హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 242. స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 242వ అధ్యాయం: స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 4 హదీసులు (హదీసు 1394 – 1397) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

242. స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం

↑ విషయ సూచిక

بابُ فضل الحمد والشكر

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{فَاذْكُرُونِي أَذْكُرْكُمْ وَاشْكُرُوا لِي وَلا تَكْفُرُونِ} [البقرة: ١٥٢]

"మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలువండి. చేసిన మేలును మరువకండి." (అల్ బఖర: 152)

{لَئِنْ شَكَرْتُمْ لأَزِيدَنَّكُمْ} [إبراهيم: ٧]

"మీరు గనక కృతజ్ఞులయితే నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను." (ఇబ్రాహీమ్-7)

{وَقُلِ الْحَمْدُ لِلَّهِ} [الإسراء: ١١١]

"చెప్పండి, స్తోత్రం దేవునికే చెల్లుతుంది." (బనీ ఇస్రాయీల్: 111)

{وَآخِرُ دَعْوَاهُمْ أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ} [يونس: ١٠]

"విశ్వాసుల ప్రతి మాటకు ముగింపు ఇలా ఉంటుంది: స్తోత్రమంతా సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు మాత్రమే." (యూనుస్: 10)

ముఖ్యాంశాలు

దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవటమంటే ఆయనకు విధేయత చూపటం, సంతోష సమయాల్లో, విచార ఘడియల్లో, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన్నే ఆరాధించటం, ఆయన ముందు తప్ప ఇతరుల ముందు చెయ్యి చాపకుండా ఉండటం. అలా చేసేవారిని దేవుడు కూడా జ్ఞాపకముంచుకుంటాడు. అంటే వారు మంచి స్థితిలో ఉంటే వారి స్థితిని మరింత సుఖమయం చేస్తాడు. తన కరుణాకటాక్షాలతో వారిని చల్లగా ఉంచుతాడు. ఒకవేళ వారు కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుండి వారిని గట్టెక్కిస్తాడు. తమకు లభిస్తున్నవన్నీ దేవుడు ప్రసాదించినవేనని మనసారా అంగీకరించటాన్ని కృతజ్ఞత అంటారు. ఈ కృతజ్ఞత రెండు విధాలుగా ఉండవచ్చు. నోటితో దేవుణ్ణి స్తుతిస్తే అది నోటి పరమైన కృతజ్ఞత అవుతుంది. దైవాజ్ఞల్ని అమలు పరుస్తే అది ఆచరణాత్మకమైన కృతజ్ఞత అవుతుంది. పై రెండు విధాలుగానూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. లేకపోతే అది దైవం పట్ల కృతఘ్నత అవుతుంది. కృతఘ్నత చాలా పెద్ద పాపం.

English

“Therefore, remember Me (by praying, glorifying). I will remember you, and be grateful to Me (for My countless Favours on you) and never be ungrateful to Me.” [Al-Baqarah 2:152]

“If you give thanks (by accepting Faith and worshipping none but Allah), I will give you more (of My Blessings).” [Ibrāhīm 14:7]

“And say: `All the praises and thanks be to Allah.”’ [Al-Isrā’ 17:111]

“And the close of their request will be: `Al-hamdu lillahi Rabbil-`alamin [All the praise is due to Allah, the Rubb of `Alamin (mankind, jinn and all that exists)].”’ [Yūnus 10:10]

1394

హదీసు 1394

وعن أبي هُرَيْرة، رضي اللَّه عنْهُ، أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أُتِي لَيْلةَ أُسْرِيَ بِهِ بِقَدَحَيْن مِن خَمْر ولَبن، فنظَرَ إلَيْهِما فأَخذَ اللَّبنَ، فَقَالَ جبريلُ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الحمْدُ للَّهِ الَّذي هَداكَ للفِطْرةِ لوْ أخَذْتَ الخَمْرَ غَوتْ أُمَّتُكَ" رواه مسلم.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺకు మేరాజ్ యానం చేయించబడినరోజు ఆయన ముందు రెండు పాత్రలు ఉంచబడ్డాయి. వాటిలో ఒకటి మద్యంది-రెండోది పాలది. దైవప్రవక్త ﷺ వాటివైపు (పరీక్షగా) చూసి పాలపాత్ర ఎత్తుకున్నారు. అప్పుడు జిబ్రయీల్ (అలైహి) "మిమ్మల్ని సహజత్వం వైపు ప్రేరేపించిన దేవుడే స్తోత్రానికి అర్హుడు. మీరు మద్యం పాత్ర ఎత్తుకున్నట్లయితే మీ అనుచర సమాజం భ్రష్టత్వానికి గురయ్యేది" అని అన్నారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని విశ్వాసాల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: On the Night of Al-Isra (the Night of Ascension) the Prophet ﷺ was presented with two drinking vessels: one full of wine and the other one full of milk. He looked at them. Then he took the vessel which was full of milk. Thereupon Jibril (Gabriel) said: “Al-hamdu lillah (praise be to Allah) Who has guided you to that, which is in accord with Fitrah (i.e., Islamic Monotheism; pure nature of Islam). Had you selected wine, your people would have gone astray.”[Muslim].

ముఖ్యాంశాలు

1) ఇస్లాం సహజమైన ధర్మం. సహజత్వాన్ని ప్రేమించే, నిష్కల్మషత్వంతో ఆలోచించే వారెవరూ ఈ ధర్మాన్ని తృణీకరించలేరు. 2) దేవుడు తమకు మంచి పనులు చేసే సద్బుద్ధినీ, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తే అందుకుగాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 3) మద్యపానం ఎన్నో చెడులకు దారితీస్తుంది. అందుకే దాన్ని 'ఉమ్ముల్ ఖబాయిస్' (చెడుల తల్లి) అని అంటారు. 4) సంఘటనల్ని మంచి శకునాలుగా భావించటంలో తప్పులేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|242. స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం|హదీసు 1394

1395

హదీసు 1395

وعنْهُ عنْ رَسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كُلُّ أمْرٍ ذِي بَالٍ لاَ يُبْدأُ فِيهِ ب: الحمد للَّه فَهُوَ أقْطُع" حديثٌ حسَنٌ، رواهُ أَبُو داود وغيرُهُ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: దైవాన్ని స్తుతించకుండా ప్రారంభించబడిన ప్రతి ముఖ్యమైన పనీ అసంపూర్ణంగానే మిగిలి పోతుంది.

ఈ హదీసు హసన్ కోవకు చెందినది. దీనిని అబూదావూద్ తదితరులు వెలికి తీశారు.

(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం – సుననె ఇబ్నెమాజాలోని నికాహ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Any matter of importance which is not begun with Al-hamdu lillah (praise be to Allah) remains defective.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

వేరొక ఉల్లేఖనంలో 'బిస్మిల్లాహ్'తో ప్రారంభించబడని ముఖ్యమైన పని అశుభంగా మిగిలిపోతుందని చెప్పబడింది. షేఖ్ అల్‌బానీ గారు ఈ రెండు హదీసులనూ అస్పష్టమైనవిగా, ఆధారాల రీత్యా బలహీనమైనవిగా ఖరారు చేశారు. అయితే ముర్సల్‌గా (అంటే తాబయీన్లు నేరుగా దైవప్రవక్త నుంచి చేసిన కథనం ప్రకారం) ఆ విధంగా దైవస్తోత్రం చేయటం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమయినప్పటికీ ప్రతి పనికీ ముందు దైవనామాన్ని ప్రస్తావించుకోవటం లేదా దైవాన్ని ప్రస్తుతించుకోవటం అభిలషణీయమన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|242. స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం|హదీసు 1395

1396

హదీసు 1396

وعَن أَبي مُوسى الأشعريَّ رضي اللَّه عنْهُ، أنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا ماتَ ولَدُ العبْدِ قَالَ اللَّه تَعَالَى لملائِكَتِهِ: قَبضْتُمْ ولَدَ عبْدِي؟ فيقولُون: نَعمْ، فَيقولُ: قبضتُم ثَمرةَ فُؤَادِهِ؟ فيقولونَ: نَعَمْ، فيقولُ: فَمَاذَا قَالَ عَبْدي؟ فيقولونَ: حمِدكَ واسْتَرْجَع، فَيقُولُ اللَّه تَعالى: ابْنُوا لِعَبْدِي بيْتاً في الجنَّةِ، وسَمُّوهُ بَيْتَ الحمْدِ "رواهُ الترمذي وقالَ: حديثٌ حسنٌ.

హజ్రత్ అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: దాసుని సంతానం మరణించినప్పుడు దేవుడు తన దూతల్ని, "మీరు నా దాసుని బిడ్డ ప్రాణాలు తీశారా?" అని అడుగుతాడు. దూతలు 'అవున'ంటారు. దేవుడు మళ్ళీ "అతని హృదయ ఫలాన్ని కోశారా?" అని అడుగుతాడు. దైవదూతలు 'ఔన'ంటారు. "మరి దానికి నా దాసుడు ఏమన్నాడు?" అని అడుగుతాడు దేవుడు. దానికి దూతలు సమాధానమిస్తూ, "అతను నిన్ను స్తుతించాడు. ఆ తర్వాత 'ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్' (మేము అల్లాహ్ వారము. మేమంతా ఆయన వైపుకు మరలిపోవలసిన వారము) అని అన్నాడు" అని చెబుతారు. అప్పుడు దేవుడు, "అయితే నా దాసుని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించండి. దానికి 'బైతుల్ హమ్ద్' (స్తోత్ర గృహం) అని పేరుపెట్టండి" అని దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. (తిర్మిజీ- హసన్)

(సుననె తిర్మిజీలోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When a slave’s child dies, Allah the Most High asks His angels, `Have you taken out the life of the child of My slave?” They reply in the affirmative. He then asks, `Have you taken the fruit of his heart?’ They reply in the affirmative. Thereupon he asks, `What has My slave said?’ They say: `He has praised You and said: Inna lillahi wa inna ilaihi raji`un (We belong to Allah and to Him we shall be returned). Allah says: `Build a house for My slave in Jannah and name it as Bait-ul-Hamd (the House of Praise).”’[At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|242. స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం|హదీసు 1396

1397

హదీసు 1397

وعنّْ أنَسَ رضي اللَّه عنهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ اللَّه لَيرضي عنِ العبْدِ يَأْكُلُ الأكْلَةَ فَيَحْمَدُهُ عَليْهَا، وَيَشْرب الشَّرْبَةَ فَيَحْمَدُهُ عَلَيْهَا" رواهُ مسلم. كتابُ الصَّلاة عَلَى رَسُول الله صلى الله عليه وسلم

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఏదయినా తిన్నప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునేవాడు, ఏదయినా పానీయం తాగినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే దాసుని పట్ల దేవుడు ప్రసన్నుడౌతాడు. (ముస్లిం)

English

Anas bin Malik (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah is pleased with His slave who says: `Al-hamdu lillah (praise be to Allah)’ when he takes a morsel of food and drinks a draught of water.”[Muslim].

ముఖ్యాంశాలు

ఈ హదీసు ఇంతకుముందు 'సత్కార్య మార్గాలు అనేకం' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. మనం తీసుకునే అన్నపానీయాలు అవి ఎక్కువైనా, తక్కువైనా వాటిని సేవించినందుకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|దైవ స్తోత్రం, దైవ కృతజ్ఞతల ప్రకరణం|242. స్తోత్రం – కృతజ్ఞతల వైశిష్ట్యం|హదీసు 1397