హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 26వ అధ్యాయం: దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 19 హదీసులు (హదీసు 205 – 223) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……

↑ విషయ సూచిక

باب تحريم الظلم والأمر بردِّ المظالم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు:

{مَا لِلظَّالِمِينَ مِنْ حَمِيمٍ وَلا شَفِيعٍ} [غافر: ١٨]

"దుర్మార్గులకు ఆప్తమిత్రుడుగానీ, మాట చెల్లుబడి అయ్యే సిఫారసుదారుగానీ ఎవ్వడూ ఉండడు." (అల్ మూమిన్ : 18)

{وَمَا لِلظَّالِمِينَ مِنْ نَصِيرٍ} [الحج: ٧١]

"దుర్మార్గులకు సహాయపడే వాడెవ్వడూ ఉండడు." (అల్ హజ్ : 81)

ఇక ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసుల విషయానికొస్తే, ఇంతకుముందు 'పోరాట పటిమ' అనే అధ్యాయం చివర్లో వచ్చిన అబూజర్ర్ (రదియల్లాహు అన్హు) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. (111వ హదీసు చూడండి)

English

“There will be no friend, nor an intercessor for the Zalimun (polytheists and the wrongdoers), who could be given heed to.” [Ghāfir 40:18]

“And for the Zalimun (wrongdoers, polytheists and disbelievers in the Oneness of Allah) there is no helper.” [Al-Ḥajj 22:71]

205

హదీసు 205

وعن جابر رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "اتَّقُوا الظُّلْمَ فَإِنَّ الظُّلْمَ ظُلُمَاتٌ يَوْمَ الْقِيَامَةِ، واتَّقُوا الشُّحَّ فَإِنَّ الشُّحَّ أَهْلَكَ منْ كَانَ قَبْلَكُمْ، حملَهُمْ عَلَى أَنْ سفَكَوا دِماءَهُمْ واسْتَحلُّوا مَحارِمَهُمْ "رواه مسلم.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : "దుర్మార్గానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దుర్మార్గం ప్రళయదినాన కటిక చీకట్లవలె ఉంటుంది. ఇంకా పిసినారితనానికి దూరంగా ఉండండి. ఈ పిసినారితనమే మీకు పూర్వం గతించిన సమాజాల్ని సర్వనాశనం చేసింది; అయినవారి రక్తం చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మ సమ్మతం (హలాల్)గా తలపోసేందుకు ప్రేరేపించింది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల పుస్తకం)

English

Jabir bin `Abdullah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Beware of injustice, for oppression will be darkness on the Day of Resurrection; and beware of stinginess because it doomed those who were before you. It incited them to shed blood and treat the unlawful as lawful.”[Muslim]

ముఖ్యాంశాలు

మితిమీరిన ధనవ్యామోహాన్ని పిసినారితనం అంటారు. మనిషి ప్రాపంచిక సిరిసంపదలు, భోగభాగ్యాల వలలో చిక్కుకున్నప్పుడు ధర్మాధర్మాల సంగతిని మరచిపోతాడు. ఆఖరికి తన స్వార్థం కోసం ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. ఈ రోజు మన సమాజ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉన్నవాడు లేని వాడిని దోచుకుంటున్నాడు. ధనవంతుడు ఇంకా ధనవంతుడై కోట్లకు పడగలెత్తుతున్నాడు. దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కవలసి వచ్చినా, ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయినాసరే తమ పబ్బం గడిస్తే చాలనుకుంటున్నారు. ప్రస్తుతం మన సమాజాన్ని ఏలుతున్న అవినీతి ఇలాగే కొనసాగితే మన సమాజం కూడా వినాశానికి లోనవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 205

206

హదీసు 206

وعن أَبِي هريرة رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَتُؤَدُّنَّ الْحُقُوقَ إِلَى أَهْلِهَا يَوْمَ الْقيامَةِ حَتَّى يُقَادَ للشَّاةِ الْجَلْحَاء مِنَ الشَّاةِ الْقَرْنَاء" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : ప్రళయదినాన మీరు హక్కుదారులకు వారి హక్కుల్ని తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. ఆఖరికి కొమ్ముల్లేని మేకకు కూడా కొమ్ములున్న మేకనుండి పరిహారం ఇప్పించబడుతుంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “On the Resurrection Day, the rights will be paid to those to whom they are due so much so that a hornless sheep will be retaliated for by punishing the horned sheep which broke its horns”.[Muslim].

ముఖ్యాంశాలు

ప్రళయదినాన దేవుని దర్బారులో ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా తిరుగులేని న్యాయం జరుగుతుందని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఆఖరికి జంతువులు పరస్పరం కొట్లాడుకుంటే వాటిలోని పీడిత జంతువులకు కూడా న్యాయం చేకూరుస్తాడు దేవుడు. పరమ ప్రభువు బుద్ధిజ్ఞానాలు లేని జంతువులనే క్షమించనప్పుడు అన్నీ తెలిసిన మానవులు దుర్మార్గానికి ఒడిగడితే ఎలా క్షమిస్తాడు? అని ఈ హదీసు హెచ్చరిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 206

207

హదీసు 207

وعن ابن عمر رضي اللَّه عنهما قال: كُنَّا نَتحدَّثُ عَنْ حَجَّةِ الْوَدَاعِ، وَالنَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بَيْن أَظْهُرِنَا، وَلاَ نَدْرِي مَا حَجَّةُ الْوداع، حَتَّى حمِدَ اللَّه رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَأَثْنَى عَليْهِ ثُمَّ ذَكَر الْمسِيحَ الدَّجَالَ فَأَطْنَبَ في ذِكْرِهِ، وَقَالَ: "مَا بَعَثَ اللَّه مِنْ نَبيٍّ إلاَّ أَنْذَرَهُ أُمَّتهُ: أَنْذَرَهُ نوحٌ وَالنَّبِيُّون مِنْ بَعْدِهِ، وَإنَّهُ إنْ يَخْرُجْ فِيكُمْ فَما خفِيَ عَليْكُمْ مِنْ شَأْنِهِ فَلَيْسَ يَخْفِي عَلَيْكُمْ، إِنَّ رَبَّكُمْ لَيس بأَعْورَ، وَإِنَّهُ أَعورُ عَيْن الْيُمْنَى، كَأَنَّ عيْنَهُ عِنبَةٌ طَافِيَةٌ. ألا إنَّ اللَّه حرَّم علَيْكُمْ دِمَاءَكُمْ وَأَمْوالكُمْ، كَحُرْمَةِ يوْمكُمْ هَذَا، في بلدِكُمْ هذا، في شَهْرِكُم هَذَا ألاَ هَلْ بلَّغْتُ؟ "قَالُوا: نَعَمْ، قَالَ:"اللَّهُمَّ اشْهَدْ ثَلاثاً ويْلَكُمْ أَوْ: ويحكُمْ، انظُرُوا: لا ترْجِعُوا بَعْدِي كُفَّاراً يضْرِبُ بَعْضُكُمْ رِقَابَ بَعْضِ "رواه البخاري، وروى مسلم بعضه.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ మా మధ్య ఉన్న ప్పుడే మేము 'హజ్జతుల్ విదా' (అంతిమ హజ్) గురించి మాట్లాడుకునే వాళ్ళం. అప్పటికింకా మాకు 'హజ్జతుల్ విదా' అంటే ఏమిటో తెలీదు. ఎట్టకేలకు (హజ్జతుల్ విదా రానే వచ్చింది. ఆ సందర్భంగా) ఆయన దేవుని ప్రశంసల్నీ, పొగడ్తల్ని కొనియాడారు. ఆ తరువాత 'మసీహుద్దజ్జాల్' గురించి ప్రస్తావించారు. అతని గురించి వివరంగా తెలియజేస్తూ ఇలా అన్నారు: అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ తమ తమ జాతుల వారిని ఇతన్ని (అంటే దజ్జాల్) గురించి తప్పకుండా అప్రమత్తం చేశారు. నూహ్ – అలైహి – (తన జాతి ప్రజలను) ఇతన్ని గురించి భయపెట్టారు. ఆయన తరువాత వచ్చిన ప్రవక్తలు కూడా భయపెట్టారు. ఒకవేళ అతను మీ మధ్య వెలిస్తే అతని రూపురేఖలు మీకు తెలియకుండా ఉండవు (మీరతన్ని చాలా తేలికగా గుర్తుపట్టవచ్చు). దేవుడు ఒంటికన్ను వాడు కాదన్న సంగతైతే రహస్యంగా లేదు కదా! కాని అతను మాత్రం ఒంటికన్నువాడై ఉంటాడు. అతనికి ఒక్క కుడి కన్ను మాత్రమే ఉంటుంది. అదీ ద్రాక్ష పండులా ఉబ్బినట్లు కనిపిస్తుంది.

జాగ్రత్త! మీ నగరంలో, మీ ప్రదేశంలో ఈనాటి ఈ రోజు మీ కొరకు నిషిద్ధమైనట్లే (పరస్పరం) అల్లాహ్ మీ రక్తాన్ని, మీ ధనాన్ని నిషిద్ధం (హరాం) చేశాడు. నేను మీకు (దేవుని సందేశాన్ని) అందజేశానా?"

దానికి ఆయన అనుచరులందరూ (ముక్తకంఠంతో) అవునన్నారు. అప్పుడు ఆయన (ఆకాశం వైపు తలెత్తి) "అల్లాహ్! (దీనికి) నీవు సాక్షిగా ఉండు" అని మూడుసార్లు అన్నారు. ఆ తరువాత "మీరు నాశనమైపోతారు జాగ్రత్త! (లేక) మీ స్థితి కడు శోచనీయం చూడండి! నా తదనంతరం మీరు పరస్పరం మెడలు నరుక్కుంటూ అవిశ్వాసులై పోరాదు" అని అన్నారు. (దీనిని బుఖారీ ఉల్లేఖించారు. ముస్లిం ఇందులోని కొంతభాగాన్ని మాత్రం ఉల్లేఖించారు.)

(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది).

English

Ibn `Umar (May Allah bepleased with them) reported: We were talking about the Farewell Pilgrimage without knowing what was it when Messenger of Allah ﷺ was also present. He ﷺ stood up and recited the Praise and Glorification of Allah. He then gave a detailed account of Ad-Dajjal and said, ‘Every Prophet sent by Allah had warned his people against his mischief. Nuh ﷺ )warned his nation and so did all the Prophets after him. If he (i.e., Ad-Dajjal) appears among you, his condition will not remain hidden from you. Your Rubb is not one-eyed, but Ad-Dajjal is. His right eye is protruding like a swollen grape. Listen, Allah has made your blood, and your properties as inviolable as of this day of yours (i.e., the Day of Sacrifice), in this city of yours (i.e., Makkah), in this month of yours (i.e., Dhul -Hijjah). Listen, have I conveyed Allah’s Message to you?’‘ The people replied in affirmative. There upon he said, “O Allah, bear witness.” And he repeated it thrice. He ﷺ concluded: “Do not revert after me as infidels killing one another”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో మసీహుద్దజ్జాల్ పుట్టుకను ప్రళయం రాకకు సూచనగా చెప్పబడింది. విశ్వాసులు మసీహుద్దజ్జాల్‌ని గుర్తుపట్టి అతని వలలో చిక్కుకోకుండా ఉండేందుకు అతని రూపురేఖల్ని కూడా వర్ణించడం జరిగింది. 'మసీహ్' అంటే ఒంటికన్నువాడు. 'దజ్జాల్' అనేది 'దజ్ల్' అనే పదం నుండి వచ్చిన అతిశయ పదం. దీనికి 'మోసకారి' అని అర్థం. ఇతను ప్రళయానికి ముందు చాలామందిని మోసం చేసి సన్మార్గం నుండి భ్రష్టుపట్టిస్తాడని హదీసుల్లో చెప్పబడింది.
  2. ముస్లింల ధనప్రాణాలు పరస్పరం నిషిద్ధం గావించబడ్డాయి. కనుక ప్రతి ముస్లిం తోటి ముస్లిం ధన, మాన ప్రాణాలను పరిరక్షించాలి.
  3. ముస్లింలు ఒకరినొకరు చంపుకోవటం మహాపాపం. ఇది 'కుఫ్ర్'కు దారితీస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 207

208

హదీసు 208

وعن عائشة رضي الله عنها أنَّ رَسُول الله صلى الله عليه وسلم قَالَ: " مَنْ ظَلَمَ قِيدَ شِبْرٍ مِنَ الأرْضِ طُوِّقَهُ منْ سَبْعِ أَرَضِينَ " متفقٌ عليه.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : ఎవడైనా ఒక జానెడు భూభాగాన్ని బలవంతంగా లాక్కొని ఎవరి పైనయినా దౌర్జన్యం చేస్తే (ప్రళయదినాన అతని మెడకు) ఏడు భూ(గోళ)ముల కంఠబంధం తొడిగించడం జరుగుతుంది." (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని 'అత్యాచారాల' ప్రకరణంలోనూ సహీహ్ ముస్లింలోని 'వాణిజ్య' ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

`Aishah (May Allah bepleased with her) reported: Messenger of Allah ﷺ said, “Whoever usurps unlawfully even a hand span of land a collar measuring seven times (this) land will be placed around his neck on the Day of Resurrection”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ప్రపంచంలో కొంచెం దౌర్జన్యానికి పాల్పడినా, పరలోకంలో అది పెద్ద శిక్షకు కారణభూతమవుతుందని ఈ హదీసు హెచ్చరిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 208

209

హదీసు 209

وعن أَبي موسى رضي اللَّه عنه قَالَ: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"إِنَّ اللَّه لَيُمْلِي لِلظَّالِمِ فَإِذَا أَخَذَهُ لَمْ يُفْلِتْهُ، ثُمَّ قَرَأَ: {وَكَذَلِكَ أَخْذُ رَبِّكَ إِذَا أَخَذَ الْقُرَى وَهِيَ ظَالِمَةٌ إِنَّ أَخْذَهُ أَلِيمٌ شَدِيدٌ} [هود:١٠٢] مُتَّفَقٌ عَلَيهِ.

హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు : నిశ్చయంగా దేవుడు దౌర్జన్యం చేసేవాడికి అవకాశం ఇస్తాడు. కాని ఆయన అతన్ని పట్టుకున్నాడంటే ఇక (శిక్షించకుండా) వదలిపెట్టడు." ఆ తరువాత ఆయన ఈ సూక్తిని పఠించారు: "నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షంచదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది, బాధాకరమైనది. (హూద్ : 102) (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యాన ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని సత్కార్యాల పుస్తకంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Musa (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Verily, Allah gives respite to the oppressor. But when He seizes him, He does not let him escape.” Then he ﷺ) recited, “Such is the Seizure of your Rubb when He seizes the (population of) towns while they are doing wrong. Verily, His Seizure is painful (and) severe”. (11:102).[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దేవుడు దౌర్జన్యాలు చేసేవాడిని కొంతకాలం పాటు శిక్షించకుండా వదలిపెడతాడు. కాని అతని పాపం పండాక అతన్ని పట్టుకున్నాడంటే ఇక ఆయన పట్టునుండి విడిపించుకునే మార్గమేదీ ఉండదు. కనుక దౌర్జన్యాలకు, అత్యాచారాలకు దూరంగా ఉండాలి. దౌర్జన్యం చేసినా శిక్ష పడట్లేదని సంబరపడిపోకూడదు. దైవాగ్రహం ఎప్పుడు విరుచుకుపడుతుందో, దేవుడు వేసిన ఉచ్చు ఎప్పుడు బిగుసుకుంటుందో ఎవరికీ తెలియదు!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 209

210

హదీసు 210

وعن مُعاذٍ رضي اللَّه عنه قَالَ: بعَثَنِي رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالَ: "إنَّكَ تَأْتِي قوْماً مِنْ أَهْلِ الْكِتَاب، فادْعُهُمْ إِلَى شََهَادة أَنْ لا إِلَهَ إلاَّ اللَّه، وأَنِّي رَسُول اللَّه فإِنْ هُمْ أَطاعُوا لِذَلِكَ، فَأَعْلِمهُمْ أَنَّ اللَّه قَدِ افْترضَ علَيْهم خَمْسَ صَلَواتٍ في كُلِّ يومٍ وَلَيْلَةٍ، فَإِنْ هُمْ أَطَاعُوا لِذلكَ، فَأَعلِمْهُمْ أَنَّ اللَّه قَدِ افْتَرَضَ عَلَيهمْ صدَقَةً تُؤْخذُ مِنْ أَغنيائِهِمْ فَتُرَدُّ عَلَى فُقَرائهم، فَإِنْ هُمْ أَطَاعُوا لِذلكَ، فَإِيَّاكَ وكَرائِمَ أَمْوالِهم. واتَّقِ دعْوةَ الْمَظْلُومِ فَإِنَّهُ لَيْس بَيْنَها وبيْنَ اللَّه حِجَابٌ "متفقٌ عليه.

హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ నన్ను (యమన్ వైపుకు) పంపినప్పుడు ఇలా హిత బోధ చేశారు: (ఓ ముఆజ్!) నువ్వు గ్రంథవహులైన ప్రజల దగ్గరికి వెళుతున్నావు. (కనుక ముందుగా) నువ్వు వారిని అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ దైవప్రవక్త అని సాక్ష్యం పలకమని ఆహ్వానించు. వారు నీ మాట వింటే అప్పుడు, దేవుడు రేయింబవళ్ళలో వారిపై ఐదు (పూటల) నమాజులు విధిగా చేశాడని వారికి చెప్పు. దానికీ వారు ఒప్పుకుంటే, దేవుడు వారిపై జకాత్ దానాన్ని విధిగా చేశాడని, అది వారి ధనవంతుల నుండి వసూలు చేయబడి వారిలోని బీదవారికి పంచబడుతుందని తెలియజెయ్యి. అందుక్కూడా అంగీకరిస్తే (జకాత్ వసూలు చేసినప్పుడు) నీవు (న్వయంగా) వారి నంపదలోని నాణ్యమైన వస్తువుల్ని తీసుకోకుండా జాగ్రత్తపడు. (అలా చేస్తే వారిని పీడించినట్లవుతుంది కనుక) పీడితుని ఆర్తనాదం నుండి నిన్ను నీవు రక్షించుకో. ఎందుకంటే, పీడితుని ఆర్తనాదానికి – దేవునికి మధ్య ఎలాంటి అడ్డుతెర లేదు (అతని శాపానికి దేవుడు తప్పకుండా ఆమోద ముద్రవేస్తాడు). (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని జకాత్ ప్రకరణంలోనూ, యుద్ధాల ప్రకరణంలోనూ ఏకేశ్వరోపాసనా సిద్ధాంత ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Mu`adh (May Allah bepleased with him) reported that Messenger of Allah ﷺ sent me (as a governor of Yemen) and instructed me thus: “You will go to the people of the Book. First call them to testify that `there is no true god except Allah, that I am (Muhammad ﷺ) the Messenger of Allah.’ If they obey you, tell them that Allah has enjoined upon them five Salat (prayers) during the day and night; and if they obey you, inform them that Allah has made Zakat obligatory upon them; that it should be collected from their rich and distributed among their poor; and if they obey you refrain from picking up (as a share of Zakat) the best of their wealth. Beware of the supplication of the oppressed, for there is no barrier between it and Allah”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. దైవ తిరస్కారులతో యుద్ధం అనివార్యమైపోతే యుద్ధం చేసే ముందు వారిని ఇస్లాం స్వీకరించమని ఆహ్వానించాలి. ఆ తరువాత వారికి నమాజ్, జకాత్ ఇంకా ఇతర విధుల గురించి బోధించాలి.
  2. ఒక ప్రాంతంలోని ధనవంతుల నుండి జకాత్ ధనాన్ని వసూలు చేస్తే దాన్ని ఆ ప్రాంతంలోని బీదవారికే పంచిపెట్టాలి. మిగిలిపోతే ఇతర ప్రాంతాలకు కూడా తరలించవచ్చు.
  3. జకాత్ వసూళ్ళపై నియుక్తులైన ఉద్యోగులు జకాత్ వసూలు చేసినప్పుడు ప్రజలపై దౌర్జన్యం చేయకూడదు. దౌర్జన్య పీడితుల శాపం ఊరికేపోదు. అల్లాహ్ దానిని తప్పకుండా అంగీకరిస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 210

211

హదీసు 211

وعن أَبِي حُميْد عبْدِ الرَّحْمن بنِ سعدٍ السَّاعِدِيِّ رضي اللَّه عنه قَالَ: اسْتعْملَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَجُلاً مِن الأَزْدِ يُقَالُ لَهُ: ابْنُ اللُّتْبِيَّةِ عَلَى الصَّدقَةِ، فَلَمَّا قَدِمَ قَالَ: هَذَا لَكُمْ، وَهَذَا أُهدِيَ إِلَيَّ فَقَامَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلَى الْمِنبرِ، فَحمِدَ اللَّه وأَثْنَى عَلَيْهِ، ثُمَّ قَالَ: "أَمَّا بعْدُ فَإِنِّي أَسْتعْمِلُ الرَّجُلَ مِنْكُمْ عَلَى الْعمَلِ مِمَّا ولاَّنِي اللَّه، فَيَأْتِي فَيَقُولُ: هَذَا لَكُمْ، وَهَذَا هَدِيَّةٌ أُهْدِيَت إِلَيَّ، أَفَلا جَلَسَ في بيتِ أَبيهِ أَوْ أُمِّهِ حتَّى تأْتِيَهُ هَدِيَّتُهُ إِنْ كَانَ صَادِقاً، واللَّه لا يأْخُذُ أَحدٌ مِنْكُمْ شَيْئاً بِغَيْرِ حقِّهِ إلاَّ لَقِيَ اللَّه تَعالَى، يَحْمِلُهُ يَوْمَ الْقِيامَةِ، فَلا أَعْرفَنَّ أَحداً مِنْكُمْ لَقِيَ اللَّه يَحْمِلُ بعِيراً لَهُ رغَاءٌ، أَوْ بَقرة لَهَا خُوارٌ، أَوْ شَاةً تيْعَرُ ثُمَّ رفَعَ يَديْهِ حتَّى رُؤِيَ بَياضُ إبْطيْهِ فَقَالَ:"اللَّهُمَّ هَلْ بَلَّغْتُ" ثلاثاً، متفقٌ عليه.

హజ్రత్ అబూ హుమైద్ అబ్దుర్రహ్మాన్ బిన్ సాద్ సాయిదీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ అజ్ద్ తెగకు చెందిన ఒక వ్యక్తిని జకాత్ వసూళ్ళ కోసం ఉద్యోగిగా నియమించారు. అతణ్ణి ఇబ్నె లుత్‌బియ్యా అని పిలిచేవారు. అతను (జకాత్ వసూళ్ళు అయిపోయిన తరువాత) తిరిగివచ్చి, "ఈ సొమ్ము మీది. ఇది మాత్రం నాకు కానుకగా ఇవ్వబడింది" అని అన్నాడు.

అతను అన్నది విని దైవప్రవక్త ﷺ (మస్జిదులోని) వేదికపైకెక్కి దైవస్తోత్రం చేసిన తరువాత ఇలా అన్నారు –

"దేవుడు నాకు అప్పగించిన అధికారిక విషయాల్లోని (జకాత్ వసూళ్ళ) పనిపై ఒకర్ని నేను ఉద్యోగిగా నియమిస్తే, అతనేమో (వసూళ్ళు జరిగిన తరువాత) 'ఇది మీది. ఇది నాకు కానుకగా ఇవ్వబడింది' అని అంటున్నాడు. అలాగయితే అతను (జకాత్ పనిమీద వెళ్ళకుండా) తన తండ్రి ఇంట్లోనో, తల్లి ఇంట్లోనో ఎందుకు కూర్చొని ఉండలేదు? అతను (కానుకలని) చెబుతున్న సంగతి నిజమే అయితే (ఇంట్లో కూర్చొని ఉన్నా) ఈ కానుకలు అతనికి చేరాల్సిందిగా! దైవసాక్షిగా చెబుతున్నాను. మీలో ఎవరైనా సరే (జకాత్ వసూళ్ళలో) తన హక్కు (జీతం)కు మించి ఏమైనా తీసుకుంటే ప్రళయ దినాన అతనా వస్తువుని ఎత్తుకొని ఉన్న స్థితిలోనే దైవాన్ని కలుసుకుంటాడు. (అక్రమంగా ఒంటెను తీసుకుంటే) ఒంటెనెత్తుకొని ఉన్న స్థితిలోనే కలుస్తాడు. ఆ ఒంటె (అతని వీపుపై) విలవిల్లాడుతూ ఉంటుంది. (ఆవుని తీసుకుంటే) అరుస్తూ ఉండే ఆవునే ఎత్తుకొని కలుస్తాడు. (ఒకవేళ మేకను తీసుకుంటే) మేకనే ఎత్తుకొని కలుస్తాడు. అది (అతని వీపుపై) 'మేమే' అని అరుస్తూ ఉంటుంది. నేను మీలో ఎవరినీ ఆ స్థితిలో చూడకూడదు సుమా!"

ఇలా అని ఆయన తన రెండు చేతులూ పెకెత్తారు. అలా చేతులెత్తినప్పుడు ఆయన చంకల్లోని తెల్లదనం కనిపించింది. తరువాత ఆయన "ఓ అల్లాహ్! నేను (నీ సందేశాన్ని ప్రజలకు) అందజేశానా?" అని మూడుసార్లు అన్నారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని కానుకల ప్రకరణంలోనూ, జకాత్ ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని 'అప్పగింతల' ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

Abu Humaid bin Sa`d As-Sa`idi (May Allah bepleased with him) reported: The Prophet ﷺ employed a man from the tribe of Al-Azd named Ibn Lutbiyyah as collector of Zakat. When the employee returned (with the collections) he said: “(O Prophet ﷺ!) This is for you and this is mine because it was presented to me as gift.” Messenger of Allah ﷺ rose to the pulpit and praised Allah and extolled Him. Then he said, “I employ a man to do a job and he comes and says: `This is for you and this has been presented to me as gift’? Why did he not remain in the house of his father or the house of his mother and see whether gifts will be given to him or not? By Allah in Whose Hand is the life of Muhammad, if any one of you took anything wrongfully, he will bring it on the Day of Resurrection, carrying it on (his back), I will not recognize anyone of you, on the Day of Resurrection with a grunting camel, or a bellowing cow, or a bleating ewe.” Then he raised his hands till we could see the whiteness of his armpits. Then he said thrice, “O Allah ! have I conveyed (Your Commandments)”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు తీవ్రమైన మందలింపు ఉంది. నేడు చాలామంది ప్రభుత్వోద్యోగులు, అధికారులు తమ అధికారాన్ని ఆసరాగా చేసుకొని అక్రమంగా, అన్యాయంగా జేబులు నింపుకుంటున్నారు. ప్రజలు కూడా తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం అధికారులకు అనేక కానుకలూ, బహుమతులు సమర్పించుకుంటూ ఉంటారు. అలాంటి అవినీతిపరులైన అధికారుల్ని ఈ హదీసు పరలోక శిక్షకోసం నిరీక్షించమని హెచ్చరిస్తోంది. దీనిప్రకారం అధికారం ఆసరాతో సంపాదించిన ధనమంతా లంచంగానే పరిగణించబడుతుంది. లంచం తీసుకోవటం, ఇవ్వటం రెండూ అధర్మకార్యాలే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 211

212

హదీసు 212

وعن أَبي هُرِيْرَةَ رضي اللَّه عنه عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ كَانتْ عِنْدَه مَظْلمَةٌ لأَخِيهِ، مِنْ عِرْضِهِ أَوْ مِنْ شَيْءٍ، فَلْيتَحَلَّلْه ِمنْه الْيوْمَ قَبْلَ أَنْ لاَ يكُونَ دِينَارٌ وَلاَ دِرْهَمٌ، إنْ كَانَ لَهُ عَملٌ صَالحٌ أُخِذَ مِنْهُ بِقدْرِ مظْلمتِهِ، وإنْ لَمْ يَكُنْ لَهُ حسَنَاتٌ أُخِذَ مِنْ سيِّئَاتِ صاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ" رواه البخاري.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : మీలో ఎవరైనా సాటి సోదరుని మానమర్యాదలకు సంబంధించిన విషయంలోగాని, మరే విషయంలోనైనాగాని అతనిపై దౌర్జన్యానికి పాల్పడితే, (ఆ పాపాన్ని దూరం చేసుకోవటం కోసం) దీనార్లుగాని, దిర్హములుగాని లభించని రోజు దాపురించక ముందు – ఈ రోజే అతను ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. (లేకపోతే ఆ రోజు పాపాన్ని తొలగించే పద్ధతి ఎలాగుంటుందంటే) దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తి దగ్గర సత్కార్యాలు ఉంటే, అతన్నుండి అతని దౌర్జన్యానికి సమానంగా సత్కార్యాలు తీసుకొని (పీడితులకు పంచడం జరుగుతుంది). ఒకవేళ అతని దగ్గర సత్కార్యాలు అయిపోతే అతని ప్రత్యర్థి పాపాలను కూడా అతనిపైనే మోపటం జరుగు తుంది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: The Prophet ﷺ said, “He who has done a wrong affecting his brother’s honour or anything else, let him ask his forgiveness today before the time (i.e., the Day of Resurrection) when he will have neither a dinar nor a dirham. If he has done some good deeds, a portion equal to his wrong doings will be subtracted from them; but if he has no good deeds, he will be burdened with the evil deeds of the one he had wronged in the same proportion”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ప్రపంచంలో దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడి బాధితుల నుండి క్షమాభిక్ష పొందకుండా లేదా దాని పరిహారాన్ని చెల్లించకుండా మరణిస్తే పరలోకంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఈ హదీసు బోధిస్తోంది. కనుక సాటి మానవులను హింసించడంగాని, వారి హక్కులను కాజేయటంగాని చేస్తే చివరికి వినాశమే గతి అని గ్రహించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 212

213

హదీసు 213

وعن عبد اللَّه بن عَمْرو بن الْعاص رضي اللَّه عنهما عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الْمُسْلِمُ مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسانِهِ ويَدِهِ، والْمُهَاجِرُ مَنْ هَجَرَ مَا نَهَى اللَّه عَنْهُ "مُتَّفَقٌ عَلَيهِ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : తన నోటితోగాని, చేత్తోగాని ఇతర ముస్లింలకు బాధ కలగకుండా మసలుకునేవాడే (నిజమైన) ముస్లిం. దేవుడు వారించిన విషయాలకు దూరంగా ఉండేవాడే (వాస్తవానికి) 'ముహాజిర్' (అంటే దైవమార్గంలో ప్రస్థానం చేసేవాడు).

(బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని విశ్వాసప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.)

English

`Abdullah bin `Amr bin Al-`as (May Allah bepleased with them) reported: The Prophet ﷺ said, “A Muslim is the one from whose tongue and hands the Muslims are safe; and a Muhajir (Emigrant) is the one who refrains from what Allah has forbidden”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

తన మాటలవల్లగాని, చేతల వల్లగాని ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తపడేవాడే నిజమైన ముస్లిం అనబడటానికి అర్హుడు. అలాగే దైవ అవిధేయతకు దూరంగా ఉండేవాడే వాస్తవానికి ముహాజిర్. ఒక వ్యక్తి హిజ్రత్ (దైవమార్గంలో వలసపోవటం) చేసినప్పటికీ దైవ అవిధేయతను విడనాడకపోతే ఇక ఆ హిజ్రత్ వల్ల అతనికి ప్రయోజనం ఏముంటుంది? అసలు హిజ్రత్ అంటేనే దైవప్రసన్నత కోసం అన్నింటినీ వదలుకోవడం. మనిషి తన ప్రాంతాన్ని, ఆస్తీ అంతస్తుల్ని, బంధుమిత్రులందరినీ వదలుకొని దైవమార్గంలో వలసపోయినప్పటికీ, దేవుడు వారించిన విషయాలను విడిచిపెట్టి ఉండలేకపోతే దైవ సన్నిధిలో అతని 'ప్రస్థానం' ఒక ప్రహసనంగా మాత్రమే మిగిలిపోతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 213

214

హదీసు 214

وعنه رضي اللَّه عنه قَالَ: كَانَ عَلَى ثَقَل النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم رَجُلٌ يُقَالُ لَهُ كِرْكِرةُ، فَمَاتَ فَقَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "هُوَ في النَّارِ" فَذَهَبُوا يَنْظُرُونَ إِلَيْهِ فوَجَدُوا عَبَاءَة قَدْ غَلَّهَا. رواه البخاري.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం : దైవప్రవక్త సామాను పర్యవేక్షణ కోసం ఒక వ్యక్తి నియమితుడై ఉండేవాడు. అతణ్ణి 'కిర్‌కిరా' అని పిలిచేవారు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు దైవప్రవక్త ﷺ అతను నరకంలో ఉన్నాడని అన్నారు. (అది విని) ప్రజలు అతణ్ణి (పరిశీలనగా) చూడసాగారు. అప్పుడు ప్రవక్త సహచరులకు ఆ వ్యక్తి దగ్గర అతను (యుద్ధప్రాప్తి నుండి) దొంగిలించిన నల్లని చారలుగల దుప్పటి ఒకటి దొరికింది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణంలోనూ, ఇంకా సుననె ఇబ్నె మాజాలోని జిహాద్ ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

`Abdullah bin `Amr bin Al-`as (May Allah bepleased with them) reported: A man named Kirkirah, who was in charge of the personal effects of Messenger of Allah ﷺ passed away and the Prophet ﷺ said, “He is in the (Hell) Fire.” Some people went to his house looking for its cause and found there a cloak that he had stolen.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

అప్పగింతల్లో ద్రోహానికి పాల్పడటం, పరుల సొమ్మును దొంగిలించడం మహా పాతకం. ఈ ద్రోహబుద్ధి మనిషిని నరకానికి గొనిపోతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 214

215

హదీసు 215

وعن أَبي بَكْرَةَ نُفَيْعِ بنِ الحارثِ رضيَ اللَّه عنهُ عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّ الزَّمَانَ قَدِ اسْتَدَارَ كَهَيْئَتِهِ يَوْمَ خَلَقَ اللَّه السَّمواتِ والأَرْضَ: السَّنةُ اثْنَا عَشَر شَهْراً، مِنْهَا أَرْبَعَةٌ حُرُم: ثَلاثٌ مُتَوَالِيَاتٌ: ذُو الْقعْدة وَذو الْحِجَّةِ، والْمُحرَّمُ، وَرجُب الَّذِي بَيْنَ جُمادَي وَشَعْبَانَ، أَيُّ شَهْرٍ هَذَا؟ "قلْنَا: اللَّه ورسُولُهُ أَعْلَم، فَسكَتَ حَتَّى ظنَنَّا أَنَّهُ سَيُسمِّيهِ بِغَيْرِ اسْمِهِ، قَالَ: أَليْس ذَا الْحِجَّةِ؟ قُلْنَا: بلَى: قَالَ:"فأَيُّ بلَدٍ هَذَا؟ "قُلْنَا: اللَّه وَرسُولُهُ أَعلمُ، فَسَكَتَ حتَّى ظَنَنَّا أَنَّهُ سيُسمِّيهِ بغَيْر اسْمِهِ. قَالَ:"أَلَيْسَ الْبلْدةَ؟ "قُلْنا: بلَى. قَالَ:"فَأَيُّ يَومٍ هذَا؟ "قُلْنَا: اللَّه ورسُولُهُ أَعْلمُ، فَسكَتَ حَتَّى ظَنَنَّا أَنَّه سيُسمِّيهِ بِغيْر اسمِهِ. قَالَ:"أَلَيْسَ يَوْمَ النَّحْر؟ "قُلْنَا: بَلَى. قَالَ:"فإِنَّ دِماءَكُمْ وَأَمْوَالَكُمْ وأَعْراضَكُمْ عَلَيْكُمْ حرَامٌ، كَحُرْمَةِ يَوْمِكُمْ هَذَا في بَلَدِكُمْ هَذا في شَهْرِكم هَذَا، وَسَتَلْقَوْن ربَّكُم فَيَسْأْلُكُمْ عَنْ أَعْمَالِكُمْ، أَلا فَلا تَرْجِعُوا بَعْدِي كُفَّاراً يضْرِبُ بَعْضُكُمْ رِقَابَ بَعْضٍ، أَلاَ لِيُبلِّغِ الشَّاهِدُ الْغَائِبَ، فلَعلَّ بعْض مَنْ يبْلغُه أَنْ يَكُونَ أَوْعَى لَه مِن بَعْضِ مَنْ سَمِعه"ثُمَّ قال:"أَلا هَلْ بَلَّغْتُ، أَلا هَلْ بلَّغْتُ؟ "قُلْنا: نَعَمْ، قَالَ:"اللَّهُمْ اشْهدْ "متفقٌ عَلَيهِ.

హజ్రత్ అబూబక్రా నుఫై బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : నిస్సందేహంగా దేవుడు భూమ్యాకా శాలను సృష్టించిన నాటికి కాలం పరిభ్రమించింది (అంటే సృష్టి ప్రారంభంలో ఉండిన సంవత్సరాలు, నెలల తీరు పునఃప్రారంభమైనది. అరబ్బు బహు దైవారాధకులు మధ్యలో 'నసీ' అనే పేరుతో కల్పించుకున్న నెలలమార్పిడి విధానం రద్దు చేయబడింది). సంవత్సరానికి పన్నెండు మాసాలు. వాటిలో నాలుగు నిషిద్ధ మాసాలున్నాయి. మూడు మాసాలు వరుసగా వస్తాయి. అవి జుల్ ఖాదా, జుల్ హిజ్జ్, ముహర్రం, (నాల్గోది) జుమాదివు (స్సానియా)కు – షాబాన్‌కు మధ్య ఉండే 'ముజర్' తెగకు చెందిన రజబ్.

(ఆ తరువాత ఆయన ఇది ఏ నెల? అని ప్రశ్నించారు. దానికి మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని అన్నాం. మా జవాబు విని ఆయన మౌనంగా ఉండిపోయారు. మేము ఆయన ఏదైనా కొత్తపేరు చెబుతారేమో అనుకుంటుండగా అంతలోనే ఆయన "ఇది జుల్ హిజ్జా నెలకదూ?!" అని అడిగారు. దానికి మేము 'అవున'న్నాం. తరువాత ఆయన "ఇది ఏ నగరం?" అని అడిగారు. దానికి మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసని అన్నాం. అప్పుడు (కూడా) ఆయన మౌనంగానే ఉండిపోయారు. (ఆయన మౌనంగా ఉండిపోవటం చూసి) మేము ఏదన్నా కొత్త పేరుతో పిలుస్తారేమోననుకున్నాం. కాని అంతలోనే ఆయన "ఇది (మక్కా) నగరం కదూ?!" అని అడిగారు. దానికి మేము 'అవున'ని జవాబు చెప్పాం. ఆ తరువాత ఆయన "ఇవాళ ఏ రోజు?" అని అడిగారు. దానికి మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసని అన్నాం. అప్పుడు (మళ్ళీ) ఆయన మౌనంగా ఉన్నారు. అది చూసి ఆయన ఏదైనా కొత్త పేరు చెబుతారేమో అనుకున్నాం. అంతలో ఆయనే (స్వయంగా) "ఇవాళ ఖుర్బానీ రోజు కదూ?!" అని అడిగారు. దానికి మేము 'అవున'న్నాం.

అప్పుడు ఆయన ఇలా ఉపదేశించారు: "అయితే (వినండి) ఈ నెలలో, ఈ నగరంలో, ఈ రోజు గౌరవప్రదమైనట్లుగానే (పరస్పరం మీ మధ్య) మీ ధన, మాన ప్రాణాలు కూడా (ఎంతో) గౌరవప్రదమైనవి. త్వరలోనే మీరు మీ ప్రభువుని కలుసుకోనున్నారు. అప్పుడు ఆయన మిమ్మల్ని మీ కర్మల గురించి అడుగుతాడు. జాగ్రత్త! నా తదనంతరం మీరు ఒండొకరి మెడలు నరుక్కుంటూ అవిశ్వాసులై పోకండి. ఇక్కడ హాజరైన వారు హాజరుకాని వారికి (ఈ విషయాలు) తెలియజేయాలి సుమా! బహుశా మీరు తెలియజేసే వ్యక్తి, నేను చెప్పిన విషయాన్ని (ప్రత్యక్షంగా) విన్నవానికంటే బాగా గుర్తుపెట్టుకునేవాడు కావచ్చు.

ఆ తరువాత ఆయన, "ఇప్పుడు చెప్పండి! నేను (దైవసందేశాన్ని) మీకు అందజేశానా?" అని అడిగారు. దానికి మేము 'అవున'నన్నాం. అప్పుడు ఆయన "దేవా! నీవు (దీనికి) సాక్షిగా ఉండు" అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణంలోనూ, విద్యా ప్రకరణంలోనూ, హజ్ ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని ఖసామా ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

Abu Bakrah (May Allah bepleased with him) reported: The Prophet ﷺ said, “Time has completed its cycle and has come to the state of the day when Allah created the heavens and the earth. The year consists of twelve months of which four are inviolable; three of them consecutive – Dhul-Qa`dah, Dhul-Hijjah and Muharram and Rajab, the month of Mudar (tribe), which comes between Jumada and Sha`ban. What month is this?” We said, “Allah and His Messenger ﷺ know better”. The Prophet ﷺ remained silent for some time until we thought that he would give it a name other than its real name. Then asked, “Is it not (the month of) Dhul-Hijjah?”. We replied in the affirmative. He asked, “Which city is this?”. We replied: “Allah and His Messenger know better”. He remained silent until we thought that he would give it another name. He ﷺ asked, “Is it not Al-Baldah (Makkah)?” We said: “Yes”. He ﷺ asked, “What day is this?”. We said: “Allah and His Messenger know better.” He ﷺ remained silent until we thought that he would give it another name. He asked, “Is it not the day of An-Nahr (the sacrifice)?”. We replied in the affirmative. Thereupon he said, “Your blood, your property and your honour are inviolable to you all like the inviolablity of this day of yours, in this city of yours and in this month of yours. You will soon meet your Rubb and He will ask you about your deeds. So do not turn to disbelief after me by striking the necks of one another. Behold! Let him who is present here convey (this message ) to him who is absent; for many a person to whom a message is conveyed has more retentive memory than the one who hears it.” He ﷺ again said, “Have I conveyed the message to you? Behold! Have I conveyed the Commandments (of Allah) to you.” We submitted: “Yes”. He then said, “O Allah, bear witness (to this)”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. సృష్టి ప్రారంభం నుండి నెలలో ఇరవై తొమ్మిది లేక ముప్పై దినాలుంటాయని, సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయన్న నిర్ణయమే కొనసాగుతూ వచ్చింది. అయితే అరబ్బులు తమ స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా నెలల్లో మార్పులు చేసుకునేవారు. ఆ కాలంలో జుల్‌ఖాదా, జుల్ హిజ్జ్, ముహర్రం, రజ్జబ్ – ఈ నాలుగు నెలలూ గౌరవప్రదమైన మాసాలుగా పరిగణించబడేవి. ఈ నాలుగు మాసాల్లో వారు యుద్ధం, హత్యాప్రతీకారం లాంటి విధ్వంసక చర్యలకు దూరంగా ఉండాలి. కాని వారు తమ అవసరానికనుగుణంగా ఒక నిషిద్ధ మాసాన్ని సమ్మతమైన మాసంగా మార్చుకునేవారు. అలాగే ఒక సమ్మతమైన మాసాన్ని నిషిద్ధ మాసంగా చేసుకునేవారు. ఒక్కోసారి చాంద్రమాన సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిపెట్టటానికి చాంద్రమాన సంవత్సరానికి అదనంగా ఓ మాసాన్ని జోడించేవారు. ఈ నెలల మార్పిడీ విధానాన్నే అరబ్బులు 'నసీ' అని పిలిచేవారు. ఈ హదీసు వారు కల్పించుకున్న ఈ 'నసీ' విధానాన్నే ఖండిస్తోంది.
  2. ప్రజలు ఒండొకరి ధన, మాన ప్రాణాలను కాపాడాలి. వాటిని గౌరవప్రదమైనవిగా భావించాలి.
  3. పరలోకంలో ప్రభువు మానవులందరినీ తమ కర్మల విషయమై నిలదీస్తాడు.
  4. ధర్మబోధనలు విని వాటిని తమవరకే పరిమితం చేసుకోకుండా ఇతరులకు కూడా బోధించాలి. మనం ధర్మ విషయాలు బోధించే వ్యక్తి వాటిని మనకన్నా ఉత్తమంగా ఆచరించవచ్చు!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 215

216

హదీసు 216

وعن أَبي أُمَامةَ إِيَاسِ بنِ ثعْلَبَةَ الْحَارِثِيِّ رضي اللَّه عنه أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنِ اقْتَطَعَ حَقَّ امْريءٍ مُسْلمٍ بيَمِينِهِ فَقدْ أَوْجَبَ اللَّه لَه النَّارَ، وَحَرَّمَ عَلَيْهِ الْجَنَّةَ"فَقَالَ رجُلٌ: وإِنْ كَانَ شَيْئاً يسِيراً يَا رسولَ اللَّه؟ فَقَالَ:"وإِنْ قَضِيباً مِنْ أَرَاكٍ "رواه مسلم.

హజ్రత్ అబూ ఉమామా ఇయాస్ బిన్ సాలబా హారిసీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం (ఒకసారి) దైవప్రవక్త ﷺ, "(అసత్య) ప్రమాణం చేసి (తోటి) ముస్లిం హక్కుని లాక్కున్నవాడికి దేవుడు నరకాగ్నిని తప్పనిసరి చేశాడు. ఇంకా స్వర్గాన్ని అతనికొరకు నిషేధించాడు" అని అన్నారు. అది విని ఒక వ్యక్తి, "ఆ హక్కు ఎంత చిన్నదైనా (దేవుడు అలాగే చేస్తాడా)?" అని సందేహపడగా, దానికి ఆయన "అది పీలూ చెట్టు కొమ్మ అయినా సరే!" అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ప్రమాణాల ప్రకరణం)

English

Abu Umamah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Allah decrees the (Hell) Fire and debars Jannah for the one who usurps the rights of a believer by taking a false oath.” One man asked: “O Messenger of Allah! Even if it should be for an insignificant thing?” He said, “Even if it be a stick of the Arak tree (i.e., the tree from which Miswak sticks are taken)”.[Muslim].

ముఖ్యాంశాలు

తోటి మానవుల హక్కుల్ని కాలరాస్తే పరలోకంలో ఎదురయ్యే పర్యవసానం ఏమిటో ఈ హదీసు వివరిస్తోంది. అసలు మానవ హక్కులకు ఎంత విలువ ఉంటే దేవుడు వాటిని కొల్లగొట్టేవారికి ఇంత పెద్ద శిక్ష విధించి ఉంటాడన్నది ఆలోచించాల్సిన విషయం. తెలియక అలాంటి పాపం చేస్తే దేవుడు ఏనాటికైనా క్షమిస్తాడేమోగాని బుద్ధిపూర్వకంగా, దానిని ధర్మసమ్మతంగా భావించి చేస్తే మాత్రం శాశ్వతంగా నరక జ్వాలల మధ్య కాలుతూ ఉండాల్సిందే!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 216

217

హదీసు 217

وعن عَدِي بن عُمَيْرَةَ رضي اللَّه عنه قال: سَمِعْتُ رسولَ اللَّه يَقُول: "مَن اسْتَعْمَلْنَاهُ مِنْكُمْ عَلَى عَمَل، فَكَتَمَنَا مِخْيَطاً فَمَا فَوْقَهُ، كَانَ غُلُولا يَأْتِي بِهِ يوْم الْقِيامَةِ"فقَام إَلْيهِ رجُلٌ أَسْودُ مِنَ الأَنْصَارِ، كأَنِّي أَنْظرُ إِلَيْهِ، فَقَالَ: يَا رَسُول اللَّه اقْبل عني عملَكَ قال:"ومالكَ؟ "قَالَ: سَمِعْتُك تقُول كَذَا وَكَذَا، قَالَ:"وَأَنَا أَقُولُهُ الآنَ: مَنِ اسْتعْملْنَاهُ عَلَى عملٍ فلْيجِيء بقَلِيلهِ وَكِثيرِه، فمَا أُوتِي مِنْهُ أَخَذَ ومَا نُهِِى عَنْهُ انْتَهَى" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అదీ బిన్ ఉమైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: మేము మీలో ఎవరినయినా ఏదైనా పనికి ఉద్యోగిగా నియమించినప్పుడు అతను ఒక సూదిగాని లేదా అంతకన్నా పెద్ద (లేక చిన్న) వస్తువుని గాని దాచిపెట్టుకుంటే అది ద్రోహం అవుతుంది. ప్రళయదినాన అతను దాన్ని తన వెంట తీసుకొనే (దైవ సన్నిధికి) వస్తాడు."

అది విని అన్సార్లకు చెందిన నల్లటి వ్యక్తి ఒకడు లేచి నిలబడ్డాడు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళముందు కదలాడుతోంది. అతను దైవప్రవక్తతో "దైవప్రవక్తా! మీరు నాకు అప్పగించిన బాధ్యతను తిరిగి తీసేసుకోండి" అని అన్నాడు. దానికి ఆయన "ఏమయింది నీకు?" అని అడిగారు. అందుకతను, "మీరు ఇలా అన్నారుగా! (దాంతో నాకు భయం పట్టుకుంది)" అని విన్నవించుకున్నాడు. అతని జవాబు విని, "ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. మేము ఎవరినయినా ఏదైనా పనిపై నియమించగా అతను తనకు లభించిన దానిని – అది తక్కువైనా, ఎక్కువైనా – (మా దగ్గరికి) తీసుకురావాలి. అందులో అతనికి ఇచ్చింది తీసుకోవాలి. ఇవ్వనిది తీసుకోకుండా ఉండాలి" అని అన్నారు దైవప్రవక్త ﷺ (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

`Adi bin `Umairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Whosoever among you is appointed by us to a position and he conceals from us even a needle or less, it will amount to misappropriation and he will be called upon to restore it on the Day of Resurrection”. (`Adi bin `Umairah added:) A black man from the Ansar stood up – I can see him still – and said: “O Messenger of Allah, take back from me your assignment.” He (the Prophet ﷺ) said, “What has happened to you?” The man replied: “I have heard you saying such and such.” He ﷺ said, “I say that even now: Whosoever from you is appointed by us to a position, he should render an account of everything, big or small, and whatever he is given therefrom, he should take and he should desist from taking what is unlawful”.[Muslim].

ముఖ్యాంశాలు

  1. ప్రభుత్వోద్యోగులు తమ విధులను నిక్కచ్చిగా, నిజాయితీగా నిర్వర్తించాలి. ఉద్యోగ కార్యకలాపాల్లో ఏమాత్రం నమ్మకద్రోహానికి పాల్పడినా, పదవి ఆసరాలో అక్రమంగా డబ్బు సంపాదించినా దేవుని దృష్టిలో వారు నేరస్తులుగా పరిగణించబడతారు.
  2. ఉన్నతాధికారులు తమ క్రింది ఉద్యోగుల పనులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. విధి నిర్వహణలో ఉంటూనే దొడ్డిదారులగుండా డబ్బు సంపాదించే ఆస్కారం లేకుండా చేయాలి. లేకపోతే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా నేరంగానే పరిగణించబడుతుంది. ఇక ఉన్నతాధికారులు సైతం తమ క్రింది ఉద్యోగులతో కుమ్మక్కై ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో పాలుపంచుకుంటే ఇది మరీ దిగజారిన విషయం. నేడు మన సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే! అందుకే ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, లంచగొండితనం, కుంభకోణాలు లాంటి నేరాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 217

218

హదీసు 218

وعن عمر بن الخطاب رضي اللَّهُ عنه قَالَ: لمَّا كَانَ يوْمُ خيْبرَ أَقْبل نَفرٌ مِنْ أَصْحابِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَقَالُوا: فُلانٌ شَهِيدٌ، وفُلانٌ شهِيدٌ، حتَّى مَرُّوا علَى رَجُلٍ فقالوا: فلانٌ شهِيد. فَقَالَ النَّبِيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كلاَّ إِنِّي رَأَيْتُهُ فِي النَّارِ فِي بُرْدَةٍ غَلَّها أَوْ عبَاءَةٍ" رواه مسلم.

హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఖైబర్ సంగ్రామం జరిగిన నాడు దైవప్రవక్త సహచరులు కొందరు వచ్చి, ఆ వ్యక్తి అమరుడు (షహీద్), ఈ వ్యక్తి అమరుడు అని అనసాగారు. ఆ విధంగా వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర్నుంచి వెళుతూ ఇతను (కూడా) అమరవీరుడని అన్నారు. అది విని దైవప్రవక్త "అసంభవం, ఇతను ఒక దుప్పటిని దొంగిలించాడు. అందుకతను నరకంలో ఉండటం నేను చూశాను" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

`Umar bin Al-Khattab (May Allah bepleased with him) reported: On the day (of the battle) of Khaibar, some Companions of the Prophet ﷺ came and remarked: “So-and-so is a martyr and so-and-so is a martyr”. When they came to a man about whom they said: “So-and-so is a martyr,” the Prophet ﷺ declared, “No. I have seen him in Hell for a mantle (or cloak) which he has stolen”. [Muslim].

ముఖ్యాంశాలు

దైవమార్గంలో పోరాడి అమరగతి నొందినప్పటికీ సాటి మానవుల హక్కులను కొల్లగొట్టిన పాపం క్షమించబడదని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ఇంకా ముస్లింల ఉమ్మడి ఖజానాలో మోసానికి పాల్పడటం మహాపాపమని తెలుస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 218

219

హదీసు 219

وعن أَبي قَتَادَةَ الْحارثِ بنِ ربعي رضي اللَّه عنه عن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّهُ قَام فِيهمْ، فذَكَرَ لَهُمْ أَنَّ الْجِهادَ فِي سبِيلِ اللَّه، وَالإِيمانَ بِاللَّه أَفْضلُ الأَعْمالِ، فَقَامَ رَجلٌ فَقَالَ: يَا رَسُولَ اللَّه أَرَأَيْت إِنْ قُتِلْتُ فِي سَبِيلِ اللَّه، تُكَفِّرُ عنِي خَطَايَاىَ؟ فَقَالَ لَهُ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "نعَمْ إِنْ قُتِلْتَ فِي سَبِيلِ اللَّه وأَنْتَ صَابر مُحْتَسِبٌ، مُقْبِلٌ غيْرَ مُدْبرٍ" ثُمَّ قَالَ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"كيْف قُلْتَ؟ "قَالَ: أَرَأَيْتَ إِنْ قُتِلْتُ فِي سَبِيل اللَّه، أَتُكَفرُ عَنّي خَطَاياي؟ فَقَالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"نَعمْ وأَنْت صابِرٌ مُحْتَسِبٌ، مُقبِلٌ غَيْرَ مُدْبِرٍ، إِلاَّ الدَّيْن فَإِنَّ جِبْرِيلَ قال لِي ذلِكَ "رواه مسلم.

హజ్రత్ అబూ ఖతాదా హారిస్ బిన్ రిబ్‌యీ (రదియల్లాహు అన్హు) కథనం : ఒకసారి దైవప్రవక్త ﷺ ప్రజల మధ్య నిలబడి, దైవమార్గంలో పోరాడటం, దైవాన్ని విశ్వసించటం సత్కార్యాలన్నింటిలోకెల్లా శ్రేష్ఠమైన పని అన్నారు. దానికి ఒక వ్యక్తి లేచి, "దైవప్రవక్తా! నేను దైవమార్గంలో (పోరాడుతూ) చంపబడితే నా పాపాలన్నీ మన్నించబడతాయంటారా?" అని అడిగాడు. అందుకాయన, "అవును, నువ్వు సహనాన్ని ప్రదర్శిస్తూ, పుణ్యఫలాపేక్షతో, (యుద్ధభూమి నుండి) వెన్నుచూపి పారిపోకుండా, శత్రువులతో ఎదురొడ్డి పోరాడుతూ హత్య చేయబడినట్లైతే (నీ పాపాలన్నీ మన్నించబడతాయి)" అని అన్నారు. ఆ తరువాత ఆయనే అతనితో, "నువ్వడిగింది ఏమిటి? (ఇంకోసారి అడుగు)" అని అన్నారు. దానికతను, "నేను దైవమార్గంలో పోరాడుతూ చంపబడితే నా పాపాలన్నీ మన్నించబడతాయంటారా?" అని మళ్ళీ విన్నవించుకున్నాడు. అప్పుడతనికి సమాధానంగా, "అవును నువ్వు సహనాన్ని ప్రదర్శిస్తూ, పుణ్యాన్ని ఆశిస్తూ, వెన్ను చూపి పారిపోకుండా, శత్రువులతో ఎదురొడ్డి పోరాడుతూ చంపబడితే ఒక్క అప్పు తప్ప (మిగతా పాపాలన్నీ క్షమించబడతాయి) అప్పు మాత్రం క్షమించబడదు. ఎందుకంటే (అప్పు తీర్చకపోతే క్షమించబడదని) జిబ్రయీల్ (దూత) నాతో చెప్పారు" అని ఆయన అన్నారు.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం)

English

Abu Qatadah Al-Harith bin Rib`i (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Faith in Allah and striving in His Cause (Jihad) are the deeds of highest merit.” A man stood up said: “O Messenger of Allah! Tell me if I am killed in the Cause of Allah, will all my sins be forgiven?” He ﷺ replied, “Yes, if you are killed in the Cause of Allah while you are patient, hopeful of your reward and marching forward not retreating.” Then the Prophet ﷺ said to him, “Repeat what you have said.” The man said: “Tell me if I am killed in the Cause of Allah, will all my sins be remitted?”. He replied, “Yes, if you are martyred while you are patient, hopeful of your reward and march forward without retreating, unless, if you owe any debt, that will not be remitted. Angel Jibril told me that”.[Muslim].

ముఖ్యాంశాలు

అప్పు అనేది సాటి మానవుల హక్కు. దాన్ని తీర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అది క్షమించబడదు. కనుక ప్రతి ముస్లిం సాటి మానవుల హక్కుల్ని ఎగవేయకుండా తీసుకున్న అప్పుల్ని తీర్చడంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తపడాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 219

220

హదీసు 220

وعن أَبي هُريرةَ رضي اللَّه عنه، أَن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "أَتَدْرُون ما الْمُفْلِسُ؟ "قالُوا: الْمُفْلسُ فِينَا مَنْ لا دِرْهَمَ لَهُ وَلا مَتَاعَ. فَقَالَ:"إِنَّ الْمُفْلِسَ مِنْ أُمَّتِي مَنْ يَأْتِي يَوْمَ الْقيامةِ بِصَلاةٍ وَصِيَامٍ وزَكَاةٍ، ويأْتِي وقَدْ شَتَمَ هَذَا، وقذَف هذَا وَأَكَلَ مالَ هَذَا، وسفَكَ دَم هذَا، وَضَرَبَ هَذَا، فيُعْطَى هذَا مِنْ حسَنَاتِهِ، وهَذا مِن حسَنَاتِهِ، فَإِنْ فَنِيَتْ حَسَناتُه قَبْلَ أَنْ يقْضِيَ مَا عَلَيْهِ، أُخِذَ مِنْ خَطَايَاهُمْ فَطُرحَتْ علَيْه، ثُمَّ طُرِح في النَّارِ" رواه مُسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ (ఒకసారి తన సహచరులను) "దరిద్రుడంటే ఎవడో మీకు తెలుసా?" అని అడిగారు. "మా దృష్టిలో దిర్హములు (డబ్బు)గాని, (జీవన) సామగ్రిగాని లేనివాడు దరిద్రుడు" అని ఆయన సహచరులు సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "(కాని) నా అనుచర సమాజంలో దరిద్రుడు ఎవడంటే, ప్రళయదినాన ఒక వ్యక్తి నమాజులు, ఉపవాసాలు, జకాత్‌లు తన వెంట తీసుకొని వస్తాడు. (అయితే అతను ప్రపంచంలో) ఒకరిని తిట్టివుంటాడు, ఒకడిపై అపనింద మోపి ఉంటాడు. ఒకడి సొమ్మును (అక్రమంగా) తిని ఉంటాడు. ఒకణ్ణి హత్య చేసివుంటాడు. ఇంకొకణ్ణి కొట్టివుంటాడు. కనుక అతని పుణ్యకార్యాలన్నీ వారందరికీ పంచివేయబడతాయి. అతని సత్కార్యాలన్నీ అయిపోయి బాధితులకు రావాల్సిన హక్కులు ఇంకా బాకీ ఉంటే వారి పాపాలు అతని నెత్తిన వేయబడతాయి. ఆ విధంగా (తన సత్కార్యాలేమీ మిగలనందువల్ల) అతను నరకంలో పడవేయబడతాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని సత్కార్యాల ప్రకరణం)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “Do you know who is the bankrupt?” They said: “The bankrupt among us is one who has neither money with him nor any property”. He said, “The real bankrupt of my Ummah would be he who would come on the Day of Resurrection with Salat, Saum and Sadaqah (charity), (but he will find himself bankrupt on that day as he will have exhausted the good deeds) because he reviled others, brought calumny against others, unlawfully devoured the wealth of others, shed the blood of others and beat others; so his good deeds would be credited to the account of those (who suffered at his hand). If his good deeds fall short to clear the account, their sins would be entered in his account and he would be thrown in the (Hell) Fire”.[Muslim].

ముఖ్యాంశాలు

ముస్లింలు విధిగా నమాజ్, రోజా (ఉపవాసా)లను పాటిస్తూ, జకాత్ చెల్లిస్తూ ఉండాలన్న దాంట్లో సందేహం లేదు. అయితే వీటితో పాటు ముస్లింలు తమ నడవడికను, వ్యవహారాలను కూడా చక్కదిద్దుకోవాలి. ఆరాధనలతో పాటు లావాదేవీలలో కూడా ఉత్తమంగా మసలుకోవాలి. ఈ రెండింటిని సమాంతరంగా అమలుపరిచిన వాడే సాఫల్యం పొందుతాడు. దీనికి భిన్నంగా పై రెండింటిలో దేనిని విస్మరించినా అతనికి ముక్తి లభించకపోవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 220

221

హదీసు 221

وعن أُمِّ سَلَمةَ رضي اللَّه عنها، أَن رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّمَا أَنَا بشَرٌ، وَإِنَّكُمْ تَخْتَصِمُونَ إِلَيَّ، وَلَعَلَّ بَعْضَكُمْ أَنْ يَكُونَ أَلْحنَ بحُجَّتِهِ مِنْ بَعْض، فأَقْضِي لَهُ بِنحْو مَا أَسْمَعُ فَمَنْ قَضَيْتُ لَهُ بحَقِّ أَخِيهِ فَإِنَّمَا أَقْطَعُ لَهُ قِطْعَةً مِنَ النَّارِ" مُتَّفَقٌ عَلَيهِ."أَلْحَنَ"أَيْ: أَعْلَم.

హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: నిస్సందేహంగా నేను కూడా (మీలాంటి) మనిషినే. (తీర్పుకోసం) మీరు నా దగ్గరికి వివాదాలు తీసుకువస్తుంటారు. (ఆ సందర్భంలో) మీలో కొందరు (తమ పక్షాన ధర్మం లేకపోయినా) వాక్చాతుర్యంతో – తమ ప్రత్యర్థికన్నా బాగా వాదించినప్పుడు వారి మాటలు విని నేను (నిజమే అనుకొని) వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ధర్మం తన సోదరుని (ప్రత్యర్థి) పక్షాన ఉన్నప్పటికీ అతని హక్కు విషయంలో నేను ఏ (రెండవ) వ్యక్తికైనా అనుకూలంగా తీర్పు ఇస్తే, వాస్తవానికి నేనతనికి నిప్పు రవ్వ త్రుంచి ఇస్తున్నానని గ్రహించాలి.

(బుఖారీ – ముస్లిం)

'అల్‌హన్' అంటే బాగా తెలిసినవాడు, చురుకైనవాడు, వాక్చతురుడు అని అర్థం.

(సహీహ్ బుఖారీలోని ఆజ్ఞలు – ఆదేశాల ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని వ్యాజ్యాల ప్రకరణంలోనూ ఈ హదీసు ఉంది.)

English

Umm Salamah (May Allah bepleased with her) reported: Messenger of Allah ﷺ said, “Verily, I am only a human and the claimants bring to me (their disputes); perhaps some of them are more eloquent than others. I judge according to what I hear from them). So, he whom I, by my judgment, (give the undue share) out of the right of a Muslim, I in fact give him a portion of (Hell) Fire”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో దైవప్రవక్త ﷺ తాను కూడా మానవ మాత్రుణ్ణేనని స్వయంగా అంగీకరించారు. కనుక ఆయన కూడా ఎదుటివ్యక్తి వాక్చాతుర్యానికి, చురుకుదనానికి ప్రభావితులై అబద్ధాన్ని నిజమని భావించే అవకాశం ఉంది. కాని ధర్మం విషయంలో మాత్రం ఆయన వల్ల ఇలాంటి పొరపాట్లు జరగవు. ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత దైవానిదే కనుక అలాంటి సందర్భాల్లో ఆయన తన ప్రవక్తను అప్రమత్తం చేస్తూ ఉంటాడు.
  2. న్యాయనిర్ణేత తన ముందుకు వచ్చిన వాదప్రతివాదనల ఆధారంగానే తీర్పు ఇవ్వాలి. అలాగాకుండా కేవలం అనుమానంతోగాని లేదా తనకు నిజం తెలుసనిగాని తన యిష్టప్రకారం తీర్పులు ఇవ్వకూడదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 221

222

హదీసు 222

وعن ابنِ عمرَ رضي اللَّه عنهما قال قال رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " لَنْ يَزَالَ الْمُؤمِنُ فِي فُسْحَةٍ مِنْ دِينِهِ مَالَمْ يُصِبْ دَماً حَراماً "رواه البخاري.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధించారు : అన్యాయంగా ఒకడి రక్తాన్ని చిందించకుండా ఉన్నంతకాలం విశ్వాసికి అతని ధర్మం విశాలమనిపిస్తుంది.

(బుఖారీ)

(నహీహ్ బుఖారీలోని 'రక్తశుల్క' ప్రకరణం ప్రారంభంలో ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Ibn `Umar (May Allah bepleased with them) reported: Messenger of Allah ﷺ said, “A believer continues to guard his Faith (and thus hopes for Allah’s Mercy) so long as he does not shed blood unjustly”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

విశ్వాసి అన్యాయంగా హత్యకు ఒడిగట్టకుండా ఉన్నంతకాలం అతనికి ధర్మాన్ని ఆచరించే భాగ్యం లభిస్తూ ఉంటుంది లేదా సువిశాల దైవకారుణ్యం అతణ్ణి ఆవహించి ఉంటుంది. పై హదీసుకు రెండు భావాలూ వర్తించవచ్చు. రెండింటి సారాంశమూ ఒక్కటే. ఆ అన్యాయానికి ఒడిగట్టకుండా ఉన్నంతవరకు అతనిలో దైవకారుణ్యం పట్ల ఆశాజ్యోతి వెలుగుతూ ఉంటుంది. అతను దైవకరుణకు అర్హుడిగా పరిగణించబడతాడు. కాని అతను ఎవరినయినా అన్యాయంగా హత్య చేయగానే ఆ ఆశాజ్యోతి ఆరిపోయి అతను దైవకారుణ్యం పట్ల నిరాశా నిస్పృహలకు లోనయ్యే అవకాశముంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 222

223

హదీసు 223

وعن خَوْلَةَ بِنْتِ عامِرٍ الأَنْصَارِيَّةِ، وَهِيَ امْرَأَةُ حمْزَةَ رضي اللَّهُ عنه وعنها، قَالَتْ: سمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "إِنَّ رِجَالاً يَتَخَوَّضُونَ فِي مالِ اللَّهِ بِغَيْرِ حَقٍّ فَلهُمُ النَّارُ يَوْمَ الْقِيَامةِ" رواه البخاري.

దైవప్రవక్త ﷺ ఇలా అంటుండంగా తాను విన్నానని హజ్రత్ ఖౌలా బిన్తె ఆమిర్ అన్‌సారియ్యా (రదియల్లాహు అన్హా) – ఈమె హజ్రత్ హమ్జా గారి సతీమణి – తెలియజేశారు : కొంతమంది దేవుని ఖజానాను (ప్రజాధనాన్ని) అక్రమంగా ఖర్చుపెడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన నరకాగ్ని (సిద్ధంగా ఉంచబడుతుంది.) (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)

English

Khaulah bint `Thamir (May Allah bepleased with her) reported: Messenger of Allah ﷺ said, “Many people misappropriate (acquire wrongfully) Allah’s Property (meaning Muslims’ property). These people will be cast in Hell on the Day of Resurrection”.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ప్రజాధనాన్ని అక్రమంగా యిష్టం వచ్చినట్లు ఖర్చు చేయటం, ప్రజలందరికీ ఉపయోగపడే పనులపై గాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకోసం వినియోగించుకోవడం మహా పాపం, ఇలాంటి అవినీతికి పాల్పడిన వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం చెందకుండా మరణిస్తే పరలోకంలో నరకయాతనకు గురికావలసి ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|26. దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలనే ఆజ్ఞల గురించి……|హదీసు 223