హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 168వ అధ్యాయం: ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి. ఈ అధ్యాయంలో 7 హదీసులు (హదీసు 962 – 968) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…

↑ విషయ సూచిక

باب آداب السير والنزول والمبيت والنوم في السفر واستحباب السُّرَى والرفق بالدواب ومراعاة مصلحتها وجواز الإرداف عَلَى الدابة إِذَا كانت تطيق ذلك وأمر من قصّر في حقها بالقيام بحقها.

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

962

హదీసు 962

عن أَبي هُرَيْرَة رضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قالَ رَسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إِذَا سافَرْتُم فِي الخِصْبِ فَأعْطُوا الإِبِلَ حظَّهَا مِنَ الأَرْضِ، وإِذا سافَرْتُمْ في الجَدْبِ، فَأَسْرِعُوا عَلَيْهَا السَّيْرَ وَبادروا بِهَا نِقْيَهَا، وَإذا عرَّسْتُم، فَاجتَنِبُوا الطَّريقَ، فَإِنَّهَا طرُقُ الدَّوابِّ، وَمأْوى الهَوامِّ باللَّيْلِ "رواه مسلم. مَعنَى"اعطُوا الإِبِلَ حَظها مِنَ الأرْضِ"أَيْ: ارْفقُوا بِهَا في السَّيرِ لترْعَى في حالِ سيرِهَا، وَقوله:"نِقْيَها"هُوَ بكسر النون، وإسكان القاف، وبالياءِ المثناة من تَحْت وَهُوَ: المُخُّ، معناه: أَسْرِعُوا بِهَا حَتَّى تَصِلُوا المَقِصد قَبلَ أَنْ يَذهَبَ مُخُّها مِن ضَنكِ السَّيْرِ. وَ"التَّعْرِيسُ": النزُولُ في الليْل.

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు: మీరు పచ్చిక బయళ్ళగుండా ప్రయాణం చేసినప్పుడు, మీ ఒంటెకు అక్కడ మేతమేసే అవకాశం ఇవ్వండి. నెర్రలు విచ్చిన నేలగుండా ప్రయాణం చేసినప్పుడు దాన్ని వేగంగా పరుగెత్తించండి. దాని సత్తువ నశించక ముందే త్వరగా గమ్యానికి చేరిపోండి. మీరెక్కడయినా రాత్రిపూట మజిలీ చేయదలచుకుంటే దారుల్లో మజిలీ చేయకండి. ఎందుకంటే రాత్రిపూట వాటిగుండా జంతువులు వస్తూపోతూ ఉంటాయి. అదీగాక రాత్రిపూట అవి పురుగులకు స్థావరాలయి ఉంటాయి.

(ముస్లిం)

(సహీహ్ బుఖారీ – నాయకత్వ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said: “When you travel through green and lush land, give the camels their due from the ground, and when you travel through a dry and barren land, make them walk quickly lest their strength falters. When you encamp at night, keep away from the roads, for beasts pass there and they are the resort of insects at night.”[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 962

963

హదీసు 963

وعن أَبي قَتَادةَ رضيَ اللَّهُ عنهُ قَالَ: كانَ رَسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم إِذا كانَ فِي سفَرٍ، فَعَرَّسَ بلَيْلٍ اضْطَجَعَ عَلى يَمينِهِ، وَإِذا عَرَّس قُبيْلَ الصُّبْحِ نَصَبَ ذِرَاعَهُ وَوَضَعَ رَأْسَهُ عَلى كَفِّه. رواه مسلم. قَالَ العلماءُ: إَِّنما نَصَبَ ذِرَاعهُ لِئلاَّ يسْتَغْرِقَ في النَّوْمِ فَتَفُوتَ صلاةُ الصُّبْحِ عنْ وقْتِهَا أَوْ عَنْ أَوَّلِ وَقْتِهَا.

హజ్రత్ అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ప్రయాణంలో ఉన్నప్పుడు రాత్రిపూట ఎక్కడయినా మజిలీ చేస్తే కుడివైపుకు తిరిగి పడుకునేవారు. అదే ఉషోదయానికి కాస్త ముందు ఎక్కడయినా ఆగితే కుడిచేతిని ఎత్తిపెట్టి అరచేతిమీద తల ఉంచుకొని పడుకునేవారు. (ముస్లిం)

గాఢ నిద్రలోకి జారిపోతే ఉదయం నమాజ్ వేళ తప్పించిగాని లేదా తొలివేళ తప్పించిగాని చేయవలసి వస్తుందన్న భయంతో దైవప్రవక్త ﷺ ఆ సమయంలో ఆ విధంగా చేతిని ఎత్తిపెట్టుకొని నిద్రపోయే వారని విద్వాంసులు అభిప్రాయపడ్డారు.

(సహీహ్ ముస్లింలోని మస్జిదుల ప్రకరణం)

English

Abu Qatadah (radiyallahu anhu) reported: When the Messenger of Allah ﷺ encamped at night during a journey, he would lie down on his right side, and when he stayed a little before dawn he would raise his forearm and place his head on the palm of his hand.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 963

964

హదీసు 964

وعنْ أَنسٍ رضي اللَّه عنهُ قَال: قَالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم:"عَلَيْكُمْ بِالْدُّلْجَةِ، فَإِنَّ الأَرْضَ تُطْوَى بِاللَّيلِ" رواه أَبُو داود بإسناد حسن. "الدُّلجَة"السَّيْرُ في اللَّيْلِ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు : రాత్రిపూట ప్రయాణం చేయండి. ఎందుకంటే రాత్రిపూట భూమి చుట్టివేయబడుతుంది.

(అబూ దావూద్ – హసన్)

(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “Keep to travelling by night because the earth is folded (traversed more easily) during the night.”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 964

965

హదీసు 965

وعنْ أَبي ثَعْلَبةَ الخُشَنِي رَضي اللَّه عنهُ قَالَ: كانَ النَّاسُ إِذَا نَزَلُوا مَنْزلاً تَفَرَّقُوا في الشِّعابِ والأَوْدِيةِ. فقالَ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم: "إنَّ تَفَرُّقَكُمْ فِي هَذِهِ الشِّعابِ وَالأوْدِية إِنَّما ذلكُمْ منَ الشَّيْطَان،" فَلَمْ ينْزلُوا بعْدَ ذَلِكَ منْزلاً إِلاَّ انْضَمَّ بَعضُهُمْ إِلَى بعْضٍ. رواه أَبُو داود بإسناد حسن.

హజ్రత్ అబూ సాలబా ఖుషనీ (రదియల్లాహు అన్హు) కథనం : ప్రయాణంలో ఎక్కడయినా మజిలీ చేసినప్పుడు ప్రయాణీకుల బృందంలోని వారందరూ విడిపోయి వేర్వేరు లోయల్లోకి, కనుమల్లోకి వెళ్ళిపోయేవారు. ఒకసారి దైవప్రవక్త ﷺ ప్రయాణీకులు అలా విడిపోవటం చూసి, "ఈ విధంగా మీరు తలా ఓ కనుమలోకి, లోయలోకి వెళ్ళటం షైతాన్ చేష్ట" అని అన్నారు.

అప్పట్నుంచి ఆయన అనుచరులు ఎక్కడ మజిలీ చేసినా అందరూ ఒకేచోట కలిసి ఉండేవారు.

(అబూ దావూద్-హసన్)

(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Abu Tha`labah Al-Khushani (radiyallahu anhu) reported: Whenever the people encamped during the journey, they would disperse in the mountain passes and valleys. (When) the Messenger of Allah ﷺ noticed this he said, “Your act of scattering in the mountain passes and valleys is from Satan.” Afterwards the Companions kept close together whenever they encamped.[Abu Dawud].

ముఖ్యాంశాలు

ప్రయాణంలో వీలైనంతవరకు తోటిప్రయాణీకులంతా కలిసి ఉండటం, మార్గమధ్యంలో ఎక్కడైనా మజిలీ చేయదలిస్తే అందరూ ఒకేచోట ఆగటం ఉత్తమం. ఎందుకంటే మధ్యలో ఎవరికైనా ఏదయినా ప్రమాదం జరిగితే వెంటనున్నవారు అతన్ని రక్షించగల్గుతారు. అలాగాకుండా చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోతే వారిలో ఎవరైనా ప్రమాదం బారిన పడవచ్చు. అందుకే దైవప్రవక్త ﷺ ప్రయాణీకులు విడివిడిగా ఉండటాన్ని అసహ్యించుకున్నారు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 965

966

హదీసు 966

وعَنْ سَهْلِ بنِ عمرو وَقيلَ سَهْلِ بن الرَّبيعِ بنِ عَمرو الأنْصَاريِّ المَعروفِ بابنِ الحنْظَليَّةِ، وهُو منْ أهْل بَيْعةِ الرِّضَوان، رضيَ اللَّه عنه قالَ: مرَّ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم ببعِيرٍ قَدْ لَحِقَ ظَهْرُهُ ببطْنِهِ فَقَالَ: "اتَّقُوا اللَّه في هذِهِ البهَائمِ المُعْجمةِ فَارْكبُوها صَالِحَةً، وكُلُوها صالحَة" رواه أَبُو داود بإسناد صحيح.

హజ్రత్ సహ్ల్ బిన్ అమర్ లేదా సహ్ల్ బిన్ రబీ బిన్ అమ్ర్ అన్సారీ ఉరఫ్ ఇబ్నె హంజలియ్యా – రిజ్వాన్ ప్రమాణంలో పాల్గొన్నవారిలో ఈయన ఒకరు- చేసిన కథనం : పొట్ట వీపుకు అతుక్కుపోయినట్లుగా బాగా బక్కచిక్కి ఉన్న ఒక ఒంటె సమీపం నుండి దైవప్రవక్త ﷺ వెళ్తూ దాని పరిస్థితి చూసి, "నోరులేని ఈ జంతువుల విషయంలో అల్లాహ్‌కు భయపడండి. అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిమీద స్వారీ చేయండి. ఇంకా అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటి మాంసాన్ని భుజించండి" అని చెప్పారు.

(అబూ దావూద్ దీనిని దృఢమైన ఆధారాలతో వెలికితీశారు)

(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Sahl bin `Amr known as Ibn Al-Hanzaliyyah reported: The Messenger of Allah ﷺ happened to pass by a camel whose belly was sticking to its back (because of hunger), whereupon he said, “Fear Allah in respect of these dumb (animals). Ride them while they are fit, and slaughter them and eat their meat when they are fit.”[Abu Dawud].

ముఖ్యాంశాలు

నోరులేని జంతువుల పట్ల దయతో వ్యవహరించాలని ఈ హదీసులో తాకీదు చేయబడింది. నోరులేని జంతువులు తమకు ఆకలి వున్నా, తమమీద శక్తికి మించిన బరువు మోపబడినా ఆ బాధను భరించటం తప్ప వాటికి గత్యంతరం లేదు. అవి తమ బాధను చెప్పుకోలేవు. అంచేత మనుషులే వాటి బాధను అర్థం చేసుకొని దయతో వ్యవహరించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ప్రళయదినాన దేవుని సన్నిధిలో జంతువుల పట్ల తమ వ్యవహారం గురించి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 966

967

హదీసు 967

وعَن أَبي جعفرٍ عبدِ اللَّهِ بنِ جعفرٍ، رضيَ اللَّه عنهما قَالَ: أَرْدفني رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم، ذَاتَ يَوْم خَلْفَه، وَأسَرَّ إِليَّ حدِيثاً لا أُحَدِّث بِهِ أحَداً مِنَ النَّاسِ، وكانَ أَحبَّ مَا اسْتَتَر بِهِ رسولُ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم لِحاجَتِهِ هَدَفٌ أَوْ حَائشُ نَخل. يَعْني: حَائِطَ نَخْل: رواه مسلم هكذا مختصراً. وزادَ فِيهِ البَرْقانيُّ بإِسناد مسلم: بعد قَوْله: حائشُ نَخْلٍ: فَدَخَلَ حَائطاً لِرَجُلٍ منَ الأَنْصارِ، فَإذا فِيهِ جَمَلٌ، فَلَمَّا رَأى رسولَ اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم جرْجرَ وذَرفَتْ عَيْنَاه، فأَتَاهُ النبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم فَمَسَحَ سَرَاتَهُ أَي: سنامَهُ وَذِفْرَاهُ فَسكَنَ، فَقَالَ: "مَنْ رَبُّ هَذَا الجَمَلِ، لِمَنْ هَذا الجَمَلُ؟ "فَجاءَ فَتى مِنَ الأَنصَارِ فقالَ: هَذَا لِي يَا رسولَ اللَّه. فقالَ:"أَفَلا تَتَّقِي اللَّه في هذِهِ البَهيمَةِ الَّتي مَلَّكَكَ اللَّهُ إياهَا؟ فإنَّهُ يَشْكُو إِليَّ أَنَّكَ تُجِيعُهُ وَتُدْئِبُهُ ".ورواه أَبُو داود كروايةِ البَرْقاني. قَوْله:"ذِفْرَاه"هُوَ بكسر الذال المعجمة وإسكان الفاءِ، وَهُوَ لفظٌ مفردٌ مؤنثٌ. قَالَ أَهْلُ اللُّغَة: الذِّفْرَى: المَوْضِعُ الَّذِي يَعْرَقُ مِنَ البَعِيرِ خلْف الأذنِ، وَقوله:"تُدْئِبُهُ"أَيْ: تُتْعِبُهُ.

హజ్రత్ అబూ జాఫర్ అబ్దుల్లాహ్ బిన్ జాఫర్ (రదియల్లాహు అన్హుమా) కథనం : ఓ రోజు దైవప్రవక్త ﷺ నన్ను తన వెనక వాహనం మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన నాతో రహస్యంగా ఓ విషయం చెప్పారు. ఆ విషయం నేను ఎవరికీ చెప్పను. దైవప్రవక్త ﷺ మలమూత్ర విసర్జన సమయంలో ఏదయినా ఎత్తయిన వస్తువు (గోడ, దిబ్బలాంటి) లేక ఖర్జూర చెట్ల పొదలు తనకు అడ్డు ఉండటాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు.

(ఇమామ్ ముస్లిం (రహిమహుల్లాహ్) ఈ హదీసును ఇలాగే సంక్షిప్తంగా వివరించారు)

బుర్‌ఖానీ గారు ముస్లిం పరంపర ఆధారంగానే ఈ హదీసును వెలికితీశారు. అందులో అదనంగా ఈ వాక్యాలు ఉన్నాయి : దైవప్రవక్త ﷺ ఓ అన్సారీ వ్యక్తికి చెందిన తోటలోకి ప్రవేశించారు. అక్కడ ఆయనకు ఒక ఒంటె కనిపించింది. దైవప్రవక్త ﷺను చూడగానే ఆ ఒంటె ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టింది. దాని కళ్ళవెంబడి నీళ్ళు కారసాగాయి. ఆయన ఆ ఒంటె దగ్గరికి వెళ్ళి దాని మూపురాన్ని, చెవి వెనుక భాగాన్ని నిమిరారు. దాంతో ఆ ఒంటె కుదుటపడింది.

ఆ తర్వాత ఆయన (అక్కడున్న వారిని), "దీని యజమాని ఎవరు?" అని అడిగారు. ఓ అన్సారీ యువకుడు ముందుకు వచ్చి, "దైవప్రవక్తా! ఈ ఒంటె నాదే" అని అన్నాడు. అప్పుడాయన (ఆ యువకుని మీద చిరుకోపం వ్యక్తం చేస్తూ), "నీవు దీని విషయంలో – దీన్ని నీకు వశపరచిన దైవానికి భయపడట్లేదా? నువ్వు తనను ఆకలితో మాడ్చుతున్నావనీ, (శక్తికి మించిన పని తీసుకొని) తనకు అలసట కలిగిస్తున్నావని ఇది నాకు ఫిర్యాదు చేస్తోంది" అని అన్నారు.

English

Abu Ja`far `Abdullah bin Ja`far (radiyallahu anhuma) reported: The Messenger of Allah ﷺ made me ride behind him one day and confided something to me which I shall never disclose to anyone. (`Abdullah added:) He ( ﷺ preferred to screen himself from others when responding to the call of nature, either behind a wall or the trunk of a date-palm.[Muslim].

Al-Barqani added: The Messenger of Allah ﷺ entered an orchid belonging to an Ansari and saw there a camel. When it saw him, it began to groan and its eyes shed tears. The Messenger of Allah ﷺ approached it and patted it on the hump and the base of its head until it quieted down. Then he ﷺ asked, “Who is the owner of this camel? To whom does it belong?” An Ansari youth stepped forward and said: “It is mine O Messenger of Allah!” He said, “Do you not fear Allah in respect of this beast which Allah has placed in your possession? This camel is complaining to me that you starve it and put it to toil.” [Abu Dawud].

ముఖ్యాంశాలు

పైన పేర్కొనబడిన హదీసుకు సదరు అధ్యాయంతో ఉన్న సంబంధమేమిటో హదీసు ప్రారంభంలోనే ప్రస్తావించబడింది. వాహనంగా ఉపయోగిస్తున్న పశువులో గనక సత్తువ ఉంటే స్వారీ చేసేవ్యక్తి మరో వ్యక్తిని తనవెనక కూర్చోబెట్టుకోవచ్చని చెప్పడమే ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఉద్దేశ్యం. దీనిద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, వాహన పశువుకు మేత తక్కువ పెట్టి, ఎక్కువ పని చేయించకూడదు. అలా చేయటం అత్యాచారం క్రిందికి వస్తుంది. పశువుకు కడుపునిండా మేతపెట్టి సముచితరీతిలో దానిపై భారం వేయాలి. నోరులేని మూగజీవాల పట్ల దయతో వ్యవహరించాలి.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 967

968

హదీసు 968

وعن أَنسٍ رَضيَ اللَّهُ عنْهُ، قَالَ: كُنَّا إِذا نَزَلْنَا مَنْزِلاً، لاَ نسَبِّحُ حَتَّى نَحُلَّ الرِّحَالَ. رواه أَبُو داود بإِسناد عَلَى شرط مسلم. وَقَوْلُه:"لا نُسَبِّحُ"أَيْ لاَ نُصلِّي النَّافلَةَ، ومعناه: أَنَّا مَعَ حِرْصِنا عَلَى الصَّلاةِ لا نُقَدِّمُها عَلى حطِّ الرِّحال وإرَاحةِ الدَّوابِّ.

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం : మేము ప్రయాణంలో ఎక్కడయినా మజిలీ చేయదలచుకున్నప్పుడు వాహనాలపై నుంచి ఆసనాలను దించేదాకా నఫిల్ నమాజులు చేసే వాళ్ళం కాము.

(అబూ దావూద్ దీన్ని ముస్లిం షరతులననుసరించి వెలికి తీశారు).

(సుననె అబూ దావూద్‌లోని జిహాద్ ప్రకరణం)

English

Anas (radiyallahu anhu) reported: When we encamped, we would not offer (voluntary) prayers until we had unsaddled our beasts.[Abu Dawud].

ముఖ్యాంశాలు

దైవప్రవక్త అనుచరులు ఎక్కడయినా మజిలీ చేసినప్పుడు అన్నిటికన్నా ముందు వాహనాలపై మోపబడిన బరువును క్రిందికి దించేవారు. ఆ తర్వాతే నమాజులు చేసేవారు. దాంతో ఆ వాహన పశువులు కాసేపు సేద తీర్చుకోగలిగేవి. నోరులేని జంతువులు ఒక వైపు బరువు క్రింద నలిగిపోతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా నఫిల్ ఆరాధనలు చేస్తే దేవుడు ప్రసన్నుడు కాడని తెలియపరచటమే ఈ హదీసు ఉద్దేశ్యం. ప్రయాణంలో ఉన్నప్పుడు నఫిల్ నమాజులు చేయటం అభిలషణీయమన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|168. ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి…|హదీసు 968