హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 253వ అధ్యాయం: వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 8 హదీసులు (హదీసు 1504 – 1511) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం

↑ విషయ సూచిక

باب كرامات الأولياء وفضلهم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{أَلا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لاَ خَوْفٌ عَلَيْهِمْ وَلا هُمْ يَحْزَنُونَ الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ لَهُمُ الْبُشْرَى فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الآخِرَةِ لاَ تَبْدِيلَ لِكَلِمَاتِ اللَّهِ ذَلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ} [يونس: ٦٢, ٦٤]

"విను, అల్లాహ్‌కు స్నేహితులైన వారికీ, ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించినవారికీ ఏ విధమైన భయంగానీ, విషాదంగానీ కలిగే అవకాశం లేదు. ఇహపర జీవితాలు రెండింటిలో కూడా వారికి శుభవార్తలే శుభవార్తలు. అల్లాహ్ మాటలు మారవు. ఇదే ఘన విజయం." (యూనుస్: 62-64)

{وَهُزِّي إِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسَاقِطْ عَلَيْكِ رُطَباً جَنِيّاً فَكُلِي وَاشْرَبِي} [مريم: ٢٥, ٢٦]

"(ఓ మర్‌యమ్!) నీవు ఈ చెట్టు మొదలు కొంచెం ఊపు. నీపై స్వచ్ఛమైన తాజా ఖర్జూరపు పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు." (మర్‌యమ్: 25-26)

{كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِنْدَهَا رِزْقاً قَالَ يَا مَرْيَمُ أَنَّى لَكِ هَذَا قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللَّهِ إِنَّ اللَّهَ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ} [آل عمران: ٣٧]

"జకరియ్యా మర్‌యమ్ గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థములను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు: "మర్యమ్! ఇవి నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చాయి?" ఆమె ఇలా జవాబు చెప్పేది: "అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు." (ఆలి ఇమ్రాన్: 37)

"మీరు వారితోనూ, అల్లాహ్‌ను కాదని వారు ఆరాధించే దేవుళ్ళతోనూ సంబంధాలను త్రెంచుకున్నారు. కనుక ఇక పదండి, ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యఛాయను విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సకల సామగ్రిని సమకూరుస్తాడు.

{وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلاَّ اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنْشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ وَيُهَيِّئْ لَكُمْ مِنْ أَمْرِكُمْ مِرْفَقاً ووَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَتْ تَزَاوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَتْ تَقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ} [الكهف: ١٧,١٦]

వారిని నీవు గుహలో చూసినప్పుడు, సూర్యుడు ఉదయించేటప్పుడు వారి గుహను తాకకుండా కుడి ప్రక్కగా పైకి పోయినట్లునూ, అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ ప్రక్కగా దిగిపోయినట్లునూ నీకు గోచరిస్తుంది." (కహఫ్:16,17)

ముఖ్యాంశాలు

పైన పేర్కొనబడిన మొదటి సూక్తిలో దేవుని ప్రియదాసుల సుగుణాలు పొందుపరచబడ్డాయి. విశ్వాసం, భయభక్తులు గలవారు దేవుని ప్రియదాసులవుతారు. వీరు దైవసన్నిధికి హాజరయినప్పుడు వీరిలో దుఃఖం, భయాందోళనల తాలూకు ఆనవాళ్ళు మచ్చుకైనా కానరావు. ఎందుకంటే ఆ సమయంలో వారి వెంట విశ్వాసం, భయభక్తుల సామగ్రి ఉంటుంది. అదే ప్రళయదినాన మానవుల విముక్తికి దోహదపడుతుంది. రెండో సూక్తిలో దేవుని ప్రియదాసుల వల్ల ఉనికిలోకి వచ్చిన కొన్ని మహిమలు పేర్కొనబడ్డాయి. ఈ రకమైన మహిమల్ని 'కరామాత్' అని అంటారు. అసలు కరామత్ అంటే ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జరిగేది అని అర్థం. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు సాధారణమైన కారణాలు లేకుండానే జరుగుతాయి. ఉదాహరణకు అగ్నికి కాల్చే గుణముంది. అలాంటిది అది కాల్చకుండా ఉండటం. అలాగే ఎండిన చెట్లకూ, కాలం కాని కాలంలో పండ్లు రావు. అయినా ఆ సందర్భాల్లో పండ్లు రావటం- ఇవన్నీ ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జరిగేవన్నమాట. వలీల, పుణ్యాత్ముల మూలంగా ఇలాంటివి ఉనికిలోకి వస్తే వాటిని 'కరామాత్' అని అంటారు. ఇవి మానవుని అధీనంలోని విషయాలు కావు. దేవుని ప్రియదాసులు ఎప్పుడంటే అప్పుడు వీటిని చేసి చూపించలేరు. వాస్తవానికి ఈ అధికారమంతా దేవుని చేతుల్లోనే ఉంది. ఆయన తాను తలచినప్పుడు తన దాసుల్లో ఎవరిచేత నయినా వీటిని ఉనికిలోనికి రప్పిస్తాడు.

దైవప్రవక్తల అద్భుతాలు (మోజిజాత్‌ల) లాగే ఈ కరామత్‌లు కూడా నిజంగా జరుగుతాయి. అయితే చాలా మంది అనుకుంటున్నట్లు ఒక వ్యక్తి వలీ లేక దైవప్రియుడు అని చెప్పటానికి అది ప్రామాణికత మాత్రం కాదు. దైవం పట్ల భయభక్తులతో పరిపూర్ణ విశ్వాసం కలిగివున్న వాడెవడయినా వలీ కావచ్చు. అందుకు అతను మహిమల్ని సృష్టించాల్సిన అవసరం లేదు. కరామత్ అనేది ఒక వేరే విశిష్ఠత. దేవుడు తలచుకుంటే ఒక వలీకి ఆ విశిష్ఠతను కూడా ప్రసాదించ గలడనుకోండి. కాని మహిమల్ని సృష్టించినవాడే వలీ అవుతాడన్న నియమం ఏమీ లేదు. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు చూడండి.

English

“No doubt! Verily, the Auliya’ of Allah [i.e., those who believe in the Oneness of Allah and fear Allah much (abstain from all kinds of sins and evil deeds which He has forbidden), and love Allah much (perform all kinds of good deeds which He has ordained)], no fear shall come upon them nor shall they grieve. Those who believed (in the Oneness of Allah – Islamic Monotheism), and used to fear Allah much (by abstaining from evil deeds and sins and by doing righteous deeds). For them are glad tidings, in the life of the present world (i.e., through a righteous dream seen by the person himself or shown to others), and in the Hereafter. No change can there be in the Words of Allah. This is indeed the supreme success.” [Yūnus 10:62–64]

“And shake the trunk of date-palm towards you, it will let fall fresh ripe-dates upon you. So eat and drink.” [Maryam 19:25–26]

“Every time he (Zakariya) entered Al-Mihrab to (visit) her, he found her supplied with sustenance. He said: `O Maryam (Mary)! From where have you got this?’ She said, `This is from Allah.’ Verily, Allah provides sustenance to whom He wills, without limit.” [Āl ‘Imrān 3:37]

“(The young men said to one another): `And when you withdraw from them, and that which they worship, except Allah, then seek refuge in the Cave; your Rubb will open a way for you from His Mercy and will make easy for you your affair (i.e., will give you what you will need of provision, dwelling). And you might have seen the sun, when it rose, declining to the right from their Cave, and when it set, turning away from them to the left…” [Al-Kahf 18:16–17]

1504

హదీసు 1504

وعنْ أبي مُحَمَّدٍ عَبْدِ الرَّحْمن بنِ أَبي بكرٍ الصِّدِّيقِ رضي اللَّه عنْهُما أنَّ أصْحاب الصُّفَّةِ كانُوا أُنَاساً فُقَرَاءَ وأنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ مرَّةً"منْ كانَ عِنْدَهُ طَعامُ اثنَينِ، فَلْيذْهَبْ بِثَالث، ومَنْ كَانَ عِنْدهُ طعامُ أرْبَعَةٍ، فَلْيَذْهَبْ بخَامِسٍ وبِسَادِسٍ"أوْ كَما قَالَ، وأنَّ أبَا بَكْرٍ رضي اللَّه عَنْهُ جاءَ بثَلاثَةٍ، وَانْطَلَقَ النبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِعَشرَةٍ، وَأنَّ أبَا بَكْرٍ تَعَشَّى عِنْد النبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ثُّمَّ لَبِثَ حَتَّى صلَّى العِشَاءَ، ثُمَّ رَجَعَ، فَجَاءَ بَعْدَ مَا مَضَى مِنَ اللَّيلِ مَا شاءَ اللَّه. قَالَتْ له امْرَأَتُهُ: ما حبسَكَ عَنْ أضْيافِكَ؟ قَالَ: أوَ ما عَشَّيتِهمْ؟ قَالَتْ: أبوْا حَتَّى تَجِيءَ وَقدْ عرَضُوا عَلَيْهِم قَال: فَذَهَبْتُ أنَا، فَاختبأْتُ، فَقَالَ: يَا غُنْثَرُ، فجدَّعَ وَسَبَّ وَقَالَ: كُلُوا لاَ هَنِيئاً، واللَّه لا أَطْعمُهُ أبَداًِ، قَالَ: وايمُ اللَّهِ مَا كُنَّا نَأْخذُ منْ لُقْمةٍ إلاَّ ربا مِنْ أَسْفَلِهَا أكْثَرُ مِنْهَا حتَّى شَبِعُوا، وصَارَتْ أكثَرَ مِمَّا كَانَتْ قَبْلَ ذلكَ، فَنَظَرَ إلَيْهَا أبُو بكْرٍ فَقَال لامْرَأَتِهِ: يَا أُخْتَ بني فِرَاسٍ مَا هَذا؟ قَالَتْ: لا وَقُرّةِ عَيني لهي الآنَ أَكثَرُ مِنْهَا قَبْلَ ذَلكَ بِثَلاثِ مرَّاتٍ، فَأَكَل مِنْهَا أبُو بكْرٍ وَقَال: إنَّمَا كَانَ ذلكَ مِنَ الشَّيطَانِ، يَعني يَمينَهُ، ثُمَّ أَكَلَ مِنهَا لٍقمةً، ثُمَّ حَمَلَهَا إِلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَأَصْبَحَت عِنْدَهُ. وكانَ بَيْننَا وبَيْنَ قَومٍ عهْدٌ، فَمَضَى الأجَلُ، فَتَفَرَّقنَا اثْنَيْ عشَرَ رَجُلاً، مَعَ كُلِّ رَجُلٍ مِنْهُم أُنَاسٌ، اللَّه أعْلَم كَمْ مَعَ كُلِّ رَجُلٍ فَأَكَلُوا مِنْهَا أَجْمَعُونَ. وَفِي روايَة: فَحَلَفَ أبُو بَكْرٍ لا يَطْعمُه، فَحَلَفَتِ المرأَةُ لا تَطْعِمَه، فَحَلَفَ الضِّيفُ أوِ الأَضْيَافُ أنْ لاَ يَطعَمَه، أوْ يطعَمُوه حَتَّى يَطعَمه، فَقَالَ أبُو بَكْرٍ: هذِهِ مِنَ الشَّيْطَانِ، فَدَعا بالطَّعامِ فَأَكَلَ وَأَكَلُوا، فَجَعَلُوا لا يَرْفَعُونَ لُقْمَةً إلاَّ ربَتْ مِنْ أَسْفَلِهَا أَكْثَرَ مِنْهَا، فَقَال: يَا أُخْتَ بَني فِرَاس، مَا هَذا؟ فَقالَتْ: وَقُرَّةِ عَيْني إنهَا الآنَ لأَكْثَرُ مِنْهَا قَبْلَ أنْ نَأْكُلَ، فَأَكَلُوا، وبَعَثَ بهَا إِلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فذَكَرَ أَنَّه أَكَلَ مِنهَا. وَفِي روايةٍ: إنَّ أبَا بَكْرٍ قَالَ لِعَبْدِ الرَّحْمَنِ: دُونَكَ أَضْيافَكَ، فَإنِّي مُنْطَلِقٌ إِلَى النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَافْرُغْ مِنْ قِراهُم قَبْلَ أنْ أجِيءَ، فَانْطَلَقَ عبْدُ الرَّحمَن، فَأَتَاهم بمَا عِنْدهُ. فَقَال: اطْعَمُوا، فقَالُوا: أيْنَ رَبُّ مَنزِلَنَا؟ قَالَ: اطْعَمُوا، قَالُوا: مَا نَحْنُ بآكِلِين حتَى يَجِيىء ربُ مَنْزِلَنا، قَال: اقْبَلُوا عَنَّا قِرَاكُم، فإنَّه إنْ جَاءَ ولَمْ تَطْعَمُوا لَنَلقَيَنَّ مِنْهُ، فَأَبَوْا، فَعَرَفْتُ أنَّه يَجِد عَلَيَّ، فَلَمَّا جاءَ تَنَحَّيْتُ عَنْهُ، فَقالَ: ماصنعتم؟ فأَخْبَروهُ، فقالَ يَا عَبْدَ الرَّحمَنِ فَسَكَتُّ ثم قال: يا عبد الرحمن. فَسَكَتُّ، فَقَالَ: يَا غُنثَرُ أَقْسَمْتُ عَلَيْكَ إنْ كُنْتَ تَسمَعُ صَوتِي لَمَا جِئْتَ، فَخَرَجتُ، فَقُلْتُ: سلْ أَضْيَافكَ، فَقَالُوا: صَدقَ، أتَانَا بِهِ. فَقَالَ: إنَّمَا انْتَظَرْتُموني وَاللَّه لا أَطعَمُه اللَّيْلَةَ، فَقالَ الآخَرون: وَاللَّهِ لا نَطعَمُه حَتَّى تَطعمه، فَقَالَ: وَيْلَكُم مَالَكُمْ لا تَقْبَلُونَ عنَّا قِرَاكُم؟ هَاتِ طَعَامَكَ، فَجاءَ بِهِ، فَوَضَعَ يَدَه، فَقَالَ: بِسْمِ اللَّهِ، الأولَى مِنَ الشَّيطَانِ فَأَكَلَ وَأَكَلُوا. متفقٌ عَلَيْهِ. قَوْله:"غُنْثَر"بغينٍ معجمةٍ مضمومةٍ، ثُمَّ نونٍ ساكِنةٍ، ثُمَّ ثاءٍ مثلثةٍ وَهُوَ: الغَبيُّ الجَاهٍلُ، وقولُهُ:"فجدَّع"أَيْ شَتَمه وَالجَدْع: القَطع. قولُه:"يجِدُ عليَّ"هُوَ بكسرِ الجيمِ، أيْ: يَغْضَبُ.

హజ్రత్ అబూ ముహమ్మద్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: అరుగువాసులు (అస్‌హాబె సుప్ఫా) చాలా పేదవారు. ఒకసారి దైవప్రవక్త ﷺ "ఎవరి దగ్గరయినా ఇద్దరికి సరిపోయే అన్నం ఉంటే వారు మూడో వ్యక్తిగా (అరుగువాసుల్లో) ఎవరినయినా తీసుకెళ్ళాలి. ఎవరి దగ్గరయినా నలుగురి అన్నం ఉంటే వారు ఐదో, ఆరో వ్యక్తిగా ఎవరినయినా తీసుకెళ్ళాలి" అని ప్రకటించారు. దైవప్రవక్త ﷺ ఇలాంటి మాటే అన్నట్టు గుర్తుంది. ఆ ప్రకటన తర్వాత అబూబకర్ (రదియల్లాహు అన్హు) ముగ్గురిని ఇంటికి పిలుచుకొని వెళ్ళారు. దైవప్రవక్త ﷺ పదిమందిని పిలుచుకొని వెళ్ళారు.

(ఆ రోజు) అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) రాత్రి భోజనం దైవప్రవక్త ﷺ ఇంట్లో తిన్నారు. భోజనానంతరం కాసేపు అక్కడే ఉండి ఇషా నమాజు చేసుకొని ఇంటికి బయలుదేరారు. ఆయన ఇంటికి చేరుకునేటప్పటికి కొంత రాత్రి దేవుడు తలచినంత గడచిపోయింది. ఆయన రాగానే ఆయన భార్య ఆయన్ని "అతిధుల్ని ఇంట్లో వదలిపెట్టి ఎక్కడికెళ్ళారూ?" అని అడిగింది. అందుకాయన "నువ్వు వారికి భోజనం పెట్టలేదా ఏమిటి?" అని ఎదురు ప్రశ్నించారు. అందుకామె సంగతిని వివరిస్తూ, "(అది కాదండీ) మీరు వచ్చేదాకా వారు అన్నం తినమని కూర్చున్నారు. ఇంటివారు వారికి ఎప్పుడో అన్నం వడించారు" అని చెప్పింది. (కొన్ని ఉల్లేఖనాల్లో ఇంటివారికి బదులు 'మేము వడ్డించాం' అని ఉంది.) (ఆయన గారు నా మీద విరుచుకు పడతారేమోనని భయంతో) నేను తొందరగా వెళ్ళి దాక్కున్నాను. అప్పుడాయన నన్ను "ఒరేయ్! మూర్ఖుడా! ఎక్కడున్నావ్‌రా?" అని కేకలు పెట్టి పిలిచి తిట్టారు. శాపనార్ధాలు పెట్టారు. ఆ తర్వాత (అతిథులతో) "మీరు తినండి. ఇది మీకు ఆహ్లాదకరం కాకూడదుగాక!" (ఈ మాట ఆయన ఇంటివారు బతిమాలినప్పటికీ అతిథులు అన్నం తిననందుకు కోపంలో అని ఉంటారు. కొంత మంది ఆయన ఈ మాట తన ఇంటివారినే అన్నట్టు అభిప్రాయపడ్డారు.) "దైవం తోడు! నేను ఇది తినలేను" అని అన్నారు.

హదీసు ఉల్లేఖకులు అబ్దుర్రహ్మాన్ ఇలా అంటున్నారు: "దైవం సాక్షి! (ఆ రోజు మేము అన్నం తినేటప్పుడు) పై నుంచి ముద్ద లేపుతుంటే క్రింద నుంచి ఎన్నో రెట్లు అన్నం అందులో చేరుతూ పోయింది. అతిథులందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత చూస్తే అన్నం పూర్వంకన్నా చాలా ఎక్కువ మోతాదులో ఉంది. అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) అన్నమున్న పాత్ర వైపు చూసి భార్యను, "బనీ ఫిరాస్ సోదరీ! ఏమిటీ ఈ వింత?" అని అడిగారు. అందుకామె "నా కంటి చలువ సాక్షి! (ఇది దైవేతరుల మీద ఒట్టు వేయటం నిషిద్ధం చేయబడక ముందు జరిగిన సంఘటన) ఈ అన్నం పూర్వం కన్నా మూడు రెట్లు పెరిగిపోయింది" అన్నారు. అప్పుడు అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) ఆ అన్నంలో కొంత తిని, తాను అంతకుముందు షైతాన్ (దుష్టప్రేరేపణ) వల్ల ఒట్టు వేశానని చెప్పారు. ఆ తర్వాత అందులో నుంచి ఒక ముద్ద తిని మిగిలింది దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ అన్నం ఉదయం వరకూ ఆయన దగ్గరే ఉండింది.

(ఆ కాలంలో) మాకు ఇతరులు కొందరితో ఒప్పందం కుదిరి ఉంది. అప్పటికి దాని గడువు ముగిసిపోయింది. మేం పన్నెండు మందిమి (కాపలా పని మీద) వివిధ చోట్లకు వెళ్ళి ఉన్నాం. మాలో ప్రతి ఒక్కని వెంట కొందరు అనుచరులు ఉన్నారు. ఒక్కొక్కని వెంట ఎంతమంది ఉన్నారో దేవునికే బాగా తెలుసు. (దైవప్రవక్త ﷺ దగ్గరికి తీసుకువెళ్ళిన) ఆ అన్నాన్ని వాళ్ళందరూ తిన్నారు.

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తాను అన్నం తిననని ఒట్టేసుకున్నారు. ఆయన భార్య కూడా అన్నం తిననని ఒట్టేసుకుంది. అతిథి లేక అతిథులు కూడా అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) తిననంతవరకు తామూ తినమని ఒట్టేసుకున్నారు. (ఆ తర్వాత) అబూబక్ర్ తాను షైతాన్ మూలంగా ఒట్టేసుకున్నానని చెప్పి అన్నం తెప్పించుకొని తిన్నారు. ఆయన అతిథులు కూడా తిన్నారు. పై నుంచి ముద్ద లేపుతుంటే ఆ అన్నం క్రింద నుంచి ఎన్నో రెట్లు పెరిగిపోతూ ఉండింది. అప్పుడాయన తన భార్యను ఉద్దేశ్యించి, "ఓ బనీ ఫిరాస్ సోదరీ! ఏమిటీ వింత?" అని అడిగారు. అందుకు ఆమె (కూడా ఆశ్చర్యపోతూ) "నా కంటిచలువ సాక్షి! ఈ అన్నం మేము తినకముందు ఎంతుందో ఇప్పుడు దాని కంటే చాలా ఎక్కువగా ఉంది" అన్నారు. అప్పుడు వాళ్ళింటి వారంతా ఆ అన్నం తిన్నారు. ఆ తర్వాత దాన్ని దైవప్రవక్త ﷺ దగ్గరికి పంపించారు. ఉల్లేఖకుడు చెప్పినట్లు దైవప్రవక్త ﷺ కూడా ఆ అన్నం తిన్నారు.

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) (తన కుమారుడయిన) అబ్దుర్రహ్మాన్‌కు 'నువ్వు మన అతిథుల్ని కనిపెట్టుకొని ఉండు. నేను దైవప్రవక్త ﷺ దగ్గరికి వెళ్తున్నాను. నేను తిరిగొచ్చేటప్పటికి అతిథి సత్కారాలన్నీ పూర్తయిపోయి ఉండాలి" అని ఆదేశించి వెళ్ళిపోయారు. అబ్దుర్రహ్మాన్ (లోపలికి) వెళ్ళి (తమ దగ్గరవున్న ఆహార పదార్థాలు) తీసుకొనివచ్చి అతిథుల ముందు ఉంచి "తినండి" అని అన్నారు. అందుకు అతిథులు "మన ఇంటాయన ఏరి? ఎక్కడున్నారు?" అని అడిగారు. అందుకు అబ్దుర్రహ్మాన్ మాట్లాడుతూ, "(ఆయన్ని వదిలేయండి) మీరు మా తరపు నుండి ఆతిథ్యం స్వీకరించండి. ఎందుకంటే, ఒకవేళ మీరు అన్నం తినకముందే ఆయన (అబూబక్ర్) ఇంటికి వచ్చేసినట్లయితే మాకు తిట్లు పడతాయి (కనుక దయచేసి మీరు మొదలుపెట్టండి)" అని బతిమాలారు. కాని వారు మాత్రం తినడానికి అంగీకరించలేదు.

(ఆ తర్వాత అబ్దుర్రహ్మాన్ ఇలా చెబుతున్నారు:) అప్పుడు నేను ఆయన ఎలాగైనా నన్ను కోపగించుకుంటారని అనుకున్నాను. అందుకని ఆయన ఇంటికి రాగానే నేను (భయపడి) ఓ మూలకెళ్ళి దాక్కున్నాను. ఆయన వచ్చీ రాగానే, "ఏం చేస్తున్నారు? భోజనం అయిందా?" అని అడిగారు. వారు ఆయనకు విషయం చెప్పేశారు. ఆయన (కోపంతో) "ఒరేయ్ అబ్దుర్రహ్మాన్!" అని కేకవేశారు. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆయన మళ్ళీ "ఒరేయ్ అబ్దుర్రహ్మాన్!" అని కేకవేశారు. అప్పటికీ నేను జవాబు ఇవ్వలేదు. (మూడోసారి) ఆయన "ఒరేయ్ చవట! వినిపించట్లేదట్రా, త్వరగా బయటికి రా. లేకపోతే ఒట్టే" అని అన్నారు. నేను బయటికి వచ్చి "(నాన్నా! మేము మాత్రం ఏ లోటూ చేయలేదు) కావాలంటే అతిథుల్ని అడిగి చూడండి" అని అన్నాను. అంతలో అతిథులు కల్పించుకొని, "అబ్దుర్రహ్మాన్ చెబుతుంది నిజమే. ఇతను మా దగ్గరికి అన్నం తీసుకువచ్చాడు" అని చెప్పారు. "అంటే మీరు నా కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. దైవం సాక్షి! ఈ రోజు రాత్రి నేను అన్నం తినను" అని అన్నారు అబూబక్ర్ (రదియల్లాహు అన్హు). ఆ మాటకు ఇతరులు కూడా "దైవం సాక్షి! మీరు తిననంతవరకూ మేము కూడా తినము" అని ఒట్టేసుకున్నారు. అందుకు అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), "ఏంటండి, మా ఆతిథ్యం స్వీకరించమంటే అలా చేస్తారేమిటి? సరే, నా కోసం కూడా అన్నం తీసుకురా (నాయనా)" అని ఆదేశించారు. అబ్దుర్రహ్మాన్ అన్నం తీసుకురాగానే ఆయన అందులో చేయి ఉంచి "ఇందాక (నేను కోపంలో ఒట్టేసుకున్న స్థితి) షైతాన్ మూలంగా వచ్చింది" అని చెప్పి అన్నం తిన్నారు. ఆయనతోపాటు ఇతరులు కూడా ఆ అన్నం తిన్నారు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని నమాజు వ్యవధుల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని పానీయాల ప్రకరణం)

English

`Abdur-Rahman bin Abu Bakr (radiyallahu anhuma) reported: The Companions of As-Suffah were poor people. The Prophet ﷺ said, “Whoever has food enough for two people, should take a third one (from among them), and whoever has food enough for four persons, should take a fifth or sixth (or said something similar).” Abu Bakr (radiyallahu anhu) took three people with him while Messenger of Allah ﷺ took ten. Abu Bakr (radiyallahu anhu) took his supper with the Prophet ﷺ and stayed there till he offered the `Isha’ prayers. After a part of the night had passed, he returned to his house. His wife said to him: “What has detained you from your guests?” He said: “Have you not served supper to them?” She said: “They refused to take supper until you come.” [Abdur-Rahman (Abu Bakr’s son) or the servants] presented the meal to them but they refused to eat. I (the narrator) hid myself out of fear. Abu Bakr (radiyallahu anhu) (my father) rebuked me. Then he said to them: “Please eat. By Allah! I will never eat the meal.” `Abdur-Rahman added: Whenever we took a morsel of the meal, the meal grew from underneath more than that morsel we had till everybody ate to his satisfaction; yet the remaining food was more than what was in the beginning. On seeing this, Abu Bakr (radiyallahu anhu) called his wife and said: “O sister of Banu Firas! What is this?” She said: “O pleasure of my eyes! The food has increased thrice in quantity.” Then Abu Bakr (radiyallahu anhu) started eating. He said: “My oath not to take the meal was because of Satan.” He took a morsel handful from it and carried the rest to the Prophet ﷺ. That food remained with him. In those days there was a treaty between us and the pagans and when the period of that treaty elapsed, he ﷺ divided us into twelve groups and every group was headed by a man. Allah knows how many men were under the command of each leader. Anyhow, all of them ate of that meal.[Al-Bukhari and Muslim].

There are some more narrations in both Al-Bukhari and Muslim with very minor differences in wordings and in details.

ముఖ్యాంశాలు

రియాజుస్సాలిహీన్ గ్రంథ ప్రతుల్లో, "ఫతఫర్రఖ్‌నా ఇస్‌నై అషర రజులన్" అని ఉంది. కాని సహీహ్ ముస్లిం గ్రంథంలో 'ఫఫర్రఖ్‌నా' అని ఉంది. దీని అర్థం మేము పన్నెండుమందిని వేర్వేరు కూటములుగా విభజించాము అని. సహీహ్ బుఖారీ గ్రంథంలో, "ఫఅర్రఫ్‌నా" అని ఉంది. పర్యవేక్షకుణ్ణి నియమించటం అని దీని అర్థం. ముస్లిం గ్రంథ వ్యాఖ్యానంలో ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) గారు ఈ రెండు పదాలూ సరైనవేనని పేర్కొన్నారు. సైన్యాధ్యక్షుడు, కమాండరు కాక సైన్యపర్యవేక్షణ కోసం, మంచిచెడ్డలు తెలుసుకోవటం కోసం నియమితుడైన ప్రత్యేక అధికారిని 'అరీఫ్' అంటారు. మొత్తానికి దీని భావం ఏమిటంటే ఆ కాలంలో పన్నెండు మందిని అరీఫ్‌లుగా నియమించటం జరిగింది. వారిలో ప్రతి ఒక్కరి వెంట వారి సహాయార్ధం కొంతమంది అనుచరులు కూడా ఉండేవారు.

1) హదీసులో వివరించబడిన విధంగా ధార్మిక పాఠశాలల్లో ధార్మిక విద్య నభ్యసించే విద్యార్థుల్ని ప్రజలు తమ ఇండ్లకు పిలుచుకొనివెళ్ళి వారికి అన్నం తినిపించటం చేయవచ్చు. ఇంతకు ముందు కొన్నికొన్ని ప్రాంతాల్లో కొందరు ఈ విధానాన్ని పాటించేవారు. బహుశా ఇప్పటికీ ఎక్కడైనా ఈ విధానం అమల్లో ఉండవచ్చు.

2) పిల్లలకు సంస్కారం నేర్పే ఉద్దేశ్యంతో తండ్రి వారిని మందలించవచ్చు. వారిని తిట్టడం, శాపనార్ధాలు పెట్టడంలోనూ తప్పులేదు.

3) ధర్మసమ్మతమైన ఆహార పదార్థాలకు సంబంధించి వాటిని తినమని ఒట్టేసుకోవడంలో తప్పులేదు.

4) ఒకవేళ అంతకంటే మంచి పద్ధతి ఉందనుకుంటే ఒట్టుని భంగం చేసుకొని ఆ పద్ధతిని అవలంబించాలి. అయితే అలాంటి సందర్భంలో ఆ ఒట్టుకి పరిహారం చెల్లించవలసి ఉంటుంది.

5) ఇందులో 'కరామత్' నిజమని నిరూపించబడింది. కొద్దిపాటి అన్నంలోనే దేవుడు ఎంత శుభాన్ని అనుగ్రహిం[చా]డంటే అబూబక్ర్ ఇంటివారు, ఆయన అతిథులు, దైవప్రవక్త ﷺ, పన్నెండు మంది అరీఫ్‌లు తమ అనుచరుల సమేతంగా అందరూ ఆ అన్నం తిన్నారు. (ఫత్‌హుల్ బారీ, కితాబుల్ మనాఖిబ్)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1504

1505

హదీసు 1505

وعنْ أبي هُرَيْرَة رضي اللَّه عَنْهُ قَالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"لَقَدْ كَان فِيما قَبْلَكُمْ مِنَ الأُممِ نَاسٌ محدَّثونَ، فَإنْ يَكُ في أُمَّتي أَحَدٌ، فإنَّهُ عُمَرُ" رواه البخاري، ورواه مسلم من روايةِ عائشةَ، وفي رِوايتِهما قالَ ابنُ وَهْبٍ:"محدَّثُونَ"أَي: مُلهَمُون.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీకు పూర్వపు సమాజాల్లో మగతలో దేవుని విషయాలు తెలుసుకునేవారు కొందరుండేవారు. ఒకవేళ నా అనుచర సమాజంలో అలాంటివారు ఎవరైనా ఉంటే ఆయన ఉమర్(రదియల్లాహు అన్హు). (బుఖారీ)

ముస్లిం ఈ హదీసును ఆయిషా (రదియల్లాహు అన్హా) ఆధారంగా వెలికితీశారు. ఆ రెండు హదీసుల్లోనూ ఇబ్నె వహబ్, ముహద్దసూన్ అంటే ముల్‌హమూన్ అని అర్థమని పేర్కొన్నారని ఉంది.

(సహీహ్ బుఖారీలోని ప్రవక్త సహచరుల మహిమోన్నతుల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “There were Muhaddithun (the recipients of Divine inspiration) among the nations before you. If there is any of such Muhaddith among my followers, he must be `Umar.”[Al-Bukhari].

In Muslim, this Hadith is narrated by `Aishah (radiyallahu anha), and in both these narrations Ibn Wahb has said that the meaning of Muhaddithun is recipients of Divine inspiration.

ముఖ్యాంశాలు

దేవుని తరపు నుండి మనసులో విషయాలు నాటబడేవారిని "ముల్‌హమూన్" అని అంటారు. ఉదాహరణకు ఒకవేళ శత్రువుల బెడద ఉందనుకుంటే మూసాను నదిలో వదిలేయమని మూసా తల్లికి దేవుని తరపు నుండి మనసులో ఒక ఆలోచన వచ్చింది. అలాగే మర్‌యమ్ (అలైహా)కు కూడా మనసులో దేవుని తరపు నుండి విషయాలు నాటబడుతూ ఉండేవి. ఇవన్నీ కూడా కరామత్‌కు సంబంధించిన వివిధ రూపాలే. పోతే ఈ హదీసు ముఖ్యంగా ఉమర్ (రదియల్లాహు అన్హు) ఔన్నత్యాన్ని వివరిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1505

1506

హదీసు 1506

وعنْ جَابِر بنِ سمُرَةَ، رضي اللَّه عَنْهُمَا. قَالَ: شَكَا أهْلُ الكُوفَةِ سَعْداً، يَعْنِي: ابْنِ أَبي وَقَّاصٍ، رضي اللَّه عَنْهُ، إِلَى عُمَرَ بنِ الخَطَّابِ، رضي اللَّه عَنْهُ، فَعزَلَه وَاسْتَعْمَلَ عَلَيْهِمْ عمَّاراً، فَشَكَوْا حَتَّى ذكَرُوا أَنَّهُ لا يُحْسِنُ يُصَلِّي، فَأْرسَلَ إلَيْهِ، فَقَالَ: ياأَبا إسْحاقَ، إنَّ هؤُلاءِ يزْعُمُونَ أنَّكَ لا تُحْسِنُ تُصَلِّي. فَقَالَ: أمَّا أَنَا واللَّهِ فَإنِّي كُنْتُ أُصَلِّي بِهمْ صَلاةَ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لا أَخْرِمُ عَنْهَا أُصَلِّي صَلاةَ العِشَاءِ فَأَرْكُدُ فِي الأُولَيَيَنِ، وَأُخِفُّ في الأُخْرَييْنِ، قَالَ: ذَلِكَ الظَنُّ بكَ يَا أبَا إسْحاقَ، وأَرسلَ مَعَهُ رَجُلاً أَوْ رجَالاً إلَى الكُوفَةِ يَسْأَلُ عَنْهُ أَهْلَ الكُوفَةِ، فَلَمْ يَدَعْ مَسْجِداً إلاَّ سَأَلَ عَنْهُ، وَيُثْنُونَ مَعْرُوفاً، حَتَّى دَخَلَ مَسْجِداً لِبَني عَبْسٍ، فَقَامَ رَجُلٌ مِنْهُمْ، يُقَالُ لَهُ أُسامةُ بنُ قَتَادَةَ، يُكَنَّى أَبَا سَعْدَةَ، فَقَالَ: أَمَا إذْ نَشَدْتَنَا فَإنَّ سَعْداً كانَ لا يسِيرُ بِالسَّرِيّةِ وَلاَ يَقْسِمُ بِالسَّويَّةِ، وَلا يعْدِلُ في القَضِيَّةِ، قَالَ سعْدٌ: أَمَا وَاللَّهِ لأدْعُوَنَّ بِثَلاثٍ: اللَّهُمَّ إنْ كَانَ عبْدكَ هَذَا كَاذِباً، قَام رِيَآءً، وسُمْعَةً، فَأَطِلْ عُمُرَهُ، وَأَطِلْ فَقْرَهُ، وَعَرِّضْهُ للفِتَنِ، وَكَانَ بَعْدَ ذلكَ إِذَا سُئِلَ يَقُولُ: شَيْخٌ كَبِيرٌ مَفْتُون، أصَابتْني دَعْوةُ سعْدٍ. قَالَ عَبْدُ الملِكِ بنُ عُميْرٍ الرَّاوِي عنْ جَابرِ بنِ سَمُرَةَ فَأَنا رَأَيْتُهُ بَعْد قَدْ سَقَط حَاجِبَاهُ عَلى عيْنيْهِ مِنَ الكِبَرِ، وَإنَّهُ لَيَتَعَرَّضُ للجوارِي فِي الطُّرقِ فَيغْمِزُهُنَّ. متفقٌ عليهِ.

హజ్రత్ జాబిర్ బిన్ సమురా (రదియల్లాహు అన్హుమా) కథనం: కూఫావాళ్ళు సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ గురించి ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)కు ఫిర్యాదు చేశారు. దాంతో ఉమర్ (రదియల్లాహు అన్హు) సాద్‌ను (గవర్నరు) పదవి నుంచి తొలగించి అమ్మార్ (రదియల్లాహు అన్హు)ని వారికి గవర్నరుగా నియమించారు. కూఫావాళ్ళు సాద్ (రదియల్లాహు అన్హు) గురించి ఎంతగా ఫిర్యాదు చేశారంటే కనీసం ఆయన నమాజు కూడా సరిగా చేయించరని చెప్పారు. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని పిలిపించి "అబూ ఇస్‌హాఖ్! (ఇది సాద్ మారుపేరు.) వీళ్ళు నువ్వు నమాజ్ సరిగ్గా చేయించటం లేదని అంటున్నారేమిటి?" అని అడిగారు. అందుకు సాద్ ఇలా బదులు చెప్పారు: "నేనా…. దైవం సాక్షి! నేను మాత్రం వీరికి దైవప్రవక్త ﷺ చేయించిన విధంగా నమాజ్ చేయించేవాణ్ణి. అందులో నేను ఎలాంటి లోపం రానిచ్చేవాణ్ణి కాదు. నేను మగ్రిబ్, ఇషా నమాజులు చేయిస్తాను. మొదటి రకాతుల్లో చాలా సేపు నిలబడతాను. ఆ తర్వాతి రకాతుల్లో తక్కువసేపు నిలబడతాను." ఆయన సమాధానం విని ఉమర్(రదియల్లాహు అన్హు), "అబూ ఇస్‌హాఖ్! మీ గురించి నేననుకున్నదీ అదే!" అని అన్నారు.

ఆ తర్వాత ఉమర్ (రదియల్లాహు అన్హు) సాద్ (రదియల్లాహు అన్హు)పై వచ్చిన ఆరోపణల గురించి విచారించటానికి ఆయనవెంట ఒక వ్యక్తిని (లేక) కొంతమందిని కూఫా పంపించారు. వారు కూఫాలోని అన్ని మస్జిదులు తిరిగి ఆయన గురించి ప్రజలను విచారించారు. అందరూ ఆయన మంచితనాన్ని కొనియాడారు. అయితే వారు బనూ అబస్‌కు చెందిన మస్జిద్‌కు వెళ్ళి విచారించినప్పుడు అక్కడి నమాజీల్లో ఉసామా బిన్ ఖతాదా అనబడేవాడొకడు (అతని మారుపేరు అబూ సాద) లేచి, "మీరు అడిగారు కనుక చెబుతున్నాను. సాద్ సైనిక దళాలతో కలిసి యుద్ధానికి పోరు. (యుద్ధ సొత్తును) సమానంగా పంచరు. వ్యవహారాలు విచారించినప్పుడు న్యాయంగా తీర్పివ్వరు" అని అన్నాడు.

అది విని సాద్(రదియల్లాహు అన్హు) "అలాగయితే నేను కూడా ఇతనికి మూడు శాపాలు పెడ్తాను (ఇతను సత్యవంతుడయితే ఆ శాపాలకు గురికాకుండా ఉంటాడు)" అని చెప్పి, "ఓ అల్లాహ్! ఈ నీ దాసుడు అబద్ధం చెబుతున్నట్లయితే, పేరు ప్రతిష్ఠల కోసం, ప్రజల ముందు తన గొప్పదనాన్ని చాటుకోవటం కోసం నా మీద నిందలు మోపటానికి నిలబడినట్లయితే ఇతనికి దీర్ఘాయుషును ప్రసాదించు. దీర్ఘకాల దారిద్ర్యానికి లోనుచేయి, ఇంకా ఇతన్ని పరీక్షలకు గురిచెయ్యి" అని ప్రార్థించారు. (చివరికి ఆయన శపించినట్లుగానే జరిగింది). ఆ తర్వాత ఎవరైనా అతన్ని అతని పరిస్థితి గురించి అడిగితే, "నేను చాలా ముసలోణ్ణయిపోయాను, పరీక్షలకు గురై ఉన్నాను. నాకు సాద్ శాపం తగిలింది" అని అనేవాడు.

జాబిర్ బిన్ సమురా (రదియల్లాహు అన్హు) నుండి ఈ హదీసును ఉల్లేఖించిన అబ్దుల్ మలిక్ బిన్ ఉమైర్ ఇలా అంటున్నారు: ఆ తర్వాతి రోజుల్లో నేనతన్ని చూశాను. వృద్ధాప్యం వల్ల అతని కనురెప్పలు వ్రేలాడిపోయి కళ్ళమీద పడ్డాయి. అతను దారులవెంట వచ్చేపోయే అమ్మాయిలను అల్లరిపెడ్తూ వారికి సైగలు చేసేవాడు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాత్ ప్రకరణం)

English

Jabir bin Samurah (radiyallahu anhuma) said: The inhabitants of Kufah complained to `Umar (radiyallahu anhu) against Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) and `Umar (radiyallahu anhu) appointed `Ammar (radiyallahu anhu) as Governor of Kufah in his place. Their complaint was that he did not even conduct As-Salat (the prayers) properly. `Umar (radiyallahu anhu) sent for Sa`d and said to him: “O Abu Ishaq, the people claim that you do not offer the Salat properly.” Sa`d replied: “By Allah! I observe Salat according to the Salat of the Messenger of Allah ﷺ, and I make no decrease in it. I prolong Qiyam (standing) in the first two Rak`ah in Maghrib and `Isha’ prayers and shorten in the last ones.” `Umar (radiyallahu anhu) said: “This is what I thought of you, O Abu Ishaq!” Then he sent with him a man (or some men) to Kufah to investigate the matter about him (from the people of Kufah). The inquiry was conducted in every mosque and all the people in these mosques praised him; but in the mosque of the Banu `Abs, a man, with the name of Usamah bin Qatadah and surname Abu Sa`dah, stood up and said, “Sa`d bin Abu Waqqas did not participate in Jihad and he did not distribute the spoils equitably and did not judge justly.” On this Sa`d said: “I shall make three supplications in respect of him: O Allah! If this slave of Yours is a liar and seeker of notoriety, please prolong his life and lengthen his period of adversity and afflict him with trials.” (And so did it happen.) Thereafter, when the man was asked about his condition he would say, “I am an old man afflicted with trials and overtaken by the curses of Sa`d.”

`Abdul-Malik bin `Umair (a subnarrator) said: I saw this man with eyebrows hung over his eyes as a result of his old age and he walked aimlessly, following young girls and winking at them.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

మొదటి విషయం, ఈ హదీసులో సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ ఘనత వివరించబడింది. ఆయన చేసే ప్రార్థనలు అంగీకరించబడేవి. రెండోది, ఎవరి గురించయినా విచారణ జరపదలచినప్పుడు సజ్జనుల్ని, సంస్కరణా భావం కలవారిని అడగాలి. ఉదాహరణకు ఈ హదీసులో కూఫాలోని మస్జిదులకు వెళ్ళి నమాజీలను విచారించటం జరిగింది. మూడోది, సముచితమని భావించినప్పుడు ప్రభుత్వాధికారులను మార్చటంలో తప్పులేదు. ఉదాహరణకు ఈ హదీసులో సాద్ (రదియల్లాహు అన్హు)ని పదవి నుంచి తొలగించటం జరిగింది. నిజానికి ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమైనవి. అయినప్పటికీ ఉమర్ (రదియల్లాహు అన్హు) పరిస్థితుల స్వరూపం దృష్ట్యా ఆయన్ని పదవీచ్యుతుణ్ణి చేసి కూఫావారికి మరో కొత్త గవర్నరును నియమించటమే సముచితమని భావించారు. నాల్గోది, ఇందులో 'కరామత్' అనేది సత్యమని నిరూపించబడింది. ఎలాగంటే సాద్ (రదియల్లాహు అన్హు) గారు పెట్టిన మూడు శాపాలూ ఆమోదించబడ్డాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1506

1507

హదీసు 1507

وعنْ عُرْوَةَ بن الزُّبيْر أنَّ سعِيدَ بنَ زَيْدٍِ بْنِ عمْرو بْنِ نُفَيْلِ، رضي اللَّه عَنْهُ خَاصَمتْهُ أرْوَى بِنْتُ أوْسٍ إِلَى مَرْوَانَ بْنِ الحَكَم، وَادَّعَتْ أنَّهُ أَخَذَ شَيْئاً مِنْ أرْضِهَا، فَقَالَ سَعِيدٌ: أنَا كُنْتُ آخُذُ مِنْ أرْضِها شَيْئاً بعْدَ الَّذِي سمِعْتُ مِنْ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم،؟ قَالَ: مَاذا سمِعْتَ مِنْ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم؟ قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "مَنْ أَخَذَ شِبْراً مِنَ الأرْضِ ظُلْماً، طُوِّقَهُ إِلَى سبْعِ أرضينَ" فَقَالَ لَهُ مرْوَانٌ: لا أسْأَلُكَ بَيِّنَةً بعْد هَذَا، فَقَال سعيدٌ: اللَّهُمَّ إنْ كانَتْ كاذبِةً، فَأَعْمِ بصرهَا، وَاقْتُلْهَا في أرْضِهَا، قَالَ: فَمَا ماتَتْ حَتَّى ذَهَبَ بَصَرُهَا، وبيْنَما هِي تمْشي في أرْضِهَا إذ وَقَعَتْ في حُفْرةٍ فَمَاتتْ. متفقٌ عَلَيْهِ. وفي روايةٍ لمسلِمٍ عنْ مُحمَّدِ بن زَيْد بن عبد اللَّه بن عُمَر بمَعْنَاهُ وأَنَّهُ رآهَا عَمْياءَ تَلْتَمِسُ الجُدُرَ تَقُولُ: أصَابَتْني دعْوَةُ سعًيدٍ، وَأَنَّها مرَّتْ عَلى بِئْرٍ في الدَّارِ الَّتي خَاصَمَتْهُ فِيهَا، فَوقَعتْ فِيها، وَكانَتْ قَبْرهَا.

హజ్రత్ ఉర్వా బిన్ జుబైర్(రదియల్లాహు అన్హు) కథనం: సయీద్ బిన్ జైద్ బిన్ అమ్ర్ బిన్ నుఫైల్ (రదియల్లాహు అన్హు)తో అర్వా బిన్తె ఔస్ (అనే స్త్రీ) వాదులాడి ఆ వివాదాన్ని మర్వాన్ బిన్ హకమ్ (మదీనా గవర్నరు) దృష్టికి తీసుకెళ్ళింది. సయీద్ తన భూమిలోని కొంతభాగాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేసింది. దానికి సయీద్ (నిర్ఘాంతపోయి) "దైవప్రవక్త ﷺ నోట (హెచ్చరిక) విన్న నేను ఈవిడ భూమిని ఆక్రమించగలనా?" అని అన్నారు. అప్పుడు మర్వాన్ (రదియల్లాహు అన్హు) అడిగారు: "దైవప్రవక్త ﷺ నోట మీరు ఏం (హెచ్చరిక) విన్నారు?" అని. అందుకాయన దైవప్రవక్త ﷺ ఈ విధంగా చెబుతుండగా తాను విన్నానని చెప్పారు: "ఎవరయితే అక్రమంగా జానెడు భూమిని ఆక్రమించుకుంటాడో, ప్రళయదినాన ఏడు భూముల హారాన్ని వారి మెడలో (గుదిబండగా) వేయటం జరుగుతుంది."

అది విని మర్వాన్ "ఇక మిమ్మల్ని నేను ఏ ఆధారం అడగను" అని అన్నారు. అప్పుడు సయీద్ (రదియల్లాహు అన్హు) ఆమెను ఈ విధంగా శపించారు: "ఓ అల్లాహ్! ఈ స్త్రీ గనక అబద్ధం చెబుతున్నట్లయితే నీవు ఈమె చూపుని పోగొట్టు. ఈమెను ఈవిడ భూమిలోనే చావుకి గురిచేయి."

ఉర్వా (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: ఆ స్త్రీ మరణానికి ముందు ఆమె చూపు పోయింది. ఒకసారి ఆమె తన స్థలంలో నడుస్తుండగా ఒక గోతిలో పడి చచ్చిపోయింది. (బుఖారీ-ముస్లిం)

ముస్లింలో ఇదే అర్థాన్నిచ్చే వేరొక హదీసు ఉంది. అది ముహమ్మద్ బిన్ జైద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ నుండి ఉల్లేఖించబడింది. అందులో ఇలా ఉంది: ఒకసారి ఆ స్త్రీ అంధురాలై గోడలు వెతుక్కుంటూ నడుస్తుండగా ముహమ్మద్ బిన్ జైద్ చూశారు. అప్పుడామె తనకు సయీద్ శాపం తగిలిందని చెప్పుకుంటూ పోసాగింది. ఒకసారి ఆమె ఒకప్పుడు తాను గొడవపడ్డ స్థలంలోనే బావి దగ్గర్నుండి వెళ్తూ అందులో పడి మరణించింది. ఆ భూభాగమే ఆమెకు సమాధి అయింది.

(సహీహ్ బుఖారీలోని సృష్టిఆరంభ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ముసాఖాత్ ప్రకరణం)

English

`Urwah bin Az-Zubair (radiyallahu anhu) reported: Arwa bint Aus brought a suit against Sa`id bin Zaid bin `Amr bin Nufail (radiyallahu anhu). She complained to Marwan bin Al-Hakam that he had wrongfully taken possession of a portion of her land. Sa`id said: “How can I take a portion out of her land while I have heard a denunciation from the Messenger of Allah ﷺ.” Marwan asked him: “What did you hear from the Messenger of Allah?” He said, “I heard the Messenger of Allah ﷺ saying, `He who takes a span of land unjustly will be made to wear seven earths round his neck on the Day of Ressurection’.” Marwan said to him: “I don’t seek proof from you after this.” Sa`id supplicated: “O Allah! If she is a liar, deprive her of her eye sight and cause her to die in her land.” `Urwah said: “She did not die till she became blind. While she was walking in her land (concerning which the dispute arose) she fell down into a pit and died.”[Al-Bukhari and Muslim].

In another narration of Muslim, Muhammad bin Zaid bin `Abdullah bin `Umar said that he had seen Arwa blind, feeling for on the walls with her hand and saying: “I am ruined by the curse of Sa`id.” Later she fell in a well in the same disputed land and died.

ముఖ్యాంశాలు

సయీద్ బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హు) చాలా గొప్ప సహాబీ. ఇహలోకంలోనే స్వర్గశుభవార్త విన్న పదిమంది దైవప్రవక్త సహచరుల్లో ఈయన కూడా ఒకరు. మర్వాన్ బిన్ హకమ్ హసన్, హుసైన్‌లలాగా చిన్న సహచరుల కోవకు చెందినవారు. ఈయన ముఆవియా (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో మదీనా నగరానికి గవర్నరుగా ఉండేవారు. హదీసులో వివరించబడిన సంఘటన ఆ కాలంలో జరిగినదే. యజీద్ కుమారుడు ముఆవియా బిన్ యజీద్ తర్వాత ఈయన కొన్ని నెలలపాటు ముస్లింల ఖలీఫాగా కూడా ఉన్నారు. ఈ హదీసులో సయీద్ బిన్ జైద్ ఘనత వివరించబడింది. ఆయన చేసే ప్రార్థనలు అంగీకరించబడేవి. ఇది ఆయన 'కరామత్'కు నిదర్శనం.

2) బాధితుని శాపం కొన్ని సందర్భాల్లో వెంటనే ఆమోదించబడుతుంది. అందుకని పుణ్యపురుషుల శాపాలకు గురికాకుండా ఉండాలంటే వారిని బాధించకుండా జాగ్రత్తపడాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1507

1508

హదీసు 1508

وَعَنْ جَابِرِ بنِ عبْدِ اللَّهِ رضي اللَّه عَنْهُما قَال: لمَّا حَضَرَتْ أُحُدٌ دَعاني أَبي مِنَ اللَّيْلِ فَقَال: مَا أُرَاني إلاَّ مَقْتُولا في أوَّل مَنْ يُقْتَلُ مِنْ أصْحابِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَإنِّي لا أَتْرُكُ بعْدِي أعزَّ عَلَيَّ مِنْكَ غَيْرِ نَفْسِ رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وإنَّ علَيَّ دَيْناً فَاقْضِ، واسْتَوْصِ بِأَخَوَاتِكَ خَيْراً: فأَصْبَحْنَا، فَكَانَ أوَّل قَتِيلٍ، ودَفَنْتُ مَعهُ آخَرَ في قَبْرِهِ، ثُمَّ لَمْ تَطِبْ نَفْسِي أنْ أتْرُكهُ مَعَ آخَرَ، فَاسْتَخْرَجته بعْدَ سِتَّةِ أشْهُرٍ، فَإذا هُو كَيَوْمِ وَضَعْتُهُ غَيْر أُذُنِهِ، فَجَعَلتُهُ في قَبْرٍ عَلى حٍدَةٍ. رواه البخاري.

హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఉహుద్ యుద్ధం సంభవించినప్పుడు మా నాన్న (అబ్దుల్లాహ్) రాత్రివేళ నన్ను పిలిచి "(బాబూ) రేపు యుద్ధంలో మొట్టమొదట హతులయ్యే దైవప్రవక్త సహచరుల్లో నేను కూడా ఉంటానని నాకనిపిస్తోంది. ఇప్పుడు నేను వదలి వెళుతున్నవారిలో దైవప్రవక్త ﷺ తర్వాత నాకు నీకంటే ప్రియమైనవారు మరెవరూ లేరు. నాకు కొంత అప్పు ఉంది. నువ్వు దాన్ని మర్చిపోకుండా తీర్చు. నీ అక్కా చెల్లెళ్ళపట్ల మేలైన రీతిలో మెలగు" అని చెప్పారు.

తెల్లవారిన తర్వాత చూస్తే అందరికన్నా ముందు మా నాన్నే హతులై ఉన్నారు. నేనాయనతోపాటు వేరొకతన్ని కూడా ఉంచి ఖననం చేశాను. అయితే మా నాన్నను వేరొకతనితో పాటు సమాధిలో అలాగే ఉంచేయటం నా మనసుకు నచ్చలేదు. అందుకని ఆరునెలల తర్వాత నేనాయన్ని (సమాధి నుండి) బయటికి తీశాను. అప్పుడు ఆయన చెవులు తప్ప మిగిలిన శరీరం మొత్తం మొదటిరోజు మేము ఎలా ఉంచామో అలాగే ఉంది. నేను ఆయన్ని (ఆయన భౌతికకాయాన్ని) వేరొక సమాధిలో ఉంచి ఖననం చేశాను. (బుఖారి)

(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం)

English

Jabir bin `Abdullah (radiyallahu anhuma) said: My father called me on the evening before (the battle of) Uhud and said: “I perceive that I shall be among the first from among the Companions of the Prophet ﷺ to be martyred, and after him you are the dearest to me. I am under the burden of debt. Pay it and treat your sisters well.” Next morning he was among the first to be killed, so I buried him along with another in the same grave. Thereafter, I did not like that I should leave him with another in the grave. So I dug up his corpse after six months and he was in the same condition in which he was on the day when I buried him, except that there was a scratch on his ear. Then I buried him in a separate grave.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

మొదటిది, ఇందులో సహాబీలకు దైవప్రవక్త ﷺ పట్ల ఉండిన అపారప్రేమాభిమానాలు, ఆంతరంగిక అనుబంధం వివరించబడ్డాయి. ఆ అనుబంధం వారి దృష్టిలో ప్రపంచంలోని అన్ని వస్తువులకంటే, ఆఖరికి తమ ధనప్రాణాలు, తమ సంతానం కంటే కూడా చాలా గొప్పది. రెండోది, వారు నిత్యం షహాదత్ (వీరమరణం) కోసం ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. మూడోది, తాను అమరగతి నొందబోతున్నానన్న సంగతి జాబిర్ (రదియల్లాహు అన్హు)కు ముందుగానే అర్ధమయిపోయింది. నాల్గోది, ఆరు నెలల తర్వాత కూడా ఆయన భౌతిక కాయంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది ఆయన కరామతు. ఐదోది, ఈ హదీసు ద్వారా అవసరమైనప్పుడు సమాధిలో నుండి శవాన్ని బయటికి తీయటం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. అయితే శవాన్ని సమాధి చేసి ఎక్కువకాలం జరగకుండా ఉండి, శవం అప్పటిదాకా సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం ఉన్నప్పుడే సమాధిని త్రవ్వాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1508

1509

హదీసు 1509

وَعَنْ أنَسٍ رضي اللَّه عَنْهُ أنَّ رَجُلَيْنِ مِنْ أصْحابِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَرَجا مِنْ عِنْدِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في لَيْلَةٍ مُظْلِمَةَ ومَعهُمَا مِثْلُ المِصْبَاحَينِ بيْنَ أيديهِما، فَلَمَّا افتَرَقَا، صارَ مَعَ كلِّ واحِدٍ مِنهما وَاحِدٌ حَتى أتَى أهْلَهُ. رواهُ البُخاري مِنْ طرُقٍ، وفي بعْضِها أنَّ الرَّجُلَيْنِ أُسيْدُ بنُ حُضيرٍُ، وعبَّادُ بنُ بِشْرٍ رضي اللَّه عَنْهُما.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సహచరుల్లో ఇద్దరు బాగా చీకటిగా వున్న ఒక రాత్రి దైవప్రవక్త ﷺ దగ్గరి నుంచి (తమ ఇండ్లకు) బయలుదేరారు. వారు బయలుదేరినప్పుడు వారి ముందు దీపంలాంటి ఒక వస్తువు కూడా బయలుదేరింది. అది వారివెంట నడుస్తూ ఉంది. ఆ తర్వాత (తమ దారులు వేరవగానే) వారిద్దరూ విడిపోయారు. అప్పుడు వారిద్దరి వెంట చేరో దీపం బయలుదేరింది. (వాటి వెలుతురులోనే) వారిద్దరూ ఇంటికి చేరుకున్నారు.

బుఖారీ ఈ హదీసును ఎన్నో ఆధారాల ద్వారా సేకరించారు. వాటిలో కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆ ఇద్దరు మనుషులు 'ఉసైద్ బిన్ హుజైర్' మరియు 'అబ్బాద్ బిన్ బిష్ర్' అని తెలుస్తోంది.

(సహీహ్ బుఖారీలోని సలాత్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: Two Companions of the Prophet ﷺ left his home in a very dark night with something like lights in front of them; when they separated, each of them had one light in front of him till they arrived home.[Al-Bukhari].

Other narrations reported in Al-Bukhari say that the two men were Usaid bin Hudhair and `Abbad bin Bishr (radiyallahu anhuma).

ముఖ్యాంశాలు

దీపం లాంటి వస్తువంటే ఏమిటి? వారి చేతికర్రలు దీపం లాగా వెలుగుతూ ఉన్నాయనీ, దాని వెలుతురులో వారు దారిలోని ఎత్తుపల్లాలు చూసుకొని నడిచేవారని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అది ప్రవక్తృత్వపు జ్యోతి అని చెబుతున్నారు. ఏమైనప్పటికీ అది ఆ ఇద్దరు సహచరుల కరామత్. దైవప్రవక్త ﷺ గారి మహిమ (మోజిజా).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1509

1510

హదీసు 1510

وعنْ أَبي هُرَيْرةَ، رضي اللَّه عَنْهُ، قَال: بَعثَ رَسُولُ اللِّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَشَرَةَ رهْطٍ عَيْناً سَريَّةً، وأمَّرَ عليْهِم عَاصِمَ بنَ ثابِتٍ الأنصاريَّ، رضي اللَّه عنْهُ، فَانطَلَقُوا حتَّى إِذَا كانُوا بالهَدْأةِ، بيْنَ عُسْفانَ ومكَّةَ، ذُكِرُوا لَحِيِّ منْ هُذَيْلٍ يُقالُ لهُمْ: بنُوا لِحيَانَ، فَنَفَرُوا لهمْ بقَريب منْ مِائِةِ رجُلٍ رَامٍ فَاقْتَصُّوا آثَارَهُمْ، فَلَمَّا أحَسَّ بهِمْ عاصِمٌ ؤَأصحابُهُ، لجَأوا إِلَى مَوْضِعٍ، فَأحاطَ بهمُ القَوْمُ، فَقَالُوا: انْزلوا، فَأَعْطُوا بأيْدِيكُمْ ولكُم العَهْدُ والمِيثاق أنْ لا نَقْتُل مِنْكُم أحَداً، فَقَالَ عَاصِمُ بنُ ثَابِتٍ: أَيُّهَا القومُ، أَمَّا أَنَا فَلاَ أَنْزِلُ عَلَى ذِمةِ كَافرٍ. اللهمَّ أخْبِرْ عَنَّا نَبِيَّكَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَرمَوْهُمْ بِالنَّبْلِ فَقَتَلُوا عَاصِماً، ونَزَل إلَيْهِمْ ثَلاثَةُ نَفَرٍ عَلَى العهدِ والمِيثاقِ، مِنْهُمْ خُبيْبٌ، وزَيْدُ بنُ الدَّثِنِة ورَجُلٌ آخَرُ، فَلَمَّا اسْتَمْكَنُوا مِنْهُمْ أطْلَقُوا أوْتَار قِسِيِّهمْ، فرَبطُوهُمْ بِها، قَال الرَّجلُ الثَّالِثُ: هَذَا أوَّلُ الغَدْرِ واللَّهِ لا أصحبُكمْ إنَّ لِي بهؤلاءِ أُسْوةً، يُريدُ القَتْلى، فَجرُّوهُ وعَالَجُوهُ، فَأبي أنْ يَصْحبَهُمْ، فَقَتَلُوهُ، وانْطَلَقُوا بخُبَيْبٍ، وَزيْدِ بنِ الدَّثِنَةِ، حَتَّى بَاعُوهُما بمكَّةَ بَعْد وَقْعةِ بدرٍ، فَابتَاعَ بَنُو الحارِثِ ابنِ عامِرِ بنِ نوْفَلِ بنِ عَبْدِ مَنَافٍ خُبَيْباً، وكانَ خُبَيبُ هُوَ قَتَل الحَارِثَ يَوْمَ بَدْرٍ، فلَبِثَ خُبيْبٌ عِنْدهُم أسِيراً حَتى أجْمَعُوا عَلَى قَتْلِهِ، فَاسْتَعارَ مِنْ بعْضِ بنَاتِ الحارِثِ مُوسَى يَسْتحِدُّ بهَا فَأَعَارَتْهُ، فَدَرَجَ بُنَيُّ لهَا وَهِي غَافِلةٌ حَتى أَتَاهُ، فَوَجَدْتُه مُجْلِسَهُ عَلى فَخذِهِ وَالمُوسَى بِيده، فَفَزِعتْ فَزْعَةً عَرَفَهَا خُبَيْبٌ، فَقَال: أتَخْشيْنَ أن أقْتُلَهُ مَا كُنْتُ لأفْعل ذلكَ، قَالَتْ: وَاللَّهِ مَا رأيْتُ أسِيراً خَيْراً مِنْ خُبيبٍ، فواللَّهِ لَقَدْ وَجدْتُهُ يوْماً يأَكُلُ قِطْفاً مِنْ عِنبٍ في يدِهِ، وإنَّهُ لمُوثَقٌ بِالحديدِ وَما بمَكَّةَ مِنْ ثمَرَةٍ، وَكَانَتْ تقُولُ: إنَّهُ لَرزقٌ رَزقَهُ اللَّه خُبَيباً، فَلَمَّا خَرجُوا بِهِ مِنَ الحَرمِ لِيقْتُلُوهُ في الحِلِّ، قَال لهُم خُبيبُ: دعُوني أُصلي ركعتَيْنِ، فتَرَكُوهُ، فَركعَ رَكْعَتَيْنِ، فقالَ: واللَّهِ لَوْلا أنْ تَحسَبُوا أنَّ مابي جزَعٌ لَزِدْتُ: اللَّهُمَّ أحْصِهمْ عَدَداً، واقْتُلهمْ بَدَداً، وَلاَ تُبْقِ مِنْهُم أَحَداً. وقال: فلَسْتُ أُبالي حينَ أُقْتلُ مُسْلِماً عَلَى أيِّ جنْبٍ كَانَ للَّهِ مصْرعِي وذلِكَ في ذَاتِ الإلَهِ وإنْ يشَأْ يُبَارِكْ عَلَى أوْصالِ شِلْوٍ مُمَزَّعِ وكانَ خُبيْبٌ هُو سَنَّ لِكُلِّ مُسْلِمٍ قُتِلَ صبْراً الصَّلاةَ وأخْبَر يعني النبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. أصْحَابهُ يوْمَ أُصِيبُوا خبرهُمْ، وبعَثَ نَاسٌ مِنْ قُريْشٍ إِلَى عاصِم بنِ ثابتٍ حينَ حُدِّثُوا أنَّهُ قُتِل أنْ يُؤْتَوا بشَيءٍ مِنْهُ يُعْرفُ. وكَانَ قتَل رَجُلاً مِنْ عُظَمائِهِمْ، فبَعثَ اللَّه لِعَاصِمٍ مِثْلَ الظُّلَّةِ مِنَ الدَّبْرِ، فَحَمَتْهُ مِنْ رُسُلِهِمْ، فَلَمْ يقْدِرُوا أنْ يَقْطَعُوا مِنهُ شَيْئاً. رواه البخاري. قولُهُ: الهَدْأةُ: مَوْضِعٌ، وَالظُّلَّةُ: السَّحَابُ، والدَّبْرُ: النَّحْلُ. وقَوْلُهُ:"اقْتُلْهُمْ بِدَداً"بِكسرِ الباءِ وفتحهَا، فَمَنْ كَسَرَ، قَالَ هُوَ جمعٍ بِدَّةٍ بكسر الباءِ، وهو النصِيب، ومعناه اقْتُلْهُمْ حِصَصاً مُنْقَسِمَةً لِكلِّ واحِدٍ مِنْهُمْ نصيبٌ، وَمَنْ فَتَح، قَالَ: مَعْنَاهُ: مُتَفَرِّقِينَ في القَتْلِ واحِداً بَعْدَ وَاحِد مِنَ التّبْدِيدِ. وفي الباب أحاديثٌ كَثِيرَةٌ صحِيحَةُ سَبَقَتْ في مواضِعها مِنْ هَذَا الكِتَابِ مِنها حديثُ الغُلام الَّذِي كانَ يأتِي الرَّاهِبَ والسَّاحِرَ ومِنْهَا حَديثُ جُرَيجٍ، وحديثُ أصحَابِ الغَارِ الذين أَطْبقَتْ علَيْهمُ الصَّخْرةُ، وحديثُ الرَّجُلِ الَّذِي سَمِعَ صَوتاً في السَّحاب يقولُ: اسْقِ حدِيقة فلانٍ، وغيرُ ذَلِكَ والدَّلائِلُ في البابِ كثيرةٌ مَشْهُورةٌ، وبِاللَّهِ التَّوْفِيقُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ పదిమందితోకూడిన ఒక సైనిక పటాలాన్ని గూఢచర్యం చేయటం కోసం పంపించారు. ఆసిమ్ బిన్ సాబిత్ అన్సారీ (రదియల్లాహు అన్హు)ని వారికి నాయకునిగా నియమించారు. వారు బయలుదేరి ఉస్‌ఫాన్, మక్కాల మధ్యనున్న 'హద్‌అ' ప్రాంతానికి చేరుకువేసరికి బనూ లిహ్‌యాన్ అనబడే హుజైల్‌కు చెందిన ఒక తెగవారికి ఈ సైనికపటాలం గురించి సమాచారం అందింది. వెంటనే వారు దాదాపు వందమంది విలుకాండ్రతో ఆ సైనిక పటాలాన్ని ఎదుర్కోవటానికి బయలుదేరారు. వారి అడుగుల గుర్తుల వెంట నడుస్తూ వారి సమీపానికి చేరుకున్నారు. ఆసిమ్ మరియు ఆయన అనుచరులు వారి రాకను పసిగట్టి ఒకచోట దాక్కున్నారు. (ఈ విషయం తెలుసుకున్న) బనూ లిహ్‌యాన్ అనుచరులు వారిని చుట్టుముట్టి "క్రిందికి దిగి వచ్చి మాకు లొంగిపోండి. మేము మీతో ఒప్పందం చేసుకుంటాం. మీలో ఎవరినీ హతమార్చమని మీకు మాటిస్తున్నాం" అని అన్నారు. అందుకు ఆసిమ్ (రదియల్లాహు అన్హు) "ప్రజలారా! నేను మాత్రం అవిశ్వాసుల ప్రమాణాన్ని నమ్మి లొంగిపోను. ఓ అల్లాహ్! నీవు మా గురించి నీ ప్రవక్తకు తెలియపరచు" అని అన్నారు. ఆయన ఆ మాట అనగానే శత్రువులు ఆయన మీద బాణాల వర్షం కురిపించి ఆయన్ని హతమార్చారు.

ముగ్గురు మాత్రం వారి మాట మీద వారి ప్రమాణాన్ని నమ్మి లొంగిపోయారు. వారిలో ఒకరు ఖుబైబ్. రెండో ఆయన జైద్ బిన్ దసినా. వీరితో పాటు మూడో వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. శత్రువులు వారిని పట్టుకొని వారి వింటి నారులను విప్పదీసి వాటితోనే వారిని కట్టేశారు. మూడో వ్యక్తి అది చూసి, "ఇది మీరు చేస్తున్న మొదటి వాగ్దాన భంగం. దైవం సాక్షి! నేను మీవెంట రాను. ఈ మరణించిన వారే నాకు ఆదర్శప్రాయులుగా కనిపిస్తున్నారు" అని అన్నాడు. శత్రువులు ఆయన్ని లాగి ఈడ్చుకెళ్ళటానికి ప్రయత్నించారు. కాని ఆయన మాత్రం వారివెంట వెళ్ళటానికి నిరాకరించారు. దాంతో శత్రువులు ఆయన్ని కూడా హతమార్చారు. మిగిలిన ఖుబైబ్ మరియు జైద్ బిన్ దసినాను తమ వెంట తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత బద్ర్ యుద్ధానంతరం వారిద్దరినీ మక్కాలో అమ్మేశారు. ఖుబైబ్‌ను హారిస్ బిన్ ఆమిర్ బిన్ నౌఫల్ బిన్ అబ్దె మనాఫ్ కుమారులు కొనుక్కున్నారు. ఆయన బద్ర్ యుద్ధం నాడు హారిస్‌ను హతమార్చి ఉన్నారు. ఖుబైబ్ కొంతకాలంపాటు వారి దగ్గర ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత వారు ఆయన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

(వారి దగ్గర ఖైదీగా ఉన్నప్పుడు) ఒకరోజు ఆయన హారిస్ కుమార్తెల్లో ఒకామెను నాభి క్రింది వెంట్రుకలు గొరుక్కోవటం కోసం మంగలికత్తి ఇవ్వమని అడిగారు. ఆమె అది ఇచ్చింది. అంతలో ఆమె పిల్లవాడొకడు ఖుబైబ్ దగ్గరికి వెళ్ళాడు. అది ఆమె చూసుకో లేదు. ఖుబైబ్ ఆ పిల్లవాణ్ణి తనతొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఆయన చేతిలో కత్తి ఉంది. ఆ దృశ్యం చూడగానే ఆ స్త్రీ ఆందోళన పడసాగింది. ఆమె ఆందోళనను గమనించి ఖుబైబ్, "ఏమిటీ? నేను ఈ అబ్బాయిని చంపుతానని భయపడుతున్నావా? నేను అలాంటివాణ్ణి కాదు సుమా!" అన్నారు.

ఆ అమ్మాయి ఇలా అంది: "దైవం సాక్షి! ఖుబైబ్ కన్నా మంచి ఖైదీని నేనెన్నడూ చూడలేదు. దైవం సాక్షి! ఒకరోజు ఆయన, చేతిలో ద్రాక్ష పండ్ల గెల పట్టుకొని తినడం చూశాను. ఆ సమయంలో ఆయన సంకెళ్ళతో బంధించబడి ఉన్నారు. ఆ రోజుల్లో అసలు మక్కాలో పండ్లేలేవు. అందుకే ఆమె తరచూ ఇలా అంటూ ఉండేది: అది ఖుబైబ్‌కు దేవుడిచ్చిన ఆహారమని నా అభిప్రాయం.

శత్రువులు ఆయన్ని హరమ్ పరిధుల నుండి బయటికి తెచ్చి హిల్ల్ (సమ్మత) ప్రదేశంలో హతమార్చేందుకు తీసుకెళ్ళినప్పుడు (మార్గమధ్యంలో) ఆయన "నన్ను కాస్త వదలండి. నేను రెండు రకాతుల నమాజ్ చేసుకుంటాను" అని అడిగారు. వారు ఆయన్ని వదలిపెట్టారు. ఆయన రెండు రకాతుల నమాజు చేసుకొని వారిని ఉద్దేశ్యించి, "దైవంసాక్షి! చావుభయంతో నేను నమాజు చేస్తున్నానని మీరు తలపోయరనుకుంటే నేను ఇంకా ఎక్కువ నమాజ్ చేసేవాణ్ణి" అన్నారు. ఆ తర్వాత దేవుణ్ణి ఇలా ప్రార్థించారు: ఓ అల్లాహ్! వీరు ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టుకో. వీళ్ళను ముక్కలు ముక్కలుగా చేసి చంపు. వీరిలో ఎవరినీ మిగిల్చి ఉంచకు. (ఆ తర్వాత ఒక కవిత చదివారు. దాని భావం ఇది:) "నేను ముస్లిం అయిన స్థితిలో చంపబడుతున్నప్పుడు దైవం కోసం ఏ వైపు నుండి మరణం సంభవించినా నాకు భయం లేదు. నాకు ఈ మరణం దేవుని మార్గంలో వస్తోంది. ఆయన తలచుకుంటే తెగిపోయిన నా శరీర అవయవాలలో శుభం ప్రసాదిస్తాడు."

బంధించి హతమార్చబడే ప్రతి ఒక్క ముస్లిం కోసం ఆయన నమాజు చేసే ఆచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన అమరగతి నొందిననాడే దైవప్రవక్త ﷺ తన సహచరులకు ఈ వార్త తెలిపారు. ఇక ఆసిమ్ హతమార్చబడ్డారని చెప్పగానే ఆయన ఖురైషు సర్దారుల్లో ఒకాయన్ని చంపి ఉన్నందున ఆయన్ని గుర్తు పట్టేందుకు వీలుగా ఆయన శరీరంలోని ఏదైనా ఒక భాగాన్ని తీసుకురమ్మని ఖురైషులు కొంతమందిని పంపించారు. అటు ఆసిమ్ శవాన్ని రక్షించటం కోసం దేవుడు భిడ్డూ (లేక తేనెటీగల) దండును పంపాడు. అవి మబ్బుల రూపంలో వచ్చి ఆయన్ని ఖురైషు మనుషుల నుంచి కాపాడాయి. వాటి మూలంగా ఆయన శరీరంలోని ఏ భాగాన్ని వారు కోయలేకపోయారు. (బుఖారీ)

హద్‌అ అనేది ఒక ప్రాంతం పేరు. జుల్లహ్ అంటే మబ్బు. దబ్‌రున్ అంటే తేనెటీగ. బిదదా అనేపదం బదదా అని కూడా పఠించబడింది. బదదా అని చదివేవారు దీన్ని బిద్దతున్ అనే పదానికి బహువచనంగా భావిస్తారు. అప్పుడు దీనికి భాగాలు అని అర్థం వస్తుంది. అంటే, "దేవా! వీరిని ఖండఖండాలుగా చేసి చంపు. ప్రతి ఒక్కరూ ముక్కలు కావాలి" అని ఆ వాక్యానికి భావం. అయితే బిదాదన్ అని చదివేవారి ప్రకారం దాని భావం, "వారిని ఒకరి తర్వాత మరొకర్ని వేర్వేరుచేసి చంపు" అని. అలాంటప్పుడు దానికి తబ్‌దీద్ మూల పదం అవుతుంది.

(కరామత్ నిజమని రుజువు చేసే) ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రామాణిక హదీసులెన్నో ఈ గ్రంథంలో ఇంతకు ముందు అనేకచోట్ల, అనేక అధ్యాయాల్లో వచ్చాయి. వాటిలో క్రైస్తవ మత గురువు దగ్గరికి, ఇంద్రజాలికుడి దగ్గరికీ వెళ్తుండే బాలుని కథ (సహనం అధ్యాయం), జురైజ్ కథ (చిత్తశుద్ధి అధ్యాయం), బండరాయి మూలంగా గుహ ద్వారం మూసుకుపోయిన వారి కథ (చిత్తశుద్ధి అధ్యాయం), మబ్బుల్లో నుంచి ఫలానా వాని తోట మీద వర్షం కురిపించు అనే మాటలు విన్న వాని కథ, ఇవేగాక ఇలాంటి ఇతర కథలు, సంఘటనలన్నీ కూడా అలాంటివే. ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అవకాశం కల్పించేవాడు దేవుడే.

(సహీహ్ బుఖారీలోని మగాజీ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ sent an espionage mission of ten men under the leadership of `Asim bin Thabit Al-Ansari (radiyallahu anhu). They proceeded till they reached Al-Had’ah, a place between `Usfan and Makkah and the news of their arrival reached a section of the tribe of Hudhail, called Banu Lihyan. About one hundred men, who were all archers, hurried to follow their tracks. When `A sim and his companions came to know of their pursuers, they took refuge in a safe place. The infidels encircled them and said to them: “Come down and surrender, and we promise and guarantee you that we will not kill anyone of you.” `Asim bin Thabit (radiyallahu anhu) said: “By Allah! I will not come down to be under the protection of disbelievers. O Allah! convey this news to our Prophet ﷺ.” Then the infidels shot arrows at them till they killed `Asim. Three men came down relying on their promise and covenant. They were Khubaib, Zaid bin Ad-Dathinah and another man. When the disbelievers captured them, they tied them up with the strings of their bows. The third of the captives said: “This is the beginning of first betrayal. By Allah! I will not go with you. I have a good example in these (martyrs).” So they dragged him and tried to compel him to accompany them, but he refused. At last they killed him. They took Khubaib and Zaid bin Ad-Dathina with them and sold them as slaves in Makkah. This incident took place after the battle of Badr.

Khubaib was bought by the sons of Al-Harith bin `Amir bin Naufal bin `Abd Manaf. It was Khubaib who had killed Al-Harith in the battle of Badr. Khubaib remained a prisoner with those people for a few days till the sons of Al-Harith resolved to kill him.

When Khubaib (radiyallahu anhu) got wind of this plot, he borrowed a razor from one of Al-Harith’s daughters in order to remove his pubic hair. Her little son crawled towards Khubaib because of her carelessness. Later on, she saw her son on his thigh and the razor was in his hand. She got scared so much that Khubaib noticed the agitation on her face and said: “Are you afraid that I will kill him? No, I will never do that.” She later remarked (after Al-Khubaib got martyred): “By Allah! I never saw a prisoner better than Khubaib.” She added: “By Allah! I saw him once eating of a bunch of grapes in his hand while he was chained and there was no such fruit at that time in Makkah. Probably it was a boon which Allah bestowed upon Khubaib.”

When they took him out of the Haram of Makkah to kill him outside its boundaries, Khubaib requested them to let him offer two Rak`ah of voluntary prayer. They allowed him and he offered two Rak`ah prayer. Then he said: “Had I not apprehended that you would think that I was afraid of death, I would have prolonged the prayer. O Allah! Count their number; slay them one by one and spare not one of them.” He then recited these poetic verses:

`I do not care how they kill me as long as I get martyred in the Cause of Allah as a Muslim. I received my death for Allah’s sake. If Allah so desires, He will bless, the amputated limbs of the torn body.’

Then the son of Al-Harith killed him. It was Khubaib who set the tradition for any Muslim sentenced to death in captivity to offer two Rak`ah of voluntary prayer. On that day the Messenger of Allah ﷺ informed his Companions of the martyrdom of Khubaib. Later on, when some disbelievers from Quraish were informed that `Asim had been martyred, they sent some people to fetch a significant part of his body to ascertain his death. (This was because) `Asim had killed one of their chiefs. So Allah sent a swarm of wasps, resembling a shady cloud, to hover over the body of `Asim and to shield him from their messengers, and thus they could not cut off anything from his body.[Al-Bukhari].

ముఖ్యాంశాలు

'రహ్‌తున్' అంటే ఒక సమూహం అని అర్థం. కొందరి అభిప్రాయం ప్రకారం హదీసులో పేర్కొనబడిన సమూహంలో ఆరుగురు ఉన్నారు. వారిపేర్లు ఆసిమ్ బిన్ సాబిత్, మర్‌సద్ బిన్ అబూ మర్‌సద్; ఖుబైబ్ బిన్ అదీ, జైద్ బిన్ దసినా, అబ్దుల్లాహ్ బిన్ తారిఖ్, ఖాలిద్ బిన్ బుకైర్. మరికొంతమంది ఆ సమూహంలో పదిమంది ఉన్నారని అభిప్రాయపడ్డారు. వాస్తవం దేవునికే బాగా తెలుసు.

ఈ సంఘటనలో వారివల్ల అనేక కరామత్‌లు జరిగాయి. మొదటిది, వారు ప్రార్థించినట్టుగానే వారు వీరమరణం పొందిన రోజే దేవుడు వహీ ద్వారా తన ప్రవక్తకు ఆ విషయం తెలియజేశాడు. రెండోది, ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఆ కాలంలో లభించని పండ్లు ప్రసాదించాడు. మూడోది, ఆసిమ్‌ను రక్షించటం కోసం దేవుడు తేనెటీగల లేక భిడ్డూల దండును పంపాడు. నాల్గోది, వారు తమను హతమార్చిన దుర్మార్గుల్ని శపించారు. దాంతో ఆ దుర్మార్గులు వారు శపించినట్లుగానే దుష్పరిణామాలకు గురయ్యారు.

ఈ హదీసు ద్వారా బోధపడే మరికొన్ని అంశాలు ఇవి: 1) శత్రువు గనక కఠినంగా ప్రవర్తిస్తున్నట్లయితే అతను రక్షణ [ఇ]స్తానని మాటిచ్చినా దాన్ని ససేమిరా ఒప్పుకోకూడదు. దానివల్ల తమ ప్రాణాలు పోయినాసరే; అయితే ఒకవేళ అతను మృదువుగా ప్రవర్తిస్తాడన్న ఆశ ఉంటే మాత్రం అతన్ని రక్షణ కోరి ప్రాణాలను కాపాడుకోవటం అవసరం. 2) బహుదైవారాధకులు పెట్టిన శిక్షలకు దైవప్రవక్త సహచరులు ప్రదర్శించిన సహనస్థయిర్యాలు ఈ హదీసులో వివరించబడ్డాయి. 3) అత్యంత కఠిన కాలంలో కూడా వారు తమ మంచితనాన్ని నిరూపించుకున్నారు. తనకు ప్రాణ శత్రువైన వాని కుమారుడు చేతికి చిక్కినా కూడా అతన్ని ఏమీ అనలేదు. పైగా అతని మీద వాత్సల్యం కురిపించారు. 4) శత్రువుల చేతుల్లో వీరమరణం పొందే ముందు వారి నుంచి అనుమతి తీసుకొని రెండు రకాతులు నమాజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) ఆ విధంగా చేయగా దైవప్రవక్త ﷺ ఆయన్ని ఏమీ అనలేదు. పైగా ఆ విధానాన్ని ఇతర ముస్లింల కోసం కూడా నిర్ణయించారు. 5) బహుదైవారాధకుల్ని, దుర్మార్గులైన శత్రువుల్ని శపించవచ్చు. 6) దైవప్రవక్త ﷺ కాలంలోని బహుదైవారాధకులు కూడా నిషిద్ధ మాసాలను, నిషిద్ధ ప్రాంతాన్ని (హరమ్‌ను) గౌరవించేవారు. (ఫత్‌హుల్ బారీ)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1510

1511

హదీసు 1511

وعَن ابْنِ عُمر رضي اللَّه عنْهُما قال: مَا سمِعْتُ عُمرَ رضي اللَّه عنْهُ يَقُولُ لِشَيءٍ قطُّ: إنِّي لأظُنَّهُ كَذا إلاَّ كَانَ كَمَا يَظُنُّ، رواهُ البُخَاري. كتَاب الأمُور المَنهي عَنْهَا

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ఉమర్(రదియల్లాహు అన్హు) ఏదయినా విషయం గురించి "నా అభిప్రాయం ఇది" అని చెబితే ఆ విషయం ఆయన అన్నట్లుగానే జరిగేది. నేను ఆయన నోట ఈ విధంగా ఎన్నిసార్లు విన్నానో అన్నిసార్లూ అలాగే జరిగింది. (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని మనాఖిబుల్ అన్సార్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: I never heard `Umar (radiyallahu anhu) relating anything that he conceived it to be so-and-so, but that it proved to be as he had conceived it.”

[Al-Bukhari].

ముఖ్యాంశాలు

ఇందులో ఉమర్(రదియల్లాహు అన్హు)గారి మహిమోన్నతులు వివరించబడ్డాయి. దేవుడు ఆయనకు గొప్ప తెలివితేటల్ని, అసామాన్య మేధాసంపత్తిని ప్రసాదించాడు. అందుకే దైవప్రవక్త ﷺ తరచూ అంటుండేవారు, "నా అనుచర సమాజంలో దివ్య విషయాలు తెలుసుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన ఉమరే" అని.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|253. వలీల (దేవుని ప్రియదాసుల) మహిమలు, వారి గొప్పదనం|హదీసు 1511