హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 247వ అధ్యాయం: దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంఛనీయం. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 1448 – 1451) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
247. దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంఛనీయం
باب فضل حِلَقِ الذِّكْر والنَّدب إِلَى ملازمتها والنهَّي عن مفارقتها لغير عذر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِينَ يَدْعُونَ رَبَّهُمْ بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ وَلا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ} [الكهف: ٢٨]
"తమ ప్రభువు ప్రసన్నతను అర్ధిస్తూ ఉదయం, సాయంత్రం ఆయనను వేడుకుంటూ ఉండే వారి సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్తి పరచుకో. వారి నుండి నీ దృష్టిని ఏమాత్రం మరల్చకు." (కహఫ్:28)
ముఖ్యాంశాలు
ప్రభువు ప్రసన్నతను ఆశించేవారిని నిర్లక్ష్యం చేసి ప్రభువు ధ్యానం విషయంలో ఏమరుపాటుకు లోనయినవారి వైపు దృష్టి మళ్ళించకు, వారు ఎంత స్థితిపరులైనా సరే; అని పై దైవసూక్తికి భావం.
English
“And keep yourself (O Muhammad ﷺ) patiently with those who call on their Rubb (i.e., your companions who remember their Rubb with glorification, praising in prayers, and other righteous deeds) morning and afternoon, seeking His Face; and let not your eyes overlook them.” [Al-Kahf 18:28]
హదీసు 1448
وعنْ أَبي هُريرةَ رضي اللَّه عنهُ قَالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِنَّ للَّهِ تَعالى ملائِكَةً يَطُوفُونَ في الطُّرُق يَلْتَمِسُونَ أَهْلَ الذِّكْرِ، فإِذا وَجدُوا قَوْماً يذكُرُونَ اللَّه عَزَّ وَجلَّ، تَنَادَوْا: هَلُمُّوا إِلى حاجتِكُمْ، فَيَحُفُّونَهم بِأَجْنِحَتِهم إِلى السَّمَاء الدُّنْيَا، فَيَسأَلهُم رَبُّهُم – وَهُوَ أَعْلم-: مَا يقولُ عِبَادِي؟ قَالَ: يَقُولُونَ: يُسبِّحُونَكَ وَيُكَبِّرونَكَ، ويحْمَدُونَكَ، ويُمَجِّدُونَكَ، فيقولُ: هَلْ رأَوْني؟ فيقولونَ: لا واللَّهِ مَا رأَوْكَ، فَيَقُولُ: كَيْفَ لَوْ رَأَوْني؟، قَالَ: يقُولُون لَوْ رَأَوْكَ كانُوا أَشَدَّ لكَ عِبادَةً، وأَشَدَّ لكَ تمْجِيداً، وأَكثرَ لكَ تَسْبِيحاً. فَيَقُولُ: فماذا يَسأَلُونَ؟ قَالَ: يَقُولونَ: يسأَلُونَكَ الجنَّةَ. قالَ: يقولُ: وَهل رَأَوْهَا؟ قالَ: يَقُولُونَ: لا وَاللَّه ياربِّ مَا رأَوْهَا. قَالَ: يَقُولُ: فَكَيْفَ لَوْ رَأَوْهَا؟، قَالَ: يَقُولُونَ: لَوْ أَنَّهُم رأَوْها كَانُوا أَشَدَّ علَيْهَا حِرْصاً، وَأَشَدَّ لهَا طَلَباً، وَأَعْظَم فِيها رغْبة. قَالَ: فَمِمَّ يَتَعَوَّذُونَ؟ قَالَ: يَتعَوَّذُونَ مِنَ النَّارِ، قَالَ: فَيقُولُ: وهَل رَأَوْهَا؟ قالَ: يقولونَ: لا واللَّهِ مَا رأَوْهَا. فَيقُولُ: كَيْف لَوْ رَأوْها؟، قَالَ: يقُولُون: لَوْ رَأَوْهَا كانوا أَشَدَّ مِنْهَا فِراراً، وأَشَدَّ لَهَا مَخَافَة. قَالَ: فيقُولُ: فَأُشْهدُكم أَنِّي قَد غَفَرْتُ لَهُم، قَالَ: يقُولُ مَلَكٌ مِنَ الملائِكَةِ: فِيهم فُلانٌ لَيْس مِنهم، إِنَّمَا جاءَ لِحاجَةٍ، قَالَ: هُمُ الجُلَسَاءُ لا يَشْقَى بِهم جلِيسهُم "متفقٌ عَلَيْهِ. وفي روايةٍ لمسلِمٍ عنْ أَبي هُريرةَ رضِي اللَّه عنْهُ عَنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قال: "إِنَّ للَّهِ مَلائِكَةً سَيَّارةً فُضًلاءَ يتَتَبَّعُونَ مجالِس الذِّكرِ، فَإِذا وجدُوا مَجلِساً فِيهِ ذِكْرٌ، قَعدُوا معهُم، وحفَّ بعْضُهُم بعْضاً بِأَجْنِحَتِهِم حتَّى يَمْلؤوا مَا بيْنَهُمْ وَبَيْنَ السَّماءِ الدُّنْيَا، فَإِذا تَفَرَّقُوا عَرجُوا وصعِدوا إِلى السَّماءِ، فَيسْأَلهُمُ اللَّهُ عَزَّ وجلَّ- وهُوَ أَعْلَمُ -: مِنْ أَيْنَ جِئْتُمْ؟ فَيَقُولُون: جِئْنَا مِنْ عِندِ عِبادٍ لَكَ في الأَرْضِ: يُسبحُونَكَ، ويُكَبِّرُونَكَ، وَيُهَلِّلُونَكَ، وَيحْمَدُونَكَ، وَيَسْأَلُونَكَ. قَالَ: وَمَاذا يسْأَلُوني؟ قَالُوا: يَسْأَلُونَكَ جنَّتَكَ. قَالَ: وهَلْ رَأَوْا جنَّتي؟ قالُوا: لا، أَيْ ربِّ: قَالَ: فكَيْفَ لَوْ رأَوْا جنَّتي؟ قالُوا: ويسْتَجِيرُونَكَ قال: ومِمَّ يسْتَجِيرُوني؟ قالوا: منْ نَارِكَ ياربِّ. قَالَ: وَهَلْ رَأَوْا نَارِي؟ قالوا: لا، قَالَ: فَكَيْفَ لَوْ رَأَوْا نَارِي؟، قالُوا: ويسْتَغْفِرونَكَ، فيقولُ: قَدْ غفَرْتُ لهُمْ، وأَعطَيْتُهُمْ مَا سَأَلُوا، وأَجرْتُهم مِمَّا اسْتَجارُوا. قال: فَيقُولونَ: ربِّ فيهمْ فُلانٌ عبْدٌ خَطَّاءٌ إِنَّمَا مَرَّ، فَجلَس معهُمْ، فيقُولُ: ولهُ غفَرْتُ، هُمْ القَوْمُ لاَ يَشْقَى بِهِمْ جَلِيسُهُمْ".
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది దైవదూతలు దైవస్మరణ చేసేవారిని వెతుక్కుంటూ దారుల్లో తిరుగుతూ ఉంటారు. ఎక్కడయినా ఎవరయినా దేవుణ్ణి స్మరిస్తూ వారికి కనిపిస్తే వారు తోటి దూతల్ని పిలుస్తూ, "ఇలా రండి. మీరు వెతుకుతున్న వారు ఇక్కడున్నారు" అని అంటారు. అంతేకాదు, మొదటి ఆకాశం వరకు వారిని తమ రెక్కలతో కప్పివేస్తారు. (ఆ తర్వాత వారు అక్కణ్ణుంచి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు) దేవుడు వారిని 'నా దాసులు ఏమంటున్నారు?' అని అడుగుతాడు. వాస్తవానికి వారేమంటున్నారో దేవునికి బాగా తెలుసు. దానికి సమాధానంగా దైవదూతలు, 'వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు. నీ గొప్పదనాన్ని చాటుతున్నారు. నిన్ను స్తుతిస్తున్నారు. నీ ఔన్నత్యాన్ని పొగుడుతున్నారు" అని చెబుతారు. "వారు నన్ను చూశారా?" అని అడుగుతాడు దేవుడు. దానికి దూతలు, "దైవం సాక్షి! వారు నిన్ను చూడలేదు" అని చెబుతారు. ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడెలా ఉంటుంది వారి పరిస్థితి? అని అడుగుతాడు దేవుడు. 'వారు గనక నిన్ను చూస్తే మరింత ఎక్కువగా నిన్ను ఆరాధిస్తారు. నీ ఔన్నత్యాన్ని పొగుడుతారు. నీ పరిశుద్ధతను కొనియాడుతారు' అంటారు దూతలు. దేవుడు (మళ్ళీ) 'వారికి ఏం కావాలట?' అని అడుగుతాడు. 'నువ్వు వారికి స్వర్గం ప్రసాదించాలట' అని చెబుతారు దూతలు. 'వారు స్వర్గాన్ని చూశారా?' అని అడిగితే 'దైవం సాక్షి! వారు చూడలేదు' అని చెబుతారు దూతలు. అప్పుడు దేవుడు మళ్ళీ అడుగుతాడు, 'వారు గనక స్వర్గాన్ని చూస్తే అప్పుడెలా ఉంటుంది. వారి పరిస్థితి?' అని. "(దేవా!) ఒకవేళ వీరు గనక స్వర్గాన్ని చూస్తే, దాన్ని పొందాలనే ఆశ, కోరిక శ్రద్ధాసక్తులు వీరిలో మరింత పెరిగిపోతాయి' అని చెబుతారు దూతలు. "సరే, వారు దేని నుంచి శరణు వేడుకుంటున్నారు?" అని అడుగుతాడు. "వారు నరకాగ్ని నుండి శరణు వేడుకుంటున్నారు" అని చెబుతారు దూతలు. 'అసలు వారు ఆ నరకాన్ని చూశారా?' అని అడుగుతాడు దేవుడు మళ్ళీ. 'లేదు, దైవం సాక్షి! వారు దాన్ని చూడలేదు' అని చెబుతారు దూతలు. 'ఒకవేళ చూస్తే అప్పుడెలా ఉంటుంది?' అని అడిగితే, దూతలు 'వారు గనక దాన్ని చూస్తే దాని నుండి ఇంకా పారిపోతారు. దానికి ఇంకా భయపడతారు' అని చెబుతారు. అప్పుడు దేవుడు, 'నేను వారిని క్షమిస్తున్నాను. ఇందుకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెడుతున్నాను' అంటాడు. దానికి దూతల్లో ఒకడు సందేహపడుతూ, "(దేవా!) వారిలో ఒకతను ఏదో పనిమీద వచ్చి (కూర్చున్నాడు). నిజానికి అతను (ముందు నుంచి) వారితో పాటు లేడు" అని చెబుతాడు. ఆ మాట విని దేవుడు ఇలా ప్రకటిస్తాడు: దేవుణ్ణి స్మరిస్తూ కూర్చున్నవారు ఎలాంటివారంటే వారివెంట కూర్చునే వారు కూడా (ఆ శుభాలను) పొందకుండా ఉండరు. (బుఖారీ-ముస్లిం)
ముస్లిం గ్రంథంలో హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారిచే ఉల్లేఖించబడిన వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: రక్షణ కోసం నియమించబడిన దైవదూతలు కాకుండా మరికొందరు దూతలు ఉన్నారు. వారు దైవస్మరణ సదస్సుల కోసం తిరుగుతూ ఉంటారు. ఎక్కడయినా (జనులు) దైవస్మరణలో నిమగ్నమై ఉన్న సమావేశం కనిపిస్తే వీరు కూడా వారితోపాటు కూర్చుంటారు. ఒకరి రెక్కల్ని మరొకరితో కలుపుకొని (మొత్తం సమావేశాన్ని) చుట్టూర కప్పుకుంటారు. ఆ విధంగా మొదటి ఆకాశం వరకు మధ్యలోవున్న స్థలం వారితోనే నిండిపోతుంది. ప్రజలు అక్కణ్ణుంచి శెలవు తీసుకున్న తర్వాత దూతలు ఆకాశం వైపు ఎక్కిపోతారు. అప్పుడు దేవుడు వారిని అడుగుతాడు: 'మీరు ఎక్కణ్ణుంచి వస్తున్నారు?' అని. వాస్తవానికి వారు ఎక్కణ్ణుంచి వస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. ఆ ప్రశ్నకు దూతలు 'మేము భువిలో వున్న నీ దాసుల దగ్గర్నుండి వస్తున్నాం. వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు. నీ గొప్పదనాన్ని చాటుతున్నారు. నీ ఏకత్వాన్ని కీర్తిస్తున్నారు. నిన్ను స్తుతిస్తున్నారు. నిన్ను అర్థిస్తున్నారు' అని చెబుతారు. 'వారు నన్ను ఏం అర్థిస్తున్నారు?' అని అడుగుతాడు దేవుడు. 'వారు నిన్ను నీ దగ్గరున్న స్వర్గం ఇవ్వమని అడుగు తున్నారు' అని చెబుతారు దూతలు. 'వారు నా స్వర్గం చూశారా?' అని దేవుడు ప్రశ్నిస్తాడు. 'లేదు, ప్రభూ! వారు చూడలేదు' అని దూతలు జవాబు చెబుతారు. 'ఒకవేళ వారు దాన్ని చూస్తే ఏమనుకుంటారు?' అని అడుగుతాడు దేవుడు.
(తర్వాత) దూతలు, 'వారు నీ శరణు వేడుతున్నారు' అని చెబుతారు. దానికి దేవుడు 'దేన్నుండి నా శరణు వేడుతున్నారు' అని అడుగుతాడు. దానికి దూతలు సమాధానమిస్తూ, 'నీ అగ్ని నుండి' అని చెబుతారు. 'వారు నా అగ్నిని చూశారా?' అని అడుగు తాడు దేవుడు. 'లేదు, చూడలేదు' అని జవాబు చెబుతారు దూతలు. దేవుడు మళ్ళీ, 'ఒకవేళ వారు నా అగ్నిని చూస్తే ఏమనుకుంటారు?' అని అడుగుతాడు.
(తర్వాత) దూతలు, 'వారు నీ మన్నింపుని కోరుతున్నారు' అని అంటారు. అప్పుడు దేవుడు ఇలా ప్రకటిస్తాడు: "నేను వారిని మన్నించాను. వారు అడిగినది ఇచ్చేశాను. వారు దేన్నుండి శరణు కోరుకుంటున్నారో ఆ శరణు ఇచ్చేశాను."
అది విని దూతలు, 'ప్రభూ! వారిలో ఒక పాపాత్ముడు కూడా ఉన్నాడు. నిజానికి అతను అట్నుంచి వెళ్తూవెళ్తూ అక్కడ కూర్చున్నవాడే గాని (అతను ముందు నుంచి వారివెంట లేడు) అని చెబుతారు. దానికి దేవుడు, 'నేను అతన్ని కూడా క్షమించాను. అక్కడ కూర్చున్నవారు ఎలాంటి వారంటే వారి వెంట కూర్చున్నవారు కూడా (ఆ శుభాలు) పొందకుండా ఉండరు' అని అంటాడు.
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah, the Exalted, has teams of angels who go about on the roads seeking those who remember Allah. When they find some people remembering Allah they call to one another and say, `Come to what you are looking for;’ and they surround them with their wings till the space between them and the lowest sky is fully covered. Allah, the Exalted and Glorious, asks them (although He is best informed about every thing): `What are my slave saying?’ They say: `They are glorifying Your Tasbih, Tahmid, Takbir, Tamjid, (i.e., they were declaring Your Perfectness, praising, remembering the Greatness and Majesty of Allah).’ He asks: `Have they seen Me?’ They reply, `No, indeed, they have not seen You.’ He asks: `How would they act if they were to see Me?’ Thereupon they reply: `If they were to see You, they would engage more earnestly in worshipping and glorifying You and would extol You more.’ He would say: `What do they beg of Me?’ They say, `They beg You for Your Jannah.’ Allah says, `Have they seen My Jannah?’ They say, `No, our Rubb.’ He says: `How would they act if they were to see My Jannah?’ They reply, `Were they to see it, they would more intensely eager for it.’ They (the angels) say, `They seek Your Protection.’ He asks, `Against what do they seek My Protection?’ They (the angels) say, `Our Rubb, from the fire of Hell.’ (He, the Rubb) says, `Have they seen the fire of Hell?’ They say, `No. By Your Honour, they have not seen it.’ He says: `How would they act if they were to see My Fire?’ They say: `If they were to see it, they would more earnest in being away from it and fearing it. They beg of Your forgiveness.’ He says: `I call you to witness that I hereby grant pardon to them and confer upon them what they ask for; and grant them protection against what they seek protection from.’ One of the angels says: `Our Rubb, there is amongst them such and such slave who does not belong to the assembly of those who are participating in Your remembrance. He passed by them and sat down with them.’ He says: `I also grant him pardon because they are the people by virtue of whom their associates will not be unfortunate‘.”[Al-Bukhari and Muslim].
(The narration in Muslim is also the same with minor changes in wordings).
ముఖ్యాంశాలు
దైవస్మరణ జరిగే సదస్సులు, సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవని ఈ హదీసులో చెప్పబడింది. అయితే అసలు ఆ సదస్సులు, సమావేశాల రూపురేఖలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తవచ్చు. అవి హదీసుల్లో వివరించబడని, ప్రజలు తమంత తాము ఓ ప్రత్యేక పంథాలో జరుపుకునే సమావేశాలు మాత్రం కావని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఉదాహరణకు కొందరు 'అల్లాహు హువ' అనో, లేక 'హువ హఖ్ఖున్' అనో పఠిస్తూ కూర్చుంటారు. హదీసుల్లో ఇలా చేయాలని ఎక్కడా లేదు. మరికొందరు దీపాలు ఆర్పేసి పూనకం వచ్చినవారిలాగా ఏదో ఒక వచనం పఠిస్తూ ఊగిపోతూ ఉంటారు. దైవప్రవక్త ﷺ జీవితంలోగాని ఆ తర్వాత ఆయన సహచరుల విధానంలోగాని వీటికి ఎలాంటి ఆధారాలూ కన్పించవు. నిజమైన దైవస్మరణ సమావేశాలు ఏవంటే- వాటిలో స్వయం కల్పిత విధానాలుండవు. ఎవరో కొందరు తయారు చేసుకున్న వచనాలు పఠించబడవు. పైగా 'సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్' అనే వాక్యాలను సాధారణ రీతిలో పఠించాలి. ఉదా: నమాజ్ తర్వాత వెంటనే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అని పఠించటం, జుమానాడు మస్జిద్లో ఉన్నవారు దేవుణ్ణి స్మరిస్తూ ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉండాలి. లేదా ధర్మ బోధనల్లో, ధార్మిక చర్చల్లో నిమగ్నులై ఉండాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|247. దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంఛనీయం|హదీసు 1448
హదీసు 1449
وعنهُ عنْ أَبي سعيدٍ رضِي اللَّه عنْهُمَا قالا: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لا يَقْعُدُ قَوْمٌ يذْكُرُونَ اللَّهَ إِلاَّ حفَّتْهُمُ الملائِكة، وغشِيتهُمُ الرَّحْمةُ ونَزَلَتْ علَيْهِمْ السَّكِينَة، وذكَرَهُم اللَّه فِيمن عِنْدَهُ" رواه مسلم.
హజ్రత్ అబూసయీద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరైనా దేవుణ్ణి స్మరిస్తూ కూర్చుంటే దైవదూతలు వారిని చుట్టుముడుతారు. వారిమీద కారుణ్యం కమ్ముకుంటుంది. శాంతి (అనగా విశేషమైన దైవసహాయం) అవతరిస్తుంది. దేవుడు తన దగ్గరున్న వారి సమక్షంలో వీరిని జ్ఞాపకం చేసుకుంటాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
448. Abu Hurairah and Abu Sa`id Al-Khudri (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “When a group of people assemble for the remembrance of Allah, the angels surround them (with their wings), (Allah’s) mercy envelops them, Sakinah, or tranquillity descends upon them and Allah makes a mention of them before those who are near Him.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|247. దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంఛనీయం|హదీసు 1449
హదీసు 1450
وعن أَبي واقِدٍ الحارِثِ بن عَوْفٍ رضيَ اللَّه عنْهُ أَنَّ رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم بيْنَما هُو جَالِسٌ في المسْجِدِ، والنَّاسُ معهُ، إِذ أَقْبلَ ثَلاثَةُ نَفَرٍ، فأَقْبَل اثْنَانِ إِلى رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وذَهَب واحدٌ، فَوقَفَا عَلَى رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. فَأَمَّا أَحدُهُما فرأَى فُرْجَةً في الحلْقَةِ، فجَلَسَ فِيهَا وأَمَّا الآخَرُ، فَجَلَس خَلْفَهُمْ، وأَمَّا الثالثُ فَأَدبر ذاهِباً. فَلمَّا فَرَغَ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَلا أُخبِرُكم عَنِ النَّفَرِ الثَّلاثَةِ، أَمَّا أَحدُهم، فَأَوى إِلى اللَّهِ فآواه اللَّه وأَمَّا الآخرُ فَاسْتَحْيي فَاسْتَحْيَى اللَّهُ مِنْهُ وَأَمَّا الآخرُ، فأَعْرضَ، فأَعْرض اللَّهُ عنْهُ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ వాఖిద్ హారిస్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒక రోజు దైవప్రవక్త ﷺ మస్జిద్లో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఆయన దగ్గర జనం కూడా ఉన్నారు. అంతలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో ఇద్దరు దైవప్రవక్త ﷺ వైపు వచ్చారు. మిగిలిన ఒకడు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి నించున్నారు. వారిలో ఒకడికి ఆ సమావేశంలో ఖాళీ కనిపిస్తే అక్కడ కూర్చున్నాడు. రెండో వ్యక్తి అందరి కన్నా వెనుక కూర్చున్నాడు. మూడో వ్యక్తి తిరిగి వెళ్ళిపోయాడు. సమావేశం ముగిసిన తర్వాత దైవప్రవక్త ﷺ తన సహచరుల్ని ఉద్దేశ్యించి, "ఈ ముగ్గురి గురించి చెప్పమంటారా? వీరిలో ఒకడు దేవుని శరణుకోసం వెతికాడు. దేవుడు అతనికి శరణు ఇచ్చాడు. రెండోవాడు బిడియపడ్డాడు, దానికి దేవుడు కూడా బిడియంగానే వ్యవహరించాడు. మూడోవాడు వైముఖ్య ధోరణికి పాల్పడ్డాడు. దాంతో దేవుడు కూడా విముఖత వహించాడు" అని వివరించారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని విద్యా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని సలాం ప్రకరణం)
English
Abu Waqid Al-Harith bin `Auf (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ was sitting in the mosque with his Companions when three people came to him. Two of them stepped forward to the Messenger of Allah ﷺ and the third went away. Those two men stood by the side of Messenger of Allah ﷺ. One of them found a space in the circle and he filled it, while the other one sat behind him. When the Messenger of Allah ﷺ finished, he said, “Shall I not inform you about these three people? One of them sought refuge with Allah and Allah gave him refuge; the second one felt shy and Allah showed kindness to his shyness (and so he was accommodated in that meeting), and the last one averted, and so Allah turned away His Attention from him.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దైవధ్యాన సమావేశాల్లో పాల్గొనటం వల్ల కలిగే శుభం ఈ హదీసుల్లో చెప్పబడింది. జనులను ఇబ్బంది పెట్టకుండా సర్దుబాటు చేసు కోవటంలోని శుభం కూడా వివరించబడింది. అకారణంగా ఇలాంటి ధార్మిక సమావేశాల పట్ల విముఖత చూపేవారి చర్య ఖండించబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|247. దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంఛనీయం|హదీసు 1450
హదీసు 1451
وعن أَبي سعيد الخُدْريِّ رضي اللَّه عنْهُ قَالَ: خَرج معاوِيَة رضي اللَّه عَنْهُ علَى حَلْقَةٍ في المسْجِدِ، فَقَالَ: مَا أَجْلَسكُمْ؟ قالُوا: جلَسْنَا نَذْكُرُ اللَّه. قَالَ: آللَّهِ مَا أَجْلَسكُم إِلاَّ ذَاكَ؟ قالوا: مَا أَجْلَسنَا إِلاَّ ذَاكَ، قَالَ: أَما إِنِّي لَمْ أَسْتَحْلِفْكُم تُهْمةً لَكُم وَمَا كانَ أَحدٌ بمنْزِلَتي مِنْ رسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أقلَّ عنْهُ حَدِيثاً مِنِّي: إِنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خرَج علَى حَلْقَةٍ مِن أَصحابِه فَقَالَ:"مَا أَجْلَسكُمْ؟ "قالوا: جلَسْنَا نَذكُرُ اللَّه، ونحْمدُهُ علَى ماهَدَانَا لِلإِسْلامِ، ومنَّ بِهِ عليْنا. قَال:"آللَّهِ مَا أَجْلَسكُمْ إِلاَّ ذَاكَ؟ قالوا: واللَّه مَا أَجْلَسنا إِلاَّ ذَاكَ. قالَ:"أَما إِنِّي لَمْ أَسْتَحْلِفْكُمْ تُهمةً لكُمْ، ولِكنَّهُ أَتانِي جبرِيلُ فَأَخْبرني أَنَّ اللَّه يُباهِي بِكُمُ الملائكَةَ "رواهُ مسلمٌ.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: (ఒకరోజు) ముఆవియా (రదియల్లాహు అన్హు) మస్జిద్కు వెళ్ళారు. అక్కడ కొంతమంది సమావేశమై ఉండటం చూసి, "ఏంటి విశేషం, ఇలా సమావేశమయ్యారు?" అని అడిగారు. "దైవస్మరణ కోసం సమావేశమయ్యాం" అని చెప్పారు వాళ్ళు. "దైవంసాక్షిగా చెప్పండి. మీరు సమావేశమయింది అందు కోసమేనా?" అని అడిగారాయన. అందుకు వారు "(ఔను). దాని కోసమే మేము సమావేశమయింది" అని చెప్పారు. అప్పుడు ముఆవియా ఇలా అన్నారు: నేను మీ చేత ఒట్టు వేయించానంటే, అది మీరు అబద్ధం చెబుతున్నారన్న అనుమానంతో కాదు. దైవప్రవక్త ﷺకు నాకంటే ఎక్కువ సన్నిహితంగా ఉండి, నాకన్నా తక్కువ హదీసులు వివరించిన వారు ఎవరూ లేరు. (వినండి) ఒకసారి దైవప్రవక్త (సల్లం కూడా) తన సహచరులు కొంతమంది ఇలాగే సమావేశమై ఉంటే వారిదగ్గరకు వచ్చి, "ఏంటి విశేషం, ఇలా సమావేశమయ్యారు?" అని అడిగారు. దానికి సహచరులు, "దేవుణ్ణి స్మరించటానికి, ఆయన మాకు ఇస్లాం మార్గం చూపి మాకు మహోపకారం చేసినందుకు మేమాయన్ని స్తుతిస్తున్నాం" అని సమాధానమిచ్చారు. దైవప్రవక్త ﷺ "దైవం సాక్షిగా చెప్పండి. అందు కోసమేనా మీరు సమావేశమయింది?" అని మళ్ళీ అడిగారు. దానికివారు "దైవం సాక్షి! అందుకోసమే సమావేశమయ్యాం" అని చెప్పారు.
అప్పుడాయన ఇలా అన్నారు: నేను మీ చేత ఒట్టు వేయించుకున్నానంటే, మీరు అబద్ధం చెబుతున్నారన్న అనుమానంతో కాదు, జిబ్రయీల్ వచ్చి నాతో చెప్పారు. దేవుడు మీ గురించి తన దూతలముందు గొప్పగా చెప్పుకుంటున్నాడట. (అందుకే అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని అడిగాను.) (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని జిక్ర్, దుఆల ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: Mu`awiyah (radiyallahu anhu) came to an assembly in the mosque and asked them: “What has made you sit together?” They replied, “We are sitting here to remember Allah.” He said, “I adjure you by Allah to tell me whether nothing else has made you to sit together.” They replied: “By Allah! We are sitting only to remember Allah.” Then he said, “I did not adjure you because I suspected you. No one of my rank in the eyes of the Messenger of Allah ﷺ is the narrator of so few traditions as I am. The fact is that the Messenger of Allah ﷺ went out to a circle of his Companions and said, `What has made you sit there?‘ When they replied that they are sitting together to remember Allah and to praise Him for guiding them to Islam and bestowing favours on them, he ﷺ said, `I adjure you by Allah to tell me that nothing else has made you sit together.’ On their reply that there was certainly no other purpose, he ﷺ said, `I did not adjure you because I suspected you, but Jibril (Gabriel) came to me and told me that Allah was talking proudly of you to the angels.”’
[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|247. దైవస్మరణ సమావేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి. అలాంటి సమావేశాలకు హాజరవుతూ ఉండటం అభిలషణీయం, అకారణంగా వాటిని వదలిపెట్టడం అవాంఛనీయం|హదీసు 1451
You must be logged in to post a comment.