హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 172వ అధ్యాయం: ప్రయాణావస్థలో 'దుఆ' చేయటం మంచిది. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 980) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
172. ప్రయాణావస్థలో 'దుఆ' చేయటం మంచిది
باب استحباب الدعاء في السفر
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 980
عن أَبي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ قالَ: قالَ: رسولُ الله صلى الله عليه وسلم: " ثَلاثُ دَعَوَاتٍ مُسْتجَابَاتٌ لاَ شَكَّ فِيهنَّ: دَعْوَةُ المَظلومِ، وَدَعْوَةُ المسَافِرِ، وَدَعْوَةُ الوَالِدِ عَلى وَلدِهِ " رواه أَبُو داود والترمذي وقال: حديث حسن. وليس في رواية أَبي داود: "على ولِدِه".
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ముగ్గురి ప్రార్థనలు అంగీకరించబడతాయి. అందులో ఎలారటి సందేహం లేదు. (1) బాధితుని ఆర్తనాదం. (2) ప్రయాణీకుని ప్రార్థన. (3) తండ్రి తన సంతానానికిచ్చే శాపం. (అబూ దావూద్, తిర్మిజీ – తిర్మిజీ దీన్ని 'హసన్'కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు).
(సుననె అబూదావూద్లోని నమాజ్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Three supplications are answered without doubt. The supplication of the oppressed, the supplication of the traveller, and the supplication of the parent for his son.”[At-Tirmidhi and Abu Dawud].
ముఖ్యాంశాలు
బాధితుడు తన మీద దౌర్జన్యం చేసినవారిని శపిస్తాడు. ఆ సమయంలో తనకు సహాయం చేసినవారిని దేవుడు చల్లగా చూడాలని దీవిస్తాడు. ప్రయాణీకుడు ప్రయాణావస్థలో ఉన్నప్పుడు తనమీద ఎవరయినా దౌర్జన్యం చేస్తే వారిని శపిస్తాడు. ఆ సమయంలో తనను ఆదుకున్నవారికి మంచి జరగాలని ప్రార్థిస్తాడు. అలాగే సంతానం తమ తల్లి దండ్రులపట్ల ఉత్తమంగా వ్యవహరిస్తూ, వారికి సేవలు చేస్తూ ఉంటే వారు సంతానాన్ని దీవిస్తారు. అలాగాకుండా సంతానం తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు పిల్లల్ని శపించనూవచ్చు. శాపం కూడా వాస్తవానికి ఒక ప్రార్థనే. పైన పేర్కొనబడిన ఈ మూడు రకాల వ్యక్తులు ప్రార్థిస్తే, దేవుడు వారి ప్రార్థనల్ని తప్పకుండా అంగీకరిస్తాడు. కనుక ఎల్లప్పుడూ బాధితుల, ప్రయాణీకుల, తల్లిదండ్రుల దీవెనల్ని మాత్రమే అందుకోవటానికి ప్రయత్నించాలిగాని వారి శాపానికి గురికాకూడదు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|172. ప్రయాణావస్థలో 'దుఆ' చేయటం మంచిది|హదీసు 980
You must be logged in to post a comment.