హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 24. బుద్ది చెప్పి గడ్డి తినే వారి పర్యవసానం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 24వ అధ్యాయం: మంచిని గురించి ఆదేశిస్తూ, చెడునుండి వారిస్తూ తాను మాత్రం దానికి విరుద్ధంగా చేసేవాడికి ఎదురయ్యే కఠిన పర్యవసానం గురించి. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 1 హదీసులు (హదీసు 200) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

24. మంచిని గురించి ఆదేశిస్తూ, చెడునుండి వారిస్తూ తాను మాత్రం దానికి విరుద్ధంగా చేసేవాడికి ఎదురయ్యే కఠిన పర్యవసానం గురించి…..

↑ విషయ సూచిక

باب تغليظ عقوبة من أمر بمعروف أَوْ نهى عن منكر وخالف قولُه فِعله

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

{أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنْسَوْنَ أَنْفُسَكُمْ وَأَنْتُمْ تَتْلُونَ الْكِتَابَ أَفَلا تَعْقِلُونَ} [البقرة:٤٤]

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ సెలవిచ్చాడు : "సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు – కాని మిమ్మల్ని మీరు మరచిపోతారేమిటి? మరి చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారు. అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి?" (అల్ బఖర : 44)

{يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لا تَفْعَلُونَ كَبُرَ مَقْتاً عِنْدَ اللَّهِ أَنْ تَقُولُوا مَا لا تَفْعَلُونَ} [الصف:٢،٣]

మరొకచోట ఇలా అంటున్నాడు : "విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని చేస్తాము అని చెబుతారెందుకు? మీరు చేయని దానిని చేస్తాము అని చెప్పటం అల్లాహ్ దృష్టిలో అత్యంత అప్రియమైన విషయం." (అస్ సఫ్ : 2,3)

{وَمَا أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَى مَا أَنْهَاكُمْ عَنْهُ} [هود: ٨٨]

ఇంకొకచోట షుఐబ్ – అలైహి – అన్నమాటను ప్రస్తావించాడు: "(షుఐబ్ ఇలా అన్నాడు) ఏ విషయాల నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేనే స్వయంగా చేయటాన్ని నేను సుతరామూ యిష్టపడను." (హూద్ : 88)

English

“Enjoin you Al-Birr (piety and righteousness and every act of obedience to Allah) on the people and you forget (to practise it) yourselves, while you recite the Scripture [the Taurat (Torah)]! Have you then no sense?”. [Al-Baqarah 2:44]

“O you who believe! Why do you say that which you do not do? Most hateful it is with Allah that you say that which you do not do”. [Aṣ-Ṣaff 61:2–3]

“(Shu`aib said:) I wish not, in contradiction to you, to do that which I forbid you.” [Hūd 11:88]

200

హదీసు 200

وعن أَبي زيدٍ أُسامة بْنِ زيد بن حَارثَةَ، رضي اللَّه عنهما، قَالَ: سَمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "يُؤْتَى بالرَّجُلِ يَوْمَ الْقِيامةِ فَيُلْقَى في النَّار، فَتَنْدلِقُ أَقْتَابُ بَطْنِهِ، فيَدُورُ بِهَا كَمَا يَدُورُ الحِمَارُ في الرَّحا، فَيجْتَمِعُ إِلَيْهِ أَهْلُ النَّار فَيَقُولُونَ: يَا فُلانُ مَالَكَ؟ أَلَمْ تَكُن تَأْمُرُ بالمَعْرُوفِ وَتَنْهَى عَنِ المُنْكَرِ؟ فَيَقُولُ: بَلَى، كُنْتُ آمُرُ بالمَعْرُوفِ وَلاَ آتِيه، وَأَنْهَى عَنِ المُنْكَرِ وَآَتِيهِ" مُتَّفَقٌ عَلَيهِ. قولُهُ:"تَنْدلِقُ"هُوَ بالدَّالِ المهملةِ، وَمَعْنَاهُ تَخْرُجُ. وَ"الأَقْتابُ": الأَمْعَاءُ، واحِدُهَا قِتْبٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ జైద్ ఉసామా బిన్ జైద్ బిన్ హారిసా (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: "ప్రళయదినాన ఒక వ్యక్తిని తీసుకొచ్చి అగ్ని (నరకం)లో పడవేయటం జరుగుతుంది. దాంతో అతని పేగులు (కడుపులో నుండి) బయటికి వచ్చి పడతాయి. అతనా ప్రేగుల్ని పట్టుకొని గానుగ గాడిదలా (నరకంలో అటూ ఇటూ) తిరుగుతూ ఉంటాడు. ఇతర నరకవాసులు అతని వద్దకు చేరి, "అయ్యో! మీరేం పాపం చేశారని ఇక్కడున్నారు? మీరైతే మంచి పనులు చేయమని ప్రబోధిస్తూ, చెడు పనులు చేయవద్దని వారిస్తూ ఉండే వారు కదా!" అని అడుగుతారు. దానికి అతను, "నిజమే, నేను మంచిని గురించి ఆజ్ఞాపించిన మాట వాస్తవమే. కాని నేను మాత్రం మంచి పనులు చేసేవాణ్ణి కాదు. ఇతరులను చెడునుండి వారిస్తూ నేను స్వయంగా దానికి పాల్పడేవాణ్ణి" అని చెప్తాడు. (బుఖారీ – ముస్లిం)

'తందలిఖు' అంటే బయటికి వస్తాయి అని అర్థం. 'అఖ్‌తాబ్' అంటే ప్రేగులు. 'ఖిత్‌బున్' ఏకవచనం.

(సహీహ్ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణంలోనూ, సహీహ్ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.)

English

Usamah bin Zaid (May Allah bepleased with them) reported: Messenger of Allah ﷺ said, “A man will be brought on the Day of Resurrection and will be cast into Hell, and his intestines will pour forth and he will go round them as a donkey goes round a millstone. The inmates of Hell will gather round him and say: `What has happened to you, O so-and-so? Were you not enjoining us to do good and forbidding us to do evil?’ He will reply: `I was enjoining you to do good, but was not doing it myself; and I was forbidding you to do evil, but was doing it myself”.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

వేదికలపై నించొని ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఉర్రూతలూగిస్తూ, వ్యక్తిగత జీవితంలో మాత్రం దానికి విరుద్ధమైన పనులుచేసే పండితులకు, సత్య సందేశ ప్రదాతలకూ ఈ హదీసు కనువిప్పు కావాలి. అలాగే ఇతరుల ముందు నీతి సూత్రాలు వల్లిస్తూ తమల్ని తాము మరచిపోయే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పీఠాధిపతులకు, మత, రాజకీయ నాయకులకు కూడా ఈ హదీసులో హెచ్చరిక ఉంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రారంభ ప్రకరణం|24. మంచిని గురించి ఆదేశిస్తూ, చెడునుండి వారిస్తూ తాను మాత్రం దానికి విరుద్ధంగా చేసేవాడికి ఎదురయ్యే కఠిన పర్యవసానం గురించి…..|హదీసు 200