హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) – 154. మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్) [టెక్స్ట్ రూపంలో]
సంకలనం: ఇమామ్ అబూ జకరియ్యా యహ్యా బిన్ షరఫ్ అన్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)
ఉర్దూ అనువాదం, వ్యాఖ్యానం: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ · తెలుగు రూపం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ · ప్రకాశకులు: ట్రూత్ పబ్లికేషన్స్, హైదరాబాద్

రియాదుస్ సాలిహీన్ – హదీసు కిరణాలు (ఇమామ్ నవవీ) – అరబీ, తెలుగు, English

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – 154వ అధ్యాయం: మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు. ఈ అధ్యాయంలో 1 హదీసులు (హదీసు 928) ఉన్నాయి. ప్రతి హదీసు అరబీ మూలం, తెలుగు అనువాదం, ముఖ్యాంశాలు, English అనువాదంతో.

154. మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు

↑ విషయ సూచిక

باب الكف عما يرى في الميت من مكروه

అరబీ పాఠం: రియాదుస్ సాలిహీన్ – తహ్‌ఖీఖ్: షుఐబ్ అల్ అర్నావూత్ (ముఅస్సస్సతుర్ రిసాలా)

928

హదీసు 928

عن أَبي رافعٍ أَسْلم موْلى رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم أَنَّ رسول اللَّه صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم قَالَ: "مَنْ غَسَّل ميِّتاً فَكَتَمَ عَلَيْه، غَفَرَ اللَّهُ لَهُ أَرْبعِينَ مرَّةً "رواه الحاكم وقال: صحيح عَلَى شرط مسلم.

హజ్రత్ అబూ రాఫే అస్లమ్ – దైవప్రవక్త ద్వారా స్వేచ్ఛ నొసగబడిన బానిస – కథనం ప్రకారం దైవప్రవక్త ﷺ ఈ విధంగా ప్రవచించారు : మృతుని (శవాని)కి స్నానం చేయించేవారు అతని లోపాలను బయటపెట్టకుండా ఉంటే, దేవుడు వారిని నలభైసార్లు క్షమిస్తాడు. (హాకిమ్ దీనిని ఉల్లేఖించి ఇది ముస్లిం షరతులను అనుసరించి వెలికితీయబడిందని పేర్కొన్నారు).

English

Abu Rafi` Aslam (radiyallahu anhu), the freed slave of the Messenger of Allah ﷺ reported: The Messenger of Allah ﷺ said, “He who washes a dead body and conceals what he notices of physical defects, he will be forgiven forty times.”[Al-Hakim].

ముఖ్యాంశాలు

మృతుని భౌతిక కాయానికి స్నానం చేయించేవారికి అతనిలో శారీరక లోపాలేవయినా కనబడితే లేదా మరణం వల్ల అతని రూపురేఖల్లో ఏమయినా మార్పులు పొడసూపితే వాటిని ఇతరుల ముందు బయటపెట్టరాదు. అలా చేస్తే మరణించినవారిని అవమానించినట్లవుతుంది. అయితే ఇతరులకు గుణపాఠం బోధించే ఉద్దేశ్యంతో దైవశిక్షకు గురయినవారి శవాల స్థితిగతుల గురించి వివరించవచ్చని కొంతమంది పండితులు చెబుతున్నారు. అయితే హదీసు ఉద్దేశ్యాన్ని బట్టి చూస్తే దానికి కూడా దూరంగా ఉండటమే మంచిదనిపిస్తోంది.

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్)|రోగుల పరామర్శ ప్రకరణం|154. మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు|హదీసు 928