హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 25. అమానతులు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 25వ అధ్యాయం: అమానతులు. ఈ అధ్యాయంలో 2 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 201 – 204) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

25. అమానతులు

↑ విషయ సూచిక

باب الأمر بأداء الأمانة

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَنْ تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَى أَهْلِهَا} [النساء: ٥٨]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ముస్లిములారా! ఎవరి అమానతులను వారికి అప్పగించమని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు." (అన్ నిసా : 58)

{إِنَّا عَرَضْنَا الْأَمَانَةَ عَلَى السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالْجِبَالِ فَأَبَيْنَ أَنْ يَحْمِلْنَهَا وَأَشْفَقْنَ مِنْهَا وَحَمَلَهَا الْأِنْسَانُ إِنَّهُ كَانَ ظَلُوماً جَهُولاً} [الأحزاب:٧٢]

మరోచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు : "మేము ఈ అమానతును ఆకాశాలముందూ, భూమిముందూ, పర్వతాలముందూ పెట్టాము. అవి దానిని మోయటానికి సిద్ధపడలేదు. దానికి భయపడ్డాయి. కాని మానవుడు దాన్ని తనపై మోపుకున్నాడు. నిస్సందేహంగా, అతడు అన్యాయం చేసుకున్నాడు, మూర్ఖుడు." (అల్ అహ్‌జాబ్ : 72)

గమనిక : పై సూక్తిలో అమానతు అంటే దేవుని ఆజ్ఞలు, విధులు, నిషేధాలని అర్థం. ఆ విధంగా యావత్తు షరీఅత్ (ధర్మం) ఒక అమానతు (అప్పగింత) లాంటిదే. దేవుడు భూమ్యాకాశాల్లో, పర్వతాల్లో ఒక రకమైన గ్రహణశక్తిని సృజించాడు. అందుకే అవి ఈ అప్పగింతను భరించడానికి వెనుకంజవేశాయి. దైవప్రవక్త ﷺ ఆనుకొని నిలబడి ఉపన్యాసం ఇచ్చే చెట్టు కొమ్మ దుఃఖించిందని హదీసుల ద్వారా తెలుస్తోంది. భూమ్యాకాశాల, పర్వతాల గ్రహణశక్తి కూడా అలాంటిదే!

English

“Verily! Allah commands that you should render back the trusts to those to whom they are due.” [An-Nisā’ 4:58]

“Truly, We did offer Al-Amanah (the trust or moral responsibility or honesty and all the duties which Allah has ordained) to the heavens and the earth, and the mountains, but they declined to bear it and were afraid of it (i.e., afraid of Allah’s torment). But man bore it. Verily, he was unjust (to himself) and ignorant (of its results)”. [Al-Aḥzāb 33:72]

201

హదీసు 201

عن أَبي هريرة، رضي اللَّه عنه، أن رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: " آيَةُ المُنَافِقِ ثَلاثٌ: إِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا وَعَدَ أَخْلَفَ، وإِذَا آؤْتُمِنَ خَانَ" متفقٌ عَلَيهِ. وفي رواية: "وَإِنْ صَامَ وَصَلَّى وزعَمَ أَنَّهُ مُسْلِمٌ ".

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు : మూడు విషయాల ద్వారా కపటిని గుర్తించవచ్చు. అతను మాట్లాడితే అబద్ధం పలుకుతాడు, ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని భంగపరుస్తాడు, ఇంకా అతని దగ్గర అమానతు (అప్పగింత)ను ఉంచితే అందులో ద్రోహానికి పాల్పడతాడు.

(బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో, "ఒకవేళ అతను నమాజ్ చేసినా, ఉపవాసాలు పాటించినా, తన్ను తాను ముస్లింగా భావించినాసరే (అతను కపటిగానే పరిగణించబడతాడు)" అని ఉంది.

(సహీహ్ బుఖారీలోని విశ్వాస ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

Abu Hurairah (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ said, “There are three signs of a hypocrite: When he speaks, he lies; when he makes a promise, he breaks it; and when he is trusted, he betrays his trust.”[Al-Bukhari and Muslim].

Another narration adds the words: ‘Even if he observes fasts, performs Salat and asserts that he is a Muslim”.

ముఖ్యాంశాలు

మనసులో ఇస్లాం మరియు ముస్లింలతో విరోధాన్ని, అక్కసును దాచిపెట్టుకుని పైకి మాత్రం తాను ముస్లింనని చెప్పుకునేవాడిని 'మునాఫిక్' (కపట విశ్వాసి) అని అంటారు. ఈ కపట స్వభావం 'కుఫ్ర్' (దైవతిరస్కారం) కన్నా హేయమైనది. అందుకే దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశానికి పోతారు" (అన్ నిసా : 145). దైవప్రవక్త ﷺ కాలంలో ఇలాంటి కపటులు అనేకమంది ఉండేవారు. దేవుడు ఆయనకు వహీ ద్వారా వారందరి పేర్లనూ తెలియజేశాడు. కాని ప్రస్తుత కాలంలో ఇలాంటి కపటులను గుర్తించడం చాలా కష్టం. కనుక ఇప్పుడు ఎవరినీ కపటులని అనడానికి వీల్లేదు. దైవప్రవక్త తదనంతరం వహీ (దైవవాణి) అవతరణ ఆగిపోయింది. ప్రజల మనసులో దాగివున్న కపట స్వభావాన్ని తెలుసుకోవడం ఇక అసాధ్యం. అయితే నేడు ముస్లింలలోనూ ఆచరణపరమైన కాపట్యం సామాన్యమైపోవడం శోచనీయం. హదీసులో సూచించబడిన కపట చేష్టల్ని ముస్లింలు కూడా అవలంబిస్తున్నారు. ఇది ఆచరణపరమైన కాపట్యమే గాని విశ్వాసపరమైన కాపట్యం కాదు. ఇస్లాంపై అపనమ్మకంతో కపట చేష్టలకు పాల్పడితే అది కుఫ్ర్ అవుతుంది. అయితే ఆచరణపరమైన కాపట్యం కూడా చాలా ప్రమాదకరమైనదే. కనుక ముస్లింలు అలాంటి చేష్టలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. లేకపోతే వారు కూడా క్రమక్రమంగా కాపట్యగోతిలో పడిపోయే అవకాశముంది!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|25. అమానతులు|హదీసు 201

202

హదీసు 202

وعن حُذيْفَة بنِ الْيمانِ، رضي اللَّه عنه، قَالَ: حدثنا رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، حَديثْين قَدْ رَأَيْتُ أَحدهُمَا، وَأَنَا أَنْتظرُ الآخَرَ: حدَّثَنا أَنَّ الأَمَانَة نَزلتْ في جَذْرِ قُلُوبِ الرِّجَالِ، ثُمَّ نَزَلَ الْقُرآنُ فَعلموا مِنَ الْقُرْآن، وَعلِمُوا مِنَ السُّنَّةِ، ثُمَّ حَدَّثنا عَنْ رَفْعِ الأَمانَةِ فَقال: "يَنَامُ الرَّجل النَّوْمةَ فَتُقبضُ الأَمَانَةُ مِنْ قَلْبِهِ، فَيظلُّ أَثَرُهَا مِثْلَ الْوَكْتِ، ثُمَّ ينامُ النَّوْمَةَ فَتُقبضُ الأَمَانَةُ مِنْ قَلْبِهِ، فَيظَلُّ أَثَرُهَا مِثْل أثرِ الْمَجْلِ، كجَمْرٍ دَحْرجْتَهُ عَلَى رِجْلكَ، فَنفطَ فتَراه مُنْتبراً وَلَيْسَ فِيهِ شَيءٌ"ثُمَّ أَخذَ حَصَاةً فَدَحْرجَهَا عَلَى رِجْلِهِ، فَيُصْبحُ النَّاسُ يَتبايَعونَ، فَلا يَكادُ أَحَدٌ يُؤدِّي الأَمَانَةَ حَتَّى يُقَالَ: إِنَّ في بَنِي فَلانٍ رَجُلاً أَمِيناً، حَتَّى يُقَالَ لِلَّرجلِ: مَا أَجْلدهُ مَا أَظْرَفهُ، مَا أَعْقلَهُ، وَمَا في قلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِنْ خَرْدَلِ مِنْ إِيمانٍ. وَلَقَدْ أَتَى عَلَيَّ زَمَانٌ وَمَا أُبَالِي أَيُّكُمْ بايعْتُ، لَئِنْ كَانَ مُسْلماً ليردُنَّهُ عَليَّ دِينُه، ولَئِنْ كَانَ نَصْرانياً أَوْ يَهُوديًّا لَيُرُدنَّهُ عَلَيَّ سَاعِيه، وأَمَّا الْيَوْمَ فَما كُنْتُ أُبايُعُ مِنْكمْ إِلاَّ فُلاناً وَفلاناً "متفقٌ عَلَيهِ. قوله:"جَذْرُ"بفتح الجيم وإسكان الذال المعجمة: وَهُوَ أصل الشيء. وَ"الوكت"بالتاء المثناة من فوق: الأثر اليسير."والمجل"بفتح الميم وإسكان الجيم, وَهُوَ تَنَفُّطٌ في اليدِ ونحوها من أثرِ عمل وغيرِهِ. قوله:"مُنْتَبراً": مرتفِعاً. قوله:"ساعِيهِ": الوالي عَلَيهِ.

హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మాకు (భవిష్యత్తులో జరగబోయే) రెండు విషయాలు చెప్పారు. అందులో ఒకటి (నిజమయింది. దాన్ని నేను కళ్ళారా) చూశాను. ఇక రెండవ దానికోసం – ఎదురుచూస్తున్నాను. ఆయన మాతో ఇలా చెప్పి ఉన్నారు: "(ముందు) నిజాయితి ప్రజల హృదయాల్లో వ్రేళ్ళూనుకుంది (అంటే నిజాయితి మానవ సహజధర్మం అన్నమాట). ఆ తరువాత దివ్యఖుర్‌ఆన్ అవతరించింది. అప్పుడు వారు ఖుర్‌ఆన్ మరియు ప్రవక్త బోధనల ద్వారా దాని గురించి (మరింత వివరంగా) తెలుసుకున్నారు (అంటే మానవ సహజధర్మాన్ని ఖుర్‌ఆన్, హదీసుల ద్వారా ఇంకా బాగా ఆకళింపు చేసుకున్నారని అర్థం.)

ఆ తరువాత మనిషి హృదయం నుండి నిజాయితీ అడుగంటిపోవడం గురించి వివరిస్తూ ఆయన ఇలా అన్నారు : మనిషి ఒకసారి పడుకున్నప్పుడు అతని హృదయం నుండి నిజాయితీని స్వాధీనపరచుకోవటం జరుగుతుంది. దాంతో (గాయం నయమయిపోయిన తరువాత) మిగిలిన మచ్చ లాగా నిజాయితి తాలూకు ఒక చిన్న మచ్చ మాత్రమే అక్కడ ఉండిపోతుంది.

ఆ తరువాత అతను (రెండవసారి) పడుకున్నప్పుడు (మిగిలిపోయిన) నిజాయితీని కూడా తీసేయడం జరుగుతుంది. దాంతో ఒక నిప్పు రవ్వ కాలి మీద దొర్లినప్పుడు బొబ్బవచ్చి ఎలా ఉబ్బెత్తుగా కనిపిస్తుందో నిజాయితి తాలూకు గుర్తుకూడా అలాగే కనిపిస్తుంది. ఆ బొబ్బ లోపల ఏమీ ఉండదు (మనిషి నిజాయితీ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది). ఈ విషయం చెబుతూ ఆయన (ప్రజలకు అర్థం కావటం కోసం) ఒక కంకర రాయిని చేతిలోకి తీసుకొని దానిని తన కాలిపై దొర్లించారు.

(ఆ తరువాత ఇలా అన్నారు:) ప్రజలు అమ్మకాలు, కొనుగోళ్ళయితే చేస్తారు. కాని వారిలో ఎవరికీ ప్రజలు భద్రపరచమని ఇచ్చిన అమానతులను అప్పగించాలన్న ధ్యాసే ఉండదు. ఆఖరికి ప్రజలు "ఫలానా తెగలో ఎంతో నిజాయితీపరుడైన మనిషి ఉండేవాడు" అని అంటారు. (అంటే నిజాయితీపరులు అరుదైపోతారన్నమాట. అలాగే ప్రజల విశ్వాసం కూడా క్షీణించిపోతుంది) "(ఫలానా వ్యక్తి విశ్వాసంలో) ఎంత గట్టివాడు! ఎంత వివేకి!! ఎంత బుద్ధిమంతుడు!!!" అని ప్రశంసిస్తారు గాని నిజానికి అతని హృదయంలో ఆవగింజంత విశ్వాసం కూడా ఉండదు.

(హదీసు ఉల్లేఖకులు హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు:) నిస్సందేహంగా చెబుతున్నాను. ఒకప్పుడు నేను మీలో ఎవరితో క్రయవిక్రయాలు జరుపుతున్నానన్న విషయాన్ని అసలు పట్టించుకునే వాణ్ణే కాదు. ఎందుకంటే (నేను వ్యవహారం జరుపుతున్న) వ్యక్తి ముస్లిం అయితే అతని (ఇస్లాం) ధర్మం నాకు రావలసిన హక్కును నాకు ఇప్పిస్తుందన్న నమ్మకం నాకు ఉండేది. ఒకవేళ ఆ వ్యక్తి క్రైస్తవుడో లేక యూదుడో అయివుంటే అతని పర్యవేక్షకుడు నాకు నా వస్తువుని ఇప్పించేవాడు (ఆ కాలంలో నిజాయితీ, విశ్వాసాలు గాలి, నీరులా సర్వత్రా వ్యాపించి ఉండేవి కనుక నాకు నష్టం కలుగుతుందన్న భయం లేకపోయింది). కాని నేడు (పరిస్థితులు మారిపోయాయి కాబట్టి) నేను మాలో ఫలానా (నమ్మకస్తు లైన) వ్యక్తులతోనే అమ్మకం, కొనుగోళ్ళ వ్యవహారం జరుపుతాను.

(బుఖారీ – ముస్లిం)

'జజ్‌ర్' అంటే వస్తువులోని తొలి భాగం పేరు. 'వక్త్' అంటే చిన్న మచ్చ. 'మజ్ల్' అంటే పని చేయటం వల్ల చేతులకూ, కాళ్ళకీ బొబ్బలు రావటం. 'ముంతబిరన్' అంటే ఉబ్బినది. 'సాయి' అంటే బాధ్యుడు, పర్యవేక్షకుడు.

(సహీహ్ బుఖారీలోని ప్రేమైక వచనాల ప్రకరణంలోనూ ఉపద్రవాల ప్రకరణంలోనూ ఇంకా సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీసు పేర్కొనబడింది.)

English

Hudhaifah bin Al-Yaman (May Allah bepleased with him) reported: Messenger of Allah ﷺ foretold to us two Ahadith. I have seen one (being fulfilled), and I am waiting for the other. He ﷺ told us, “Amanah (the trust) descended in the innermost (root) of the hearts of men (that is, it was in their heart innately, by Fitrah, or pure human nature). Then the Qur’an was revealed and they learnt from the Quran and they learned from the Sunnah.” Then the (Prophet ﷺ) told us about the removal of Amanah. He said, “The man would have some sleep, and Amanah would be taken away from his heart leaving the impression of a faint mark. He would again sleep, and Amanah would be taken away from his heart leaving an impression of a blister, as if you rolled down an ember on your foot and it was vesicled. He would see a swelling having nothing in it.” He (the Prophet ﷺ) then took up a pebble and rolled it over his foot and said, “The people would enter into transactions with one another and hardly a person would be left who would return (things) entrusted to him (and there would look like an honest person) till it would be said: `In such and such tribe there is a trustworthy man.’ And they would also say about a person: `How prudent he is! How handsome he is and how intelligent he is!’ whereas in his heart there would be no grain of Faith.” Hudhaifah bin Al-Yaman (May Allah bepleased with him) added: I had a time when I did not care with whom amongst you I did business, I entered into a transaction, for if he were a Muslim, his Faith would compel him to discharge his obligation to me; and if he were a Christian or a Jew, his guardian (surety) would compel him to discharge his obligation to me. But today I would not enter into a transaction except with so-and-so.[Al-Bukh ri and Muslim].

ముఖ్యాంశాలు

"అమానత్" (నిజాయితి) అన్న పదానికి చాలా విస్తృతమైన భావముంది. ధర్మాదేశాలను పరిరక్షించడం, వ్యవహారాల్లో కచ్చితంగా ఉండటం, హక్కుదారులకు వారి హక్కులను అప్పగించడం ఇవన్నీ కూడా అమానత్ క్రిందికే వస్తాయి. పోను పోను సమాజంలో పొడసూపే నీతిరాహిత్యం వల్ల రోజు రోజుకీ ప్రజల హృదయాల నుంచి ఈ అమానత్ (నిజాయితీ) భావన క్షీణించి పోతుందని పై హదీసు ద్వారా తెలుస్తోంది. ఆఖరికి లోకంలో నిజాయితీ అనేది హదీసులో వివరించబడిన స్థాయికి కొడిగట్టుకుపోతుంది. ప్రస్తుతకాలంలో మన సమాజంలో కూడా నిజాయితి చాలా అరుదైపోయింది. ఇది దైవప్రవక్త పలుకుల్లోని సత్యసంధతకు ప్రబల నిదర్శనం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|25. అమానతులు|హదీసు 202

203

హదీసు 203

وعن حُذَيْفَةَ، وَأَبي هريرة، رضي اللَّه عنهما، قالا: قالَ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "يَجْمعُ اللَّه، تَباركَ وَتَعَالَى، النَّاسَ فَيُقُومُ الْمُؤمِنُونَ حَتَّى تَزْلفَ لَهُمُ الْجَنَّةُ، فَيَأْتُونَ آدَمَ صلواتُ اللَّه عَلَيْهِ، فَيَقُولُون: يَا أَبَانَا اسْتفْتحْ لَنَا الْجَنَّةَ، فَيقُولُ: وهَلْ أَخْرجكُمْ مِنْ الْجنَّةِ إِلاَّ خَطِيئَةُ أَبِيكُمْ، لَسْتُ بصاحبِ ذَلِكَ، اذْهَبُوا إِلَى ابْنِي إبْراهِيمَ خَلِيل اللَّه، قَالَ: فَيأتُونَ إبْرَاهِيمَ، فيقُولُ إبْرَاهِيمُ: لَسْتُ بصَاحِبِ ذَلِك إِنَّمَا كُنْتُ خَلِيلاً مِنْ وَرَاءَ وراءَ، اعْمَدُوا إِلَى مُوسَى الَّذِي كَلَّمهُ اللَّه تَكْلِيماً، فَيَأْتُونَ مُوسَى، فيقُولُ: لسْتُ بِصَاحِب ذلكَ، اذْهَبُوا إِلَى عِيسى كَلِمَةِ اللَّه ورُوحِهِ فَيقُولُ عيسَى: لَسْتُ بِصَاحِبِ ذلكَ. فَيَأْتُونَ مُحَمَّداً صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَيَقُومُ فَيُؤْذَنُ لَهُ، وَتُرْسَلُ الأَمانَةُ والرَّحِمُ فَيَقُومَان جنْبَتَي الصراطِ يَمِيناً وشِمالاً، فيَمُرُّ أَوَّلُكُمْ كَالْبَرْقِ"قُلْتُ: بأَبِي وَأُمِّي، أَيُّ شَيءٍ كَمَرِّ الْبَرْقِ؟ قَالَ:"أَلَمْ تَرَوْا كَيْفَ يمُرُّ ويَرْجعُ في طَرْفَةِ عَيْنٍ؟ ثُمَّ كَمَرِّ الريحِ ثُمَّ كَمرِّ الطَّيْرِ؟ وَأَشَدُّ الرِّجالِ تَجْرِي بهمْ أَعْمَالُهُمْ، ونَبيُّكُمْ قَائِمٌ عَلَى الصرِّاطِ يَقُولُ: رَبِّ سَلِّمْ سَلِّمْ، حَتَّى تَعْجِزَ أَعْمَالُ الْعَبَادِ، حَتَّى يَجئَ الرَّجُلُ لا يَسْتَطِيعُ السَّيْرَ إلاَّ زَحْفاً، وفِي حافَتَي الصرِّاطِ كَلالِيبُ مُعَلَّقَةٌ مَأْمُورَةٌ بأَخْذِ مَنْ أُمِرَتْ بِهِ، فَمَخْدُوشٌ نَاجٍ وَمُكَرْدَسٌ في النَّارِ" وَالَّذِي نَفْسُ أَبِي هُرَيْرَةَ بِيَدِهِ إِنَّ قَعْرَ جَهنَّم لَسبْعُونَ خَريفاً. رواه مسلم. قوله:"ورَاءَ وَرَاءَ"هُو بالْفَتْحِ فِيهمَا. وَقيل: بِالضَّمِّ بِلا تَنْوينٍ، وَمَعْنَاهُ: لسْتُ بتلْكَ الدَّرَجَةِ الرَّفيعَةِ، وهِي كَلِمةٌ تُذْكَرُ عَلَى سبِيل التَّواضُعِ. وَقَدْ بسِطْتُ مَعْنَاهَا في شَرْحِ صحيح مسلمٍ، واللَّه أعلم.

హజ్రత్ హుజైఫా మరియు అబూహురైరా (రదియల్లాహు అన్హుమా)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: (ప్రళయదినాన) అల్లాహ్ మానవులందరినీ (హష్ర్ స్థలంలో) సమీకరిస్తాడు. అప్పుడు విశ్వాసులు లేచి నించుంటారు. స్వర్గం వారికి దగ్గరగా తీసుకురాబడుతుంది. (దాంతో ఎప్పుడు స్వర్గంలోకి ప్రవేశిస్తామా అన్న ఆతురతతో) వాళ్ళందరూ (కలిసి) హజ్రత్ ఆదం (అలైహి) దగ్గరికి వెళ్ళి, "తండ్రీ! మా కోసం స్వర్గం (ద్వారాల)ను తెరిపించండి" అని అంటారు. దానికి ఆయన, "(అయ్యో! మీకు తెలియదా?!) మీ తండ్రి చేసిన పొరపాటే కదా మిమ్మల్ని స్వర్గం నుండి తీయించింది! కనుక నేను (మీ గురించి సిఫారసు చేసేందుకు) తగినవాడ్ని కాను, మీరు దేవుని స్నేహితుడైన నా కుమారుడు ఇబ్రాహీం దగ్గరికి వెళ్ళండి (ఆయన మీకోసం సిఫారసు చేయగలరు)" అని సమాధానమిస్తారు.

హజ్రత్ ఆదం -అలైహి- సమాధానం విని వాళ్ళంతా ఇబ్రాహీం (అలైహి) వద్దకు చేరుకుంటారు. ఆయన కూడా, "నేను అల్లాహ్ మిత్రుణ్ణన్న సంగతి నిజమేగాని నా స్థాయి మీ గురించి సిఫారసు చేసేటంతటిది కాదు. మీరు మూసా వద్దకు వెళ్ళండి (ఆయన మీ కోసం సిఫారసు చేయగలరు). ఆయనతో దేవుడు (ప్రత్యక్షంగా) మాట్లాడాడు" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తారు.

ఆ తరువాత వాళ్ళు మూసా -అలైహి- దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా తాను ఆ పనికి యోగ్యుణ్ణి కానని, మీరు ఈసా -అలైహి- దగ్గరికి వెళ్ళండి, ఆయన దేవుని వచనం మరియు దైవాత్మ (కనుక మీ పని చేసిపెట్టగలరు) అని బదులిస్తారు. (దాంతో వాళ్ళంతా ఈసా -అలైహి- దగ్గరికి వెళ్ళగా) ఆయన కూడా తాను అందుకు తగినవాణ్ణి కానని సున్నితంగా తిరస్కరిస్తారు.

ఆఖరికి వాళ్ళంతా ముహమ్మద్ (అంటే నా) దగ్గరికి వస్తారు. ముహమ్మద్ నించుంటారు. (ప్రజల విషయంలో సిఫారసు చేయడానికి) ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. నిజాయితి మరియు బంధుత్వాలను విడిచిపెట్టడం జరుగుతుంది. అవి రెండూ వచ్చి 'నరక వంతెన' (పుల్‌సిరాత్)కు ఇరుప్రక్కలా కుడి, ఎడమ దిశల్లో నించుంటాయి. (తరువాత ప్రజలు ఆ వంతెనను దాటడం ప్రారంభిస్తారు). అయితే మీలోని తొలి సమూహం మెరుపులా ఆ వంతెనను దాటుతుంది. (హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు: ఈ మాట విని) నేను, "దైవప్రవక్తా! నా తల్లిదండ్రులను మీకు అర్పింతును గాక! మెరుపులా దాటటమంటే ఏమిటి? (నాకు అర్థం కాలేదు!)" అని అడిగాను. దానికి ఆయన "మెరుపు రెప్పపాటులో ఎలా మెరిసి వెళ్ళిపోతుందో నీవు చూడలేదా?!" అని అన్నారు.

ఆ తరువాత (రెండవ సమూహం) వాయు వేగంతో వంతెన దాటి వెళ్ళిపోతుంది. ఆ తరువాత (వచ్చే సమూహం) పక్షివేగంతో దాటి వెళ్ళిపోతుంది. ఇంకా కాళ్ళపై పరిగెత్తే అత్యంత గట్టి మనుషుల్ని వారి ఆచరణలు (వంతెనను) దాటిస్తాయి. మీ ప్రవక్త (నేను) ఆ వంతెనపై నించొని, "ప్రభూ! రక్షించు, రక్షించు" అని అంటూ ఉంటాడు. చివరికి కొంతమంది దాసులు చేసుకున్న (మంచి) పనులు (వారిని వంతెన నుండి వేగంగా) తీసుకెళ్ళ లేకపోతాయి. ఒక వ్యక్తి అయితే అసలు నడవలేక కాళ్లు ఈడ్చుకుంటూ వెళతాడు. ఆ నరకవంతెన కిరుప్రక్కలా (కొక్కెముల మాదిరిగా) ముళ్లు వ్రేలాడబడి ఉంటాయి. చెప్పిన వాళ్ళని పట్టుకోమని వాటికి ఆజ్ఞ ఇవ్వబడి ఉంటుంది. కనుక కొంతమంది (ఆ వంతెన దాటుతూ) గాయపడినప్పటికీ (నరకం నుండి) బయటపడతారు. కాని మరికొంత మందిని నరకంలో బోర్లాపడేయడం జరుగుతుంది. ఎవరి చేతిలోనైతే అబూహురైరా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. నిస్సందేహంగా నరకం డెబ్బై సంవత్సరాల (వ్యవధి అంత) లోతు ఉంటుంది. (ముస్లిం)

'వరా' అంటే ఆ మహోన్నత స్థానానికి నేను తగిన వాడిని కాదు అని అర్థం. అణకువను వ్యక్తీకరించడం కోసం ఈ పదాన్ని వాడతారు. ముస్లిం గ్రంథ తాత్పర్యంలో నేను ఈ పదం యొక్క భావాన్ని సవివరంగా తెలియజేశాను. వల్లాహు ఆలము.

(సహీహ్ ముస్లింలోని విశ్వాస ప్రకరణం)

English

Hudhaifah and Abu Hurairah (May Allah bepleased with them) reported that they heard Messenger of Allah ﷺ saying, “Allah will assemble mankind, and the believers will stand till Jannah will be brought near them. They will then go to Adam ﷺ and say, `O our father, ask (Allah (SWT), that Jannah may be opened for us, but he will reply: `There was nothing that put you out of Jannah except your father’s sin. I am not the one to do that, go to my son Ibrahim (Abraham), the beloved man of Allah.’ Then Ibrahim ﷺ when approached, will say: `I am not the one to do that, for I was only a friend; and that is not a lofty status but ask Musa (Moses) to whom Allah spoke.’ They will then go to Musa ﷺ but he will say: `I am not the one to do that; go to `Isa (Jesus), Allah’s Word and spirit.’ `Isa ﷺ will say: `I am not the one to do that.’ So they will come to me; and I will stand and be given permission. Amanah and ties of relationship will be sent forth and will stand on the sides of the Sirat (that is, the Bridge set over Hell-fire) right and left, and the first of you will pass like lightning.” I said (that is Abu Hurairah (May Allah bepleased with him)” :I ransom you with my father and mother, what is like the movement of lightning?” The Messenger of Allah replied, “Have you not seen how the lightning goes and returns in the twinkling of an eye? Next (group will pass) like the passing of the breeze, next like the passing of a bird, and the next with the speed of a running man, according to the quality of their deeds. (During all this time) your Prophet ﷺ will remain standing on the Bridge saying: `O my Rubb, keep (them) safe, keep (them) safe,’ till men’s deeds are so weak that a man comes who will be able only to crawl. On both sides of the Bridge pronged flesh hooks, placed under command will be hung and will seize those about whom they receive command, some people being lacerated and escaping and others being thrown violently into Hell.” Abu Hurairah added: By Him in Whose Hand Abu Hurairah’s soul is, the pit of Jahannam (Hell) is seventy years in depth.[Muslim].

ముఖ్యాంశాలు

  1. ఈ హదీసులో చెప్పబడిన మొదటి విషయం ఏమిటంటే, హష్ర్ స్థలంలో మానవుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. దైవప్రవక్తలు కూడా దైవసన్నిధిలో హాజరు కావడానికి, దైవం ముందు పల్లెత్తు మాట మాట్లాడటానికి జంకుతూ ఉంటారు. ఆఖరికి ప్రవక్తల నాయకుడైనటువంటి ముహమ్మద్ ﷺ కూడా "ప్రభూ! రక్షించు, రక్షించు" అని శరణు వేడుకుంటారంటే ఇక సామాన్య మానవులకు ఆ రోజు ఎంత కఠినంగా గడుస్తుందో ఊహించటం కష్టం కాదు.
  2. ఈ హదీసు ద్వారా దైవప్రవక్త ముహమ్మద్ ﷺగారి ప్రశస్తి వెల్లడౌతోంది. పరలోకంలో ఆయన దైవం ముందు భూత, భవిష్యత్, వర్తమాన మానవులందరి కోసం సిఫారసు చేస్తారు.
  3. మానవులందరికీ నరక వంతెనను దాటవలసి ఉంటుంది.
  4. ఇంకా ఈ హదీసులో నిజాయితీ తత్పరత, బంధుత్వాల విశిష్ఠతలు కూడా వివరించబడ్డాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|25. అమానతులు|హదీసు 203

204

హదీసు 204

وعن أَبِي خُبَيْبٍ بضم الخاءِ المعجمة عبد اللَّهِ بنِ الزُّبَيْرِ، رضي اللَّه عنهما قَالَ: لَمَّا وَقَفَ الزبَيْرُ يَوْمَ الْجَمَلِ دَعانِي فَقُمْتُ إِلَى جَنْبِهِ، فَقَالَ: يَا بُنَيَّ إِنَّهُ لاَ يُقْتَلُ الْيَوْمَ إِلاَّ ظَالِمٌ أَوْ مَظْلُومٌ، وإِنِّي لاأُرَنِي إِلاَّ سَأُقْتَلُ الْيَومَ مَظْلُوماً، وَإِنَّ مِنْ أَكْبَرِ هَمِّي لَدَينْيِ أَفَتَرَى دَيْنَنَا يُبْقى مِنْ مالِنا شَيْئاً؟ ثُمَّ قَالَ: يا بني بعْ مَالَنَا واقْضِ دَيْنِي، وَأَوْصَى بالثُّلُثِ، وَثُلُثِهُ لِبَنِيهِ، يَعْنِي لبَنِي عَبْدِ اللَّه بن الزبير ثُلُثُ الثُّلُث. قَالَ: فَإِن فَضلِ مِنْ مالِنَا بعْدَ قَضَاءِ الدَّيْنِ شَيءٌ فثُلُثُهُ لِبَنِيك، قَالَ هِشَامٌ: وَكَانَ بَعْضُ وَلَدُ عَبْدِ اللَّهِ قَدْ وَازى بَعْضَ بَني الزبَيْرِ خُبيبٍ وَعَبَّادٍ، وَلَهُ يَوْمَئذٍ تَسْعَةُ بَنينَ وتِسعُ بَنَاتٍ. قَالَ عَبْدُ اللَّه: فَجَعَل يُوصِينِي بديْنِهِ وَيَقُول: يَا بُنَيَّ إِنْ عَجزْتَ عنْ شَيءٍ مِنْهُ فَاسْتَعِنْ عَلَيْهِ بموْلايَ. قَالَ: فَوَاللَّهِ مَا دَريْتُ مَا أرادَ حَتَّى قُلْتُ يَا أَبَتِ مَنْ مَوْلاَكَ؟ قَالَ: اللَّه. قَالَ: فَواللَّهِ مَا وَقَعْتُ في كُرْبَةٍ مِنْ دَيْنِهِ إِلاَّ قُلْتُ: يَا مَوْلَى الزبَيْرِ اقْضِ عَنْهُ دَيْنَهُ، فَيَقْضِيَهُ. قَالَ: فَقُتِلَ الزُّبَيْرُ وَلَمْ يَدَعْ دِينَاراً وَلاَ دِرْهَماً إِلاَّ أَرَضِينَ، مِنْهَا الْغَابَةُ وَإِحْدَى عَشَرَةَ دَاراً بالْمَدِينَةِ. وداريْن بالْبَصْرَةِ، وَدَارَاً بالْكُوفَة وَدَاراً بِمِصْرَ. قَالَ: وَإِنَّمَا كَانَ دَيْنُهُ الذي كَانَ عَلَيْهِ أَنَّ الرَّجُلَ يَأْتَيهِ بِالمالِ، فَيَسْتَودِعُهُ إِيَّاهُ، فَيَقُولُ الزُّبيْرُ: لا وَلَكنْ هُوَ سَلَفٌ إِنِّي أَخْشَى عَلَيْهِ الضَّيْعةَ. وَمَا ولِي إَمَارَةً قَطُّ وَلا جِبَايةً ولا خَراجاً وَلاَ شَيْئاً إِلاَّ أَنْ يَكُونَ في غَزْوٍ مَعَ رسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، أَوْ مَعَ أَبِي بَكْر وَعُمَرَ وَعُثْمَانَ رضي اللَّه عنهم، قَالَ عَبْدُ اللَّه: فَحَسَبْتُ مَا كَانَ عَلَيْهِ مِنَ الدَّيْنِ فَوَجَدْتُهُ أَلْفَيْ أَلْفٍ وَمائَتَيْ أَلْفٍ، فَلَقِيَ حَكِيمُ بْنُ حِزَامٍ عَبدَ اللَّهِ بْن الزُّبَيْرِ فَقَالَ: يَا ابْنَ أَخِي كَمْ عَلَى أَخِي مِنَ الدَّيْنِ؟ فَكَتَمْتُهُ وَقُلْتُ: مِائَةُ أَلْفٍ. فَقَالَ: حَكيمٌ: وَاللَّه مَا أَرى أَمْوَالَكُمْ تَسعُ هَذِهِ، فَقَالَ عَبْدُ اللَّهِ: أَرَأَيْتُكَ إِنْ كَانَتْ أَلْفَي أَلْفٍ؟ وَمِائَتَيْ أَلْفٍ؟ قَالَ: مَا أَرَاكُمْ تُطِيقُونَ هَذَا، فَإِنْ عَجَزْتُمْ عَنْ شَىْء مِنْهُ فَاسْتَعِينُوا بِي. قَالَ: وكَانَ الزُّبَيْرُ قدِ اشْتَرَى الْغَابَةَ بِسَبْعِينَ ومِائَة أَلْف، فَبَاعَهَا عَبْدُ اللَّهِ بِأْلف ألفٍ وسِتِّمِائَةِ أَلْفَ، ثُمَّ قَامَ فَقالَ: مَنْ كَانَ لَهُ عَلَى الزُّبَيْرِ شَيْء فَلْيُوافِنَا بِالْغَابَةِ، فأَتَاهُ عبْدُ اللَّهِ بْنُ جَعفر، وكَانَ لَهُ عَلَى الزُّبَيْرِ أَرْبعُمِائةِ أَلْفٍ، فَقَالَ لعَبْدِ اللَّه: إِنْ شِئْتُمْ تَرَكْتُهَا لَكُمْ؟ قَالَ عَبْدُ اللَّه: لا، قَالَ فَإِنْ شِئْتُمْ جعَلْتُمْوهَا فِيمَا تُؤخِّرُونَ إِنْ أَخَّرْتُمْ، فَقَالَ عَبْدُ اللَّه: لا، قَالَ: فَاقْطَعُوا لِي قِطْعَةً، قَالَ عبْدُ اللَّه: لَكَ مِنْ هاهُنا إِلَى هاهُنَا. فَبَاعَ عَبْدُ اللَّهِ مِنْهَا فَقَضَى عَنْهُ دَيْنَه، وَوَفَّاهُ وَبَقِيَ منْهَا أَرْبَعةُ أَسْهُمٍ وَنِصْفٌ، فَقَدم عَلَى مُعَاوِيَةَ وَعَنْدَهُ عَمْرُو بْنُ عُثْمَانَ، وَالْمُنْذِرُ بْنُ الزُّبيْرِ، وَابْن زَمْعَةَ. فَقَالَ لَهُ مُعَاوِيَةُ: كَمْ قَوَّمَتِ الْغَابَةُ؟ قال: كُلُّ سَهْمٍ بِمائَةِ أَلْفٍ قَالَ: كَمْ بَقِي مِنْهَا؟ قَالَ: أَرْبَعَةُ أَسْهُمٍ ونِصْفٌ، فَقَالَ الْمُنْذرُ بْنُ الزَّبَيْرِ: قَدْ أَخَذْتُ مِنْهَا سَهْماً بِمائَةِ أَلْفٍ، وقال عَمْرُو بنُ عُثْمان: قَدْ أَخَذْتُ مِنْهَا سَهْماً بِمِائَةِ أَلْفٍ. وَقالَ ابْن زمْعَةَ: قَدُ أَخَذْتُ سَهْماً بِمِائَةِ أَلْفٍ، فَقَالَ مُعَاوِيةُ: كَمْ بَقِيَ مِنْهَا؟ قَالَ: سَهْمٌ ونصْفُ سَهْمٍ، قَالَ: قَدْ أَخَذْتُهُ بِخَمسينَ ومائَةِ ألْف. قَالَ: وبَاعَ عَبْدُ اللَّه بْنُ جَعْفَرٍ نصِيبَهُ مِنْ مُعَاوِيَةَ بسِتِّمِائَةِ أَلْفٍ. فَلَمَّا فَرغَ ابنُ الزُّبَيْرِ مِنْ قََضاءِ ديْنِهِ قَالَ بَنُو الزُّبْيرِ: اقْسِمْ بَيْنَنَا مِيراثَنَا. قَالَ: وَاللَّهِ لا أَقْسِمُ بيْنَكُمْ حَتَّى أَنَادِيَ بالمَوْسم أَرْبَع سِنِين: أَلا مَنْ كَانَ لَهُ عَلَى الزُّبَيَّرِ دَيْنٌ فَلْيَأْتِنَا فَلْنَقْضِهِ. فَجَعَلَ كُلُّ سَنَةٍ يُنَادِي في الْمَوسمِ، فَلَمَّا مَضى أَرْبَعُ سِنينَ قَسم بَيْنَهُمْ ودَفَعَ الثُلث وكَان للزُّبَيْرِ أَرْبَعُ نِسْوةٍ، فَأَصاب كُلَّ امْرَأَةٍ أَلْفُ أَلْفٍ ومِائَتَا أَلْفٍ، فَجَمِيعُ مَالِهِ خَمْسُونَ أَلْف أَلْفٍ ومِائَتَا أَلْف. رواه البخاري.

హజ్రత్ అబూ ఖుబైబ్ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : (నా తండ్రి) జుబైర్ (రదియల్లాహు అన్హు) జమల్ యుద్ధం జరిగిన రోజు (యుద్ధభూమిలో నించున్నప్పుడు నన్ను పిలిచారు. నేను ఆయన పిలుపు విని ఆయన ప్రక్కన నించున్నాను. అప్పుడాయన నాతో, "నాయనా! ఈ రోజు హతులయ్యేవారు బాధించేవాళ్ళయినా అయి ఉంటారు. లేక బాధితులయినా అయి ఉంటారు. నేను మాత్రం ఈ రోజు అన్యాయంగా చంపబడతానని అనుకుంటున్నాను. ఇప్పుడు నా మదిని ఎక్కువగా తొలుస్తున్నది నేను చేసిన అప్పు. మన అప్పు మన ధనంలో ఏమైనా మిగుల్చు తుందంటావా? (అంటే రుణం తీర్చిన తరువాత మన సంపదలో ఏమైనా మిగిలి ఉంటుందా?)" అని అన్నారు. ఆ తరువాత "మన ఆస్తి మొత్తం అమ్మేసి అప్పు తీర్చు నాయనా!" అని చెప్పారు. తన ధనంలో మూడో వంతును వసియ్యత్ (వీలు) చేశారు. ఆ మూడో వంతులోనే మూడో వంతు భాగం (తన కుమారుడైన) అబ్దుల్లాహ్ కుమారులకు చెందాలని ఆదేశించారు. "అప్పు తీర్చిన తరువాత నా సంపదలో ఏమయినా మిగిలితే అందులో మూడో వంతు నీ కుమారులకు చెందాలి" అని అన్నారు.

(హదీసు పరంపరలోని ఒకానొక ఉల్లేఖకులైన) హిషామ్ ఉవాచ : (ఈ సంఘటన జరిగిన కాలంలోనే) అబ్దుల్లాహ్ కుమారులైన ఖుబైబ్ మరియు అబ్బాద్‌లు, జుబైర్ (రదియల్లాహు అన్హు) గారి కుమారులకు సమవయస్కులై ఉన్నారు (అంటే మనవళ్ళు కూడా చిన్న కుమారుల వయసుకి ఎదిగారన్న మాట!) అప్పుడు జుబైర్ (రదియల్లాహు అన్హు) గారికి తొమ్మిదిమంది మగపిల్లలు, తొమ్మిది మంది ఆడపిల్లలు ఉన్నారు.

(హజ్రత్ అబ్దుల్లాహ్ అంటున్నారు): మా నాన్నగారు తన అప్పుని తీర్చమని నన్ను ఆదేశిస్తూ, "నాయనా! ఒకవేళ నీవు ఆ అప్పులో ఏ కొంతైనా తీర్చలేకపోతే అప్పుడు నీవు నా కార్యసాధకుణ్ణి సహాయం కోసం అర్థించు" అని అన్నారు. దానికి నేను, "దైవసాక్షి! కార్యసాధకుడు అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్థం కాలేదు" అని అన్నాను. "నాన్నగారు! మీ కార్యసాధకుడు ఎవరు?" అని కూడా అడిగాను. అందుకాయన "అల్లాహ్!" అని సమాధానమిచ్చారు. దైవసాక్షిగా చెబుతున్నాను. ఆయన అప్పు తీర్చడం కష్టమనిపించినప్పుడల్లా నేను, "ఓ జుబైర్ కార్యసాధకా! ఆయన రుణభారాన్ని తొలగించు" అని (దేవుడ్ని) వేడుకుంటూ ఉండేవాణ్ణి. ఆయన కార్యసాధకుడైన దేవుడే ఆయన రుణభారాన్ని తొలగించేవాడు. (నేను నిమిత్త మాత్రుణ్ణే).

మా నాన్నగారు (ఈ యుద్ధంలోనే) చంపబడ్డారు. ఆయనకు కొన్ని భూముల ఆస్తి ఉంది. అవి తప్ప (నగదు రూపంలో) దీనార్లుగాని, దిర్హములుగాని ఆయన వదలిపెట్టిపోలేదు. ఆ భూముల్లోనే 'గాబా' భూమి కూడా ఒకటి. ఇంకా మదీనాలో పదకొండు ఇండ్లు, బస్రాలో రెండు ఇండ్లు, కూఫాలో ఒక ఇల్లు, ఈజిప్టులో ఒక ఇల్లు వదలిపెట్టి పోయారు. ఆయనపై ఉన్న రుణం (కూడా వాస్తవానికది రుణం కాదు అది) ఎలాంటిదంటే, ఎవడైనా తన ధనం తీసుకువచ్చి ఆయన దగ్గర భద్రపరచమని అప్పగిస్తే, దానికి ఆయన, "కాదు, ఇది అమానతు (అప్పగింత) కాదు. దీన్ని నేను మీ దగ్గర అప్పు తీసుకున్నానని భావించండి. ఎందుకంటే ఈ ధనం నా దగ్గర పాడయి (ఖర్చయి) పోతుందేమోనని భయంగా ఉంది" అని అనేవారు. (ఇస్లాంలో అమానతు (అప్పగింత)గా పెట్టిన ధనం పాడయిపోతే దానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి భిన్నంగా అప్పుగా తీసుకున్న ధనాన్నయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాపసు చేయక తప్పదు!) ఆయన ఎన్నడూ ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టలేదు. పన్నుల వసూళ్ళుగాని, ఇంకా ఏ ఇతర వసూళ్ళపని గానీ చేయలేదు (ఒకవేళ ఆయన ప్రభుత్వ పదవిలో పనిచేసి వున్నట్లయితే ఆయన దగ్గరున్న ఈ ధనం అక్రమంగా ఆర్జించబడిందనే నింద మోపబడేదేమో!). అయితే ఆయన దైవప్రవక్త ﷺ, అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)లతోపాటు ధర్మయుద్ధాల్లో పాల్గొనేవాళ్ళు (అంటే ఈ ధనం యుద్ధప్రాప్తిగా లభించిందన్న మాట!)

అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అంటున్నారు: ఆయన అప్పు మొత్తాన్ని నేనొకసారి లెక్కపెట్టి చూస్తే అది ఇరవై రెండు లక్షలదాకా తేలింది. హకీం బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు) నన్ను కలిసినప్పుడు నాతో, "భాతృజా! నా సోదరునికి (జుబైర్‌కి) ఎంత అప్పు ఉంది?" అని అడిగారు. నేను నిజాన్ని దాచుతూ "ఒక లక్ష" అని చెప్పాను. దానికి ఆయన, "దైవసాక్షి! మీ నాన్న నీ కోసం విడిచిపెట్టి వెళ్ళిన ధనం ఇంత అప్పుని తీర్చలేదని నా అనుమానం" అని అన్నారు. అందుకు నేను "అప్పు ఇరవై లక్షలుంటే?" అని అడిగాను. దానికి, "నువ్వు (ఇంతపెద్ద) అప్పు తీర్చలేవనే నేను భావిస్తున్నాను. ఒకవేళ నువ్వు నిజంగానే దాన్ని తీర్చలేకపోయినప్పుడు నా సహాయాన్ని అర్థించవచ్చు" అని అన్నారు హకీం బిన్ హిజామ్ (రదియల్లాహు అన్హు).

"(మా నాన్న) జుబైర్ 'గాబా' భూమిని అప్పట్లో లక్షా డెబ్బైవేలకు కొన్నారు" అని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) తెలిపారు. ఆ భూమినే అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) పదహారు లక్షలకు అమ్మారు. ఆ తరువాత ఆయన నిలబడి, "(మా నాన్న) జుబైర్ (రదియల్లాహు అన్హు) ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే వారు 'గాబా' భూమి దగ్గర మమ్మల్ని కలుసుకొని మా నుండి తమ అప్పుని వసూలు చేసుకోవచ్చు" అని ప్రకటించారు. ఈ ప్రకటన విని అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ (రదియల్లాహు అన్హు) ఆయన దగ్గరికి వచ్చి "మీరు కోరుకుంటే (మీ నాన్న నుండి నాకు రావలసిన) అప్పును మాఫీ చేయగలను" అని అన్నారు. అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ 'అక్కర్లేద'న్నారు. అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ (రదియల్లాహు అన్హు) మళ్ళీ, "కావాలనుకుంటే మీరు నా అప్పుని (ఇప్పుడు కాకుండా) తరువాతయినా ఇవ్వొచ్చు" అని అన్నారు. అబ్దుల్లాహ్ దానిక్కూడా ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన "(సరే, అయితే) ఈ భూమిలోని ఒక భాగాన్ని నాకిచ్చేయండి" అని అడిగారు. దానికి అబ్దుల్లాహ్ "ఇక్కణ్ణుంచి ఇక్కడిదాకా మీదండి" అని అన్నారు. (ఇంకా) ఆ భూమిలోని కొంతభాగాన్ని అమ్మి దాంతో (తండ్రి) జుబైర్ అప్పుని పూర్తిగా తీర్చేశారు. ఇంకా ఆ భూమిలో నాలుగున్నర భాగాలు మిగిలి ఉన్నాయి.

ఆ తరువాత అబ్దుల్లాహ్ ముఆవియా (రదియల్లాహు అన్హు) దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో అమ్ర్ బిన్ ఉస్మాన్, ముంజిర్ బిన్ జుబైర్ మరియు ఇబ్నె జమఆ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ముఆవియా అబ్దుల్లాహ్‌ను, "గాబా (భూమి) విలువ ఎంత?" అని అడిగారు. దానికి ఆయన, "ఒక్కోభాగం లక్ష" అని జవాబిచ్చారు. "ఇంకా ఎన్ని భాగాలు మిగిలి ఉన్నాయి?" అని మళ్ళీ అడిగారు. నాలుగున్నర భాగాలు ఇంకా మిగిలున్నాయని అబ్దుల్లాహ్ సమాధానమిచ్చారు. అప్పుడు ముంజిర్ బిన్ జుబైర్ కల్పించుకొని, "మిగిలున్నవాటిలో ఒక భాగాన్ని నేను లక్షకు తీసుకుంటున్నాను" అని అన్నారు. ఆ తరువాత అమ్ర్ బిన్ ఉస్మాన్, "లక్షకు నేను (కూడా) ఒక భాగం తీసుకున్నాను" అన్నారు. అలాగే ఇబ్నె జమఅ కూడా ఒక భాగాన్ని లక్షకు కొంటానని ప్రకటించారు.

ఆ తరువాత ముఆవియా (రదియల్లాహు అన్హు), "ఇప్పుడెన్ని భాగాలు మిగిలున్నాయి?" అని అడిగారు. "ఒకటిన్నర భాగాలు ఇంకా మిగిలి ఉన్నాయని అబ్దుల్లాహ్ చెప్పారు. అప్పుడు ముఆవియా (రదియల్లాహు అన్హు) "దీన్ని నేను లక్షన్నరకు తీసుకున్నాను" అని అన్నారు. అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ తన భూభాగాన్ని ముఆవియాకు ఆరు లక్షలకు అమ్మారని అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) తెలిపారు. అబ్దుల్లాహ్ అప్పంతా తీర్చేసిన తరువాత జుబైర్ కుమారులు తమ ఆస్తిని తమకు పంచిపెట్టమని కోరారు. దానికి అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) తన సోదరు లతో, "దైవసాక్షి! హజ్ కాలాల్లో (ఎడతెగ కుండా) నాలుగు సంవత్సరాల పాటు "జుబైర్ (రదియల్లాహు అన్హు) ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వుంటే మా దగ్గరికి రండి. ఆయన అప్పుని మేము తీరుస్తాం" అని ప్రకటించాలి. అంతవరకూ నేను ఆస్తిని మీ మధ్య పంచేది లేదు" అని అన్నారు. అన్నట్లుగానే ఆయన ప్రతి సంవత్సరం హజ్ కాలంలో (జుబైర్ అప్పుకి సంబం ధించిన) ప్రకటన చేసేవారు. నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత (మిగి లిన ఆస్తిని) వారి మధ్య పంచేశారు. వీలు ప్రకారం మూడో వంతు ఆస్తిని సంబంధిత వ్యక్తులకు ఇచ్చేశారు. జుబైర్ (రదియల్లాహు అన్హు)కు నలుగురు భార్యలుండేవారు. ఒక్కో భార్యకు పన్నెండు లక్షల చొప్పున (ఆస్తిలో వాటాగా) లభించాయి. హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) వదలివెళ్ళిన మొత్తం ఆస్తి ఐదు కోట్ల రెండు లక్షలు. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని "ఖుమ్స్ (ఐదో భాగం) విధి" అన్న ప్రకరణంలో ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.)

English

Abu Khubaib `Abdullah bin Az-Zubair (May Allah bepleased with them) reported: When Az-Zubair, got ready to fight in the battle of Al-Jamal, he called me and said: “My son, whoever is killed today will be either a wrongdoer or a wronged one. I expect that I shall be the the wronged one today. I am much worried about my debt. Do you think that anything will be left over from our property after the payment of my debt? My son, sell our property and pay off my debt.” Az-Zubair then willed one-third of that portion to his sons; namely `Abdullah’s sons. He said, “One-third of the one-third. If any property is left after the payment of debts, one-third (of the one-third of what is left is to be given to your sons.” (Hisham, a subnarrator added: “Some of the sons of `Abdullah were equal in age to the sons of Az-Zubair, e.g., Khubaib and Abbad. `Abdullah had nine sons and nine daughters at that time)”. (The narrator `Abdullah added:) He kept on instructing me about his debts and then said: “My son, should you find yourself unable to pay any portion of my debt then beseech my Master for His help.” By Allah, I did not understand what he meant and asked: “Father, who is your Master?” He said: “Allah.” By Allah! Whenever I faced a difficulty in discharging any portion of his debt; I would pray: “O Master of Zubair, discharge his debt,” and He discharged it. Zubair was martyred. He left no money, but he left certain lands, one of them in Al-Ghabah, eleven houses in Al-Madinah, two in Basrah, one in Kufah and one in Egypt. The cause of his indebtedness was that a person would come to him asking him to keep some money of his in trust for him. Zubair would refuse to accept it as a trust, fearing it might be lost, but would take it as a loan. He never accepted a governorship, or revenue office, or any public office. He fought along with Messenger of Allah ﷺ and Abu Bakr, `Umar and `Uthman (radiyallahu anhum).

`Abdullah added: I prepared a statement of his debts and they amounted to two million and two hundred thousand! Hakim bin Hizam met me and asked me: “Nephew, how much is due from my brother as debt?” I kept it as secret and said: “A hundred thousand.” Hakim said: “By Allah! I do not think your assets are sufficient for the payment of these debts.” I said: “What would you think if the amount were two million and two hundred thousand?” He said: “I do not think that you would be able to clear off the debts. If you find it difficult let me know.”

Az-Zubair (May Allah bepleased with him) had purchased the land in Al-Ghabah for a hundred and seventy thousand. `Abdullah sold it for a million and six hundred thousand, and declared that whosoever had a claim against Az-Zubair (May Allah bepleased with him) should see him in Al-Ghabah. `Abdullah bin Ja`far (May Allah bepleased with him) came to him and said: “Az-Zubair (May Allah bepleased with him) owed me four hundred thousand, but I would remit the debt if you wish.” `Abdullah (May Allah bepleased with him) said: “No.” Ibn Ja`far said: “If you would desire for postponement I would postpone the recovery of it.” `Abdullah said: “No.” Ibn Ja`far then said: “In that case, measure out a plot for me.” `Abdullah marked out a plot. Thus he sold the land and discharged his father’s debt. There remained out of the land four and a half shares. He then visited Mu`awiyah who had with him at the time `Amr bin `Uthman, Al-Mundhir bin Az-Zubair and Ibn Zam`ah (May Allah bepleased with them). Mu`awiyah (May Allah bepleased with him) said: “What price did you put on the land in Al-Ghabah?” He said: “One hundred thousand for a each share. Mu`awiyah inquired: “How much of it is left?” `Abdullah said: “Four and a half shares.” Al-Mundhir bin Az-Zubair said: “I will buy one share for a hundred thousand”. `Amr bin `Uthman said: “I will buy one share for a hundred thousand”. Ibn Zam`ah said: “I will buy one share for a hundred thousand.” Then Mu`awiyah asked: “How much of it is now left?” `Abdullah said: “One and a half share. Mu`awiyah said: “I will take it for one hundred and fifty thousand.” Later `Abdullah bin Ja`far sold his share to Mu`awiyah for six hundred thousand.

When `Abdullah bin Az-Zubair (May Allah bepleased with him) finished the debts, the heirs of Az-Zubair (May Allah bepleased with him) asked him to distribute the inheritance among them. He said: “I will not do that until I announce during four successive Hajj seasons: `Let he who has a claim against Az-Zubair come forward and we shall discharge it.”’ He made this declaration on four Hajj seasons and then distributed the inheritance among the heirs of Az-Zubair (May Allah bepleased with him) according to his will. Az-Zubair (May Allah bepleased with him) had four wives. Each of them received a million and two hundred thousand. Thus Az-Zubair’s total property was amounted to fifty million and two hundred thousand.[Al-Bukhari]

ముఖ్యాంశాలు

1. మనిషికి తాను ఇంకా ఎక్కువకాలం బతకలేనన్న సందేహం కలిగినప్పుడు వీలైనంత త్వరగా వీలునామా రాసేయటం అభిలషణీయం.

2. ముందుగా ఆస్తిలో నుండి మృతుని రుణాన్ని తీర్చాలి. దాని తరువాతే వీలునామాను అమలుపరచటంగాని, ఆస్తిని వారసుల మధ్య పంచడంగాని చేయాలి.

3. తండ్రులు బ్రతికివున్నప్పుడు అవసరమనుకుంటే మనవళ్ల పేర కూడా వీలునామా రాయవచ్చు.

4. అప్పు తీర్చగల స్థోమత ఉన్నవాడు అప్పు పుచ్చుకోవడం ధర్మసమ్మతమే.

5. భూములు, ఇండ్లు, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవచ్చు. ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా సంపాదిస్తున్నప్పుడు ఇస్లాం ధర్మం అలాంటి సంపాదనపై పరిమితులు విధించదు.

6. అల్లాహ్‌పై హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) గారికున్న నమ్మకం మరియు విశ్వాసాలు ఆదర్శప్రాయమైనవి. ప్రతి విశ్వాసీ అలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్గిఉండాలి.

7. ఈ హదీసు ప్రవక్త సహచరుల ఉదాత్త గుణాలను చాటిచెబుతోంది. కొంతమంది అప్పు తీర్చడంలో అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు)కు సహకరించారు. మరికొందరైతే తమకు రావలసిన అప్పుని వాయిదా వేయవచ్చని, అవసరమైతే పూర్తిగా కూడా మాఫీ చేస్తామని కూడా ముందుకు వచ్చారు. కాని అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) మాత్రం దానికి ఒప్పుకోకుండా తన నిరపేక్షాభావాన్ని వ్యక్తం చేశారు. వారి హక్కుల్ని వారికి ఇచ్చివేసి అందరికన్నా ఉత్తమంగా వ్యవహరించారు.

8. దైవమార్గంలో పోరాడేవాని సంపదలో దైవంపై పూర్తినమ్మకం కలిగివున్న వాని సంపాదనలో శుభం ప్రాప్తమవుతుంది. అందుకే హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) గారి భూమి దాని అసలు ఖరీదుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ధర పలికింది. అప్పంతా తీర్చిన తరువాత కూడా చాలా ధనం మిగిలిపోయింది.

9. హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు) గారి ఉత్తమ నైతికత, ప్రజల పట్ల ఆయన శ్రేయోభిలాష భావాలు ఈ హదీసు ద్వారా వెల్లడౌతున్నాయి. ప్రజలు వస్తువులు భద్రపరచమని ఇస్తే ఆయన వాటిని అప్పుగా స్వీకరించేవారు. తనకు నష్టం జరిగినా ఫరవాలేదు గాని ప్రజలకు మాత్రం నష్టం జరగకూడదని ఆయన కోరుకునేవారు.

10. హజ్రత్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) గారి కార్యదక్షత ప్రశంసనీయం. ముందుగా ఆయన తన తండ్రి రుణభారాన్ని దించిన తరువాతే ఆస్తిని వారసులకు పంచారు. నీతి, నిజాయితీలతో వ్యవహరించారు.

11. వారసులు కూడా మాటిమాటికీ ఆస్తివాటాల సంగతి ఎత్తకుండా జుబైర్ (రదియల్లాహు అన్హు) రుణభారం తొలగిపోయేవరకు సహకరించారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|25. అమానతులు|హదీసు 204