హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 185వ అధ్యాయం: వుజూ ఘనత. ఈ అధ్యాయంలో 1 ఖుర్ఆన్ ఆయతులు, 9 హదీసులు (హదీసు 1024 – 1032) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
185. వుజూ ఘనత
باب فضل الوضوء
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُمْ مِنْ حَرَجٍ وَلَكِنْ يُرِيدُ لِيُطَهِّرَكُمْ وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ} [المائدة: ٦]
"విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజ్ కొరకు లేచినప్పుడు మీ ముఖాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను ప్రక్షాళనం చేసుకోండి; తలపై చేతులతో రాయండి, కాళ్ళను చీలమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుద్ధులుగా ఉంటే, స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. మీరు గనక అస్వస్థులయితే లేక ప్రయాణ స్థితిలో ఉంటే లేక మీలో ఎవరయినా కాల కృత్యాలు తీర్చుకొని వస్తే లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి; దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై, చేతులపై రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయటం అల్లాహ్ అభిమతం కాదు. కాని ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయ గోరుతున్నాడు. మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు మీరు కృతజ్ఞులవుతారేమో అని." (అల్మాయిదా-6)
English
“O you who believe! When you intend to offer As-Salat (the prayer), wash your faces and your hands (forearms) up to the elbows, wipe (by passing wet hands over) your heads, and (wash) your feet up to the ankles. If you are in a state of Janaba (i.e., after a sexual discharge), purify yourselves (bathe your whole body). But if you are ill or on a journey, or any of you comes from responding to the call of nature, or you have been in contact with women (i.e., sexual intercourse) and you find no water, then perform Tayammum with clean earth and rub therewith your faces and hands. Allah does not want to place you in difficulty, but He wants to purify you, and to complete His Favour to you that you may be thankful.” [Al-Mā’idah 5:6]
హదీసు 1024
وعَنْ أَبي هُريْرَةَ رضيَ اللَّه عَنْه قَالَ: سمِعْت رَسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُول: "إِنَّ أُمَّتي يُدْعَوْنَ يَوْمَ القِيامَةِ غُرّاً محَجَّلِينَ مِنْ آثَارِ الوضوءِ فَمنِ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيل غُرَّتَه، فَليفعلْ" متفقٌ عَلَيْهِ.
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ప్రళయ దినాన నా అనుచర సమాజాన్ని పిలవబడినప్పుడు వారి ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ చిహ్నాలతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. మీలో ఎవరికయినా తమ తేజస్సును పెంచుకునే వీలుకలిగితే వారు (వుజూ అవయవాలను నిర్ణీత భాగంకన్నా అధిక పరిమాణంలో కడిగి) తప్పకుండా పెంచుకోవాలి.
(బుఖారీ, ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying: “On the Day of Resurrection, my followers (or Ummah) will be summoned `Al-Ghurr Al-Muhajjalun’ from the traces of Wudu’. Whoever can increase the area of his radiance should do so.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఈ హదీసులో 'గుర్ర్' అనే పదం వాడబడింది. ఇది 'అగర్రు' అనే పదానికి బహువచనం. అగర్రు అంటే తెలుపు లేక తేజస్సు గలవాడని అర్థం. నుదురు తెలుపుగా ఉండే గుర్రాలు మొదలగు జంతువుల కోసం ఈ పదాన్ని వాడతారు. ప్రళయ దినాన ముహమ్మదీయ అనుచర సమాజంలోని విశ్వాసుల ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ ప్రభావంతో మెరుస్తూ ఉంటాయి. నుదురు మరియు కాళ్ళు తెలుపుగా ఉండే గుర్రం ఎన్ని గుర్రాల మధ్య ఉన్నప్పటికీ తేలికగా గుర్తించబడినట్లు ప్రళయ దినాన హష్ర్ మైదానంలో ముహమ్మదీయ అనుచర సమాజంలోని విశ్వాసులు ఇతర సమాజాల వారి మధ్య ఎంతో విశిష్టంగా కనిపిస్తారు. దానిక్కారణం వారు వుజూ చేసుకునే అవయవాలు తెల్లగా, మహోజ్వలంగా మెరుస్తూ ఉంటాయి.
రెండో విషయం ఏమిటంటే, ఈ హదీసులో వుజూ అవయవాలను నిర్ణీత భాగాల కన్నా అధిక పరిమాణంలో కడగాలని బోధించటం జరిగింది. ఉదా: చేతుల్ని మోచేతుల వరకు కడిగే బదులు భుజాల వరకు కడగాలి. కాళ్ళను చీలమండల వరకు కడిగేబదులు సగం పిక్కల వరకు లేదా మోకాళ్ళ వరకు కడగాలి. సహాబాలు, తాబయీన్లలో కొందరు, ఇంకా అత్యధికమంది షాఫయీ, హనఫీ ఫికహ్వేత్తలు ఈ పద్ధతిని అభిలషణీయమైనదిగా తలపోశారు (ఫత్హుల్బారీ).
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1024
హదీసు 1025
وعنه قَالَ: سَمِعْت خَلِيلي صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقُول: "تَبْلُغُ الحِلية مِنَ المؤمِن حَيْث يبْلُغُ الوضوءُ" رواه مسلم.
తన ప్రాణమిత్రులయిన దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే తెలియజేశారు: విశ్వాసి శరీరంలో వుజూ నీళ్ళు ఎక్కడి వరకయితే చేరుకుంటాయో (స్వర్గంలో) అతనికి అక్కడి వరకు ఆభరణాలు తొడిగించటం జరుగుతుంది. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: I heard my Khalil (the Messenger of Allah ﷺ) as saying, “The adornment of the believer (in Jannah) will reach the places where the water of Wudu’ reaches (his body).”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1025
హదీసు 1026
وعن عثمانَ بن عفانَ رضي اللَّه عنه قَالَ: قَالَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "منْ تَوَضَّأَ فَأَحْسَنَ الوضوءَ، خَرَجَت خَطَايَاهُ مِنْ جسَدِهِ حتَّى تَخْرُجَ مِنْ تحتِ أَظفارِهِ" رواه مسلم.
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా ఉత్తమ పద్ధతిలో వుజూ చేస్తే అతని శరీరం నుండి పాపాలు తొలగిపోతాయి. చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా పాపాలు తొలగిపోతాయి. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
`Uthman bin `Affan (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “He who performs the Wudu’ perfectly (i.e., according to Sunnah), his sins will depart from his body, even from under his nails.”[Muslim].
ముఖ్యాంశాలు
ఉత్తమ పద్ధతిలో వుజూ చేయటమంటే సున్నత్ విధానానికి అనుగుణంగా వుజూ చేయటం అని అర్థం. పాపాలు తొలగిపోవటమంటే, పాపాలు క్షమించబడతాయని భావం. ఇక్కడ 'పాపాలు' అంటే చిన్నచిన్న పాపాలని అర్థం. ఎందుకంటే పెద్ద పాపాలు వాటి గురించి పశ్చాత్తాపం చెందనంతవరకు (తౌబా చేసుకోనంతవరకూ) క్షమించబడవు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1026
హదీసు 1027
وعنهُ قَالَ: رَأَيْتُ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم َتَوَضَّأُ مثلَ وُضوئي هَذَا ثُمَّ قَالَ: "مَنْ تَوَضَّأَ هكَذَا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنبِهِ، وَكَانَتْ صَلاتُهُ وَمَشْيُهُ إِلى المَسْجِدِ نَافِلَةً" رواه مسلم.
హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺ నేను వుజూ చేసినట్లుగానే వుజూ చేస్తుండగా నేను (కళ్ళారా) చూశాను. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: ఎవరయితే ఈ విధంగా వుజూ చేస్తారో వారి వెనకటి పాపాలన్నీ మన్నించబడతాయి. ఇక ఆ తర్వాత వారు నమాజ్ చేసినందుకుగాను, మస్జిద్కు నడచి వెళ్లినందుకుగాను లభించే పుణ్యం అదనం.
(ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
`Uthman bin `Affan (radiyallahu anhu) reported: I saw the Messenger of Allah ﷺ performing Wudu’ the way I have just done it and said, “He who performs Wudu’ like this, his previous sins will be forgiven and his Salat and walking to the mosque will be considered as supererogatory act of worship.”[Muslim].
ముఖ్యాంశాలు
వుజూ చేయటం వల్ల చిన్నచిన్న పాపాలన్నీ మన్నించబడతాయి. అయితే ఆ పాపాలు తోటి మానవుల హక్కులకు సంబంధించినవై ఉండకూడదు. ఎందుకంటే అలాంటి పాపాలు కూడా తౌబా చేయనంత వరకు లేదా హక్కుల్ని నెరవేర్చనంతవరకు క్షమార్హం కావు. మొత్తానికి మస్జిద్కు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటి దగ్గరే వుజూ చేసుకొని వెళ్ళటం గొప్ప సత్కార్యం. అలా చేస్తే పూర్వం తమ వల్ల జరిగిన చిన్నచిన్న పాపాలన్నీ క్షమించబడతాయి. ఇక ఆ తర్వాత మస్జిద్కు నడచి వెళ్ళినందుకు, అక్కడ నమాజ్ చేసినందుకు అదనంగా పుణ్యం లభిస్తుంది. పరలోకపు అంతస్తులు పెరుగుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1027
హదీసు 1028
وعن أبي هريرةَ رضي اللَّه عنه أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِذا تَوَضَّأَ العبدُ المُسلِم أَوِ المؤْمِنُ فَغَسل وجهَهُ خَرجَ مِنْ وَجهِهِ كلُّ خطِيئَة نَظَر إِلَيْهَا بِعيْنيْهِ مَعَ الماءِ أَوْ معَ آخرِ قَطْرِ الماءِ، فَإِذا غَسل يديهِ، خَرج مِنْ يديهِ كُلُّ خَطيئَةٍ كانَ بطَشَتْهَا يداهُ مَعَ المَاءِ أَوْ مَعَ آخِر قَطْرِ الماءِ، فَإِذا غَسلَ رِجَليْهِ، خَرَجَتْ كُلُّ خَطِيئَةٍ مَشَتها رِجلاه مَعَ الماءِ أَوْ مَع آخرِ قَطرِ الماءِ، حَتَّى يخرُجَ نَقِيًّا مِن الذُّنُوبِ" رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ముస్లిం లేక విశ్వాసి అయిన దాసుడు వుజూ చేస్తూ ముఖం కడుక్కున్నప్పుడు, ఆ నీళ్ళతో పాటు లేక ఆ నీటి చివరి బొట్టుతో పాటు తను కళ్ళతో చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. తరువాత చేతులు కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళతోపాటు లేక నీటి చివరి బొట్టుతోపాటు తన చేతులు చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఇంకా అతను కాళ్ళు కడుక్కున్నప్పుడు నీళ్ళతోపాటు లేక నీటి ఆఖరి బొట్టుతో పాటు తన కాళ్ళతో నడిచి చేసిన పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఆ విధంగా అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడైపోతాడు. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “When a Muslim, or a believer, washes his face (in the course of Wudu’), every sin which he committed with his eyes, will be washed away from his face with water, or with the last drop of water; when he washes his hands, every sin which is committed by his hands will be effaced from his hands with the water, or with the last drop of water; and when he washes his feet, every sin his feet committed will be washed away with the water, or with the last drop of water; until he finally emerges cleansed of all his sins.”[Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1028
హదీసు 1029
وعنْهُ أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَتَى المقبرةَ فَقَال: "السَّلامُ عَلَيْكُمْ دَار قَومٍ مُؤْمِنينِ وإِنَّا إِنْ شَاءَ اللَّه بِكُمْ لاحِقُونَ، ودِدْتُ أَنَّا قَدْ رأَيْنَا إِخْوانَنَا": قَالُوا: أَولَسْنَا إِخْوانَكَ يَا رسُول اللَّهِ؟ قَالَ:"أَنْتُمْ أَصْحَابي، وَإخْوَانُنَا الّذينَ لَم يَأْتُوا بعد"قالوا: كيف تَعْرِفُ مَنْ لَمْ يَأْتُوا بَعْدُ مِنْ أُمَّتِكَ يَا رَسولَ الله؟ فَقَالَ:"أَرَأَيْتَ لَوْ أَنَّ رَجُلا لهُ خَيْلٌ غُرٌّ مُحجَّلَةٌ بيْنَ ظهْريْ خَيْلٍ دُهْمٍ بِهْمٍ، أَلا يعْرِفُ خَيْلَهُ؟ "قَالُوا: بلَى يَا رسولُ اللَّهِ، قَالَ:"فَإِنَّهُمْ يأْتُونَ غُرًّا مَحجَّلِينَ مِنَ الوُضُوءِ، وأَنَا فرَطُهُمْ على الحوْضِ" رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు)గారే చేసిన కథనం: దైవప్రవక్త ﷺ శ్మశానానికి వెళ్ళి, "మోమిన్ ఇంటి వారలారా! మీకు శాంతి కల్గుగాక! దైవం తలిస్తే మేము కూడా మిమ్మల్ని కలుసుకుంటాం. నాకు మా సోదరుల్ని చూడాలని ఉంది" అని అన్నారు.
అదివిని సహచరులు ఆశ్చర్యపోతూ, "దైవప్రవక్తా! మేము తమరి సోదరులం కామా?" అని అడిగారు. అందుకాయన "మీరు నా సహచరులు. సోదరులంటే ఇప్పటి వరకు పుట్టని వారని అర్థం" అని అన్నారు. "దైవప్రవక్తా! మీ అనుచర సమాజంలో ఇంకా పుట్టనివారిని తమరు ఎలా గుర్తుపట్టగలరు?" అని అడిగారు సహచరులు. అందుకు దైవప్రవక్త, "ఒక వ్యక్తి దగ్గర నుదురు, కాళ్ళు తెలుపు రంగులో ఉండే గుర్రాలుండి, అవి ముదురు నలుపురంగు గుర్రాల్లో కలిసిపోతే అతను తన గుర్రాల్ని గుర్తుపట్టలేడా చెప్పండి?" అన్నారు. దానికి సహచరులు, "గుర్తుపట్టగలడు" అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త ఇలా అన్నారు: (నా తదనంతరం వచ్చే నా అనుచరుల సంగతి కూడా అంతే). ప్రళయ దినాన వారు (హష్ర్ మైదానానికి) వచ్చినప్పుడు వారి ముఖాలు, కాళ్ళు, చేతులు వుజూ ప్రభావం మూలంగా మెరుస్తూ ఉంటాయి. నేను వారందరికంటే ముందు (కౌసర్) సరస్సు దగ్గర ఉంటాను. (ముస్లిం)
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ went to the (Baqi`) cemetery and said, “May you be secured from punishment, O dwellers of abode of the believers! We, if Allah wills, will follow you. I wish we see my brothers.” The Companions said, “O Messenger of Allah! Are not we your brothers?” He ﷺ said, “You are my Companions, but my brothers are those who have not come into the world yet.” They said; “O Messenger of Allah! How will you recognize those of your Ummah who are not born yet?” He ﷺ said, “Say, if a man has white-footed horses with white foreheads among horses which are pure black, will he not recognize his own horses?” They said; “Certainly, O Messenger of Allah!” He ﷺ said, “They (my followers) will come with bright faces and white limbs because of Wudu’; and I will arrive at the Haud (Al-Kauthar) ahead of them.”[Muslim].
ముఖ్యాంశాలు
"ఇన్నమల్ మూమినూన ఇఖ్వహ్" అన్న దివ్యఖుర్ఆన్ సూక్తి ప్రాతిపదికగా దైవప్రవక్త ﷺ తన తదనంతరం పుట్టబోయే వారినందరినీ తన సోదరులుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన హయాంలో జీవించివున్న అనుచరులకు ఒకింత అధిక ప్రాధాన్యత లభిస్తుంది. ఎందుకంటే వారు దైవప్రవక్త సోదరులే కాదు; ఆయన సహచరులు కూడా.
ప్రళయ దినాన దైవప్రవక్త ﷺ కు ప్రసాదించబడే సరస్సు గురించి కూడా ఈ హదీసులో ప్రస్తావించటం జరిగింది. ఆయన తన అనుచర సమాజానికి ఆ సరస్సు నీళ్ళు త్రాపిస్తారు. ఒకసారి ఆ నీళ్ళు త్రాగిన తర్వాత ఇక వారికి దాహమే వేయదు. అయితే ధర్మంలో కొత్తపోకడల్ని లేవనెత్తేవారు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోలేరని ఇతర హదీసులు ఉద్ఘాటిస్తున్నాయి. ఈ హదీసులో 'ఫర్తు' అనే పదం వాడబడింది. ఫర్తు అంటే ముందుగా గమ్యానికి చేరుకొని తన వెనుక వస్తున్న ప్రయాణ బృందానికి అవసరమైన ఏర్పాట్లు చేసే వాడని అర్థం. ముహమ్మదీయ అనుచర సమాజానికి ఫర్తు, స్వయంగా వారి ప్రవక్త కావటం నిజంగా వారి అదృష్టం!
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1029
హదీసు 1030
وعنْهُ أَنَّ رسُولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَلا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللَّه بِهِ الخَطَايا، ويرْفَعُ بِهِ الدَّرجاتِ؟ " قَالُوا: بَلَى يَا رَسُول اللَّهِ، قَالَ: "إِسْباغُ الوُضُوءِ عَلَى المكَارِهِ وكَثْرَةُ الخُطَا إِلَى المساجِدِ، وانْتِظَارُ الصَّلاةِ بعْد الصَّلاةِ، فَذلِكُمُ الرِّبَاطُ، فذلِكُمُ الرِّباطُ "رواه مسلم.
హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తన సహచరులనుద్దేశ్యించి, "దైవం (మానవుల) పాపాలను ప్రక్షాళనం చేసి, (వారి) అంతస్తులను పెంచేందుకు దోహదపడే విషయాలు ఏమిటో నేను మీకు చెప్పనా?" అని అడగ్గా, దానికి ఆయన సహచరులు, "తప్పకుండా చెప్పండి దైవప్రవక్తా" అని విన్నవించుకున్నారు. అప్పుడాయన ఇలా చెప్పారు: "కష్టమనిపించినప్పటికీ బాగా వుజూ చేయటం, మస్జిద్ల వైపు ఎక్కువ అడుగులు వేయటం (అంటే దూరం నుంచి రావటం), ఒక నమాజు ముగిసిన పిదప తరువాతి నమాజు కోసం ఎదురు చూడటం. ఇదే రిబాతు! ఇదే రిబాతు!!" (ముస్లిం)
(ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported that the Messenger of Allah ﷺ said, “Shall I not tell you something by which Allah effaces the sins and elevates ranks (in Jannah)?” The Companions said; “Certainly, O Messenger of Allah.” He ﷺ said, “Performing the Wudu’ thoroughly in spite of difficult circumstances, walking with more paces to the mosque, and waiting for the next As-Salat (the prayer) after observing Salat; and that is Ar-Ribat, and that is Ar-Ribat.”[Muslim].
ముఖ్యాంశాలు
'రిబాతు' అంటే సరిహద్దుపై కాపలా కాయటం, శత్రువు లోపలికి జొరబడకుండా రేయింబవళ్లు ఒకేచోట కూర్చొని పర్యవేక్షిస్తూ ఉండటం అని అర్థం. నమాజ్ చేసే వ్యక్తి ఎడతెరిపిలేకుండా తన మనసును దైవధ్యానం, దైవారాధన యందే లగ్నం చేసుకొని షైతాన్ దాన్ని లోబరచుకోకుండా కాపాడుకుంటాడు. కనుక ఒక నమాజ్ తర్వాత రెండో నమాజ్ కోసం నిరీక్షించటం రిబాత్ (సరిహద్దుపై కాపలా కాయటం) లాంటిదని చెప్పబడింది. ఈ హదీసు ఇంతకు ముందు కూడా వచ్చింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1030
హదీసు 1031
وعَنْ أَبي مَالكٍ الأَشْعرِيِّ رضَي اللَّه عنْهُ قَال: قالَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الطُّهُورُ شَطْرُ الإِيمانِ" رواه مسلم. وَقَدْ سبقَ بِطولِهِ في باب الصبرِ. وفي البابِ حديثُ عمرو بْنِ عَبْسةَ رضِيَ اللَّه عنْهُ السَّابِقُ في آخِرِ باب الرَّجاءِ، وَهُو حدِيثٌ عظيمٌ، مُشْتَمِلٌ عَلَى جُملٍ من الخيرات.
హజ్రత్ అబూ మాలిక్ అష్అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: పరిశుభ్రత సగం విశ్వాసం (ఈమాన్)కు సమానం.
(ముస్లిం)
ఈ హదీసు ఇంతకు ముందు 'సహనం' అధ్యాయంలో సుదీర్ఘంగా వచ్చింది.
ఇంతకు ముందు 'ఆశాభావం' అధ్యాయం చివర్లో వచ్చిన అమ్ర్ బిన్ అబసా(రదియల్లాహు అన్హు) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. అది చాలా ముఖ్యమైన హదీసు. అందులో ఎన్నో సత్కార్యాలను ప్రస్తావించటం జరిగింది.
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
Abu Malik Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “Wudu’ is half the Iman.”[Muslim].
ముఖ్యాంశాలు
'తుహూర్' అంటే పరిశుభ్రత అని భావం. నమాజ్ నెరవేరటానికి పరిశుభ్రత చాలా అవసరం. అశుద్ధావస్థలో నమాజ్ చేయటానికి కనీసం అనుమతి కూడా లేదు. పరిశుభ్రతే సగం విశ్వాసం (ఈమాన్) తో సమానమని చెప్పటం ద్వారా పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత వెల్లడౌతోంది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1031
హదీసు 1032
وعنْ عُمَر بْنِ الخَطَّابِ رضي اللَّه عَنْهُ عنِ النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَا مِنْكُمْ مِنْ أَحدٍ يتوضَّأُ فَيُبْلِغُ أَو فَيُسْبِغُ الوُضُوءَ ثُمَّ يقولَ: أَشْهدُ أَنْ لا إِله إِلاَّ اللَّه وحْدَه لا شَريكَ لهُ، وأَشْهدُ أَنَّ مُحمَّدًا عبْدُهُ وَرسُولُه، إِلاَّ فُتِحَت لَهُ أَبْوابُ الجنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّها شاءَ" رواه مسلم. وزاد الترمذي: "اللَّهُمَّ اجْعلْني مِنَ التَّوَّابِينَ واجْعلْني مِنَ المُتَطَهِّرِينَ".
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీలో ఎవరయినా బాగా వుజూ చేసి, ఆ తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ" (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు మరెవరూ లేరు. ముహమ్మద్ ﷺ అల్లాహ్ దాసుడు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను) అని పలికితే అతని కోసం ఎనిమిది స్వర్గద్వారాలూ తెరువబడతాయి. అతను తాను కోరిన ద్వారం గుండా లోనికి వెళ్ళవచ్చు. (ముస్లిం)
తిర్మిజీలో ఈ వాక్యాలు అదనంగా ఉన్నాయి: అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హి రీన్ (ఓ అల్లాహ్! నన్ను ఎక్కువగా పశ్చాత్తాపపడేవానిగా చెయ్యి. ఇంకా నన్ను ఎక్కువగా పరిశుద్ధతను పాటించేవానిగా చెయ్యి).
(సహీహ్ ముస్లింలోని శుచీశుభ్రతల ప్రకరణం- సుననె తిర్మిజీలోని శుచీశుభ్రతల ప్రకరణం)
English
`Umar bin Al-Khattab (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Whoever of you performs Wudu’ carefully and then affirms: `Ash-hadu an la ilaha illallahu Wahdahu la sharika Lahu, wa ash-hadu anna Muhammadan `abduhu wa Rasuluhu [I testify that there so no true god except Allah Alone, Who has no partners and that Muhammad ( ﷺ is His slave and Messenger],’ the eight gates of Jannah are opened for him. He may enter through whichever of these gates he desires (to enter).”[Muslim].
In the narration in At-Tirmidhi, it is added: “Allahummaj-`alni minat-tawwabina, waj-`alni minal-mutatahhirin (O Allah make me among those who repent and purify themselves).”
ముఖ్యాంశాలు
'తవ్వాబ్' అంటే అతి ఎక్కువగా పశ్చాత్తాపపడేవారని, దైవం వైపునకు మరలేవారని అర్థం. అదే విధంగా అతి ఎక్కువగా పరిశుభ్రతను పాటించేవారంటే పాపాలకు, అవిధేయతలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక పరిశుభ్రతను పొందేవారని భావం.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|185. వుజూ ఘనత|హదీసు 1032
You must be logged in to post a comment.