హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 241వ అధ్యాయం: విజ్ఞానం ఘనత. ఈ అధ్యాయంలో 4 ఖుర్ఆన్ ఆయతులు, 17 హదీసులు (హదీసు 1377 – 1393) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
241. విజ్ఞానం ఘనత
بابُ فضل العلم
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{وَقُلْ رَبِّ زِدْنِي عِلْماً} [طه: ١١٤]
ప్రవక్తా! ఇలా అనండి: "ప్రభూ! నాకు మరింత జ్ఞానమొసగు." (తాహా: 114)
{قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لاَ يَعْلَمُونَ} [الزمر: ٩]
తెలిసినవారూ, తెలియనివారూ ఇరువురూ సమానులు కాగలరా? (జుమర్: 9)
{يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ} [المجادلة: ١١]
మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. (ముజాదలహ్: 11)
{إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ} [فاطر: ٢٨]
అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. (ఫాతిర్: 28)
ముఖ్యాంశాలు
1) విజ్ఞానం ఎంతో గొప్పది. పరాత్పరుడైన దేవుడే దానికి మూలం. అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయనే. కనుక జ్ఞానప్రాప్తికోసం ఆయన్నే ప్రార్థించాలి. అగోచరాల జ్ఞానం ఆయనకు తప్ప మరెవరికీ లేదు. అందుకే దైవప్రవక్తలు సైతం జ్ఞానం ప్రసాదించమని ఆయన్నే వేడుకుంటారు.
2) జ్ఞానులూ- అజ్ఞానులూ, పండితులూ- పామరులు ఎన్నటికీ సమానులు కాలేరు.
3) విశ్వాసులకు, జ్ఞానవంతులకు ఇహపరాల్లోనూ గొప్ప హోదా, అంతస్తులు లభిస్తాయి.
4) కేవలం పుస్తకాలు ఔపోసన పట్టినంతమాత్రాన మనుషులు పండితులు కారు. దైవభీతిపరులే సిసలైన పండితులు. విద్యకొద్దీ వినయమన్నట్టుగా జ్ఞానం పెరిగినకొలది మనిషిలో భక్తివిశ్వాసాలు పెంపొందాలి.
English
“And say: `My Rubb! Increase me in knowledge.” [Ṭā Hā 20:114]
“Are those who know equal to those who know not?”’ [Az-Zumar 39:9]
“Allah will exalt in degree those of you who believe, and those who have been granted knowledge.” [Al-Mujādilah 58:11]
“It is only those who have knowledge among His slaves that fear Allah.” [Fāṭir 35:28]
హదీసు 1377
وعَنْ مُعاوِيةَ، رضي اللَّه عنْهُ، قَالَ: قَال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَنْ يُرِد اللَّه بِهِ خيْراً يُفَقِّهْهُ في الدِّينِ" متفقٌ عليه.
హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దేవుడు ఎవరికయినా మేలు చేయదలచుకుంటే వారికి ధర్మావగాహనా శక్తిని ప్రసాదిస్తాడు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని విద్యాప్రకరణం – సహీహ్ ముస్లింలోని జకాత్ ప్రకరణం)
English
Mu`awiyah (radiyallahu anhu) reported: The Messenger of Allah said, “When Allah wishes good for someone, He bestows upon him the understanding of Deen.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1377
హదీసు 1378
وعنْ ابنِ مسْعُودٍ، رضي اللَّه عنْه، قَال: قَال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لاَ حَسَد إلاَّ في اثْنَتَيْنِ: رَجُلٌ آتَاهُ اللَّه مَالاً فَسلَّطهُ عَلى هلَكَتِهِ فِي الحَقِّ، ورَجُلٌ آتاهُ اللَّه الحِكْمَةَ فهُوَ يَقْضِي بِهَا، وَيُعَلِّمُهَا "مُتَّفَقٌ عَليهِ. والمرادُ بالحسدِ الْغِبْطَةُ، وَهُوَ أنْ يتَمنَّى مثْلَهُ.
హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఇద్దరి మీద తప్ప మరెవరి మీద కూడా ఈర్ష్యపడటం ధర్మసమ్మతం కాదు. దేవుడు ధనం ప్రసాదించి, దాన్ని ధర్మమార్గంలో ఖర్చుపెట్టే సద్బుద్ధిని అనుగ్రహించిన వ్యక్తి మీద; దేవుడు వివేచనా జ్ఞానాన్ని ప్రసాదిస్తే దానిమూలంగా (ప్రజల వ్యవహారాల్లో) సరైన నిర్ణయాలు తీసుకుంటూ, ఆ వివేచనాజ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధించే వ్యక్తి మీద.
(బుఖారీ- ముస్లిం)
ఇక్కడ 'ఈర్ష్య' అంటే అసూయ కాదు. ఈర్ష్య అంటే ఇతరుల దగ్గర ఉన్న వస్తువులు తమకు కూడా ప్రాప్తించాలని కోరుకోవటం. (ఇతరుల వస్తువులు నాశనమై అవి తమకు లభించాలని కోరుకోవటం అసూయ అవుతుంది.)
(సహీహ్ బుఖారీలోని విద్యాప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Envy is permitted only in two cases: A man whom Allah gives wealth, and he disposes of it rightfully, and a man to whom Allah gives knowledge which he applies and teaches it.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
1) ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) చెప్పినట్లు పై హదీసులో ఈర్ష్య అంటే నిజంగా ఈర్ష్య అని కాదు. ఇక్కడ అది 'గిబ్తా' అనే అర్థంలో ఉపయోగించబడింది. అరబీ భాషలో గిబ్తా అంటే ఇతరులు మంచి స్థితిలో ఉండటం చూసి తమకు కూడా అలాంటి స్థితి కల్పించమని దైవాన్ని కోరుకోవటం. ఈ విధంగా కోరుకోవటంలో తప్పులేదు. కనుక ఇతరుల ఆస్తుల మీద ఈర్ష్య (గిబ్తా) చెందటం ధర్మసమ్మతంగానే పరిగణించబడుతుంది. అలాగాకుండా ఇతరుల ఆస్తులు నాశనమయిపోయి అవి తమకు లభించాలని కోరుకోవటం, ఇతరులు సుఖపడుతుంటే చూసి ఉడికిపోవటం అసూయ అనిపించుకుంటుంది. అసూయ చెందటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మసమ్మతం కాదు.
2) ఇక్కడ వివేచనా జ్ఞానం అంటే ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం అని అర్థం. ఈ జ్ఞానం ద్వారానే ప్రజల వ్యవహారాల్లో సరైన తీర్పులు ఇవ్వగలం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1378
హదీసు 1379
وعَنْ أَبي مُوسى، رضي اللَّه عنْهُ، قَالَ: قَالَ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَثَلُ مَا بعثَنِي اللَّه بِهِ مِنَ الهُدى والْعِلْمِ كَمَثَل غَيْثٍ أَصَابَ أرْضاً، فَكَانَتْ مِنْهَا طَائفَةٌ طَيِّبَةٌ قَبِلَتِ المَاءَ فَأَنْبَتَتِ الْكَلأَ، وَالْعُشْب الْكَثِيرَ، وَكَانَ مِنْهَا أجَادِبُ أمسَكَتِ المَاءَ، فَنَفَعَ اللَّه بِهَا النَّاسَ، فَشَرِبُوا مِنْهَا وَسَقَوْا وزَرَعُوا، وأَصَاب طَائفَةً مِنْهَا أُخْرى إنَّما هِي قِيعانٌ، لا تمْسِكُ مَاءً، ولاتُنْبِتُ كَلأً، فَذلكَ مثَلُ منْ فَقُهَ في دِينِ اللَّهِ، وَنَفَعَهُ مَا بَعَثَنِي اللَّه بِهِ فَعلِمَ وَعلَّمَ، وَمَثَلُ منْ لَمْ يَرْفَعْ بِذلكَ رَأساً، وَلَمْ يَقْبَلْ هُدَى اللَّهِ الَّذي أُرْسِلْتُ بِهِ "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: అల్లాహ్ నాకిచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాలు నేలపై కురిసే వర్షం లాంటివి. ఆ నేలలోని కొంతభాగం సారవంతమైనది. అది (వర్షపు) నీటిని పీల్చుకొని పచ్చిక, చెట్లు చేమలను మొలకెత్తించింది. ఆ నెలలోని మరికొంతభాగం గట్టినేల. అది (నీటిని పీల్చుకోలేకపోయినా) నిల్వచేసి మాత్రం ఉంచుతుంది. ఆ నీటితో అల్లాహ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతాడు. వారు ఆ నీటిని తాము స్వయంగా త్రాగటమేకాకుండా (తమ పశువులకు కూడా) త్రాపిస్తారు. ఇంకా పంటపొలాల కోసం కూడా వినియోగిస్తారు. మరోవైపు ఆ వర్షమే మెట్టపల్లాలు లేని చదునైన నేలపై కూడా కురిసింది. కాని ఆ నేల వర్షపు నీటిని నిలిపి ఉంచటంగాని, పచ్చికను మొలకెత్తించటంగాని చేయజాలదు. ఈ (తొలిరెండు) ఉదాహరణలు దైవధర్మాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తికి వర్తిస్తాయి. దేవుడు నాకిచ్చి పంపిన జ్ఞానం, సన్మార్గాలతో అతనికి ప్రయోజనం చేకూర్చాడు. అతను (స్వయంగా ధర్మ) జ్ఞానాన్ని ఆర్జించి (ఇతరులక్కూడా) దాన్ని బోధించాడు. ఇక (మూడవ) ఉదాహరణ దేవుడు నాకిచ్చి పంపిన (ధర్మం)వైపు తలెత్తి అయినా చూడకుండా, దేవుడు నాకిచ్చి పంపిన సన్మార్గాన్ని తృణీకరించిన వాడికి వర్తిస్తుంది. (బుఖారీ-ముస్లిం)
English
Abu Musa (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The guidance and knowledge with which Allah has sent me are like abundant rain which fell on a land. A fertile part of it absorbed the water and brought forth profuse herbage and pasture; and solid ground patches which retained the water by which Allah has benefited people, who drank from it, irrigated their crops and sowed their seeds; and another sandy plane which could neither retain the water nor produce herbage. Such is the similitude of the person who becomes well-versed in the religion of Allah and receives benefit from the Message entrusted to me by Allah, so he himself has learned and taught it to others; such is also the similitude of the person who has stubbornly and ignorantly rejected Allah’s Guidance with which I have been sent.”[Al-Bukhari and Muslim]
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకుముందు "సున్నత్ పరిరక్షణ" అనే అధ్యాయంలో కూడా వచ్చింది. విద్య యొక్క ఘనతావిశిష్టతలను వివరించటానికి దీనిని ఈ అధ్యాయం క్రింద కూడా పొందుపరచటం జరిగింది. విద్యావిషయికంగా మనుషుల్లో మూడురకాల వారుంటారని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. మొదటిరకం వారు ఖుర్ఆన్ హదీసుల జ్ఞానాన్ని ఆర్జిస్తారు. దానికనుగుణంగా ఆచరిస్తారు. ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తారు. అంతేకాదు, ఆ జ్ఞానపు లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి, పరిశోధించి ఖుర్ఆన్, హదీసులకు అనుగుణమైన ధర్మసూత్రాలను రూపొందిస్తారు. ఆ విధంగా ధర్మాన్ని సర్వవ్యాప్తం చేస్తారు. వీరు అందరికంటే ఉత్తములుగా పరిగణించబడతారు.
రెండవ రకం వారు ఖుర్ఆన్ హదీసుల జ్ఞానాన్ని ఆర్జిస్తారు. తమ జ్ఞానం ద్వారా ఇతరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తారు. అయితే విషయ లోతుల్లోకి వెళ్ళి ధర్మసూత్రాలను క్రోడీకరించేటంతటి వాళ్ళు కారువీరు. అందుకే వీరు మొదటిరకం వారి కన్నా తక్కువ శ్రేణివారుగా పరిగణించబడతారు. ఏమయినప్పటికీ ఈ రెండు వర్గాలవారు మాత్రం- హదీసులో చెప్పబడినట్లు- దేవుని దృష్టిలో ప్రయోజకులే.
ఇకపోతే మూడోరకం వారు ఎవరంటే- వారు ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం పట్ల వైముఖ్య ధోరణిని అవలంబిస్తారు. తాము స్వయంగా వాటిని నేర్చుకోరు. అందువల్ల ఇతరులకు కూడా ప్రయోజనం కలిగించలేరు. వీరు అందరికన్నా అధమశ్రేణికి చెందినవారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1379
హదీసు 1380
وعَنْ سَهْلِ بن سعدٍ، رضي اللَّه عنْهُ، أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ لِعَليًّ، رضي اللَّه عنْهُ: "فو اللَّهِ لأنْ يهْدِيَ اللَّه بِكَ رجُلاً واحِداً خَيْرٌ لكَ من حُمْرِ النَّعم" متفقٌ عليهِ.
హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ అలీ (రదియల్లాహు అన్హు)కి హితోపదేశం చేస్తూ ఇలా అన్నారు: దైవసాక్షి! దేవుడు నీ మూలంగా ఏ ఒక్క వ్యక్తికి సన్మార్గాన్ని చూపించినా అది నీ పాలిట ఎరుపు ఒంటెల కన్నా ఎంతో విలువైనది.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ప్రవక్త సహచరులు మహిమోన్నతుల ప్రకరణం)
English
Sahl bin Sa`d (radiyallahu anhu) reported: The Prophet ﷺ said to `Ali (radiyallahu anhu), “By Allah, if a single person is guided by Allah through you, it will be better for you than a whole lot of red camels.”
[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఆ రోజుల్లో అరబ్బు దేశంలో ఎరుపు రంగు ఒంటెల్ని అత్యంత విలువైన సంపదగా భావించటం జరిగేది. అరబ్బుల దృష్టిలో వాటికంటే విలువైన సంపద మరొకటి ఉండేది కాదు. అందుకని వారు ఏదైనా విలువైన, శ్రేష్ఠమైన వస్తువుని గురించి చెప్పేటప్పుడు "అది ఎరుపు రంగు ఒంటెలకన్నా విలువైనది" అని చెప్పేవారు. మొత్తానికి ఈ హదీసులో ప్రజల్ని దైవం వైపునకు, దైవధర్మం వైపునకు పిలవటం ఎంత గొప్ప సత్కార్యమో, అందుకు ఎంతటి విలువైన, శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుందో వివరించబడింది. అయితే మనిషి తనకు సన్మార్గం తెలిసినప్పుడే ఇతరులకు అది చూపగలుగుతాడు. కనుక ముందుగా అతను స్వయంగా ఖుర్ఆన్ హదీసుల జ్ఞానాన్ని నేర్చుకోవటం అవసరం. లేకపోతే సరైన విధంగా ప్రజలకు ధర్మబోధ చేయటం సాధ్యం కాదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1380
హదీసు 1381
وعن عبدِ اللَّه بن عمرو بن العاص، رضي اللَّه عنْهُما، أنَّ النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "بلِّغُوا عَنِّي ولَوْ آيَةً، وحَدِّثُوا عنْ بَنِي إسْرَائيل وَلا حَرجَ، ومنْ كَذَب علَيَّ مُتَعمِّداً فَلْيتبَوَّأْ مَقْعَدهُ مِنَ النَّار" رواه البخاري.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీరు నా తరపు నుండి (దైవాజ్ఞల్ని) ప్రజలకు చేరవేయండి. అది ఒక్క సూక్తి అయినాసరే; ఇంకా బనీ ఇస్రాయీల్ వారి నుండి సేకరించిన విషయాలు కూడా మీరు ప్రచారం చేయవచ్చు. అందులో తప్పులేదు. అయితే ఎవరయినా ఉద్దేశ్యపూర్వకంగా నా తరపు నుండి అబద్ధాలు చెబితే అతను తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకుంటాడు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని అహాదీసుల్ అంబియా ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “Convey from me even an Ayah of the Qur’an; relate traditions from Banu Israel, and there is no restriction on that; but he who deliberately forges a lie against me let him have his abode in the Hell.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
1) ఖుర్ఆన్ హదీసుల జ్ఞానాన్ని ఆర్జించి దాన్ని ప్రజల మధ్య ప్రచారం చేయమని ఈ హదీసు ప్రబోధిస్తోంది. కనుక మన దగ్గర ధర్మజ్ఞానం తక్కువున్నా, ఎక్కువున్నా దాన్ని ఇతరులకు కూడా బోధించాలి. మనకు తెలిసినంతవరకు ప్రజలకు దైవాజ్ఞల్ని గురించి బోధించాలి. "ధర్మబోధన, ప్రచార కార్యం పండితులే చేయగలరు. మాలాంటి సామాన్యులు ఆ పని చేయలేరు" అని ఎన్నడూ అనుకోరాదు. ప్రతి వ్యక్తీ తనకు తెలిసిన విషయాలు ప్రచారం చేయాలి. ఈ విషయమై రేపు ప్రళయ దినాన దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. కనుక తమకు ఒక్క దైవాజ్ఞ గురించి తెలిసినా దాన్ని ఇతరులకు బోధించటం తమ బాధ్యతగా గుర్తించాలి.
2) బనీ ఇస్రాయీల్ వారి నుండి సేకరించిన విషయాలంటే దైవప్రవక్త ﷺ వారి గురించి చెప్పిన కథలు, సంఘటనలని భావం. అవన్నీ ప్రామాణిక హదీసుల్లో పొందుపరచబడి ఉన్నాయి. అంతేగాని, బనీ ఇస్రాయీల్వారు చెప్పే అసత్య, అర్ధసత్య విషయాలన్నిటినీ గుడ్డిగా ప్రచారం చేసేయటం కాదు. చాలా మంది అలాగే భావిస్తున్నారు. కాని ఆ భావన సరైనది కాదు.
3) దైవప్రవక్త మీద అబద్ధాలు ఆపాదించేవారి గురించి తీవ్రమైన హెచ్చరికలొచ్చాయి. కనుక దైవప్రవక్త హదీసుల్ని వివరించేముందు వాటిని అన్ని విధాలా పరిశీలించి, పరిశోధించి, వడబోసి అది దైవప్రవక్త హదీసేనని ప్రామాణికంగా నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని ఇతరులకు బోధించాలి. ఒక హదీసు ఆధారాలు సరైనవి కావనీ, దానిని ఉటంకించిన వ్యక్తుల్లో కొందరు నిందితులు, అబద్ధాలకోరులున్నారని తెలిసికూడా అలాంటి హదీసును ప్రచారం చేయటం చాలా పెద్ద నేరం. అలాంటి బలహీన హదీసుల్లో కూడా వివిధ కోవలకు చెందిన హదీసులుంటాయి. హదీసుల్ని ఉటంకించిన వ్యక్తుల జీవిత చరిత్రల్ని కాచివడబోసి, హదీసు నియమనిబంధనల జ్ఞానాన్ని ఔపోశనం పట్టిన వారికి మాత్రమే ఆ హదీసుల బలహీనతలు తెలుస్తాయి. అలాంటి పండితులు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక సామాన్య ఉలమాలు (పండితులు) ఒక హదీసులో కొంచెం బలహీనత ఉన్నా దాన్ని ప్రచారం చేయకుండా ఉండటంలోనే శ్రేయం ఉంది. చాలా మంది విద్వాంసులు స్వల్ప బలహీనతల్ని కల్గివున్న హదీసుల్ని ఆచరించవచ్చుననే అంటారు. కానీ సామాన్య ప్రజలు ఆ బలహీనతల్ని గుర్తించలేరు. కనుక సామాన్యులు అసలు 'జయీఫ్' (బలహీన) హదీసుల జోలికి పోకుండా ఉండటమే మంచిది.
ప్రస్తుత కాలంలో షేఖ్ నాసిరుద్దీన్ అల్బానీ (రహిమహుల్లాహ్) గారు ఈ రంగంలో ఎనలేని సేవలు చేశారు. ఆయన నాలుగు సునన్ (అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజా) గ్రంథాల్లో వున్న బలహీనమైన హదీసులన్నిటినీ వేరు చేసి పూర్తిగా ప్రామాణికమైన హదీసుల్ని ప్రత్యేక గ్రంథాలుగా క్రోడీకరించారు. దాంతో సామాన్య పండితులకు కూడా బలహీనమైన హదీసుల్ని గుర్తించటం సులభమై పోయింది. ఈ బృహత్తర పరిశోధనా కార్యంలో ఆయన వల్ల కూడా తప్పులు దొర్లి ఉండవచ్చు. ఏదేని సహీహ్ హదీసుని జయీఫ్గా, జయీఫ్ హదీసుని సహీహ్గా పేర్కొని ఉండవచ్చు. కాని అలాంటివి చాలా చాలా అరుదు. ఇక్కడ మేము చెప్పదలచుకున్నదేమిటంటే, షేఖ్ అల్బానీలాగా హదీసుల లోపాలను గుర్తించగలిగేవాడు, హదీసుల మీద 'గట్టి నిఘా' ఉంచేవాడు మాత్రమే ఈ పని చేయగలడు. ప్రజల్లో బహుళ ప్రచారంలో ఉన్న నాలుగు సునన్ గ్రంథాల్లోని బలహీనమైన హదీసుల్ని వేరుపరచి ప్రామాణికమైన హదీసులన్నిటినీ క్రోడీకరించి సామాన్య ప్రజానీకానికి ఆయన మహోపకారం చేశారు. సామాన్య పండితులు ఆయన గ్రంథాలమూలంగా వీలైనంత ఎక్కువగా ప్రయోజనం పొందగలరు. అలాగాకుండా అల్బానీగారి అభిప్రాయం అంతిమ నిర్ణయం కానవసరం లేదంటూ ఆయనచేసిన సేవల్ని ఉపేక్షించటం భావ్యం కాదు. నిస్సందేహంగా ఆయన కూడా మానవ మాత్రులే. ఆయన అభిప్రాయాలు కొన్ని తప్పు కావచ్చు. ఆయన నిర్ణయాలు అంతిమ నిర్ణయాలు కాకపోవచ్చు. అలా అని చెప్పి ఆయన శ్రమను నిరుపయోగకరంగా లెక్కగట్టటం మాత్రం సమంజసం కాదు. ఇలాంటి పనికిమాలిన అనుమానాలతోటే చాలామంది "బుఖారీ -ముస్లిం హదీసులు అన్నిటికంటే ప్రామాణికమైనవి" అనే విషయాన్ని కూడా త్రోసిపుచ్చారు. మరి వీరి అభిప్రాయం కూడా సరైనదేనని భావించాలా? కాదు, ముమ్మాటికీ కాదు. అలాంటప్పుడు "అల్బానీ గారి పరిశోధనలు మాకవసరం లేదు" అని అనటం అర్థం లేనిమాట. హదీసు వేత్తలు హదీసుల్ని క్రోడీకరించి ముస్లిం సమాజానికి మహోపకారం చేశారు. అలాగే వారు ప్రతిపాదించిన సూత్రాలకు, నిబంధనలకు అనుగుణంగా వారి గ్రంథాలను కూడా పరిశీలించటం, పరిశోధించటం వాటిలో ఉన్న సహీహ్, జయీఫ్ హదీసుల్ని వేరుపరచటం కూడా హదీసువేత్తల కార్యంలో అంతర్భాగమే. ప్రస్తుత కాలంలో దేవుడు ఆ మహాభాగ్యాన్ని షేఖ్ నాసిరుద్దీన్ అల్బానీ గారికి ప్రసాదించాడు.
అది వేరే విషయం. అసలు హదీసులో చెప్పబడిందేమిటంటే- ఒక విషయం దైవప్రవక్త చెప్పారా లేదా అన్న మీమాంస ఏర్పడినప్పుడు అసలు ఆ విషయాన్ని ప్రజలకు బోధించకుండా ఉండటమే మంచిది. అలాగే జయీఫ్ హదీసుల్ని కూడా ప్రచారం చేయకూడదు. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే ఈ విషయంలో ఇంతటి తీవ్రమైన హెచ్చరికలు వచ్చినప్పటికీ చాలా మంది ఉలమాలు హదీసుల ప్రచారం విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమ మాటల్లో చేవ తీసుకురావటానికని, శ్రోతల్ని రంజింప చేయటానికని వారు బలహీన హదీసుల్ని కాదు, కల్పితమైన హదీసులు కూడా వినిపిస్తుంటారు. దేవుడు అలాంటి ఉలమాలకు సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరోవైపు కొంతమంది పండితులున్నారు. వారు తమ ఫికహ్ శాస్త్రాలను బలపరచు కోవటం కోసం ప్రామాణికమైన హదీసుల్ని ఏదో ఒకరకంగా నిరుపయోగకరమైనవిగా చేసి తమ శాస్త్రాలకు అనుగుణంగా ఉన్న బలహీనమైన హదీసుల్ని బలపరచటానికి, వారి ప్రామాణికతను రుజువుచేయటానికి ప్రయత్నిస్తుంటారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1381
హదీసు 1382
وعنْ أَبي هُريرةَ، رضي اللَّه عَنْهُ، أنَّ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قالَ: "ومَنْ سلَك طرِيقاً يَلْتَمِسُ فِيهِ عِلْماً، سهَّلَ اللَّه لَهُ بِهِ طَرِيقاً إِلَى الجَنَّةِ "رواهُ مسلمٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: (ధర్మ) జ్ఞానాన్ని ఆర్జించటం కోసం ఎవరయినా ఒక దారిన పడితే దేవుడు ఆ దారి గుండా అతని కోసం స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. (ముస్లిం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah makes the way to Jannah easy for him who treads the path in search of knowledge.”[Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకు ముందు "ముస్లింల అవసరాలను తీర్చటం" అనే అధ్యాయంలో ఇంకా వివరంగా వచ్చింది. ఇక్కడ జ్ఞానార్జన ప్రాముఖ్యతను వివరించటానికి అందులో కొంతభాగాన్ని పొందుపరచటం జరిగింది. జ్ఞానమంటే ఖుర్ఆన్ హదీసుల ద్వారా బోధపడే సరైన జ్ఞానం అని భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1382
హదీసు 1383
وَعَنهُ، أَيضاً، رضي اللَّه عنْه أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ دَعَا إِلَى هُدىً كانَ لهُ مِنَ الأجْر مِثلُ أُجورِ منْ تَبِعهُ لاَ ينْقُصُ ذلكَ مِنْ أُجُورِهِم شَيْئاً "رواهُ مسلمٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: సన్మార్గం వైపుకు పిలిచిన వ్యక్తికి అతని పిలుపునందుకొని (సన్మార్గాన్ని) ఆచరించిన వారందరికీ లభించినంత పుణ్యం లభిస్తుంది. దానివల్ల వారి పుణ్యంలోనూ ఎలాంటి తగ్గింపు జరగదు.
(ముస్లిం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who calls others to follow the Right Guidance will have a reward equal to the reward of those who follow him, without their reward being diminished in any respect on that account.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1383
హదీసు 1384
وعنْهُ قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا ماتَ ابْنُ آدَم انْقَطَع عَملُهُ إلاَّ مِنْ ثَلاثٍ: صَدقَةٍ جَاريَةٍ، أوْ عِلمٍ يُنْتَفَعُ بِهِ، أوْ وَلدٍ صالحٍ يدْعُو لَهُ" رواهُ مسلمٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన ఇంకొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఆదం పుత్రుడు (మనిషి) చనిపోగానే అతని కర్మల పరంపర అంతటితో ఆగిపోతుంది. అయితే మూడు కర్మల పుణ్యం మాత్రం అతనికి (ఆ తర్వాత కూడా) లభిస్తూనే ఉంటుంది. ఆ మూడు ఇవి: (1) శాశ్వతంగా ఉండిపోయే దానం (సదఖయె జారియా), (2) తన తదనంతరం ప్రజలకు ఉపయోగపడే విద్య (3) తన శ్రేయస్సు కోసం ప్రార్ధించే సదాచార సంపన్నులయిన సంతానం. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని వసియ్యత్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When a man dies, his deeds come to an end except for three things: Sadaqah Jariyah (ceaseless charity); a knowledge which is beneficial, or a virtuous decendant who prays for him (for the deceased).”[Muslim].
ముఖ్యాంశాలు
కర్మల పరంపర ఆగిపోతుందంటే దానికి లభించే పుణ్యపరంపర ఆగిపోతుందని అర్థం. అయితే మూడు రకాల కర్మల వల్ల మాత్రం మనిషికి తను చనిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. వాటిలో మొదటిది శాశ్వతంగా ఉండిపోయే దానం. ఉదా: మస్జిదులు, ధార్మిక పాఠశాలలు, వైద్యశాలలు, ధర్మసత్రాలు మొదలగునవి. వీటిని తమ సొంత ఖర్చుతో నిర్మించేవారికి వారి మరణానంతరం కూడా పుణ్యఫలం లభిస్తూనే ఉంటుంది. రెండోది, ప్రయోజనకరమైన విద్య. అంటే ఇతరులకు చదువు చెప్పటం, పుస్తకాల రాసి విద్యను వ్యాపింపజేయటం మొదలగు పనులన్నమాట. ప్రజలు ఆ పుస్తకాల ద్వారా, వారి జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందుతున్నంతకాలం వారికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. పోతే మూడోది మరియు చివరి కర్మ, సదాచార సంపన్నులయిన సంతానం ప్రార్థనలు. సదాచార సంపన్నులయిన సంతానం తమ పెద్దల కోసం ప్రార్థన (దుఆ) చేస్తే దాంతో వారికి పుణ్యంతోపాటు పరలోకంలో ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుంది. కనుక పిల్లలకు మంచి విద్యాశిక్షణలు గరపటం చాలా అవసరం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1384
హదీసు 1385
وَعنْهُ قَالَ: سمِعْتُ رسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "الدُّنْيَا ملْعُونَةٌ، ملْعُونٌ مَا فِيهَا، إلاَّ ذِكرَ اللَّه تَعَالى، وَمَا والاَهُ، وعَالماً، أوْ مُتَعلِّماً "رواهُ الترمذيُّ وقال: حديثٌ حسنٌ. قولهُ"وَمَا وَالاهُ"أيْ: طاعةُ اللِّه.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియ జేశారు: ప్రపంచం పాపిష్టిది, ప్రపంచంలో ఉన్నదంతా పాపిష్టిదే. దైవధ్యానం, దానికి సంబంధించినవి, ఇంకా ధర్మజ్ఞాని, జ్ఞానార్ధి తప్ప!
(తిర్మిజీ-హసన్)
మూలంలోని పదం 'వమా వాలాహు' అంటే దైవవిధేయత (దేవునికి విధేయత చూపుతూ ఆయన సామీప్యం కోసం చేసే పనులని భావం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The world, with all that it contains, is accursed except for the remembrance of Allah that which pleases Allah; and the religious scholars and seekers of knowledge.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఈ హదీసు ఇంతకుముందు 'ఐహిక అనాసక్తత' అనే అధ్యాయంలో కూడా వచ్చింది. ఇక్కడ ప్రపంచం, ప్రపంచంలోని వస్తువులు పాపిష్టివి అంటే నిజంగా అవి పాపిష్టివి అని కాదు. మనిషిని దేవుని నుండి ఏమార్చే వస్తువులని దాని అసలు భావం. ఆ విధంగా చూస్తే మనిషిని దైవారాధనలో లీనమవకుండా పరధ్యానంలో ఉంచే వస్తువులన్నీ కూడా పాపిష్టివిగానే పరిగణించబడతాయి. ఈ హదీసుని ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఔచిత్యమేమిటంటే, ప్రపంచంలో ఏ వస్తువు దేవుని ధ్యానం నుండి ఏమారుస్తుందో, ఏ విషయం దేవుని అప్రసన్నతకు కారణమవుతుందో తెలుసుకోవాలంటే ముందు జ్ఞానం అవసరం. జ్ఞానాన్ని బోధించేవారు, జ్ఞానాన్ని ఆర్జించేవారు మాత్రమే ఆ విషవలయంలో చిక్కుకోకుండా సురక్షితంగా ఉండగలుగుతారు. ఈ హదీసు జ్ఞానసముపార్జనా ప్రాముఖ్యతను వివరిస్తుంది. కనుక దీనిని ఇక్కడ పొందుపరచటం జరిగింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1385
హదీసు 1386
وَعَنْ أنسٍ، رضي اللَّه عنْهُ قالَ: قَالَ رَسُولُ اللَّهِ، صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مَن خرَج في طَلَبِ العِلمِ، كان في سَبيلِ اللَّهِ حَتَّى يرجِعَ "رواهُ الترْمِذيُّ وقال: حديثٌ حَسنٌ.
హజ్రత్ అనస్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: జ్ఞానార్జనా ధ్యేయంతో బయలుదేరిన వ్యక్తి తిరిగొచ్చేవరకు దైవమార్గంలో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని విద్యా అధ్యాయం)
English
Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who goes forth in search of knowledge is considered as struggling in the Cause of Allah until he returns.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఇందులో విద్యార్జన కోసం ప్రయాణం చేయటం దైవమార్గంలో జిహాద్ చేయటంతో సమానమని చెప్పబడింది. కాని ఈ హదీసు ఆధారాల రీత్యా బలహీనమైనదని షేఖ్ అల్బానీ గారంటున్నారు. ఆయన దీనిని 'తఖ్రీజ్ ఫిక్హుస్సీరత్" అనే గ్రంథంలో పేర్కొన్నారు. (అల్బానీ గారిచేత పరిశోధిత రియాజుస్సాలిహీన్ గ్రంథం చూడండి)
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1386
హదీసు 1387
وعَنْ أَبي سَعيدٍ الخدْرِيِّ، رضي اللَّه عَنْهُ، عَنْ رسُولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لَنْ يَشبَع مُؤمِنٌ مِنْ خَيْرٍ حَتَّى يَكُونَ مُنْتَهَاهُ الجَنَّةَ". رواهُ الترمذيُّ، وقَالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: విశ్వాసి తన అంతిమ స్థానమైన స్వర్గంలోకి ప్రవేశించేవరకు మంచి పనులు చేయటంలో అతని ఆత్రం చల్లారదు.
(తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని విద్యాప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A believer never satisfies doing good until he reaches Jannah.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
విశ్వాసి మంచిపనులు చేయటంలో ఎల్లప్పుడూ ఎంతో ఆతురతని కనబరుస్తాడు. వాటిని చేయటంలో ఎన్నటికీ విసుగు చెందడు. మరణం వరకూ అదే స్థితిలో ఉండి మరణానంతరం స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ఈ హదీసును విద్యకు సంబంధించిన అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఔచిత్యం ఏమిటి? అని మీకు సందేహం రావచ్చు. మంచి పనులన్నిటిలోకెల్లా అత్యుత్తమమైనది ధర్మజ్ఞానాన్ని ఆర్జించటం. ఈ ధర్మజ్ఞానం సహాయంతోనే కదా మనిషి మంచీచెడుల మధ్య భేదాన్ని గుర్తించగలిగేది. అందుకే ఈ హదీసుని ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1387
హదీసు 1388
وعَنْ أَبي أُمَامة، رضي اللَّه عنْهُ، أنَّ رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "فضْلُ الْعالِم عَلَى الْعابِدِ كَفَضْلي عَلَى أَدْنَاكُمْ"ثُمَّ قَالَ: رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"إنَّ اللَّه وملائِكَتَهُ وأَهْلَ السَّمواتِ والأرضِ حتَّى النَّمْلَةَ في جُحْرِهَا وَحَتَّى الحُوتَ لَيُصَلُّونَ عَلى مُعلِّمِي النَّاسِ الخَيْرْ "رواهُ الترمذي وقالَ: حَديثٌ حَسنٌ.
హజ్రత్ అబూ ఉమామా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీలో అందరికన్నా అల్పునిమీద నాకెంత విశిష్టత ఉందో- ఒక జ్ఞానికి మరో ఆరాధకుడి మీద అంత విశిష్టత ఉంటుంది.
ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: ప్రజలకు మంచిని బోధించే వారి మీద దేవుడు కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఇంకా దైవదూతలు, భూమ్యాకాశాల్లో ఉన్నవారు, ఆఖరికి చీమలు తాముండే రంధ్రంలో నుండి, చేపలు (నీళ్ళలో నుండి) వారి మీద దైవకారుణ్యం వర్షించాలని ప్రార్థిస్తూ ఉంటారు. (తిర్మిజీ-హసన్)
(సుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం)
English
Abu Umamah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The superiority of the learned over the devout worshipper is like my superiority over the most inferior amongst you (in good deeds).” He went on to say, “Allah, His angels, the dwellers of the heaven and the earth, and even the ant in its hole and the fish (in water) supplicate in favour of those who teach people knowledge.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ఇక్కడ జ్ఞాని అంటే దేవుని విధుల్ని, ప్రవక్త సున్నత్ (సంప్రదాయా)లను నిర్వర్తిస్తూ మరోవైపు ధర్మజ్ఞానాన్ని ఆర్జించి ప్రజలకు మంచిపనుల గురించి బోధించేవాడని అర్థం. 'ఆరాధకుడు' అంటే తన సమయంలోని అధికభాగాన్ని దైవారాధన కోసం వెచ్చించేవాడని అర్థం. ఇతను ఎన్ని సున్నత్, నఫిల్ నమాజులు చేసినా దాని ప్రయోజనం తనవరకే పరిమితమై ఉంటుంది. దీనికి భిన్నంగా జ్ఞానులు చేసే ధర్మబోధ వల్ల ఇతరులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఒక జ్ఞానికి సామాన్య ఆరాధకుడి కంటే ఎక్కువ విశిష్టత ఉంటుందని హదీసులో చెప్పబడింది.
హదీసు మూలంలో 'యుసల్లూన' అనే పదం వచ్చింది. సలాత్ అనేది దానికి మూలపదం. దేవుడు జ్ఞానులమీద సలాత్ పంపిస్తాడంటే వారిమీద కారుణ్యవర్షం కురిపిస్తాడని అర్థం. అదే దైవదూతలు జ్ఞానుల మీద సలాత్ పంపిస్తారంటే వారి మన్నింపు కోసం ప్రార్థిస్తారని భావం. ఇతర సృష్టిరాశులు సలాత్ పంపించటమంటే వారి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారని భావం. మొత్తానికి ధర్మజ్ఞానాన్ని ప్రజలకు బోధించే గురువుల మీద దేవుడు తన కారుణ్య వర్షాన్ని కురిపిస్తాడు. దైవదూతలు వారి మన్నింపు కోసం ప్రార్థిస్తారు. సృష్టిలోని మిగతా జీవరాశులన్నీ కూడా వారి శ్రేయస్సు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాయన్నమాట!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1388
హదీసు 1389
وَعَنْ أَبي الدَّرْداءِ، رضي اللَّه عَنْهُ، قَال: سمِعْتُ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يقولُ: "منْ سَلَكَ طَريقاً يَبْتَغِي فِيهِ علْماً سهَّل اللَّه لَه طَريقاً إِلَى الجنةِ، وَإنَّ الملائِكَةَ لَتَضَعُ أجْنِحَتَهَا لِطالب الْعِلْمِ رِضاً بِما يَصْنَعُ، وَإنَّ الْعالِم لَيَسْتَغْفِرُ لَهُ منْ في السَّمَواتِ ومنْ فِي الأرْضِ حتَّى الحِيتانُ في الماءِ، وفَضْلُ الْعَالِم عَلَى الْعابِدِ كَفَضْلِ الْقَمر عَلى سَائِرِ الْكَوَاكِبِ، وإنَّ الْعُلَماءَ وَرَثَةُ الأنْبِياءِ وإنَّ الأنْبِياءَ لَمْ يُورِّثُوا دِينَاراً وَلا دِرْهَماً وإنَّما ورَّثُوا الْعِلْمَ، فَمنْ أَخَذَهُ أَخَذَ بِحظٍّ وَافِرٍ". رواهُ أَبُو داود والترمذيُّ.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) తెలియ జేశారు: (ధర్మ) జ్ఞానాన్ని వెతుక్కుంటూ బయలుదేరే వారి కోసం దేవుడు వారు నడిచే మార్గం గుండా స్వర్గమార్గాన్ని సుగమం చేస్తాడు. విద్యార్థి చేసే పనుల పట్ల ప్రసన్నులై దైవదూతలు అతని గౌరవార్ధం తమ రెక్కలు ముడుచుకుంటారు. భూమ్యాకాశాలలో ఉన్నవారు, ఆఖరికి నీళ్ళలో ఉండే చేపలు కూడా జ్ఞానుల మన్నింపు కోసం ప్రార్థిస్తూ ఉంటాయి. చంద్రునికి ఇతర నక్షత్రాల మీద ఎంత విశిష్టత ఉందో జ్ఞానులకు ఆరాధకుల మీద అంత విశిష్టత ఉంది. జ్ఞానులు దైవప్రవక్తల వారసులు. దైవప్రవక్తలు తమ వారసుల కోసం దిర్హాంలు, దీనార్లు (మొదలగు ధనసంపదలు) వదలి వెళ్ళరు. వారు కేవలం జ్ఞానం మాత్రమే వదలి వెళ్లారు. కనుక ఎవరయితే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారో వారు ఓ గొప్ప భాగ్యాన్ని పొందినట్లే.
(అబూదావూద్, తిర్మిజీ)
(సుననె అబూదావూద్లోని విద్యాప్రకరణం – సుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం)
English
Abud-Darda (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who follows a path in quest of knowledge, Allah will make the path of Jannah easy to him. The angels lower their wings over the seeker of knowledge, being pleased with what he does. The inhabitants of the heavens and the earth and even the fish in the depth of the oceans seek forgiveness for him. The superiority of the learned man over the devout worshipper is like that of the full moon to the rest of the stars (i.e., in brightness). The learned are the heirs of the Prophets who bequeath neither dinar nor dirham but only that of knowledge; and he who acquires it, has in fact acquired an abundant portion.”[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1389
హదీసు 1390
وعنِ ابن مسْعُودٍ، رضي اللَّه عنْهُ، قالَ: سمِعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "نَضَّرَ اللَّه امْرءاً سمِع مِنا شَيْئاً، فبَلَّغَهُ كَمَا سَمعَهُ فَرُبَّ مُبَلَّغٍ أوْعى مِنْ سَامِع ". رواهُ الترمذيُّ وقال: حديثٌ حَسنٌ صَحيحٌ.
దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె మస్వూద్ (రదియల్లాహు అన్హు) తెలియ జేశారు: "మా నుండి ఏదయినా విషయం విని దాన్ని యధాతథంగా ఇతరులకు చేరవేసిన వ్యక్తిని దేవుడు చల్లగా చూడుగాక! మా సందేశం చేరుకున్న వ్యక్తుల్లో కొందరు మా నుండి విషయాన్ని విన్నవారికంటే ఎక్కువ గుర్తుంచుకునేవారయి ఉండవచ్చు." (తిర్మిజీ-హసన్, సహీహ్)
(సుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం)
ముఖ్యాంశాలు:
ఈ హదీసు విద్యార్జన, ధర్మప్రచార కార్యాల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది.
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “May Allah freshen the affairs of a person who hears something from us and communicates it to others exactly as he has heard it (i.e., both the meaning and the words). Many a recepient of knowledge understands it better than the one who has heard it.”[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1390
హదీసు 1391
وعن أَبي هُريرةَ، رضي اللَّه عنْهُ، قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"منْ سُئِل عنْ عِلمٍ فَكَتَمَهُ، أُلجِم يَومَ القِيامةِ بِلِجامٍ مِنْ نَارٍ".رواهُ أَبو داود والترمذي، وَقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా తనను ధర్మసందేహం గురించి అడిగితే (తనకు తెలిసికూడా) ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టిన వ్యక్తి (నోటి)కి ప్రళయదినాన నిప్పుకళ్ళెం బిగిస్తారు.
(అబూదావూద్, తిర్మిజీ-హసన్)
(సుననె అబూదావూద్లోని విద్యా ప్రకరణం – సుననె తిర్మిజీలోని విద్య అధ్యాయం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who is asked about knowledge (of religion) and conceals it, will be bridled with a bridle of fire on the Day of Resurrection.”[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1391
హదీసు 1392
وعنه قَالَ: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ تَعلَّمَ عِلماً مِما يُبتَغَى بِهِ وَجْهُ اللَّهِ عز وَجَلَّ لا يَتَعلَّمُهُ إِلاَّ ليصِيبَ بِهِ عَرَضاً مِنَ الدُّنْيا لَمْ يجِدْ عَرْفَ الجنَّةِ يوْم القِيامةِ "يَعْنِي: رِيحَهَا، رواه أَبُو داود بإسناد صحيح.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారి మరొక కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: దైవప్రసన్నత కోసం నేర్చుకునే విద్యని ఎవడైనా కేవలం ప్రాపంచిక ప్రయోజనాల కోసం నేర్చుకుంటే – అలాంటి వ్యక్తి ప్రళయదినాన స్వర్గసువాసన కూడా పొందలేడు. (అబూదావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికి తీశారు)
(సుననె అబూదావూద్లోని విద్యాప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who does not acquire knowledge with the sole intention of seeking the Pleasure of Allah but for worldly gain, will not smell the fragrance of Jannah on the Day of Resurrection.”[Abu Dawud].
ముఖ్యాంశాలు
ధర్మజ్ఞానాన్ని కేవలం దైవప్రసన్నత కోసం ఆర్జించాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. ఒకవేళ ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మజ్ఞానాన్ని ఆర్జిస్తే అది మహానేరంగా పరిగణించబడుతుంది. అలాంటివారు పరలోకంలో స్వర్గ సువాసన కూడా పొందలేరు. అయితే ఆశించకుండానే ఏమైనా ప్రతిఫలం దొరికితే అది వేరే విషయం. దాన్ని పుచ్చుకోవడంలో ఎలాంటి పాపం లేదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1392
హదీసు 1393
وعنْ عبدِ اللَّه بن عمرو بن العاص رضي اللَّه عَنهُما قَالَ: سمِعتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول:"إنَّ اللَّه لاَ يقْبِض العِلْم انْتِزَاعاً ينْتزِعُهُ مِنَ النَّاسِ، ولكِنْ يقْبِضُ العِلْمَ بِقَبْضِ العُلَماءِ حتَّى إِذَا لمْ يُبْقِ عَالِماً، اتَّخَذَ النَّاسُ رُؤوساً جُهَّالاً فَسئِلُوا، فأفْتَوْا بغَيْرِ علمٍ، فَضَلُّوا وأَضَلُّوا" متفقٌ عَلَيْهِ. كتابُ حمد الله تعالى وشكره
దైవప్రవక్త ﷺ ఇలా ఉద్బోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: దేవుడు జ్ఞానాన్ని ప్రజల హృదయాల నుండి లాక్కొని పైకిలేపుకోడు. అలాగాకుండా ఆయన ముందుగా జ్ఞానుల మరణం ద్వారా జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఆ విధంగా ఒక్క జ్ఞానిని కూడా మిగలకుండా చేస్తాడు. ఆ తర్వాత ప్రజలు చదువులేని వారిని తమ గురువులుగా (నాయకులుగా) చేసుకుంటారు. వారిని ఏదయినా అడిగితే వారు తమ అజ్ఞానంతోనే తీర్పులు ఇస్తారు. ఫలితంగా తామూ భ్రష్టులవుతారు. ఇతరుల్ని కూడా భ్రష్టు పట్టిస్తారు.
(బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలోని విద్యా ప్రకరణాలు)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: I heard the Messenger of Allah ﷺ saying: “Verily, Allah does not take away knowledge by snatching it from the people, but He takes it away by taking away (the lives of) the religious scholars till none of the scholars stays alive. Then the people will take ignorant ones as their leaders, who, when asked to deliver religious verdicts, will issue them without knowledge, the result being that they will go astray and will lead others astray.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ప్రళయానికి ముందు పొడసూపే ఆనవాళ్ళలో ఇది ఒకటి. ఆ కాలంలో పండితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నిజమైన ధర్మజ్ఞానం కలవాళ్ళు లేకుండా పోతారు. అలాంటి పరిస్థితుల్లో అజ్ఞానులే తమంతట తాముగా నాయకులు, ఇమాములై కూర్చుంటారు. వారికి ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం లేశమైనా ఉండదు. అయినప్పటికీ వారు ముఫ్తీలుగా, ముజ్తహిద్లుగా చెలామణి అవుతారు. తమ తీర్పుల ద్వారా, స్వయం కల్పిత తీర్మానాల ద్వారా తామూ మార్గభ్రష్టులవుతారు. ఇతరుల్ని కూడా భ్రష్టత్వానికి గురిచేస్తారు. అందుకని భావితరాల కోసం వీలైనంత ఎక్కువమంది ధర్మజ్ఞానుల్ని తయారు చేయాలనీ, అదే సమయంలో అజ్ఞానుల్ని ధర్మనాయకులుగా నియమించకుండా జాగ్రత్తపడాలని ఈ హదీసు తాకీదు చేస్తోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|విజ్ఞాన ప్రకరణం|241. విజ్ఞానం ఘనత|హదీసు 1393
You must be logged in to post a comment.