హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 239వ అధ్యాయం: ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1367) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
239. ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం
باب فضل العبادةِ في الهرج وَهُوَ الاختلاط والفتن ونحوها
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1367
عنْ مَعقِلِ بن يسارٍ، رضي اللَّه عنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " العِبَادَةُ في الهَرْجِ كهِجْرةٍ إلَيَّ" رواهُ مُسْلمٌ.
హజ్రత్ మాఖిల్ బిన్ యసార్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: కల్లోలాలు, ఉపద్రవాల కాలంలో దైవారాధన చేయటం నా దగ్గరకు వలస రావటంతో సమానం. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపద్రవాల ప్రకరణం)
English
Ma`qil bin Yasar (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The reward of worship performed at a time of trials is equal in reward to an emigration to me.”[Muslim].
ముఖ్యాంశాలు
మక్కా అవిశ్వాసుల ఆగడాలు, వేధింపులు తారాస్థాయికి చేరుకున్నప్పుడు మహాప్రవక్త ﷺ మక్కా నుండి మదీనాకు వెళ్ళవలసి వచ్చింది. దాన్నే 'హిజ్రత్' అన్నారు. దైవప్రవక్త మదీనాకు వలస వెళ్ళిన తర్వాత ఇతర ముస్లింలు కూడా వీలైతే తప్పకుండా ఆయన వద్దకు, అంటే మదీనాకు వలస వెళ్ళాలన్న ఆదేశం అవతరించింది. ఆ కాలంలో మదీనాకు వలస వెళ్ళటమంటే సామాన్య విషయం కాదు. అవిశ్వాసుల కళ్ళుగప్పి, ప్రాణాలకు తెగించి వారితో పోరాడి వెళ్ళవలసి వచ్చేది. ఒక సుప్రసిద్ధ సహచరుడయితే తాను సంపాయించిన లక్షల ఆస్తిని అవిశ్వాసులకు పరిహారంగా ఇచ్చి మదీనాకు ప్రస్థానం చేశారు. దీనిద్వారా ఆ రోజుల్లో మదీనా ప్రస్థానం ఎంత పుణ్యప్రదమైన విషయంగా భావించబడేదో అర్ధమవుతుంది.
పై హదీసులో సర్వత్రా కల్లోలాలు వ్యాపించి ధర్మాన్ని ఆచరించటమే కష్టమైపోయే ఉపద్రవభరిత యుగంలో ఆరాధన చేయటం తన వద్దకు వలస రావటంతో సమానమని, దానికీ హిజ్రత్ చేసినంత పుణ్యం లభిస్తుందని దైవప్రవక్త ﷺ ప్రకటించారు. దైవారాధన అంటే కేవలం నమాజులు, వ్రతాలు పాటించటమే కాదు. దేవునికి విధేయత చూపటం, దైవాజ్ఞల్ని పాటించటం, మంచిని గురించి ప్రజలకు బోధించటం, చెడుల నుండి వారిని వారించటం- ఇవన్నీ ఆరాధన క్రిందికే వస్తాయి. కల్లోల భరితమైన సమయంలో ఈ విధమైన దైవారాధన చేయటం కత్తిమీద సాము వంటిదే. అయినప్పటికీ పరిస్థితుల్ని మనో నిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కుంటూ సా[ధ]న చేసినవారికి, ఆరాధన నెరవేర్చినవారికి తప్పకుండా హిజ్రత్ చేసినంత పుణ్యం ల[భిస్తుంది.]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|జిహాద్ ప్రకరణం|239. ఉపద్రవ కాలంలో దైవారాధన చేయటం|హదీసు 1367
You must be logged in to post a comment.