హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 186వ అధ్యాయం: అజాన్ ఘనత. ఈ అధ్యాయంలో 9 హదీసులు (హదీసు 1033 – 1041) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
186. అజాన్ ఘనత
باب فضل الأذان
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1033
عَنْ أَبي هُريْرةَ رَضِيَ اللَّه عنْهُ أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَال: "لَوْ يعْلمُ النَّاسُ مَا في النِّداءِ والصَّفِّ الأَولِ. ثُمَّ لَمْ يَجِدُوا إِلاَّ أَنْ يسْتَهِموا علَيهِ لاسْتهموا علَيْهِ، ولوْ يعْلَمُونَ مَا فِي التَّهْجِير لاسْتبَقوا إَليْهِ، ولَوْ يعْلَمُون مَا فِي العَتَمَةِ والصُّبْحِ لأتوهمُا ولَوْ حبواً" متفقٌ عليه. "الاسْتهامُ": الاقْتراعُ،"والتَّهْجِيرُ": التَّبْكيرُ إِلى الصَّلاةِ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ ఘనతను పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని తెలిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. అలాగే నమాజ్‌కు వేళకాగానే తొలి సమయంలో (మస్జిదుకు) రావటానికి ఎంతటి ఘనత ఉందో తెలిస్తే, వారు పరుగెత్తుకుంటూ మరీ వస్తారు. అదే విధంగా ఇషా, ఫజ్ర్ (సామూహిక) నమాజులకు ఎంతటి ఘనత ఉందో తెలిస్తే, వాటి కోసం కాళ్ళీడ్చుకుంటూ రావలసి వచ్చినా సరే వారు తప్పకుండా (మస్జిద్కు) వస్తారు. (బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “Were people to know the blessing of pronouncing Adhan and the standing in the first row, they would even draw lots to secure these privileges. And were they to realize the reward of performing Salat early, they would race for it; and were they to know the merits of Salat after nightfall (`Isha’) and the dawn (Fajr) Salat, they would come to them even if they had to crawl.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1033
హదీసు 1034
وعنْ مُعاوِيةَ رضي اللَّه عنْهُ قَال: سمِعْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "المُؤذِّنُونَ أَطْولُ النَّاسِ أعْنَاقاً يوْمَ القِيامةِ" رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: అజాన్ చెప్పేవారి మెడలు ప్రళయ దినాన అందరికంటే పొడుగ్గా ఉంటాయి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
ముఖ్యాంశాలు:
ఈ హదీసు ద్వారా అజాన్ యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతోంది. దైవారాధన వైపునకు, సాఫల్య మార్గం వైపునకు ఆహ్వానించే కొన్ని పలుకుల సముదాయాన్ని 'అజాన్' అంటారు. అజాన్ చెప్పేవానిని 'ముఅజ్జిన్' అంటారు. అలాంటి ముఅజ్జిన్ యొక్క అజాన్ విని ఎంత మంది అయితే, నమాజ్ కోసం వస్తారో వారందరి నమాజుల పుణ్యం ముఅజ్జిన్కు కూడా లభిస్తుంది. ఎందుకంటే దైవప్రవక్త ﷺ 'మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహూ మిస్లు అజ్రి ఫాయిలిహీ' అన్నారు. అంటే మంచిపని వైపునకు మార్గదర్శకత్వం వహించేవారికి కూడా దాన్ని ఆచరించేవారికి సమానంగా పుణ్యం లభిస్తుందని భావం. అజాన్ చెప్పేవారు హష్ర్ మైదానంలో మానవులందరిలో విశిష్టమైనవారుగా కనిపిస్తుంటారు.
English
Mu`awiyah (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying: “The Mu’adhdhinun (callers to prayer) will have the longest necks on the Day of Resurrection.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1034
హదీసు 1035
وعنْ عَبْدِ اللَّه بْنِ عبدِ الرَّحْمنِ بنِ أَبي صَعْصعَةَ أَن أَبَا سعِيدٍ الخُدْرِيِّ رضِيَ اللَّه عنْهُ قَالَ لَهُ: "إنِّي أراكَ تُحِبُّ الْغَنَم والْبادِيةَ فإِذا كُنْتَ في غَنَمِكَ أَوْ بادِيَتِكَ فَأَذَّنْتَ للصلاةِ، فَارْفَعْ صَوْتَكَ بالنِّدَاءِ، فَإِنَّهُ لا يْسمعُ مَدَى صوْتِ المُؤذِّن جِنُّ، وَلاَ إِنْسٌ، وَلا شَيْءٌ، إِلاَّ شَهِد لَهُ يوْمَ الْقِيامَةِ" قَالَ أَبُو سعيدٍ: سَمِعْتُهُ مِنْ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. رواه البخاري.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) తనతో ఇలా అన్నారని అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ సాసఅ చెప్పారు: నీకు మేకలు, పొలాలంటే యిష్టమనుకుంటాను. ఏది ఏమైనా నువ్వు మేకల మధ్యగాని, పొలాల్లోగాని ఉన్నప్పుడు నమాజ్ కోసం అజాన్ చెప్పదలిస్తే బిగ్గరగా చెప్పు. ఎందుకంటే ముఅజ్జిన్ గొంతు ఎక్కడివరకయితే వినిపిస్తుందో దాని పరిధిలోని జిన్నాతులు, మానవులు, ఇంకా ఇతర వస్తువులన్నీ ప్రళయదినాన అతనికి అనుకూలంగా సాక్ష్యం పలుకుతాయి.
తను ఈ విషయం దైవప్రవక్త ﷺ ద్వారా విన్నానని హజ్రత్ అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం)
English
`Abdullah bin `Abdur-Rahman reported: Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) said to me: “I see that you like living among your sheep in wilderness. So whenever you are with your sheep or in wilderness and you want to call Adhan, you should raise your voice because whoever hears the Adhan, whether a human or jinn or any other creature, will testify for you on the Day of Resurrection.” Abu Sa`id added: “I heard this from the Messenger of Allah ﷺ.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
ఇతర వస్తువులన్నీ అంటే జంతువులు, వృక్షాలు మొదలగునవి అని అర్థం. ప్రళయ దినాన దేవుడు వాటికి కూడా మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. దాని మూలంగా అవి మానవుల, జిన్నాతుల మాదిరిగా ముఅజ్జిన్కు అనుకూలంగా సాక్ష్యం చెబుతాయి. ఈ హదీసు ద్వారా కూడా అజాన్ మరియు ముఅజ్జిన్‌ల ఘనతా విశిష్ఠతలు వెల్లడౌతున్నాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1035
హదీసు 1036
وعَنْ أَبي هُريْرَةَ رضي اللَّه عنْهُ قَال: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا نُودِي بالصَّلاةِ، أَدْبرَ الشيْطَانُ ولهُ ضُرَاطٌ حتَّى لاَ يسْمع التَّأْذِينَ، فَإِذا قُضِيَ النِّداءُ أَقْبَل، حتَّى إِذا ثُوِّبَ للصَّلاةِ أَدْبَر، حَتَّى إِذا قُضِيَ التَّثْويِبُ أَقْبلَ، حَتَّى يخْطِر بَيْنَ المرْءِ ونَفْسِهِ يقُولُ: اذْكُرْ كَذا، واذكُرْ كذا لمَا لَمْ يكن يذْكُرْ منْ قَبْلُ حَتَّى يظَلَّ الرَّجُلُ مَا يدرَي كَمْ صلَّى" متفقٌ عَلَيْهِ. "التَّثْوِيبُ": الإِقَامةُ.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అజాన్ చెప్పబడినప్పుడు షైతాన్ ఆ శబ్దం వినకూడదని తలచి, వెనక్కి తిరిగి పలాయనం చిత్తగిస్తాడు. ఆ సమయంలో (భయంతో) వాడికి అపానవాయువు కూడా వెలువడుతుంది. అయితే అజాన్ చెప్పటం అయిపోగానే వాడు మళ్ళీ తిరిగొస్తాడు. ఆ తర్వాత ఇఖామత్ చెప్పటం ప్రారంభించగానే తిరిగి వెన్నుచూపి పారిపోతాడు. ఇఖామత్ చెప్పటం అయిపోగానే తిరిగొచ్చి మనిషి మనసులో దురాలోచనలు రేకెత్తిస్తాడు. మనిషికి అంతకు ముందు గుర్తులేని విషయాలను (నమాజ్‌లో ఉండగా) గుర్తు చేస్తూ, "ఇది జ్ఞాపకం తెచ్చుకో, అది జ్ఞాపకం తెచ్చుకో" అంటాడు. (ఆ దురాలోచనల మూలంగా) మనిషికి తాను ఎన్ని రకాతులు చేశానన్న సంగతి కూడా గుర్తుకు రాదు. (బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం – సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When Adhan for Salat is pronounced, the devil takes to his heels and breaks wind with noise so as not to hear the call. When the Adhan is finished, he returns. When the Iqamah is announced, he turns his back, and after it is finished, he returns again to distract the attention of one and makes him remember things which he does not recall in his mind before the Salat, and says `Remember this, and this,’ and thus causes one to forget how many Rak`at he performed.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1036
హదీసు 1037
وَعَنْ عبْدِ اللَّهِ بْنِ عَمرِو بْنِ العاصِ رضِيَ اللَّه عنْهُما أَنه سَمِع رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُولُ: "إِذا سمِعْتُمُ النِّداءَ فَقُولُوا مِثْلَ مَا يَقُولُ، ثُمَّ صَلُّوا علَيَّ، فَإِنَّهُ مَنْ صَلَّى علَيَّ صَلاةً صَلَّى اللَّه عَلَيْهِ بِهَا عشْراً، ثُمَّ سلُوا اللَّه لِيَ الْوسِيلَةَ، فَإِنَّهَا مَنزِلَةٌ في الجنَّةِ لاَ تَنْبَغِي إِلاَّ لعَبْدٍ منْ عِباد اللَّه وَأَرْجُو أَنْ أَكُونَ أَنَا هُو، فَمنْ سَأَل ليَ الْوسِيلَة حَلَّتْ لَهُ الشَّفاعَةُ" رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: మీరు అజాన్ విన్నప్పుడు, ముఅజ్జిన్ ఏ విధంగా పలుకుతాడో ఆ విధంగా మీరు కూడా పలకండి. ఆ తర్వాత నా కొరకు దరూద్ పఠించండి. ఎవరయినా నా కొరకు ఒకసారి దరూద్ పఠిస్తే, దేవుడు వారి మీద పదిసార్లు కారుణ్యవర్షం కురిపిస్తాడు.
దరూద్ పఠించిన తర్వాత నాకు 'వసీలా' లభించాలని దైవాన్ని అర్థించండి. నిస్సందేహంగా 'వసీలా' అనేది స్వర్గంలో ఒక ఉన్నత స్థానం. దేవుని దాసుల్లో ఒకే ఒక్కడు మాత్రమే దానికి యోగ్యుడు-ఆ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను. కనుక ఎవరయితే నాకు వసీలా లభించాలని కోరుకుంటారో వారికి తప్పకుండా నా సిఫారసు సమ్మతించబడుతుంది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
`Abdullah bin `Amr bin Al-`As (radiyallahu anhuma) reported: I heard the Messenger of Allah ﷺ saying, “When you hear the Adhan, repeat what the Mu’adhdhin says. Then ask Allah to exalt my mention because everyone who does so will receive in return ten rewards from Allah. Then beseech Allah to grant me Al-Wasilah, which is a high rank in Jannah, fitting for only one of Allah’s slaves; and I hope that I will be that man. If any one asks Al-Wasilah for me, it becomes incumbent upon me to intercede for him.”[Muslim]
ముఖ్యాంశాలు
దేవుడు, ప్రవక్తపై దరూద్ పంపిస్తాడంటే ఆయనపై తన కారుణ్యాన్ని కురిపిస్తాడని అర్థం. అదే దైవదూతలు దరూద్ పంపుతారంటే మన్నింపుకోసం వేడుకుంటారని భావం. మానవులు దరూద్ పంపిస్తారంటే శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారని భావం. నిఘంటువు ప్రకారం వసీలా అంటే సామీప్యం అని అర్థం. లక్ష్యసాధనలో ఉపయోగపడే సాధనాన్ని 'వసీలా' అని చెప్పవచ్చు. కాని ఇక్కడ వసీలా అంటే స్వర్గంలో ఒక మహోన్నత స్థానం. అది దైవప్రవక్త ﷺకు మాత్రమే ప్రసాదించబడుతుంది.
సిఫారసు అంటే ఒకరి తప్పుల్ని, పొరపాట్లను మన్నించమనీ లేదా వారికి మంచి చేయమని మరొకర్ని అర్థించటం. హదీసు పరిభాషలో సిఫారసు అంటే దైవప్రవక్త ﷺకు లభించనున్న ఒక హక్కు. దాని ఆధారంగా ఆయన దేవుడు తలచిన వారి మన్నింపు కొరకు ప్రార్థిస్తారు.
అజాన్ వినేవారు దానికి జవాబుగా ముఅజ్జిన్ పలికే పలుకుల్నే ఉచ్చరించాలి. అయితే హయ్యా అలస్సలాహ్ మరియు హయ్యాఅలల్ ఫలాహ్‌కు జవాబుగా మాత్రం "లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్" అని పలకాలి. అజాన్ పూర్తయిన తర్వాత దైవప్రవక్త ﷺ కొరకు దరూద్ పఠించాలి. ఆయనకు 'వసీలా' స్థానం లభించాలని ప్రార్థించాలి. అలా చేసేవారి కొరకు ప్రళయదినాన దైవప్రవక్త ﷺ సిఫారసు అనివార్యమవుతుంది. అయితే వారు ఏకదైవారాధకులుగా తనువు చాలించినవారై ఉండాలి. అధముల ప్రార్థనల మూలంగా ఉత్తములకు ప్రయోజనం కలుగుతుందని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1037
హదీసు 1038
وعن أَبي سعيدٍ الخُدْرِيِّ رضيَ اللَّه عنْهُ أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا سمِعْتُمُ النِّداءَ، فَقُولُوا كَما يقُولُ المُؤذِّنُ". متفق عليه.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ పలికే పలుకుల్నే మీరూ పలకండి. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When you hear the Mu’adhdhin (pronouncing the call to Salat), repeat after him what he says.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1038
హదీసు 1039
وَعنْ جابرٍ رضَي اللَّه عنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ قَال حِين يسْمعُ النِّداءَ: اللَّهُمَّ رَبَّ هذِهِ الدَّعوةِ التَّامَّةِ، والصَّلاةِ الْقَائِمةِ، آتِ مُحَمَّداً الْوسِيلَةَ، والْفَضَيِلَة، وابْعثْهُ مقَامًا محْمُوداً الَّذي وعَدْتَه، حلَّتْ لَهُ شَفَاعتي يوْم الْقِيامِة" رواه البخاري.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అజాన్ విన్న తర్వాత ఈ విధంగా పఠించేవారి కొరకు నా సిఫారసు అనివార్యమవుతుంది. (అల్లాహుమ్మ రబ్బహాజిహిద్దా వతిత్తామ్మా…..) అనువాదం: ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ ఆహ్వానానికి, జరగబోయే నమాజ్‌కు అధిపతీ! ముహమ్మద్ ﷺకు 'వసీలా' మరియు ఘనతను ప్రసాదించు. నీవు ఆయనకు చేసిన వాగ్దానం ప్రకారం ఆయన్ని 'మహ్మూద్' స్థానంపై ప్రతిష్ఠింపజెయ్యి. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం)
English
Jabir (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who says upon hearing the Adhan: `Allahumma Rabba hadhihid-da`wati-ttammati, was-salatil-qa’imati, ati Muhammadanil-wasilata wal-fadhilata, wab`athu maqaman mahmuda nilladhi wa `adtahu [O Allah, Rubb of this perfect call (Da`wah) and of the established prayer (As-Salat), grant Muhammad the Wasilah and superiority, and raise him up to a praiseworthy position which You have promised him]’, it becomes incumbent upon me to intercede for him on the Day of Resurrection.”[Al-Bukhari].
ముఖ్యాంశాలు
'ఆహ్వానం' అంటే అజాన్ పలుకులని అర్థం. 'పరిపూర్ణమైనది' అంటే ప్రళయం వరకు ఎలాంటి మార్పులకు, చేర్పులకు ఆస్కారం లేనిదనీ లేక దోషాలకు అతీతమైనదని భావం. అజాన్ అనేది ఇస్లామీయ విశ్వాసాల సమగ్ర రూపం. జరగబోయే నమాజ్ అంటే- ప్రస్తుతం చెప్పబడిన అజాన్ తర్వాత జరగబోయే నమాజ్ కావచ్చు. లేదా ఈ నమాజ్ ప్రళయం వరకు నిలిచి ఉంటుందనే భావమైనా కావచ్చు. ఇందులో వసీలా ప్రార్థన యొక్క ఘనత ప్రస్తావించబడింది. అయితే వసీలా ప్రార్థనను అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ హదీసులో వివరించబడినట్లుగా ప్రార్థించాలి. అంటే ముందుగా అజాన్ పలుకులకు సమాధానం చెప్పాలి. తర్వాత దరూద్ పఠించాలి. ఆ తర్వాత వసీలా ప్రార్థన చేయాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1039
హదీసు 1040
وعنْ سَعْدِ بْن أَبي وقَّاصٍ رضِيَ اللَّه عنْهُ عَن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّهُ قَالَ: "مَنْ قَال حِينَ يسْمعُ المُؤذِّنَ: أَشْهَد أَنْ لا إِله إِلاَّ اللَّه وحْدهُ لا شَريك لهُ، وَأَنَّ مُحمَّداً عبْدُهُ وَرسُولُهُ، رضِيتُ بِاللَّهِ رَبّاً، وبمُحَمَّدٍ رَسُولاً، وبالإِسْلامِ دِينًا، غُفِر لَهُ ذَنْبُهُ" رواه مسلم.
హజ్రత్ సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అజాన్ విన్న తర్వాత ఈ విధంగా పలికేవారి పాపాలు మన్నించబడతాయి: (అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ….) అనువాదం: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఒక్కడే. ఆయనకు సహవర్తులు ఎవరూ లేరు. ఇంకా ముహమ్మద్ ﷺ ఆయన దాసులనీ, ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్‌ను ప్రభువుగా, ముహమ్మద్‌ను ప్రవక్తగా, ఇస్లాంను ధర్మంగా సంతోషంతో అంగీకరిస్తున్నాను. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Sa`d bin Abu Waqqas (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who says after the Adhan: `Ash-hadu an la ilaha illallah Wah-dahu la sharika Lahu; wa ash-hadu anna Muhammadan `abduhu wa Rasuluhu, radhitu Billahi Rabban, wa bi Muhammadin Rasulan, wa bil Islami Dinan [I testify that there is no true god except Allah Alone; He has no partners and that Muhammad ﷺ is His slave and Messenger; I am content with Allah as my Rubb, with Muhammad as my Messenger and with Islam as my Deen],’ his sins will be forgiven.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1040
హదీసు 1041
وعنْ أَنَسٍ رضيَ اللَّه عنْهُ قَالَ: قَال رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الدُّعَاءُ لاَ يُردُّ بَيْنَ الأَذانِ والإِقامةِ" رواه أَبُو داود والترمذي وقال: حديث حسن.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: అజాన్ మరియు ఇఖామత్‌ల మధ్య చేయబడే ప్రార్థన త్రోసిపుచ్చబడదు.
(అబూదావూద్, తిర్మిజీ- హసన్)
(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం-సుననె తిర్మిజీలోని నమాజ్ అధ్యాయం)
English
Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “The supplication made between the Adhan and the Iqamah is never rejected.”[Abu Dawud and At-Tirmidhi].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|186. అజాన్ ఘనత|హదీసు 1041
You must be logged in to post a comment.