హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 208. ‘తహియ్యతుల్ మస్జిద్’ నమాజు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 208వ అధ్యాయం: రెండు రకాతులు 'తహియ్యతుల్ మస్జిద్' నమాజు చేయాలి, ఏ వేళప్పుడు మస్జిద్‌లోకి వెళ్ళినా రెండు రకాతులు చేయకుండా కూర్చోవటం అవాంఛనీయం, ఆ రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంకల్పంతో లేక ఫర్జ్ సంకల్పంతో లేక సున్నతె రాతిబా సంకల్పంతో మరే నమాజు సంకల్పంతోనయినా చేయవచ్చు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1145 – 1146) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

208. రెండు రకాతులు 'తహియ్యతుల్ మస్జిద్' నమాజు చేయాలి, ఏ వేళప్పుడు మస్జిద్‌లోకి వెళ్ళినా రెండు రకాతులు చేయకుండా కూర్చోవటం అవాంఛనీయం, ఆ రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంకల్పంతో లేక ఫర్జ్ సంకల్పంతో లేక సున్నతె రాతిబా సంకల్పంతో మరే నమాజు సంకల్పంతోనయినా చేయవచ్చు

↑ విషయ సూచిక

باب الحثِّ على صلاة تحية المسجد وكراهية الجلوس قبل أن يصلي ركعتين في أي وقت دخل وسواء صلَّى ركعتين بنية التَّحِيَّةِ أَوْ صلاة فريضة أَوْ سُنة راتبة أَوْ غيرها.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

1145

హదీసు 1145

عن أَبي قتادةَ رضِيَ اللَّه عَنْهُ، قالَ: قالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا دَخَلَ أحَدُكم المسْجِدَ، فَلا يَجلِسْ حَتَّى يُصَلِّيَ رَكْعَتيْنِ" متفقٌ عليه.

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: మీలో ఎవరయినా మస్జిద్‌లోకి ప్రవేశిస్తే రెండు రకాతుల నమాజ్ చేసేంతవరకు కూర్చోకూడదు. (బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Abu Qatadah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When anyone of you enters the mosque, he should perform two Rak`ah (of voluntary prayer) before sitting.”[Al-Bukhari and Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|208. రెండు రకాతులు 'తహియ్యతుల్ మస్జిద్' నమాజు చేయాలి, ఏ వేళప్పుడు మస్జిద్‌లోకి వెళ్ళినా రెండు రకాతులు చేయకుండా కూర్చోవటం అవాంఛనీయం, ఆ రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంకల్పంతో లేక ఫర్జ్ సంకల్పంతో లేక సున్నతె రాతిబా సంకల్పంతో మరే నమాజు సంకల్పంతోనయినా చేయవచ్చు|హదీసు 1145

1146

హదీసు 1146

وعن جابِرٍ رضيَ اللَّه عنْهُ قالَ: أَتيْتُ النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم وهَو فِي المسْجدِ، فَقَالَ: "صَلِّ ركْعَتيْن" متفقٌ عليه.

హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త ﷺ మస్జిద్‌లో ఉండగా నేనాయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన నాతో 'రెండు రకాతులు నమాజ్ చెయ్యి" అని అన్నారు.

(బుఖారీ-ముస్లిం)

(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)

English

Jabir (radiyallahu anhu) reported: I came to the Prophet ﷺ when he was in the mosque, and he said to me, “Perform two Rak`ah prayer.”[Al-Bukhari and Muslim].

ముఖ్యాంశాలు

పై రెండు హదీసుల్లోనూ 'తహియ్యతుల్ మస్జిద్ నమాజు' రెండు రకాతులు చేయమని ఆదేశించటం జరిగింది. ఇది కనిష్ఠ సంఖ్య. వాస్తవానికి తహియ్యతుల్ మస్జిద్ నమాజులో మనిషి రెండేసి రకాతుల చొప్పున ఎన్ని రకాతులయినా చేసుకోగలడు. అసలు ఏమీ చేయకుండా మస్జిద్‌లోకి వెళ్ళి కూర్చోవటం అయిష్టకరమైన చర్యగా పరిగణించబడుతుంది. మస్జిద్‌లోకి ప్రవేశించే వ్యక్తి ఫర్జ్, సున్నతె ముఅక్కదా మొదలగు ఏ నమాజు చేసినా అతను తహియ్యతుల్ మస్జిద్ నమాజు పాటించినట్లుగానే భావింపబడుతుందని ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం. ఆయన ఈ అధ్యాయానికి పెట్టిన శీర్షిక ద్వారా కూడా ఈ విషయం బోధపడుతున్నది.

కొంతమంది పండితులు పై హదీసులోని ఆజ్ఞను అనివార్యమైనదిగా భావిస్తున్నారు. అలాంటివారి దృష్టిలో 'తహియ్యతుల్ మస్జిద్' నమాజును తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. మరికొంతమంది విద్వాంసులు పై ఆజ్ఞ ఉపదేశపూర్వకమైనదేగాని అనివార్యమైనది కాదని తలపోశారు. వీరి అభిప్రాయంలో 'తహియ్యతుల్ మస్జిద్' నమాజ్ పాటించటం అభిలషణీయం (ముస్తహబ్).

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|208. రెండు రకాతులు 'తహియ్యతుల్ మస్జిద్' నమాజు చేయాలి, ఏ వేళప్పుడు మస్జిద్‌లోకి వెళ్ళినా రెండు రకాతులు చేయకుండా కూర్చోవటం అవాంఛనీయం, ఆ రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంకల్పంతో లేక ఫర్జ్ సంకల్పంతో లేక సున్నతె రాతిబా సంకల్పంతో మరే నమాజు సంకల్పంతోనయినా చేయవచ్చు|హదీసు 1146