హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 250. ప్రార్థన విశిష్టత

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 250వ అధ్యాయం: ప్రార్థన విశిష్టత. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 29 హదీసులు (హదీసు 1466 – 1494) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

250. ప్రార్థన విశిష్టత

↑ విషయ సూచిక

٢٥٠ – باب فضل الدعاء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

{وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ} . [غافر: ٦٠]

"నీ ప్రభువు ఇలా అంటున్నాడు: నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను." (మోమిన్: 60)

{ادْعُوا رَبَّكُمْ تَضَرُّعاً وَخُفْيَةً إِنَّهُ لا يُحِبُّ الْمُعْتَدِينَ} [الأعراف: ٥٥]

"మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ, గోప్యంగానూ, నిశ్చయంగా ఆయన మితిమీరి మెలిగేవారిని ప్రేమించడు." (ఆరాఫ్: 55)

{وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ} الآية [البقرة: ١٨٦]

"నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటాను, సమాధానం పలుకుతాను అనీ, (ఓ ప్రవక్తా!) నీవు వారికి తెలుపు." (బఖర: 186)

{أَمَّنْ يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ} الآية [النمل: ٦٢]

"కలత చెందినవాడు మొరపెట్టు కున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు?" (నమ్ల్: 62)

ముఖ్యాంశాలు

ప్రార్థన (దుఆ) కూడా ఒక రకమైన ఆరాధనే. పైగా ఆరాధనకు ప్రాణం, సారం ప్రార్థనే. కనుక ఆ ప్రార్థన కూడా అల్లాహ్‌కే అంకితం కావాలి. అంటే అల్లాహ్‌ను మాత్రమే ప్రార్థించాలి. పైన పేర్కొనబడిన ఖుర్‌ఆన్ సూక్తుల్లో ఈ విషయమే నొక్కి వక్కాణించబడింది. ప్రార్థనల్ని అంగీకరించేవాడు దేవుడు ఒక్కడేననీ, మనం ఆయన్ని మాత్రమే ప్రార్థించాలనీ, వేరితరుల్ని ప్రార్థిస్తే వారిని ఆరాధించినట్లవుతుందనీ, అది షిర్క్ (బహు దైవారాధన)కు దారితీస్తుందని పైసూక్తులు ప్రబోధిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే బాధితుల మొరలను ఆలకించలేని, వారి మాటలను సయితం వినలేని విగ్రహాలు, చనిపోయిన పుణ్యాత్ములు వారికి ఏం సహాయం చేస్తారు? అందుకని ఆరాధనలో అంతర్భాగమైన 'దుఆ' (ప్రార్థన) ను కూడా అల్లాహ్‌కే అంకితం చేసుకోవాలి.

English

“And your Rubb said: `Invoke Me, [i.e., believe in My Oneness (Islamic Monotheism)] (and ask Me for anything) I will respond to your (invocation).”’ [Ghāfir 40:60]

“Invoke your Rubb with humility and in secret. He likes not the aggressors.” [Al-A‘rāf 7:55]

“And when My slaves ask you (O Muhammad ﷺ) concerning Me, then (answer them), I am indeed near (to them by My Knowledge). I respond to the invocations of the supplicant when he calls on Me (without any mediator or intercessor).” [Al-Baqarah 2:186]

“Is not He (better than your gods) Who responds to the distressed one, when he calls on Him, and Who removes the evil?” [An-Naml 27:62]

1466

హదీసు 1466

وَعن النُّعْمانِ بْنِ بشيرٍ رضِي اللَّه عنْهُما، عَنِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الدُّعاءُ هوَ العِبَادةُ". رواه أَبُو داود والترمذي وقالا حديث حسن صحيح.

హజ్రత్ నోమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: 'దుఆ (ప్రార్థన) కూడా ఆరాధనే.' (అబూదావూద్, తిర్మిజీ- తిర్మిజీ దీనిని హసన్, సహీహ్ కోవకు చెందినదిగా పేర్కొన్నారు.)

(సుననె అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

An-Nu`man bin Bashir (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “Du`a (supplication) is worship.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

అసలు 'ప్రార్థన' అంటే ఏమిటి? తమ బలహీనతను, నిస్సహాయతను వ్యక్తపరచటమే కదా! అరాధన అన్నా కూడా అదే భావం వస్తుంది. దేవుని శక్తిసామర్ధ్యాల ముందు తమ బలహీనతను, నిస్సహాయతను వెలిబుచ్చటం తమల్ని తాము అల్పులుగా, అధములుగా భావించుకోవటం ఆరాధనకు ప్రాణం. అందుకే ప్రార్థన కూడా ఆరాధనేనని చెప్పబడింది. ఆరాధన దేవుని హక్కు. ఆయన్ని తప్ప ఇతరుల్ని ఆరాధించకూడదు. అలాగే ప్రార్థన కూడా దేవుని హక్కే. కనుక ఆయన్ని తప్ప ఇతరుల్ని ప్రార్థించరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1466

1467

హదీసు 1467

وعَنْ عَائِشَةَ رَضِيَ اللَّه عَنْهَا، قَالَتْ: كَان رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَسْتَحِبُّ الجوامِعَ مِنَ الدُّعاءِ، ويَدَعُ مَا سِوى ذلكَ. رَوَاه أَبو داود بإِسنادٍ جيِّد.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ సమగ్రమైన ప్రార్థనల్ని యిష్టపడేవారు. అవి మినహా ఇతర ప్రార్థనల్ని వదలి పెట్టేవారు. (అబూదావూద్ ఈ హదీసుని మంచి ఆధారాలతో వెలికితీశారు)

(సుననె అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Messenger of Allah ﷺ liked comprehensive supplications or (Al-Jawami` – i.e., supplications with very few words but comprehensive in meanings), and discarded others.[Abu Dawud].

ముఖ్యాంశాలు

సమగ్రమైన ప్రార్థనలంటే పదాలు తక్కువగా ఉండి, చాలా ఎక్కువ భావాన్ని కలిగివున్న ప్రార్థనలు (దుఆలు) అని అర్థం. సమగ్రమైన పదాలతో ప్రార్థన చేయటానికి ఉత్తమ పద్ధతి ఏమిటంటే స్వయంకల్పిత ప్రార్థనలు చేయకుండా మస్నూన్ ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే అవి చాలా భావగర్భితంగా ఉంటాయి. అదీగాక అవి దైవప్రవక్త ﷺగారి నోటి నుండి జాలువారినవి కనుక వాటిలో అసాధారణమైన ప్రభావశక్తి, శ్రేయోశుభాలు ఇమిడి ఉంటాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1467

1468

హదీసు 1468

وعَنْ أَنَسٍ رَضي اللَّه عنْهُ، قَالَ: كانَ أَكْثَرُ دُعَاءِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اللَّهُمَّ آتِنَا في الدُّنْيَا حَسَنَةً، وَفِي الآخِرةِ حَسنَةً، وَقِنَا عَذابَ النَّارِ" مُتَّفَقٌ عليهِ. زاد مُسلِمٌ في رِوايتِهِ قَال: وكَانَ أَنَسٌ إِذا أَرَاد أَنْ يَدعُوَ بِدعوَةٍ دَعَا بِهَا، وَإِذا أَرَادَ أَن يَدعُو بدُعَاءٍ دَعا بهَا فيه.

హజ్రత్ అనస్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఎక్కువగా ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు: "ఓ అల్లాహ్! ఇహలోకంలో మాకు మంచిని ప్రసాదించు, పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు. ఇంకా మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు."

(బుఖారీ-ముస్లిం)

ముస్లిం ఉల్లేఖనంలో అదనంగా ఇలా ఉంది: హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఎప్పుడైనా దుఆ చేస్తే పై వచనాలతోనే దుఆ చేసేవారు. ఏదయినా (ప్రత్యేకమైన) దుఆ చేస్తే, అందులో కూడా ఈ వాక్యాలను కలుపుకునేవారు.

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The supplication most often recited by the Prophet ﷺ was: “Allahumma atina fid-dunya hasanatan, wa fil-akhirati hasanatan, wa qina `adhab-annar (O our Rubb! give us in this world that which is good and in the Hereafter that which is good, and save us from the punishment of the Fire).”’[Al-Bukhari and Muslim].

In the narration of Muslim it is added that whenever Anas supplicated, he used to beseech Allah with this Du`a.

ముఖ్యాంశాలు

'మంచిని ప్రసాదించు' అంటే మంచిపనులు చేసే భాగ్యాన్ని ప్రసాదించు అని భావం. విశ్వాసులు ప్రపంచంలో కేవలం ప్రాపంచిక సిరిసంపదల్ని మాత్రమే కాకుండా మంచిపనులు చేసుకునే సౌభాగ్యం ప్రాప్తించాలని కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. తమకు ఏది ఒసగబడినా అది తమకు శుభకరం కావాలని కోరుకోవాలి. పోతే పరలోకంలో మంచిని ప్రసాదించటమంటే ప్రపంచంలో చేసిన పుణ్యకార్యాలకు మంచి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదించమని భావం. ఎంతో సమగ్రమైన ప్రార్థన ఇది. హజ్ ఉమ్రా యాత్రల్లో కాబా గృహ ప్రదక్షిణాలు చేసినప్పుడు రుక్నెయమానీ, హజ్రె అస్వద్‌ల మధ్య ఈ ప్రార్థన చేయటం మస్నూన్ (దైవప్రవక్త విధానం). కొందరు ఆ సమయంలో ఈ ప్రార్థన చేయకుండా ఏవో స్వయంకల్పిత వచనాలు పఠిస్తూ ఉంటారు. ఈ పద్ధతి సరైనది కాదు. దైవప్రవక్త ﷺ వాటి మధ్య 'రబ్బనా ఆతినా ఫిద్దున్‌యా హసనతన్…' అని మాత్రమే పఠించేవారని హదీసుల ద్వారా బోధపడుతోంది. కనుక దాన్ని వదలిపెట్టి స్వయం కల్పిత ప్రార్థనా వచనాలు వల్లించటం సరైన పద్ధతి కాదు. అయితే తమ అవసరాలు తీర్చమని తమకు వచ్చిన భాషలోనే దేవుణ్ణి వేడుకోవచ్చు. ముఖ్యంగా 'ముల్తజిమ్'ని అంటిపెట్టుకొని విలపించి మరీ ప్రార్థనలు చేయాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1468

1469

హదీసు 1469

وعَن ابنِ مسْعُودٍ رَضي اللَّه عنْهُ، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَقُولُ: "اللَّهُمَّ إِنِي أَسْأَلُكَ الهُدَى، وَالتُّقَى، وَالعفَافَ، والغنَى" رواهُ مُسْلِمٌ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా వేడుకునేవారు: దేవా! నేను నిన్ను సన్మార్గాన్ని, భయభక్తుల్ని, సౌశీల్యాన్ని, నిరపేక్షాభావాన్ని ప్రసాదించమని అర్థిస్తున్నాను. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ used to supplicate: “Allahumma inni as’alukal-huda, wat-tuqa, wal-`afafa, wal-ghina (O Allah! I beseech You for guidance, piety, chastity and contentment).”[Muslim].

ముఖ్యాంశాలు

'సన్మార్గం' అంటే మంచివైపునకు దర్శకత్వం అని అర్థం. మనిషికి ఎల్లప్పుడూ దీని అవసరముంటుంది. సన్మార్గమనే మాటలో మంచిని బలపరచటం, దానిపై స్థిరంగా నిలబడటం అనే అర్థాలు కూడా ఇమిడి ఉన్నాయి. దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయన వారించిన విషయాలకు దూరంగా ఉండటం 'తఖ్వా' (భయభక్తులు) క్రిందికి వస్తాయి. మనిషికి భయభక్తులు ఎంత అవసరమో వివరించనవసరం లేదు. సౌశీల్యతలో రెండు భావాలు ఇమిడి ఉన్నాయి. పాపాలకు దూరంగా ఉండటం, ప్రజల ముందు ముష్టెత్తకుండా గౌరవంగా బతకటం. ఈ రెండూ సౌశీల్యత క్రిందికే వస్తాయి. ఇకపోతే నిరపేక్షాభావమంటే ప్రజల నుండి ఏమీ ఆశించకుండా ఒక్క దేవుని మీదే అన్ని ఆశలూ పెట్టుకొని ఉండటం. ఈ ప్రార్థనలో కూడా ఎంతో సమగ్రత ఉంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1469

1470

హదీసు 1470

وعَنْ طارِقِ بنِ أَشْيَمَ، رضِيَ اللَّه عَنْهُ، قالَ: كَانَ الرَّجلُ إِذا أَسْلَمَ عَلَّمَهُ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، الصَّلاةَ، ثُمَّ أَمَرَهُ أَنْ يَدعُوَ بهَؤُلاءِ الكَلِمَاتِ: "اللَّهُمَّ اغفِرْ لِي، وَارْحمْني، واهْدِني، وعافِني، وارْزُقني "رواهُ مسلمٌ. وفي رِوايَةٍ لَهُ عَنْ طارقٍ أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وَأَتاهُ رَجُلٌ، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ. كيْفَ أَقُولُ حِينَ أَسْأَلُ رَبِّي؟ قَالَ: "قُلْ: اللَّهُمَّ اغْفِرْ لِي، وَارْحَمْني، وَعَافِني، وَارْزُقني، فَإِنَّ هَؤُلاءِ تَجْمَعُ لَكَ دُنْيَاكَ وَآخِرَتَكَ ".

హజ్రత్ తారిఖ్ బిన్ అష్‌యమ్ (రదియల్లాహు అన్హు) కథనం: ఏ మనిషి అయినా ఇస్లాం స్వీకరిస్తే దైవప్రవక్త ﷺ (ముందుగా) అతనికి నమాజ్ నేర్పించేవారు. ఆ తర్వాత ఈ వచనాలతో (దైవాన్ని) ప్రార్థించమని ఆదేశించేవారు. "ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం చూపు, నన్ను క్షేమంగా ఉంచు, నాకు ఉపాధినొసగు." (ముస్లిం)

ముస్లింలోనే వేరొక ఉల్లేఖనం ప్రకారం తారిఖ్ (రదియల్లాహు అన్హు) తాను దైవప్రవక్త ﷺ నుండి విన్న విషయాన్ని ఇలా వివరించారు: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి, "దైవప్రవక్తా! నేను నా ప్రభువును అర్ధించినప్పుడు ఏమని పలకాలి?" అని అడిగాడు. అందుకాయన ఇలా అన్నారు: "ఈ విధంగా ప్రార్థించు, ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నా మీద దయజూపు, నన్ను క్షేమంగా ఉంచు. నాకు ఉపాధినొసగు."

ఈ ప్రార్థనా వచనాలు నీ ఇహలోక జీవితానికి, పరలోక జీవితానికి రెండింటికీ వర్తిస్తాయి. (వీటిలో రెండురకాల ఉద్దేశాలూ ఇమిడి వున్నాయని భావం.)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Tariq bin Ashyam (radiyallahu anhu) reported: Whenever a man entered the fold of Islam, the Prophet ﷺ would show him how to perform Salat and then direct him to supplicate: “Allahumm-aghfir li, warhamni, wa-hdini, wa `afini, warzuqni (O Allah! Forgive me, have mercy on me, guide me, guard me against harm and provide me with sustenance and salvation).”’[Muslim].

In another narration Tariq said: A man came to the Prophet ﷺ and said to him: “O Messenger of Allah! What shall I say if I want to pray to my Rubb?” He ﷺ said, “Say: `Allahumma-ghfir li, warhamni, wa `afini, warzuqni (O Allah! Forgive me, have mercy on me, protect me and provide me with sustenance).’ Surely, this supplication is better for you in this life and in the Hereafter.”

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1470

1471

హదీసు 1471

وَعَنْ عَبْدِ اللَّهِ بنِ عمرو بن العاصِ رضيَ اللَّه عنْهُمَا، قَالَ: قَال رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اللَّهُمَّ مُصَرِّفَ القُلُوبِ صرِّفْ قُلوبَنَا عَلَى طَاعَتِكَ" رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్(రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించారు: దేవా! హృదయాలను మరలించే స్వామీ! మా హృదయాలను నీ విధేయత వైపు మరల్చు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఖదర్ ప్రకరణం)

English

`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ supplicated: “Allahumma musarrifal-qulubi, sarrif qulubana `ala ta`atika (O Allah! Controller of the hearts, direct our hearts to Your obedience).”[Muslim].

ముఖ్యాంశాలు

ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన. ఇందులో మంచితనం కోసం, ధర్మంపై నిలకడతనం కోసం ప్రార్థించటం జరుగుతుంది. మనిషి హృదయం ఎల్లప్పుడూ సమస్యల వలయంలో, సంఘటనల సుడిగుండంలో చిక్కుకొని ఉంటుంది. అందులోని అలల తాకిడికి అది ఎప్పుడు ఏ వైపుకు మళ్ళుతుందో తెలియదు. దేవుని కృప, ఆయన సహాయం తోడు లేకపోతే మనిషి హృదయం ఏ సందర్భంలోనయినా వక్రతకు గురై భష్టత్వకూపంలో పడిపోవచ్చు. అందుకే హృదయాలు వక్రతకు లోనవకుండా కాపాడమనీ, వాటిని కేవలం తనవైపునకు మాత్రమే మళ్ళించి ఉంచమనీ ఈ హదీసులో దేవుణ్ణి ప్రార్థించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1471

1472

హదీసు 1472

وَعَنْ أَبي هُريَرةَ رَضيَ اللَّه عَنْهُ، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "تَعَوَّذُوا بِاللَّهِ مِنْ جَهْدِ الْبَلاءِ، وَدَرَكِ الشَّقَاءِ، وَسُوءِ الْقَضَاءِ، وَشَماتَةِ الأَعْدَاءِ "متفقٌ عَلَيْهِ. وفي رِوَايةٍ: قالَ سُفْيَانُ: أَشُكُّ أَنِّي زِدْتُ وَاحِدَةً مِنها.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: పరిశ్రమ వల్ల కలిగే కష్టం నుండి, దౌర్భాగ్యం సోకటం నుండి, చెడు నిర్ణయాల నుంచి, శత్రువుల నవ్వులాటల నుంచి మీరు దేవుని శరణు వేడుకోండి.

(బుఖారీ-ముస్లిం)

వేరొక ఉల్లేఖనం ప్రకారం (ఈ హదీసు ఉల్లేఖకుల్లో ఒకరైన) సుఫ్యాన్ తాను వీటిలో ఏదో ఒక విషయం తన తరపు నుండి అదనంగా చెప్పానేమోనని అనుమానంగా ఉందని చెప్పారు.

(సహీహ్ బుఖారీలోని ఖదర్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Seek refuge in Allah against the turmoils, attacks of misfortunes, and evil of judgement and joys of the enemies.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసులో నాలుగు విషయాల బారి నుండి శరణు వేడుకోవటం జరిగింది. మొదటగా 'జహ్‌దుల్ బలా' నుండి శరణుకోరటం జరిగింది. మనిషి ఓర్చుకోలేని, తొలగించుకోనూలేని అత్యంత బాధాకరమైన కష్టాన్ని 'జహ్‌దుల్ బలా' అని అంటారు. కొందరు సిరిసంపదలు తక్కువగా ఉండటాన్ని, తమ మీద ఆధారపడి బతికేవారు చాలా ఎక్కువమంది ఉండటాన్ని జహ్‌దుల్ బలా అన్నారు. కాని హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) దీని గురించి వ్యాఖ్యానిస్తూ, 'జహ్‌దుల్ బలా'లో అది ఒక రకమే కాని, పూర్తిగా అదే 'జహ్‌దుల్ బలా' కాదని అన్నారు. రెండోది, దౌర్భాగ్యం అంటుకోవటం నుండి శరణుకోరటం. ఇది సౌభాగ్యానికి వ్యతిరేకమైనది. మూడోది, చెడు నిర్ణయాల నుండి. దేవుని నిర్ణయాల్లో ఏ నిర్ణయమూ చెడ్డది

కాదు. కాకపోతే వాటిలో కొన్నిటివల్ల మనుషులకు నష్టం కలగవచ్చు. మరికొన్నిటివల్ల లాభమూ కలగవచ్చు. ఆ విధంగా మానవుల దృష్టితో చూస్తే దేవుని నిర్ణయాల్లో మంచీచెడులు రెండూ ఉంటాయి. కనుక దేవుని నిర్ణయాల్లో తమకు నష్టం కలిగించే వాటి నుండి శరణువేడుకుంటూ ఉండాలి. చివరగా 'షమాతత్' నుండి శరణు వేడుకోమని ఆదేశమయింది. శత్రువు సంతోషించటాన్ని 'షమాతత్' అంటారు. సాధారణంగా మనుషులు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు వారి శత్రువులు వారిని చూసి నవ్వుతారు. సంతోషం ప్రదర్శిస్తారు. అలాంటి కష్టాల నుండి కూడా దేవుని శరణువేడుకుంటూ ఉండాలని దైవప్రవక్త ﷺ ప్రబోధించారు.

ఈ హదీసులో ఉల్లేఖకుడు సుఫ్యాన్ సొంతమాట ఒకటి ఉంది. అది హదీసులో భాగం కాదు. అయితే ముసలితనంలో ఆయన ఆ మాట ఏదో మర్చిపోయారు. అయితే ఇతర ఉల్లేఖనాల ద్వారా ఆ అదనపు మాట 'శత్రువుల నవ్వులాట' అని తెలిసిపోయింది. (ఇబ్నెఅల్లాన్)

హదీసు ఉల్లేఖకుల నిజాయితీకి ఈ సంఘటన ఓ మచ్చుతునక. హదీసులో తమ తరపు నుండి అదనంగా ఓ ప్రార్థన వచనాన్ని చేర్చినా ఆ విషయాన్ని కూడా వారు ఎలంటి దాపరికాలూ లేకుండా వివరించారు. కొంతమంది 'శత్రువుల నవ్వులాట' అనేది విశ్వసనీయమైన ఉల్లేఖకుడు అదనంగా చెప్పింది కనుక అది ఆమోదయోగ్యమని అన్నారు. కాని నిజానికి వారు పారబడ్డారు. ఒక హదీసు ఉల్లేఖకుల్లో విశ్వసనీయమైన వ్యక్తి ఒకడు ఇతరులెవరూ చెప్పని మాట హదీసులో అంతర్భాగంగా చెప్పాడనుకోండి. అది అమోదయోగ్యమే. కాని ఈ హదీసులోని సమస్య వేరు. ఇందులో ఉల్లేఖకుడు స్వయంగా చెబుతున్నారు ఆ అదనపు మాట తాను కల్పించినదని. కనుక అదనపు మాట హదీసుగా చెల్లదు. దీన్ని 'ఇద్రాజ్' అని అంటారు. అదనపు మాటను 'ముద్రజ్' అంటారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1472

1473

హదీసు 1473

وَعَنْهُ قَالَ: كَانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ:"اللَّهمَّ أَصْلِحْ لِي دِيني الَّذي هُوَ عِصْمَةُ أَمْرِي، وأَصْلِحْ لِي دُنْيَايَ الَّتي فِيهَا مَعَاشِي، وَأَصْلِحْ لِي آخِرَتي الَّتي فِيها مَعَادي، وَاجْعلِ الحيَاةَ زِيادَةً لِي في كُلِّ خَيْرٍ، وَاجْعَلِ الموتَ راحَةً لِي مِنْ كُلِّ شَرٍ "رَوَاهُ مسلِمٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండేవారు: ఓ అల్లాహ్! నా జీవన వ్యవహారాల్ని పరిరక్షించేది ధర్మమే కనుక నా ధర్మాన్ని చక్కదిద్దు. నేను జీవితం గడపవలసింది ప్రపంచంలోనే కనుక నా ప్రాపంచిక జీవితాన్ని సంస్కరించు. మరణానంతరం నా శాశ్వత స్థానం పరలోకమే కనుక నా పరలోక జీవితాన్ని చక్కదిద్దు. నా జీవితంలో అన్ని రకాల మేళ్ళు పెరిగిపోయేలా చెయ్యి. అన్నిరకాల చెడుల నుండి (రక్షణ పొందటానికి వీలుగా) మరణాన్ని నా కొరకు సుఖవంతం చెయ్యి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to say: “Allahumm-aslih li diniyalladhi huwa `ismatu amri, wa aslih li dunyaya-llati fiha ma`ashi, wa aslih li akhirati-llati fiha ma`adi, waj`alil-hayata ziyadatan li fi kulli khair, waj`alil-mauta rahatan li min kulli sharrin (O Allah, make my religion easy for me by virtue of which my affairs are protected, set right for me my world where my life exists, make good for me my Hereafter which is my resort to which I have to return, and make my life prone to perform all types of good, and make death a comfort for me from every evil).”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ ప్రార్థన కూడా చాలా సమగ్రంగా, భావగర్భితంగా ఉంది. ఇందులో ధర్మం, ప్రపంచం, పరలోకం ఈ మూడింటిలోనూ తమ జీవితాన్ని చక్కదిద్దమని ప్రార్థించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1473

1474

హదీసు 1474

وَعنْ علي رَضِيَ اللَّه عَنْهُ، قَالَ: قَالَ لي رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"قُلْ: اللَّهُمَّ اهْدِني، وَسدِّدْني". وَفي رِوَايةٍ:"اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْهُدى، وَالسَّدَادَ "رواهُ مسلم.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నాకు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండమని ఉపదేశించారు: "ఓ అల్లాహ్! నాకు సన్మార్గం చూపు. నన్ను తిన్నగా (సవ్యంగా) ఉంచు."

వేరొక ఉల్లేఖనంలో "దేవా! నేను నీ నుండి సన్మార్గం, నిలకడతనం, మధ్యేమార్గం కోరుకుంటున్నాను" అని ఉంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

`Ali (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me, “Recite: `Allahumma-hdini wa saddidni (O Allah! Direct me to the Right Path and make me adhere to the Straight Path).” Another narration is: `Allahumma inni as’aluk-alhuda was-sadad (I beg You for guidance and uprightness).”[Muslim].

ముఖ్యాంశాలు

హదీసు మూలంలో 'సిదాద్' అనే పదం వచ్చింది. సిదాద్ అంటే సవ్యమైనది అని అర్థం. ప్రతి ఆచరణా సవ్యమైన రీతిలో, దైవప్రవక్త విధానానికి అనుగుణంగా నెరవేర్చే సద్బుద్ధిని ప్రసాదించమని ఇక్కడ దానిభావం. కొందరు హదీసు భాష్యకారులు ఈ పదానికి నిలకడతనం, మధ్యేమార్గం అనే అర్ధాలు ఉన్నాయని చెప్పారు. భావం రీత్యా రెండు అర్థాలూ సరైనవే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1474

1475

హదీసు 1475

وَعَنْ أَنَسٍ رَضِيَ اللَّه عَنْهُ، قَالَ: كَانَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: يَقُولُ: "اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعجْزِ والكَسَلِ وَالجُبْنِ وَالهَرَمِ، وَالْبُخْلِ، وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ القبْرِ، وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ المَحْيا وَالمَمَاتِ ". وفي رِوايةٍ:"وَضَلَعِ الدَّيْنِ وَغَلَبَةِ الرِّجَالِ" رَوَاهُ مُسْلِمٌ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా వేడుకునేవారు: "ఓ అల్లాహ్! (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండి కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం, పిసినారితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి, జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను.

వేరొక ఉల్లేఖనంలో 'రుణభారం, ఇతరులు నాపై దౌర్జన్యం చేయటం నుంచి (నీ శరణు కోరుతున్నాను)' అని ఉంది. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to supplicate: “Allahumma inni a`udhu bika minal-ajzi wal-kasali, wal-jubni wal-harami, wal-bukhli, wa a`udhu bika min `adhabil-qabri, wa a`udhu bika min fitnatil-mahya wal-mamat [O Allah! I seek refuge in You from helplessness (to do good), indolence, cowardice, senility, and miserliness; and I seek Your Protection against the torment of the grave and the trials of life and death].” Another narration adds: “wa dala`id-daini wa ghalabatir-rijal (And from the burden of indebtedness and the tyranny of men).”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1475

1476

హదీసు 1476

وَعن أَبي بكْرٍ الصِّدِّيقِ رَضِيَ اللَّه عَنْه، أَنَّه قَالَ لِرَسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: عَلِّمني دُعَاءً أَدعُو بِهِ في صَلاتي، قَالَ: قُلْ: اللَّهمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْماً كثِيراً، وَلا يَغْفِر الذُّنوبَ إِلاَّ أَنْتَ، فَاغْفِر لي مغْفِرَةً مِن عِنْدِكَ، وَارحَمْني، إِنَّكَ أَنْتَ الْغَفور الرَّحِيم" متَّفَقٌ عليهِ. وفي رِوايةٍ:"وَفي بيْتي"وَرُوِي:"ظُلْماً كَثِيراً"وروِيَ"كَبِيراً"بِالثاءِ المثلثة وبِالباءِ الموحدة، فَيَنْبغِي أَن يُجْمَعَ بَيْنَهُمَا، فَيُقَالُ: كَثيراً كَبيراً.

హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం తానొకసారి దైవప్రవక్త ﷺను అడిగారు, "నమాజులో చేసుకోవటానికి నాకొక ప్రార్థన నేర్పించండి" అని. అందుకాయన ఈ విధంగా ప్రార్థించమని ఉపదేశించారు.

"అల్లాహ్! నేను నా ఆత్మకు చాలా అన్యాయం చేసుకున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు. నా మీద దయజూపు, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు."

(బుఖారీ-ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో "ఈ ప్రార్థన నేను ఇంట్లో చేసుకుంటాను" అని ఉంది. అందులోనే 'జుల్మన్ కసీరన్'కు బదులు జుల్మన్ కబీరన్ అని ఉంది. (అందుకని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారంటే) ఆ రెండింటినీ కలుపుకొని "జలమ్‌తు నఫ్‌సీ జుల్మన్ కసీరన్ కబీరన్" అని పఠించటం ఉత్తమం.

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Bakr As-Siddiq (radiyallahu anhu) reported: I requested the Messenger of Allah ﷺ to teach me a supplication which I could recite in my Salat (prayer). Thereupon he said, “Recite: `Allahumma inni zalamtu nafsi zulman kathiran, wa la yaghfirudh-dhunuba illa Anta, faghfir li maghfiratan min `indika, warhamni, innaka Antal-Ghafur-ur-Rahim (O Allah! I have considerably wronged myself. There is none to forgive the sins but You. So grant me pardon and have mercy on me. You are the Most Forgiving, the Most Compassionate).”’[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఈ ప్రార్థనా వచనాలను నమాజులో దరూదె షరీఫ్ తర్వాత సలాం చేయకముందు పఠించాలి. ఇతర వేళల్లో కూడా దీన్ని పఠించవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1476

1477

హదీసు 1477

وَعَن أَبي موسَى رضَيَ اللَّه عَنْه، عَنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّه كَانَ يَدعُو بهَذا الدُّعَاءِ: "اللَّهمَّ اغْفِر لِي خَطِيئَتي وجهْلي، وإِسْرَافي في أَمْري، وَمَا أَنْتَ أَعلَم بِهِ مِنِّي، اللَّهمَّ اغفِرْ لِي جِدِّي وَهَزْلي، وَخَطَئي وَعمْدِي، وَكلُّ ذلِكَ عِنْدِي، اللَّهُمَّ اغْفِرْ لي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ، وَما أَسْررْتُ وَمَا أَعْلَنْتُ، وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي، أَنْت المقَدِّمُ، وَأَنْتَ المُؤَخِّرُ، وَأَنْتَ عَلى كلِّ شَيْءٍ قَدِيرٌ "متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అబూమూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ (క్రింది) ప్రార్థనా వచనాలతో దేవుణ్ణి ప్రార్థించేవారు: "ఓ అల్లాహ్! నా తప్పునీ, నా మూర్ఖత్వాన్ని, నా వ్యవహారంలో నేను మితిమీరిపోవటాన్ని, నా కంటే నీకు బాగా తెలిసిన నా తప్పుల్నీ క్షమించు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా చేసినా, ఉబుసుపోక చేసినా, తెలిసి చేసినా తెలియకచేసినా- అవన్నీ నేను చేసిన తప్పులే. వాటన్నిటినీ క్షమించు. దేవా! నేను ఇంతకు ముందు చేసిన పాపాలను, చేయబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను, ఇంకా నాకంటే నీకే ఎక్కువ తెలిసిన పాపాలను కూడా క్షమించు. ముందుకు నడిపించేవాడవు, వెనక్కి నెట్టేవాడవు నీవే. నీవు ప్రతి వస్తువుపై అధికారం కలిగివున్నావు."

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Musa (radiyallahu anhu) reported: The Prophet ﷺ used to supplicate: “Allahumm-aghfir li khati‘ati, wajahli, wa israfi fi amri, wa ma Anta a`lamu bihi minni. Allahumm-aghfir li jiddi wa hazli, wa khata’i wa `amdi, wa kullu dhalika `indi. Allahumm-aghfir li ma qaddamtu wa ma akhkhartu, wa ma asrartu, wa ma a`lantu, wa ma Anta a`lamu bihi minni. Antal-Muqaddimu, wa Antal-Mu’akhkhiru; wa Anta `ala kulli shai’in Qadir (O Allah! Forgive my errors, ignorance and immoderation in my affairs. You are better aware of my faults than myself. O Allah! Forgive my faults which I committed in seriousness or in fun deliberately or inadvertently. O Allah! Grant me pardon for those sins which I committed in the past and I may commit in future, which I committed in privacy or in public and all those sins of which You are better aware than me. You Alone can send whomever You will to Jannah, and You Alone can send whomever You will to Hell-fire and You are Omnipotent).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త ﷺ ద్వారా జరిగిన, జరగపోయే పాపాలన్నిటినీ దేవుడు మన్నించాడు. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి ఎంతగా క్షమాపణలు వేడుకునేవారో చూడండి. ఇందులో మనకు గొప్ప గుణపాఠం ఉంది. మనం మన వల్ల జరిగే పాపాలపై పశ్చాత్తాపం చెంది, వాటికి క్షమాపణలు వేడుకునే విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుకు లోనుకాకూడదు. ఈ ప్రార్థనా వచనాలను అత్యంత అణకువభావంతో (అన్ని రకాల పాపాలను క్షమించమని) పలకటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1477

1478

హదీసు 1478

وعنْ عَائِشَةَ رَضِيَ اللَّه عَنهَا، أَنَّ النَّبي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يقُولُ في دُعَائِهِ: "اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا عمِلْتُ ومِنْ شَرِّ مَا لَمْ أَعْمَلْ". رَوَاهُ مُسْلِم.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన ప్రార్థనలో ఇలా అనేవారు: "ఓ అల్లాహ్! నేను ఇంతకు ముందు చేసిన పనుల కీడు నుండి, ఇంతవరకు చేయని పనుల కీడు నుండి నీ శరణు కోరుతున్నాను." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ used to supplicate (in these words): “Allahumma inni audhu bika min sharri ma `amiltu, wa min sharri ma lam a`mal (O Allah! I seek refuge in You from the evil of that which I have done and the evil of that which I have not done).”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ ప్రార్థనలో ఓ పెద్ద భావ సముద్రమే ఇమిడి ఉంది. మనిషి కొన్ని సందర్భాల్లో మంచిపనులు చేస్తాడు. కాని వాటిలో ప్రదర్శనాబుద్ధిగాని, అహంకారంగాని ఉంటే అది ఇతర మంచిపనులను కూడా నాశనం చేసేస్తుంది. అందుకని అలాంటివాటి నుంచి శరణు వేడుకుంటూ ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1478

1479

హదీసు 1479

وعَنِ ابنِ عُمَر رَضِيَ اللَّه عَنْهُما قَالَ: كانَ مِنْ دُعاءِ رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم "اللَّهمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ، وَتَحَوُّلِ عَافِيَتِكَ وَفُجاءَةِ نِقْمَتِكَ، وَجميعِ سخَطِكَ "روَاهُ مُسْلِمٌ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి: "ఓ అల్లాహ్! నీవు అనుగ్రహించిన వరాలు తరిగిపోవటం నుండి, నీవు ప్రసాదించిన క్షేమం మారిపోవటం నుంచి, హఠాత్తుగా నీవు నిలదీసి నిగ్గుతేల్చటం నుంచి, ఇంకా ఏ విధంగానయినా నీకు ఆగ్రహం రావటం నుండి నేను నీ శరణు వేడుతున్నాను." (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని రిఖాఖ్ ప్రకరణం)

English

`Abdullah bin `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ used to supplicate thus: “Allahumma inni a`udhu bika min zawali ni`matika, wa tahawwuli `afiyatika, wa fuja’ati niqmatika, wa jami`i sakhatika (O Allah! I seek refuge in You against the declining of Your Favours, passing of safety, the suddenness of Your punishment and all that which displeases You).”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ ప్రార్థన కూడా అత్యంత సమగ్రంగా ఉంది. దేవుడు ప్రతి మనిషికీ ఎన్నో వరాలు అనుగ్రహించాడు. ఆ వరాలు తొలగిపోయినప్పుడే అతనికి వాటి విలువ తెలుస్తుంది. కళ్ళు, చెవులు, ఆరోగ్యం, సిరిసంపదలు ఇలా ఎన్నో అమూల్యమైన వరాలు దేవుడు ప్రసాదించాడు. ఆయన ప్రసాదించిన వరాలేవీ కోల్పోకూడదని ఈ ప్రార్థనలో కోరుకోవటం జరిగింది. ఆ తర్వాత క్షేమం మారిపోవటం నుండి శరణు కోరటం జరిగింది. అసలు క్షేమం అంటే వ్యాధులకు, కష్టాలకు, దుఃఖవిచారాలకు లోనవకుండా ఉండటం. అలాగాకుండా మనిషి నిరంతరం వ్యాధులకు, కష్టాలకు గురవుతుంటే దాన్నే 'క్షేమం మారిపోవటం' అంటారు. అలాంటి బాధాకరమైన విషయాలన్నిటి నుండి శరణు కోరుకుంటూ ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1479

1480

హదీసు 1480

وَعَنْ زَيْدِ بنِ أَرْقَم رضَي اللَّه عَنْهُ، قَالَ: كَانَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقَولُ: "اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ العَجْزِ وَالكَسَلِ، والبُخْلِ وَالهَرم، وعَذَاب الْقَبْر، اللَّهُمَّ آتِ نَفْسِي تَقْوَاهَا، وَزَكِّهَا أَنْتَ خَيرُ مَنْ زَكَّاهَا، أَنْتَ ولِيُّهَا وَموْلاَهَا، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عِلمٍ لا يَنْفَعُ، ومِنْ قَلْبٍ لاَ يخْشَعُ، وَمِنْ نَفْسٍ لاَ تَشبَعُ، ومِنْ دَعْوةٍ لا يُسْتجابُ لهَا" رواهُ مُسْلِمٌ.

హజ్రత్ జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! దీనావస్థ నుంచి, సోమరితనం నుంచి, పిసినారితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి, సమాధి యాతన నుంచి నేను నీ శరణు వేడుతున్నాను. దేవా! నా మనసుకు భయభక్తులు అనుగ్రహించు. దాన్ని పరిశుద్ధపరచు. నీవు మనసుని అందరికంటే బాగా శుద్ధి చేస్తావు. దాని కార్యసాధకుడివి, దాని సంరక్షకుడివి నీవే. దేవా! నిష్ప్రయోజనకరమైన విద్య నుండి నీ శరణు వేడుతున్నాను. భయపడని హృదయం నుండి, తృప్తి చెందని మనసు నుండి, ఆమోదించబడని ప్రార్థన నుండి నీ శరణు వేడుతున్నాను. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Zaid bin Arqam (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ would supplicate: “Allahumma inni a`udhu bika minal-`ajzi wal-kasali, wal-bukhli wal-harami, wa `adhabil-qabri. Allahumma ati nafsi taqwaha, wa zakkiha Anta khairu man zakkaha, Anta waliyyuha wa maulaha. Allahumma inni a`udhu bika min `ilmin la yanfau`, wa min qalbin la yakhsha`u, wa min nafsin la tashba`u, wa min da`watin la yustajabu laha` [O Allah! I seek refuge in You from the inability (to do good), indolence, cowardice, miserliness, decrepitude and torment of the grave. O Allah! Grant me the sense of piety and purify my soul as You are the Best to purify it. You are its Guardian and its Protecting Friend. O Allah! I seek refuge in You from the knowledge which is not beneficial, and from a heart which does not fear (You), and from desire which is not satisfied, and from prayer which is not answered].”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1480

1481

హదీసు 1481

وَعنِ ابنِ عبَّاسٍ رَضِيَ اللَّه عَنْهُمَا، أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَقُولُ:"اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ، وَبِكَ آمَنْتُ، وعلَيْكَ تَوَكَّلْتُ، وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ، وإِلَيْكَ حَاكَمْتُ. فاغْفِرْ لِي مَا قَدَّمْتُ، وَمَا أَخَّرْتُ، وَمَا أَسْررْتُ ومَا أَعلَنْتُ، أَنْتَ المُقَدِّمُ، وَأَنْتَ المُؤَخِّرُ، لا إِلَهَ إِلاَّ أَنْتَ". زادَ بعْضُ الرُّوَاةِ:"وَلاَ حَولَ وَلاَ قوَّةَ إِلاَّ بِاللَّهِ "متفَقُ عليهِ.

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! నేను నా స్వయాన్ని నీకు సమర్పించుకున్నాను. నిన్ను విశ్వసించాను. నిన్నే నమ్ముకున్నాను. నీ వైపుకే మరలాను. నీ (సహాయం) తోనే నేను (నీ శత్రువులతో) పోరాడాను. తీర్పు కోసం నేను నీ సన్నిధికే వచ్చాను. (దేవా!) నేను ఇంతకు ముందు చేసిన పాపాలనూ, తర్వాత చేసిన పాపాలనూ మన్నించు. రహస్యంగా చేసిన పాపాలనూ, బహిరంగంగా చేసిన పాపాలను కూడా మన్నించు. ముందుకు నడిపించేవాడవు, వెనక్కి నెట్టేవాడవు నీవే. నీవు తప్ప మరొక ఆరాధ్యదేవుడు ఎవరూ లేరు.

కొందరు ఉల్లేఖకులు ఈ వాక్యం అదనంగా ఉల్లేఖించారు: "మంచి పనులు చేసే శక్తి, చెడుల నుండి కాపాడుకునే సామర్థ్యం అల్లాహ్ తరపు నుండే లభిస్తుంది." (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని తహజ్జుద్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ used to supplicate: “Allahumma laka aslamtu, wa bika amantu, wa `alaika tawakkaltu, wa ilaika anabtu, wa bika khasamtu, wa ilaika hakamtu. Faghfir li ma qaddamtu, wa ma akh-khartu, wa ma asrartu wa ma a`lantu, Antal-Muqaddimu, wa Antal-Mu`akhkhiru, la ilaha illa Anta (O Allah! to You I submit, in You I affirm my faith, in You I repose my trust, to You I turn in repentance and with Your Help I contend my adversaries and from You I seek judgement. O Allah! Grant me forgiveness for the faults which I made in past and those ones I may commit in the future, those which I committed secretly or openly. You Alone send whomever You will to Jannah, and You Alone send whomever You will to Hell-fire. There is none worthy of worship except You).” Another narration adds: “La hawla wa la quwwata illa billah (There is no strength to resist evil and no power to do good except through Allah).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పూర్తిగా అల్లాహ్ వైపుకు మరలిపోయి ప్రతి వ్యవహారంలోనూ ఆయన ప్రసన్నతను, ఆయన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉండాలనీ, ఒకరితో స్నేహం పెంచుకోవాలన్నా లేదా శత్రుత్వం పెట్టుకోవాలన్నా దానికి దైవాభీష్టమే ప్రాతిపదిక కావాలని ఇందులో ప్రకటించబడింది. అల్లాహ్ ప్రతి ఒక్క ముస్లింకు హదీసులో పేర్కొనబడిన ప్రార్థన చేసే, అందులోని ప్రకటనను అనుసరించి ఆచరణ చేసే సద్బుద్ధిని ప్రసాదించు గాక!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1481

1482

హదీసు 1482

وَعَن عَائِشَةَ رَضِيَ اللَّه عَنْهَا، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَدعو بهؤُلاءِ الكَلِمَاتِ: " اللَّهُمَّ إِني أَعوذُ بِكَ مِن فِتنةِ النَّارِ، وعَذَابِ النَّارِ، وَمِن شَرِّ الغِنَى وَالفَقْر ". رَوَاهُ أَبو داوَد، والترمذيُّ وقال: حديث حسن صحيح، وهذا لفظُ أَبي داود.

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ ఈ ప్రార్థనా వచనాలతో దేవుణ్ణి ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! అగ్ని మూలంగా ఏర్పడే ఉపద్రవం నుండి, అగ్ని యాతన కీడు నుండి, కలిమి లేముల కీడు నుండి నేను నీ శరణు వేడుతున్నాను. (అబూదావూద్, తిర్మిజీ. తిర్మిజీ దీనిని హసన్ మరియు సహీహ్ కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు. వాక్యాలు అబూదావూద్‌వి)

(సుననె అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయం)

English

`Aishah (radiyallahu anha) reported: The Prophet ﷺ used to supplicate: “Allahumma inni a`udhu bika min fitnatin-nari, wa `adhabin-nari, wa min sharril-ghina wal-faqri (O Allah! I seek refuge in You from the trials and the torment of the Fire and from the evils of wealth and poverty).”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

కలిమి వల్ల కలిగే కీడు ఏమిటంటే మనిషిలో సిరిసంపదల పట్ల విపరీతమైన వ్యామోహం పెరిగిపోతుంది. వాటిని సంపాయించే ధ్యాసలో అతను ధర్మాధర్మాలను కూడా లెక్కచేయడు. అంతేకాదు, ఆ సిరిసంపదల మూలంగా అతనిలో గర్వం, అహంకారం, ఖారూనీ తత్త్వాలు కూడా పెరగవచ్చు. ఇవన్నీ మనిషి పరలోక జీవితానికి గొడ్డలిపెట్టు వంటివి. పోతే లేమివల్ల కలిగే కీడు ఏమిటంటే పేదరికం వల్ల కొన్ని సందర్భాల్లో మనిషి దేవుని కరుణాకటాక్షాల పట్ల నిరాశకు లోనవుతాడు. లేదా దైవప్రసన్నతను, విధివ్రాతను తూలనాడుతాడు, నీతి నిజాయితీలను ఉల్లంఘిస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1482

1483

హదీసు 1483

وعَن زيادِ بْن عِلاقَةَ عن عمِّه، وَهُوَ قُطبَةُ بنُ مالِكٍ، رَضِيَ اللَّه عَنْهُ، قَال: كَانَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "اللَّهمَّ إِنِّي أَعُوذُ بِكَ مِن منْكَرَاتِ الأَخلاقِ، والأعْمَالِ والأَهْواءِ "رواهُ الترمذي وقال: حديثُ حَسَنٌ.

హజ్రత్ జియాద్ బిన్ ఇలాఖా తన బాబాయి ఖుత్‌బా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) నుండి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! నేను చెడు నడత నుండి, చెడు కర్మల నుండి, చెడు వాంఛల నుంచి నీ శరణు వేడుతున్నాను. (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ ప్రకరణం)

English

Ziyad bin `Ilaqah reported: My uncle Qutbah bin Malik (radiyallahu anhu) said that the Prophet ﷺ used to supplicate: “Allahumma inni a`udhu bika min munkaratil-akhlaqi, wal-a`mali, wal-ahwa`i (O Allah! I seek refuge in You from undesirable manners, deeds, and aspirations).”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ ప్రార్థనలో చెడు నడత నుంచి, చెడు కర్మల నుంచి శరణు కోరుతూ పరోక్షంగా మంచినడత కోసం, సదాచరణ కోసం ప్రార్థించటం జరిగింది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1483

1484

హదీసు 1484

وعَن شكَلِ بنِ حُمَيْدٍ رَضِيَ اللَّه عَنْهُ قَال: قُلْتُ يَا رَسولَ اللَّهِ: عَلِّمْني دُعاءً. قَالَ: "قُلْ: اللَّهُمَّ إِني أعوذُ بِكَ مِنْ شَرِّ سَمْعِي، وَمِن شَرِّ بصَرِي، وَمِن شَرِّ لسَاني، وَمِن شَرِّ قَلبي، وَمِن شَرِّ منِيِّي" رواهُ أَبو داودَ، والترمذيُّ وقالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ షకల్ బిన్ హుమైద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి నేను దైవప్రవక్త ﷺ ను అడిగాను, "దైవప్రవక్తా! నాకో ప్రార్థన నేర్పించండి" అని. అందుకాయన ఈ విధంగా ప్రార్థించమని ఉపదేశించారు: "ఓ అల్లాహ్! నేను నా చెవుల కీడు నుండి, నా కళ్ళ కీడు నుండి, నా నాలుక కీడు నుండి, నా హృదయం కీడు నుండి, నా మర్మావయవం కీడు నుండి నీ శరణు వేడుతున్నాను." (అబూదావూద్, తిర్మిజీ-హసన్)

(సుననె అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Shakal bin Humaid (radiyallahu anhu) reported: I asked: “O Messenger of Allah, teach me a prayer.” He ﷺ said, “Say: Allahumma inni a`udhu bika min sharri sam`i, wa min sharri basari, wa min sharri lisani, wa min sharri qalbi, wa min sharri maniyyi (O Allah! I seek refuge in You from the evils of my hearing, the evils of my seeing, the evils of my tongue; the evils of my heart and the evils of passions).”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

అబద్ధపు మాటలు, అపనిందలు, చాడీలు, సంగీతం లాంటి నిషిద్ధ విషయాలు వినటం, లేక ధర్మవిషయాలు వినకపోవటం చెవుల కీడు. లోకుల లోపాల వైపు కన్నెత్తి చూడటం, పరస్త్రీల మీద దృష్టి కేంద్రీకరించటం లేదా విశ్వంలో వ్యాపించివున్న దైవమహిమల్ని కానకుండా ఉండటం దృష్టికీడు. మనసులో దేవుని ప్రేమకు కాకుండా ఇతరుల ప్రేమకు చోటివ్వటం హృదయ కీడు. లైంగిక కోర్కెలు తీర్చుకున్న తర్వాత మర్మాంగం నుండి స్ఖలించే చిక్కటి జిగట పదార్ధాన్ని 'మనీ' అంటారు. ఇక్కడ ఆ పదం 'మర్మాంగం' అనే అర్థంలో వాడబడింది. మర్మాంగాన్ని అక్రమంగా ఉపయోగిస్తే అది మర్మాంగ కీడు అవుతుంది. మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే చెవులు, కళ్లు, నాలుక, హృదయం, మర్మాంగం మొదలగు అవయవాలను అక్రమంగా ఉపయోగిస్తే, దేవుని దృష్టిలో అది నేరంగా పరిగణించబడుతుంది. అలాంటి నేరస్థులు దేవుని సన్నిధిలో నిలదీయబడతారు. అందుకని వాటిని దైవాభీష్టానికి అనుకూలమైన పనుల్లో ఉపయోగించి వాటిని పరిరక్షించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1484

1485

హదీసు 1485

وَعَن أَنسٍ رَضِيَ اللَّه عَنْهُ، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ يَقُولُ: "اللَّهمَّ إِنِّي أَعُوُذُ بِكَ مِنَ الْبرَصِ، وَالجُنُونِ، والجُذَامِ، وسّيءِ الأَسْقامِ" رَوَاهُ أَبو داود بإِسنادٍ صحيحٍ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! తెల్లమచ్చల రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్ఠు వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల నుండి నేను నీ శరణు వేడుతున్నాను. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

English

Anas (radiyallahu anhu) reported: The Prophet ﷺ used to supplicate: “Allahumma inni a`udhu bika minal-barasi, wal-jununi, wal-judhami, wa sayyi’il-asqami’ (O Allah! I seek refuge in You from leucoderma, insanity, leprosy and evil diseases).”[Abu Dawud].

ముఖ్యాంశాలు

హదీసులో పేర్కొనబడిన మూడు వ్యాధులు చాలా భయంకరమైనవి. అవేగాకుండా పక్షవాతం, మూతి వంకరపోవటం, మధుమేహం, క్యాన్సర్, అంధత్వం మొదలగు హీనమైన రోగాల నుండి కూడా ఇందులో శరణు వేడటం జరిగింది. దేవుడు మనల్ని ఇలాంటి వ్యాధుల నుండి రక్షించుగాక!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1485

1486

హదీసు 1486

وعَنْ أَبي هُرَيْرَةَ رَضِيَ اللَّه عَنْهُ، قَالَ: كانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقولُ: " اللَّهمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الجُوعِ، فإِنَّهُ بِئْسَ الضَّجيعُ، وَأَعُوذُ بِكَ منَ الخِيانَةِ، فَإِنَّهَا بئْسَتِ البِطانَةُ". رواهُ أَبُو داودَ بإِسنادٍ صحيحٍ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించేవారు: ఓ అల్లాహ్! నేను ఆకలి బాధ నుండి నీ శరణు కోరుతున్నాను. అది చాలా చెడ్డ సావాసి. ఓ అల్లాహ్! ఇంకా నేను నమ్మకద్రోహం నుండి నీ శరణు వేడుతున్నాను. ఎందుకంటే అదో ఘోరమైన మానసిక దౌర్బల్యం. (అబూదావూద్)

(సుననె అబూదావూద్‌లోని సలాత్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to supplicate: “Allahumma inni a`udhu bika minal-ju`i, fa-innahu bi’sad-daji`u; wa a`udhu bika minal-khiyanati, fa-innaha bi’satil-bitanah’ [O Allah! I seek refuge in You from hunger; surely, it is the worst companion. And I seek refuge in You from treachery; surely, it is a bad inner trait].”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1486

1487

హదీసు 1487

وَعن عليٍّ رَضِيَ اللَّه عَنْهُ، أَنَّ مُكَاتَباً جاءهُ، فَقَالَ إِني عجزتُ عَن كِتَابَتِي. فَأَعِنِّي. قالَ: أَلا أُعَلِّمُكَ كَلِماتٍ عَلَّمَنيهنَّ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لَو كانَ عَلَيْكَ مِثْلُ جبلٍ دَيْناً أَدَّاهُ اللَّهُ عنْكَ؟ قُلْ:"اللَّهمَّ اكْفِني بحلالِكَ عَن حَرَامِكَ، وَاغْنِني بِفَضلِكَ عَمَّن سِوَاكَ". رواهُ الترمذيُّ وقال: حديثٌ حسنٌ.

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం లిఖితపూర్వకంగా విడుదల ఒప్పందం (ముకాతబత్) చేసుకున్న బానిస వ్యక్తి ఒకడు తన దగ్గరకు వచ్చి ఒప్పందం ప్రకారం తాను యజమానికి డబ్బు చెల్లించలేకపోతున్నాననీ (అందుకని తనకు సహాయం చేయమని) కోరాడు. అందుకు అలీ (రదియల్లాహు అన్హు) అతనితో, "(అప్పుల బాధ తొలగిపోవటానికి) దైవప్రవక్త నాకు నేర్పిన ప్రార్థనా వచనాలను నీకు కూడా నేర్పమంటావా? నీ మీద కొండంత అప్పు ఉన్నాసరే దేవుడు నీ తరపు నుండి దాన్ని తీర్చేస్తాడు. నువ్వు ఈ విధంగా ప్రార్థించు" అని అన్నారు:

"ఓ అల్లాహ్! నేను అక్రమార్జనకు పాల్పడకుండా ఉండేందుకు నీవు ప్రసాదించే పరిశుద్ధ సంపాదనతోనే నా అవసరాలన్నీ తీర్చు. నీ కరుణాకటాక్షాలతో నన్ను నీ విషయంలో తప్ప ఇతర అన్ని విషయాల్లోనూ నిరపేక్షాపరునిగా ఉండేలా చెయ్యి."

(తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయం)

English

`Ali (radiyallahu anhu) reported: A slave who had made a contract with his master to pay for his freedom, came to me and said: “I am unable to fulfill my obligation, so help me.” He said to him: “Shall I not teach you a supplication which the Messenger of Allah ﷺ taught me? It will surely prove so effective that if you have a debt as large as a huge mountain, Allah will surely pay it for you. Say: `Allahumm-akfini bihalalika `an haramika, wa aghnini bifadlika `amman siwaka (O Allah! Grant me enough of what You make lawful so that I may dispense with what You make unlawful, and enable me by Your Grace to dispense with all but You).”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

బానిస తాను ఇంత డబ్బు కట్టి స్వేచ్ఛాపరుణ్ణి అయిపోతానని తన యజమానితో ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని 'ముకాతబత్ ఒప్పందం' అంటారు. ఈ విధమైన బానిసను ముకాతబ్ బానిస అని పిలుస్తారు. నిర్ణీత మొత్తం యజమానికి చెల్లించగానే ఆ బానిస స్వేచ్ఛ పొందుతాడు. తిర్మిజీ గ్రంథంలో దైవప్రవక్త ﷺ ప్రస్తావించిన కొండ పేరు కూడా ఉంది. దానిపేరు 'సుబైర్'. చెప్పొచ్చేదేమిటంటే రుణాన్ని చెల్లించటం కోసం, ప్రజల నుండి నిరపేక్షతతో ఉండటం కోసం ఈ ప్రార్థన చేసుకుంటూ ఉండటం ఉత్తమం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1487

1488

హదీసు 1488

وعَنْ عِمْرانَ بنِ الحُصينِ رَضي اللَّه عنْهُمَا، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم علَّم أَباهُ حُصيْناً كَلِمتَيْنِ يدعُو بهما: "اللَّهُمَّ أَلهِمْني رُشْدِي، وأَعِذني مِن شَرِّ نَفْسي". رواهُ الترمذيُّ وقَالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఆయన తండ్రిగారైన హుసైన్‌కు రెండు ప్రార్థనా వచనాలు నేర్పించారు. వాటితో ఆయన ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ రెండు వచనాలు ఇవి: ఓ అల్లాహ్! నా మనసులో సద్బుద్ధిని పుట్టించు. నాకు నా మనసు కీడు నుండి శరణు ఇవ్వు. (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

`Imran bin Husain (radiyallahu anhuma) reported: The Prophet ﷺ taught my father two statements to recite in his Du`a. These are: “Allahumma al-himni rushdi, wa a`idhni min sharri nafsi (O Allah! Inspire in me guidance and deliver me from the evils within myself).”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

సద్బుద్ధి పుట్టించటమంటే మంచిపనులు చేసే సద్బుద్ధిని ప్రసాదించటం, ప్రతి సందర్భంలోనూ సరైన మార్గాన్ని సూచించటమని అర్థం. మనసు కీడు నుండి రక్షించటమంటే ఇహపరాల వినాశనానికి దారితీసే మనోవాంఛల నుండి కాపాడటమని భావం.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1488

1489

హదీసు 1489

وَعَن أَبي الفَضلِ العبَّاسِ بنِ عَبْدِ المُطَّلِبِ رضِي اللَّه عنْهُ، قال: قُلْتُ يارسول اللَّهِ: عَلِّمْني شَيْئاً أَسْأَلُهُ اللَّه تَعَالى، قَالَ: "سَلُوا اللَّه العافِيةَ". فَمكَثْتُ أَيَّاماً، ثُمَّ جِئتُ فَقُلْتُ: يَا رسولَ اللَّه: علِّمْني شَيْئاً أَسْأَلُهُ اللَّه تَعَالَى، قَالَ لي: "يَا عبَّاسُ يَا عمَّ رَسولِ اللَّهِ، سَلُوا اللَّه العافيةَ في الدُّنْيا والآخِرةِ ". رَواهُ الترمذيُّ وقَالَ: حديثٌ حسنٌ صَحيحٌ.

అబుల్ ఫజ్ల్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను దైవప్రవక్త ﷺను అడిగాను: "దేవుణ్ణి ప్రార్థించటానికి ఏమైనా (ప్రార్థనా వచనాలు) నేర్పించండి!" అని. అందుకాయన "దేవుణ్ణి క్షేమం ప్రసాదించమని అడగండి" అని ఉపదేశించారు. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళి "దైవప్రవక్తా! దేవుణ్ణి ప్రార్థించటానికి నాకు ఏమైనా నేర్పించండి" అని అడిగాను. అందుకాయన "దైవప్రవక్త బాబాయి అయిన ఓ అబ్బాస్! దేవుణ్ణి ఇహపరాల్లో క్షేమాన్ని ప్రసాదించమని అడగండి" అని ఉపదేశించారు.

(తిర్మిజీ-హసన్, సహీహ్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Abul-Fadl Al-`Abbas bin `Abdul-Muttalib (radiyallahu anhu) reported: I asked the Messenger of Allah ﷺ to teach me a supplication. He ﷺ said, “Beg Allah for safety (from all evils in this world and in the Hereafter).” I waited for some days and then I went to him again and asked him: “O Messenger of Allah Teach me to supplicate something from Allah.” He said to me, “O Al-`Abbas, the uncle of Messenger of Allah! Beseech Allah to give you safety (Al-a’fiyah ) in this life and in the Hereafter.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఆఫియత్ (క్షేమం)కు సంబంధించిన ప్రార్థనలో ఇహపరాల్లో ప్రశాంతంగా ఉండాలన్న కోరిక కూడా ఇమిడి ఉంది. ఈ విధంగా ఈ ప్రార్థన కూడా చాలా సమగ్రమైనది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1489

1490

హదీసు 1490

وعنْ شَهْرِ بْنِ حوشَبٍ قَالَ: قُلْتُ لأُمِّ سَلَمَةَ، رَضِي اللَّه عَنْهَا، يَا أُمَّ المؤمِنِين مَا كَانَ أَكْثَرُ دُعَاءِ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا كانَ عِنْدكِ؟ قَالَتْ: كانَ أَكْثَرُ دُعائِهِ: "يَا مُقلبَ القُلوبِ ثَبِّتْ قلْبي علَى دِينِكَ" رَواهُ الترمذيُّ، وقال حَديثٌ حسنٌ.

హజ్రత్ షహర్ బిన్ హౌషబ్ కథనం: నేను ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) ను అడిగాను: "ఓ విశ్వాసుల మాతృమూర్తీ! దైవప్రవక్త ﷺ మీ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా ఏమని ప్రార్థించేవారు?" అని. అందుకామె దైవప్రవక్త ﷺ ఎక్కువగా ఈ ప్రార్థన చేసేవారని చెప్పారు:

"హృదయాలను మరల్చేవాడా! నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా ఉంచు." (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Shahr bin Haushab reported: I asked Umm Salamah (radiyallahu anha), “O Mother of the Believers! Which supplication did the Messenger of Allah ﷺ make frequently when he was in your house?” She said: “He ﷺ supplicated frequently: `Ya muqallibal-qulubi, thabbit qalbi `ala dinika (O Controller of the hearts make my heart steadfast in Your religion).”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

గొప్ప పట్టుదల ఉన్నవారే ధర్మంపై స్థిరంగా నిలబడ గల్గుతారు. అది కూడా దైవసహాయం తోడుంటేనే సాధ్యమవుతుంది. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురౌతుంటాయి. అలాంటి సందర్భాల్లో మనిషి ఏ నిమిషం లోనయినా ధర్మం విషయంలో అలసత్వానికి, ఏమరుపాటుకు, భ్రష్టత్వానికి లోనుకావచ్చు. అలాంటి వారికోసం ఈ దుఆ చేయటం చాలా అవసరం. చాలా ఎక్కువగా ఈ ప్రార్థన చేయాలి. ఒకసారి కాదు, వీలైనంతవరకు ఎల్లప్పుడూ దీన్ని పఠిస్తూనే ఉండాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1490

1491

హదీసు 1491

وعن أَبي الدَّرداءِ رَضيَ اللَّه عَنْهُ، قَالَ: قَالَ رَسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "كانَ مِن دُعاءِ دَاوُدَ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"اللَّهمَّ إِنِّي أَسْأَلُكَ حُبَّكَ، وَحُبَّ مَنْ يُحِبُّكَ، وَالعمَل الَّذِي يُبَلِّغُني حُبَّكَ اللَّهُمَّ اجْعل حُبَّكَ أَحَبَّ إِلَيَّ مِن نَفسي، وأَهْلي، ومِن الماءِ البارِدِ "روَاهُ الترمذيُّ وَقَالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: దావూద్ ప్రవక్త ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి:

"ఓ అల్లాహ్! నేను నీ నుండి నీ ప్రేమను, నిన్ను ప్రేమించేవారి ప్రేమను, నన్ను నీ ప్రేమదాకా చేర్చే కర్మను ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నీ ప్రేమను నా కొరకు నా ప్రాణం కన్నా, నా ఆలుబిడ్డల కన్నా, చల్లని నీటికన్నా ప్రియమైనదిగా చెయ్యి." (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Abud-Darda’ (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “One of Prophet Dawud’s supplications was: `Allahumma inni as’aluka hubbaka, wa hubba man yuhibbuka, wal-`amalalladhi yuballighuni hubbaka. Allahumm-aj`al hubbaka ahabba ilayya min nafsi, wa ahli, wa minal-ma’il-baridi (O Allah! I ask You for Your Love, the love of those who love You, and deeds which will cause me to attain Your Love. O Allah! Make Your Love dearer to me than myself, my family and the cold water).”’[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ ప్రార్థనలో దేవుని ప్రేమతోపాటు దేవుని ప్రియదాసుల ప్రేమను, సత్కార్యాల ప్రేమను కూడా అర్ధించటం జరిగింది. ఎందుకంటే మనిషికి వీటి మూలంగా కూడా దైవప్రేమ, ఆయన సాన్నిహిత్యం లభిస్తాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1491

1492

హదీసు 1492

وعن أَنَسٍ رضِيَ اللَّه عَنْهُ، قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"أَلِظُّوا بِياذا الجَلالِ وَالإِكرامِ". رواه الترمذي وروَاهُ النَّسَائيُّ مِن رِوايةِ ربيعةَ بنِ عامِرٍ الصَّحابيِّ. قَالَ الحاكم: حديثٌ صحيحُ الإِسْنَادِ. "أَلِظُّوا"بكسر الَّلام وتشديد الظاءِ المعجمةِ معْنَاه: الْزَمُوا هذِهِ الدَّعْوَةِ وأَكْثِرُوا مِنها.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: 'యా జల్ జలాలి వల్ ఇక్రామ్' అనే మాటను విరివిగా ఉపయోగించండి. (తిర్మిజీ, నసాయీ దీనిని రబీఆ బిన్ ఆమిర్ సహాబీ ఆధారంగా వెలికితీశారు. ఇమామ్ హాకిమ్ ఈ హదీసు ఆధారాలను దృఢమైనవిగా పేర్కొన్నారు.)

'అలిజ్జూ' అంటే "(యా జల్ జలాలి వల్ ఇక్రామ్ అన్న) పిలుపును (మీ ప్రార్థనల్లో) తప్పకుండా పఠించండి. దీన్ని చాలా ఎక్కువగా ఉపయోగించండి" అని అర్థం.

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Recite frequently: `Ya Dhal-Jalali wal-Ikram! (O You, Possessor of glory and honour).”’[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

తమ ప్రార్థనల్లో దేవుణ్ణి మాటిమాటికీ 'యాజల్ జలాలి వల్ ఇక్రామ్' అని సంబోధిస్తూ ఉండాలని ఈ హదీసు భావం. ఎందుకంటే ఇందులో దైవస్తోత్రం, ఆయన పరిపూర్ణ గుణవిశేషాలు కీర్తించబడ్డాయి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1492

1493

హదీసు 1493

وعن أَبي أُمامةَ رضيَ اللَّه عنْهُ قَالَ: دَعا رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بِدُعَاءٍ كَثيرٍ، لَمْ نَحْفَظْ مِنْهُ شَيْئاً، قُلْنا يَا رَسُولَ اللَّهِ دَعَوْتَ بِدُعاءٍ كَثِيرٍ لَمْ نَحْفَظ منْهُ شَيْئاً، فقَالَ: "أَلا أَدُلُّكُم عَلَى مَا يَجْمَعُ ذَلكَ كُلَّهُ؟ تَقُولُ: "اللَّهُمَّ إِنِّي أَسْأَلُك مِن خَيرِ مَا سأَلَكَ مِنْهُ نبيُّكَ مُحَمَّدٌ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا اسْتَعاذَ مِنْهُ نَبيُّكَ مُحمَّدٌ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَأَنْتَ المُسْتَعَانُ، وعليْكَ البلاغُ، وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِاللَّهِ "رواهُ الترمذيُّ وقَالَ: حديثٌ حَسَنٌ.

హజ్రత్ అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ఎన్నో ప్రార్థనలు చేశారు. మేము వాటిలో ఒక్కటి కూడా గుర్తుంచుకోలేదు. ఓసారి మేము (ఆయన దగ్గరికెళ్ళి) "దైవప్రవక్తా! మీరు ఎన్నో ప్రార్థనలు చేశారు. కాని మేము వాటిలో ఒక్కటి కూడా గుర్తుంచుకోలేకపోయాం" అని విన్నవించుకున్నాం. అది విని ఆయన "వాటన్నిటినీ సమీకరించుకున్న ప్రార్థన మీకు తెలుపనా? మీరు ఇలా అనండి" అని ఉపదేశించారు:

"ఓ అల్లాహ్! నేను నీ నుండి నీ ప్రవక్త ముహమ్మద్ ﷺఅర్ధించిన మేళ్ళను అర్థిస్తున్నాను. నీ ప్రవక్త ముహమ్మద్ ﷺ వేటి కీడు నుండి నీ శరణు వేడుకున్నారో వాటి కీడు నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. సహాయం కోసం అర్థించబడేది నీవే. బాధితుని దగ్గరికి చేరేవాడివి నీవే. మంచి పనులు చేసే శక్తి, చెడుల నుండి కాపాడుకోవటానికి కావలసిన సామర్థ్యం అల్లాహ్ నుండే లభిస్తుంది."

(తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Abu Umamah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ made many supplications which we did not memorize. We said to him: “O Messenger of Allah! You have made many supplications of which we do not remember anything.” He said, “Shall I tell you a comprehensive prayer? Say: `Allahumma inni as’aluka min khairi ma sa’alaka minhu nabiyyuka Muhammadun sallallahu `alaihi wa sallam. Wa `a`udhu bika min sharri mas-ta`adha minhu nabiyyuka Muhammadun sallallahu `alaihi wa sallam. Wa Antal-Musta`anu, wa `alaikal-balaghu, wa la hawla wa la quwwata illa billah (O Allah, I beg to You the good which Your Prophet Muhammad ﷺ begged of You; and I seek refuge in You from the evil where from Your Prophet Muhammad ﷺ sought refuge. You are the One from Whom help is sought and Your is the responsibility to communicate (the truth). There is no power or strength except with Allah the Exalted, the Great.”’[At-Tirmidhi]

ముఖ్యాంశాలు

ఎక్కువ ప్రార్థనా వచనాలను కంఠస్థం చేసుకోలేనివారు ఈ ప్రార్థనను కంఠస్థం చేసుకోవాలి. అలాంటివారికి ఈ ప్రార్థన చాలా సమగ్రమైనది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1493

1494

హదీసు 1494

وَعَن ابْنِ مسْعُودٍ، رضِيَ اللَّه عنْهُ، قَالَ: كَانَ مِن دُعَاء رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مُوجِباتِ رحْمتِكَ، وَعزَائمَ مغفِرتِكَ، والسَّلامَةَ مِن كُلِّ إِثمٍ، والغَنِيمَةَ مِن كُلِّ بِرٍ، وَالفَوْزَ بالجَنَّةِ، وَالنَّجاةَ مِنَ النَّارِ ". رواهُ الحاكِم أَبُو عبد اللَّهِ، وقال: حديثٌ صحيحٌ على شرط مسلِمٍ.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి: "ఓ అల్లాహ్! నేను నీ నుండి నీ ప్రేమను, నా కొరకు అనివార్యం చేసే విషయాలను, మాకు నీ క్షమాభిక్ష దొరికేలా చేసే ఆచరణల్ని, అన్నిరకాల పాపాల నుండి సురక్షితంగా ఉండటాన్ని, ప్రతి సత్కార్యంలో భాగాన్ని, స్వర్గాన్ని సాధించటంలో విజయాన్ని, నరకాగ్ని నుండి విముక్తిని కోరుకుంటున్నాను." (ఈ హదీసును ఇమామ్ హాకిమ్ అబూ అబ్దుల్లాహ్ ఉల్లేఖించారు. ఆయన దీన్ని ముస్లిం షరతులకు అనుగుణంగా ప్రామాణికమైనదని పేర్కొన్నారు.)

(హాకిమ్ గారి ముస్త్రదక్ గ్రంథం మొదటి సంపుటి-525)

English

Ibn Mas`ud (radiyallahu anhu) reported: One of the supplications of the Messenger of Allah ﷺ was: “Allahumma inni as’aluka mujibati rahmatika, wa `aza’ima maghfiratika, was-salamata min kulli ithmin, wal-ghanimata min kulli birrin, wal-fawza bil-jannati, wannajata mina-nar (O Allah! I beg You for that which incites Your Mercy and the means of Your forgiveness, safety from every sin, the benefit from every good deed, success in attaining Jannah and deliverance from Fire).”[Al-Hakim].

ముఖ్యాంశాలు

షేఖ్ అల్‌బానీ ఈ హదీసుని బలహీనమైనదిగా పేర్కొన్నారు. వివరాల కోసం అల్‌బానీ గారిచేత పరిశోధించబడిన రియాజుస్సాలిహీన్ గ్రంథం, జయీఫ్ జామే సగీర్ గ్రంథాలు చూడండి. అయితే కేవలం ఒక ప్రార్థనగా దీని ద్వారా దేవుణ్ణి వేడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో దేవుని కరుణను, క్షమాభిక్షను ప్రసాదించిపెట్టే ఆచరణల్ని అవలంబించే సద్బుద్ధి కోసం, స్వర్గసాధనలో విజయం కోసం , నరకం నుండి రక్షణ కోసం ప్రార్థించటం జరిగింది. దేవుడు ఆమోదించుగాక!

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రార్ధనల ప్రకరణం|250. ప్రార్థన విశిష్టత|హదీసు 1494