హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 173. ప్రయాణంలో ఎవరయినా తమకు కీడు తలపెడతారేమోనన్న భయముంటే ఈ దుఆ చేసుకోవాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 173వ అధ్యాయం: ప్రయాణంలో ఎవరయినా తమకు కీడు తలపెడతారేమోనన్న భయముంటే ఈ దుఆ చేసుకోవాలి. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 981) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

173. ప్రయాణంలో ఎవరయినా తమకు కీడు తలపెడతారేమోనన్న భయముంటే ఈ దుఆ చేసుకోవాలి

↑ విషయ సూచిక

باب مَا يدعو بِهِ إِذَا خاف ناساً أَوْ غيرهم

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

981

హదీసు 981

عن أَبي موسى الأشعرِيِّ رَضي اللَّه عنهُ أَنَّ رسولَ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم كانَ إِذَا خَافَ قَوماً قَالَ: "اللَّهُمَّ إِنَّا نجعلُكَ في نحورِهِمْ، ونعُوذُ بِك مِنْ شرُوِرِهمْ" رواه أَبُو داود، والنسائي بإسنادٍ صحيح.

హజ్రత్ అబూ మూసా అష్‌అరీ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఎవరయినా తమకు కీడు తలపెడతారేమోనన్న భయముంటే ఈ దుఆ చేసేవారు: "అల్లాహుమ్మ ఇన్నా నజ్‌అలుక ఫీ నుహూరిహిమ్ వ నవూజు బిక మిన్ షురూరిహిమ్." (దేవా! మేము నిన్ను వారి ముందుంచుతున్నాం. వారి కీడు నుండి నీ శరణు వేడుతున్నాం).

(అబూ దావూద్, నసాయి – దీని ఆధారాలు దృఢమైనవి)

(సుననె అబూ దావూద్‌లోని నమాజ్ ప్రకరణం)

English

Abu Musa Al-Ashari (radiyallahu anhu) reported: When the Messenger of Allah ﷺ, feared mischief from a people, he would supplicate: “Allahumma inna naj`aluka fi nuhurihim, wa na`udhu bika min shururihim (O Allah! We ask You to face them, and seek Your Protection against their evil.”[Abu Dawud and An-Nasa’i].

ముఖ్యాంశాలు

'నుహూర్' అనేది నహ్ర్‌కు బహువచనం. గొంతు దగ్గర కోయబడే చోటుని నహ్ర్ అంటారు. "మేము నీ సహాయాన్ని రక్షక కవచంగా భావిస్తున్నాం. ఈ అవిశ్వాసుల కుట్రల్ని నీవే మావైపు నుంచి వారిమీదకు తిప్పికొట్టాలి" అని పై ప్రార్థనకు భావం. ప్రయాణంలో శత్రువు బెడద ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి సమయంలో ఈ ప్రార్థనకు ప్రత్యేక ప్రాముఖ్యముంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|173. ప్రయాణంలో ఎవరయినా తమకు కీడు తలపెడతారేమోనన్న భయముంటే ఈ దుఆ చేసుకోవాలి|హదీసు 981