హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 167వ అధ్యాయం: ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవర్నయినా ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి. ఈ అధ్యాయంలో 4 హదీసులు (హదీసు 958 – 961) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
167. ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవర్నయినా ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి…
باب استحباب طلب الرفقة وتأميرهم عَلَى أنفسهم واحداً يطيعونه
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 958
عَن ابْنِ عُمَرَ رضِيَ اللَّه عَنْهُما قَالَ: قَالَ رسُولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "لَوْ أَنَّ النَّاسَ يَعْلَمُونَ مِنَ الوحْدةِ مَا أَعَلمُ مَا سَارَ رَاكِبٌ بِلَيْلٍ وحْدَهُ" رواه البخاري.
హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ఒంటరిగా ప్రయాణం చేయటం వల్ల కలిగే నష్టమేమిటో నాకు తెలిసినట్టుగా ప్రజలకు తెలిస్తే వారిలో ఏ రౌతూ రాత్రిపూట ఒంటరిగా ప్రయాణానికి సిద్ధపడడు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)
English
Ibn `Umar (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “Were people to know of what I know about the dangers of travelling alone, no rider would travel alone at night.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|167. ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవర్నయినా ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి…|హదీసు 958
హదీసు 959
وعن عمرِو بن شُعَيْبٍ، عن أَبيه، عن جَدِّهِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "الرَّاكِبُ شَيطَانٌ، والرَّاكِبان شَيطَانانِ، والثَّلاثَةُ رَكبٌ ". رواه أَبُو داود، والترمذي، والنسائي بأَسانيد صحيحة، وقال الترمذي: حديثٌ حسن.
హజ్రత్ అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయన తన తాతగారి నుంచి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : ఒక రౌతు షైతాను. ఇద్దరు రౌతులు కూడా షైతానులే. ముగ్గురు రౌతులుంటే ఒక ప్రయాణబృందం ఏర్పడగలదు.
అబూ దావూద్, తిర్మిజీ, నసాయీ తదితరులు దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని హసన్‌గా పేర్కొన్నారు.
(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)
English
`Amr bin Shu`aib (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “A single rider is (accompanied with) Satan and two riders are (accompanied with) two Satans. Three riders form a group.”[At-Tirmidhi and Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|167. ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవర్నయినా ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి…|హదీసు 959
హదీసు 960
وعن أَبي سعيدٍ وأَبي هُريرةَ رضيَ اللَّهُ تَعَالَى عَنْهُمَا قَالا: قَال رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذا خَرَج ثَلاثَةٌ في سفَرٍ فليُؤَمِّرُوا أَحدهم" حديث حسن، رواه أَبُو داود بإسنادٍ حسن.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ మరియు అబూ హురైరా (రదియల్లాహు అన్హు)ల కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: ముగ్గురు వ్యక్తులు (ఒక బృందంగా ఏర్పడి) ప్రయాణం చేసినప్పుడు వారు తమలో ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవాలి.
(ఈ హదీసు ప్రామాణికమైనది. అబూ దావూద్ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖించారు)
(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri and Abu Hurairah (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ said, “When three persons set out on a journey, they should appoint one of them as their leader.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|167. ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవర్నయినా ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి…|హదీసు 960
హదీసు 961
وعن ابْنِ عبَّاسٍ رضِي اللَّهُ عَنْهُما عن النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "خَيرُ الصَّحَابةِ أَرْبَعَةٌ، وَخَيْرُ السَّرايا أَرْبَعُمِائَةٍ، وخَيرُ الجُيُوش أَرْبعةُ آلافٍ، ولَن يُغْلَبَ اثْنَا عَشَرَ أَلْفاً منْ قِلَّة "رواه أَبُو داود والترمذي وقال: حديث حسن.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : నలుగురు మిత్రులతో కూడిన (ప్రయాణ) బృందం అత్యుత్తమ ప్రయాణబృందం. నాలుగొందల మందితో కూడిన సైనిక పటాలం అత్యుత్తమ సైనిక పటాలం. నాలుగు వేల మందితో కూడిన సైనిక దళం అత్యుత్తమ సైనిక దళం. పన్నెండువేల మందితో కూడిన సైనిక దళం తక్కువ సంఖ్య నెపంతో ఎన్నడూ ఓడిపోదు.
(అబూ దావూద్, తిర్మిజీలు దీన్ని ఉల్లేఖించారు. తిర్మిజీ దీన్ని 'హసన్' కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు)
(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని యుద్ధాల అధ్యాయం)
English
Ibn `Abbas (radiyallahu anhuma) reported: The Prophet ﷺ said, “The best number of companions is four; the best detachment is four hundred and the best army is four thousand; and twelve thousand men will not be defeated as a result of smallness of number.”[At-Tirmidhi and Abu Dawud].
ముఖ్యాంశాలు
కాలినడకన గాని, వాహంనంపైగాని రేయింబవళ్ళలో ఎప్పుడయినా ఒంటరిగా ప్రయాణం చేయటం ఎంతయినా ప్రమాదకరమే. ఒంటరిగా ప్రయాణించటం వల్ల మనిషి ఎన్నో భౌతిక, మానసిక కష్టాలకు గురయ్యే ప్రమాదముంది. ఒంటరిగా ప్రయాణించేవారి వెంట షైతాన్ ఉంటాడు. ఒంటరి వ్యక్తి చాలా సులభంగా పైశాచిక దుష్టప్రభావాలకు లోనవుతాడు. ఇద్దరు వ్యక్తుల్ని కూడా షైతాన్ తన జిత్తులతో లొంగదీసుకోగలడు. అందుకే ప్రయాణం చేసేటప్పుడు కనీసం ముగ్గురు వ్యక్తులయినా కలిసి ప్రయాణించాలనీ, ప్రయాణం చేసేటప్పుడు తమలో ఒకర్ని నాయకునిగా ఎన్నుకోవాలని దైవప్రవక్త ﷺ ప్రబోధించారు.
కొందరు ఒక బృందంగా ఏర్పడి ప్రయాణం చేస్తున్నప్పుడు వారందరూ తమ నాయకునికి విధేయత చూపాలి. ప్రయాణావస్థలో తమ నాయకుని ఆదేశాలకు అనుగుణంగా మసలుకోవాలి. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. బహుశా ఆ లాభాలను దృష్టిలో పెట్టుకునేనేమో కొంతమంది పండితులు ప్రయాణస్థితిలో నాయకుణ్ణి ఎన్నుకోవటం 'వాజిబ్' (తప్పనిసరి) అని అభిప్రాయపడ్డారు. అయితే అత్యధికమంది విద్వాంసులు మాత్రం ప్రయాణంలో నాయకుని (అమీర్) ఎన్నికను అభిలషణీయమైన అంశంగానే పరిగణించారు. గ్రంథకర్త ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) అభిప్రాయం కూడా అదే!
ప్రయాణం చేసేటప్పుడు ఎంత ఎక్కువమంది కలిసి ప్రయాణిస్తే అంత మంచిది. అందుకే చివరి హదీసులో నలుగురు వ్యక్తులతో కూడిన ప్రయాణ బృందాన్ని అత్యుత్తమ ప్రయాణ బృందంగా చెప్పటం జరిగింది. ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకో విషయం ఏమిటంటే, పన్నెండు వేల మందితో కూడిన సైనికదళం దృఢచిత్తంతో, ధర్మంపై సంపూర్ణ విశ్వాసంతో పోరాడితే ప్రపంచంలోని ఏ శక్తీ దాన్ని ఓడించజాలదు. ఒకవేళ అది ఓడిపోతే శత్రుసైన్యం కన్నా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఓడిపోయిందని చెప్పకూడదు. దాని ఓటమికి వేరే కారణాలేవయినా ఉండి ఉండవచ్చు.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|167. ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవర్నయినా ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి…|హదీసు 961
You must be logged in to post a comment.