in sin and transgression.” [Al-Mā’idah 5:2]

1593

హదీసు 1593

وعنْ أنَسٍ رضي اللَّه عنهُ قَالَ: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لاَ تَقَاطَعُوا، وَلاَ تَدابروا، وَلاَ تباغضُوا، وَلاَ تحاسدُوا، وكُونُوا عِبادَ اللَّهِ إخْواناً. وَلاَ يحِلُّ لمُسْلِمٍ أنْ يهْجُرَ أخَاهُ فَوقَ ثَلاثٍ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు పరస్పరం సంబంధాలు త్రెంచుకోకండి. ఎడమొహం, పెడమొహంతో ఉండకండి. పరస్పరం ద్వేషించుకోకండి. అసూయ చెందకండి. దైవదాసులారా! పరస్పరం అన్నదమ్ములుగా ఉండండి. ఒక ముస్లిం తోటి (ముస్లిం) సోదరునితో మూడు రోజులకు మించి మాట్లాడకుండా ఉండరాదు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Anas bin Malik (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Do not desert (stop talking to) one another, do not nurse hatred towards one another, do not be jealous of one another, and become as fellow brothers and slaves of Allah. It is not lawful for a Muslim to stop talking to his brother (Muslim) for more than three days.”[Al-Bukhari and Muslim]

ముఖ్యాంశాలు

'హిజ్‌రాన్' అంటే సంబంధాలు త్రెంచుకొని పరస్పరం మాట్లాడుకోకుండా ఉండటం. పై హదీసులో పేర్కొనబడిన పనులన్నీ సౌభ్రాతృత్వానికి విరుద్ధమైనవి కనుక వాటిని వారించటం జరిగింది. దీనికి భిన్నంగా ఇస్లామీయ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పమని ముస్లింలకు ఆదేశించబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1593

1594

హదీసు 1594

وعنْ أَبي أيوبَ رضي اللَّه عنْهُ أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "لا يحِلُّ لمُسْلِمٍ أنْ يَهْجُرَ أخَاهُ فوْقَ ثَلاثِ لَيالٍ: يلتَقِيانِ، فيُعرِضُ هَذَا ويُعرِضُ هَذَا، وخَيْرُهُما الَّذِي يبْدأ بالسَّلامِ" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఒక ముస్లిం తోటి (ముస్లిం) సోదరునితో మూడు రాత్రులకు మించి సంబంధాలు త్రెంచుకొని ఉండటం, పరస్పరం ఎదురుపడినప్పుడు ఎడమొహం పెడమొహంతో ఉండటం ధర్మసమ్మతం కాదు. వారిద్దరిలో ముందుగా సలాం చేసేవాడే ఉత్తముడు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అదబ్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని బిర్ర్ ప్రకరణం)

English

Abu Ayyub Al-Ansari (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “It is not lawful for a Muslim to desert (stop talking to) his brother beyond three nights, the one turning one way and the other turning to the other way when they meet, the better of the two is one who is the first to greet the other.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇస్లాం ఒక సహజ ధర్మం. అందుకే సహజ విషయాల్లో, వ్యవహారాల్లో అందులో అనుకూలం మేరకు సౌకర్యం ఉంచబడింది. ఇద్దరు ముస్లింల మధ్య ఏ కారణంగానయినా గొడవ జరిగితే సహజంగానే వారి మనసుల్లో తమ ప్రత్యర్థి పట్ల సంకుచితత్వం, అక్కసు మాలిన్యం చేరుకుంటుంది. దాని మూలంగా వారు పరస్పరం కలుసుకొని మాట్లాడుకోలేరు. ఇస్లామీయ షరీఅతు ఈ సహజమైన సంకుచితత్వాన్ని అంగీకరించి మూడురోజుల వరకు ప్రత్యర్థులు మాట్లాడుకోకుండా ఉండటానికి అనుమతినిచ్చింది. అయితే ఎక్కువ రోజుల వరకు సంబంధాలు త్రెంచుకొని ఉంటే అది తీవ్ర విద్వేషానికి, శత్రుత్వానికి దారితీస్తుంది. దానిమూలంగా సమాజంలో మరింత అల్లకల్లోలం వ్యాపిస్తుంది. బంధువుల మధ్య అంతరాల అగాధాలు పెరిగిపోతాయి. స్నేహ సంబంధాలు పాడయిపోతాయి.

2) ముందుగా సలాం చేయటంలోని ప్రాముఖ్యతను వివరించి సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి ఒక సులభమైన మార్గాన్ని సూచించడం జరిగింది. ఎందుకంటే సలాం చేయటం మూలంగా ప్రేమ పెరుగుతుంది. సంభాషణ మొదలవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1594

1595

హదీసు 1595

وعنْ أبي هُريرةَ رضي اللَّه عنْه قَال: قَال رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "تُعْرضُ الأعْمالُ في كُلِّ اثْنَيْنِ وخَميس، فيغفِر اللَّه لِكُلِّ امْريءٍ لا يُشْرِكُ بِاللَّهِ شَيْئاً، إِلاَّ امْرءًا كَانَتْ بيْنَهُ وبيْنَ أخِيهِ شَحْناءُ، فيقُولُ: اتْرُكُوا هذَينِ حتَّى يصْطلِحا" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ప్రతి సోమ, గురువారాల్లో కర్మలు ప్రవేశపెట్టబడతాయి. ఆ రోజు అల్లాహ్‌కు ఎవరినీ సహవర్తులుగా నిలబెట్టని ప్రతి ఒక్కణ్ణీ అల్లాహ్ క్షమిస్తాడు. కాని తనకూ తన తోటి (ముస్లిం) సోదరునికి మధ్య శత్రుత్వమున్న వాణ్ణి మాత్రం క్షమించడు. అతడి గురించి ఇలా అనటం జరుగుతుంది: 'వీరిద్దరూ సంధి కుదుర్చుకునే దాకా గడువు ఇవ్వండి.'

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని బిర్ర్, సిలా ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “People’s deeds are presented before Allah on Mondays and Thursdays, and then every slave (of Allah) is granted forgiveness (of minor sins) if he does not associate anything with Allah in worship. But the person in whose heart there is rancour against his brother, will not be pardoned. With regard to them, it is said twice: `Hold these two until they are reconciled‘.”[Muslim].

ముఖ్యాంశాలు

షరీఅత్ పరమైన కారణంలేని పరస్పర శత్రుత్వం దేవుని క్షమాభిక్ష లభించకుండా చేస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1595

1596

హదీసు 1596

وعَنْ جابرٍ رضي اللَّه عنْهُ قَال: سمِعْتُ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "إنَّ الشَّيْطَانَ قَدْ أيسَ أنْ يَعْبُدهُ المُصلُّون فِي جَزيرةِ العربِ ولكِن في التَّحْرِيشِ بيْنهم" رواه مسلم. "التَحْرِيشُ"الإفسادُ وتغييرُ قُلُوبِهم وتَقَاطُعُهم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: అరబ్బు ద్వీపంలోని నమాజీలు ఇక తనను ఆరాధించరని షైతాన్ నిరాశ చెందాడు. అయితే వారిమధ్య గొడవలు సృష్టించటంలో మాత్రం అతను (విజయం సాధిస్తాడు సుమా!) (ముస్లిం)

'తహ్‌రీష్' అంటే గొడవలు సృష్టించటం, మనసుల్ని మార్చటం, సంబంధాలను త్రెంచటం.

(సహీహ్ ముస్లింలోని సిఫతుల్ ఖియామతి వల్ జన్నతి వన్నార్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) said: I heard the Messenger of Allah ﷺ as saying, “The Satan has despaired of being worshipped by those who engage in prayer in the Arabian Peninsula but (has not lost hope) in creating dissension among them.”[Muslim].

ముఖ్యాంశాలు

1) ముహమ్మద్ ﷺ నిజంగా దైవప్రవక్త ﷺ అని చెప్పటానికి ఈ హదీసు ప్రబల నిదర్శనం. ముస్లింలు పరస్పరం గొడవ పడి సంబంధాలు త్రెంచుకుంటారనీ, ఇదంతా షైతాన్ యొక్క కుచేష్టల మూలంగా, వాడి దుష్టప్రేరేపణల మూలంగానే జరుగుతుందని ఆయనెప్పుడో చెప్పారు. ఆ భవిష్యవాణి నిజమని రుజువయింది.

2) పై హదీసులో నమాజీలంటే ముస్లింలని భావం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1596

1597

హదీసు 1597

وعنْ أَبي هريرة رضي اللَّه عَنْه قَال: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "لاَ يحِلُّ لمسْلِمٍ أنْ يهْجُرَ أخَاه فوْقَ ثَلاثٍ، فمنْ هَجر فَوْقَ ثلاثٍ فَمَاتَ دخَل النَار". رواهُ أَبُو داود بإسْنادٍ على شرْطِ البخاري ومسلم.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఏ ముస్లిం కూడా తోటి (ముస్లిం) సోదరుని మీద కోపంతో మూడు రోజులకు మించి అతనితో మాట్లాడకుండా ఉండరాదు. మూడురోజులకు మించి మాట్లాడకుండా ఉన్న స్థితిలో చనిపోతే అతను నరకానికి వెళ్తాడు. (అబూదావూద్ దీనిని బుఖారీ షరతులను అనుసరించి ఉన్న 'సనదు' ఆధారంగా వెలికి తీశారు)

(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “It is not lawful for a Muslim to forsake his (Muslim) brother beyond three days; and whosoever does so for more than three days, and then dies, will certainly enter the Hell.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

తాను చేసిన పాపానికి శిక్షగా అతను నరకానికి వెళ్తాడు. ఆ శిక్షననుభవించిన తర్వాత అతన్ని నరకం నుండి బయటికి తీసి స్వర్గానికి పంపటం జరుగుతుంది. ఎందుకంటే శాశ్వతంగా నరకంలో ఉండేది కేవలం దైవతిరస్కారులు మాత్రమే. కనుక ముస్లిం అయినవాడు ఏం చేసినా అతను శిక్షగా కూడా నరకానికి వెళ్ళడని భావించటం తప్పు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1597

1598

హదీసు 1598

وعَنْ أَبي خرَاشٍ حدْرَدِ بنِ أَبي حدْردٍ الأسْلمي، ويُقَالُ السُّلمي الصَّحابِي رضي اللَّه عَنْهُ أنَّهُ سَمِعَ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "منْ هَجر أخاهُ سَنَةً فَهُو كَسفْكِ دمِهِ". رواه أَبُو داود بإسناد صحيح.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూ ఖిరాష్ హద్‌రద్ బిన్ అబూ హద్‌రద్ అస్లమీ- కొందరి అభిప్రాయం ప్రకారం సులమీ సహాబీ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు: తన సోదరునితో ఒక సంవత్సరం పాటు తెగత్రెంపులు చేసుకొని ఉంటే తను అతన్ని ఖూనీ చేసినట్లే లెక్క. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు.)

(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)

English

Abu Khirash Hadrad bin Abu Hadrad Al-Aslami (radiyallahu anhu) said: I heard the Prophet ﷺ saying, “Whosoever forsakes his brother for a year is like one who sheds his blood.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

సంబంధాల తెగత్రెంపుల మూలంగా ఎదుటి ముస్లిం తీవ్రమైన మనోవ్యధకు గురవుతాడు. ఆ విధంగా ఒక ముస్లింని తీవ్రమనోవ్యధకు గురిచేయటం కూడా ఖూనీ చేయటంతో సమానమని ఈ హదీసులో చెప్పబడింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1598

1599

హదీసు 1599

وعنْ أبي هُرَيْرةَ رضي اللَّه عَنْهُ أنًَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَحِلُّ لمُؤْمِنٍ أنْ يهْجُرَ مُؤْمِناً فَوْقَ ثَلاثٍ، فَإنْ مرَّتْ بِهِ ثَلاثٌ، فَلْيَلْقَهُ، ولْيُسَلِّمْ عَلَيْهِ، فَإن رَدَّ عليهِ السَّلام، فقَدِ اشْتَرَكَا في الأجْرِ، وإنْ لَمْ يَرُدَّ عَلَيْهِ، فَقَدْ باءَ بالإثمِ، وخَرَجَ المُسلِّمُ مٍن الهجْرةِ". رواهُ أَبُو داود بإسنادٍ حسن. قَالَ أَبُو داود: إِذَا كَانَتِ الهجْرَةُ للَّهِ تَعالى فَلَيْس مِنْ هذَا في شيءٍ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒక విశ్వాసి తోటి విశ్వాసితో మూడురోజులకు మించి సంబంధం లేకుండా ఉండరాదు. ఒకవేళ అదే స్థితిలో మూడు రోజులు గడిచిపోతే ఆ తర్వాత అతన్ని కలుసుకొని అతనికి సలాం చేయాలి. అతను గనక ఆ సలాంకు ప్రతి సలాం చేస్తే ఇద్దరికీ పుణ్యం లభిస్తుంది. ఒకవేళ అతను (తన క్రోధాన్ని అలాగే కొనసాగిస్తూ) ప్రతి సలాం చేయకపోతే అతను పాపాత్ముడౌతాడు. సలాం చేసినవాడు మాత్రం తెగత్రెంపుల పాపం నుండి బతికిపోతాడు. అబూదావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో వెలికితీసిన తర్వాత, 'దేవుని కోసం సంబంధాలను తెగత్రెంపులు చేసుకుంటే మాత్రం అందులో తప్పులేదు' అని అన్నారు.

(సుననె అబూదావూద్‌లోని అదబ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “It is not permissible for a believer to forsake his (Muslim) brother for more than three days. If three days have passed, he should meet him and greet him; and if other responds to it they will both share the reward; but if he does not respond, he will bear his sin and the one who (has taken the initiative to) greet (the other) will be absolved of the sin of forsaking (one’s brother in Faith).”[Abu Dawud].

ముఖ్యాంశాలు

1) సంబంధాల తెగత్రెంపులనేవి కేవలం అల్లాహ్ కోసం మాత్రమే జరగాలి. ఉదాహరణకు ఒకతను ధర్మంలో కొత్తపోకడలు (బిద్‌అత్‌లు) సృష్టిస్తున్నాడు లేక బహిరంగంగా పాపాలకు పాల్పడుతున్నాడు. ఎంతచెప్పినా తన బిద్‌అత్‌లను, పాపవైఖరిని విడనాడటం లేదనుకోండి అలాంటి వ్యక్తితో కేవలం అల్లాహ్ కోసం మాట్లాడకుండా ఉండటం, అతనితో తెగత్రెంపులు చేసుకోవటం ధర్మసమ్మతమే. పైగా అభిలషణీయం కూడాను. ఎందుకంటే దానిద్వారా అతను గుణపాఠం నేర్చుకొని తన తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. అంతేగాని ప్రాపంచికపు పొరపొచ్చాల మూలంగా మూడు రోజులకు మించి సంబంధం లేకుండా ఉండటం ధర్మసమ్మతం కాదు.

2) మూడు రోజుల తర్వాత ముందుగా ప్రత్యర్థికి సలాం చెప్పినవాడు ఉత్తముడు. ఒకవేళ ఆ రెండో వ్యక్తి సలాంకు జవాబు చెప్పకుండా హృదయంలో ఉన్న శత్రుత్వాన్ని ఇంకా పెంచుకున్నాడనుకోండి, అప్పుడతను పాపాత్ముడౌతాడు. సలాం చేసిన వ్యక్తి మాత్రం ఆ పాపం నుండి బతికిపోతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|వారింపబడిన విషయాల ప్రకరణం|280. ముస్లింలు పరస్పరం మూడురోజులకు మించి మాట్లాడుకోకుండా ఉండటం నిషిద్ధం. అయితే ధర్మంలో కొత్తపోకడలు సృష్టించేవారితో లేక బహిరంగంగా పాపాలు చేసేవారితో తెగత్రెంపులు చేసుకోవచ్చు|హదీసు 1599