హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 222వ అధ్యాయం: ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 1234 – 1240) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ
باب فَضْل تَعْجِيل الفِطْرِوما يُفْطَرُ عَليهِ وَمَا يَقُولُهُ بَعْدَ الإِفْطَارِ
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1234
عَنْ سَهْلِ بنِ سَعْدٍ رضِيَ اللَّه عَنْهُ، أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "لاَ يَزالُ النَّاسُ بخَيْرٍ مَا عَجلوا الفِطْرَ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఉపవాస విరమణ విషయం (ఇఫ్తార్)లో త్వరపడినంతకాలం ప్రజలు శ్రేయోమార్గంపై ఉంటారు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Sahl bin Sa`d (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “People will continue to adhere to good as long as they hasten to break the Saum (fasting).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఇఫ్తార్ విషయంలో త్వరపడటమంటే సూర్యాస్తమయానికి ముందే ఉపవాసాన్ని విరమించుకోవటమని అర్ధం ఎంతమాత్రం కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక ఉపవాసాన్ని విరమించుకోవటంలో అనవసరంగా ఆలస్యం చేయకూడదని భావం. ఆ విధంగా తొందరపడేవారు ఇహపరాల్లోనూ శ్రేయోసాఫల్యాలను పొందుతారు. ఉపవాసమంటే ఆకలి దాహాలతో శరీరాన్ని బాధపెట్టడం, కృశింపజేసుకోవటం కాదు. సాధారణంగా అతివాదులైన సూఫీలు ధర్మావలంబనలో ఇలాంటి అతివాద చేష్టలకు పాల్పడుతుంటారు. వాస్తవానికి ఇలాంటి అతివాద చేష్టల వల్ల శుభం ఒనగూడదు. శుభం అనేది క్రమశిక్షణ వల్ల, దేవుడు నిర్ణయించిన హద్దులకు లోబడి జీవితం గడపటం వల్లనే లభిస్తుంది. కనుక ముస్లింలు ఇఫ్తార్ విషయంలో త్వరపడినప్పుడే ఇహపరాల సాఫల్యాన్ని తమ స్వంతం చేసుకోగల్గుతారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1234
హదీసు 1235
وعن أَبي عَطِيَّةَ قَالَ: دخَلتُ أَنَا ومسْرُوقٌ عَلَى عائشَةَ رَضِيَ اللَّه عَنْهَا فقَالَ لهَا مَسْرُوقٌ: رَجُلانِ منْ أَصْحَابِ مُحَمَّدٍ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كلاَهُمَا لا يَأْلُو عَنِ الخَيْرِ: أَحَدُهُمَا يُعَجِّلُ المغْربَ والإِفْطَارَ، والآخَرُ يُؤَخِّرُ المغْرِبَ والإِفْطَارَ؟ فَقَالَتْ: مَنْ يُعَجِّلُ المَغْربَ وَالإِفْطَارَ؟ قالَ: عَبْدُ اللَّه يعني ابنَ مَسْعودٍ فَقَالَتْ: هكَذَا كَانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، يصْنَعُ. رواه مسلم. قوله:"لا يَأْلُوا"أَيْ لاَ يُقَصِّرُ في الخَيْرِ.
హజ్రత్ అబూ అతియ్యా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు నేను, మస్రూఖ్ (రదియల్లాహు అన్హు)- ఇద్దరం కలిసి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దగ్గరికి వెళ్ళాం. అప్పుడు మస్రూఖ్ (రదియల్లాహు అన్హు) ఆయిషా (రదియల్లాహు అన్హా)తో మాట్లాడుతూ, "దైవప్రవక్త ﷺ సహచరుల్లో ఇద్దరు వ్యక్తులున్నారు. వారిద్దరూ మంచి పనుల్లో ఏమాత్రం అశ్రద్ధ వహించరు. వారిలో ఒకడు మగ్రిబ్ నమాజు మరియు ఇఫ్తార్ విషయంలో త్వరపడతాడు. వేరొకడు మగ్రిబ్ మరియు ఇఫ్తార్ ఆలస్యంగా చేస్తాడు. (మరి వీరిద్దరిలో ఎవరి విధానం దైవప్రవక్త విధానానికి అనుగుణంగా ఉంది?)" అని అడిగారు. దానికి ఆమె, "మగ్రిబ్ మరియు ఇఫ్తార్ విషయంలో తొందరపడే వ్యక్తి ఎవరు?" అని ప్రశ్నించారు. "అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్" అని మస్రూఖ్ (రదియల్లాహు అన్హు) తెలుపగా, దానికామె "(ఆయన విధానమే సరయినది) దైవప్రవక్త ﷺ అలాగే చేసేవారు" అని చెప్పారు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Atiyyah (radiyallahu anhu) reported: Masruq and I visited `Aishah (radiyallahu anha) and said: “O Mother of the Believers! There are two Companions of Muhammad ﷺ and neither of them holds back from doing good acts; but one of them hastens to break Saum (fasting) and hastens to perform the Maghrib prayer, while the other delays breaking Saum and delays performing Salat (prayer).” She asked, “Who is the one who hastens to break Saum and perform the Maghrib prayer?” Masruq said, “It is `Abdullah (meaning `Abdullah bin Mas`ud).” She said, “The Messenger of Allah ﷺ used to do so.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1235
హదీసు 1236
وَعَنْ أَبي هُريرَةَ رَضِيَ اللَّه عنْهُ قالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، قَالَ اللَّه عَزَّ وَجَلَّ: أَحَبُّ عِبَادِي إِليَّ أَعْجَلُهُمْ فِطْراً" رواه الترمذي وقالَ: حَديثٌ حسنٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దేవుడు ఇలా సెలవిచ్చాడని దైవప్రవక్త ﷺ తెలియజేశారు: నా దాసుల్లో త్వరగా ఇఫ్తార్ చేసేవారు నాకు అత్యంత ప్రియతములు. (తిర్మిజీ- హసన్)
(సుననె తిర్మిజీలోని ఉపవాస ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Allah the Most High says: `From amongst my slaves, the quicker the one is in breaking the Saum (fasting), the dearer is he to me.”’[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1236
హదీసు 1237
وَعنْ عُمر بنِ الخَطَّابِ رَضِي اللَّه عَنْهُ، قالَ: قَالَ رَسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: " إِذا أَقْبَلَ اللَّيْلُ مِنْ ههُنَا وأَدْبَرَ النَّهَارُ مِنْ ههُنا، وغَرَبتِ الشَّمسُ، فَقَدْ أَفْطَرَ الصائمُ "متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: ఇటు (తూరుపు దిక్కు) నుంచి రేజీకటి కమ్ముకోవటం ప్రారంభించి, పగటి వెలుగు, అటు పశ్చిమ దిక్కుకు) వెడలిపోయి సూర్యుడు అస్తమిస్తే ఉపవాసి తన ఉపవాసాన్ని విరమించుకున్నట్లే;
(బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “When the night approaches from this side (i.e., the east) and the day retreats from that side (i.e., west) and the sun sets, then it is time for a person observing Saum (fasting) to break his fast.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమించగానే ఉపవాస సమయం ముగిసిపోతుంది. కనుక సూర్యాస్తమయం తర్వాత ఉపవాసి ఏమీ తినకపోయినా త్రాగకపోయినా అతని ఉపవాసం మాత్రం ముగిసిపోయినట్లుగానే పరిగణించబడుతుంది. ఈ హదీసు ఉపవాస వ్యవధిని నిర్ణయిస్తోంది. ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస సమయం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సమయం ఉపవాసం పాటించటం వృధా ప్రయాస మాత్రమే. దానివల్ల దేవుడు ప్రసన్నుడు కాడు, అప్రసన్నుడౌతాడు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1237
హదీసు 1238
وَعَنْ أَبي إِبراهيمَ عبدِ اللَّهِ بنِ أَبي أَوْفى رَضِي اللَّه عنْهُمَا، قالَ: سِرْنَا مَعَ رسولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، وَهُوَ صائمٌ، فَلَمَّا غَرَبتِ الشَّمسُ، قالَ لِبْعضِ الْقَوْمِ:" يَا فُلانُ انْزلْ فَاجْدحْ لَنا، فَقَال: يَا رَسُول اللَّهِ لَوْ أَمْسَيتَ؟ قالَ:"انْزِلْ فَاجْدَحْ لَنَا"قالَ: إِنَّ علَيْكَ نَهَاراً، قَالَ:"انْزلْ فَاجْدَحْ لَنَا"قَالَ: فَنَزَلَ فَجَدَحَ لَهُمْ فَشَرِبَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ثُمَّ قالَ:"إِذا رَأَيْتُمُ اللَّيْلَ قَدْ أَقْبَلَ مِنْ ههُنَا، فَقَدْ أَفْطَرَ الصَائمُ "وأَشارَ بِيَدِهِ قِبَلَ المَشْرِقِ. متفقٌ عَلَيْهِ. قَوْله:"اجْدَحْ"بِجيم ثُمَّ دال ثُمَّ حاءٍ مهملتين، أَي: اخْلِطِ السَّوِيقَ بالماءِ.
హజ్రత్ అబూ ఇబ్రాహీమ్ అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔఫా (రదియల్లాహు అన్హుమా) కథనం: మేమొకసారి దైవప్రవక్త ﷺ వెంట ప్రయాణంలో ఉన్నాం. ఆ రోజు ఆయన ఉపవాసంలో ఉన్నారు. సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ఆయన తోటి ప్రయాణీకుల్లోని ఒకతన్ని సంబోధిస్తూ, "దిగు, దిగి నా కోసం సత్తుపిండి కరగబెట్టు" అన్నారు. ఆ మాట విని అతను, "ఇంకాసేపు ఆగితే బాగుంటుంది" అన్నాడు, "దిగు, దిగి నా కోసం సత్తుపిండి కరగబెట్టు" అని దైవప్రవక్త ﷺ మళ్ళీ ఆదేశించారు. కాని అతను "సూర్యరశ్మి ఇంకా మిగిలి ఉంది, కాసేపు ఆగండి" అన్నాడు మళ్ళీ. కాని దైవప్రవక్త ﷺ (మాత్రం అతని మాటలేవీ పట్టించుకోకుండా), "దిగు, దిగి నా కోసం సత్తుపిండి కరగబెట్టు" అని అన్నారు.
హదీసు ఉల్లేఖకులయిన అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: అప్పుడు ఆ వ్యక్తి వాహనం దిగి దైవప్రవక్త ﷺకు సత్తు కరగబెట్టి ఇచ్చాడు. ఆయన దాన్ని సేవించి తన చేతిని తూర్పు వైపు సూచిస్తూ మీరు ఇటు నుంచి రేజీకటి కమ్ముకున్నట్లు చూడగానే ఉపవాసి తన ఉపవాసాన్ని విరమించుకున్నాడని భావించండి" అని ఉపదేశించారు.
(బుఖారీ- ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఉపవాస ప్రకరణం – సహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
English
Abu Ibrahim `Abdullah bin Abu Aufa (radiyallahu anhuma) reported: We were with the Messenger of Allah ﷺ on a journey and he was observing Saum (fasting). When the sun set, he ﷺ said to a person, “Dismount and prepare the ground roasted barley drink for us.” Upon this he replied, “O Messenger of Allah, there is daylight still.” The Messenger of Allah ﷺ said, “Get down and prepare barley drink for us.” He said, “But it is still daytime.” The Messenger of Allah ﷺ again said to him, “Get down and prepare barely drink for us.” So he got down and prepared a barley liquid meal for him. The Prophet ﷺ drank that and then said, “When you perceive the night approaching from that side, a person observing Saum (fasting) should break the fast.” And he ﷺ pointed towards the east with his hand.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1238
హదీసు 1239
وَعَنْ سَلْمَانَ بنِ عَامر الضَّبِّيِّ الصَّحَابيِّ رَضِيَ اللَّه عَنْهُ، عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذَا أَفْطَرَ أَحَدُكُمْ، فَلْيُفْطِرْ عَلى تَمْرٍ، فَإِنْ لَمْ يَجدْ، فَلْيُفْطِرْ عَلَى مَاءٍ فَإِنَّه طَهُورٌ". روَاهُ أَبو دَاودَ، والترمذي وقالَ: حديثٌ حَسَنٌ صحيحٌ.
హజ్రత్ సల్మాన్ బిన్ ఆమిర్ జబ్బీ సహాబీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరయినా ఉపవాసం విరమించదలచుకున్నప్పుడు (ఇఫ్తార్ చేయదలచుకున్నప్పుడు) ఖర్జూరపండుతో ఉపవాసం విరమించాలి. అది లభించకపోతే నీళ్ళతో విరమించాలి. ఎందుకంటే నీరు చాలా పరిశుద్ధమైన పదార్ధం.
(అబూదావూద్, తిర్మిజీ- హసన్, సహీహ్)
(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల ప్రకరణం – సుననె తిర్మిజీలోని ఉపవాస అధ్యాయాలు)
English
Salman bin `Amir (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “When one of you breaks his Saum (fasting), let him break it on dates; if he does not have any, break his fast with water for it is pure.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1239
హదీసు 1240
وَعَنْ أَنَسٍ رَضِيَ اللَّه عَنْهُ، قالَ: كانَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يُفْطِرُ قَبْلَ أَنْ يُصَلِّيَ عَلى رُطَبَاتٍ، فَإِنْ لَمْ تَكُنْ رُطَبَاتٌ فَتُمَيرْاتٌ، فإِنْ لمْ تَكُنْ تُميرْاتٌ حَسَا حَسَواتٍ مِنْ ماءٍ رواه أَبو داود، والترمذي وَقالَ: حديثٌ حسنٌ.
హజ్రత్ అనస్(రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ నమాజుకు ముందు కొన్ని ఖర్జూర పండ్లతో ఉపవాసం విరమించేవారు. ఒకవేళ ఖర్జూర పండ్లు లభించకపోతే ఎండు ఖర్జూరాలతోనయినా విరమించేవారు. అవీ లభించని పక్షంలో కొన్ని గుటకల నీళ్ళతో ఉపవాసాన్ని విరమించేవారు.
(అబూదావూద్, తిర్మిజీ- తిర్మిజీ దీనిని 'హసన్' కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు)
(సుననె అబూదావూద్‌లోని ఉపవాసాల ప్రకరణం – సుననె తిర్మిజీలోని ఉపవాస అధ్యాయాలు)
English
Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ used to break his Saum (fasting) before performing Maghrib prayer with three fresh date-fruits; if there were no fresh date-fruits, he will eat three dry dates; and if there were no dry date-fruits; he would take three draughts of water.[At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|222. ఇఫ్తార్ (ఉపవాస విరమణ)లో త్వరపడటం వల్ల లభించే పుణ్యం, ఇఫ్తార్ కోసం ఉపయోగించ వలసిన ఆహార పదార్ధం, ఇఫ్తార్ తర్వాత పఠించవలసిన దుఆ|హదీసు 1240
You must be logged in to post a comment.