హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 166వ అధ్యాయం: గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టడం అభిలషణీయం. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 956 – 957) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
166. గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టడం అభిలషణీయం
باب استحباب الخروج يوم الخميس واستحبابه أول النهار
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 956
عن كعبِ بن مالك، رَضيَ اللَّهُ عنه، أَنَّ النبيَّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم خَرَجَ في غَزْوَةِ تَبُوكَ يَوْمَ الخَمِيسِ، وَكَانَ يُحِبُّ أَنْ يَخْرُجَ يَوْمَ الخَمِيس. متفقٌ عَلَيْهِ. وفي رواية في الصحيحين:"لقلَّما كانَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَخْرُجُ إِلاَّ في يَوم الخَمِيسِ".
హజ్రత్ కాబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ తబూక్ దండయాత్ర కొరకు గురువారం రోజు బయలుదేరారు. ఆయన గురువారం రోజు ప్రయాణం చేయటాన్ని ఇష్టపడేవారు. (బుఖారీ – ముస్లిం)
బుఖారీ – ముస్లింలలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవప్రవక్త ﷺ గురువారానికి బదులు వేరేదినాల్లో ప్రయాణించటం బహు అరుదుగా జరిగేది.
(సహీహ్ బుఖారీలోని జిహాద్ ప్రకరణం)
English
Ka`b bin Malik (radiyallahu anhu) reported: The Prophet ﷺ set out on Thursday for the expedition of Tabuk. He liked to set out on a journey on Thursdays.[Al-Bukhari and Muslim]
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|166. గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టడం అభిలషణీయం|హదీసు 956
హదీసు 957
وعن صخْرِ بنِ وَدَاعَةَ الغامِدِيِّ الصَّحابيِّ رضي اللَّه عنْهُ، أَنَّ رسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ:"اللَّهُمَّ بَارِكْ لأُمَّتي في بُكُورِها "وكَان إِذا بعثَ سَرِيَّةً أَوْ جَيْشَاً بعَثَهُم مِنْ أَوَّلِ النَّهَارِ وَكان صخْرٌ تَاجِراً، وَكَانَ يَبْعثُ تِجارتهُ أَوَّلَ النَّهار، فَأَثْرى وكَثُرَ مالُهُ. رواه أَبو داود والترمذيُّ وَقالَ: حديثٌ حسن.
హజ్రత్ సఖ్ర్ బిన్ వదాఆ గామిదీ సహాబీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ "దేవా! నా అనుచర సమాజం వేకువజాములో (చేసే ప్రయాణంలో) శుభాన్ని అవతరింపజేయి" అని ప్రార్థించారు. ఆయన ఏదయినా సైనిక పటాలాన్ని గాని లేదా సైనిక దళాన్ని గాని పంపినప్పుడు దాన్ని వేకువజామునే పంపేవారు.
ఈ హదీసును తెలియజేసిన సఖ్ర్ (రదియల్లాహు అన్హు) స్వయంగా ఓ వ్యాపారి. ఈయన కూడా తన వ్యాపార సామగ్రిని వేకువ జాములోనే రవాణా చేసేవారు. (దైవప్రవక్త ﷺ ప్రార్థన) ఫలితంగా ఆయన గొప్ప ధనికులయ్యారు. ఆయన సంపద వృద్ధిచెందింది.
(అబూ దావూద్, తిర్మిజీ, హసన్)
(సుననె అబూ దావూద్లోని జిహాద్ ప్రకరణం, సుననె తిర్మిజీలోని వాణిజ్య అధ్యాయాలు)
English
Sakhr bin Wada`ah Al-Ghamidi (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ said, “O Allah! Bless my people in the early part of the day (morning). Whenever he dispatched a detachment or an army-unit, he would dispatch it at the beginning of the day (soon after dawn). The narrator, Sakhr (radiyallahu anhu) was a merchant, and he used to send off his merchandise at the beginning of the day. So his trade flourished and he made a good fortune.[At-Tirmidhi and Abu Dawud].
ముఖ్యాంశాలు
ప్రయాణంగాని, వస్తు రవాణాగాని వేకువ జాములో మొదలయితే, అది లాభదాయకంగానూ, శుభకరంగానూ ఉంటుందని పై హదీసుద్వారా బోధపడుతోంది. ఆ సమయంలో మనుషులు తాజాగా, హుషారుగా ఉంటారు. పనిచేసే శక్తి, ఓపిక వారిలో పుష్కలంగా ఉంటాయి. అందుకనే ఆ సమయంలో చేసేపనులు చాలా తొందరగా పూర్తవుతాయి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|ప్రయాణ ప్రకరణం|166. గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టడం అభిలషణీయం|హదీసు 957
You must be logged in to post a comment.