హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 249వ అధ్యాయం: నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 1459 – 1465) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు
باب مَا يقوله عِنْدَ النوم
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
{إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالأَرْضِ وَاخْتِلافِ اللَّيْلِ وَالنَّهَارِ لآياتٍ لأُولِي الأَلْبَابِ الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَاماً وَقُعُوداً وَعَلَى جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ} الآيات. [آل عمران: ١٩٠-١٩١]
భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు ఒకదాని తర్వాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్నివేళలా అల్లాహ్ను స్మరించేవారున్నూ, భూమీ ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. (ఆలి ఇమ్రాన్: 190-191)
English
“Verily! In the creation of the heavens and the earth, and in the alternation of night and day, there are indeed signs for men of understanding. Those who remember Allah (always, and in prayers) standing, sitting, and lying down on their sides, and think deeply about the creation of the heavens and the earth.” [Āl ‘Imrān 3:190–191]
హదీసు 1459
وعنْ حُذيفةَ وأَبي ذرٍّ رضي اللَّه عنْهما أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذَا أَوَى إِلَى فِرَاشِهِ قالَ: "باسْمِكَ اللَّهُمَّ أَحْيَا وَأَمُوتُ".رواه البخاري.
హజ్రత్ హుజైఫా మరియు అబూ జర్ర్ (రదియల్లాహు అన్హుమా)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ పడకపై (నిద్రపోవటానికి) మేను వాల్చినప్పుడు, "దేవా! నీ పేరుతోనే నేను బతుకు తున్నాను, మరణిస్తున్నాను" అని అనేవారు.
(బుఖారీ)
English
Hudhaifah and Abu Dharr (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to supplicate when he went to bed at night: “Bismik-Allahumma ahya wa amut (With Your Name, O Allah, I expire and return to life).”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకుముందు 'నిద్రపోయేటప్పుడు ఏమనాలి?' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. ప్రతి మనిషి రాత్రిపూట నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేస్తుంటాడు. నిజానికి నిద్రపోవటం ఒకరకంగా మరణం లాంటిది. మేల్కొనటం జీవితం లాంటిది. జీవితం, మరణం- ఈ రెండూ దేవుని అధీనంలోనే ఉన్నాయి. ఈ హదీసులో ఆ భావాన్నే బలపరచటం జరిగింది. మనిషి ప్రతి రాత్రీ ఈ దుఆను నెమరువేసుకుంటూ ఉంటే అతనికి తన జీవితం దేవుడు ప్రసాదించినదనీ, ఆయన ఇష్టాయిష్టాల మీదే తను జీవిస్తున్నాడనీ, ఆయన ఎప్పుడు తలచుకుంటే అప్పుడు తన జీవిత దీపం ఆరిపోతుందనీ, కనుక దేవుడు అరువిచ్చిన జీవితాన్ని ఆయన అభీష్టానికి అనుగుణంగా గడపాలనీ, ఆయన పట్ల అవిధేయతకు పాల్పడకూడదనే విషయాలు ఎల్లప్పుడూ గుర్తుంటాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1459
హదీసు 1460
وعَنْ عليٍّ رضي اللَّه عَنْهُ أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ لَهُ وَلِفَاطِمةَ رضيَ اللَّه عنهما: "إِذَا أَوَيْتُمَا إِلى فِراشِكُما، أَوْ إِذَا أَخَذْتُمَا مَضَاجِعَكُما فَكَبِّرا ثَلاثاً وَثَلاثِينَ، وَسَبِّحَا ثَلاثاً وثَلاثِينَ، وَاحْمَدَا ثَلاثاً وَثَلاثِين" وفي روايةٍ:"التَّسْبِيحُ أَرَبعاً وَثَلاثِينَ "وفي روايةٍ:" التَّكبيرُ أَربعاً وَثَلاثِينَ "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తనకూ మరియు ఫాతిమా (రదియల్లాహు అన్హా) కు ఇలా ఉపదేశించారు: మీరు మీ పడకలపై మేను వాల్చినప్పుడు '33 సార్లు అల్లాహుఅక్బర్' అనీ, '33సార్లు సుబ్హానల్లాహ్' అనీ, '33సార్లు అల్హమ్దులిల్లాహ్' అనీ అనాలి.
మరొక ఉల్లేఖనంలో సుబ్హానల్లాహ్ 34 సార్లు చెప్పాలి అని ఉంది. ఇంకొక ఉల్లేఖనంలో 'అల్లాహు అక్బర్ ముప్పై నాలుగు సార్లు చెప్పాలి' అని ఉంది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నఫఖాత్, దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
`Ali (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me and to Fatimah (radiyallahu anha) (Ali’s wife and the Prophet’s daughter), “When you go to bed, recite: Takbir (Allahu Akbar) thirty-three times and Tasbih (Subhan-Allah) thirty-three times and Tahmid (Al-hamdu lillah) thirty-three times.”
Another narration is: The Messenger of Allah ﷺ said, “Recite Tasbih thirty-four times.”
Another narration is: The Messenger of Allah ﷺ said, “Recite Takbir thirty-four times.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పైన పేర్కొనబడిన వచనాలు మూడింటినీ కలిపి వందసార్లు పఠించాలని విభిన్న హదీసుల సారాంశం బోధపరుస్తోంది. ఒక్కొక్క వచనాన్ని ముప్పైమూడు సార్లు పఠించి చివరగా మూడవ వచనాన్ని ముప్పై నాలుగుసార్లు పఠించాలి. మూడింటికీ సంబంధించి ముప్పైనాలుగు సార్లు పఠించాలనే ఆదేశముంది కనుక సుబ్హానల్లాహ్, అల్హమ్దు లిల్లాహ్, అల్లాహు అక్బర్ వీటిలో దేన్నయినా ముప్పై నాలుగుసార్లు పఠించవచ్చు. గ్రంథకర్త ఇమామ్ నవవీ రెండు ఉల్లేఖనాల్ని ఇక్కడ పొందుపరచారు. పోతే నసాయి గ్రంథంలో అల్హమ్దులిల్లాహ్ ముప్పై నాలుగుసార్లు పఠించాలని ఉంది. ఈ విధంగా 34 సార్లు అనేమాట మూడింటికీ వర్తిస్తుంది. వాటిలో దేన్నయినా ముప్పైనాలుగు సార్లు పఠించవచ్చు. ఈ తస్బీహ్ వచనాలను ఈ సంఖ్య ప్రకారమే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత కూడా పఠించాలని హదీసుల్లో ఆదేశించబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1460
హదీసు 1461
وعن أَبي هُريرةَ رَضِيَ اللَّه عنهُ، قَالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا أَوَى أَحَدُكُم إِلى فِراشِهِ، فَلْيَنْفُض فِراشَهُ بداخِلَةِ إِزَارِهِ فإِنَّهُ لاَ يَدْرِي مَا خَلَفَهُ عَلَيْهِ، ثُمَّ يَقُولُ: بِاسْمِكَ رَبِّي وَضَعْتُ جَنْبي، وَبِكَ أَرْفَعُهُ، إِنْ أَمْسَكْتَ نَفْسِي فَارْحَمْها، وإِنْ أَرْسَلْتَهَا، فَاحْفَظْهَا بِمَا تَحْفَظُ بِه عِبادَكَ الصَّالحِينَ" متفقٌ عَلَيهِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీరు లేనప్పుడు మీ పడకల మీద ఏమొచ్చి చేరిందో మీకు తెలియదు. కనుక మీలో ఎవరయినా (నిద్రపోవటానికి) పడక మీద మేను వాల్చినప్పుడు ముందుగా తన లుంగీ లోపలి భాగంతో సహా పడకను దులుపుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ప్రార్థించాలి:
"ప్రభూ! నేను నీ పేరుతోనే (పడక మీద) మేను వాల్చాను. తిరిగి నీ పేరుతోనే దాన్ని లేపుతాను. (ఈ నిద్రలో గనక) నీవు నా ఆత్మను ఆపుకుంటే దాన్ని కరుణించు. ఒకవేళ విడిచిపెట్టినట్లయితే నీవు దాన్ని నీ పుణ్యదాసుల్ని ఎలా కాపాడుతావో అలా కాపాడు."
(బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When any of you goes to bed, he should shake off (or dust off) his bedsheet because he does not know what might have fallen on it after he had left it. Then he should recite: `Bismika Rabbi wada`tu janbi, wa bika arfa`uhu, in amsakta nafsi farhamha, wa in arsaltaha fahfazha bima tahfazu bihi `ibadakas-salihin [With Your Name, my Rubb, I place my side (upon the bed) and with Your Grace I will raise it up. If You withhold my soul (cause me to die), have mercy on it but if You let it go (let me live), guard it against which You guarded Your pious slaves].”’[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో ఒక ముఖ్య విషయం బోధించబడింది, అదేమిటంటే, మనం లేనప్పుడు హానికరమైన పురుగులేవయినా మన పడకల మీద దుప్పట్లలో దాక్కొని ఉండవచ్చు. కనుక దుప్పట్లను దులుపుకోకుండా పడుకోవటం వల్ల హానికరమైన పురుగులు మనల్ని కుట్టే ప్రమాదముంటుంది. కనుక మనం నిద్రపోదలచుకున్నప్పుడు ముందుగా మంచాన్ని, దుప్పట్లను ఒకటికి రెండుసార్లు దులుపుకోవాలి. తర్వాత పైన పేర్కొనబడిన దుఆ కూడా పఠించాలి. దాంతో మనిషి దేవుని రక్షణ పరిధిలోకి వచ్చేస్తాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1461
హదీసు 1462
وعنْ عائشةَ رضي اللَّه عنْها، أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذَا أَخَذَ مضْجعَهُ نَفَثَ في يدَيْهِ، وَقَرَأَ بالْمُعَوِّذاتِ ومَسح بِهمَا جَسَدَهُ، متفقٌ عَلَيْهِ. وفي رواية لهما: أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذَا أَوى إِلى فِرَاشِهِ كُلَّ لَيْلةٍ جمَع كَفَّيْهِ ثُمَّ نفَثَ فِيهِمَا فَقَرأَ فِيهما: {قُلْ هُوَ اللَّهُ أَحَدٌ} ، {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ} ، {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ} ، ثُمَّ مَسَحَ بِهِمَا مَا اسْتطاعَ مِن جسَدِهِ، يبْدَأُ بِهما عَلَى رَأْسِهِ وَوجهِهِ، وَمَا أَقبلَ مِنْ جَسَدِهِ، يَفْعَلُ ذلكَ ثَلاَثَ مرَّات متفقٌ عَلَيْهِ. قَالَ أَهلُ اللُّغَةِ:"النَّفْثُ"نَفخٌ لَطِيفٌ بِلاَ رِيقٍ.
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం: దైవప్రవక్త ﷺ (నిద్ర పోవటానికి) పడకమీదకు వెళ్ళినప్పుడు అరచేతుల్లో ఊదుకునేవారు. ముఅవ్వజాత్లు పఠించి అరచేతులతో శరీరాన్ని స్పృశించుకునేవారు. (బుఖారీ-ముస్లిం)
బుఖారీ-ముస్లింలలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: దైవప్రవక్త ﷺ ప్రతిరోజూ రాత్రి (నిద్రపోవటానికి) పడకమీదకు చేరుకున్నప్పుడు అరచేతులు కలిపి అందులో ఊదేవారు. తర్వాత అరచేతుల్లోనే ఖుల్ హువల్లాహు అహద్ సూరా, ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్ సూరా, ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్ సూరాలు పఠించి వాటితో వీలైనంతవరకు శరీరాన్ని స్పృశించుకునేవారు. ముందు తల, ముఖం, శరీర ఉదరభాగం నుండి స్పృశించటం మొదలుపెట్టేవారు. ఈ విధంగా మూడుసార్లు చేసేవారు.
(బుఖారీ-ముస్లిం)
భాషావేత్తల అభిప్రాయం ప్రకారం 'నఫ్సున్' అంటే ఉమ్మిరాకుండా మెల్లిగా ఊదటం అని అర్థం.
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
`A ishah (radiyallahu anha) reported: Whenever the Messenger of Allah ﷺ went to bed, he would blow upon his hands recite Al-Mu`awwidhat; and pass his hands over his body.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
హదీసులో పేర్కొనబడిన మూడు సూరాలను 'ముఅవ్వజాత్' అని పిలుస్తారు. వీటి ద్వారా దేవుని శరణువేడుకోవటం జరుగుతుంది. పోతే ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్ మరియు ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్ రెండు సూరాలను కలిపి ముఅవ్వజతైన్ అని అంటారు. మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే నిద్రపోయేటప్పుడు ఈ మూడు సూరాలనూ పఠించి నిద్రపోవాలి. అలా చేస్తే ఒకవైపు దైవప్రవక్త సంప్రదాయాన్ని ఆచరించినట్లవుతుంది. మరోవైపు దేవుని శరణు కూడా లభిస్తుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1462
హదీసు 1463
وَعنِ البرَاءِ بنِ عازِبٍ، رَضِيَ اللَّه عنْهمَا، قَالَ: قَالَ لي رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا أَتَيتَ مَضْجَعَكَ فَتَوضَّأْ وضُوءَكَ لِلصَّلاةِ، ثُمَّ اضْطَجِعْ عَلى شِقِّكَ الأَيمَنِ، وقلْ: اللَّهُمَّ أَسْلَمْتُ نفِسي إِلَيكَ، وَفَوَّضتُ أَمري إِلَيْكَ، وَأَلَجَأْتُ ظَهرِي إِلَيْكَ، رغبةً ورهْبَةً إِلَيْكَ، لامَلجأَ ولا مَنجي مِنْكَ إِلاَّ إِليكَ، آمنتُ بِكِتَابِكَ الذِي أَنزَلْت، وَبِنَبِيِّكَ الذِي أَرسَلتَ، فإِنْ مِتَّ. مِتَّ عَلَى الفِطرةِ، واجْعَلهُنَّ آخِرَ مَا تَقُولُ" مُتَّفقٌ عليهِ.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ నాకు ఇలా ఉపదేశించారు: (నిద్రపోవటానికి) పడకమీదికి వెళ్ళాలనుకున్నప్పుడు నమాజుకు మాదిరిగా వుజూ చేసుకో. తర్వాత (పడకమీద) కుడి ప్రక్కకు తిరిగి పడుకొని ఈ విధంగా వేడుకో: "ఓ అల్లాహ్! నేను నా స్వయాన్ని నీకు సమర్పించుకున్నాను. నా ముఖాన్ని నీ వైపుకు తిప్పుకున్నాను. నా వ్యవహారాన్ని నీకు అప్పగించాను. నీ కారుణ్యాన్ని కోరుకుంటూ, నీ ఆగ్రహానికి భయపడుతూ నా వీపును నీ వైపుకు ఆనించాను. నీవు ఆశ్రయమిస్తే తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు రక్షణ కల్పిస్తే తప్ప రక్షణ పొందటానికి మరో చోటు లేదు. నీవు అవతరింపజేసిన గ్రంథాన్ని నేను విశ్వసించాను. నీవు పంపిన ప్రవక్తను నమ్మాను."
నీవు ఈ వచనాలు పఠించి నిద్రపోయినప్పుడు రాత్రికి రాత్రే నీకు మరణం సంభవించినట్లయితే నీవు సహజత్వం (ఇస్లాం ధర్మం)పై మరణించినట్లుగా పరిగణించబడతావు. (ఇంకో విషయం గుర్తుంచుకో) 'ఈ వచనాలు నీ ఆఖరి వచనాలు కావాలి (ఆ తర్వాత ప్రాపంచికమైన మాటలేవీ మాట్లాడకూడదు).'
(బుఖారీ-ముస్లిం)
English
Al-Bara` bin `Azib (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “Whenever you intend to go to bed, perform Wudu’ as is done for Salat (prayer); and then lie down on the right side and recite: `Allahumma aslamtu nafsi ilaika, wa fawwadtu amri ilaika, wal-ja’tu zahri ilaika, raghbatan wa rahbatan ilaika, la malja’a wa la manja minka illa ilaika, amantu bikitabik-alladhi anzalta, wa binabiyyik-alladhi arsalta [O Allah! I have submitted myself to You. I have turned my face to You, entrusted my affairs to You and relied completely on You out of desire for and fear of You (expecting Your reward and fearing Your punishment). There is no resort and no deliverer from (hardships) except You. I affirm my faith in Your Book which You have revealed, and in Your Prophet whom You have sent].’ If you die during the night, you will die in the true religion. Let these words be your last words at night.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకు ముందు (మొదటి సంపుటిలోని) 'నమ్మకం, దేవుని మీద భారం మోపటం' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. నిద్రపోయేటప్పుడు వుజూ చేసుకొని పడుకోవాలనీ, పైన పేర్కొనబడిన దుఆ పఠించిన తర్వాత ఇతర ప్రాపంచికమైన మాటలేవీ మాట్లాడరాదని ఈ హదీసు మనకు బోధిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1463
హదీసు 1464
وَعَنْ أَنَسٍ رَضِيَ اللَّه عَنْهُ، أَنَّ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذَا أَوَى إِلى فِرَاشِهِ قَال: "الحمْدُ للَّهِ الَّذي أَطْعَمنَا وسقَانا، وكفَانَا وآوانَا، فكمْ مِمَّنْ لا كافيَ لَهُ وَلاَ مُؤْوِيَ" رواهُ مسلمٌ.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ పడక మీదకెళ్ళినప్పుడు ఇలా అనేవారు: అల్లాహ్ మాకు తినిపించాడు, త్రాపించాడు, తమకు తోడు-నీడ లేనివారు (ఈ ప్రపంచంలో) చాలామంది ఉన్నారు. మాకు మాత్రం దేవుడే తోడునీడగా నిలిచాడు. అందుకు మేమాయన్ని స్తుతిస్తున్నాం. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Anas (radiyallahu anhu) reported: Whenever the Prophet ﷺ went to his bed, he would say: “Al-hamdu lillah-illadhi at`amana wa saqana, wa kafana wa awana, fakam mimman la kafiya lahu wa la mu’wiya (Praise is due to Allah Who has fed us, provided us drink, satisfied us and gave us protection. Many are those who have no one to provide for them, or give them shelter).”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1464
హదీసు 1465
وعنْ حُذيْفَةَ، رضِيَ اللَّه عَنْهُ، أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كَانَ إِذا أَرَاد أَنْ يرْقُدَ، وضَع يَدهُ اليُمنَى تَحْتَ خَدِّهِ، ثُمَّ يقُولُ: "اللَّهمَّ قِني عَذَابكَ يوْمَ تَبْعثُ عِبادَكَ "رواهُ الترمِذيُّ وقال: حديثٌ حَسنٌ. وَرَواهُ أَبو داودَ مِنْ رِوايةِ حفْصةَ، رَضِي اللَّه عنْهُا، وَفيهِ أَنَّهُ كَانَ يقُولهُ ثَلاثَ مَرَّاتٍ.
హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నిద్ర పోదలచుకున్నప్పుడు కుడిచేతిని (కుడి) చెంప క్రింద పెట్టుకొని ఇలా వేడుకునేవారు: "ఓ అల్లాహ్! నీవు నీ దాసుల్ని తిరిగి (బతికించి) లేపేరోజున నన్ను నీ శిక్ష నుండి కాపాడు." తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్గా పేర్కొన్నారు.
అబూదావూద్ ఈ హదీసుని హఫ్సా (రదియల్లాహు అన్హా) ఆధారంగా వెలికి తీశారు. అందులో 'దైవప్రవక్త ﷺ, పై విధంగా వేడుకునేవారు' అని ఉంది.
(సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు – సుననె అబూదావూద్లోని సంస్కార ప్రకరణం)
English
Hudhaifah (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ intended to go to sleep, he would place his right hand under his (right) cheek and supplicate: “Allahumma qini `adhabaka yauma tab`athu `ibadaka (O Allah! Guard me against Your punishment on the Day when You will resurrect Your slaves).”[At-Tirmidhi].
In a narration in Abu Dawud, Hafsah (radiyallahu anha) said: Before going to sleep the Messenger of Allah ﷺ would recite this Du`a three times.
ముఖ్యాంశాలు
మనిషి దైవశిక్ష పట్ల నిర్భయుడై పోకూడదనీ, నిత్యం దాన్నుండి శరణుకోరుతూ ఉండాలనీ, పైగా దేవుని ప్రసన్నత కోసం మంచిపనులు చేస్తూ ఉండాలనీ, అప్పుడే ప్రళయం నాడు దైవశిక్ష నుండి సురక్షితంగా ఉండటానికి వీలవుతుందని ఈ హదీసు పరోక్షంగా హెచ్చరిస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|249. నిద్రపోయేటప్పుడు చేసే ప్రార్థనలు|హదీసు 1465
You must be logged in to post a comment.