హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 159వ అధ్యాయం: మృతుని అప్పు తీర్చడంలో, అంత్యక్రియల్లో తొందరచేయాలి, మనిషి హఠాత్తుగా చనిపోతే మరణం నిర్ధారితమయ్యేవరకు వేచివుండవచ్చు. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 943 – 944) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
159. మృతుని అప్పు తీర్చడంలో, అంత్యక్రియల్లో తొందరచేయాలి, మనిషి హఠాత్తుగా చనిపోతే మరణం నిర్ధారితమయ్యేవరకు వేచివుండవచ్చు
باب تعجيل قضاء الدَّين عن الميت والمبادرة إلى تجهيزه إلا أن يموت فجاءة فيترك حَتَّى يُتَيَقَّنَ مَوْتُه.
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 943
عن أَبي هريرة رضي اللَّه عنه، عن النَّبيّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "نَفْسُ المُؤْمِنِ مُعَلَّقَةٌ بِدَيْنِهِ حَتَّى يُقْضَي عَنْهُ".رواه الترمذي وقال: حديث حسنٌ.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : విశ్వాసి (చనిపోతే) అతను తీసుకున్న అప్పులు తీర్చబడనంతవరకు అతని ప్రాణం అనిశ్చితంగా ఉంటుంది. (తిర్మిజీ – హసన్)
(సుననె తిర్మిజీలోని జనాయెజ్ అధ్యాయాలు)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “The soul of the deceased believer remains pending on account of the debt till it (the debt) is repayed.”[At-Tirmidhi].
ముఖ్యాంశాలు
ప్రాణం అనిశ్చితంగా ఉండటమంటే ప్రపంచంలో అతను తీసుకున్న అప్పులు తీర్చబడేవరకు అతనికి ముక్తిని ప్రసాదించాలా లేక శిక్ష విధించాలా అన్న విషయం తెమలకుండా ఉంటుందని భావం. అతను తీసుకున్న అప్పులు దాసుల హక్కుల క్రిందికి వస్తాయి. మనిషి దేవుని హక్కుల్ని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహిస్తే దేవుడు క్షమిస్తాడేమోగాని తోటి మానవుల హక్కుల్ని కాజేస్తే మాత్రం, వాటిని తిరిగి నెరవేర్చనంతవరకు లేదా హక్కుదారులు క్షమాభిక్ష పెట్టనంతవరకు దేవుడు అతణ్ణి క్షమించడు. కనుక మనిషి చనిపోయినప్పుడు అతనెవరి దగ్గరయినా అప్పు తీసుకొని ఉంటే అతని వారసులు ముందుగా అతని అప్పు తీర్చటానికి ప్రయత్నించాలి.
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|159. మృతుని అప్పు తీర్చడంలో, అంత్యక్రియల్లో తొందరచేయాలి, మనిషి హఠాత్తుగా చనిపోతే మరణం నిర్ధారితమయ్యేవరకు వేచివుండవచ్చు|హదీసు 943
హదీసు 944
وعن حُصَيْنِ بن وحْوَحٍ رضي اللَّهُ عنه أَنْ طَلْحَةَ بنَ الْبُرَاءِ بن عَازِبٍ رضِي اللَّه عنْهما مَرِض، فَأتَاهُ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَعُودُهُ فَقَالَ: إنِّي لاَ أُرَى طَلْحةَ إلاَّ قدْ حَدَثَ فِيهِ المَوْتُ فَآذِنُوني بِهِ وَعَجِّلُوا بِهِ، فَإنَّهُ لاَ يَنْبَغِي لجِيفَةِ مُسْلِمٍ أنْ تُحْبَسَ بَيْنَ ظَهْرَانَيْ أَهْلِهِ". رواه أَبُو داود.
హజ్రత్ హుసైన్ బిన్ వహ్‌వహ్ (రదియల్లాహు అన్హు) కథనం : తల్హా బిన్ బరా (రదియల్లాహు అన్హుమా) వ్యాధిగ్రస్తుడయినప్పుడు దైవప్రవక్త ﷺ ఆయన్ని పరామర్శించటానికి వచ్చి (అక్కడున్న వారితో) ఇలా అన్నారు: తల్హాలో మరణ సూచనలు కన్పిస్తున్నట్లున్నాయి. (ఒకవేళ ఈయన చనిపోతే) వెంటనే నాకు తెలియజేయండి. ఈయన భౌతికకాయాన్ని ఖననం చేయటంలో తొందర చేయండి. ఎందుకంటే ఒక ముస్లిం వ్యక్తి శవాన్ని అతని ఇంటివారి మధ్య (ఎక్కువ సేపు) ఉంచటం మంచిది కాదు. (అబూ దావూద్)
(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం)
English
Hussain bin Wahwah (radiyallahu anhu) reported: When Talhah bin Al-Bara’ (radiyallahu anhu) fell ill, the Prophet ﷺ came to visit him and said, “Verily, I think that Talhah is about to die. So inform me when he is dead and make haste (in burying him). Indeed, it is improper for the corpse of a Muslim to be kept lying unburied among his family members.”[Abu Dawud].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|159. మృతుని అప్పు తీర్చడంలో, అంత్యక్రియల్లో తొందరచేయాలి, మనిషి హఠాత్తుగా చనిపోతే మరణం నిర్ధారితమయ్యేవరకు వేచివుండవచ్చు|హదీసు 944
You must be logged in to post a comment.