హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 158వ అధ్యాయం: జనాజాను త్వరగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి. ఈ అధ్యాయంలో 2 హదీసులు (హదీసు 941 – 942) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.
158. జనాజాను త్వరగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి
باب الإِسراع بالجنازة
అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)
హదీసు 941
عن أَبي هُرَيْرَةَ رضِيَ اللَّهُ عنه عَن النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "أَسْرِعُوا بِالجَنَازَةِ، فَإنْ تَكُ صَالِحَةً، فَخَيْرٌ تُقَدِّمُونها إلَيْهِ، وَإنْ تَك سِوَى ذلِكَ، فَشَرٌّ تَضَعُونَهُ عَنْ رِقَابِكُمْ" متفقٌ عَلَيْهِ. وفي روايةٍ لمُسْلِمٍ:"فَخَيْرٌ تُقَدِّمُونَهَا عَلَيْه ".
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రబోధించారు: మృతుని అంత్యక్రియల విషయంలో తొందర చేయండి. ఎందుకంటే మరణించిన వ్యక్తి పుణ్యాత్ముడయి ఉంటే అతడ్ని మీరు సాఫల్యం వైపుకు తీసుకెళ్తున్నారన్నమాట. ఒకవేళ అతను పాపాత్ముడయి ఉంటే అతనొక చెడు పదార్థం. దాన్ని మీరు మీ భుజాల నుండి దించివేయటానికి వెళ్తున్నారన్నమాట. (అందుచేత మృతుని భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా శ్మశానానికి చేర్చండి).
(బుఖారీ – ముస్లిం)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం, సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)
English
Abu Hurairah (radiyallahu anhu) reported: I heard the Prophet ﷺ saying, “Hurry up with the dead body (for its burial), for if it is pious, you are speeding it to goodness and if it is otherwise, you are laying an evil off your necks.” [Al-Bukhari and Muslim].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|158. జనాజాను త్వరగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి|హదీసు 941
హదీసు 942
وعن أَبي سعيدٍ الخُدْرِيِّ رضي اللَّه عنه قَالَ. كَانَ النَّبيُّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَقُولُ: "إِذَا وُضِعَتِ الجِنَازَةُ، فَاحْتَملَهَا الرِّجَالُ عَلى أَعنَاقِهِمْ، فَإنْ كَانتْ صَالحةً، قالتْ: قَدِّمُوني، وَإنْ كَانَتْ غَيْرَ صَالِحَةٍ، قَالَتْ لأهْلِهَا: يَاوَيْلَهَا أَيْنَ تَذْهَبُونَ بِهَا، يَسْمَعُ صَوْتَهَا كُلُّ شَيْءٍ إلاَّ الإنسانَ، وَلَوْ سَمِعَ الإنْسَانُ، لَصَعِقَ "رواه البخاري.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించేవారు : ప్రజలు మృతుని భౌతికకాయాన్ని శ్మశానానికి సిద్ధం చేసుకొని భుజాలమీద మోసుకొని వెళ్ళేటప్పుడు అది మంచివాని శవమయితే, "నన్ను త్వరగా తీసుకెళ్ళండి" అని అంటుంది. మంచివాని శవం కాకపోతే అది తన్ను మోసుకెళ్తున్న వారితో, "అయ్యో! నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు" అని మొత్తుకుంటుంది. దాని అరుపుల్ని మానవుడు తప్ప మిగతా సృష్టిరాశులన్నీ వింటాయి. మానవుడు గనక ఆ అరుపుల్ని వింటే (అక్కడికక్కడే) సొమ్మసిల్లి పోతాడు. (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని జనాయెజ్ ప్రకరణం)
English
Abu Sa`id Al-Khudri (radiyallahu anhu) reported: The Prophet ﷺ said, “When a dead body is placed on a bier and men carry it on their shoulders, if he was a pious man, it (corpse) says: `Take me in haste.’ But if he was not righteous, it says to its bearers: `Woe to it. Where are you taking it?’ Everything except man hears its voice. Had a human being heard its voice, he would have surely fallen into swoon.”[Al-Bukhari].
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|158. జనాజాను త్వరగా శ్మశానానికి తీసుకువెళ్ళాలి|హదీసు 942
You must be logged in to post a comment.