హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 157వ అధ్యాయం: జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ. ఈ అధ్యాయంలో 6 హదీసులు (హదీసు 935 – 940) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ

↑ విషయ సూచిక

باب مَا يقرأ في صلاة الجنازة. يُكَبِّرُ أرْبَعَ تَكبِيرَاتٍ: يَتَعوَّذُ بَعْدَ الأُولَى, ثُمَّ يَقْرَأُ فَاتِحَةَ الكِتَابِ, ثُمَّ يُكَبِّرُ الثَّانِيَةَ, ثُمَّ يُصَلِّي عَلَى النَّبيِّ صلى الله عليه وسلم فيقول: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ, وَعَلَى آلِ مُحَمَّدٍ. والأفضل أن يتمه بقوله: كَمَا صَلَّيتَ عَلَى إبرَاهِيمَ..إِلَى قَوْله: إنك حميد مجيد. ولايفعل مايفعله كَثيرٌ مِنَ العَوامِّ مِنْ قراءتِهِمْ {إنَّ اللهَ وملائكته يصلون على النبي} الآية [الأحزاب: ٥٦] فَإنَّهُ لاَ تَصحُّ صَلاَتُهُ إِذَا اقْتَصَرَ عَلَيْهِ. ثُمَّ يُكَبِّرُ الثَّالِثَةَ, وَيَدعُو للمَيِّتِ وَللمُسْلِمِينَ بِمَا سَنَذكُرُهُ مِنَ الأحاديث إنْ شَاءَ اللهُ تَعَالَى, ثُمَّ يُكَبِّرُ الرَّابِعَةَ وَيَدْعُو, وَمِنْ أحْسَنِهِ: اللَّهُمَّ لاَ تَحْرِمْنَا أجْرَهُ, وَلاَ تَفْتِنَّا بَعدَهُ, وَاغْفِرْ لَنَا وَلَهُ. وَالمُخْتَارُ أنه يُطَوِّلُ الدُّعاء في الرَّابِعَة خلافَ مَا يَعْتَادُهُ أكْثَرُ النَّاس؛ لحديث ابن أَبي أَوْفى الذي سَنَذْكُرُهُ إنْ شَاء الله تعالى. فأما الأَدْعِيَةُ المَأثُورَةُ بَعْدَ التَّكبِيرَةِ الثالثة, فمنها:

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

జనాజా నమాజ్‌లో నాలుగు తక్బీర్లు పలకాలి. మొదటి తక్బీర్ తర్వాత 'అవూజు బిల్లాహి…' చదివి, ఫాతిహా సూరా, (ఇంకొక సూరా) పఠించి రెండవ తక్బీర్ పలకాలి. రెండవ తక్బీర్ తర్వాత దైవప్రవక్తపై దరూద్ పఠించాలి. అల్లాహుమ్మ సల్లిఅలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ నుండి కమా సల్లైత అలా ఇబ్రాహీమ అంటూ ఇన్నక హమీదుం మ్మజీద్' వరకు పూర్తి దరూద్ పఠించడమే శ్రేష్ఠమైన పద్ధతి. ఈ సందర్భంగా చాలా మంది ఇన్నల్లాహ వ మలాయికతహూ యుసల్లూన అలన్నబియ్యి' అనే సూక్తి మాత్రమే పఠిస్తుంటారు. అలా చేయకూడదు. ఆ సూక్తి పఠించటం సరయిన పద్ధతి కాదు. కేవలం ఆ సూక్తి పఠిస్తే నమాజ్ నెరవేరదు. దరూద్ షరీఫ్ పఠించాక మూడో తక్బీర్ పలికి మృతుని కొరకు, ముస్లింలందరి కొరకు దుఆలు చేయాలి. ఆ దుఆలను మేము ఇన్షాఅల్లాహ్ రాబోయే హదీసుల్లో పొందుపరుస్తాం. దుఆలు చేశాక నాల్గో తక్బీర్ పలికి ఆ తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థనలన్నిటిలో అత్యుత్తమమైనది, అత్యంత ప్రియమైనది "అల్లాహుమ్మ లా తహ్‌రిమ్‌నా అజ్‌రహూ వలా తఫ్‌తిన్నా బాదహూ" అనే ప్రార్థన. నేడు చాలామంది సంక్షిప్త దుఆలకు అలవాటు పడిపోయారు. వారి పద్ధతికి విరుద్ధంగా ఇబ్నె అబూ ఔఫా హదీసులో పేర్కొనబడినట్లు నాల్గో తక్బీర్ తర్వాత సుదీర్ఘమైన దుఆలు చేయాలి. ఆ హదీసును మేము ఇన్షాఅల్లాహ్ త్వరలోనే ప్రస్తావిస్తాం. ఇకపోతే మూడో తక్బీర్ తర్వాత పఠించబడే సంప్రదాయబద్ధమైన దుఆలు ఇవి:

English

To pronounce four Takbir (saying Allahu Akbar) in the funeral prayer. After the first Takbir, after saying A`udhu billahi minash-Shaitanir-rajim, recite Surat Al-Fatihah. After the second Takbir, send Salam [Allahumma Salli `ala Muhammadin wa `ala ali Muhammadin kama sallaita `ala Ibrahima wa `ala ali Ibrahima, innaka Hamidun Majid. Allahumma barik `ala Muhammadin wa `ala ali Muhammadin, kama barakta `ala Ibrahima, wa `ala ali Ibrahima, innaka Hamidun Majid. Then after the third Takbir, invoke supplication for the deceased and for the Muslims as we will mention later on, in sha’ Allah. After the fourth Takbir, supplicate Allah. (Some of the supplications of the Messenger of Allah ﷺ, which are to be recited after the third Takbir are mentioned in the following Ahadith:)

935

హదీసు 935

عن أبي عبدِ الرحمنِ عوفِ بن مالكٍ رضي اللَّه عنه قَالَ: صلَّى رَسُول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلى جَنَازَةٍ، فَحَفِظْتُ مِنْ دُعائِهِ وَهُو يَقُولُ: "اللَّهُمَّ اغْفِرْ لَهُ، وارْحمْهُ، وعافِهِ، واعْفُ عنْهُ، وَأَكرِمْ نزُلَهُ، وَوسِّعْ مُدْخَلَهُ واغْسِلْهُ بِالماءِ والثَّلْجِ والْبرَدِ، ونَقِّه منَ الخَطَايَا، كَمَا نَقَّيْتَ الثَّوب الأبْيَضَ منَ الدَّنَس، وَأَبْدِلْهُ دَاراً خَيْراً مِنْ دَارِه، وَأَهْلاً خَيّراً منْ أهْلِهِ، وزَوْجاً خَيْراً منْ زَوْجِهِ، وأدْخِلْه الجنَّةَ، وَأَعِذْه منْ عَذَابِ القَبْرِ، وَمِنْ عَذَابِ النَّار "حَتَّى تَمَنَّيْتُ أَنْ أَكُونَ أنَا ذلكَ المَيِّتَ. رواه مسلم.

హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ ఒకరి జనాజా నమాజ్‌లో చేసిన దుఆను నేను కంఠస్తం చేసుకున్నాను. అందులో ఆయన ఇలా ప్రార్థించారు : (అల్లాహుమ్మగ్ఫిర్ లహూ వర్‌హమ్‌హు…." అనువాదం:) దేవా! ఇతన్ని క్షమించు. ఇతని మీద దయజూపు. ఇతన్ని శిక్ష నుండి కాపాడు. ఇతన్ని క్షమించు. ఇతన్ని ఆదరించి మర్యాద చెయ్యి. ఇతని సమాధిని విశాలపరచు. ఇతన్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి, తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాలనుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లుకన్నా మంచి ఇల్లునీ, ఇహలోకపు పరివారం కన్నా ఉత్తమ పరివారాన్నీ, ఇహలోకపు ఇల్లాలికన్నా మంచి ఇల్లాలిని ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు.

ఔఫ్ బిన్ మాలిక్ ఉవాచ : అప్పుడు దైవప్రవక్త ﷺ నోట ఆ ప్రార్థన వింటుంటే మరణించిన వ్యక్తి నేనయి వుంటే ఎంత బాగుండేదనిపించింది నాకు. (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu `Abdur-Rahman `Auf bin Malik (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ offered a funeral prayer and I memorized his supplication. He ﷺ prayed: “Allahummaghfir lahu, warhamhu, wa `afihi, wa`fu `anhu, wa akrim nuzulahu, wa wassi` mudkhalahu, waghsilhu bil-ma’i wath-thalji wal-baradi, wa naqqihi minal-khataya, kama naqqaytath-thawbal-abyada minad-danasi, wa abdilhu daran khairan min darihi, wa ahlan khairan min ahlihi, wa zawjan khairan min zawjihi, wa adkhilhul-Jannata, wa a`idh-hu min `adhabil-qabri, wa min `adhabin-nar [if the dead person is a woman, one should change the ending of certain words in this supplication from hu to ha] (O Allah! Forgive him, bestow mercy upon him, pardon him, accord him a noble provision and make his grave spacious, wash him with water, snow and hail, purify him from sins as You have purified the white garment from soiling, give him a better abode in place of his present one, and a better family in exchange of his present one, and a better spouse in place of his present wife; admit him to Jannah and protect from the trial in the grave and punishment in the Hell).” (After hearing this supplication of the Messenger of Allah ﷺ, Abu’ Abdur-Rahman ‘Auf bin Malik (radiyallahu anhu) said: I wished I had been that dead man.[Muslim].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ|హదీసు 935

936

హదీసు 936

وعن أَبي هُريرة وأبي قَتَادَةَ، وَأبي إبْرَاهيمَ الأشْهَليَّ عنْ أبيه، وأبوه صَحَابيٌّ رضي اللَّه عنهم، عَنِ النبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أنَّه صلَّى عَلى جَنَازَة فَقَالَ: "اللَّهم اغْفِرْ لِحَيِّنَا وَميِّتِنا، وَصَغيرنا وَكَبيرِنَا، وذَكَرِنَا وَأُنْثَانَا، وشَاهِدِنا وَغائِبنَا. اللَّهُمَّ منْ أَحْيَيْتَه منَّا فأَحْيِه عَلَى الإسْلامِ، وَمَنْ توَفَّيْتَه منَّا فَتَوَفَّهُ عَلى الإيمانِ، اللَّهُمَّ لاَ تَحْرِمْنا أَجْرَهُ، وَلا تَفْتِنَّا بَعْدَهُ" رواه الترمذي من رواية أَبي هُرَيْرةَ والأشهَليِّ، ورواه أَبُو داود من رواية أَبي هريرة وأبي قَتَادَةَ. قَالَ الحاكم: حديث أَبي هريرة صَحيحٌ عَلَى شَرْطِ البُخاريِّ ومُسْلِمٍ، قَالَ الترْمِذي قَالَ البخاريُّ: أَصحُّ رواياتِ هَذَا الحديث روايةُ الأَشْهَليِّ. قَالَ البخاري: وَأَصَحُّ شيء في هَذَا الباب حديث عوْفِ بن مالكٍ.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు), అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఇంకా అబూ ఇబ్రాహీం అష్‌హలీ తన తండ్రి నుండి – ఆయన తండ్రి దైవప్రవక్త సహచరుడు – చేసిన కథనం : దైవప్రవక్త ﷺ ఒకరి జనాజా నమాజ్‌లో ఈ విధంగా దుఆ చేశారు: (అల్లాహుమ్మగ్ఫిర్లి హయ్యినా, వ మయ్యితినా…. అనువాదం:) దేవా! మాలో బ్రతికున్నవారిని, చనిపోయినవారిని, పిన్నలను, పెద్దలను, పురుషుల్నీ, స్త్రీలనూ అందరినీ క్షమించు.

దేవా! మాలో ఎవరిని బ్రతకనిచ్చినా ఇస్లాం ధర్మంపై బ్రతకనివ్వు. మాలో ఎవరికి మరణాన్ని ప్రసాదించినా విశ్వాస స్థితిలోనే మరణాన్ని ప్రసాదించు. దేవా! ఈ మరణించిన వ్యక్తి (విషయంలో సహనం వహించటం వల్ల లభించే) పుణ్యానికి మమ్మల్ని దూరం చేయకు. ఇతని తర్వాత మమ్మల్ని పరీక్షలకు గురిచేయకు.

ఈ హదీసును తిర్మిజీగారు, అబూ హురైరా, అష్‌హలీల ఆధారంగా వెలికితీశారు. అబూ దావూద్ దీనిని అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఆధారంగా ఉల్లేఖించారు. ఇమామ్ హాకిమ్ అబూ హురైరా గారి హదీసు బుఖారీ – ముస్లిం షరతులను అనుసరించి వెలికితీయబడిందని పేర్కొన్నారు. ఇమామ్ తిర్మిజీ కథనం ప్రకారం ఈ హదీసుకు సంబంధించిన ఉల్లేఖనాలన్నిటిలో అష్‌హలీ గారి ఉల్లేఖనం అన్నిటికన్నా ప్రామాణికమైనదనీ, ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులన్నిటిలో ఔఫ్ బిన్ మాలిక్ హదీసు ప్రామాణికమైనదని ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) పేర్కొన్నారు.

(సుననె తిర్మిజీలోని జనాయెజ్ అధ్యాయాలు, సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Hurairah, Abu Qatadah, and Abu Ibrahim Al-Ash-hali (radiyallahu anhum) reported: The Prophet ﷺ offered a funeral prayer and said: “Allahummaghfir lihaiyina wa maiyitina, wa saghirina wa kabirina, wa dhakarina wa unthana, wa shahidina wa gha’ibina. Allahumma man ahyaiytahu minna, fa’ahyihi `alal-Islam, wa man tawaffaiytahu minna, fatawaffahu `alal-Iman. Allahumma la tahrimna ajrahu, wa la taftinna ba`dahu (O Allah, forgive our living and our dead, our present and our absent, our young and our old, our male and our female. O Allah, whosoever of us You keep alive, keep him alive (faithful) to IslÀm, and whosoever of us You cause to die, let him die having Iman. O Allah, do not deprive us of our reward (for being patient) and do not subject us to trials after his death.”[Abu Dawud and At-Tirmidhi].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ|హదీసు 936

937

హదీసు 937

وعن أبي هُريْرَةَ رَضِي اللَّهُ عَنْهُ قَالَ: سمعتُ رَسُول اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يقول: "إذ صَلَّيْتُم عَلى المَيِّت، فأَخْلِصُوا لهُ الدُّعاءَ" رواه أبوداود.

దైవప్రవక్త ﷺ ఇలా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : మీరు మృతుని జనాజా నమాజ్ చేసేటప్పుడు అతని కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించండి.

(అబూ దావూద్)

(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: I heard the Messenger of Allah ﷺ saying: “When you pray over the dead, make a sincere supplication for him.”[Abu Dawud and Ibn Majah].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ|హదీసు 937

938

హదీసు 938

وعَنْهُ عَنِ النَّبيِّ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم في الصَّلاةِ عَلى الجَنَازَة: "اللَّهُمَّ أَنْت ربُّهَا، وَأَنْتَ خَلَقْتَها، وأَنْتَ هَديْتَهَا للإسلامِ، وَأَنْتَ قَبَضْتَ رُوحَهَا، وَأَنْتَ أَعْلمُ بِسِرِّها وَعَلانيتِها، جئْنَاكَ شُفعاءَ لَهُ فاغفِرْ لهُ". رواه أَبُو داود.

దైవప్రవక్త ﷺ ఒకరి జనాజా నమాజులో ఈ దుఆ పఠించారని హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు : (అల్లాహుమ్మ అంత రబ్బుహా వ అంత…. అనువాదం:) దేవా! నీవే ఇతని ప్రభువువి. ఇతన్ని నీవే పుట్టించావు. ఇతన్ని ఇస్లాం మార్గం వైపునకు నడిపించిందీ నీవే. ఆఖరికి ఇతని ప్రాణాన్ని తీసింది కూడా నీవే. ఇతని బాహ్య, అంతర్గత స్థితిగతుల గురించి నీకే బాగా తెలుసు. మేము ఇతని కొరకు సిఫారసు చేయటానికి వచ్చాము. నీవు ఇతన్ని మన్నించు." (అబూ దావూద్)

(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం)

English

Abu Hurairah (radiyallahu anhu) reported: The Prophet ﷺ supplicated in course of funeral prayer: “Allahumma Anta Rabbuha, wa Anta khalaqtaha, wa Anta hadaytaha lil-Islam, wa Anta qabadta ruhaha, wa Anta a`lamu bisirriha wa `alaniyyatiha, ji’naka shufa`a’a lahu [if the dead person is a man, or laha if the dead person is a woman], faghfir lahu [or laha, if it is a woman] (O Allah, You are its Rubb; You created it; You guided it to Islam; You have taken its life back and You know best its insight and outer condition. We have come as intercessors, so forgive him).”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ|హదీసు 938

939

హదీసు 939

وعن واثِلة بنِ الأسقعِ رضيَ اللَّه عنه قَالَ: صَلَّى بِنَا رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم عَلى رجُلٍ مِنَ المُسْلِمينَ، فَسَمِعْتُهُ يقولُ: "اللَّهُمَّ إنَّ فُلانَ ابْنَ فُلان في ذِمَّتِكَ وَحَبْلِ جِوَارِكَ، فَقِهِ فِتْنَةَ القَبْر، وَعَذَابَ النَّارِ، وَأَنْتَ أَهْلُ الوَفاءِ والحَمْدِ، اللَّهُمَّ فاغفِرْ لهُ وَارْحَمْهُ، إنكَ أَنْتَ الغَفُور الرَّحيمُ "رواه أَبُو داود.

హజ్రత్ వాసిలా బిన్ అస్‌ఖా (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త ﷺ మాకు ఒక ముస్లిం వ్యక్తి జనాజా నమాజ్ చేయించారు. ఆ సందర్భంగా ఆయన ఈ విధంగా ప్రార్థిస్తుండగా నేను విన్నాను: (అల్లాహుమ్మ ఇన్న పులానబ్‌న పులానిన్ … అనువాదం:) "దేవా! ఫలానా వ్యక్తి కుమారుడు నీ రక్షణలో, నీ చెంత ఉన్నాడు. నీవు అతన్ని సమాధి యాతన నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు. నీవు వాగ్దానాన్ని నెరవేర్చేవాడవు. స్తుతి పాత్రుడవు. దేవా! ఇతన్ని మన్నించు. ఇతని మీద దయజూపు. నిస్సందేహంగా నీవు అమితంగా మన్నించేవాడవు. అత్యధికంగా కరుణించేవాడవు.

(అబూ దావూద్)

(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్ ప్రకరణం)

English

Wathilah bin Al-Asqa` (radiyallahu anhu) reported: The Messenger of Allah ﷺ led the funeral prayer of a Muslim man in our presence, and I heard him saying “Allahumma inna [name of the dead person] fi dhimmatika wa habli jiwarika, faqihi fitnatal-qabri; wa `adhaban-Nari, wa Anta ahlul-wafa’i wal-hamdi; Allahumma faghfir lahu warhamhu, innaka Antal-Ghafur-ur-Rahim [If the dead person is a woman, one can change hu in some words here with ha] [O Allah, (so-and-so son of so-and-so) is in Your Protection and inside the surroundings of Your Refuge. Safeguard him from the trial of the grave and the punishment of the Hell. You keep Your Promise and You deserve to be praised. O Allah! Forgive him and be merciful to him. Indeed, You are the Forgiving, the Merciful].”[Abu Dawud].

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ|హదీసు 939

940

హదీసు 940

وعن عبدِ اللَّه بنِ أبي أوْفى رضي اللَّه عنهما أَنَّهُ كبَّر عَلَى جَنَازَةِ ابْنَةٍ لَهُ أَرْبَعَ تَكْبِيراتٍ، فَقَامَ بَعْدَ الرَّابِعَةِ كَقَدْرِ مَا بَيْنَ التَّكْبيرتيْن يَسْتَغفِرُ لهَا وَيَدْعُو، ثُمَّ قَالَ: كَانَ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَصْنَعُ هكذَا وفي رواية: "كَبَّرَ أَرْبعاً فَمَكَثَ سَاعةً حتَّى ظَنَنْتُ أَنَّهُ سيُكَبِّرُ خَمْساً، ثُمَّ سلَّمَ عنْ يمِينهِ وَعَنْ شِمالِهِ، فَلَمَّا انْصَرَف قُلْنا لَهُ: مَا هَذَا؟ فَقَالَ: إنِّي لاَ أزيدُكُمْ عَلى مَا رَأَيْتُ رسُولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم يَصْنَعُ، أوْ: هكَذَا صَنعَ رسولُ اللَّهِ صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم. رواه الحاكم وقال: حديث صحيح.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔఫా (రదియల్లాహు అన్హుమా) స్వయంగా చేసిన కథనం ప్రకారం ఆయన తన కూతురి జనాజా నమాజ్‌లో నాలుగు తక్బీర్లు పలికారు. నాల్గో తక్బీర్ తర్వాత కూడా రెండు తక్బీర్ల మధ్య ఉండేంతసేపు అలాగే నిలబడ్డారు. ఆ సమయంలో ఆయన తన కూతురి మన్నింపు కోసం, ఆమె శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. నమాజ్ ముగిసిన తర్వాత ఆయన (ప్రజలతో మాట్లాడుతూ) దైవప్రవక్త ﷺ ఆ విధంగా చేసేవారని చెప్పారు.

వేరొక హదీసులో ఆయన్నుండి హదీసు గ్రహించిన ఉల్లేఖకుడు ఇలా అంటున్నాడు : ఆయన నాలుగు తక్బీర్లు పలికిన తర్వాత కూడా అలాగే నించున్నారు. అప్పుడు ఆయన ఐదో తక్బీర్ కూడా పలుకుతారేమో ననిపించింది నాకు. కాసేపటి తర్వాత ఆయన కుడి ఎడమలకు (మెడ త్రిప్పుతూ) సలాం చేశారు. నమాజ్ ముగించాక మేము ఆయన్ని "(మీరు నాల్గో తక్బీర్ తర్వాత అలాగే నించున్నారు) ఏమిటి విశేషం?" అని అడిగాం.

దానికి అబ్దుల్లాహ్ బిన్ అబూ ఔఫా (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ, "నేను దైవప్రవక్త ﷺ చేస్తుండగా చూసినదానికంటే ఎక్కువ ఏమీ మీ ముందు ప్రదర్శించను" (లేదా ఆయన) "దైవప్రవక్త ﷺ ఆ విధంగా చేసేవారు" అని చెప్పారు. (హాకిమ్ – సహీహ్)

English

`Abdullah bin Abu Aufa (radiyallahu anhuma) reported: While offering the funeral prayer of one of his daughters, he recited four Takbir, and after the fourth Takbir he continued standing for a time equal to an interval between two Takbir, praying for her and seeking Allah’s forgiveness for her.” Then he said: “The Messenger of Allah ﷺ used to do so.”

Another narration is: He (Abdullah) recited four Takbir and remained standing in prayer for some time till we thought that he would recite the fifth Takbir. Then he gave Salam on the right and on the left. When he turned aside, we asked him about it. He replied: “I would add nothing to what I saw the Messenger of Allah ﷺ doing,” or he said: “The Messenger of Allah ﷺ used to do so.”[Al-Hakim].

ముఖ్యాంశాలు

ఇప్పటి వరకు పేర్కొనబడిన దుఆలన్నీ దైవప్రవక్త ﷺ తరచూ జనాజా నమాజుల్లో పఠించినవే. కనుక జనాజా నమాజ్ చేసేటప్పుడు వాటన్నిటినీ కలిపి చదువుకోవచ్చు. అదీగాక ఇస్లాంలో మృతుని కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించమని ఆదేశించబడింది కాబట్టి జనాజా నమాజ్‌లో వాటన్నిటినీ కలిపి చదువుకోవటాన్ని ఉత్తమంగా భావించవచ్చు.

రెండో విషయమేమిటంటే, జనాజా నమాజ్‌లో దుఆలు, సూరాలు బిగ్గరగా పఠించటం ధర్మసమ్మతమే. పైన పేర్కొనబడిన హదీసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దైవప్రవక్త ﷺ గనక జనాజా నమాజ్‌లో దుఆలను బిగ్గరగా పఠించి ఉండకపోతే ఆయన అనుచరులకు అవి తెలిసి ఉండేవి కావన్న విషయం గమనార్హమైనది. అయితే జనాజా నమాజ్‌లో ఇమామ్ వెనక ముక్తదీలు బిగ్గరగా 'ఆమీన్' అని పలకరాదు. ఎందుకంటే దైవప్రవక్త ﷺగాని, ఆయన అనుచరులుగాని జనాజా నమాజ్‌లో బిగ్గరగా 'ఆమీన్' అని పలికినట్లు దాఖలాలు లేవు. అంచేత ముఖ్యంగా జనాజా నమాజ్‌లో ఆమీన్ బిగ్గరగా పలకరాదు.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|157. జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ|హదీసు 940