హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 252వ అధ్యాయం: పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1497 – 1503) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు
باب في مسائل من الدعاء
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1497
عنْ أُسامَةَ بْنِ زيْدٍ رضِيَ اللَّه عنْهُما قالَ: قالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"مَنْ صُنِعَ إَلَيْهِ معْرُوفٌ، فقالَ لِفَاعِلِهِ: جزَاك اللَّه خَيْراً، فَقَد أَبْلَغَ فِي الثَّنَاءِ". رواه الترمذي وقَالَ: حَدِيثٌ حسنٌ صَحِيحٌ.
హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: తమపట్ల సద్వ్యవహారం చేసిన వారి కోసం 'జజాకల్లాహు ఖైరా' (దేవుడు నీకు మంచి ప్రతిఫలం ఇవ్వుగాక!) అని ప్రార్థిస్తే, వారిని బాగా పొగిడినట్లే.
(తిర్మిజీ, హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని బిర్ర్, సిలా అధ్యాయాలు)
English
Usamah bin Zaid (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “He who is favoured by another and says to his benefactor: `Jazak-Allah khairan (may Allah reward you well)’ indeed praised (the benefactor) satisfactorily.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఉపకారానికి బదులుగా ఉపకారం చేయలేకపోతే కనీసం, 'జజాకల్లాహు ఖైరా' అని అయినా అనాలి. దీని భావం ఏమిటంటే, 'నువ్వు నాకు చేసిన ఉపకారానికి నేను ప్రతిఫలం ఇవ్వలేను. దేవుడే నీకు మంచి ప్రతిఫలం ఇవ్వాలి' అని. దేవుడు ఎవరికయినా మంచి ప్రతిఫలం ఇస్తే ఇక వారికి కావాల్సింది ఏముంది? అందుకే దైవప్రవక్త ﷺ అన్నారు- ఈ వేడుకోలు వచనాలు పలికితే చాలు తమకు ఉపకారం చేసిన వారిని చాలా గొప్పగా పొగిడినట్లవుతుంది అని.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1497
హదీసు 1498
وَعَن جَابرٍ رَضِيَ اللَّه عَنْه قال: قَال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا تَدعُوا عَلى أَنْفُسِكُم، وَلا تدْعُوا عَلى أَولادِكُم، وَلاَ تَدْعُوا عَلَى أَمْوَالِكُم، لا تُوافِقُوا مِنَ اللَّهِ سَاعَةً يُسأَلُ فِيهَا عَطاءً، فيَسْتَجيبَ لَكُم "رواه مسلم.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మిమ్మల్ని మీరు శపించుకోకండి. మీ పిల్లల్ని శపించకండి. మీ సిరిసంపదలకు శాపనార్ధాలు పెట్టకండి. ఎందుకంటే అర్థింపులు అంగీకరించబడటానికి దేవుడు నిర్ణయించిన వేళలో మీరు అలా ప్రార్థించటం తటస్థిస్తే (దానివల్ల మీకు నష్టం కలగవచ్చు) (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జుహ్‌ద్, రఖాయిఖ్ ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Do not invoke curses on yourself or on your children or on your possessions lest you should happen to do it at a moment when the supplications are accepted, and your prayer might be granted.”[Muslim].
ముఖ్యాంశాలు
దేవుడు ప్రతి ఒక్కరి వేడుకోలును ఆలకించి దాన్ని ఆమోదిస్తూ ఉంటాడు. ఈ పరంపర నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే కొన్నికొన్ని వేళల్ని ఆయన ప్రత్యేకించి పెట్టాడు. ఆయావేళల్లో ఆయన దాసుల ప్రార్థనల్ని చాలా ఎక్కువగా ఆమోదిస్తాడు. అందుకని మనిషి ఏ సమయంలోనయినా తననుగాని, తన పిల్లల్నిగాని తన వృత్తినిగాని శపించుకోకూడదు. ఎందుకంటే ప్రార్థనలు అంగీకరించబడే వేళలో ఆ విధంగా శపించుకోవటం జరిగితే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1498
హదీసు 1499
وعن أَبي هُريرةَ رضي اللَّه عنهُ أَنَّ رَسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَقْرَبُ مَا يَكُونُ العَبْدُ مِن ربِّهِ وَهُوَ سَاجِدٌ، فَأَكْثِرُوا الدُّعَاءَ" رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మనిషి సాష్టాంగ ప్రణామ (సజ్దా) స్థితిలో తన ప్రభువుకు అత్యంత ఎక్కువగా దగ్గరవుతాడు. కనుక (ఆ స్థితిలో) ఎక్కువగా ప్రార్థనలు చేయండి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A slave becomes nearest to his Rubb when he is in prostration. So increase supplications in prostrations.”[Muslim].
ముఖ్యాంశాలు
నఫిల్ నమాజుల్లోని సజ్దాల్లో లేక నమాజ్ బయట ఇతర సజ్దాల్లో ఈ విధంగా ప్రార్థనలు చేయాలని పండితులు అభిప్రాయపడ్డారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1499
హదీసు 1500
وَعَنْهُ أَنَّ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:" يُسْتجَابُ لأَحَدِكُم مَا لَم يعْجلْ: يقُولُ قَد دَعوتُ رَبِّي، فَلم يسْتَجبْ لِي". متفقٌ عَلَيْهِ. وفي رِوَايَةٍ لمُسْلِمٍ: "لا يزَالُ يُسْتَجَابُ لِلعَبْدِ مَا لَم يدعُ بإِثمٍ، أَوْ قَطِيعةِ رَحِمٍ، مَا لَمْ يَسْتعْجِلْ "قِيلَ: يَا رسُولَ اللَّهِ مَا الاسْتِعْجَالُ؟ قَالَ:"يَقُولُ: قَدْ دعَوْتُ، وَقَدْ دَعَوْتُ فَلَم أَرَ يَسْتَجِيبُ لي، فَيَسْتَحْسِرُ عِنْد ذَلِكَ، ويَدَعُ الدُّعَاءَ ".
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరూ 'నేను నా ప్రభువుని ప్రార్థించాను. కాని నా ప్రార్థన అంగీకరించబడలేదు' అంటూ ప్రార్థన స్వీకరణ విషయంలో తొందరపడని పక్షంలోనే వారి ప్రార్థన అంగీకరించబడుతుంది. (బుఖారీ-ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: "దాసుడు పాపకార్యం కోసం లేక బంధువిచ్ఛిత్తి కోసం ప్రార్థించనంత వరకూ అతని ప్రార్థన అంగీకరించబడుతుంది. అయితే అతను ఆ విషయంలో తొందర పడకూడదు."
ఆ మాట విని ఎవరో అడిగారు: "దైవప్రవక్తా! తొందరపడటమంటే ఏమిటి?" అని. అందుకాయన ఇలా చెప్పారు: 'దాసుడు నేను ప్రార్థన చేశాను. (ఎన్నోసార్లు) ప్రార్థన చేశాను. కాని నా ప్రార్థన ఏదీ అంగీకరించబడినట్లు కనిపించ లేదు' అంటాడు. ఆ తర్వాత అతను విసిగివేసారి ప్రార్థన చేయటమే మానేస్తాడు. (తొందరపడటమంటే అదే!)."
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ, “The supplication of every one of you will be granted if he does not get impatient and say (for example): `I supplicated my Rubb but my prayer has not been granted‘.”[Al-Bukhari and Muslim].
The narration of Muslim is: “The supplication of a slave continues to be granted as long as he does not supplicate for a sinful thing or for something that would cut off the ties of kinship and he does not grow impatient.” It was said: “O Messenger of Allah! What does growing impatient mean?” He ﷺ said, “It is one’s saying: `I supplicated again and again but I do not think that my prayer will be answered.’ Then he becomes frustrated (in such circumstances) and gives up supplication altogether.”
ముఖ్యాంశాలు
మనిషి ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. "నేను చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాను. కాని ఫలితం ఏమీ కనిపించటం లేదు" అని అనుకోకూడదు. దేవుని కారుణ్యం పట్ల ఎన్నటికీ నిరాశ చెందకూడదు. ఒకవేళ ప్రార్థన స్వీకరణలో కొంత జాప్యం జరిగితే అది తమ మంచికే జరిగిందనుకోవాలి. దాని వాస్తవాలు తమకు తెలియకపోయినా దేవునికి తెలిసివుంటాయి. అందుకని ప్రార్థన అంగీకరించబడినా లేకపోయినా తాము మాత్రం ప్రార్థనను వదలిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనయినా అందులో మనిషికి ప్రయోజనమే ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1500
హదీసు 1501
وَعَنْ أَبي أُمامَةَ رَضيَ اللَّه عَنْهُ قَالَ: قِيلَ لِرَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: أَيُّ الدُّعَاءِ أَسْمعُ؟ قَالَ:"جوْفَ اللَّيْلِ الآخِرِ، وَدُبُرَ الصَّلَوَاتِ المكْتُوباتِ "رواه الترمذي وقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺను "ఏ ప్రార్థన అతి ఎక్కువగా అంగీకరించబడుతుంది?" అని అడగటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, "రాత్రి చివరిజాములో, ఫర్జ్ నమాజుల తర్వాత (చేయబడే) ప్రార్థన (ఎక్కువగా అంగీకరించబడుతుంది)" అని చెప్పారు. (తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయం)
English
Abu Umamah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ was asked: “At what time does the supplication find the greatest response?” He ﷺ replied, “A supplication made during the middle of the last part of the night and after the conclusion of the obligatory prayers.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
"జౌఫుల్లైలిల్ ఆఖిరి" అంటే రాత్రి చివరి జాము అని అర్థం. జౌఫ్ అనే పదాన్ని గనక మధ్య అనే అర్థంలో తీసుకుంటే అప్పుడు దాని అర్థం 'రాత్రి చివరి అర్ధభాగం మధ్యలో' అని వస్తుంది. ఈ రెండు వేళలూ ఒకే సమయాన్ని సూచిస్తాయి. దాన్నే ఇతర హదీసుల్లో రాత్రిలో చివరి మూడోవంతు భాగంగా పేర్కొనటం జరిగింది. ఆ సమయంలో దేవుడు మొదటి ఆకాశం పైకి వస్తాడు.
ప్రార్థనలు అంగీకరించబడే రెండో సమయం ఫర్జ్ నమాజుల తర్వాతి సమయం. కొంత మంది పండితులు అది నమాజులోని చివరి తషహ్హుద్‌లో దరూద్ తర్వాత సలామ్‌కు ముందు ఉండే సమయం అని అభిప్రాయపడ్డారు. అత్యధిక మంది పండితులు మాత్రం అది సలామ్ చేసి నమాజ్ ముగించిన తర్వాతి సమయం అని అభిప్రాయపడ్డారు. హదీసుని పరిశీలిస్తే ఈ భావమే సరైనదని తెలుస్తోంది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ అవసరాలు తీరాలని ప్రార్థన చేసుకోవాలి. అయితే ఈ హదీసుని ఆధారంగా చేసుకొని ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నట్లు ఫర్జ్ నమాజుల అనంతరం సామూహిక ప్రార్థన చేయటం అభిలషణీయ మని వాదించటం సమంజసం కాదు. ఎందుకంటే ఏ ప్రామాణిక హదీసులోనూ దైవప్రవక్త ﷺ ఈ విధంగా చేసినట్లు దాఖలాలు లేవు. అందుకని ఫర్జ్ నమాజుల తర్వాత ఈ విధంగా సామూహిక ప్రార్థనా కార్యాన్ని నిర్వహిస్తూ ఉండటం సమ్మతం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1501
హదీసు 1502
وَعَنْ عُبَادَةَ بْنِ الصَّامِتِ رضِي اللَّه عنْهُ أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا عَلى الأَرْضِ مُسْلِمٌ يَدْعُو اللَّه تَعالى بِدَعْوَةٍ إِلاَّ آتَاهُ اللَّه إِيَّاهَا، أَوْ صَرَف عنْهُ مِنَ السُّوءِ مِثْلَهَا. مَا لَم يدْعُ بإِثْم، أَوْ قَطِيعَةِ رحِمٍ"فَقَالَ رَجُلٌ مِنَ القَوْمِ: إِذاً نُكْثِرُ. قَالَ:"اللَّه أَكْثَرُ". رواه الترمذي وقال حَدِيثٌ حَسنٌ صَحِيحٌ: وَرَواهُ الحاكِمُ مِنْ رِوايةِ أَبي سعيِدٍ وَزَاد فِيهِ: "أَوْ يَدَّخر لهُ مِنَ الأَجْرِ مِثْلَها".
హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: భూమి మీద ఉండే ఏ ముస్లిం అయినా దేవుణ్ణి ఏదైనా ఇవ్వమని ప్రార్థిస్తే దేవుడు అతనికి తప్పకుండా ఇస్తాడు. లేదా దానికి సమానమైన చెడును (బాధను) దేన్నయినా అతని నుండి దూరం చేస్తాడు. అయితే అతను పాపకార్యం కోసమో, బంధు విచ్ఛిత్తి కోసమో ప్రార్థించేవాడయి ఉండకూడదు.
ఆ మాట విని అక్కడున్నవారిలో ఒకడు, "అలాగయితే ఇక నుంచి మేము చాలా ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాం" అని అన్నాడు. అందుకాయన "దేవుడు కూడా చాలా ఎక్కువగా ప్రసాదిస్తాడు. చాలా ఎక్కువగా (ప్రార్థనలు) అంగీకరిస్తాడు" అని బదులిచ్చారు. (తిర్మిజీ-హసన్, సహీహ్)
ఇమామ్ హాకిమ్ ఈ హదీసుని అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) ఆధారంగా వెలికి తీశారు. అందులో ఈ వాక్యం అదనంగా ఉంది: "లేదా అతని కోసం (పరలోకంలో) దానికి సమానమైన పుణ్యం నిధిగా ఉంచబడుతుంది."
(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయం)
English
`Ubadah bin As-Samit (radiyallahu anhu) said: The Messenger of Allah ﷺ said, “Whenever a Muslim supplicates Allah, He accepts his supplication or averts any similar kind of trouble from him until he prays for something sinful or something that may break the ties of kinship.” Upon this someone of the Companions said: “Then we shall supplicate plenty.” The Messenger of Allah ﷺ said, “Allah is more plentiful (in responding).”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
1) ఏ విధంగా చూసినా ప్రార్థన వల్ల లాభమేగాని నష్టం లేదు. ముస్లిం వ్యక్తి అడిగిన వస్తువుని దేవుడు అతనికి తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ దైవాభీష్టం ప్రకారం ఆ ప్రార్థన అంగీకరించబడకూడదని ఉన్నట్లయితే దానికి బదులుగా భవిష్యత్తులో రాబోయే ఒక ఆపద తొలగిపోతుంది. లేదా దేవుడు పరలోకంలో దానికి సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు.
2) మనిషి దేవుణ్ణి ప్రార్థించే విషయంలో మొహమాట పడకూడదు. బాగా ప్రార్థించాలి. మాటిమాటికీ ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎంత ప్రార్థించినా ఆయన ఖజానాలో ఏ లోటూ రాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1502
హదీసు 1503
وعَنِ ابْنِ عَبَّاسٍ رضي اللَّه عنْهُما أَنَّ رسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَان يقُولُ عِنْد الكرْبِ: "لا إِلَه إِلاَّ اللَّه العظِيمُ الحلِيمُ، لا إِله إِلاَّ اللَّه رَبُّ العَرْشِ العظِيمِ، لا إِلَهَ إِلاَّ اللَّه رَبُّ السمَواتِ، وربُّ الأَرْض، ورَبُّ العرشِ الكريمِ "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఆపద సమయంలో ఈ విధంగా ప్రార్థించేవారు: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన మహోన్నతుడు, గొప్ప ఉదాత్తుడు, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయన మహోన్నత సింహాసనానికి ప్రభువు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ఆయన ఆకాశాలకు ప్రభువు. భూమికీ ప్రభువు. ఇంకా గొప్ప సింహాసనానికి కూడా ప్రభువు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) said: The Messenger of Allah ﷺ used to say when he was in distress: “La ilaha illallahul-Azimul-Halim. La ilaha illallahu Rabbul-`Arshil-`Azim. La ilaha illallahu Rabbus-samawati, wa Rabbul-ardi, wa Rabbul-`Arshil-Karim. (None has the right to be worshipped but Allah the Incomparably Great, the Compassionate. None has the right to be worshipped but Allah the Rubb of the Mighty Throne. None has the right to be worshipped but Allah the Rubb of the heavens, the Rubb of the earth, and the Rubb of the Honourable Throne).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
కష్టాలు, ఆపదల సమయాల్లో దేవుణ్ణి స్మరించటం, ఆయన ఏకత్వాన్ని , ఔన్నత్యాన్ని గుర్తుచేసుకోవటం, భౌతిక సాధన సంపత్తిని సమకూర్చుకున్న తర్వాత కేవలం ఆ ఒకే ఒక్కని మీద మొక్కవోని విశ్వాసాన్ని, పట్టుసడలని నమ్మకాన్ని ప్రదర్శించటం మూలంగా మనిషికి ఎంతో ధైర్యం వస్తుంది. అందుకని దైవప్రవక్త ﷺ కూడా అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపుకు మరలేవారు. ఎందుకంటే సర్వాధికారాలూ ఆ ఒక్క దేవుని చేతుల్లోనే ఉన్నాయి. ఆయన తప్ప ఇతరుల దగ్గర ఏ అధికారమూ లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|252. పార్థనకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు|హదీసు 1503
You must be logged in to post a comment.