హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 248వ అధ్యాయం: ఉదయం, సాయంత్రం దైవస్మరణ. ఈ అధ్యాయంలో 5 ఖుర్ఆన్ ఆయతులు, 7 హదీసులు (హదీసు 1452 – 1458) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ

↑ విషయ సూచిక

باب الذكر عِنْدَ الصباح والمساء

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَاذْكُرْ رَبَّكَ فِي نَفْسِكَ تَضَرُّعاً وَخِيفَةً وَدُونَ الْجَهْرِ مِنَ الْقَوْلِ بِالْغُدُوِّ وَالآصَالِ وَلا تَكُنْ مِنَ الْغَافِلِينَ} [الأعراف: ٢٠٥]

"ప్రవక్తా! నీ ప్రభువును ఉదయమూ, సాయంత్రమూ స్మరించు, లోలోపల వినయంతోనూ భయపడుతూనూ, మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసే వారిలో నీవు చేరకు." (ఆరాఫ్: 205)

భాషావేత్తల అభిప్రాయం ప్రకారం 'ఆసాల్' అనేది అసీల్‌కు బహువచనం. అస్ర్ మరియు మగ్రిబ్ (నమాజుల) మధ్యకాలం అని దాని భావం.

మరోచోట దేవుడు ఇలా అంటున్నాడు:

{وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا} [طه: ١٣٠]

"నీ ప్రభువు స్తోత్రంతోపాటు, ఆయన పవిత్రతను కొనియాడు, సూర్యుడు ఉదయించే ముందు, అస్తమించే ముందు." (తాహా: 130)

{وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِيِّ وَالأِبْكَارِ} [غافر: ٥٥]

"ఉదయం, సాయంత్రం నీ ప్రభువుని స్తుతిస్తూ ఉండు. ఆయన పరిశుద్ధతను కొనియాడు." (అల్ మూమిన్:55)

భాషావేత్తల అభిప్రాయం ప్రకారం 'అషియ్యి' అంటే సూర్యుడు నెత్తి నుంచి వాలినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు మధ్యకాలం అని అర్థం.

ఇంకొక చోట దేవుడు ఇలా సెలవిచ్చాడు:

{فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَنْ تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالآصَالِ رِجَالٌ لا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلا بَيْعٌ عَنْ ذِكْرِ اللَّهِ} الآية [النور: ٣٦-٣٧]

(దేవుని వెలుగు వైపునకు పోయేమార్గం పొందినవారు) ఏ గృహాలను మహోన్నతం చేయటానికీ, ఏ గృహాలలో తన నామాన్ని స్మరించటానికీ అల్లాహ్ అనుమతించాడో ఆ గృహాలలో ఉంటారు. వ్యాపారంగానీ, క్రయవిక్రయాలు గానీ, అల్లాహ్ సంస్మరణ విషయంలో ఎవరినైతే అశ్రద్ధ వహించేలా చేయవో అలాంటివారు ఉదయం, సాయంత్రం ఆయన స్తోత్రం చేస్తారు. (నూర్: 36)

{إِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهُ يُسَبِّحْنَ بِالْعَشِيِّ وَالأِشْرَاقِ} [ص: ١٨]

"మేము పర్వతాలను అతనికి (దావూద్‌కు) లొంగిపోయేలా చేశాము. ఉదయం, సాయంత్రం అవి అతనితో పాటు కీర్తన చేసేవి." (సాద్: 18)

ముఖ్యాంశాలు

పై సూక్తులన్నీ ఉదయం, సాయంత్రం దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాయి.

English

“And remember your Rubb by your tongue and within yourself, humbly and with fear and without loudness in words in the mornings, and in the afternoons and be not of those who are neglectful.” [Al-A‘rāf 7:205]

“And declare the perfectness of your Rubb before the rising of the sun, and before its setting.” [Ṭā Hā 20:130]

“And declare the perfectness of your Rubb and praise Him in the `Ashi (i.e., the time period after the midnoon till sunset) and in the Ibkar(i.e., the time period from early morning or sunrise till before midnoon).” [Ghāfir 40:55]

“In houses (mosques) which Allah has ordered to be raised (to be cleaned, and to be honoured), in them His Name is mentioned in the mornings and in the afternoons or the evenings. Men whom neither trade nor sale diverts from the remembrance of Allah (with heart and tongue).” [An-Nūr 24:36–37]

“Verily, We made the mountains to declare the Perfectness of Allah with him [Dawud (David)] in the `Ashi (i.e., after the midday till sunset) and Ishraq (i.e., after the sunrise till midday).” [Ṣād 38:18]

1452

హదీసు 1452

وعنْ أَبي هريرة رضي اللَّه عنهُ قَالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ قَالَ حِينَ يُصْبِحُ وحينَ يُمسِي: سُبْحانَ اللَّهِ وبحمدِهِ مِائَةَ مَرةٍ لَم يأْتِ أَحدٌ يوْم القِيامة بأَفضَل مِما جَاءَ بِهِ، إِلاَّ أَحدٌ قَالَ مِثلَ مَا قَالَ أَوْ زَادَ" رواهُ مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయితే ఉదయం మరియు సాయంత్రం వందసార్లు 'సుబ్‌హానల్లాహి వ బిహమ్దిహీ' అని పఠిస్తారో, ప్రళయదినాన (దేవుని సన్నిధికి) వచ్చేవారిలో వారి కంటే గొప్పవారు మరెవరూ ఉండరు. వారిలాగా లేక అంతకంటే ఎక్కువ సార్లు పఠించినవారు తప్ప. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said,

“He who recites in the morning and in the evening the statement: `Subhan-Allahi wa bihamdihi (Allah is free from imperfection and I begin with praising Him)’ one hundred times, will not be surpassed on the Day of Resurrection by anyone with better deeds than one who utters the same words or utters more of these words.”

[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1452

1453

హదీసు 1453

وعَنهُ قَالَ: جاءَ رجُلٌ إِلى النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، فَقَالَ: يَا رسُول اللَّهِ مَا لَقِيتُ مِنْ عَقْربٍ لَدغَتني البارِحةَ، قَالَ: "أَما لَو قُلتَ حِينَ أمْسيت: أعُوذُ بِكَلماتِ اللَّهِ التَّامَّاتِ منْ شَرِّ مَا خَلَقَ لَمْ تَضُرَّك" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన మరొక కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి "దైవప్రవక్తా! నిన్న రాత్రి నాకు తేలు కుట్టటంతో ఎంత నొప్పయిందనుకున్నారూ?" అన్నాడు. ఆ మాట విని ఆయన, 'నువ్వు సాయంత్రంపూట 'అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్' అని పఠించి వుంటే నీకు తేలు కుట్టేది కాదు' అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A man came to the Prophet ﷺ and said, “What a trouble I suffered from a scorpion which stung me last night!” He ﷺ said,

“Had you said in the evening: `A`udhu bikalimatillahit-tammati min sharri ma khalaqa (I seek the protection of Allah’s Perfect Words from the evil of whatever He has created),’ it would not have harmed you.”

[Muslim].

ముఖ్యాంశాలు

కలిమాత్ అంటే దైవవాక్కు, దేవుని నిర్ణయాలు అని అర్థం. తామ్మాత్ అంటే ఎలాంటి లోపాలూ, దోషాలూ లేనివని భావం. స్థూలంగా హదీసులో పేర్కొనబడిన వచనానికి 'సృష్టిరాశుల కీడు నుండి నేను తిరుగులేని దేవుని నిర్ణయాల శరణు వేడుతున్నాను' అని భావం. బాధ కలిగించే జంతువుల నుండి, మానవుల నుండి రక్షణ పొందటానికి ఇది ఎంతో శ్రేష్ఠమైన ప్రార్థన.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1453

1454

హదీసు 1454

وعنْهُ عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّه كَانَ يقولُ إِذَا أَصْبَحَ: "للَّهُمَّ بِكَ أَصْبحْنَا وبِكَ أَمسَيْنَا وبِكَ نَحْيا، وبِكَ نَمُوتُ، وَإِلَيْكَ النُّشُورُ"وإِذا أَمْسى قَالَ:"اللَّهُمَّ بِكَ أَمْسَيْنَا، وبِكَ نَحْيا، وبِك نمُوتُ وإِلَيْكَ النُّشُورُ". رواه أَبو داود والترمذي وقال: حديث حسن.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ తెల్లవార్లు (నిద్ర లేచినప్పుడు) "దేవా! నీ కృపతోనే మేము తెల్లవార్చాము. నీ కృపతోనే సాయంత్రం వరకూ ఉంటాం. నీ శక్తి వల్లనే మేము బ్రతికివున్నాం. నీ శక్తితోనే మరణిస్తాం. తిరిగి లేపబడిన తర్వాత మేమంతా నీ వద్దకే మరలి రావలసి ఉంది" అని ప్రార్థించేవారు. సాయంత్రమయినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు: "ఓ అల్లాహ్! నీ కృపతోనే మేము సాయంత్రం వరకూ ఉన్నాం. నీ శక్తితోనే జీవించి ఉన్నాం. తిరిగి నీ శక్తితోనే మరణిస్తాం. తిరిగి లేపబడిన తరువాత మేమంతా నీ వద్దకే మరలి రావలసి ఉన్నది." (అబూదావూద్, తిర్మిజీ, హసన్)

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ used to say in the morning:

“Allahumma bika asbahna, wa bika amsaina, wa bika nahya, wa bika namutu, wa ilaikan-nushur

(O Allah! With Your Power we have come to the morning, with Your Power we come to the evening, with Your Power we live, and we die, and to You will we return).”

In the evening he would say:

“Allahumma bika amsaina, wa bika nahya, wa bika namutu, wa ilaikan-nushur

(O Allah! With Your Power, we have come to the evening, by You do we live, by You do we die, and to You is the return).”

[At-Tirmidhi and Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1454

1455

హదీసు 1455

عنهُ أَنَّ أَبا بَكرٍ الصِّدِّيقَ، رضيَ اللَّه عنه، قَالَ: يَا رَسُولَ اللَّهِ مُرْنِي بِكَلمَاتٍ أَقُولُهُنَّ إِذَا أَصْبَحْتُ وإِذَا أَمْسَيتُ، قَالَ: قُلْ: "اللَّهُمَّ فَاطِرَ السَّمَواتِ والأرضِ عَالمَ الغَيْب وَالشَّهَادةِ، ربَّ كُلِّ شَيءٍ وَمَلِيكَهُ. أَشْهَدُ أَن لاَ إِله إِلاَّ أَنتَ، أَعُوذُ بكَ منْ شَرِّ نَفسي وشَرِّ الشَّيْطَانِ وَشِرْكهِ" قَالَ: "قُلْها إِذا أَصْبحْتَ، وَإِذا أَمْسَيْتَ، وإِذا أَخذْتَ مَضْجِعَكَ "رواه أَبُو داود والترمذي وقال: حديثٌ حسنٌ صحيحٌ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం ప్రకారం ఒకసారి అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) (దైవప్రవక్త ﷺతో మాట్లాడుతూ), "దైవప్రవక్తా! నేను ఉదయం, సాయంత్రం చేసుకోవటానికి నాకో ప్రార్థన ఉపదేశించండి" అని అడిగారు. అందుకాయన, "ఈ విధంగా ప్రార్థించండి. ఉదయం, సాయంత్రం, ఇంకా నిద్రపోవటానికి పడక మీదకు చేరుకున్నప్పుడు కూడా మీరు ఈ ప్రార్థన చేయవచ్చు" అని అన్నారు.

"ఓ అల్లాహ్! భూమ్యాకాశాల నిర్మాతా! గోచరాగోచరాల జ్ఞానీ! సర్వసృష్టికి యజమాని అయిన ప్రభువా! నీవు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నా మనసులో జనించే కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతను ప్రేరేపించే షిర్క్ నుండి నీ శరణు వేడుకుంటున్నాను."

(అబూదావూద్, తిర్మిజీ, హసన్, సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: Abu Bakr asked, “O Messenger of Allah! Teach me some words so that I may recite them in the morning and in the evening.” The Messenger of Allah ﷺ said,

“Recite these words: `Allahumma fatiras-samawati wal-ardi, `alimal-ghaibi wash-shahadati, Rabba kulli shai’in wa malikahu. Ash-hadu an la ilaha illa Anta, a`udhu bika min sharri nafsi, wa sharrish-Shaitani wa shirkihi

(O Allah! Creator of the heavens and the earth! Knower of the hidden and the exposed! Rubb of everything and every one. I bear witness that none has the right to be worshipped but You. I seek Your Protection from the evil of my own self from the evil of Satan and from the evil of Shirk to which he calls).”’

The Messenger of Allah ﷺ added: “Recite these words in the morning and the evening and when you go to bed.”

[Abu Dawud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1455

1456

హదీసు 1456

وعَن ابْن مَسْعُودٍ رضي اللَّه عنهُ قالَ: كانَ نبيُّ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا أَمسى قَالَ: "أَمْسَيْنَا وأَمْسى المُلكُ للَّهِ، والحمْدُ للَّهِ، لاَ إِلهَ إِلاَّ اللَّه وحْدَهُ لاَ شَريكَ لَه"قالَ الرواي: أَرَاهُ قَالَ فيهِنَّ:"لهُ المُلكُ وَلَه الحمْدُ وهُوَ عَلى كلِّ شَيءٍ قدِيرٌ، ربِّ أَسْأَلُكَ خَيْرَ مَا في هذِهِ اللَّيلَةِ، وَخَيْرَ مَا بَعْدَهَا، وأَعُوذُ بِكَ منْ شَرِّ مَا في هذِهِ اللَّيْلَةِ وشَرِّ مَا بعْدَهَا، ربِّ أَعُوذُ بِكَ مِنَ الكَسَلِ، وَسُوءِ الكِبْرِ، ربِّ أعوذُ بِكَ منْ عذَابٍ في النَّار، وَعَذَابٍ في القَبْرِ"وَإِذَا أَصْبحَ قَالَ ذَلِكَ أَيْضاً:"أَصْبحْنَا وَأَصْبَحَ المُلْك للَّهِ" رواه مسلم.

హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ సాయంత్రం పూట ఈ విధంగా ప్రార్థించేవారు: మేము సాయంత్రం వరకూ (బ్రతికి) ఉన్నాం. ఇప్పుడు కూడా సామ్రాజ్యాధికారం దేవునిదే. స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యదేవుడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు.

(హదీసు ఉల్లేఖకులు ఇలా అంటున్నారు:) తర్వాతి వచనాలను కూడా పై వచనాలతో కలిపి చదవమని దైవప్రవక్త ﷺ ఆజ్ఞాపించినట్టు గుర్తు. "సామ్రాజ్యాధికారం ఆయనదే. స్తోత్రం ఆయనకే చెల్లుతుంది. ఆయన అన్నిటిపై అధికారం కలవాడు. ప్రభూ! నేను నిన్ను ఈ రాత్రిలో వున్న మేలును, దీని తర్వాత వచ్చే మేలును అర్ధిస్తున్నాను. ఇందులోని కీడు నుండి, దీని తర్వాత వచ్చేదాని కీడు నుండి నీ శరణు వేడుతున్నాను. ప్రభూ! సోమరితనం నుండి, వృద్ధాప్య బాధల నుండి నీ శరణు వేడుతున్నాను. ఇంకా నరకాగ్నిలో ఉండే శిక్ష నుండి, సమాధిలో ఉండే శిక్ష నుండి నీ శరణు వేడుతున్నాను."

సాయంత్రం పూట కూడా ఆయన ఇలాగే ప్రార్థించేవారు. (అయితే ఉదయపు ప్రార్థనలో 'అమ్సైనా' అనే చోట) 'అస్బహ్‌నా వ అస్బహల్ ముల్కు లిల్లాహ్' (మేము తెల్లవార్చాం. ఇప్పటికీ సామ్రాజ్యాధికారం అల్లాహ్‌దే) అని పఠించేవారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)

English

`Abdullah bin Mas`ud (radiyallahu anhu) reported: When it was evening, the Prophet ﷺ used to supplicate:

“Amsaina wa amsal-mulku lillah, wal-hamdu lillah. La `ilaha illallahu wahdahu la sharika lahu

(We have entered upon evening and the whole kingdom of Allah, too, has entered upon evening. Praise is due to Allah. There is none who has the right to be worshiped but Allah, the One who has no partner with Him).”

He (the narrator) said: I think that he ﷺ used to follow the recitation with these words:

“Lahul-mulku, wa lahul-hamdu, wa Huwa `ala kulli shi’in Qadir. Rabbi as’aluka khaira ma fi hadhihil-lailati, wa khaira ma ba`daha; wa a`udhu bika min sharri ma fi hadhihil-lailati, wa sharri ma ba`daha; Rabbi a`udhu bika minal-kasali, wa su‘il-kibari; Rabbi a`udhu bika min `adhabin fin-nari, wa `adhabin fil-qabri

(His is the sovereignty and to Him is all praise due, and He is Omnipotent. My Rubb, I beg of you good that lies in this night and good that follows it, and I seek refuge in You from the evil that lies in this night and from the evil of that which follows it. My Rubb! I seek refuge in You from lethargy and the misery of old age. O Allah! I seek Your Protection from the torment of Hell-fire and the punishment of the grave).”

When it was morning, he ﷺ would recite the same, replacing the words:

“We have entered upon evening and the whole kingdom of Allah, too, has entered upon evening” with “We have entered upon morning and the whole kingdom of Allah entered upon morning.”

(Replace the words “Amsaina, amsa, hadhihil-lailati, ma ba`daha with Asbahna, asbaha, hadhal-yaumi, ma ba`dahu, respectively.)

[Muslim].

ముఖ్యాంశాలు

ఈ వచనాలను ఉదయం, సాయంత్రం, పడుకునేటప్పుడు, తిరిగి నిద్రలేచేటప్పుడు పఠిస్తూ ఉండటం అభిలషణీయం. దానివల్ల అల్లాహ్ మాత్రమే ప్రభువు, ఆరాధ్య దేవుడన్న సంగతి నిత్యం గుర్తుంటుంది. అంతేగాకుండా దేవుని నుండి శ్రేయోశుభాలనూ, ఇహపరాల్లో తమకు నష్టం కలిగించే వాటి నుండి ఆయన శరణునూ వేడుకున్నట్లవుతుంది. ఒక మనిషికి నిత్యం వాటి అవసరం ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1456

1457

హదీసు 1457

عنْ عبدِ اللَّهِ بنِ خُبَيْب بضَمِّ الْخَاءِ المُعْجَمَةِ رضي اللَّه عَنْهُ قَالَ: قَالَ لي رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"اقْرأْ: {قُلْ هُوَ اللَّهُ أَحَدٌ} والمعوِّذَتَيْن حِينَ تُمْسِي وَحِينَ تُصبِحُ، ثَلاثَ مَرَّاتٍ تَكْفِيكَ مِنْ كلِّ شَيْءٍ ". رواهُ أَبو داود والترمذي وقال: حديثٌ حسن صحيح.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఖుబైబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నాకు "ఉదయం, సాయంత్రం మూడేసిసార్లు 'ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్, ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్' సూరాలు పఠించు. ప్రతి వస్తువు కీడు నుండి కాపాడుకోవటానికి వాటిని పఠిస్తే చాలు" అని ఉపదేశించారు. (అబూదావూద్, తిర్మిజీ-హసన్, సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

`Abdullah bin Khubaib (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to me, “Recite Surat Al-Ikhlas and Al-Mu`awwidhatain (Surat Al-Falaq and Surat An-Nas) three times at dawn and dusk. It will suffice you in all respects.”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ఈ మూడు సూరాలనూ పూర్తిగా పఠించాలని భావం. ప్రతి సూరాను మూడేసి సార్లు పఠించాలి. వీటిని పఠిస్తే ఇతర దుఆలు పఠించకపోయినా ఫర్వాలేదు. వీటి పఠనం మూలంగా దేవుడు మానవుల్ని బాధాకరమైన జంతువుల బారి నుండి రక్షిస్తాడు. దైవప్రవక్త ﷺ రాత్రిపూట పడకమీద వాలిన తర్వాత ఈ సూరాలు పఠించుకొని చేతుల మీద ఊది, ఆ చేతులతో వీలైనంత వరకు మొత్తం శరీరాన్ని స్పృశించుకునేవారని ఇతర హదీసుల ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1457

1458

హదీసు 1458

وعنْ عُثْمَانَ بْنِ عَفَانَ رضيَ اللَّه عنهُ قالَ: قالَ رَسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَا مِنْ عَبْدٍ يَقُولُ في صَبَاحِ كلِّ يَوْمٍ ومَسَاءٍ كلِّ لَيْلَةٍ: بِسْمِ اللَّهِ الَّذِي لاَ يَضُرُّ مَع اسْمِهِ شَيْءٌ في الأرضِ وَلاَ في السماءِ وَهُوَ السَّمِيعُ الْعلِيمُ، ثلاثَ مَرَّاتٍ، إِلاَّ لَمْ يَضُرَّهُ شَيءٌ" رواه أَبُو داود، والتِّرمذي وَقالَ: حديث حسن صحيح.

హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ప్రతి రోజూ ఉదయంపూట, ప్రతి రాత్రికి ముందు సాయంత్రం పూట మూడు సార్లు 'బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు మఅ ఇస్మిహీ షైవున్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాయి వహువస్సమీవుల్ అలీమ్' అని పఠించేవారికి ఏ వస్తువూ నష్టం కలిగించజాలదు. (అబూదావూద్, తిర్మిజీ- హసన్, సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం – సుననె తిర్మిజీలోని దావాత్ అధ్యాయాలు)

English

`Uthman bin `Affan (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who recites three times every morning and evening:

Bismillahil-ladhi la yadurru ma`as-mihi shai’un fil-ardi wa la fis-sama’i, wa Huwas-Sami`ul-`Alim (In the Name of Allah with Whose Name there is protection against every kind of harm in the earth or in the heaven, and He is the All-Hearing and All-Knowing),’

nothing will harm him.”[Abu Dawud and At-Tirmidhi].

Source: Dar-us-salam English Publication of Riyad-us-Saliheen

Related Links:

Dhikr (Remembrance of Allaah)

Du’a (Supplication to Allaah)

ముఖ్యాంశాలు

హదీసులో పేర్కొనబడిన ప్రార్థనా వచనాలకు భావం ఇది: 'నేను ప్రతి వస్తువు కీడు నుండి దైవనామ శరణు వేడుతున్నాను. ఆయనకు ప్రతి వస్తువు గురించీ తెలుసు. ప్రతి ఒక్కరి విన్నపాలను ఆలకించేవాడూ ఆయనే. తాను స్వయంగా నష్టం కలిగించదలిస్తే తప్ప ఆయన రక్షణలో ఉన్నవారికి ఎవరూ నష్టం కలిగించలేరు. కనుక అన్నిరకాల కీడుల నుండి – అవి మనుషులు, జంతువుల నుండి కలిగేవయినా లేక జిన్నులు షైతానుల నుండి కలిగేవయినా- వాటన్నిటి నుండి ఆ మహిమాన్వితుని పేరు తీసుకునే శరణు వేడటం జరుగుతుంది.

ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన ప్రార్థనల్ని ప్రతి ముస్లిం ఉదయం సాయంత్రం ఆనవాయితీగా పఠిస్తూ ఉండాలి. మనుషులు తమకు తాముగా కల్పించుకునే ప్రార్థనలు, దైవస్మరణరీతుల కన్నా ఇవి ఎంతో మెరుగయినవి, శుభవంతమైనవి, మోక్షదాయకమైనవి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|248. ఉదయం, సాయంత్రం దైవస్మరణ|హదీసు 1458