హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 182వ అధ్యాయం: ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం. ఈ అధ్యాయంలో 5 హదీసులు (హదీసు 1004 – 1008) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
182. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం….
باب استحباب تحسين الصَّوت بالقرآن وطلب القراءة من حَسَن الصوت والاستماع لها.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 1004
عَنْ أبي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سمِعتُ رسولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "مَا أَذِنَ اللهُ لِشَيْءٍ مَا أَذِنَ لِنَبِيٍّ حَسَنِ الصَّوْتِ يَتَغَنَّى بِالْقُرْآنِ يَجْهَرُ بِهِ" متفقٌ عَلَيْهِ. مَعْنَى"أَذِنَ اللهُ": أي اسْتَمَعَ، وَهُوَ إشَارَةٌ إلى الرِّضَى وَالقُبُولِ".
దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: సుమధుర స్వరంతో గొంతెత్తి ఖుర్‌ఆన్ పారాయణం చేసే దైవప్రవక్త కంఠ స్వరాన్ని శ్రద్ధగా ఆలకించినట్లుగా దేవుడు మరే స్వరాన్నీ ఆలకించడు.
(బుఖారీ-ముస్లిం)
'అజినల్లాహు' అంటే చెవులొగ్గి వినడం అని అర్థం. ఇక్కడ దాని భావం సుమధుర స్వరంతో ఖుర్‌ఆన్ పారాయణం చేసేవాని పట్ల దేవుడు ప్రసన్నుడయి అతని ఆచరణను అంగీకరిస్తాడని.
(సహీహ్ బుఖారీలోని ఖుర్‌ఆన్ మహాత్యాల ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
AbU Hurairah (radiyallahu anhu) reported: I heard the Messenger of AllAh ﷺ saying, “Allah does not listen so attentively to anything as He listens to the recitation of the Qur’an by a Prophet who recites well with a melodious and audible voice.”[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|182. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం….|హదీసు 1004
హదీసు 1005
وعن أَبي موسى الأشْعَرِيِّ رضيَ اللهُ عنهُ أنَّ رسولَ اللهِ صلى الله عليه وسلم قالَ لهُ: " لَقَدْ أُوتِيتَ مِزْمَارَاً مِنْ مَزَامِيرِ آلِ دَاوُد" متفقٌ عَلَيْهِ. وفي روايةٍ لمسلمٍ: أنَّ رسولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وسَلَّم قالَ لهُ: "لَوْ رَأَيْتَنِي وَأَنَا أَسْتَمِعُ لِقِرَاءَتِكَ البارحَةَ".
హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ తనతో ఇలా అన్నారు: నీకు హజ్రత్ దావూద్ (అలైహి) గారి స్వర మాధుర్యంలో ఒక భాగం ప్రసాదించబడింది.
(బుఖారీ-ముస్లిం)
ముస్లింలోని వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ﷺ తనతో ఇలా కూడా అన్నారు: నిన్న రాత్రి నువ్వు ఖుర్‌ఆన్ పారాయణం చేస్తుండగా నేను విన్నాను. అప్పుడు నువ్వు, నన్ను చూసినట్లయితే (చాలా సంతోషించేవాడివి).
(సహీహ్ బుఖారీలోని ఖుర్‌ఆన్ మహాత్యాల ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Abu Musa Al-Ash`ari (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said to him, “You have been given a Mizmar (sweet melodious voice) out of the Mazamir of Prophet Dawud (David).”[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
మధురమైన కంఠం, ఇంపైన స్వరం నిజంగానే ఎంతో అమూల్యమైన దైవానుగ్రహాలు. దైవం తాను కోరినవారికి వాటిని ప్రసాదిస్తాడు. అలాంటి మహదనుగ్రహాలకు నోచుకున్న వారు చాలా అదృష్టవంతులు. ఆ అనుగ్రహానికి కృతజ్ఞతగా వారు ప్రజల ముందు ఖుర్‌ఆన్ పారాయణం చేసి వారిని ధర్మం వైపునకు పిలవటానికి ప్రయత్నించాలి. అంతేగాని ధనం కూడబెట్టుకునే ఉద్దేశ్యంతో, అశ్లీల ప్రచారానికి పూనుకొని అలాంటి మహత్తరమైన అనుగ్రహాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|182. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం….|హదీసు 1005
హదీసు 1006
وعَنِ الْبَرَاءِ بنِ عَازِبٍ رَضِيَ اللهُ عنهمَا قالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وسَلَّم قَرَأَ فِي العِشَاءِ بِالتِينِ والزَّيْتُونِ، فَمَا سَمِعْتُ أَحَدَاً أَحْسَنَ صَوْتَاً مِنْهُ. متفقٌ عَلَيْهِ.
హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హుమా) కథనం: నేనొకసారి దైవప్రవక్త ﷺ ఇషా నమాజ్‌లో 'వత్తీన్ వజ్జైతూన్…." సూరా పఠిస్తుండగా విన్నాను. ఆయనంతటి మధురస్వరంతో ఖుర్‌ఆన్ పారాయణం చేసినవారిని నేనెన్నడూ చూడలేదు. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని అజాన్ ప్రకరణం- సహీహ్ ముస్లింలోని నమాజ్ ప్రకరణం)
English
Al-Bara’ bin `Azib (radiyallahu anhuma) reported: I heard the Prophet ﷺ reciting Surat Wat-Teen Waz-Zaitun (Chapter 95) during the `Isha’ prayer. I have never heard anyone reciting it in a more beautiful voice than his.[Al-Bukhari and Muslim].
ముఖ్యాంశాలు
దైవప్రవక్త ﷺకు మొత్తం ఖుర్‌ఆన్ కంఠస్తం కావటంతోపాటు, ఆయన దాన్ని మధురాతి మధురంగా పారాయణం కూడా చేసేవారనడానికి ఈ హదీసు ఒక మచ్చుతునక. దేవుడు ఆయనకు ఎంతో ఇంపైన స్వరాన్ని అనుగ్రహించాడు. దాన్ని ఆయన ధర్మసందేశ ప్రచారం కోసం, ప్రజలకు ఖుర్‌ఆన్ సందేశం అందజేయటం కోసం వినియోగించేవారు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|182. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం….|హదీసు 1006
హదీసు 1007
وَعَنْ أَبِي لُبَابَة بَشِير بنِ عَبْدِ المُنْذِرِ رضيَ اللهُ عنهُ، أنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ لَمْ يَتَغَنَّ بِالْقُرْآنِ فَلَيْسَ مِنَّا" رواهُ أَبُو داود بإسنادٍ جيدٍ. وَمَعْنَى"يَتَغَنَّى": يُحْسِنُ صَوْتَهُ بِالْقُرْآنِ.
హజ్రత్ అబూ లుబాబా బషీర్ బిన్ అబ్దుల్ ముంజిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఖుర్‌ఆన్‌ను ఇంపుగా పారాయణం చేయనివాడు మాలోని వాడుకాడు (అతను మా పద్ధతిని అనుసరించట్లేదు). (అబూదావూద్ దీన్ని ఉత్తమ ఆధారాలతో వెలికితీశారు.)
(సుననె అబూదావూద్‌లోని నమాజ్ ప్రకరణం)
English
Abu Lubabah Bashir bin `Abdul-Mundhir (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “He who does not recite the Qur’an in a pleasant tone is not of us.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|182. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం….|హదీసు 1007
హదీసు 1008
وَعَنْ ابْنِ مَسْعُودٍ رضيَ اللهُ عنهُ قالَ: قَالَ لِي النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وسَلَّم: "اقْرَأْ عَلَيَّ الْقُرْآنَ"، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ، أَقْرَأُ عَلَيْكَ وَعَلْيكَ أُنْزِلَ؟! قَالَ:"إِنِّي أُحِبُّ أَنْ أَسْمَعَهُ مِنْ غَيْرِي"فَقَرَأْتُ عَلَيْهِ سُورَةَ النِّسَاءِ حَتَّى جِئْتُ إِلى هذهِ الآيَة: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَى هؤُلاءِ شَهِيدَاً} [النساء: ٤١] قالَ:"حَسْبُكَ الآنَ "فالْتَفَتُّ إِلَيْهِ، فَإِذَا عَيْنَاهُ تَذْرِفَان. متفقٌ عليه.
హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకసారి దైవప్రవక్త ﷺ నాతో మాట్లాడుతూ, "(ఇబ్నె మస్‌వూద్!) నాకు ఖుర్‌ఆన్ చదివి వినిపించు" అని కోరారు. దానికి నేను, "దైవప్రవక్తా! ఖుర్‌ఆన్ అవతరించింది మీపైనే కదా! అలాంటప్పుడు మీకు నేను ఖుర్‌ఆన్ చదివి వినిపించటవేంటి?" అని ఆశ్చర్యపోతూ అడిగాను. "(ఎందుకో!) నాకు ఇతరుల ద్వారా ఖుర్‌ఆన్ పారాయణం వినాలనిపిస్తోంది" అని అన్నారాయన. అప్పుడు నేను, 'నిసా' సూరా పారాయణం చేయటం మొదలెట్టాను. అలా నేను పారాయణం చేస్తూ, "మేము ప్రతి అనుచర సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, నిన్ను (అంటే ముహమ్మద్ ప్రవక్తను) వారందరికీ సాక్షిగా నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమవుతుంది?" అనే సూక్తి దగ్గరికి చేరుకోగానే "ఇక చాలు ఆపెయ్యి" అన్నారాయన. నేను తలపైకెత్తి చూస్తే ఆయన కళ్ళ వెంబడి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి. (బుఖారీ-ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం- సహీహ్ ముస్లింలోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
English
Ibn Mas`ud (radiyallahu anhu) reported: The Prophet ﷺ said to me, “Recite the Qur’an to me.” I said: “O Messenger of Allah! Shall I recite it to you when it was revealed to you?” He ﷺ said, “I like to hear it from others.” Then I began to recite Surat An-Nisa’. When I reached the Ayah: `How will it be when We shall bring a witness from every people and bring you as a witness against them?’ (Having heard it) he said, “Enough! Enough!” When I looked at him, I found his eyes were overflowing with tears.[Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|మహత్యాల ప్రకరణం|182. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం చేయటం అభిలషణీయం, మధురంగా పారాయణం చేసే వారిచేత ఖుర్‌ఆన్ చదివించుకొని మరీ వినటం, దాన్ని శ్రద్ధగా ఆలకించటం….|హదీసు 1008
You must be logged in to post a comment.