హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 181వ అధ్యాయం: ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న తర్వాత, దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 1002 – 1003) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
181. ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న తర్వాత, దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి
باب الأمر بتعهد القرآن والتحذير من تعريضه للنسيان
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1002
عَنْ أَبي مُوسَى رضِيَ اللَّه عنهُ عن النَّبِيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "تَعاهَدُوا هَذَا الْقُرآنَ فَوَالَّذي نَفْسُ مُحمَّدٍ بِيدِهِ لَهُو أَشَدُّ تَفَلُّتاً مِنَ الإِبِلِ فِي عُقُلِها" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ని పరిరక్షిస్తూ ఉండండి (నిరంతరం దాన్ని పఠిస్తూ జ్ఞాపకం ఉంచుకోండి). ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుని సాక్షి! ఖుర్‌ఆన్, త్రాడు తెంచుకొని పారిపోయే (పొగరుబోతు) ఒంటెకన్నా వేగంగా విడిపించుకొని పారిపోతుంది. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఖుర్‌ఆన్ మహాత్యాల ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “Read the Qur’an regularly. By the One in Whose Hand Muhammad’s soul is, it escapes from memory faster than a camel does from its tying ropes.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|181. ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న తర్వాత, దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి|హదీసు 1002
హదీసు 1003
وعنِ ابْنِ عُمَرَ رَضِي اللَّه عنهما أَنَّ رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "إِنَّمَا مَثَلُ صاحِبِ الْقُرْآنِ كَمَثَلِ الإِبِلِ المُعقَّلَةِ، إِنْ عَاهَد عَليْها أَمْسَكَهَا، وإِنْ أَطْلَقَهَا، ذَهَبَتْ" متفقٌ عَلَيْهِ.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈవిధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకోవటం ఒంటెను త్రాడుతో కట్టేయటం లాంటిది. దాన్ని అలాగే (కట్టేసి) కాపలా కాస్తూ ఉంటే అది ఎక్కడికి వెళ్ళకుండా ఒకచోట ఆగి ఉంటుంది. ఒకవేళ వదిలేస్తే అది ఎక్కడికైనా పారిపోతుంది.
(బుఖారీ- ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని ఖుర్‌ఆన్ మహాత్యాల ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said: “The parable of one who knows the Qur’an by heart is as the parable of an owner of hobbled camel. If he remains vigilant, he will retain it; and if he neglects it, it will go away.”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
ఇంతకు ముందు హదీసులో చెప్పబడిన విషయమే ఇందులోనూ వివరించబడింది. మొత్తం ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న వారయినా లేక ఏ కొంత భాగాన్ని కంఠస్తం చేసుకున్న వారయినా తరచూ దాన్ని పఠిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఖుర్‌ఆన్ వాక్యాలను చాలా తొందరగా మరచిపోవటానికి ఆస్కారముంది. ఖుర్‌ఆన్ పారాయణం పట్ల నిర్లక్ష్యం వహిస్తే, తాడు త్రెంచుకున్న ఒంటె వేగంగా పారిపోయినట్లు, మనిషి చాలా తొందరగా ఖుర్‌ఆన్ వాక్యాలు మరచిపోతాడని పై రెండు హదీసుల్లో చమత్కరించబడింది.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|181. ఖుర్‌ఆన్‌ను కంఠస్తం చేసుకున్న తర్వాత, దాన్ని మరచిపోకుండా గుర్తుంచుకోవాలి|హదీసు 1003
You must be logged in to post a comment.