హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 246వ అధ్యాయం: నిద్రపోయేటప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు పఠించే దుఆ. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1447) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
246. నిద్రపోయేటప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు పఠించే దుఆ
باب مَا يقوله عِنْدَ نومه واستيقاظِه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1447
عن حُذَيْفَةَ، وأَبي ذَرٍّ رضيَ اللَّه عَنْهُمَا قالا: كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا أَوَى إِلى فِراشِهِ قَالَ: "بِاسمِكَ اللَّهُمَّ أَمُوتُ وَأَحْيَا "وإِذا اسْتيقَظَ قَالَ: "الحمْدُ للَّهِ الذِي أَحْيَانَا بعد مَا أَماتَنَا وَإِليْهِ النُّشورُ" رواه الترمذي.
హజ్రత్ హుజైఫా మరియు అబూజర్ర్ (రదియల్లాహు అన్హుమా)ల కథనం: దైవప్రవక్త ﷺ (నిద్రపోవటానికి) పడకమీద వాలినప్పుడు ఇలా వేడుకునేవారు: "అల్లాహ్! నీ పేరుతోనే మరణిస్తున్నాను. తిరిగి నీ పేరుతోనే బ్రతుకుతాను."
నిద్ర మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థించేవారు: "మమ్మల్ని మరణింప జేసిన తర్వాత తిరిగి బ్రతికించిన దేవునికే స్తోత్రం శోభిస్తుంది. మనమంతా ఆయన వైపుకే వెళ్ళవలసి ఉంది."
(బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని దావాత్ ప్రకరణం)
English
Hudhaifah and Abu Dharr (radiyallahu anhu) reported: Whenever the Messenger of Allah ﷺ went to bed, he would supplicate: “Bismika-Allahumma amut wa ahya (With Your Name, O Allah, I die and return to life)”; and when he woke up, he would supplicate thus: “Al-hamdu lillahilladhi ahyana ba`da ma amatana, wa ilaihin-nushur (All praise belongs to Allah Who has restored us back to life after causing us to die; and to Him shall we return).”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఉదయం సాయంత్రం ఇలాంటి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవధ్యాన ప్రకరణం|246. నిద్రపోయేటప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు పఠించే దుఆ|హదీసు 1447
You must be logged in to post a comment.