హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 240. కొనుగోలు అమ్మకాల్లో మృదువుగా వ్యవహరించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 240వ అధ్యాయం: కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి. ఈ అధ్యాయంలో 3 ఖుర్ఆన్ ఆయతులు, 9 హదీసులు (హదీసు 1368 – 1376) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి

↑ విషయ సూచిక

باب فضل السَّماحةِ في البيع والشراء والأخذ والعطاء، وحسن القضاء والتقاضي، وإرجاح المكيال والميزان، والنَّهي عن التطفيف، وفضل إنظار الموسِر المُعْسر والوضع عَنْهُ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

దివ్యఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ} [البقرة: ٢١٥]

"మీరు ఏ మేలు చేసినా దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు." (బఖర: 215)

{وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ وَلا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ} [هود: ٨٥]

"నా జాతి ప్రజలారా! కచ్చితంగా న్యాయంగా, పూర్తిగా కొలవండి, తూయండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువచేసి ఇవ్వకండి." (హూద్: 85)

{وَيْلٌ لِلْمُطَفِّفِينَ الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ وَإِذَا كَالُوهُمْ أَوْ وَزَنُوهُمْ يُخْسِرُونَ أَلا يَظُنُّ أُولَئِكَ أَنَّهُمْ مَبْعُوثُونَ يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ} [المطففين: ١-٦]

"తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది. వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు. వారికి కొలిచి గాని తూచిగాని ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. ఒక మహాదినం నాడు వారు బ్రతికించి తీసుకురాబడనున్నారని వారికి తెలియదా? ఆ రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు." (ముతఫ్ఫిఫీన్: 1-6)

English

“And whatever you do of good deeds, truly, Allah knows it well.” [Al-Baqarah 2:215]

“And O my people! Give full measure and weight in justice and reduce not the things that are due to the people.” [Hūd 11:85]

“Woe to Al-Mutaffifun (those who give less in measure and weight). Those who, when they have to receive by measure from men, demand full measure. And when they have to give by measure or weight to (other) men, give less than due. Do they not think that they will be resurrected (for reckoning). On a Great Day? The Day when (all) mankind will stand before the Rubb of the `Alamin (mankind, jinn and all that exists)?” [Al-Muṭaffifīn 83:1–6]

1368

హదీసు 1368

وعَنٌْ أبي هُريرة، رضِيَ اللَّه عنْهُ، أَنَّ رجُلاً أَتَى النَّبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يتَقاضَاهُ فَأَغْلَظَ لَهُ، فَهَمَّ بِهِ أَصْحابُهُ، فَقَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"دعُوهُ فَإنَّ لِصَاحِبِ الحَقِّ مقَالاً"ثُمَّ قَالَ:"أَعْطُوه سِنًّا مِثْلَ سِنِّهِ"قالوا: يَا رسولَ اللَّهِ لا نَجِدُ إلاَّ أَمْثَل مِنْ سِنِّهِ، قَالَ:"أَعْطُوهُ فَإنَّ خَيْرَكُم أَحْسنُكُمْ قَضَاءً "متفقٌ عليه. [باب فضل السماحة في البيع والشراء] …

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి ఆయన్ని (తన దగ్గర తీసుకున్న అప్పు) తిరిగిచ్చేయమని అడిగాడు. అడగటం కూడా చాలా కరకుగా అడిగాడు. అది చూసి ఆయన సహచరులు (ఉండబట్టలేక) అతన్ని చితకబాద బోయారు. కాని ఆయన వారిని వారిస్తూ, "అతడ్ని అడగనివ్వండి. తనకు సొమ్ము రావలసిన వాడికి అడిగే హక్కుంది" అని అన్నారు.

తర్వాత తన సహచరుల్ని "ఇతనికి, ఇతను మాకిచ్చిన వయసు పశువు ఇచ్చేయండి" అని ఆదేశించారు. దానికి సహచరులు, "అలాంటిది మన దగ్గర లేదు దైవప్రవక్తా! అంతకంటే పెద్దదయితే ఉంది" అని అన్నారు. "సరే, అదే ఇవ్వండతనికి. ఉత్తమంగా అప్పు తీర్చేవారే మీలో ఉత్తములన్న సంగతిని గుర్తుపెట్టుకోండి" అని అన్నారు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని వకాలా ప్రకరణం – సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: A man demanded of the Prophet ﷺ for repayment of a loan and was harsh to him. His Companions were about to attack him, but he ﷺ said, “Leave him, as the creditor is entitled to make a demand. Give him a camel of the same age as the camel that is due to him.” They said: “We find a better camel senior to it in age.” He ﷺ said, “Then buy it and give it to him; verily the best of you is the one who is the best in discharging his obligations (repayment of loans).”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

1) దైవప్రవక్త ﷺకు అప్పిచ్చిన వ్యక్తి జైద్ బిన్ షోబా కినానీ (రదియల్లాహు అన్హు) అని కొంత మంది అంటారు. ఆయన స్వయానా దైవప్రవక్త సహచరులు. కాని అసలు విషయం ఏమిటంటే అప్పటికింకా ఆయన ఇస్లాం స్వీకరించలేదు. అందుకే దైవప్రవక్త గౌరవమర్యాదల్ని లెక్కచేయక అప్పు విషయంలో ఆయన పట్ల కరకుగా వ్యవహరించారు. ఆ సందర్భంగా ఆయన సహచరులు జైద్ మీద చేయి చేసుకోబోతే ఆయన వారిని వారించారు. "రుణదాత రుణగ్రహీతను తన అప్పు తిరిగిచ్చేయమని అడిగినప్పుడు మంచితనంగా అడగాలి. ఇదే ఉత్తమ పద్ధతి. ఒకవేళ అతను దబాయించి అడిగినా అందులో ఆక్షేపించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే రుణదాతకు అప్పు గురించి అడిగే హక్కుంది కనుక" అని దైవప్రవక్త సహచరులకు బోధించారు. అయితే తనకు హక్కుంది కదా అని రుణదాత షరీఅత్ ఆదేశాలను తుంగలో తొక్కి రుణగ్రహీత మీద వీరంగం కూడా చేయకూడదు.

2) రుణగ్రహీత అప్పుతీర్చేటప్పుడు తన ఇష్టంతో తీసుకున్న అప్పు కంటే ఎక్కువ ఇవ్వదలచుకుంటే అందులో తప్పులేదు. పైగా తీసుకున్న అప్పును వీలైనంత ఉత్తమరీతిలో తీర్చటం మంచిపద్ధతి కూడా. అలాగాకుండా ఒకవేళ రుణదాత అప్పుకన్నా ఎక్కువ ఇవ్వమని ఒత్తిడి తెస్తే ఆ అదనపు సొమ్ము 'వడ్డీ'గా భావింపబడుతుంది. వడ్డీ ఇవ్వటం, తీసుకోవటం రెండూ అధర్మ కార్యాలే.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1368

1369

హదీసు 1369

وعَنْ جابرٍ، رضي اللَّه عنْهُ، أن رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "رَحِم اللَّه رجُلا سَمْحاً إِذَا بَاع، وَإذا اشْتَرى، وَإذا اقْتَضىَ". رواه البخاريُّ.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు, అప్పు తిరిగిచ్చేయమని అడిగినప్పుడు మృదువుగా వ్యవహరించే వ్యక్తిని దేవుడు కరుణించుగాక! (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “May Allah show mercy to a man who adopts a kind attitude when he sells, buys and demands for the repayment of loans.”[Al-Bukhari].

ముఖ్యాంశాలు

కొనుగోలు చేసినప్పుడు మృదువుగా వ్యవహరించటమంటే అమ్మేవారికి నష్టమొచ్చే విధంగా బేరమాడకూడదని భావం. అదే విధంగా అమ్మేవారు కూడా కొనుగోలుదారుల మీద తలకుమించిన భారం వేసి, ధరలు ఎక్కువగా చెప్పి వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఏదయినా వస్తువు వారు వాపసు చేయదలిస్తే తీసుకోవాలి. పై హదీసుని మనం మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే- వస్తువుని కొనేటప్పుడు అమ్మకం దారునికి దాని ఖరీదు పూర్తిగా ఇచ్చేయాలి. అమ్మేటప్పుడు కొనుగొలుదారులకు వారి వస్తువులు ఎలాంటి తగ్గింపు చేయకుండా ఇవ్వాలి.

పోతే మూడో విషయం- ఇతరుల నుండి తమకు ఏదయినా రావలసి ఉంటే దాన్ని అడగటంలో కాఠిన్యతను ప్రదర్శించేబదులు మృదువుగా అడగాలి. ఎదుటి వ్యక్తి పరువు మర్యాదలకు విఘాతం కలిగేలా వ్యవహరించకూడదు. ఆ వ్యక్తి పేదవాడయితే అతనికి తగినంత గడువునివ్వాలి. అసలు రుణమే మాఫీ చేస్తే అది ఇంకా మంచిది. (బఖర: 280)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1369

1370

హదీసు 1370

وعَنْ أَبي قَتَادَةَ، رضي اللَّه عَنْهُ، قَالَ: سمِعْتُ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "مَنْ سَرَّهُ أَنْ يُنَجِّيَهُ اللَّه مِنْ كُرَبِ يَوْمِ القِيَامَةِ، فَلْيُنَفِّسْ عَنْ مُعْسِرٍ أوْ يَضَعْ عَنْهُ" رواهُ مسلمٌ.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) తెలియ జేశారు: ప్రళయ దినాన కలిగే తీవ్రమైన వ్యాకులత నుండి దేవుడు తనను కాపాడాలని కోరుకునే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవానికి (అప్పు తీర్చే విషయంలో) తగినంత వ్యవధి నివ్వాలి లేదా అసలు మొత్తం రుణాన్నే మాఫీ చేసేయాలి. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)

English

Abu Qatadah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who likes Allah to deliver him from the calamities of the Day of Resurrection, let him either give respite to a debtor or grant him remission (of loans) in straitened circumstances.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1370

1371

హదీసు 1371

وعنْ أبي هُريرةَ، رضي اللَّه عَنْهُ، أنَّ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "كَانَ رجلٌ يُدايِنُ النَّاسَ، وَكَان يَقُولُ لِفَتَاهُ: إِذَا أَتَيْتَ مُعْسِراً فَتَجاوزْ عَنْهُ، لَعلَّ اللَّه أنْ يَتجاوزَ عنَّا فَلقِي اللَّه فَتَجاوَزَ عنْهُ" متفقٌ عَليهِ.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈవిధంగా ప్రవచించారు: ఒక వ్యక్తి ప్రజలకు రుణాలిచ్చేవాడు. అతను తన నౌకరుకి, "నువ్వు అప్పు వసూలు చేసుకోవటానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వీలైనంతవరకు అతన్ని ఉపేక్షించు. అలాచేస్తే బహుశా దేవుడు కూడా మనల్ని (మన పాపాల విషయంలో) ఉపేక్షించవచ్చు" అని చెప్పేవాడు. ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకున్నప్పుడు (అంటే మరణించినప్పుడు) దేవుడు నిజంగానే (అతని పాపాలను) ఉపేక్షించాడు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలలోని లావాదేవీల ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “There was a person who used to loan money to the people and he used to say to his servant: `When an insolvent person comes to you, show him leniency so that Allah may forbear our faults.’ So when he met Allah (i.e., when he died), Allah forgave him.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఇక్కడ 'ఉపేక్షించు' అన్న మాటలోనే, అప్పు తీర్చమని ఉత్తమరీతిలో అడగటం, మరింత గడువు ఇవ్వటం, అప్పుని పూర్తిగా మాఫీ చేసేయటం అనే అర్ధాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ మూడు గుణాలూ విశ్వాసుల్లో పెంపొందాలని ఇస్లామియ షరీఅత్ కోరుతోంది. అంతేకాదు, అలాంటి సుగుణ సంపన్నుల్ని వేన్నోళ్లా పొగుడుతోంది. ఈ సంఘటన పూర్వకాలంలో ఎవరిదై ఉంటుందోగాని, వారి ఆదర్శాన్ని మాత్రం దైవప్రవక్త మెచ్చుకున్నారు. కేవలం మెచ్చుకోవటమే కాదు ఆ ఆదర్శాన్ని తన అనుచరులు కూడా ఆచరణలో పెట్టాలని ప్రబోధించారు. కనుక నిరుపేదల పట్ల సడలింపుల వైఖరిని అవలంబించేవారిని దేవుడు కూడా మెచ్చుకుంటాడన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1371

1372

హదీసు 1372

وعَنْ أَبي مسْعُودٍ البدْرِيِّ، رضي اللَّه عنْهُ، قَال: قَالَ رَسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "حُوسب رَجُلٌ مِمَّنْ كَانَ قَبْلَكُمْ فَلَمْ يُوجدْ لَهُ مِنَ الخَيْرِ شَيءٌ، إلاَّ أَنَّهُ كَان يَُخَالِطُ النَّاس، وَكَانَ مُوسِراً، وَكَانَ يأْمُرُ غِلْمَانَه أنْ يَتَجَاوَزُوا عَن المُعْسِر. قَالَ اللَّه، عزَّ وجَلَّ:"نَحْنُ أحقُّ بِذَلكَ مِنْهُ، تَجاوَزُوا عَنْهُ" رواه مسلمٌ.

హజ్రత్ అబూ మస్‌వూద్ బద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: మీకు పూర్వం (జాతుల్లోని) ఒక వ్యక్తి (మరణించాడు. తర్వాత అతని) కర్మల లెక్క తీసుకోవటం జరిగింది. అతని (కర్మల చిట్టాలో) సత్కర్మ ఒక్కటీ కనిపించలేదు. అయితే అతను (జీవితంలో) ఒక మంచి పనిమాత్రం చేశాడు. అదేమిటంటే- అతను ప్రజలతో లావాదేవీల వ్యవహారం జరిపేవాడు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న అతను, (లావాదేవీల విషయాల్లో) నిరుపేదల పట్ల ఉపేక్షాభావంతో వ్యవహరించండి' అని తన క్రింద పనిచేసే బానిసలకు తాకీదు చేసేవాడు. (అందుకని అతని మరణానంతరం కర్మల విచారణ జరిపినప్పుడు, దేవుడు "మేము ఇతని కంటే ఎక్కువ ఉపేక్షాభావంతో వ్యవహరించగలం. మీరు కూడా ఇతణ్ణి (అంటే ఇతని పాపాలను) ఉపేక్షించండి" అని (తన దూతలను) ఆదేశించాడు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)

English

Abu Mas`ud Al-Badri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A person from amongst the people who lived before you was called to account by Allah on the Day of Resurrection. No good deeds were found in his credit except that he being a rich man had (financial) dealings with people and had commanded his servants to show leniency to those who were in straitened circumstances. Upon this Allah, the Exalted, and Majestic said: `I am more entitled to this attribute, so waive (his faults).”’[Muslim].

ముఖ్యాంశాలు

వాస్తవానికి ప్రళయం సంభవించేంతవరకు ఎవరి కర్మల విచారణా తెమలదు. మరి దైవప్రవక్త ﷺ ఈ సంఘటన వివరించారంటే భవిష్యత్తులో ప్రళయం తర్వాత, పరలోకంలో జరగబోయేదాని గురించి దేవుని వాణి ద్వారా తెలుసుకొని ఆయన తన సహచరులకు చెప్పినదేకాని ఆ వ్యక్తి విచారణ నిజంగా జరగలేదు. అయితే పరలోకంలో ఆ వ్యక్తి పట్ల అలాంటి వ్యవహారమే జరగబోతుందన్న విషయం మాత్రం వాస్తవం. మొత్తానికి ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే ఇతరుల పట్ల మన్నింపుల, సడలింపుల వైఖరిని అవలంబిస్తే దేవుడు కూడా వారిపట్ల అలాగే వ్యవహరిస్తాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1372

1373

హదీసు 1373

وعنْ حُذَيْفَةَ، رضي اللَّه عنْهُ، قَالَ:"أُتِى اللَّه تَعالى بِعَبْد مِنْ عِبَادِهِ آتاهُ اللَّه مَالاً، فَقَالَ لَهُ: ماذَا عمِلْتَ في الدُّنْيَا؟ قَالَ: وَلا يَكْتُمُونَ اللَّه حديثاً قَال: يَاربِّ آتَيْتَنِي مالَكَ فَكُنْتُ أُبايِعُ النَّاسَ، وَكانَ مِنْ خُلُقي الجوازُ، فكُنْتُ أَتَيَسرُ عَلى المُوسِرِ، وأُنْظِرُ المُعْسِر. فَقَالَ اللَّه تَعَالى:"أَنَا أَحقُّ بِذا مِنْكَ، تجاوزُوا عَنْ عبْدِي" فَقَالَ عُقْبَةُ بنُ عامرٍ، وأَبو مَسْعُودٍ الأنصاريُّ، رَضِيَ اللَّه عنْهُما: هكَذا سَمِعْنَاهُ مِنْ فيِّ رَسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. رواهُ مسلمٌ.

హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)కథనం: దేవుని దాసుల్లోని ఒకతన్ని దైవసన్నిధిలో హాజరుపరచటం జరిగింది. (ప్రపంచ జీవితంలో) దేవుడు అతనికి సిరిసంపదలు ఒసగాడు. "నువ్వు ప్రపంచంలో ఏం చేశావు" అని దేవుడు అతన్ని అడిగాడు. మానవులు దేవుని ముందు ఏ విషయాన్నీ దాచలేరు. కనుక అతను "ప్రభూ! నువ్వు నాకు నీ సంపదనిచ్చావు. నేను ప్రజలతో లావాదేవీల వ్యవహారాలు నడిపేవాణ్ణి. (ప్రజలు నా దగ్గర తీసుకున్న అప్పుల్ని) ఉపేక్షించటం నాకలవాటు. నేను స్తోమత గలవారికి సౌలభ్యాన్ని కలుగజేసేవాణ్ణి. (వారు నాసిరకం వస్తువులు ఇచ్చినా తీసుకునేవాణ్ణి) నిరుపేదలకయితే (కావలసినంత) గడువు ఇచ్చేవాణ్ణి" అని చెప్పాడు. అందుకు దేవుడు, "నేను నీకంటే ఎక్కువగా ఉపేక్షించేవాణ్ణి" అని చెప్పి "ఈ నా దాసుని (పాపాలను) ఉపేక్షించండి" అని తన దూతల్ని ఆదేశించాడు.

ఉఖ్‌బా బిన్ ఆమిర్ మరియు అబూ మస్‌వూద్ (రదియల్లాహు అన్హుమా)లు "మేము కూడా దైవప్రవక్త నోట ఈ మాట ఇలాగే విన్నాం" అని చెప్పారు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)

English

Hudhaifah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A slave of Allah whom He had endowed with wealth, will be brought before Him. Allah will ask him: `What did you do in the world?’ (They cannot conceal anything from Allah.) He will say: `O my Rubb, You endowed me with Your wealth; I used to enter into transactions with people and it was my nature to be lenient to the insolvent ones. I used to give respite to those who were in straitened circumstances.’ Whereupon Allah will say: `I am more entitled than you to do this. So forgive my slave‘.” `Uqbah bin `Amir and Abu Mas`ud Al-Ansari (radiyallahu anhuma) said, “Thus we heard it from the Messenger of Allah ﷺ.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1373

1374

హదీసు 1374

وعنْ أَبي هُريرَةَ، رضي اللَّه عنْه، قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:" مَنْ أَنْظَر مُعْسِراً أوْ وَضَعَ لَهُ، أظلَّهُ اللَّه يَوْمَ القِيامَةِ تَحْتَ ظِلِّ عَرْشِهِ يَوْمَ لا ظِلَّ إلاَّ ظِلُّهُ ". رواهُ الترمذيُّ وقَال: حديثٌ حسنٌ صحيحٌ. كتابُ العِلم

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తగినంత వ్యవధి నిచ్చేవారిని లేక అసలు రుణాన్ని మాఫీ చేసేసేవారిని ప్రళయదినాన దేవుడు తన సింహాసనం నీడలో చోటిస్తాడు. ఆ రోజు ఆయన నీడ తప్ప మరే నీడా ఉండదు సుమా!

(తిర్మిజీ-హసన్, సహీహ్)

(సుననె తిర్మిజీలోని లావాదేవీల అధ్యాయాలు)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who gives respite to someone who is in straitened circumstances, or grants him remission, Allah will shelter him in the shade of His Throne, on the Day of Resurrection, when there will be no shade except its shade.”[At-Tirmidhi].

ముఖ్యాంశాలు

ప్రళయానంతరం ఆది నుండి అంతం వరకు మానవులందరూ హష్ర్ మైదానంలో సమీకరించబడి ఉన్నప్పుడు సూర్యుడు వారికి అతి దగ్గరగా వస్తాడు. దాని వేడికి మానవులు చెమటలో మునిగిపోయి ఉంటారు. తీవ్రమైన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు. ఆ సమయంలో దైవ సింహాసనం నీడ దొరికినవారు మహా అదృష్టవంతులు. అలాంటి అదృష్టవంతుల్లో నిరుపేదలకు ఋణాలిచ్చి వారిపట్ల మృదువుగా వ్యవహరించేవారు కూడా ఉంటారు. వారు నిరుపేదలకు ఋణాలిచ్చి వారికి తగినంత గడువు ఇస్తారు లేదా ఆ రుణాన్ని మాఫీ చేస్తారు. ఈ హదీసు చూచాయగా ధనవంతుల్ని దానధర్మాల వైపుకు ప్రేరేపిస్తోంది.

ఈ రోజుల్లో ప్రజలు ధనవంతులకయితే ఋణాలిస్తారు గాని నిరుపేదలకు ఎవరూ రుణాలివ్వరు. పేదవారికి అప్పులిస్తే తమ సొమ్ము తిరిగి రాదేమోనని భయపడతారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారి అప్పుల్ని మాఫీ చేసే నైతిక విధిని మనం పూర్తిగా విస్మరించాం. ఇవ్వగలిగే స్తోమత ఉండికూడా అవసరాల్లో ఉన్న నిరుపేదలకు అప్పు ఇవ్వకుండా ఉండటం ఎంతో అవాంఛనీయమైన విషయం. దీనికి భిన్నంగా అలాంటి వారికి రుణాలిచ్చి వారికి తగినంత వ్యవధినివ్వటం, అప్పులో ఎంతో కొంత వీలైతే పూర్తిగా మాఫీ చేయటం ఎంతో మంచి పద్ధతి. అందుకుగాను పరలోకంలో గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1374

1375

హదీసు 1375

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన దగ్గర ఒక ఒంటె కొన్నారు. అందుకాయన తనకు ఆ ఒంటె ఖరీదు బాగా మొగ్గినట్లు తూచి ఇచ్చారు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం – సహీహ్ ముస్లింలోని లావాదేవీల ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: The Prophet ﷺ purchased a camel from me and weighed more than its price.[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త హయాంలో, ఆ తర్వాత చాలా కాలం వరకు దిర్హమ్, దీనార్ల ద్వారానే లావాదేవీలు జరిగేవి. దీనారు బంగారు నాణెంగానూ, దిర్హమ్ వెండి నాణెంగానూ ఉండేది. ఆ కాలంలో ఒంటె దీనారు, దిర్హమ్‌లలోనే వెలకట్టబడేది. అందుకే దైవప్రవక్త-స- ఒంటె వెలను తూచి ఇచ్చారు. నిర్ణీత బరువుకన్నా కాస్త అధికంగానే ఇచ్చారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1375

1376

హదీసు 1376

హజ్రత్ అబూ సఫ్వాన్ సువైద్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను మరియు మఖ్రమా అబ్దీ ఇద్దరం 'హజన్' అనే ప్రాంతం నుంచి కొంత గుడ్డ (అమ్మటం కోసం) తెచ్చాం. అప్పుడు దైవప్రవక్త ﷺ మా దగ్గరకొచ్చి ఒక షరాయి కోసం బేరమాడారు. నా దగ్గర ఒక తూకందారు ఉండేవాడు. అతను ఇవ్వవలసిన వస్తువులు తూకంవేసి ఇచ్చేవాడు. దైవప్రవక్త ﷺ అతన్ని ఉద్దేశించి, "తూయి, బాగా మొగ్గినట్టు తూయి" అని అన్నారు. (అబూదావూద్, తిర్మిజీ- హసన్, సహీహ్)

(సుననె అబూదావూద్‌లోని లావాదేవీల ప్రకరణం – సుననె తిర్మిజీలోని లావాదేవీల ప్రకరణం)

English

Abu Safwan Suwaid bin Qais (radiyallahu anhu) reported: Makhramah Al-`Abdi and I procured some drapery from Hajar and brought them to Makkah. The Prophet ﷺ came and bargained with us for some trousers and we sold them to him. We had a person who weighed the cloth in order to fix the price. The Prophet ﷺ said to him, “Weigh and add a little to it.”[Abu Dawud and At-Tirmidhi].

ముఖ్యాంశాలు

కొనుగోలుదారుడు వస్తువుధరకన్నా ఎక్కువ ఇవ్వటానికి ప్రయత్నించాలి. అలాగే అమ్మకందారుడు కొనుగోలుదారుకి ఇవ్వవలసిన వస్తువులకన్నా కొంచెం అధికంగానే ఇవ్వాలి. ఇది ఉత్తమ పద్ధతి. దీనివల్ల సమాజంలో శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. దీనికి భిన్నంగా ఒండొకరి హక్కులకు గండి కొట్టటానికి ప్రయత్నిస్తే పరస్పర విద్వేష వైషమ్యాలు పెరిగి అశాంతి అల్లకల్లోలమైన వాతావరణం ఏర్పడుతుంది. అది సమాజ మనుగడకే గొడ్డలిపెట్టు అవుతుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|240. కొనుగోలు అమ్మకాల్లో ఇచ్చిపుచ్చుకోవటాల్లో మృదువుగా వ్యవహరించాలి, ఇతరుల హక్కుల్ని తీర్చినప్పుడు లేదా వారి నుండి ఏదయినా ఆశించినప్పుడు ఉత్తమంగా ప్రవర్తించాలి. తూచి లేదా కొలిచి ఇచ్చేటప్పుడు కాస్తంత మొగ్గుతోనే ఇవ్వాలి, తక్కువగా తూచి లేదా కొలిచి ఇవ్వకూడదు. తాము సంపన్నుల మయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి అప్పు విషయంలో సడలింపుల వైఖరిని అవలంబించాలి, వీలైతే అప్పుని మాఫీ చేయాలి|హదీసు 1376