హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 221. సహ్‌రీ భుజించటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 221వ అధ్యాయం: సహ్‌రీ భుజించటం, ఉషోదయం కానంతవరకు అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 1230 – 1233) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

221. సహ్‌రీ భుజించటం, ఉషోదయం కానంతవరకు అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం

↑ విషయ సూచిక

باب فَضْلِ السُّحورِ وتأخيرِهِ مَا لَمْ يَخْشَ طُلُوع الفَجْرِ

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1230

హదీసు 1230

عنْ أَنسٍ رَضِيَ اللَّه عَنْهُ قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"تَسَحَّرُوا فَإِنَّ في السُّحُورِ بَركَةً" متفقٌ عَلَيْهِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: సహ్‌రీ భోజనంలో శుభం ఉంది. అంచేత మీరు (తప్పకుండా) సహ్‌రీ భుజించండి.

(బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Eat Suhur (predawn meal). Surely, there is a blessing in Suhur.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

ఉపవాస దినాల్లో ఉషోదయానికి ముందు నిద్రలేచి సహ్‌రీ భుజించటం అభిలషణీయం. సాధారణంగా ఆ వేళప్పుడు మనిషికి అసలు అన్నం తినబుద్ధి కాదు. అయినప్పటికీ ఓపిగ్గా కొంచెం ఆహారమయినా తీసుకోవటం మంచిది. సహ్‌రీ భోజనంలో శుభం ఉంటుందనీ, అందువల్ల ఉపవాసం పాటించదలచుకున్నవారు సహ్‌రీ భుజించాలని దైవప్రవక్త ﷺ పదేపదే తాకీదు చేసేవారు. సహ్‌రీ భుజించకపోతే ఉపవాసి చాలా తొందరగా నీరసించిపోతాడు. దానివల్ల అతను పూర్తి ఏకాగ్రతతో దైవారాధనలో లీనం కాలేడు. ఉపవాసం అంటే శరీరాన్ని కృశింపజేసుకోవటం కాదు. దేవుడు ఎల్లప్పుడూ తన దాసుల సౌలభ్యాన్ని మాత్రమే కోరుకుంటాడు. దాసుల్ని ఇబ్బందులకు లోను చేయటం దేవుని అభిమతం ఎంతమాత్రం కాదు. కొంతమంది సహ్‌రీ వేళ నిద్రలేవటం కష్టంగా ఉంటుందని రాత్రిపూట పడుకునే ముందు పీకల దాకా మెక్కి నిద్రపోతారు. అలా చేయటం వల్ల సహ్‌రీ శుభాన్ని కోల్పోవటం తప్ప ఇతర ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా మరునాడు మధ్యాహ్నాని కల్లా వారు మళ్ళీ ఆకలితో అన్నం కోసం విలవిల్లాడిపోతారు. అంచేత సహజమైన, శుభకరమైన పద్ధతిలో దైవప్రవక్త ఆదేశానికి అనుగుణంగా ఉషోదయానికి కాసేపు ముందు నిద్రలేచి కొంచెమయినా సహ్‌రీ భుజిస్తే సాయంత్రం వరకు నిక్షేపంగా ఆరాధనలో కాలం గడపవచ్చు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|221. సహ్‌రీ భుజించటం, ఉషోదయం కానంతవరకు అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం|హదీసు 1230

1231

హదీసు 1231

وعن زيدِ بن ثابتٍ رَضيَ اللَّه عَنْهُ قَالَ: تَسحَّرْنَا مَعَ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ثُمَّ قُمْنَا إِلى الصَّلاةِ. قِيلَ: كَمْ كانَ بَيْنَهُمَا؟ قَالَ: قَدْرُ خَمْسينَ آيةً. متفقٌ عليه.

హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు మేము దైవప్రవక్త ﷺ వెంట సహ్‌రీ భుజించి ఆ తర్వాత నమాజ్ కోసం బయలుదేరాం.

"మీ సహ్‌రీ ముగింపుకూ- నమాజ్‌కు మధ్య ఎంత వ్యవధి ఉండిందని" ఎవరో అడగ్గా, అందుకాయన సమాధానమిస్తూ, "యాభై ఆయతులు పఠించగల వ్యవధి ఉండింది" అని చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

Zaid bin Thabit (radiyallahu anhu) reported: We took Suhur (predawn meal) with the Messenger of Allah ﷺ and then we stood up for (Fajr) Salat (prayer). It was asked: “How long was the gap between the two?” He replied: “The time required for the recitation of fifty Ayat.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

సహ్‌రీ భుజించటంలో ఆలస్యం చేయాలి. ఎప్పుడో అర్ధరాత్రి పూట నిద్రలేచి గబాగబా నాలుగు ముద్దలు తిని పడుకోవటం మంచి పద్ధతి కాదు. ఉషోదయం వరకు ఆలస్యం చేయాలి. అయితే ఉషోదయానికి ముందే సహ్‌రీ ముగించుకోవాలి సుమా! సహ్‌రీ ముగింపుకూ, ఉషోదయానికి మధ్య యాభై ఆయతులు పఠించగలిగేంత వ్యవధి ఉండేటట్లు చూసుకోవటం మంచిది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|221. సహ్‌రీ భుజించటం, ఉషోదయం కానంతవరకు అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం|హదీసు 1231

1232

హదీసు 1232

وَعَنِ ابنِ عُمَرَ رَضيَ اللَّه عَنْهُمَا، قالَ: كانَ لرسولِ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم مُؤَذِّنَانِ: بلالٌ وَابْنُ أُمِّ مَكْتُومٍ. فَقَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"إِنَّ بِلالاً يُؤَذِّنُ بِلَيْلٍ، فَكُلُوا وَاشْرَبُوا حتَّى يُؤَذِّنَ ابْنُ أُمِّ مَكْتُومٍ"قَالَ: وَلَمْ يَكُنْ بَيْنَهُمَا إِلاَّ أَنْ يَنْزِلَ هَذَا وَيَرْقَى هَذَا، متفقٌ عَلَيْهِ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: దైవప్రవక్త ﷺ దగ్గర ఇద్దరు ముఅజ్జిన్‌లు (అజాన్ ఇచ్చేవారు) ఉండేవారు. ఒకరు బిలాల్. రెండోవారు, ఇబ్నె ఉమ్మె మక్తూమ్. ఒకసారి దైవప్రవక్త ﷺ (సహ్‌రీ భోజనం గురించి చెబుతూ) "బిలాల్ రాత్రివేళ ఉండగానే అజాన్ ఇస్తారు. కనుక మీరు (తొందర పడకుండా) ఇబ్నె ఉమ్మె మక్తూమ్ అజాన్ ఇచ్చేవరకు నిస్సంకోచంగా తినండి, త్రాగండి" అని ఉపదేశించారు.

ఇబ్నె ఉమర్(రదియల్లాహు అన్హుమా) ఉవాచ: వారిద్దరి అజాన్‌ల మధ్య ఏమంత ఎక్కువ వ్యవధి ఉండేది కాదు. బిలాల్ అజాన్ ఇచ్చి క్రిందికి దిగగానే ఈయన (అంటే ఇబ్నె ఉమ్మె మ క్తూమ్) అజాన్ ఇవ్వటానికి పైకెక్కేవారు.

(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ had two Mu’adhdhin: Bilal and Ibn Umm Maktum (radiyallahu anhuma). The Messenger of Allah ﷺ said, “Bilal proclaims Adhan [call to Salat (prayer)] at fag end of night, so eat and drink till Ibn Umm Maktum pronounces Adhan.” Ibn `Umar (radiyallahu anhum) added: And the gap between their Adhan was not more than the time spent in one’s getting down and the other’s climbing (the minaret).[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై హదీసు ద్వారా బోధపడేదేమిటంటే, దైవప్రవక్త ﷺ కాలంలో ఇద్దరు ముఅజ్జిన్‌లు ఉండేవారు. ఉదయం వేళ ఆ ఇద్దరూ రెండుసార్లు అజాన్ ఇచ్చేవారు. మొదటి అజాన్ అవగానే సహ్‌రీ భుజిస్తున్న ప్రజలు సహ్‌రీ సమయం అయిపోవస్తుందని, కనుక త్వరగా సహ్‌రీ ముగించి నమాజ్ సన్నాహాలు మొదలెట్టాలని అర్థం చేసుకునేవారు. ఇకపోతే రెండో అజాన్ అన్నపానీయాలు ఆపేసి నమాజ్‌కు బయలుదేరండి అనే ప్రకటన అన్నమాట. ఈ పరంపర ఒక్క రమజాన్ మాసంలోనేగాక సంవత్సరం మొత్తం ఇలాగే జరిగేదని హదీసు వాక్యాలు తెలుపుతున్నాయి. ఈ విధానం సౌదీ అరేబియాలోని కాబా, మస్జిదె నబవీలలో నేటికీ అమల్లో ఉంది. మనం కూడా ఈ విధానాన్ని పాటించాలి.

ఇకపోతే రెండు అజాన్‌ల మధ్య ఎంత సమయం ఉండేదన్న విషయమై పండితులు ఏమన్నారంటే, హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) ఉషోదయానికి పూర్వం రాత్రి ఉండగానే అజాన్ ఇచ్చి కాసేపు ప్రార్థనల్లో నిమగ్నులై ఉండి ఉషోదయం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఉషోదయం అవబోతుందని అనిపించగానే ఆయన క్రిందికి దిగి అంధులయిన హజ్రత్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్‌కు ఆ విషయం తెలియపరచేవారు. అప్పుడు ఇబ్నె ఉమ్మె మక్తూమ్ వుజూ చేసుకొని పైకెక్కి ఉషోదయం మొదలుకాగానే అజాన్ ఇచ్చేవారు. (ఇబ్నె అల్లాన్)

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|221. సహ్‌రీ భుజించటం, ఉషోదయం కానంతవరకు అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం|హదీసు 1232

1233

హదీసు 1233

وعَنْ عمْرو بنِ العاصِ رَضِيَ اللَّه عَنْهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: " فَضْلُ مَا بيْنَ صِيَامِنَا وَصِيامِ أَهْل الكِتَابِ أَكْلَةُ السَّحَرِ". رواه مسلم.

హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మన ఉపవాసానికి, గ్రంథవహుల ఉపవాసానికి మధ్య భేదం సహ్‌రీ భుజించటం.

(ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)

English

`Amr bin Al-`As (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The difference between our observance of Saum (fasting) and that of the people of the Scriptures is Suhur (predawn meal in Ramadan).”[Muslim].

ముఖ్యాంశాలు

సహ్‌రీ భుజించటమనేది ముహమ్మదీయ అనుచర సమాజానికి దేవుడు ప్రసాదించిన ఒక ప్రత్యేకత. కనుక వారు అల్లాహ్ తమకు ఇచ్చిన ప్రత్యేకతను కాపాడుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|221. సహ్‌రీ భుజించటం, ఉషోదయం కానంతవరకు అందులో ఆలస్యం చేయటం పుణ్యప్రదం|హదీసు 1233