హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 251వ అధ్యాయం: పరోక్ష ప్రార్థన విశిష్టత. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 2 హదీసులు (హదీసు 1495 – 1496) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
251. పరోక్ష ప్రార్థన విశిష్టత
باب فضل الدُّعاء بظهر الغيب
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَالَّذِينَ جَاءُوا مِنْ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْأِيمَانِ} [الحشر: ١٠]
వారి తర్వాత వచ్చినవారు ఇలా అంటారు: "ఓ ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు." (హష్ర్: 10)
{وَاسْتَغْفِرْ لِذَنْبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ} [محمد: ١٩]
"నీ పొరపాట్లకు, విశ్వాసులైన స్త్రీపురుషుల పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో." (ముహమ్మద్: 19)
దేవుడు (దివ్య ఖుర్ఆన్లో) ఇబ్రాహీమ్ ప్రవక్త ఈ విధంగా ప్రార్థించారని అంటున్నాడు:
{رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ} [إبراهيم: ٤١]
"మా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులనూ, విశ్వసించే వారంధరినీ లెక్క ఖరారు అయ్యే రోజున క్షమించు." (ఇబ్రాహీమ్: 41)
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన సూక్తులన్నిటిలోనూ ఇతరుల కోసం వారి గైర్హాజరులో ప్రార్థించటం జరిగింది. దీని ద్వారా ఈ రకమైన పరోక్ష ప్రార్థనకు ఎంతటి విశిష్టత ఉందో అర్థమవుతుంది.
English
“And those who came after them say: `Our Rubb! Forgive us and our brethren who have preceded us in Faith.”’ [Al-Ḥashr 59:10]
“And ask forgiveness for your sin, and also for (the sin of) believing men and believing women”. [Muḥammad 47:19]
“Our Rubb! Forgive me and my parents, and (all) the believers on the Day when the reckoning will be established.” [Ibrāhīm 14:41]
హదీసు 1495
وَعَن أَبي الدَّردَاءِ رَضِي اللَّه عنْهُ أَنَّهُ سمِعَ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "مَا مِن عبْدٍ مُسْلِمٍ يَدعُو لأَخِيهِ بِظَهرِ الغَيْبِ إِلاَّ قَالَ المَلكُ ولَكَ بمِثْلٍ"ر واه مسلم.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఏ ముస్లిం దాసుడైనా తన సోదరుని పరోక్షంలో అతని కోసం ప్రార్థిస్తే దైవదూత (ఒకడు) 'నీక్కూడా అలాగే జరుగుగాక!' అని దీవిస్తూ ఉంటాడు.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abud-Darda’ (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “Whenever a Muslim supplicates for his (Muslim) brother in his absence, the angels say: `May the same be for you too‘.”[Muslim].
ముఖ్యాంశాలు
ఒక ముస్లిం తోటి ముస్లిం కోసం అతని పరోక్షంలో ప్రార్థించటం వల్ల స్వయంగా తనకు కూడా ప్రయోజనం కలుగుతుంది. అతను ఇతరుల కోసం ప్రార్థించగానే దైవదూతలు అతని గురించి దేవునికి సిఫారసు చేస్తారు. తను ఇతరుల కోసం కోరుకుంటున్నది తనకు కూడా ప్రాప్తం కావాలని దీవిస్తారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|251. పరోక్ష ప్రార్థన విశిష్టత|హదీసు 1495
హదీసు 1496
وعَنْهُ أَنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ يقُولُ:"دَعْوةُ المرءِ المُسْلِمِ لأَخيهِ بِظَهْرِ الغَيْبِ مُسْتَجَابةٌ، عِنْد رأْسِهِ ملَكٌ مُوكَّلٌ كلَّمَا دَعَا لأَخِيهِ بخيرٍ قَال المَلَكُ المُوكَّلُ بِهِ: آمِينَ، ولَكَ بمِثْلٍ" رواه مسلم.
అబూ దర్దా (రదియల్లాహు అన్హు)గారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ముస్లిం వ్యక్తి తన సోదరుని గైర్హాజరులో అతనికోసం ప్రార్థిస్తే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. అతని తల దగ్గర ఒక దూత నియమించబడి ఉన్నాడు. ఆ వ్యక్తి తన సోదరుని శ్రేయస్సు కోసం ప్రార్థించినప్పుడల్లా ఆ నియమిత దూత "ఆమీన్, నీక్కూడా అలాగే జరుగుతుంది" అని దీవిస్తుంటాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abud-Darda’ (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The supplication of a Muslim for his (Muslim) brother in his absence will certainly be answered. Everytime he makes a supplication for good for his brother, the angel appointed for this particular task says: `A meen! May it be for you, too‘.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|251. పరోక్ష ప్రార్థన విశిష్టత|హదీసు 1496
You must be logged in to post a comment.