హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 174. ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 174వ అధ్యాయం: ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 982 – 983) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

174. ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి

↑ విషయ సూచిక

باب مَا يقول إِذَا نزل منْزلاً

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

982

హదీసు 982

عن خَولَة بنتِ حكيمٍ رَضي اللَّهُ عنها قالتْ: سمعْتُ رَسُولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقولُ: "مَنْ نَزلَ مَنزِلاً ثُمَّ قَالَ: أَعُوذُ بِكَلِمات اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ، لَمْ يضرَّه شَيْءٌ حتَّى يرْتَحِل مِنْ منزِلِهِ ذلكَ" رواه مسلم.

దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్ ఖౌలా బిన్తె హకీమ్ (రదియల్లాహు అన్హా) తెలియజేశారు : (ప్రయాణంలో) ఎక్కడయినా దిగినప్పుడు ఈ వాక్యాలు పఠించేవారికి తిరిగి ఆ ప్రదేశం నుండి బయలుదేరే వరకు ఎలాంటి కీడూ జరగదు –

"అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్"

నేను దేవుని సంపూర్ణ వచనాల ఆధారంగా యావత్తు సృష్టి కీడు నుండి ఆయన శరణు వేడుతున్నాను. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని దైవధ్యానం, ప్రార్థనల ప్రకరణం)

English

Khaulah bint Hakim (radiyallahu anha) reported: I heard the Messenger of Allah ﷺ saying, “Whosoever alights somewhere and says: `A`udhu bikalimat-illahit-tammati min sharri ma khalaqa (I seek refuge with the Perfect Words of Allah from the evil of what He has created),’ nothing will harm him until he leaves that place.”[Muslim].

ముఖ్యాంశాలు

ఇక్కడ 'వచనాలు' అంటే దేవునికి చెందిన ఆదిమధ్యాంతరహిత గుణవిశేషాలు అని అర్థం. 'సంపూర్ణ' వచనాలంటే ఎలాంటి లోపానికి గాని, దోషానికిగాని ఆస్కారం లేని దేవుని పవిత్ర నామాలు, గుణవిశేషాలని భావం. ప్రయాణంలో ఎక్కడయినా దిగేముందు ఈ వాక్యాలు చదువుకునే మనిషి దైవకృపతో అన్నిరకాల కీడుల నుంచి రక్షణపొందుతాడు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|174. ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి|హదీసు 982

983

హదీసు 983

وعن ابن عمرو رَضي اللَّه عنهمَا قَالَ: كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذَا سَافَرَ فَأَقبَلَ اللَّيْلُ قال: " يَا أَرْضُ ربِّي وَربُّكِ اللَّه، أَعُوذُ بِاللَّهِ مِنْ شرِّكِ وشَرِّ ما فِيكِ، وشر ماخُلقَ فيكِ، وشَرِّ ما يدِبُّ عليكِ، وأَعوذ باللَّهِ مِنْ شَرِّ أَسدٍ وَأَسْودٍ، ومِنَ الحيَّةِ والعقربِ، وَمِنْ سَاكِنِ البلَدِ، ومِنْ والِدٍ وَمَا وَلَد "رواه أبو داود. "والأَسودُ"الشَّخص، قال الخَطَّابي:"وسَاكِن البلدِ": هُمُ الجنُّ الَّذِينَ همْ سُكَّان الأرْضِ. قَالَ: وَالبَلَد مِنَ الأَرْضِ مَا كَانَ مأْوى الحَيوَانِ وإنْ لَمْ يَكنْ فِيهِ بِنَاء وَمَنازلُ قَالَ: ويحتَمِلُ أَنَّ المُرَادَ"بِالوالِدِ": إِبلِيسُ"وَمَا ولد": الشَّيَاطِينُ.

హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం: ప్రయాణంలో రాత్రి అయితే దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రార్థించేవారు : "ఓ భూమీ! నీకూ నాకూ ప్రభువు అల్లాహ్‌యే. నేను అల్లాహ్ శరణు వేడుతున్నాను. నీ కీడు నుంచి, నీలో వున్నవాటి కీడు నుంచి, నీలో పుట్టించబడినవాటి కీడు నుంచి, నీ ఉపరితలంపై నడిచేవాటి నుంచి, ఇంకా పులుల నుంచి, పెద్ద సర్పాలనుంచి, చిన్న పాముల నుంచి, భూలోకవాసుల నుంచి, తండ్రి నుంచి, అతని సంతానం నుంచి కూడా నేను అల్లాహ్ శరణువేడుతున్నాను." (అబూ దావూద్)

ఇమామ్ ఖత్తాబీ ఇలా అంటున్నారు : పై హదీసులో భూలోకవాసులంటే భూమిలో విహరించే జిన్నాతులు అని అర్థం. బహుశా తండ్రి అంటే ఇబ్లీసు అనీ, సంతానమంటే షైతానులు అని భావం కావచ్చు.

(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Ibn `Umar (radiyallahu anhuma) reported: Whenever the Messenger of Allah ﷺ set out on a journey, he would say by nightfall: “Ya ardu, Rabbi wa Rabbuk-illahu, a`udhu billahi min sharriki wa sharri ma fiki, wa sharri ma khuliqa fiki, wa sharri ma yadibbu `alaiki; a`udhu billahi min sharri asadin wa aswadin, wa minal-hayyati wal-`aqrabi, wa min sakinil-baladi, wa min walidin wa ma walad [O land, my Rubb and your Rubb is Allah, I seek refuge in Him from your evils, the evils of what you contain, the evils of what has been created in you, and the evils of what walks upon you. I seek refuge in Allah from lions, black serpents, scorpions and from the inhabitants of the place, and from the parent (i.e., Satan) and his offspring who inhabit a settlement (i.e., helpers from amongst the devils)].”[Abu Dawud].

ముఖ్యాంశాలు

ఎంతో సమగ్రమైన, భావగర్భితమైన ప్రార్థనా వచనాలు ఇవి. భూమిలో ఉన్నవి అంటే హానికరమైన జంతువులు, నేలమీద పాకే విషపూరిత జంతువులు అని అర్థం. నీలో పుట్టించబడినవి అంటే చెట్టు మొదలగు వాటికి ఢీ కొనటం కావచ్చు. ప్రయాణంలో రాత్రిపూట ఇలాంటి ప్రమాదాలు జరగటానికి చాలా ఎక్కువ అవకాశాలుంటాయి. అంచేత ప్రయాణంలో ముఖ్యంగా రాత్రిపూట ఈ దుఆ చేసుకోవాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|174. ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి|హదీసు 983