హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 207వ అధ్యాయం: సూర్యుడు ఆకాశంపైకెక్కి నప్పటినుంచి నడినెత్తి నుండి వాలేవరకు మధ్యలో ఎప్పుడైనా చాష్త్ నమాజ్ చేసుకోవచ్చు, అయితే బాగా పొద్దెక్కిన తర్వాత ఎండ కాస్తున్నప్పుడు చేయటం ఉత్తమం. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 1144) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
207. సూర్యుడు ఆకాశంపైకెక్కి నప్పటినుంచి నడినెత్తి నుండి వాలేవరకు మధ్యలో ఎప్పుడైనా చాష్త్ నమాజ్ చేసుకోవచ్చు, అయితే బాగా పొద్దెక్కిన తర్వాత ఎండ కాస్తున్నప్పుడు చేయటం ఉత్తమం
باب: تجويز صلاة الضحى من ارتفاع الشمس إلى زوالها والأفضل أن تصلَّى عِنْدَ اشتداد الحرِّ وارتفاع الضحى
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1144
عن زيدِ بن أَرْقَم رَضِي اللَّه عنْهُ، أَنَّهُ رَأَى قَوْماً يُصَلُّونَ مِنَ الضُّحَى، فَقَالَ: أَمَا لَقَدْ عَلِمُوا أَنَّ الصَّلاةَ في غَيْرِ هذِهِ السَّاعَةِ أَفْضَلُ، إنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ: "صَلاةُ الأوَّابِينَ حِينَ ترْمَضُ الفِصَالُ "رواه مسلم. "تَرمَضُ"بفتح التاءِ والميم وبالضاد المعجمة، يعني: شدة الحر."والفِصالُ جمْعُ فَصيلٍ وهُو: الصَّغيرُ مِنَ الإِبِلِ.
హజ్రత్ జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం కొంతమంది చాష్త్ నమాజ్ చేస్తుండగా చూసి తను ఇలా అన్నారు: జాగ్రత్త! ఈ నమాజును ఇప్పుడు కాకుండా వేరే సమయంలో చేయటం ఉత్తమం అన్న సంగతి వీరికి బాగా తెలుసు. నిస్సందేహంగా దైవప్రవక్త ﷺ ఇలా ప్రవచించారు: (పాపాల నుండి) మరలేవారి (అవ్వాబీన్ల) నమాజు, ఎండతీవ్రతకు గున్న ఒంటెల కాళ్ళు కాలినప్పుడు చేయబడుతుంది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Zaid bin Arqam (radiyallahu anhu) reported: I saw some people performing Duha (prayers) in the early forenoon and warned them (saying): These people must know that performing Salat a little later is better. The Messenger of Allah ﷺ said, “The Salat of the penitent is to be observed when the young ones of camels feel the heat of the sun (i.e., when it becomes very hot).”[Muslim].
ముఖ్యాంశాలు
చాష్త్ మరియు ఇష్రాఖ్ రెండూ వేర్వేరు నమాజులని చెప్పేవారు ఈ హదీసునే నిదర్శనంగా చూపిస్తారు. సూర్యుడు ఆకాశాన ఒక ఈటెంత పైకెక్కిన తర్వాత ఇష్రాఖ్ నమాజు చేసుకోవాలనీ, ఆ తర్వాత ఎండ తీవ్రమై పశువుల కాళ్ళు కాలే సమయంలో చాష్త్ నమాజు చేసుకోవాలని వీరు అభిప్రాయపడతారు. మరో విషయం ఏమిటంటే చాలామంది జనం 'సలాతుల్ అవ్వాబీన్' విషయంలో అపార్ధానికి లోనై ఉన్నారు. సాధారణంగా ప్రజలు మగ్రిబ్ తర్వాత ఆరు రకాతుల నఫిల్ నమాజు చేయటాన్ని సలాతుల్ అవ్వాబీన్గా తలపోస్తారు. ఓ బలహీన (జయీఫ్) హదీసు ఆధారంగా ఈ ఆచరణ ప్రచారంలోకి వచ్చిందన్న విషయం గమనార్హం. మరి చూడబోతే సదరు ప్రామాణిక హదీసులో చాష్త్ నమాజునే అవ్వాబీన్ నమాజ్గా పేర్కొనటం జరిగింది. దీనిద్వారా బోధపడేదేమిటంటే సలాతుల్ అవ్వాబీన్ అనే పేరుతో ప్రత్యేక నమాజు ఏమీ లేదు. చాష్త్ నమాజుకు మరో పేరే సలాతుల్ అవ్వాబీన్.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|207. సూర్యుడు ఆకాశంపైకెక్కి నప్పటినుంచి నడినెత్తి నుండి వాలేవరకు మధ్యలో ఎప్పుడైనా చాష్త్ నమాజ్ చేసుకోవచ్చు, అయితే బాగా పొద్దెక్కిన తర్వాత ఎండ కాస్తున్నప్పుడు చేయటం ఉత్తమం|హదీసు 1144
You must be logged in to post a comment.