హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 187వ అధ్యాయం: నమాజుల ఘనత. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 5 హదీసులు (హదీసు 1042 – 1046) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
187. నమాజుల ఘనత
باب فضل الصلوات
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
{إِنَّ الصَّلاةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنْكَرِ} [العنكبوت: ٤٥]
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ సెలవిచ్చాడు: "నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది." (అల్ అన్కబూత్: 45)
వివరణ
నమాజును తగురీతిలో, దైవప్రవక్త విధానానికి అనుగుణంగా అత్యంత భక్తిశ్రద్ధలతో నెరవేర్చేవారికి మాత్రమే ఆ ప్రయోజనం లభిస్తుంది. అలాగాకుండా కాకి పొడుపులు పొడిచినట్లు, ఏదో మొక్కుబడిగా చేసే నమాజు అసలు నమాజే కాదు. దాని వల్ల మనిషిలో ఎలాంటి మార్పూ రాదు. అందుకే నమాజ్‌ను పూర్తి భక్తిశ్రద్ధలతో నెరవేర్చాలి.
English
“Verily, As-Salat (the prayer) prevents from Al-Fahsha’ (i.e., great sins of every kind, unlawful sexual intercourse) and Al-Munkar (i.e., disbelief, polytheism, and every kind of evil, wicked deed).” [Al-‘Ankabūt 29:45]
హదీసు 1042
وَعنْ أَبي هُرَيْرةٍ رضي اللَّه عنْهُ قَال: سمِعْتُ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "أَرأَيْتُمْ لَوْ أَنَّ نَهْراً بِباب أَحَدِكم يغْتَسِلُ مِنْه كُلَّ يَوْمٍ خَمْس مرَّاتٍ، هلْ يبْقى مِنْ دَرَنِهِ شَيءٌ؟ "قالُوا: لا يبْقَى مِنْ درنِهِ شَيْء، قَال:"فذلكَ مَثَلُ الصَّلَواتِ الخَمْسِ، يمْحُو اللَّه بهِنَّ الخطَايا" متفقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అందులో అతను ప్రతి రోజూ ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే అతని ఒంటిపై మురికి, మాలిన్యాలు మిగిలి ఉంటాయా చెప్పండి?" అని అడిగారు దైవప్రవక్త ﷺ. దానికి సహచరులు, "ఎలాంటి మురికి, మాలిన్యాలు మిగిలి ఉండవండీ?" అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త ﷺ ఇలా అన్నారు: "ఐదుపూటల నమాజు సంగతి కూడా అంతే. అల్లాహ్ వాటి మూలంగా పాపాలను మన్నిస్తాడు." (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని నమాజ్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రార్థనాస్థలాల ప్రకరణం)
English
Abu Hurairahu (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying, “Say, if there were a river at the door of one of you in which he takes a bath five times a day, would any soiling remain on him?” They replied, “No soiling would left on him.” He ﷺ said, ” That is the five (obligatory) Salat (prayers). Allah obliterates all sins as a result of performing them.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో ఐదుపూటల నమాజ్ ఘనత, వాటిని నెరవేర్చటం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించబడ్డాయి. ప్రతి రోజూ ఐదుపూటల నమాజ్ చేస్తే మనిషి వల్ల జరిగే చిన్నచిన్న పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే నియమనిబద్ధంగా, భక్తిశ్రద్ధలతో చేసే నమాజ్ వల్లే ఇలా జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమకు నచ్చిన విధంగా, తమకిష్టం వచ్చినట్లు చేసే నమాజు వల్ల ఏ పాపం మన్నించబడదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|187. నమాజుల ఘనత|హదీసు 1042
హదీసు 1043
وعنْ جَابِرٍ رَضيَ اللَّه عنهُ قَالَ: قَالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "مثَلُ الصَّلواتِ الخَمْسِ كمثَلِ نهْرٍ جارٍ غمْرٍ عَلى بَابِ أَحَدِكُم يغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خمْسَ مرَّاتٍ" رواه مسلم. "الغَمْرُ"بفتحِ الغين المعجمةِ: الكثِيرُ.
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఐదుపూటలా నమాజ్ చేయటం మీలో ఒకరి ఇంటిముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో, రోజూ ఐదుపూటల స్నానం చేయటం లాంటిది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం)
English
Jabiru (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The similitude of the five (obligatory) Salat is like a river running at the door of one of you in which he takes a bath five times a day.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|187. నమాజుల ఘనత|హదీసు 1043
హదీసు 1044
وعَنِ ابْنِ مَسْعُودٍ رضي اللَّه عنْهُ أَنَّ رجُلاً أَصاب مِنِ امْرأَةٍ قُبْلَةً، فأَتَى النَّبِيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَأَخبرهُ فأَنزَل اللَّه تَعَالَى: {وأَقِم الصَّلاةَ طَرفي النَّهَار وَزُلَفا مِنَ اللَّيْلِ، إِنَّ الْحَسنَاتِ يُذهِبْنَ السَّيِّئَاتِ} [هود: ١١٤] فَقَالَ الرَّجُلُ: أَلِيَ هَذَا؟ قَالَ:" لجمِيع أُمَّتي كُلِّهِمْ" متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకతను ఓ స్త్రీని ముద్దాడాడు. ఆ తర్వాత అతను (పాపభీతితో) దైవప్రవక్త ﷺ దగ్గరికి వచ్చి తను చేసిన తప్పుని గురించి చెప్పుకున్నాడు. అప్పుడు "నమాజును స్థాపించు, పగటి యొక్క రెండు సరిహద్దు సమయాలలోనూ, కొంత రాత్రి గడచిన తరువాతనూ. నిస్సందేహంగా సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి" అనే ఆయతు అవతరించింది. ఆ తర్వాత అతను "ఈ ఆయతులోని ఆదేశం నాకొక్కడికేనా?" అని అడిగాడు. దానికి దైవప్రవక్త ﷺ "నా అనుచర సమాజంలోని వారందరికీ" అని చెప్పారు.
(బుఖారీ-ముస్లిం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: A man kissed a woman. So he came to the Messenger of Allah ﷺ and informed him about it. Then Allah revealed this Ayah: “And perform the Salat, between the two ends of the day and in some hours of the night. Verily, the good deeds efface the evil deeds (i.e., minor sins).” (11:114) The man asked the Messenger of Allah ﷺ whether this applies to him only. The Messenger of Allah ﷺ said, “It applies to all of my Ummah.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
పగటి యొక్క రెండు సరిహద్దు సమయాలలో నమాజ్ స్థాపించటమంటే, ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజులు కావచ్చు. కొంతమంది దానిభావం కేవలం ఇషా నమాజు అనీ, మరికొంతమంది మగ్రిబ్ మరియు ఇషా నమాజులని, "కొంతరాత్రి గడచిన తర్వాత" అంటే తహజ్జుద్ అనీ అభిప్రాయపడ్డారు. బహుశా ఈ ఆయతు మేరాజ్ సంఘటనకు ముందు అవతరించి ఉంటుందని ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే మేరాజ్ సంఘటన జరిగినప్పుడే ఐదు నమాజులు విధించబడ్డాయి. అంతకు ముందు రెండు నమాజులే విధిగా ఉండేవి. ఒకటి- సూర్యోదయానికి ముందు, మరొకటి- సూర్యాస్తమయానికి ముందు. ఆ తర్వాత రాత్రి చివరి వేళల్లో తహజ్జుద్ నమాజ్ ఉండేది.
ఏది ఏమైనా ఇక్కడ ఈ ఆయతు ద్వారా, నమాజ్ అనేది చాలా గొప్ప సత్కార్యమన్న విషయం బోధపడుతోంది. నమాజ్ చేస్తే గతంలో జరిగిన పాపాలు సమసిపోతాయి. అయితే దానివల్ల చిన్నచిన్న పాపాలు మాత్రమే క్షమించబడతాయి. పెద్దపాపాలు క్షమించబడటానికి స్వచ్ఛమైన పశ్చాత్తాపం అవసరం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|187. నమాజుల ఘనత|హదీసు 1044
హదీసు 1045
وعن أَبي هُريرة رضي اللَّه عنهُ أَنَّ رَسُولِ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "الصَّلواتُ الخَمْسُ، والجُمُعةُ إِلى الجُمُعَةِ، كفَّارةٌ لِمَا بَيْنهُنَّ، مَا لَمْ تُغش الكبَائِرُ" رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఘోరపాపాలకు పాల్పడకుండా ఉంటే ఐదు పూటల నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు గల కాలం, వాటి మధ్య జరిగే (చిన్నచిన్న) పాపాలకు పరిహారాలు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “The five (daily) Salat (prayers) and the Friday (prayer) to the Friday (prayer) expiate whatever (minor sins) may be committed in between, so long as major sins are avoided.”[Muslim].
ముఖ్యాంశాలు
ఐదుపూటల నమాజుల విరామ సమయంలో, ఒక జుమా నుండి మరో జుమాకు గల మధ్యకాలంలో జరిగే పాపాలన్నీ మన్నించబడతాయని పై హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఘోరపాపాలకు పాల్పడి ఉండకూడదు. ఎందుకంటే ఘోరపాపాలు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందనంతవరకు క్షమించబడవు. బహుదైవారాధన, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, అబద్ధ ప్రమాణాలు, అబద్ధపు సాక్ష్యాలు, అనాధుల సొమ్ము తినటం, శీలవతుల మీద నిందలు మోపటం మొదలగునవన్నీ ఘోరపాపాలు. ఇవి కేవలం నమాజ్ చేసినంత మాత్రాన క్షమార్హం కావు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|187. నమాజుల ఘనత|హదీసు 1045
హదీసు 1046
وعن عثمانَ بنِ عفان رضي اللَّه عنهُ قالَ: سمِعْتُ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "ما مِن امْرِيءٍ مُسْلِمٍ تحضُرُهُ صلاةٌ مَكتُوبةٌ فَيُحْسِنُ وُضُوءَهَا، وَخُشوعَهَا، وَرُكُوعَها، إِلاَّ كَانَتْ كَفَّارةً لِمَا قَبْلَهَا مِنْ الذنُوبِ مَا لَمْ تُؤْتَ كَبِيرةٌ، وَذلكَ الدَّهْرَ كلَّهُ" رواه مسلم.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్ఫాన్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ఏ ముస్లిం అయినా ఫర్జ్ నమాజ్ వేళ కాగానే చక్కగా వుజూ చేసి, ఎంతో భక్తితో, ఉత్తమ పద్ధతిలో రుకూ చేస్తే, అది అతని వెనుకటి పాపాలకు పరిహారం అవుతుంది. అయితే అతను ఘోరపాపానికి ఒడిగట్టి ఉండకూడదు. ఈ పరంపర నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
`Uthman bin `Affan (radiyallahu anhu) reported: I heard Messenger of Allah ﷺ saying, “When the time for a prescribed Salat is due and a Muslim performs its Wudu’ and its acts of bowing and prostration properly, this Salat will be an expiation for his past sins, so long as he does not commit major sins, and this applies for ever.”[Muslim].
ముఖ్యాంశాలు
నమాజును – దాని నియమాలను, విధులను పాటిస్తూ నెరవేర్చాలని ఈ హదీసులో బోధించబడింది. అలాంటి నమాజే పాపాలకు పరిహారం కాగలుగుతుంది. లేకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|187. నమాజుల ఘనత|హదీసు 1046
You must be logged in to post a comment.